Kushaiguda
-
పట్టపగలే నడిరోడ్డుపై.. కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పనిచేస్తుండగా, అతని కుమారుడు సాయి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి.. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. కుటుంబ కలహాలతో పాటు వీరిమధ్య కొంతకాలంగా ఆస్తికి సంబంధించి తగాదాలు కూడా ఉన్నాయి.దీంతో విసిగిపోయిన సాయికుమార్.. తండ్రినే హతమార్చాలని భావించాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి బస్సులో వెళ్తున్న మొగలిని కుమారుడు సాయి వెంబడించాడు.. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద మొగిలి బస్సు దిగగానే.. వెనుక నుంచి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దాదాపు 15 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. స్థానికులు మొగిలిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడి
-
హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ ముఖ్య సమాచారం అందించింది. కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా బుధవారం (ఆగస్టు 16) నుంచి పునరిద్దరించినట్లు తెలిపింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపిందని పేర్కొంది.అయితే తాజాగా ఆ రూట్లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలి కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపింది. కాగా ఈ 3 నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలి కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ మేరకు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. చదవండి: వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే హైదరాబాద్ లోని ప్రయాణికులకు గమనిక! కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఈ రోజు నుంచి #TSRTC పునరిద్దరించింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉంది. ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపింది.… pic.twitter.com/FiJZjyxUiy — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 16, 2023 -
తండ్రి అనుమానమే నిజమైంది.. ప్రియుడి మోజులో కన్నకూతుర్ని..
సాక్షి, హైదరాబాద్: ప్రియుడిపై మోజుతో కన్నబిడ్డనే కడతేర్చిందో కసాయి తల్లి. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందినట్టు చిత్రీకరించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయింది. కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు. ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడకు చెందిన నాయక్వడి రమేష్ (30) కల్యాణి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల కూతురు తన్విత సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లి, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. కల్యాణి కుషాయిగూడ మార్కెట్లో పని చేస్తూ.. సమీపంలో కూతురు తన్వితతో కలిసి ఉంటోంది. ఈ నెల 1న కల్యాణి కూతురు తన్వితకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అంతా కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే వైద్యులు తన్విత చనిపోయినట్లు ప్రకటించారు. రోజూ మాదిరిగానే స్కూల్‌కు వెళ్లి వచ్చిన కూతురు భోజనం చేసి పడుకుందని, నిద్రలోనే ఇలా జరిగిందని కల్యాణి అందరినీ నమ్మించింది. అనుమానంతో ఫిర్యాదు... భార్య తీరుపై అనుమానం కలిగిన తండ్రి రమేష్ తన కూతురు చనిపోలేదని, చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఊపిరాడకపోవడంతో చిన్నారి చనిపోయినట్టు వెల్లడైంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా వాస్తవం వెలుగులోకి వచ్చింది. అడ్డు తొలగించుకోవాలని... కల్యాణికి జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన ఇండ్ల నవీన్‌కుమార్ (19) అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. కుషాయిగూడలో కూతురుతో కలిసి ఉంటున్న కల్యాణి వద్దను అతను తరచూ వచ్చేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. కల్యాణి భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. విడాకులు సాధ్యం కాకపోవడంతో కూతురు తన్వితను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 1న స్కూల్ కు వెళ్లి వచ్చిన తన్విత నిద్రలో ఉండగా ముందే వేసుకున్న ఫ్లాన్ ప్రకారం ముఖంపై బెడ్‌షీట్ కప్పి దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. నిందితులు కల్యాణి, నవీన్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చిన్నారి హత్య కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ షేక్ షఫీలను డీసీపీ జానకి, ఏసీపీ వెంకట్‌రెడ్డి అభినందించారు. -
Hyderabad: విద్యార్థినితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: విద్యార్థిని పట్ల ఓ ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టీచర్స్‌కాలనీకి చెందిన ఓ విద్యార్థిని స్థానిక ఓ కార్పొరేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శివసాయినగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ యాకయ్య ఆ విద్యార్థినితో పాటు మరో ముగ్గురిని రోజూ ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకువస్తాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు స్కూల్ వదిలిన తర్వాత అందరినీ ఆటోలో ఎక్కించుకొని బయలుదేరాడు. మిగతా ముగ్గురిని వారి వారి ఇళ్ల వద్ద వదిలి ఆ విద్యార్తిని ఇంటికి తీసుకెళ్లకుండా వేరే చోటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 1:20 గంటల వరకు ఇంటికి చేరుకునే కూతురు 1:30 గంటల వరకు రాకపోవడంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆటో డ్రైవర్ మిగతా పిల్లలను వదులుతున్నాను సార్.. మా ఇంటికి వెళ్లే క్రమంలో మీ పాపను వదిలి వెళ్తానని సమాధానం చెప్పి పది నిమిషాల్లో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన విద్యార్థిని ఆటో డ్రైవర్ తనను ఇంటికి తీసుకురాకుండా మరో చోటికి తీసుకెళ్లి నా పట్ల అసభ్యంగా వ్యవహరించాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. జరిగిన విషయంపై నిలదీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. -
'కొడుకు పోయిన బాధ ఎలా ఉంటదో తెలుసు.. హాత్విక్‌ను దత్తత తీసుకుంటా'
సాక్షి, నల్గొండ: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన నరేశ్, అతడి భార్య సుమ, కుమారుడు జస్విత్ మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. నరేశ్ స్వగ్రామం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కోల్పోయిన నరేశ్ పెద్ద కుమారుడు హాత్విక్‌ను దత్తత తీసు కుంటానని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ఆయన తన పీఏ సైదులుతో హాత్విక్ పేరిట బ్యాంకులో రూ. లక్ష డిపాజిట్ చేయించారు. ఖర్చుల నిమిత్తం నరేశ్ తల్లిదండ్రులకు రూ.25వేలను అందజేయించారు. నరేశ్ తల్లిదండ్రులను ఫోన్లో ఓదార్చారు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, అధైర్య పడొద్దని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. నరేశ్ కొడుకును ఇంటర్నేషనల్ స్కూ ల్లో చదివిస్తానని, పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని, ఢిల్లీ నుంచి రాగానే, గ్రామానికొచ్చి కలుస్తానని నరేష్ కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు. చదవండి: బీఆర్ఎస్తో పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు -
కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం
-
కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
సాక్షి, మేడ్చల్: కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మృతులంతా వరంగల్ జిల్లా ఒకే కుటుంబానికి చెందిన నరేష్, సుమ, బాబుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను నియంత్రించారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌గా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చదవండి: సవాల్ విసురుతున్న గుండెపోట్లు.. -
కుషాయిగూడలో వెంకటేశ్వర ఆలయంలో దారుణం
-
Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గుడిలో చోరీకి యత్నించిన దొంగపై వాచ్మెన్ దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య (60) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఓ యువకుడు చోరీ కోసం గుడిలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి వచ్చిన దుండగుడు గర్భగుడిలోని హుండీ దగ్గరకు వెళ్లి దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన రంగయ్య వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతను వాచ్మెన్పై రాళ్లతో దాడికి దిగాడు. దొంగను అడ్డుకునేందుకు వాచ్మెన్ కూడా దగ్గర ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో దొంగ తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు, పోలీసులు మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటహుటిన ఆలయానికి చేరుకున్న పోలీసులు మృతుడిని పరిశీలించగా.. అతని ఫోన్ దొరికింది. ఫోన్లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజు (23)గా గుర్తించారు. రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిగా తెలిపారు. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీకి యత్నించిన దొంగపై వాచ్ మెన్ దాడి.. అక్కడికక్కడే మృతిచెందిన దొంగ
-
అమానుష ఘటన.. అపార్ట్మెంట్ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో అమనుష ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కమలానగర్లో గుర్తు వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు. రెండ్ అపార్టమెంట్ల మధ్య ఆవరణలో కేవలం ఒకరోజు వయసున్న శిశువును వదిలి వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు.. పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందజేశారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సాయికుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ వద్ద పసికందును చూసి చలించిపోయిన ఎస్సై స్వయంగా తన చేతుల్లోకి తీసుకొని వైద్యం నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందుకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. శిశువు పట్ల మానవాత్వం చాటుకున్న ఎస్సైని స్థానికులు కొనియాడారు. చదవండి: పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ ధోబీఘాట్ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ప్రొటోకాల్ అంశంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమోహన్ వర్గాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో రెండు వర్గాలు విడిపోయి తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడల్లా బలాలను ప్రదర్శించుకుంటూ ఎవరి ఆధిపత్యాన్ని వారు చాటుతున్నారు. ఈ క్రమంలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేక నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం కుషాయిగూడలో ఆధునిక యాంత్రిక ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగా తనకు అవమానం జరిగిందని స్థానిక కార్పొరేటర్ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకోగా.. ప్రొటోకాల్ తనకు సంబంధించిన అంశం కాదని అది అధికారుల చూసుకుంటారంటూ ఎమ్మెల్యే చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మహిళా కార్పొరేటర్నైన తనను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అడుగడుగునా అవమానపరుస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. ఒక మహిళనని చూడకుండా గడిచిన మూడేళ్లుగా అనేక అవమానాలకు గురిచేస్తూ వస్తున్నారని ఆవేదన చెందుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో లేని విధంగా ఎమ్మెల్యే చర్లపల్లి డివిజన్లో కార్పొరేటర్ ప్రమేయం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’ ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి చేస్తూ ప్రొటోకాల్ సమస్యకు తెరలేపుతూ తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళనైన తనను అంతటా అవమానపరుస్తూనే ఉన్నారని ఆవేదన చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను అధిష్టానానికి అందజేస్తానన్నారు. తాజాగా కుషాయిగూడ ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగానూ తనను అగౌరవపరిచినట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు ధోబీఘాట్ వద్దే తాను ఉన్నానని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి రావడం మరో అరగంట సమయం ఉందని నిర్వాహకులు చెప్పడంతో పూలే వర్ధంతి సభలో పాల్గొనేందుకు వెళ్లి వచ్చేలోపు మంత్రి, ఎమ్మెల్యే ధోబీఘాట్ యంత్రాన్ని ప్రారంభించి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ప్రస్తావన లేకుండా నిమిషాల వ్యవధిలో ప్రారంభించి వెళ్లి తనను అవమానపరిచారని ఆవేదన చెందారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని వివరణ కోరగా.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తనపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అవి పూర్తి అసత్యాలని కొట్టి పడేశారు. -
రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా..
సాక్షి, హైదరాబాద్: బైక్ అదుపుతప్పి డివైడన్‌రు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వేణుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ మారుతీనగర్ కాలనీకి చెందిన దంతులూరి అభిసాయిరామ్‌రాజు (22) హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. గత శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అభి సిద్దిపేట నుంచి వచ్చిన మిత్రుడు రమేష్‌నును కలిశాడు. ఇద్దరు కలిసి నాగారంలోని మరో మిత్రుడి ఇంటికి వెళ్లారు. రాత్రి ఇంటికి రావడం లేదని మరుసటి రోజు ఉదయం వస్తానని తన తల్లికి ఫోన్ చేసి చెప్పిన అభి రాత్రంతా మిత్రులతో కలిసి సరదాగా గడిపారు. ఆదివారం తెల్లవారుజామున రమేష్‌ను జేబీఎస్లో డ్రాప్ చేయడానికి మరో మిత్రుడి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో ఈసీఐఎల్ చౌరస్తా నుంచి రాధిక వైపుగా వెళ్తుండగా సోనీ సెంటర్ మూలమలుపు వద్ద అదుపు తప్పిన బైక్ డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అభిసాయిరామ్‌రాజు తల పగిలి అక్కడిక్కడే మృతిచెందగా రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. చదవండి: విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి -
432 ఖరీదైన సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన దొంగలు
-
డేట్స్ ప్యాకెట్లో పురుగులు.. కుషాయిగూడ డీ మార్ట్‌లో ఘటన
సాక్షి, హైదరాబాద్: డేట్స్ (కర్జూర) ప్యాకెట్లో పురుగులు రావడంతో అవాక్కైన వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టిన అధికారులు నిర్వాహకులకు జరిమాన విధించిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ డీ మార్ట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే.. న్యూ వాసవి శివనగర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ శుక్రవారం డీ మార్ట్‌లో డేట్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. సరుకుల కొనుగోలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా అతడి కుమారుడు డీ మార్ట్ ఆవరణలోనే తినేందుకు డేట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకోగా మూతిపై పురుగులు పారడాన్ని తండ్రి గమనించాడు. వెంటనే అప్రమత్తమైన అతను ప్యాకెట్‌ను చూడగా కుళ్లిపోయి ఉంది. దీంతో అవాకైన చంద్రశేఖర్ డీ మార్ట్ సిబ్బందిని నిలదీయడమేగాక అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నారెడ్డి తన సిబ్బందితో కలిసి సరుకులను తనిఖీ చేశారు. పూర్తిగా కుల్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్న డేట్స్ ఫ్యాకెట్‌ను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఎంహెచ్ఓ డీ మార్ట్ నిర్వాహకులకు రూ.30 వేలు జరిమానా విధించారు. చదవండి: ఎంసెట్ స్టేట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు -
కుషాయిగూడ బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో చోరీ
-
ఇష్టం లేని స్కూల్‌కు వెళ్లలేను.. పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం
కుషాయిగూడ: తల్లిదండ్రులు తనకిష్టం లేని స్కూల్‌కు వెళ్లామంటున్నారని మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా దోరదేవరపాడు గ్రామానికి చెందిన నాగళ్ల రవి, రాధ దంపతులు. 17 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. కాప్రా కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని శ్రీహన్స్ వజ్రం అపార్టుమెంట్లో ఉంటున్నారు. రవి వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. వీరి కూతురు కావ్య (15) సైనిక్‌పురి గోకుల్‌నగర్‌లోని సిటీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. సాకేత్‌లోని విద్యాభారతి స్కూల్లో 9వ తరగతి చదివిన కావ్యను.. ఆ పాఠశాల దూరం అవుతుందన్న ఉద్దేశంతో అపార్టుమెంట్‌కు సమీంలోని సిటీ హైస్కూల్లో చేర్పించారు. కొత్తగా చేరిన స్కూల్లో చదువుకోవడం తనకు ఇష్టం లేదని తిరిగి పాత పాఠశాలలోనే తనను చేర్పించాలని తల్లిదండ్రులతో చెప్పింది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనే ఉంది. స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని తండ్రి ప్రశ్నించాచు. సదరు స్కూల్‌కు వెళ్లడం తనకు ఇష్టం లేదని కావ్య సమాధానం ఇవ్వడంతో కూతురును రవి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. అదే సమయంలో అపార్టుమెంట్ ఎదుట పెద్ద శబ్దం రావడంతో అందరూ బయటకు వచ్చారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న కావ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: మొదటి పెళ్లి విషయం దాచి, ప్రేమిస్తున్నానన్నాడు.. మతం మార్చుకొని -
భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో..
సాక్షి, కుషాయిగూడ: అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక బీదర్‌కు చెందిన మచ్ఛీంద్రా రాథోడ్, కుటుంబ సభ్యులతో కలిసి ఏడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఏఎస్‌రావునగర్, సాయినాథపురంలో నివాసముంటూ స్వీట్‌కాన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ప్రియాంక జాదవ్ (20)ఉన్నారు. కూతురికి 2020 మార్చిలో ఏఎస్‌రావునగర్‌లోనే ఉంటున్న సచిన్‌జాదవ్‌తో వివాహం జరిగింది. వారికి 13 నెలల పాప ఉంది. కొంత కాలం సజావుగా సాగిన వారి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. తరచూ భార్యను అనుమానించడం, వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టాడు. భర్త వేధింపులు భరించలేని ప్రియాంక, తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా పలుమార్లు సర్ధి చెప్పినా అ తని తీరు మారలేదు. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఈ నెల 20న ప్రియాంక వారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. కూ తురుకి మళ్లీ సర్ధిచెప్పి మరుసటి రోజు సోదరుడు సంతోష్‌తో కలిసి ప్రియాంకను అత్తరింటికి పంపించారు. వారిని చూసిన సచిన్ దురుసుగా ప్రవర్తించాడు. కాసేపటి తర్వాత సంతోష్ ఇంటికెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఒంటరిగా ఎందుకు వదిలివచ్చావని, చిన్న కొడుకు సందీప్‌ను కూతురు ఇంటికి పంపించాడు. సందీప్ అక్కడికి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎంతకీ తీయకపోవడంతో కిటికీ లోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. లోనికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్వగ్రామానికి చెందిన యువతితో ప్రేమ.. మరొకరిని ప్రేమిస్తోందని తెలిసి.. మనోవేదనకు గురై.. అల్వాల్: మానసిక ఒత్తిడి, మనోవేదనకు గురై గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ గంగాధర్ వివరాల ప్రకారం.. భూదేవినగర్‌కు చెందిన రేవతి (28) మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్‌కు చెందిన కిరణ్‌తో గతేడాది వివాహం జరిగింది. గత కొంతకాలంగా రేవతి తల్లి లత తలకు తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతోంది. ఇటీవల రేవతి భూదేవినగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి మానసికంగా కుంగిపోయి ఒత్తిడి గురైంది. ఈ నెల 20న రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో లోపలికెళ్లి చూడగా రేవతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. -
ఏడేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి
సాక్షి, కుషాయిగూడ: వేర్వేరు ఘటనల్లో పలువురు అదృశ్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఓ ఘటనలో ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యం కాగా, మరో ఘటనలో స్నేహితుడితో కలిసి వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగి రాలేదు. పిల్లలతో కలిసి.. కాప్రా, శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన పులి భాస్కర్‌రాజు ప్రైవేటు ఉద్యోగి. అతడికి ఏడేళ్ల క్రితం హైమవతి (26)తో వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల హన్షిత్రాజ్, మూడున్నరేళ్ల గ్రీష్మ సంతానం. ఈ నెల 11న పిల్లలతో కలిసి అందరూ లాలాపేట్‌లో హైమవతి అక్క ఇంటికి వెళ్లి 13న వచ్చారు. 14న ఉదయం భాస్కర్‌రాజు ఆఫీసుకు వెళ్లాడు. అదే రోజు హైమవతి ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమలగిరి నాగదేవత ఆలయానికి వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విహారయాత్రకు వెళ్లి.. కాప్రా, సైనిక్‌పురి, లేక్‌వ్యూ రెసిడెన్సీలో నివసించే షేక్ ప్రద్న్య సులేమాన్ (23), భర్త షేక్ సులేమాన్ ఇద్దరూ ఐటీ ఉద్యోగులే. వారికి ఓ పాప ఉంది. పుణెకు చెందిన తన భర్త స్నేహితుడు అవినాష్ శర్మతో కలిసి తమ కారులో గత నెల 28న టూర్‌కు బయలుదేరి కర్ణాటక చేరుకున్నారు. 30న అక్కడి నుంచి గోవాకు వెళ్లారు. అక్కడ జూమైకా కాబో వాబో బీచ్‌లోని ఓ రెస్టారెంట్లో బస చేశారు.ఈ నెల 4న అవినాష్ అక్కడి నుంచి వెళ్లిపోగా సులేమాన్ 7న రెస్టారెంట్ ఖాళీ చేశాడు. తిరిగి వస్తున్నట్లు భార్యకు ఫోన్లో చెప్పిన సులేమాన్ ఇంటికి చేరుకోలేదు. చివరగా ఈ నెల 8న తన భర్తతో ఫోన్లో మాట్లాడినట్లు భార్య పోలీసులకు తెలిపింది. ఈ నెల 14 ఆన్లైన్ మీటింగ్‌లో హాజరు కావాల్సిన సులేమాన్ మీటింగ్‌లో పాల్గొనక పోవడంతో ఆరా తీసింది. ఎంతకి తన భర్త అచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.హైమవతి, ఇద్దరు పిల్లలుహైమవతి, ఇద్దరు పిల్లలు -
Hyderabad: మసాజ్ సెంటర్ పేరుతో చీకటి బాగోతాలు
సాక్షి, కుషాయిగూడ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ మసాజ్ సెంటర్‌పై బుధవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేసి సెంటర్‌ను సీజ్ చేశారు. ఏఎస్‌రావునగర్‌లో గ్లోవిష్ బ్యూటీ కేర్ పేరుతో కొంత కాలంగా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా మాదిపల్లి మహేశ్ అనే వ్యక్తితో పాటు, మరో ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు. చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..) -
పక్కస్కెచ్ వేసి తండ్రిని చంపిన కూతురు
-
కన్న తండ్రిని కూతురే కడతేర్చింది
కుషాయిగూడ(హైదరాబాద్): తమ ప్రేమకు అడ్డు చెప్తున్నాడని ఓ కూతురు ప్రియుడితో కలసి తండ్రిని హత్య చేసింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జూలైలో జరిగిన ఈ ఘటనపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఈ దర్యాప్తులో అసలు కథ బయటపడింది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటూ స్థానిక గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. రామకృష్ణ (ఫైల్) గత జూలై 20న తలకు బలమైన గాయాలతో రామకృష్ణ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరో పెద్దాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇంట్లో జారిపడి తలకు గాయమైందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఆశ్చర్యపర్చిన పోస్టుమార్టం నివేదిక.. అయితే, రామకృష్ణ పోస్టుమార్టం నివేదికలో ఆశ్యర్యపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి గొంతు నులిమినట్లుగా, బలంగా కొట్టినట్లుగా గాయాలు ఉన్నట్లుగా తేలింది. దీంతో అనుమా నం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. మృతుడి భార్య, కుటుంబసభ్యులను విచారించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో నారాయణగూడలోని ఓ అపార్ట్మెంట్లో వీరు ఉండేవారు. రామకృష్ణ కూతురు (మైనర్ బాలిక) అపార్ట్మెంట్ వాచ్‌మన్ కొడుకు చెట్టి భూపాల్ (20)తో ప్రేమలో పడింది. విషయం తెలిసిన బాలిక తండ్రి పలుమార్లు మందలించారు. ఈ క్రమంలో భూపాల్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి.. రామకృష్ణ ఇంట్లో రూ.1.75 లక్షలు చోరీ చేశాడు. ఖరీదైన బైక్, సెల్‌ఫోన్, బట్టలు కొనుక్కొని మైనర్ బాలికతో జల్సాలు చేశాడు. దీనిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు భూపాల్‌ను రిమాండ్ తరలించారు. కూతురి ప్రేమ వ్యవహారం బయటపడుతుందని... అనంతరం రామకృష్ణ కాప్రాకు మకాం మార్చాడు. గత జూలైలో జైలు నుంచి విడుదలైన భూపాల్ తిరిగి బాలికతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడినే పెళ్లి చేసుకోవాలని బాలిక కూడా నిర్ణయించుకుంది. దీంతో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న రామకృష్ణను హత్యచేయాలని భావించారు. భూపాల్ తన ఇద్దరు మిత్రులతో కలసి రామకృష్ణ హత్యకు పథకం వేశాడు. తినే ఆహారంలో మత్తు మందు కలిపితే హత్య చేయడం సులువుగా ఉంటుందని ఆలోచించారు. జూలై 19 సాయంత్రం వీరు మత్తుగోలీల పౌడర్‌ను కూతురుకు అందజేశారు. తల్లిదండ్రులు తినే ఆహారంలో ఆ పౌడర్‌ను ఆమె కలపడంతో వారు నిద్రలోకి వెళ్లిపోయారు. భూపాల్ తన మిత్రులతో రాత్రి ఒంటి గంట సమయంలో కాప్రాకు చేరుకున్నాడు. నిద్రలో ఉన్న రామకృష్ణ ముఖంపై భూపాల్, గణేష్ బ్లాంకెట్ వేసి అదిమిపట్టుకోగా, ప్రశాంత్ కత్తితో తలపై బలంగా పొడిచాడు. నొప్పితో మేల్కొన్న రామకృష్ణను చూసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తేరుకున్న కుటుంబసభ్యులు రామకృష్ణను ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. కూతురి ప్రేమ విషయం బయటకు వస్తుందన్న ఆలోచనతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పకుండా దాచారు. అయితే, పోస్టుమార్టం నివేదికతో దర్యాప్తు జరిపిన పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారు. తండ్రి హత్యకు ఫ్లాన్ చేసిన కూతురు, భూపాల్, గణేష్, ప్రశాంత్‌తో పాటుగా ప్రశాంత్‌ను రక్షించాలనే ప్రయత్నం చేసిన అతడి తండ్రి విజయ్‌పాల్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. -
హత్యా.. ఆత్మహత్యా! ముఖంపై గాయాలు.. పరారీలో భర్త
సాక్షి, కుషాయిగూడ: హెచ్‌బీకాలనీ, రాజీవ్‌నగర్‌లో మహిళ మృతిచెందిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి ముఖంపై గాయాలు, మెడకు తాడు బిగించినట్లు కనిపిస్తున్న గుర్తులు చూస్తుంటే ఆమెది హత్యా.. ఆత్మహత్యా.. అనే సందేహం వస్తోంది. సోమవారం రాత్రి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో లక్ష్మీ అనే గృహిణి అనుమానాస్పదంగ మృతిచెందిన విషయం తెలిసిందే. భర్త పరుశరాం పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చదవండి: మణికొండ: యువతితో క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన పరుశరాం కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూలీ పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి కంటే వయసులో పెద్దదైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మితో ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకు దారితీసింది. మృతురాలు లక్ష్మీది రెండో వివాహం అని తెలుస్తోంది. గత ఐదు నెలల క్రితమే హెచ్‌బీ కాలనీ, రాజీవ్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని కొత్తగా సంసారం పెట్టారు. ఇద్దరూ కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. నిత్యం మద్యం తాగే అలవాటున్న వీరు రోజూ తాగి ఇంటికి వచ్చి గొడవ పడటం తరచుగా జరిగేదని ఇంటి యజమాని తెలిపారు. చదవండి: మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం, ప్రాణం తీసింది ఈ క్రమంలోనే పరుశరాం భార్యను హత్య చేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతురాలి ముఖంపై గాయాలు, చెవి, ముక్కు, నోరు, కళ్లలోంచి కారుతున్న రక్తం మరకలు, గొంతుపై కనిపిస్తున్న చారలను బట్టి ఆమెది హత్యేనన్న అనుమానాలకు బలం చేకురుస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. పరారీలో ఉన్న భర్త పరుశరాంను అదుపులోకి తీసుకున్నారా లేదా అనే సమాచారాన్ని పోలీసులు ఇవ్వడం లేదు. -
ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం.. బిల్ కలెక్టర్ బాగోతం
సాక్షి, కుషాయిగూడ: ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ గుట్టును కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకురాలితో పాటుగా విటుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని అరెస్టు చేసిన ఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ వాసవీశివనగర్ పార్కు సమీపంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్న సునీతా మండల్ (40) అనే మహిళ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. విషయం తెలిసిన కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. అదే ఇంట్లో ఇటీవలే అద్దెకు దిగిన బిల్ కలెక్టర్ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్రూంలో ఉండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలు సునీతా మండల్, విటుడు మహదేవ్‌తో పాటుగా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్‌ను స్వా«దీనం చేసుకున్నారు. గతంలో ఆమెపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిందన్నారు. గురువారం కేసు నమోదు చేసి నిందితులను మేజిస్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు వివరించారు. చదవండి: KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి.. -
‘బ్లాక్ మ్యాజిక్ పేరుతో బ్లాక్ మెయిల్, రూ.30 లక్షలకు డీల్’
కుషాయిగూడ: గుప్తనిధులు తీసే ముందు చేసే క్షుద్రపూజలు (బ్లాక్ మ్యాజిక్ పవర్) కోసం చేసుకున్న డీల్ కాస్తా బెడిసికొట్టింది. బ్లాక్ మెయిల్‌కు పాల్పడి అడిగిన సొమ్ము ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. వివరాలను ఆదివారం కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్ వెల్లడించారు. నాగార్జునగర్ కాలనీకి చెందిన ఆంటోనీ మోసిస్ లారెన్స్ ఆలియాస్ శ్రీకాంత్ ప్యాబ్రికేషన్ పనిచేస్తూ స్థానికంగా చెగోడిల బట్టీ నిర్వహిస్తున్నాడు. గుప్తనిధులు తవ్వకాలు చేసే క్రమంలో క్షుద్రపూజలు నిర్వహించడం ప్రవృత్తిగా పెట్టుకొని పూజల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. రూ.30 లక్షలకు డీల్ ఆల్విన్‌కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ కొట్రా శ్రీనివాస్‌రెడ్డి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బిల్డింగ్ కాంట్రాక్టరు రాంమూర్తి (61) మిత్రులు. ప్రకాశం జిల్లాలో తనకు కొంత వ్యవసాయ భూమి ఉందని, అందులో గుప్తనిధులు వెలికి తీయాలంటే క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని రాంమూర్తి శ్రీనివాస్‌రెడ్డితో అన్నాడు. దీంతో తనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడని, ఈ నెల 5న రాంమూర్తిని కుషాయిగూడ, నాగర్జుననగర్ కాలనీలో నివసించే ఆంటోనీ లారెన్స్ ఇంటికి తీసుకెళ్లాడు. భూమికి సంబంధించిన పత్రాలు, ఫొటోలను ఆంటోనీకి చూపిన రాంమూర్తి రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ నెల 11న అమావాస్య రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 10న సాయంత్రం శ్రీనివాస్‌రెడ్డి, రాంమూర్తి బైక్‌పై కూకట్పల్లి నుంచి బయలుదేరి ఆంటోనీ ఇంటికి చేరుకున్నారు. ఆంటోనీ కొత్త నాటకానికి తెర తీశాడు. (చదవండి: ‘మాకు నచ్చిందే చెబుతాం, అది అంతే, మేమింతే’) కాళభైరవ శక్తుల పేరుతో.. భూమి పత్రాలు, ఫొటోలకు పూజలు చేసే క్రమంలో కాళభైరవ శక్తులు నా కుటుంబ సభ్యులపై పడి వారు అనారోగ్యానికి గురయ్యారని, రూ.30 లక్షల వరకు ఖర్చు అయ్యిందని, ఆ డబ్బులు ఇవ్వాలని రాంమూర్తిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. రూ.7 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. రాంమూర్తి డబ్బులు సమకూర్చే ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోవడంతో కర్రలతో కొట్టారు. ఈ నెల 12న అతడిని బట్టీ వద్దకు తీసుకెళ్లారు. చెరువులో మృతదేహాన్ని పడేసి.. డబ్బులు రాకపోవడంతో రాంమూర్తిని చంపేసి అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, రూ.56 వేల నగదు తీసుకొని సమీపంలో నాగారం, అన్నారం చెరువులో మృతదేహాన్ని పడేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఆంటోనీ, శ్రీనివాస్‌రెడ్డితో పాటు వారికి సహకరించిన శాగంటి వాణిసాగర్, జిత్తుసింగ్, మనోజ్సింగ్, ఆంటోనీ భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మూడు బైక్‌లు, బంగారు గొలుసు, ఆరు సెల్ఫోన్లు, గోల్డ్ రింగ్, రూ.7 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై చిలకలగూడ, అంబర్పేట్, నాచారం పోలీస్స్టేషన్ల పరిధిలో ఆరు చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. (చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..) -
ఇష్టపడి హిజ్రాను పెళ్లి.. మరో అమ్మాయిపై మోజు పెంచుకొని
సాక్షి, కుషాయిగూడ: ఇష్టపడి ఓ హిజ్రాను పెళ్లి చేసుకొని వేధింపులకు గురిచేస్తున్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన బండారి నాగేందర్ (32), మల్లాపూర్, నేతాజీనగర్‌కు చెందిన గుత్తికొండ దివ్య (32) అనే హిజ్రాకు స్నేహం కుదిరింది. 2019 వరంగల్ మేడారం జాతరలో దివ్యను చూసిన నాగేందర్ 2019 నవంబరులో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటుగా ఆనందంగా గడిపారు. గత కొన్ని రోజులుగా వైష్ణవి అనే అమ్మాయిపై మోజు పెంచుకొని తనను వేధించడం మొదలుపెట్టాడని దివ్య పోలీసుల ఎదుట వాపోయింది. ఆమెను వివాహం చేసుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని అందుకు అంగీకరించమంటూ మానసికంగా, శారీరకంగా వేధించినట్లు పోలీసులకు తెలిపింది. అంతే కాకుండా నాగేందర్ తల్లి శోభ, అక్క అఖిలవాణి తరచుగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేంధిపులకు పాల్పడుతున్న నాగేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,కుషాయిగూడ: కుషాయిగూడలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. దీంతో చిరువ్యాపారులు పలువురు తీవ్రంగా నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఖాళీ స్థలంలో స్థలాన్ని లీజుకు తీసుకొని కొంతమంది చిరు వ్యాపారాలు చేస్తున్నారు. రోజులాగానే ఆదివారం రాత్రి అందరూ షాపులు కట్టేసి వెళ్లారు. తెల్లవారు జామున ఒక్కసారిగా అకస్మాత్తుగా ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు పోలీసులు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సుమారు 4 గంటల పాటుగా శ్రమించి మంటలను అదుపు చేసినా ఫలితం కన్పించలేదు. అప్పటికే మూడు కూలర్ల షాపులు, ఫర్నిచర్, చెప్పుల దుకాణాలు, హోంనీడ్స్ ఇండియన్ బజార్, మర్తమాండ్ల దుకాణాలతో పాటు సమీపంలో పార్కు చేసిన రెండు వాహనాలు మంటల్లో కాలిపోయాయి. దీంతో దాదాపు రూ.కోటి వరకు ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు. అగ్నిప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై చూస్తుండగానే కాలిపోయిన కారు -
భర్త రెండో పెళ్లి.. భార్యపై వేధింపులు.. ఆ తర్వాత
సాక్షి, కుషాయిగూడ: భార్య, పిల్లలు ఉండగానే మరో మహిళను వివాహం చేసుకున్న వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం మల్కాజిగిరి కోర్టు తీర్పు చెప్పింది. ఆయనతో పాటు వేధింపులకు పాల్పడ్డ వారికి జరిమానా, జైలు శిక్ష విధించింది. పోలీసుల సమాచారం మేరకు... కాప్రా భవానీనగర్‌కు చెందిన ఎల్.భవాని (గాయత్రి), ప్రేమ్‌కుమార్‌లకు 2002లో వివాహం జరిగింది. ప్రేమ్‌కుమార్ రైల్వే ఉద్యోగి. వీరికి ఇద్దరు సంతానం. ఇదిలా ఉండగా... ప్రేమ్‌కుమార్‌కు పనిచేసే చోట కవిత అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యలో ప్రేమ్‌కుమార్ తన భార్యను వదిలించుకునేందుకు వేధింపుల పర్వానికి తెరలేపి నిత్యం వేధించసాగాడు. భర్తతోపాటు అత్త లాకావత్ లత, ఆడపడుచు లాకావత్ అర్చన సైతం భవానీని వేధింపులకు పాల్పడేవారు. ఇదిలా ఉండగా 2014 జూలై 4న ప్రేమ్‌కుమార్, కవితలు ఎవరికీ తెలియకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే ప్రేమ్‌కుమార్ అదృశ్యంపై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో, కవిత అదృశ్యంపై మల్కాజిగిరి పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వివాహం అనంతరం ప్రేమ్‌కుమార్, కవిత కుషాయిగూడ పోలీస్ట్‌షన్‌కు వచ్చి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో 2016 మే 5న అతిగా మద్యం సేవించిన ప్రేమ్‌కుమార్ మొదటి భార్య లావణ్య పట్ల దురుసుగా వ్యవహరించి, బూతులు తిడుతూ చేయిచేసుకున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లావణ్య పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు రెండో వివాహం చేసుకున్న ప్రేమ్‌కుమార్, కవితతో పాటు వేధింపులకు పాల్పడ్డ లత, అర్చనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐఓ ఎస్ఐ నాగేశ్వర్రావు దర్యాప్తు చేసి కోర్టుకు తగిన ఆధారాలతో చార్జిషీట్‌ను సమర్పించారు. కేసు పూర్వాపరాలు.. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం ప్రేమ్‌కుమార్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 5,500 జరిమానా, మిగతా వారికి ఏడాది జైలు శిక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు. -
పెళ్లింట భారీ చోరి.. 2 కోట్లకు పైగానే
సాక్షి, కుషాయిగూడ : ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీ 4– ఎవెన్యూ బీ ,–171లో పారిశ్రామికవేత్త ఐలేని నర్సింహారెడ్డి కుటుంబం నివాసముంటోంది. ఆయన చిన్నకుమారుడు సూర్య వివాహం గత నెల 29న జరగ్గా, రిసెప్షన్‌ను పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించారు. (పంగోలిన్ చర్మాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు) రిసెప్షన్లో పాల్గొనేందుకు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోగా, నేపాల్‌కు చెందిన వాచ్‌మన్ భీం ఒక్కరే ఇంట్లో ఉండిపోయారు. ముందస్తు పథకం ప్రకారం భీం మరో సహచరుడిని పిలిపించుకుని ఇంట్లోని లాకర్ తాళాలు పగులగొట్టి వజ్రాలు పొదిగిన హారంతోపాటు బంగారం సహా 25 రకాల ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను రెండు పెద్ద సంచుల్లో నింపుకుని ఇంటి యజమాని స్కూటీపైనే పరారయ్యాడు. సైనిక్‌పురి చౌరస్తాకు వెళ్లిన తర్వాత స్కూటీని ఓ చెత్తకుప్ప సమీపంలో వదిలేసి ఆ సంచులను భుజాన వేసుకుని తాపీగా వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రిసెప్షన్ అనంతరం అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో చోరికా గురయ్యాయని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్తోపాటు డాగ్‌స్క్వాడ్‌తో ఘటనాస్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి అక్కడ పలు ఆధారాలను సేకరించారు. సైనిక్‌పురి చౌరస్తా సమీపంలో స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 7 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ పేర్కొన్నారు. (భూతవైద్యం: ప్రాణాలు కోల్పోయిన రజిత) -
విద్యార్థిని ఐరన్ స్కేల్‌తో తలపై బాదిన టీచర్
కుషాయిగూడ: ఓ టీచర్ ఏడో తరగతి విద్యార్థి తలపై ఐరన్ స్కేల్‌తో కొట్టడంతో గాయమైంది. ఈ విషయంపై ఆ స్కూల్ ప్రిన్సిపల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారు. హెచ్‌బీకాలనీలో నివసించే భార్గవి కుమారుడు నిఖిల్‌సాయి ఈసీఐఎల్‌లోని యస్ఆర్ డీజీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం టీచర్ శశికళ క్లాస్ తీసుకునేందుకు తరగతి గదికి వెళ్లారు. అల్లరి చేస్తున్న విద్యార్థులను వారిస్తున్న క్రమంలో నిఖిల్సాయిని ఆమె ఐరన్ స్కేల్‌తో తలపై కొట్టారు. దీంతో రక్తస్రావమై బాలుడి తలకు గాయమైంది. దీంతో జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. బాలుడి తల్లి భార్గవి ప్రిన్సిపల్‌ను నిలదీయగా..ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాలుడి తాతయ్య దయానంద్‌తో కలిసి ఆమె కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా 5 గంటలు స్టేషన్లోనే ఉంచారు. రాత్రి 11 గంటల సమయంలో వారుఅక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం కాస్తా మీడియాకు పొక్కడంతో మంగళవారం ఉదయం పోలీసులు బాధితులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేపట్టి బాలుడిని కొట్టిన టీచర్‌తో పాటు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశామన్నారు. -
తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఘటన
-
అపురూప దృశ్యం..
సాక్షి, హైదరాబాద్: ఇదొక భావోద్వేగపూరిత సన్నివేశం. ఎనిమిది నెలల పాటు కనిపించకుండా పోయిన కన్నకొడుకు కళ్లెదుట ప్రత్యక్షమైనప్పుడు ఆ మాతృమూర్తి చూపించిన అవాజ్య ప్రేమకు నిలువుటద్దం. ఏమైపోయాడో తెలియని బిడ్డ ఊహించని విధంగా తిరిగిరావడంతో పట్టరాని ఆనందంతో ఆ అమ్మ తన గారాల కొడుకుని ముద్దులతో ముంచెత్తింది. ‘ఇన్నాళ్లు ఎక్కడున్నావురా కన్నా’ అంటూ గుండెలకు హత్తుకుని రోదించింది. తన ‘ప్రాణాన్ని’ తిరిగి తెచ్చిన పోలీసులకు వందనాలు అంటూ మొక్కింది. తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఈ ఘటనకు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ వేదికగా నిలిచింది. దర్పణ్.. ఇది తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్. తప్పిపోయిన పిల్లలను వెతికి ఈ యాప్ సహాయంతో వారి గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎంతో మంది పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తాజాగా ఓ పిల్లాడిని దర్పణ్ యాప్ సహాయంతో ఫేషియల్ రికగ్నిషన్ టూల్ ద్వారా గుర్తించిన కుషాయిగూడ పోలీసులకు బాలుడి తల్లిదండ్రులకు కబురు పంపారు. ఎంతో ఆతృతగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. పిల్లాడి తల్లి కొడుకుపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఐజీ(మహిళల భద్రత) స్వాతి లక్రా ట్విటర్లో షేర్ చేశారు. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులను అభినందిస్తూ నెటిజనులు ట్విటర్లో కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: మరో అమ్మ కథ) -
సహజీవనం చేస్తున్నందుకు దారుణంగా హత్య
సాక్షి, హైదరాబాద్: మహిళతో సహజీవనం చేస్తున్న యువకుడిని కొంతమంది కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్‌రావునగర్ డివిజన్, మహేశ్‌నగర్ గాయత్రి అపార్టుమెంట్లో ఓ మహిళ తన 9 సంవత్సరాల కొడుకు, తల్లితో కలిసి నివాసముంటోంది. భర్తను వదిలేసిన ఈమె యూసుఫ్‌గూడ నుంచి నెలన్నర క్రితమే ఇక్కడికి వచ్చింది. ఇదిలావుండగా రంగారెడ్డి జిల్లా, బాషామోనిగూడేనికి చెందిన గుర్రం శివారెడ్డి(30) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటు కొత్తపేట మార్గదర్శి కాలనీలో ఉంటున్నాడు. సదరు మహిళ శివారెడ్డితో నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. శివారెడ్డి తరచుగా మహేశ్‌నగర్‌కు వచ్చి వెళ్తుంటాడు. సోమవారం కూడా శివారెడ్డి ఇక్కడికి వచ్చాడు. అదే సమయంలో సదరు మహిళ సోదరుడు తన భార్యతో కలిసి మహేశ్‌నగర్‌లోని సోదరి వద్దకు రాగా మహిళ సోదరుడుకి శివారెడ్డికి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న శివారెడ్డిపై దాడి చేసి బయటకు గెంటేశారు. ఆ సమయంలో శివారెడ్డి వంటిపై లుంగీ మాత్రమే ఉంది. దీంతో బట్టల కోసమని తిరిగి ఫ్లాట్ వద్దకు వెళ్లగా లుంగీ కూడా లాగేసి కొంతమంది కర్రలతో శివారెడ్డిపై దాడి చేశారు. దాడిలో తల పగిలి కింద పడిపోయాడు. రోడ్డుపై పడివున్న శివారెడ్డిని పక్కనే ఉన్న పొదల్లో పడేశారు. శివారెడ్డి మృతదేహం ఇదంతా గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న శివారెడ్డిని పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
కుషాయిగూడ: గుడికి వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాప్రాలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాప్రా, ప్రశాంత్‌నగర్ కాలనీ, సాయినివాస్కు చెందిన కర్రె మాధవి గురువారం సమీపంలోని చాముండేశ్వరీ ఆలయాని కి నడిచి వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు ఆమె వీపుపై కొట్టి మెడలో ఉన్న 7 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దీనిపై సమాచారం అందడంతో మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వరశర్మ, క్రైం డీసీపీ సలీమా, డిఐ భాస్కర్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డిఎస్సై విజయకృష్ణ, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిదండ్రులు మందలించారని..
కుషాయిగూడ: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి లోనైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు చెదిన గోపి బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి చర్లపల్లి, భరత్‌నగర్‌లో ఉంటూ కూలీగా పని చేస్తున్నాడు. అతని కుమార్తె వైష్ణవి (15) మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం స్కూల్ నుంచి ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన వైష్ణవి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడినిపై కన్నతండ్రి కర్కశత్వం
-
అమ్మానాన్నలే కూతురిని కిడ్నాప్ చేశారు
సాక్షి, హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సినీ ఫక్కీలో ఓ వివాహితను తల్లిదండ్రులే కిడ్నాప్ చేశారు. అరుగుల ఆనంద్(29) చక్రిపురం కాలనీలో నివాసముంటున్నాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన రుచిత నాగార్జుననగర్ కాలనీలోని బంధువుల ఇంటికి వస్తూ.. వెళ్తూండేది. ఈ క్రమంలో ఆనంద్‌కు రుచితతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. నాలుగు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహరం నడిచింది. అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో గత ఏప్రిల్– 24న ఫలక్‌నామలోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రుచిత తల్లిదండ్రులు కూడ పలుమార్లు వచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. కలిసిపోయినట్లుగా నమ్మిస్తు వస్తున్న రుచిత తల్లిదండ్రులు అదును కోసం చూస్తు వచ్చారు. గురువారం మధ్యాహ్నం ఆనంద్ ఇంట్లోలేని సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు శ్రీధర్, భవానీలతో పాటుగా మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి రుచితను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్న తల్లి, బంధువులు కేకలు వేస్తుండగా, స్థానికులంతా చూస్తుండగానే సినిఫక్కీలో అందరిని తోసేసి బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీంతో ఆనంద్ తన భార్యను కిడ్నాప్ చేశారంటు రుచిత తల్లిదండ్రులపై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈకేసులో పోలీసులు సహకరించడం లేదని ఆనంద్ వాపోయాడు. -
బెయిల్‌పై ఈశాన్యరెడ్డి విడుదల
సాక్షి, హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రాణాన్ని బలితీసుకున్న కేసులో చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈశాన్యరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైంది. కుషాయిగూడ డీఏఈ కాలనీలో ఆదివారం రాత్రి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపై కారు ఎక్కించి అతని మృతికి కారణమైన ఇంజినీరింగ్ విద్యార్థిని ఈశాన్యరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ మహిళ జైలుకు తరలించారు. ఎట్టకేలకు ఆమెకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలైంది. -
బీరు బాటిల్లో చెత్తా చెదారం
కుషాయిగూడ: బీరు బాటిల్లో చెత్తా..చెదారంతో పాటుగా సన్నని పురుగులు దర్శనమిచ్చిన సంఘటన మంగళవారం ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే..మల్కాజిగిరికి చెందిన యశ్వంత్ ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్‌లో బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. అందులో చెత్తా, చెదారంతో పాటు సన్నని పురుగులు కనిపించడంతో అతను వైన్స్ నిర్వాహకులను నిలదీశాడు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాధితుడు ఘట్కేసర్ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈసీఐఎల్‌కు చేరుకున్న ఎక్సైజ్ అధికారులు బీరు బాటిల్‌ను పరిశీలించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య మాట్లాడుతూ ఫిర్యాదు దారుని ఆరోపణలు వాస్తవమేనని, షాంపిల్స్ సేకరించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
కారు నడిపింది ఈశాన్య రెడ్డి అనే అమ్మాయి
-
ఆ యువతుల్లో మద్యం తాగింది ఒక్కరే!
సాక్షి, హైదరాబాద్: అతివేగంగా కారు నడిపి, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న చర్మకారుడిని హత్యచేసిన యువతుల ఉదంతం నగరంలో కలకలం రేపుతున్నది. కుషాయిగూడ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి దర్యాప్తు వివరాలను సీఐ చంద్రశేఖర్ మీడియాకు వివరించారు. ఎలా జరిగింది?: ఏఎస్‌రావ్ నగర్లో స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొన్న నలుగురు యువతులు.. అర్ధరాత్రి తర్వాత స్కోడా కారులో కుషాయిగూడవైపు కదిలారు. అతివేగంగా కారును నడుపుతూ ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చారు. దీంతో ఫుట్‌పాత్‌పై నిద్రించిన అశోక్ అనే చర్మకారుడు(చెప్పులు కుట్టుకునే వ్యక్తి) దుర్మరణం చెందాడు. పక్కనున్న మరో వ్యక్తికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని యువతులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువతుల్లో ఓ సీఐ కూతురు: ‘‘ఘటన జరిగినప్పుడు ఈశాన్య రెడ్డి అనే యువతి డ్రైవింగ్ సీటులో కూర్చున్నారు. కారు రిజిస్ట్రేషన్ కూడా ఆమె పేరుమీదే ఉంది. కారులో మలక్‌పేట్ సీఐ గంగారెడ్డి కూతురు హారికా రెడ్డితోపాటు మరో ఇద్దరు యువతులు ఉన్నారు. ఆ నలుగురిలో ఒక్కరు మాత్రమే మద్యం సేవించి ఉన్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఐపీసీ సెక్షన్ 304కింద కేసు నమోదుచేశాం. అశోక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపాం’’ అని కుషాయుగూడ సీఐ చంద్రశేఖర్ మీడియాతో అన్నారు. -
మైనర్‌పై అత్యాచార యత్నం
సాక్షి, హైదరాబాద్ : కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని కాప్రా చెరువు వద్ద దారుణం జరిగింది. అశోక్ మణిపురి కాలనీకి చెందిన పదకొండేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులతో స్థానికులు రావడంతో నిందితుడు పారిపోయాడు. బాలిక స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి బైకుపై వచ్చి బాలికను ఏదో చిరునామా అడిగాడు. తిను బండారాలు ఆశ చూపి చెరువు వద్దకు తీసుకెళ్ళి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. -
కుషాయిగూడలో వ్యక్తిపై కత్తులతో దాడి
హైదరాబాద్: నగరంలో పట్టపగలే ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్లో ఓ వైన్స్ షాప్ ముందు నవీన్(40) అనే వ్యక్తిపై కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బాధితున్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నడిరోడ్డులో కారు దగ్ధం
-
ఉరి వేసుకొని గర్భిణి ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గర్భిణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అనిత(28) అనే గర్భణి కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కుషాయిగూడలో మహిళ దారుణ హత్య
హైదరాబాద్: పది రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. శవమై కనిపించింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అశోక్‌నగర్‌కు చెందిన పద్మ(40) గత పది రోజులుగా కనిపించకుండాపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం డీఏ కాలనీలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆమె శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన కుటుంబసభ్యులు పద్మగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చంపి అక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మంటలార్పుతూ గాయపడిన ఫైర్‌మెన్
హైదరాబాద్: కుషాయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఆర్పుతూ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. స్థానిక చిన్నచెర్లపల్లిలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలటంతో సమీపంలోనే ఉన్న ఫైర్‌మన్ గాయపడ్డారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మిగిలిన ఫైర్‌సిబ్బంది, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. -
హైదరాబాద్‌లో విదేశీ వనితల సందడి
-
కుషాయిగూడలో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే డి.సురేష్(35) అనే వ్యక్తి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులబాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్‌కు భార్యా ఇద్దరు పిల్లలున్నారు. -
రెండున్నరేళ్ల చిన్నారిపై మాస్టర్ లైంగికదాడి
కుషాయిగూడ: చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఫిర్యాదు మేరకు ఓ పాఠశాల కరాటే మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగాయి. విద్యార్థిని తండ్రి, కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం... నాగారం ఎస్వీనగర్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి స్థానిక ఐరీష్ ప్లోరెస్ట్ ప్లేస్కూల్లో చదువుతోంది. ఈనెల 7న పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చింది. ఎప్పుడూ హుషారుగా ఉండే చిన్నారి ఆరోజు నుంచి భయం.. భయంగా, దిగులుగా ఉంటోంది. తల్లిదండ్రులు చిన్నారిని ఏమైందని అడగ్గా కరాటే మాస్టర్ సాయికిరణ్ తనతో ప్రవర్తించిన తీరు వెల్లడించింది. తల్లిదండ్రులు గత సోమవారం పాఠశాలకు వెళ్లి డైరక్టర్, సిబ్బందిని నిలదీయగా.. వారు తప్పును తప్పు కప్పిపుచ్చేలా మాట్లాడారు. దీంతో అదే రోజు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కరాటే మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరమణ తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించాయి. ఈ విషయంపై పాఠశాల డైరెక్టర్ అనితను ‘సాక్షి’ వివరణ కోరగా.. తమ పాఠశాలలో అలాంటి ఘటన జరిగేందుకు ఆస్కారం లేదని, ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే దోషులకు శిక్ష పడేందుకు చిన్నారి తల్లిదండ్రులకు అండగా నిలుస్తామన్నారు. -
నయీం కేసులో మరో ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తమ కార్యాలయానికి తరలించారు. నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. -
ప్రియురాలితో భార్యకు అడ్డంగా దొరికిపోయాడు
కుషాయిగూడ: తన భర్త మరో మహిళతో కలిసి ఉండగా అతని భార్యకు రెండ్ హ్యాడెండ్‌గా దొరికిపోయిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆమె రాకను గమనించిన వారు అక్కడ నుంచి పారిపోగా తనకు న్యాయం చేయాలని భర్త ప్రియురాలి ఇంటి ఎదుటే ఆందోళనకు పూనుకుంది. వివరాల్లోకి వెలితే.. కీసరకు చెందిన వాసంతి, లక్ష్మణ్ దంపతులకు ఇద్దరు సంతానం. సోనీయాగాంధీనగర్కు చెందిన చేపలు అమ్మే మహిళతో లక్ష్మన్‌కు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కొంత కాలంగా అతడి వైఖరిని గమనిస్తున్న భార్య వాసంతి మంగళవారం సోనీయాగాంధీనగర్లో సదరు మహిళ ఇంట్లో ఇద్దరు కలిసి ఉండగా పట్టుకుంది. భార్య రాకను పసిగట్టిన లక్ష్మన్, ప్రియురాలితో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో వాసంతి తనకు న్యాయం చేయాలని కోరుతూ మహిళ ఇంటి ఎదుట బైఠాయించింది. దీంతోపోలీసులు అక్కడకు చేరుకొని ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొనడంతో.. బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై సామూహిక లైంగిక దాడి
హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడ హనుమాన్‌నగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధిత మహిళ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు..
కుషాయిగూడ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ కిరాతక భర్త. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రమేష్ అనే వ్యక్తి తన భార్య అనితపై గురువారం సాయంత్రం ఇంట్లోనే కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ పై నుంచి పడి చిన్నారి మృతి
కుషాయిగూడ (హైదరాబాద్) : రోడ్డుపై వెళుతున్న యాక్టివా పై నుంచి పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పావని అనే మహిళ కుషాయిగూడ నుంచి నాగారం వైపు బైక్‌పై తన రెండేళ్ల బాబును కూర్చోబెట్టుకుని వెళుతుంది. మార్గమధ్యంలో యాక్టివాపైనున్న చిన్నారి కింద పడిపోయాడు. తీవ్రగాయాలైన బాబు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెవిదిద్దుల కోసం చిన్నారి కిడ్నాప్
కుషాయిగూడ: చిన్నారిని కిడ్నాప్ చేసి.. చెవిదిద్దులు తీసుకొని వదిలేశాడో దుండగుడు. కుషాయిగూడకు చెందిన వీరబాబు కూతురు అక్షిత (8) స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఈ చిన్నారి మంగళవారం సాయంత్రం ఇంటి సమీపంలో సైకిల్‌పై ఆడుకుంటుడగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి మీ డాడీ తీసుకురమ్మన్నాడని మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకొని కాప్రా, భాగ్యనగర్ కాలనీ వరకు తీసుకెళ్లాడు. అక్షితను బెదిరించి చెవికి ఉన్న సుమారు 4 గ్రాముల బంగారు చెవిదిద్దులు తీసుకున్నాడు. పాపను అక్కడే వదిలి వెళ్లాడు. దీంతో అక్షిత పెద్దగా ఏడ్వడంతో స్థానికులు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం తల్లిదండ్రులను పిలిచి అక్షితను అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
లాటరీ కేంద్రంపై పోలీసుల దాడి
హైదరాబాద్ : లాటరీల పేరుతో జనాన్ని మోసం చేస్తున్న కేంద్రంపై శుక్రవారం దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్కీ ఎంటర్ప్రైజెస్ పేరుతో లాటరీలు నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేశారు. కేంద్రాన్ని నడుపుతున్న నిర్వాహకుడితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్వోటీ పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
‘సర్దార్ గబ్బర్ సింగ్’ బ్లాక్ టికెట్లు: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ శుక్రవారం విడుదలకానున్న క్రమంలో బ్లాక్ టికెట్ల విక్రయం జోరందుకుంది. కుషాయిగూడలోని తుళ్లూరి సినిమా టాకీస్‌పై ఎస్ఓటీ పోలీసులు గురువారం మధ్యాహ్నం ఆకస్మిక దాడి నిర్వహించారు.‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.21 వేల నగదు, ఒక బైక్, 650 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ డిటర్జెంట్ తయారీ కేంద్రంపై దాడులు
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ డిటర్జెంట్, తేనె, నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. సర్ఫ్ఎక్సెల్ పేరుతో నకిలీ డిటర్జెంట్ తయారీ చేస్తున్నట్టు హిందూస్థాన్ యూనీలీవర్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాగార్జుననగర్‌లో ఓ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. శ్రీనివాస్, సాగర్ అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష విలువజేసే నకిలీ డిటర్జెంట్, రూ.5 లక్షల విలువ జేసే నకిలీ నెయ్యి, తేనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
కుషాయిగూడలో ఆకతాయిల అరెస్టు
హైదరాబాద్: పీకల దాకా మద్యం తాగి ఇద్దరిపై దాడి చేసిన ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాధిక హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద గురువారం రాత్రి ఆకతాయిలు వీరంగం సృష్టించారు. రవి చౌదరి, రాహుల్ అనే యువకులపై దాడి చేయటంతో వారు గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. ఆ మేరకు కిరణ్, కృష్ణ, మహేష్ అనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
నకిలీ సరుకుల తయారీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నిత్యావసర సరుకులను కల్తీ చేస్తున్న ఓ ముఠాను కుషాయిగూడ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పసుపు, కుంకుమతో పాటు మసాల దినుసులను కల్తీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 క్వింటాళ్ల కల్తీ పసుపు, 2 క్వింటాళ్ల మసాల దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుడు మధును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కుషాయిగూడ (హైదరాబాద్) : నగరంలోని కుషాయిగూడ ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన భూపతి మధుసూదన్‌రావు బైక్‌పై వెళుతుండగా లారీ ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడి ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. -
క్రేన్ ఢీకొని వృద్ధురాలు మృతి
హైదరాబాద్: కుషాయిగూడలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. క్రేన్ ఢీకొనడంతో వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది. సాయినగర్‌కు చెందిన కమలమ్మ(65) రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఏడుగురు కూలీలు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించింది. -
కుషాయిగూడలో దంపతుల ఆత్మహత్య
-
కుషాయిగూడలో దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో మంగళవారం ఉత్తరాఖండ్‌కు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఇంట్లో ఒకే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చర్లపల్లి జైలు వద్ద ఖైదీల స్టాల్
కుషాయిగూడ (హైదరాబాద్) : చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో సబ్బులు, ఫినాయిల్, కాటన్ వస్త్రాలు, కుర్చీలు, చెప్పుల స్టాండ్లను ఉంచి విక్రయిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు జైలు అధికారులు ఉత్పత్తుల విక్రయానికి పూనుకున్నారు. ములాఖత్ కోసం జైలుకు వచ్చే ఖైదీల బంధువులతో పాటు ఆ మార్గంలో వచ్చేవారు స్టాల్‌లోని వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
నేను వెళ్లిపోతున్నాను.. నన్ను క్షమించు
హైదరాబాద్: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడలో నివసించే అవుతు పున్నారెడ్డి (28) బ్యాంకు ఉద్యోగి. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఏఎస్రావు నగర్‌లోని కరూర్ వైశ్యాబ్యాంకులో పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 6న పున్నారెడ్డి మానసిక స్థితి బాగోలేదని బ్యాంకు అధికారులు విధుల నుంచి తొలగించారు. దీంతో మనస్తాపానికి గురైన పున్నారెడ్డి నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నన్ను క్షమించు వెళ్లిపోతున్నానంటూ బార్య సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన భార్య శ్రీకళ్యాణి తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
పార్క్ చేసిన బైక్ దహనం
కుషాయిగూడ (హైదరాబాద్) : ఇంటి ముందు పార్క్ చేసిన ఓ బైక్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ఏపీఐఐసీ కాలనీకి చెందిన కటారి ముఖేష్ అనే యువకుడు వ్యాపారం చేస్తుంటాడు. రోజులానే ఆదివారం రాత్రి బైక్‌ను ఇంటి ఎదుట పార్క్ చేశాడు. రాత్రి 12 గంటల సమయంలో ఇంటి ఎదుట ఉన్న టీఎస్:08,సీజీ:9962 నెంబరు గల అపాచీ బైక్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన చుట్టు ప్రక్కలవారు కేకలు వేయడంతో ఇంట్లో పడుకొని ఉన్న వాహన యజమాని ముఖేష్ బయటకు వచ్చి చూడగా అప్పటికే బైక్ మంటల్లో కాలిపోతుంది. అంతా కలిసి మంటలార్పినా ఫలితం లేకుండా పోయింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా బైక్‌కు నిప్పంటించిన ఘటనలో ముగ్గురు పాల్గొన్నట్లు సమీపంలోని సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. బైక్‌పై వచ్చిన దుండగులు నిప్పంటించి అక్కడ నుంచి వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. -
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
హైదరాబాద్ (కుషాయిగూడ) : నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 15వేలు, 8 సెల్ఫోన్లు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు. -
వెలుగులోకి మరో 'ప్రత్యూష'
హైదరాబాద్: రాజధాని నగరంలో మరో ప్రత్యూష ఉదంతం వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలైన మరో యువతికి అధికారులు విముక్తి కల్పించారు. కుషాయిగూడలో గృహనిర్బంధం ఉన్న స్వప్న అనే యువతిని పోలీసులతో సాయంలో బాలల హక్కుల సంఘం నాయకులు విడిపించారు. స్వప్న తండ్రి బెనర్జీ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. స్వప్న తల్లి శకుంతల ఏడేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో ఆమె తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచే సవతి తల్లి స్వప్నను హించించడం మొదలు పెట్టింది. కొన్నేళ్లుగా ఆమెను గృహనిర్బంధంలో ఉంచింది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను విడిపించి ఆస్పత్రికి తరలించారు. -
వరుడు మరో యువతితో ప్రత్యక్షం
-
పెళ్లి వేళకు వరుడు మరో యువతితో ప్రత్యక్షం!
కుషాయిగూడ(హైదరాబాద్): వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. పెళ్లి నిర్ణయించి పెళ్లి పత్రికలు కూడా అచ్చువేశారు. ఆదివారం ఉదయం 10.33 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి కొడుకు ముఖం చాటేశాడు. అంతటితో ఆగకుండా తన మేన మరదలను వివాహం చేసుకొని పోలీసుల రక్షణ కోరుతూ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. విషయం తెలిసిన పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. కాపామహ్మదీయ కాలనీకి చెందిన ఓ యువతి, మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే కాప్రా శ్రీరాంనగర్‌కు చెందిన మంద మహేశ్ (22) పరస్పరం ఇష్టపడ్డారు. పెద్దల అంగీకారంతో ఏడాది క్రితమే నిశ్చితార్థం అయింది. ఈ క్రమంలో ఆదివారం 10.33 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. ఏం జరిగిందో తెలియదు కానీ, పెళ్లి వేళకు మహేశ్ ముఖం చాటేశాడు. చౌదర్‌పల్లికి చెందిన తన మేనకోడలిని ఆదివారం అదే ముహుర్తానికి యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. సాయంత్రం పోలీసులు రక్షణ కోరుతూ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించింది ఆ జంట. విషయం తెలిసిన పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా, నమ్మించి మోసం చేసినందుకు మంద మహేశ్‌తో పాటుగా అతని అక్క, బావ మాధవి, శ్రీనివాస్, మేనమామలు యాదయ్య, బాలయ్యలపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు. -
మురికి గుంటలో శిశువు మృతదేహం
హైదరాబాద్: హైదరాబాద్ కుషాయిగూడలో రోడ్డు పక్కన ఉన్న మురికి గుంటలో మంగళవారం ఓ శిశువు మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిశువు వయసు 6 నుంచి 7 నెలలు ఉండవచ్చునని అనుకుంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుషాయిగూడలో ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్: కుషాయిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో బుధవారం ఎస్ఓటీ పోలీసులు పేకాటస్థావరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారితోపాటు 5 సెల్ఫోన్లు, 20వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేశారు. -
పరువు పోతుందని...
కుషాయిగూడ: ఆర్థిక సమస్యలు... తెల్లారేసరికి రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు వినియోగదారులకు అందజేయాలి...వారు గొడవ చేస్తే ఉనికికే ప్రమాదం... అప్పుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం.. ఎన్నో ఏళ్లుగా జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే పరువుపోతుందనే భయం.. ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులను ఆత్మహత్యకు ప్రేరేపించిం ది. వారిలో ముగ్గురు ఆస్పత్రికి వెళ్లేలోపే మృతి చెందగా... మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన పొన్నాడ ఆచార్య (54), పార్వతి(48) దంపతులు ఖమ్మం జిల్లాలో స్థిరపడి... 8 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వచ్చారు. కుషాయిగూడలోని ఇందిరానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారికి ప్రసాద్ (27), నాగబాబు (25) ఇద్దరు సంతానం. ప్రసాద్‌కు భార్య లక్ష్మీతులసి, ఏడాదిన్నర వయసు గల రోహిత్ అనే బాబు ఉన్నారు. వృత్తిరీత్యా స్వర్ణకారులైన వారు నాగార్జుననగర్ కాలనీ రోడ్డు నెం.3లో పార్వతీ జ్యువెలరీస్, రోడ్డు నెంబరు.6లో స్వర్ణ జ్యువెలరీస్ పేరుతో రెండు దుకాణాలను ఏర్పాటు చేసి, వ్యాపారం సాగిస్తున్నారు. కొంతకాలం వారి వ్యాపారం సజావుగా సాగింది. ఈ మధ్య కాలంలో కొడుకు పెళ్లి , భార్య అనారోగ్యం బారిన పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. చిట్టీల డబ్బులు తీసుకోవడంతో పాటు తెలిసి న వారందరి దగ్గర అప్పులు చేశారు. ఆభరణాలు తయారు చేయాల్సిందిగా వినియోగదారులు ఇచ్చిన బంగారాన్నీ వాడుకున్నారు. అయినాఆర్థిక పరిస్థితి చక్కబడలేదు. మరోవైపు ఆభరణాల కోసం వినియోగదారుల నుంచి రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలను కస్టమర్లకు అందజేయాల్సి ఉంది. తెల్లవారితే ఇంటి ముందుకు ఎవరొచ్చి గొడవకు దిగుతారో అన్న దిగులుతో శుక్రవారం రాత్రంతా కుటుంబ సభ్యులు కూర్చొని తర్జనభర్జన పడ్డారు. దిక్కు తోచని స్థితిలో ఆచార్య, భార్య పార్వతి, చిన్న కొడుకు నాగబాబులు ఇంట్లో ఉన్న సెనైడ్‌ను గొంతులో పోసుకున్నారు. పెద్ద కొడుకు ప్రసాద్ నోటి వద్ద పెట్టుకున్న సెనైడ్‌ను భార్య లక్ష్మీతులసి తోసేసింది. అంతలోనే వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇంట్లోంచి వస్తున్న అరుపులు.. కేకలు.. విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి... వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆచార్య, పార్వతి, నాగబాబులు మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రసాద్ చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటరమణ ఆస్పత్రికి చేరుకొని మృతుల బంధువులు, కుటు ంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిం చారు. ఆచార్య కుటుంబం చాలా పరు వు గలదని... అందరితోనూ ఎంతో అ ప్యాయంగా ఉండేవారని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ర్ట స్వర్ణకారుల సంఘ అధ్యక్షుడు మహేశ్వరం జగదీశ్‌చారి కోరారు. ముగ్గురి మరణ వార్త తెలిసిన ఆయన ఇక్కడకు వచ్చి వారికి నివాళులర్పించారు. ఆధునిక హంగులతో నెలకొల్పుతున్న షాపింగ్‌మాల్స్ వల్ల ఉపాధి మార్గాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయని... ఈ క్రమంలోనే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి స్వర్ణకారుల ఆత్మహత్యలను నిరోధించి, ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. -
నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదు
హైదరాబాద్: చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరచుగా ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... రాములు అనే ఖైదీ చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని చూసేందుకు అతడి భార్య తరచుగా జైలుకు వచ్చేది. ఆ క్రమంలో జైలు వార్డర్ వెంకన్న ఆమె నుంచి సెల్ ఫోన్ నెంబరు తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచుగా ఖైదీ రాములు భార్యకు ఫోన్ చేసి వేధించేవాడు. ఆ విషయాన్ని భర్త రాములకు తెలిపింది. దీంతో రాములు జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించ లేదు. దీంతో వార్డర్ వెంకన్న... రాముల భార్యపై వేధింపులు మరింత పెరిగాయి. ఆ విషయాన్ని రాములకు వెల్లడించింది. దీంతో రాములు కూషాయిగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుషాయిగూడలో యువతి హత్య
హైదరాబాద్: కుషాయిగూడలో ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. కొందరు దుండగులు 22 ఏళ్ల యువతిని హత్య చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. హత్యపై దర్యాప్తు మొదలుపెట్టారు.