శ్యామల, రమేశ్‌లకు హైకోర్టులో చుక్కెదురు | Shock to Syamala, Ramesh to the High Court | Sakshi
Sakshi News home page

శ్యామల, రమేశ్‌లకు హైకోర్టులో చుక్కెదురు

Published Thu, Oct 29 2015 12:21 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

శ్యామల, రమేశ్‌లకు హైకోర్టులో చుక్కెదురు - Sakshi

శ్యామల, రమేశ్‌లకు హైకోర్టులో చుక్కెదురు

ప్రత్యూషపై చిత్రహింస కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ

 సాక్షి, హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసిన ఆమె సవతి తల్లి చిప్పా చాముండేశ్వరి అలియాస్ శ్యామల, తండ్రి రమేశ్‌లకు హైకోర్టులో  చుక్కెదురైంది. ప్రత్యూషను తీవ్ర హింసకు గురిచేసిన కేసులో వారికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న వారు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్‌ను కిందిస్థాయి కోర్టు తోసిపుచ్చింది.  దీంతో ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్యామల, రమేశ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేసుకున్నారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement