నర్సు కోర్సులో ప్రత్యూష
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష నర్సు కోర్సులో చేరింది. గతేడాది ఆగస్ట్‌లో సవతి తల్లి చిత్రహింసలకు గురై ఆసుపత్రి పాలైన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆమెను పరామర్శించి, అక్కున చేర్చుకున్నారు. ప్రత్యూషకు ప్రభుత్వం తరఫున విద్య, వసతి కల్పిస్తామని హామీనిచ్చారు. దాని ప్రకారమే వ్యక్తిగతంగా కొంత ఆర్థికసాయం చేయడంతో పాటు ప్రత్యూష కోరుకున్న విధంగా చదివిస్తున్నారు.