pratyusha
-
ఐపీఎస్‌కు ఎంపికైన ఏలూరు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భాను శ్రీలక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రత్యూష గత ఏప్రిల్‌లో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 198 ర్యాంకు సాధించగా.. తాజాగా ఐపీఎస్ శిక్షణకు రావాలంటూ ఉత్తర్వులు అందాయి. గతంలో గ్రూప్–1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐపీఎస్‌కు ఎంపికవడంతో ఆగస్టు 26 నుంచి ముస్సోరీలో జరగనున్న శిక్షణకు హాజరుకావాల్సి ఉంది. సిసలికి చెందిన గణేశ్న వెంకట రామాంజనేయులు, ఉషా దంపతుల కుమార్తె ప్రత్యూష మొదట నుంచి చదువుపై ఆసక్తితో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కష్టపడి చదివింది. ఏడాది ఆగస్టులో విడుదలైన గ్రూప్–1 పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. అనంతరం ఏలూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ట్రైనింగ్‌లో ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. -
బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్ నంబర్ ఇచ్చింది. షాక్‌కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్ చానల్ విలేకరి సాయికుమార్ సహకరించారు. సీక్రెట్ కెమెరాలతో క్లినిక్‌లోకి..: ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్‌కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్‌తో శివ, శ్రీనివాస్ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్ కెమెరాలను ధరించి క్లినిక్ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్‌కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్ మెసేజ్‌లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్టో కారులో బాబును తెచ్చి.. వారు క్లినిక్‌లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్ సరి్టఫికెట్ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్ అని గ్రహించారు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్‌కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.పోలీసులకు ఫోన్ చేయవద్దని సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈలోగా డయల్ 100కు ఫోన్ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిర్ సెంటర్ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్ పరికరాలున్నాయి. డస్ట్ బిన్లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ విచారణలో తేలింది. (ఆడెపు శ్రీనాథ్) -
మార్ఫింగ్ ఫొటోలతో అత్యాచార బెదిరింపులు: నటి
బెంగాలీ బుల్లితెర నటి ప్రత్యూష పాల్‌కు సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. తనను అత్యాచారం చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. గత కొంతకాలంగా ఈ వేధింపులు తీవ్రతరం కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోల్‌కతా సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురించి ప్రత్యూష మాట్లాడుతూ.. "గతేడాది జూలై నుంచి ఈ వేధింపులు మొదలయ్యాయి. ఒక అనామక అకౌంట్ నుంచి నాకు అదే పనిగా అసభ్య సందేశాలు వచ్చాయి. అయితే ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదని మొదట్లో లైట్ తీసుకున్నా. కానీ రానురానూ ఆ ఖాతా నుంచి మితిమీరిన మెసేజ్‌లు వచ్చాయి. నాపై అత్యాచారం చేస్తానంటూ ఏకంగా నా మార్ఫింగ్ ఫొటోలు పంపాడు. అతడిని 30 సార్లు బ్లాక్ చేశాను. కానీ ఎప్పటిలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త అకౌంట్ తెరిచి మళ్లీ ఇలా నీచమైన బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో ఈసారి పోలీసులను ఆశ్రయించాను" అని నటి చెప్పుకొచ్చింది. -
28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం
సాక్షి, రంగారెడ్డి (కేశంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈ నెల 28న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్దు మాత దేవాలయంలో జరగనుంది. ఉడుముల జైన్ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష వివాహం జరగనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పినతల్లి చేతుల్లో వేధింపులకు గురై వార్తల్లో నిలిచిన ప్రత్యూషను కేసీఆర్ గతంలో దత్తత తీసుకున్నారు. -
ప్రత్యూష అంత పిరికిది కాదు: కిషన్‌రావు
సాక్షి, హైదరాబాద్ : తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అల్వాల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత ప్రత్యుష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన అల్లుడు శశికాంత్‌రావే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం కూకట్‌పల్లికి చెందిన కిషన్‌రావు కుమార్తె ప్రత్యుషకు అల్వాల్ న్యూ రెడ్డి ఎన్‌క్లేవ్‌కు చెందిన శశికాంత్‌రావు అలియాస్ రాముతో 2013లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.20 లక్షల నగదు, కిలో బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. రెండేళ్ల క్రితం శశికాంత్ అదనపు కట్నం కోసం వేధించడంతో కిషన్‌రావు స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు ముట్టచెప్పాడు. అయితే మళ్లీ కొద్దిరోజులుగా భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో ప్రత్యుష బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తన కుమార్తెది హత్యేనని, ఆత్మహత్య కాదని చెబుతున్నారు. ఆరేళ్ల నుంచి తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శశికాంత్‌రావు గతంలో బినామీలు పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, ఎక్స్ సర్వీస్‌మెన్ కృష్ణారెడ్డి భూమిని లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడని కిషన్‌రావు తెలిపాడు. ప్రత్యుష అనుమానాస్పద మృతితో పాటు, శశికాంత్‌రావు కబ్జాలపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
శభాష్ ప్రత్యూష
గాజువాకకు చెందిన మహంతి చంద్ర ప్రత్యూష క్రియేటివ్ రైటింగ్, టాలెంట్ టెస్ట్ తదితర పోటీలలో ఇప్పటి వరకు స్కూల్, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పదేళ్లుగా 138 బహుమతులు సాధించింది. ఇందులో ఇండియా బుక్, ఆసియా బుక్, లిమ్కా బుక్ తదితర స్థాయి బహుమతులు, అవార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా తన విజయాలకు చెందినా ఆల్బమ్‌తో శనివారం దర్జీపేటలో ప్రత్యూష తన తండ్రి చంద్రశేఖర్‌తో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన బహుమతులను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి మరింతగా రాణించాలని అభినందించారు. -
ఆడపిల్లల్ని కాపాడుకోండి: నటి ప్రత్యూష తల్లి
సమ్మర్ వెకేషన్ పూర్తయింది... పిల్లలు కొంచెం పెద్దయ్యారు.కొంచెమే పెద్దయ్యి ఉంటారు... కానీ చాలా పెద్దయ్యామని అనుకుంటుంటారు.కొత్త పుస్తకాలు... కొత్త కాలేజీలు... కొత్త స్నేహాలు... కొత్త దుస్తులు.. స్కూలు వదిలిన మొగ్గలు కాలేజ్‌లో విచ్చుకునే టైమ్ ఇది.‘కొత్త’ ప్రపంచం వాళ్లను ఎటు నడిపిస్తుందో? అమ్మాయిల అమ్మానాన్నలకు రోజూ ఆందోళనలే. ఆ ప్రపంచంలో ప్రమాదాలు ఎలా ఉంటాయో పిల్లలకు చెప్తే.. జాగ్రత్త పడటం ఎలాగో వాళ్లకే అర్థమవుతుంది. ప్రమాదాన్ని అడ్డుకోవడమూ తెలిసి వస్తుంది. సినీ నటి ప్రత్యూష తల్లి సరోజినీదేవి అదే మాట చెప్తోంది.‘తెలుసుకోండి... ఆడపిల్లలను కాపాడుకోండి’ జాబిల్లి కాంతులను నట్టింట్లో పూయించిన ఓ చందమామ, వెండి తెరమీద నవ్వుల్ని పండించింది. టెలివిజన్ కాంటెస్ట్‌లో లవ్లీ స్మైల్ అవార్డు అందుకున్న ఈ స్మైలీ... తల్లికి మాత్రం అందని చందమామే అయింది. ఆ నవ్వుల కిరీటాన్ని మరో ఏడాది మరో అమ్మాయి అందుకునే ఉంటుంది. వెండితెర మీద మరో తార నవ్వుల్ని రువ్వే ఉంటుంది. ఇవేవీ బిడ్డను పోగొట్టుకుని కడుపుకోత అనుభవిస్తున్న ఆ కన్నతల్లి శోకాన్ని తీర్చలేవు. సరోజినీదేవికి కూతురు దూరమై పదహారేళ్లు దాటింది. ‘న్యాయం కోసం పోరాటం చేస్తున్నా, డబ్బు, అధికారం లేని సామాన్య మహిళను, కేవలం తల్లిని. నా పోరాటంలో తీర్పు రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో’ అంటోందామె నిర్వేదంగా. ‘‘మాది భువనగిరి. అత్యంత సామాన్యమైన కుటుంబం. లవ్‌మ్యారేజ్ కావడంతో మాకు అత్తింటి నుంచి ఆస్తులు, పుట్టింటి నుంచి కానుకలు ఏమీ రాలేదు. మా వారు (లక్ష్మీ నారాయణ) సిండికేట్ బ్యాంకు ఉద్యోగి, నేను స్కూల్ టీచర్ని. ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి చాలు... అనుకున్నాం. మేమిద్దరం, మాకిద్దరు. పిల్లలే లోకం అన్నట్లు జీవించాం. పింకీ (ప్రత్యూష) సిక్త్స్ క్లాసుకొచ్చేటప్పటికి మా వారికి హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయింది. తార్నాకలో ఉంటూ నేను బొమ్మలరామారంలో స్కూలుకి వెళ్లేదాన్ని. మా చిన్న ప్రపంచంలో తొలి ఉపద్రవం మా వారికి హార్ట్ఎటాక్ రూపంలో వచ్చింది. లైఫ్ క్రాస్‌రోడ్స్‌లో నిలబెట్టింది నన్ను. నా ఒక్క జీతంతో పిల్లల్ని పెంచాలి. ఇప్పటిలాగ అప్పట్లో టీచర్ల జీతాలు నలభై– యాభై వేలు లేవు. ఆయన పోయేనాటికి నా జీతం ఆరు వేల డెబ్భయ్ ఐదురూపాయలు. ఇన్సూరెన్స్ డబ్బు ఆసరాతో నెట్టుకొచ్చాను. నవ్వుల కిరీటం ఉదయం ఏడింటికి ఇంట్లో బయలుదేరితే తిరిగి వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిదయ్యేది. ఆ కండిషన్లో ప్రత్యూషని ఇంటర్‌కి ఎస్ఆర్ నగర్లో హాస్టల్లో చేర్చాను. ఆ నిర్ణయమే నా బిడ్డ జీవితాన్ని కాల రాస్తుందని అప్పుడు ఏ మాత్రం ఊహించలేదు. ప్రత్యూషకి క్లాస్మేట్ సిద్ధార్థ. ఇంటర్ పూర్తయ్యేలోపు చాలా మార్పులు వచ్చేశాయి. జెమినీ కాంటెస్ట్‌కి నాకు తెలియకుండానే ఫొటో పంపించింది ప్రత్యూష. పంపించాక చెప్పింది. ఇక చేసేదేముంటుంది? ఆ తర్వాత వారానికి ‘మిస్ లవ్లీ స్మైల్’గా ఎంపికైందని ఫోన్ చేసి చెప్పింది. సిద్ధార్థతో స్నేహం బలపడింది. మరో రోజు ప్రత్యూషకి జెమినీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్, రాయుడు సినిమాలో పాత్ర కోసం. మాకు సినిమా ఫీల్డుతో అస్సలు పరిచయమే లేదు. ఆడపిల్లను పంపించడానికి భయమేసింది. ప్రత్యూష చూపించిన ఆసక్తిని తుంచేయలేక తీసుకెళ్లాను. ఎయిర్ హోస్టెస్ కల ప్రత్యూషకి ఎయిర్ హోస్టెస్ కావాలని ఉండేది. అందుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు తప్పనిసరి. అందుకే ఇంటర్ తర్వాత సినిమాల్లో గ్యాప్ తీసుకుని హోటల్ మేనేజ్మెంట్లో చేరింది. కాలేజ్ వెతికిపెట్టడంలో సిద్ధార్థ చాలా సాయం చేశాడు. తీరా పరీక్షల టైమ్‌లో భారతీరాజా నుంచి సినిమా ఆఫర్, ముందు అనుకున్న హీరోయిన్ చేయడం లేదు, వెంటనే వచ్చి షూటింగ్ చేయాలన్నారు. పరీక్షలు సెప్టెంబర్‌లో రాయవచ్చని ప్రత్యూషని చెన్నై తీసుకెళ్లిపోయాను. ఆ తరవాత తమిళ్లో చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళంలో 22 సినిమాలు చేసింది. తొలి సినిమాకి 75 వేలు రాయుడు సినిమాకి రెమ్యూనరేషన్ అందుకున్నప్పుడు పింకీ ఆనందాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఇంటికి ఫర్నిచర్ కొన్నది. నన్ను ఒక్క రూపాయి కూడా తీయవద్దంది. సోఫా సెట్, టీవీ, టేప్‌రికార్డర్ తీసుకుంది. ‘నాన్న ఉండి ఉంటే ఇవన్నీ ఎప్పుడో కొనేవాడు. నాన్న లేకపోవడంతోనే కదా మనకు ఇప్పటి వరకు ఇవేవీ లేవు. నాన్న ఉంటే మన లైఫ్ ఎలా ఉండేదో అలా మార్చేస్తా మమ్మీ’ అన్నది. అప్పటి వరకు సముద్రంలో నీటిబొట్టులా ఉన్న మా కుటుంబానికి ఒక గుర్తింపు వచ్చింది పింకీతోనే. ఆర్థికంగా నిలదొక్కుకున్నదీ పింకీ వల్లనే. చివరికి తన మరణంతో అప్పటి వరకు తెలియని ప్రతి ఒక్కరి దృష్టిలోనూ పడ్డాం. ఇదంతా నాలుగేళ్లలోనే. అంతా కలలాగ జరిగిపోయింది. కల కాదని చెప్పడానికి పింకీ కొన్న వస్తువులు మా కళ్ల ముందున్నాయి. అక్క జ్ఞాపకాలమ్మా అవి, వీటిని మార్చవద్దు అన్నాడు మా అబ్బాయి. తన జ్ఞాపకాలను అలా పదిలంగా చూసుకుంటున్నాం. ఆ రోజు ఏం జరిగిందో! అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. అది కన్నడ సినిమాలో తొలి అవకాశం. ఫేషియల్, వ్యాక్సింగ్ చేయించుకోవడానికి కజిన్ శిరితో కలసి బ్యూటీపార్లర్‌కెళ్లింది. తనకిష్టమైన కెనెటిక్ హోండా మీదనే వెళ్లారిద్దరూ. పింకీ పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చాట్ట. ఫేషియల్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశాట్ట. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు రైడ్‌కెళ్లి వస్తానని శిరిని వెయిట్ చేయమని చెప్పింది. సిద్ధార్థ తన కారులో తీసుకెళ్లాడు. కొంత సేపటికి నాకు ఫోన్... ‘జయం సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జయం ఆఫీస్‌కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే చివరి మాట. కానీ వాళ్లు మాత్రం జయం ఆఫీస్‌కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్‌లో ఉన్న శిరి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తానన్నదట. ఆ తర్వాత ఫోన్ తియ్యలేదట. అప్పటి వరకు ప్రతి వివరమూ సరిగ్గా సరిపోలుతూనే ఉంది. ఆ తర్వాత అంతా మిస్టరీనే. పిరికి అమ్మాయి కాదు! రాత్రి ఏడు గంటలకు ఎవరో ఫోన్ చేసి ‘మీ అమ్మాయిని కేర్ హాస్పిటల్లో స్ట్రెచర్ మీద చూశాం’ అని చెప్పారు. నేను నమ్మనేలేదామాటని. మరో గంటలోపు కేర్ హాస్పిటల్ వాళ్లే ఫోన్ చేశారు ‘సూసైడ్ అటెంప్ట్ చేసింది’ అని. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదు. నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. మా అబ్బాయితోపాటు హాస్పిటల్‌కి పరుగెత్తాను. అప్పటికే ప్రత్యూష ఐసీయూలో ఉంది. మమ్మల్ని వెళ్లనివ్వలేదు. సిద్ధార్థ బంధువులు మాత్రం లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ల ఫ్రెండ్స్ కూడా ప్రత్యూష ఎలా ఉందో చెప్పలేదు. రాత్రి పదకొండు గంటలకు మమ్మల్ని లోపలికి పంపించారు, కానీ బెడ్‌కి ఐదడుగుల దూరంలో ఉంచి ఒక్క నిమిషానికే బయటకు పంపించేశారు. తెల్లవారి ఉదయం తొమ్మిది దాటాక ఒక డాక్టర్ వచ్చి ‘ప్రత్యూష మోషన్కెళ్లింది, డ్రస్ తెస్తే మారుస్తాం’ అన్నారు. ఎక్కడ లేని సంతోషంతో ఇంటికి వెళ్లి గంటలోపే డ్రస్‌తో వచ్చాం. డ్రస్ ఇచ్చిన తర్వాత పదిహేను నిమిషాలకు ‘చనిపోయింది’ అని చెప్పారు. మేము ఇచ్చిన కుర్తా మాత్రమే వేశారు, పైజామా వేయలేదు. విడిచిన దుస్తులను అడిగితే ‘రాత్రి మోషన్కెళ్లినప్పుడు తీసి డస్ట్‌బిన్‌లో వేశారు, ఉదయాన్నే అన్నీ కాల్చేస్తారు. అవి ఉండవు’ అన్నారు. మెడికో లీగల్ కేసులో ఆధారాలను అలా ఎలా కాల్చేస్తారని అడగడం కూడా నాకు తెలియదప్పుడు. పోలీసులు వచ్చారు, హిమాయత్ నగర్లో దొరికిందని ఒక పాయిజన్ డబ్బా చూపించారు. ‘ఇద్దరూ పాయిజన్ తీసుకున్నారు, మీ అమ్మాయి వీక్‌గా ఉండడంతో చనిపోయింది’ అన్నారు. కేర్ నుంచి నిమ్స్‌కి పోస్ట్‌మార్టమ్ నిమ్స్‌లో. సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్‌మార్టమ్ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోశారని నాకనిపించింది. హాస్పిటల్ వాళ్లు మాత్రం ‘ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు. అది పొరపాటే! ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్‌మార్టమ్ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేశాను. అప్పటి నుంచి మొదలైన నా న్యాయపోరాటం ఇంకా సాగుతూనే ఉంది. నీకే న్యాయం కావాలన్నారు! పుణ్యవతి, సంధ్య ఇంకా చాలామంది నాకు అండగా నిలిచారు. సీఎం చంద్రబాబు గారికి మెమోరాండం ఇచ్చాను. వైఎస్ఆర్ (అప్పుడు ప్రతిపక్షనాయకులు), కేసీఆర్, గీతారెడ్డి... ఇలా ఎక్కిన గడప ఎక్కకుండా ఎందరికి మొరపెట్టుకున్నానో ఆ భగవంతుడికే తెలుసు. సినీనటులు మురళీమోహన్ గారి నుంచి ఫోన్ వచ్చింది. చంద్రబాబు ఎదురుగా కూర్చోబెట్టారు నన్ను. రెండు గంటల సేపు ఆయన నన్ను ఒకే మాట ’నీకే న్యాయం కావాలి’ అని పదే పదే అడిగారు. సహాయం ఏదైనా కావాలా అన్నారు. నాకు ఉద్యోగం ఉంది, నా కొడుకును చదివించుకోవడానికి అది చాలు. నా బిడ్డ ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారో నాకు తెలియాలి... అనే మాట మీదనే ఉన్నాను. ఇదే మాటను అసెంబ్లీలో వైఎస్ఆర్ గారు, కేసీఆర్‌గారు కూడా లేవనెత్తారు. అప్పటి నుంచి నాకు ఫోన్లో బెదిరింపులు మొదలయ్యాయి. కేసు విచారించిన తర్వాత సిద్ధార్థకు ఏడేళ్లు శిక్ష పడింది. అది చాలదు లైఫ్ పడాలని నేను హైకోర్టుకెళ్లాను. అక్కడ విచారణ అనంతరం ఆ శిక్ష పెరగకపోగా రెండున్నరేళ్లకు తగ్గిపోయింది. మళ్లీ సుప్రీం కోర్టులో కేసు వేశాను. అదింకా టేబుల్ మీదకు రాలేదు. ప్రత్యూష ఓ నమ్మకం! కేసీఆర్‌గారు... ఇలాగే కుమిలిపోవద్దు. మోసపోయిన అమ్మాయిలు, ఆసరా కోసం ఎదురు చూసే వాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లకు ఆలంబనగా నిలవమని చెప్పారు. చారిటీ పెట్టడానికి టోకెన్ అమౌంట్‌గా ఐదువందల నోటు ఇచ్చారు. ఆ డబ్బుతో ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ చేయించాను. భువనగిరిలో పెంకుటిల్లు అద్దెకు తీసుకుని మూడు మెషీన్లతో పదిహేను మంది అమ్మాయిలకు టైలరింగ్ నేర్పించాను. స్పోకెన్ ఇంగ్లిష్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, కంప్యూటర్ ట్రైనింగ్, హ్యాండ్వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా చేర్చాను. ఈ పదహారేళ్లలో 16 వేల మంది పని నేర్చుకున్నారు. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలసి ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేస్తున్నాను. హార్ట్ ప్రాబ్లమ్‌తో ప్రత్యూష పోయిన రెండేళ్లకే ఉద్యోగం మానేశాను. ఇప్పుడు పూర్తి టైమ్ ట్రస్ట్ పనులే. ప్రత్యూష పేరు మీద పెట్టిన ట్రస్ట్ జనంలో నమ్మకాన్ని కోల్పోకూడదనేదే నా ముందున్న లక్ష్యం. ఇరవై ఏళ్లకే నూరేళ్లు జ్ఞాపకాలను మిగిల్చింది పింకీ. ఏ తల్లికీ నాలాంటి కడుపుకోత రాకూడదు’’. రెండు సందేశాలు! ప్రతి ఆడపిల్లకూ నేను చెప్పేది రెండే రెండు మాటలు. ఒకటి ... ఎవరి మీదా ఆధారపడకూడదు. ఒక రూపాయి కావాలంటే తండ్రి, అన్న, భర్తని అడిగే పరిస్థితిలో జీవించకూడదు. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. అప్పుడే కష్టం వస్తే తట్టుకునే ధైర్యం వస్తుంది. ఇక రెండోది... మీ సెక్యూరిటీ బాధ్యత మీదే. ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం అనే స్పృహ ఉండాలి. కరాటే వంటి సెల్ఫ్ డిఫెన్స్ మెథడ్స్ తెలిసి ఉండాలి. ఎవరు ఎంత ప్రేమగా మాట్లాడినా సరే... వాళ్ల వెంట కళ్లు మూసుకుని వెళ్లకూడదు. చేతులారా ప్రమాదాలలో తల దూర్చవద్దు. రక్షణగా ఉండాలంటే... ఆడపిల్లలు నాలుగ్గోడల మధ్య ఉండిపోవాలని కాదు, ధైర్యంగా అన్ని రంగాల్లోకి వెళ్లాలి. ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ మనకు రక్షణ ఉందా అనే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతాను. నాకు డబ్బు వస్తే ప్రత్యూషలాగ నష్టపోయి ప్రాణాలతో బయటపడిన వాళ్ల కోసం ఒక రెస్క్యూ హోమ్ పెట్టాలని ఉంది. – పాదరాజు సరోజినీ దేవి, నటి ప్రత్యూష తల్లి – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
నా బిడ్డ హత్య కేసును బాబు ప్రోద్బలంతోనే నీరుగార్చారు
-
నర్సు కోర్సులో ప్రత్యూష
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష నర్సు కోర్సులో చేరింది. గతేడాది ఆగస్ట్‌లో సవతి తల్లి చిత్రహింసలకు గురై ఆసుపత్రి పాలైన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆమెను పరామర్శించి, అక్కున చేర్చుకున్నారు. ప్రత్యూషకు ప్రభుత్వం తరఫున విద్య, వసతి కల్పిస్తామని హామీనిచ్చారు. దాని ప్రకారమే వ్యక్తిగతంగా కొంత ఆర్థికసాయం చేయడంతో పాటు ప్రత్యూష కోరుకున్న విధంగా చదివిస్తున్నారు. -
జాతీయ చాంపియన్ పద్మిని రౌత్
ప్రత్యూషకు 12వ స్థానం న్యూఢిల్లీ: అంతర్జాతీయ మాస్టర్ పద్మిని రౌత్ వరుసగా మూడోసారి భారత మహిళల ప్రీమియర్ జాతీయ చెస్ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన టోర్నీ చివరి, 11వ రౌండ్లో ఆమె... ఇషా కరవాడే(7)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. దీంతో పద్మిని (పీఎస్‌పీబీ) 8 పారుుం ట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఎరుురిండియా క్రీడాకారిణి ఎస్.విజయలక్ష్మి (7.5) రెండో స్థానంలో నిలవగా, ఇషా కరవాడే కాంస్య పతకం గెలుచుకుంది. ఆఖరి రౌండ్లో విజయలక్ష్మి... వైశాలి (తమిళనాడు, 3.5)పై గెలిచింది. తెలుగమ్మారుు బొడ్డ ప్రత్యూష 12వ స్థానంలో నిలి చింది. తమిళనాడుకు చెందిన కన్నమ్మ (5)తో జరిగిన పోరులో ప్రత్యూష (3.5) పరాజయం చవిచూసింది. జాతీయ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా పద్మిని భారత జట్టులోకి ఎంపికై ం ది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్న ఈ జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తలపడనుంది. -
ప్రత్యూషకు రెండో గెలుపు
న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష రెండో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన ప్రత్యూష 82 ఎత్తుల్లో నిషా మొహతాపై గెలిచింది. ఎనిమిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 2.5 పారుుంట్లతో చివరిదైన 12వ స్థానంలో కొనసాగుతోంది. పద్మిని రౌత్ 6.5 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉండగా... 5.5 పారుుంట్లతో సౌమ్య స్వామినాథన్, ఇషా కరవాడే సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఈ టోర్నీలో మరో మూడు రౌండ్లు మిగిలి ఉన్నారుు. -
మళ్లీ ఓడిన ప్రత్యూష
న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు బొడ్డ ప్రత్యూష నాలుగో పరాజయాన్ని చవిచూసింది. కిరణ్ మనీషా మొహంతితో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ప్రత్యూష 48 ఎత్తుల్లో ఓడిపోరుుంది. ఐదో రౌండ్ తర్వాత ప్రత్యూష అర పారుుంట్తో 12వ స్థానంలో కొనసాగుతోంది. పద్మిని రౌత్ నాలుగు పారుుంట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. 3.5 పారుుంట్లతో విజయలక్ష్మి సుబ్బరామన్, సౌమ్య స్వామినాథన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
సూర్యలంక బీచ్‌లో విషాదం
బాపట్ల: విహారయాత్రలో విషాదం అలముకున్న సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో జరిగింది. విహారయాత్ర కోసం వచ్చిన తొమ్మిదిమంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు మరణించారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో బయోటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న పగడాల కావ్య, గుంటి ప్రత్యూష, గోనాల సుష్మప్రియ, కొలిమర్ల సత్యసాయిప్రసాద్, ఇందుజ, జరీనాతోపాటు కె.ఎల్. యూనివర్సిటీలో బీటెక్ (ప్రథమ) చదువుతున్న వారి ఇంటర్ క్లాస్మేట్స్ శివాని, వివేక్, ఉదయ్ మొత్తం తొమ్మిదిమంది మంగళవారం ఉదయం విజ్ఞాన్ కళాశాల నుంచి ఆటోలో సూర్యలంక తీరానికి చేరుకున్నారు. వీరిలో కావ్య, ప్రత్యూష, సుష్మప్రియ, సత్యసాయిప్రసాద్ స్నానాలు చేసేందుకు ఉదయం 11గంటల సమయంలో సముద్రంలోకి దిగారు. అప్పటికే అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో సుష్మప్రియ నీటిలో లోతుకు వెళ్లింది. ఆమెను కాపాడేందుకు ప్రత్యూష(18), కావ్య, సత్యసాయిప్రసాద్(19)లు కూడా లోపలికి దిగారు. వీరంతా అలల ఉధృతికి కొట్టుకుపోవడాన్ని గమనించిన సందర్శకులు కేకలు వేయడంతో తీరంలో పహారా కాస్తున్న మెరైన్ హోంగార్డు నాయుడు శ్రీనివాసరావు మత్స్యకారుల సహాయంతో నీటిలోకి దిగి కావ్య, ప్రత్యూష, సుష్మప్రియలను ఒడ్డుకు చేర్చారు. ప్రత్యూష నీరు ఎక్కువగా తాగడంతో మృత్యువాత పడింది. సత్యసాయిప్రసాద్ గల్లంతైన రెండు గంటల తర్వాత మృతదేహమై ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. సుష్మప్రియ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, కావ్య ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ రంగంలో ఏం జరుగుతోంది?
సగటు మనిషికి విద్యుత్ గురించిన సూక్షా్మంశాలు తెలిసేది తక్కువే. స్విచ్ ఆన్ చేయడం, కరెంట్ వాడుకోవడం, అవసరం తీరాక స్విచ్ ఆఫ్ చేయడం. ఏ నెల్లో అయినా కరెంటు బిల్లు వంద రూపాయలు ఎక్కువ వస్తే గుండెలు బాదుకోవటం. మానవ జీవితానికి, ఆర్థిక వ్యవస్థలోని సకల రంగాలకు జీవధాతువుగా నిలుస్తున్న విద్యుత్ గురించి సగటు మనిషి అవగాహన అత్యంత పరిమితమే. కానీ ఒక రాష్ట్రం రెండుగా ముక్కలవడానికి దారి తీసిన ప్రధాన కారణాల్లో విద్యుత్ కూడా ఒకటి అని తెలిసినప్పుడు దాని చుట్టూ అల్లుకున్న విపరిణామాలను అర్థం చేసుకోకుండా పక్కన పెట్టడం నిపుణులకు సాధ్యం కాని పని. అందుకే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కె. రఘు గత రెండు దశాబ్దాలుగా విద్యుత్‌కి సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. కరెంట్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగానికి సంబంధించిన కీలక అంశాలను, వాటిలోని లాభనష్టాలను ప్రజా వేదికలపై విస్తృతంగా వివరించడంతోపాటు పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ క్రమంలో ఈయన ఇటీవల తీసుకొచ్చిన పుస్తకమే ‘తెలంగాణ విద్యుత్‌రంగంలో ఏం జరుగు తున్నది?’ ఇది తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో వెలు వడిన తొలి పుస్తకం కావడం విశేషం. పుస్తక రచయిత కె. రఘు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) అధికార ప్రతినిధి. తెలం గాణ ఉద్యమ సమయంలో విద్యుత్‌కు సంబంధించిన ఏ సందేహం వచ్చినా నివృ త్తికోసం ఈయన వైపే అందరూ చూసేవారంటే ఆశ్చర్యపడవలసింది లేదు. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో విద్యుత్ రంగంలో జరిగిన పరిణామాలు, వాటి మంచి చెడులపై అత్యంత సమతూ కంతో ఆయన రాసిన ఈ పుస్తకం ఆలోచనలు రేకెత్తిస్తోంది. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి విద్యుత్ రంగంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఈ పుస్తకం కూలంకషంగా వివరించింది. రాష్ట్ర విభజన సమ యంలో ఉన్న కరెంటు కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆగ మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలుపై తీసుకున్న తక్షణ నిర్ణయాలు దీర్ఘకాలంలో తెలంగాణ మెడకు ఎలా చుట్టుకోబోతున్నాయో రచ యిత సోదాహరణంగా తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌తో ఆకస్మి కంగా చేసుకున్న విద్యుత్ ఒప్పందం కొన్నేళ్లలోనే రాష్ట్రం మొత్తానికి గుదిబండగా మారనుందని గణాంక సహి తంగా వివరించారు. ప్రపంచమంతా విద్యుత్ ప్రాజె క్టులు ప్రస్తుతం అధునాతనమైన సూపర్ క్రిటికల్ (500 నుంచి 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం) టెక్నాలజీతో నడుస్తుండగా, ప్రాజెక్టు నిర్మాణ కాలాన్ని ఏడాదిపాటు తగ్గించవచ్చనే ఏకైక కారణంతో ప్రభుత్వం సబ్ క్రిటికల్ (270 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం) టెక్నాలజీతో భద్రాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టును తలపెట్టడం అసం బద్ధ చర్య అని, దీంతో ఉత్పత్తి ఖర్చు పెద్దఎత్తున పెరగ డమే కాకుండా ఆ భారం మొత్తం వినియోగదారులపైనే మోపుతారని రఘు పేర్కొన్నారు. స్వల్ప కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విష యంలో కూడా ఏపీ కంటే అధిక ధరకు తెలంగాణ కోట్ చేయడం ఎవరి ప్రయోజ నాల కోసమని రచయిత నిలదీశారు. రాష్ట్ర విద్యుత్ తీరుతెన్నులపై అత్యంత విలువైన ఈ పుస్తకంలో రచయిత మొత్తం 26 వ్యాసాలు పొందుపర్చారు. వీటిలో కొట్టొచ్చేటట్టు కనిపించే అంశం ఏమిటంటే, ప్రభుత్వాన్ని కానీ, అధికారులను కానీ పల్లెత్తుమాట అనకుండా విషయానికి మాత్రమే కట్టు బడుతూ రచయిత పాటించిన అసాధారణ సమ తుల్యమే. అత్యంత సంక్లిష్ట అంశంపై పాటించిన ఇంతటి సౌమ్య వర్తనను కూడా ప్రభుత్వాధికారులు జీర్ణించుకోలేకపోవడం విచారకరం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ఏమిటి అంటూ నేరుగా విమర్శించారు కూడా. ప్రజాభి ప్రాయాన్ని ఖాతరు చేయకుండా స్వంత నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే వచ్చే ఫలితాలు ఎవరికి నష్టకరంగా మారతాయో రచయిత సుస్పష్టం చేసిన నేపథ్యంలో కావలసింది పాలనతో సహా అన్ని రంగాల్లో పారదర్శకతే. ఈలోగా విద్యుత్‌రంగ కరదీపికగా రూపొందిన ఈ చిన్ని, విలువైన పుస్తకాన్ని అక్కున చేర్చుకోవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరిదీ. -ప్రత్యూష -
హరికృష్ణ గేమ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. హు ఇఫాన్ (చైనా)తో బుధవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రత్యూష గెలుపు: తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో బొడ్డ ప్రత్యూష మూడో విజయాన్ని సాధించింది. అనస్తాసియా (ఇండోనేసియా)తో బుధవారం జరిగిన ఏడో రౌండ్లో ప్రత్యూష 46 ఎత్తుల్లో గెలిచింది. ప్రత్యూష మూడు పాయింట్లతో 20వ ర్యాంక్‌లో ఉంది. -
లలిత్, ప్రత్యూష ఓటమి
తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఆరో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎం.ఆర్.లలిత్ బాబు, బొడ్డ ప్రత్యూషలకు పరాజయాలు ఎదురయ్యాయి. ఓపెన్ విభాగంలో అలీకులోవ్ ఎల్బెక్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో లలిత్ బాబు... మహిళల విభాగంలో హోంగ్ థి బావో ట్రామ్ (వియత్నాం) చేతిలో ప్రత్యూష ఓడిపోయారు. ఆరో రౌండ్ తర్వాత లలిత్ 2.5 పాయింట్లతో 59వ స్థానంలో, ప్రత్యూష మూడు పాయింట్లతో 17వ స్థానంలో ఉన్నారు. -
లలిత్ గేమ్ డ్రా
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా కాంటినెంటల్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు తొలి ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. బిల్‌గున్ సుమియా (మంగోలియా)తో శుక్రవారం జరిగిన రెండో గేమ్‌ను లలిత్‌బాబు ‘డ్రా’గా ముగించాడు. ఇదే టోర్నమెంట్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష రెండో పరాజయాన్ని చవిచూసింది. ఎన్గుయెన్ థి మాయ్ హంగ్ (వియత్నాం)తో జరిగిన రెండో రౌండ్లో ప్రత్యూష 44 ఎత్తుల్లో ఓడిపోయింది. -
ప్రత్యూష ఆస్తి నాకేం అవసరం లేదు...
హైదరాబాద్: 'ప్రత్యూష పేరు మీద ఉన్న ఆస్తి ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. తనపై జాలితోనే నాకు ప్రేమ పుట్టింది. ప్రత్యూషకు ఉన్న ఆస్తి రూ.2 కోట్లు అనాథాశ్రమానికి రాసి కట్టుబట్టలతో వచ్చినా ఆమెను మంచిగా చూసుకుంటాను' అని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన బాల మద్దులేటి రెడ్డి, తులసమ్మల కుమారుడు వెంకట మద్దులేటి రెడ్డి చెప్పాడు. బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావును నిన్న మద్దులేటి రెడ్డి కలసి ప్రత్యూషతో తన ప్రేమ వ్యవహారాన్ని వివరించారు. నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో అచ్యుతరావుతో కలసి మద్దులేటి రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రత్యూష చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా స్నేహితుడి బంధువులు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు వెళ్లినప్పుడే నేను ప్రత్యూషను కలిశాను. అలా మా పరిచయం పెరిగింది. నేను రిజిష్టర్ బుక్‌లో రాసిన వివరాల ఆధారంగా ప్రత్యూష నాకు ఫోన్ చేసింది. ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగింది. నాక్కూడా తనపై ఇష్టం ఉన్నందున వెంటనే ఒప్పుకున్నాను’’ అని చెప్పాడు. ఇప్పటికే తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించానని, ఆమె ప్రేమ విషయాన్ని, మాటలు అన్నీ రికార్డ్ చేశానని, అవన్నీ భద్రంగా ఉంచానని తెలిపాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుని ప్రత్యూషతో తన వివాహం జరిపించాలని కోరారు. ఆపదలో ఉన్న ప్రత్యూషను అక్కున చేర్చుకుని తన రెండో కుమార్తెగా భావిస్తున్న సీఎం కేసీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్నారని, ప్రత్యూష కోరుకున్న వ్యక్తితో వివాహాన్ని జరిపించి మనవతా దృక్పథాన్ని చాటుకోవాలని అచ్యుతరావు కోరారు. కేసీఆర్ మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించి మద్దులేటిరెడ్డిని ఏపీ రాష్ట్రం తరఫున దత్తత తీసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వియ్యంకులవుతారన్నారు. -
‘సీఎం సమక్షంలోనే మా పెళ్లి జరగాలి’
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తమ వివాహం జరగాలని కోరుకుంటున్నట్లు ప్రత్యూష ప్రియుడు మద్దిలేటిరెడ్డి తెలిపాడు. అతడు మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూషను తాను ప్రేమించానని, తమ పెళ్లి సాక్షాత్తు కేసీఆర్ సమక్షంలోనే జరగాలని కోరుకుంటున్నామని అతడు చెప్పాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన మద్దిలేటిరెడ్డిని ప్రేమిస్తున్నానని, అతడిని పెళ్లి చేసుకుంటానని ప్రత్యూష ఇటీవల వెల్లడించిన విషయం విదితమే. కాగా ప్రత్యూష మంగళవారం బాలల హక్కుల సంఘం కార్యదర్శి అచ్యుతరావును కలిసింది. తన ప్రియుడు మద్దిలేటితో తనకు వివాహం జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ప్రత్యూష మేజర్ కాబట్టి పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు చట్టపరంగా ఉంటుందని అచ్యుతరావు తెలిపారు. -
పెళ్లికి పట్టుబడుతున్న.. కేసీఆర్ దత్తపుత్రిక
సాక్షి, హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా..? తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ, పెళ్లి వరకు వెళ్లబోతోందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కన్నతల్లి మరణంతో, సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో ప్రత్యూషను మీడియా, బాలల హక్కుల సంఘాలు చొరవతో ఆస్పత్రిలో చేర్పించటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హై కోర్టుల స్పందనతో ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్నఆమె యోగక్షేమాలను అధికారుల ప్రత్యేకంగా చూస్తూవస్తున్నారు. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వోకేషనల్ పరీక్ష సైతం పాసైయ్యారు. అయితే, బీఎస్సీ నర్సింగ్ చేయటమే లక్ష్యంగా చెబుతూ వచ్చిన ప్రత్యూష.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని మహిళ సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా ప్రత్యూష తెలిపారు. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలు మార్లు కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నపటికీ.. ప్రస్తుతం తనకు ఇరవై ఏళ్లని, మేజర్‌నంటూ.. నా ఇష్టప్రకారం నేను కోరుకున్నది చేయాలంటూ ప్రత్యూష పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఎవరీ మద్దిలేటి రెడ్డి.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారీకాలనీకి చెందిన మద్దిలేటి రెడ్డి(27) బీఎస్సీ చదివి ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నారు. గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుని పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చి అక్కడే చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించాడు. ఏ ఇబ్బంది ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ నంబర్ ఇచ్చాడు. నగరంలో ఉన్న రెండు రోజుల ప్రత్యూష వద్దకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లిపోయాడు. తర్వాత ప్రత్యూష ప్రభుత్వ సంరక్షణ గృహంలో చేరింది. అప్పటినుంచి మద్దిలేటికి ఫోన్లు చేస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. హాస్టల్లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా ప్రత్యూష ప్రస్తుతం తాను హాస్టల్లో ఉండలేకపోతున్నానని, హాస్టల్ భోజనంలో సోడా ఉప్పు వేస్తున్నారని, ఉడకని బియ్యంతో అన్నం తినడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతోందని బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావుకు ఆమె ఫోన్ చేసి చెప్పారు. మద్దిలేటిని పెళ్లి చేసుకున్నాకే తాను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని వివరించారు. తాను ప్రేమించిన మద్దిలేటితోనే వివాహం జరిపించాలని కోరారు. ఆమెనే పెళ్లి చేసుకుంటా: మద్దులేటిరెడ్డి అవును.. ప్రత్యూషను ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మ తులసమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పే వాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అందుకు మేమంతా అంగీకరించాం. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో ప్రత్యూషను పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలి : అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్సభ్యులు ప్రత్యూషను ఆస్పత్రి నుండి తీసుకెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత, ఆమెకు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించ లేదు. పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఆమె వాటన్నింటి నుంచి ఇప్పటికిప్పుడు బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. -
తప్పులో కాలేసిన ఇంటర్ బోర్డ్
ప్రత్యూష ప్రాక్టికల్స్ మార్కులను పరిగణించని అధికారులు సాక్షి, హైదరాబాద్: తండ్రి, సవతి తల్లి చేతి లో చిత్రహింసలకు గురై పలువురి సహకారంతో పునర్జన్మ పొందిన ప్రత్యూష(పావని) ఇంటర్ ఫెయిల్ వెనక ఆయా ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యం వెల్లడైంది. ప్రాక్టికల్స్‌తోపాటు అన్ని పరీక్షలను ప్రత్యూష బాగానే రాసినా శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఫెయిలైనట్లుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే, మొదటి సంవత్సరం పరీక్షలను సెయింట్ డేనియల్ కళాశాల, రెండో సంవత్సరం పరీక్షలను నారాయణ కళాశాల ద్వారా ప్రత్యూష రాసింది. ఈ రెండు పరీక్షలకు వేర్వేరు హాల్‌టికెట్లు ఉండడంతో సమన్వయంలేమి కారణంగా ప్రాక్టికల్ పరీక్షల మార్కులను ఇంటర్ బోర్డు అధికారులు పట్టిం చుకోలేదు. శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ‘సాక్షి’ ప్రచురించటంతో డేనియల్ కళాశాల యాజ మాన్యం శనివారం మరోసారి ప్రత్యూష ప్రాక్టికల్ మార్కులను ఇంటర్ బోర్డుకు పంపింది. ఇంటర్ అధికారులు సైతం దొర్లిన తప్పులను సరిదిద్దే ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై డేనియల్ కళాశాల ప్రిన్సిపాల్ బసవపున్నయ్య ‘సాక్షి’ తో మాట్లాడుతూ ప్రత్యూష రాత పరీక్షలతోపాటు, ప్రాక్టికల్స్‌లోనూ ఉత్తీర్ణత సాధిం చినట్లు చెప్పారు. త్వరలో ఆమెకు పాస్ మెమో వస్తుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రత్యూషను మరోసారి మానసికంగా హింసించిన సం బంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు డిమాండ్ చేశారు. -
దూకి చస్తానన్న నటి బాయ్ ఫ్రెండ్
ముంబయి: ఇటీవల మృతిచెందిన నటి ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్, ఆమె మృతికి పరోక్షంగా కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న రాహుల్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స పొందుతున్న ఆస్పత్రి భవనం బాత్ రూంలోకి చొరబడి అందులోని కిటికీలో నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ పై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో అతడు ఈ నెల 3 నుంచి శ్రీ సాయి ఆస్పత్రిలో చేరి మానసిక ఒత్తిడికి చికిత్స పొందుతున్నాడు. అయితే, శుక్రవారం అతడిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి కనీసం రెండు గంటలపాటు విచారించారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రాహుల్ .. బాత్ రూంలోకి చొరబడి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. తాను కిందికి దూకి చనిపోతానని బెదిరించడంతో చివరకు వైద్యులు అతడితో ఏదో ఒకలా మాట్లాడి బయటకు రప్పించారు. ఆ తర్వాత కొంత కౌన్సెలింగ్ ఇచ్చారు. -
నేను ప్రత్యూషను కొట్టాను...
టీవీనటి ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మరణంపై ఆమె బాయ్‌ఫ్రెండు రాహుల్ రాజ్ సింగ్ మాజీ ప్రియురాలు సలోని శర్మ తొలిసారి మౌనం వీడారు. మీడియాతో మాట్లాడిన ఆమె కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. దీంతో ఈ ఉదంతంలో రాహుల్ ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఫిబ్రవరి 11 తాను ప్రత్యూష బెనర్జీని కొట్టినట్లు సలోని అంగీకరించారు. అయితే తాను కావాలని కొట్టలేదని, ప్రతీకారంగానే అలా చేశానని చెప్పుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, వాట్సాప్ లో ఆమె కాంటాక్ట్ ను బ్లాక్ చేశానన్నారు. రాహుల్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ కోసం పెట్టుబడి పెట్టిన డబ్బులు అడగడానికే ఫిబ్రవరి 11న ఆమె ఫ్లాట్‌కు వెళ్లినపుడు ముగ్గురి మధ్య వివాదం జరిగిందని తెలిపింది. ఈ క్రమంలో రాహుల్, ప్రత్యూష ఇద్దరూ తనపై దాడిచేసినపుడు తాను తిరగబడ్డానని తెలిపింది. తనను తాను రక్షించుకోడానికే ఆమెను కొట్టాల్సి వచ్చిందని తెలిపింది. అప్పు తీర్చమన్నందుకు తనపై అమానుషంగా ప్రవర్తించి దాడికి పాల్పడడంతో వారిపై స్థానిక బంగర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. వాళ్లిద్దరి విజ్ఞప్తితోనే ఆ తర్వాత ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు. ఇపుడు ప్రత్యూష ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ విషయాలన్నీ తెలుసని వివరించారు. శనివారం తన తండ్రితో కలిసి బంగర్ నగర్ పోలీస్ స్టేషన్లో సలోని తన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. సలోని చెప్పిన వివరాలు ఇవీ.. 2011లో మోడలింగ్, యాక్టింగ్ కెరీర్ కోసం కోల్‌కతా నుంచి ముంబైకి వచ్చినపుడు రాహుల్‌తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈక్రమంలో ఇద్దరు కలిసి ఒక కంపెనీని ప్రారంభించారు. దీనికోసం సలోని రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టింది. ఇంతలో తమ కామన్ స్నేహితుల ద్వారా రాహుల్, ప్రత్యూషల మధ్య సంబంధాన్ని తెలుసుకున్న ఆమె రాహుల్ ని నిలదీసింది. అవన్నీ అబద్ధాలని, వాటిని పట్టించుకోవద్దంటూ నమ్మబలికాడు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే హఠాత్తుగా ఆగస్టు 10 న ప్రత్యూష పుట్టినరోజు సందర్భంగా టెలివిజన్‌లో వారి వివాహ ప్రకటన విని నివ్వెరపోయి మర్నాడు రాహుల్ ని నిలదీయగా, ఆమెకు సమాధానం చెప్పాల్సిన రాహుల్ దీనికి బదులుగా సలోని తండ్రికి ఫోన్ చేసి కూతుర్ని తీసుకుపొమ్మని చెప్పాడు. ఆయన వచ్చి రాహుల్ తోనూ, ప్రత్యూష తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. తన కూతురు రాహుల్‌కు లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయిందని, ఇలాంటి పరిస్థితే ప్రత్యూషకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు తనను ఎపుడూ కలవని వారు, రాహుల్ - ప్రత్యూష తనకు మధ్య ఏం జరిగిందేంటో తెలియనివారు కూడా.. తన గురించి మాట్లాడుతున్నారని సలోని విమర్శించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన అందరిపై పరువునష్టం దావా దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాహుల్ వ్యవహారం తనకుముందే తెలిస్తే అతనితో సన్నిహితంగా ఉండేదాన్ని కాదని వాపోయారు. ప్రస్తుతం తాను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయానని తెలిపారు. -
ప్రత్యూష పిలుస్తోంది..
టీవీ నటి, బాలికా వధు ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఒకవైపు ఆమెది హత్యా ఆత్మహత్యా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రత్యూష మరణం తర్వాత అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ తండ్రి వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి. ప్రత్యూష తనను పిలుస్తోందంటూ తన కొడుకు రాహుల్ ఐసీయూలో కలవరిస్తున్నాడని చెప్పడం కలకలం రేపింది. రాహుల్ ఆరోగ్యం పట్ల అతని తండ్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యూష చనిపోయిన తర్వాత తన కొడుకు ఇంకా షాక్ లోనే ఉన్నాడని, అతని మానసిక స్థితి బాగోలేదని తండ్రి మీడియాకు వివరించారు. రాహుల్ మానసిక స్థితి ఏ మాత్రం బాగోలేదన్నారు. రాహుల్‌ను చూసేందుకు ఐసీయూకు వెళ్లిన తనతో వింతగా ప్రవర్తించాడని, ప్రత్యూష తనను పిలుస్తోందని.. తాను వెళ్తానని ఐసీయూలో ఉన్న రాహుల్ చెబుతున్నట్లు అతడి తండ్రి పేర్కొన్నారు. దీంతో తమ కొడుకు ఏమైపోతాడోనన్న భయం తమను వెంటాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూషను కోల్పోవడం ఆమె తల్లిదండ్రులకు బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడంతో పాటు తన కొడుకు తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలని వేడుకున్నారు. మరోవైపు ప్రత్యూష ఆత్మహత్యకు రాహుల్ బాధ్యుడంటూ వస్తున్న ఆరోపణలను అతడి బంధువులు తోసిపుచ్చారు. ముంబైలోని నివాసంలో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆమె మృతదేహంపై గాయాలు ఉండటం మరిన్ని సందేహాలకు తావిచ్చింది. దీంతోపాటు ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిపంద కాదని, ఆమెకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రత్యూష అనుమానాస్పద మరణంలో ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను విచారించారు. అయితే ప్రత్యూషది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయం మాత్రం ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. -
అసలు ప్రేమికులే లేకపోతే..
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఉదంతంపై విభిన్న కథనాలు వివాదాన్ని సృష్టిస్తోంటే, బాలీవుడ్ నటి, ఐటం గర్ల్ రాఖీ సావంత్ తనదైన శైలిలో స్పందించింది. ప్రత్యూష బెనర్జీ , ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ప్రేమ వ్యవహారంలోనే ఎక్కువ కలత చెందేదని ఆమె తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని రాఖీ పేర్కొంది. ప్రేమలు ప్రాణాలు తీస్తున్నాయని, ప్రేమికులు లేనిదే బతకలేరా అని ఆమె వ్యాఖ్యానించింది. అసలు ప్రేమికులే లేకపోతే ఈ ఆత్మహత్యలే ఉండవని రాఖీ చెప్పుకొచ్చింది. ఇటీవల తాను ప్రత్యుషను కలిసినపుడు చాలా ఆందోళనలో ఉన్నట్టు కనిపించిందని రాఖీ సావంత్ తెలిపింది. ప్రత్యూష చాలా ఎమోషనల్ గర్ల్ అని, అందుకే ఏమైంది తను అడగ్గానే కన్నీళ్లు పెట్టుకుందని, ఆమెకు జీవితంలో ఎన్నో కలలు ఉన్నాయని పేర్కొంది. రాహుల్ మాజీ ప్రియురాలు సలోని విషయంలో కలత చెందేదని చెప్పింది. రాహుల్ ...సలోనితో రిలేషన్ కొనసాగిస్తున్నాడని ప్రత్యుష బాధపడిందని, ఆమెకు పని విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, కేవలం ప్రేమ వ్యవహారమే ఆమెను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని అభిప్రాయపడింది. రాహుల్ ని పిచ్చిగా ప్రేమించింది.. అతను లేకపోతే బతకలేనని కన్నీళ్లతో చెప్పిందని తెలిపింది. ముంబై పోలీసులు ఈ కేసును ఎలా విచారిస్తారో చూద్దాం అని మీడియాకు తెలిపింది. మరోవైపు ప్రత్యూష సన్నిహితుడు, ప్రముఖ డిజైనర్ రోహిత్ వర్మ మరో సంచలన విషయాన్ని వెల్లడించాడు. గత నెలలో పెళ్లి దుస్తులు తయారు చేయాల్సిందిగా ప్రత్యూష తనను కోరిందని తెలిపాడు. తనను హోలీ పార్టీకి ఆహ్వానించిందని, అయితే ఆ సమయంలో తాను లండన్ లో ఉండడం రాలేకపోయానని రోహిత్ పేర్కొన్నాడు.