
గాజువాకకు చెందిన మహంతి చంద్ర ప్రత్యూష క్రియేటివ్ రైటింగ్, టాలెంట్ టెస్ట్ తదితర పోటీలలో ఇప్పటి వరకు స్కూల్, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పదేళ్లుగా 138 బహుమతులు సాధించింది. ఇందులో ఇండియా బుక్, ఆసియా బుక్, లిమ్కా బుక్ తదితర స్థాయి బహుమతులు, అవార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా తన విజయాలకు చెందినా ఆల్బమ్‌తో శనివారం దర్జీపేటలో ప్రత్యూష తన తండ్రి చంద్రశేఖర్‌తో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన బహుమతులను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి మరింతగా రాణించాలని అభినందించారు.