ఈ ఎరుపేంటి? | what is this red ? | Sakshi
Sakshi News home page

ఈ ఎరుపేంటి?

Published Tue, Jan 19 2016 12:25 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

what is this red ?

 క్రైమ్ కామెడీ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎరుపు’. వెంకట్‌కృష్ణ దర్శకత్వంలో సుధీర్, ప్రత్యూష జంటగా ‘ఓయ్’ చిత్ర దర్శకుడు ఆనంద్ రంగ, శేషారెడ్డి  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హీరో సిద్ధార్థ్‌లు ట్విటర్ ద్వారా టీజర్‌ను, పాటలను విడుదల చేయనున్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సమర్పణ: అనిల్ - భాను, సహ నిర్మాతలు: తంబరి క్రియేషన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement