రాజధాని నగరంలో మరో ప్రత్యూష ఉదంతం వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలైన మరో యువతికి అధికారులు విముక్తి కల్పించారు.
హైదరాబాద్: రాజధాని నగరంలో మరో ప్రత్యూష ఉదంతం వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలైన మరో యువతికి అధికారులు విముక్తి కల్పించారు. కుషాయిగూడలో గృహనిర్బంధం ఉన్న స్వప్న అనే యువతిని పోలీసులతో సాయంలో బాలల హక్కుల సంఘం నాయకులు విడిపించారు.
స్వప్న తండ్రి బెనర్జీ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. స్వప్న తల్లి శకుంతల ఏడేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో ఆమె తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచే సవతి తల్లి స్వప్నను హించించడం మొదలు పెట్టింది. కొన్నేళ్లుగా ఆమెను గృహనిర్బంధంలో ఉంచింది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను విడిపించి ఆస్పత్రికి తరలించారు.