సేవకు ఆకాసమంత..
సమాజానికి ఉపయోగపడే ఏ కార్యక్రమానికైనా చేయూతనిస్తానని సినీనటి, ప్రత్యూష సపోర్ట్ వ్యవస్థాపకురాలు సమంత అన్నారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో బుధవారం హెపటైటిస్ బీపై అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రత్యూష సపోర్ట్ ఆధ్వర్యంలోని చిన్నారుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ సందర్భంగా సమంత మాట్లాడుతూ ప్రధాని మోదీకి తన మద్దతును తెలిపారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని, ముఖ్యంగా ఇటీవల ప్రారంభించిన ‘స్వచ్ఛభారత్’ తననెంతో ఆకట్టుకుందన్నారు. అందులో పాల్గొనాలని తననెవరూ ఆహ్వానించలేదని, పిలిస్తే తప్పకుండా పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు.
- సిటీప్లస్