‘సీఎం సమక్షంలోనే మా పెళ్లి జరగాలి’ | CM KCR adopted daughter lover wants marriage | Sakshi
Sakshi News home page

‘సీఎం సమక్షంలోనే మా పెళ్లి జరగాలి’

Published Tue, May 10 2016 8:03 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

‘సీఎం సమక్షంలోనే మా పెళ్లి జరగాలి’ - Sakshi

‘సీఎం సమక్షంలోనే మా పెళ్లి జరగాలి’

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తమ వివాహం జరగాలని కోరుకుంటున్నట్లు ప్రత్యూష ప్రియుడు మద్దిలేటిరెడ్డి తెలిపాడు. అతడు మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూషను తాను ప్రేమించానని, తమ పెళ్లి సాక్షాత్తు కేసీఆర్ సమక్షంలోనే జరగాలని కోరుకుంటున్నామని అతడు చెప్పాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన మద్దిలేటిరెడ్డిని ప్రేమిస్తున్నానని, అతడిని పెళ్లి చేసుకుంటానని ప్రత్యూష ఇటీవల వెల్లడించిన విషయం విదితమే.

కాగా ప్రత్యూష మంగళవారం బాలల హక్కుల సంఘం కార్యదర్శి అచ్యుతరావును కలిసింది.  తన ప్రియుడు మద్దిలేటితో తనకు వివాహం జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ప్రత్యూష మేజర్ కాబట్టి పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు చట్టపరంగా ఉంటుందని అచ్యుతరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement