Sudhir
-
బిడ్డా... ఏడున్నావ్!
రాజంపేట: ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు... ఉన్నత విద్యను అభ్యసించాడు... క్యాంపస్ సెలక్షన్స్‌లోనే మంచి ఉద్యోగం పొందాడు... అంతలోనే అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. రెండేళ్లుగా అతను ఎక్కడ ఉన్నాడో... ఏమయ్యాడో తెలియదు. అతని కోసం 2022 జూలై నుంచి తల్లిదండ్రులు ఎదరుచూస్తూ నిత్యం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి వేదన స్థానికులను సైతం కంటతడిపెట్టిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు... అన్నమయ్య జిల్లా రాజంపేటలోని విద్యుత్‌నగర్‌కు చెందిన పైడి సుబ్రహ్మణ్యం, లక్షమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శృతికి గత ఏడాది వివాహమైంది. కుమారుడు సు«దీర్ బెంగళూరులోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, క్యాంపస్ సెలక్షన్లో అక్కడే టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాడు. ఈ క్రమంలో అతను రెండేళ్ల కిందట అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బెంగళూరులో సు«దీర్ మిస్సింగ్ అయినట్లు కేసు నమోదు చేశారు. కానీ, ఇంతవరకు సుదీర్ జాడ తెలియలేదు.న్యూడ్ వీడియో వల్లే..! సుధీర్ వాట్సాప్‌లో న్యూడ్ వీడియో ముఠా ట్రాప్‌కు గురయ్యాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆర్ఐఎల్వైఏ ప్లస్ 1720–657–9633 నంబర్ నుంచి దుండుగులు సు«దీర్ న్యూడ్ ఫొటోను అతని అక్క శృతి ఫోన్‌కు వాట్సాప్‌లో 2022, జూలైలో పంపారు. వెంటనే శృతి తనకు వాట్సాప్ మెసేజ్ వచ్చిన నంబర్‌కు కాల్ చేయగా, స్విచ్ ఆఫ్ వచ్చింది. సు«దీర్‌కు ఫోన్ చేయగా కట్‌చేశాడు. మళ్లీ కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత ‘తమ్ముడు నువ్వు భయపడవద్దు...’ అని సుదీర్‌కు శృతి మెసేజ్ పెట్టింది. అయినా తిరిగి అతని నుంచి సమాధానం లేదు. వెంటనే శృతి తన తండ్రితో కలిసి బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధీర్ రూమ్మేట్స్ను విచారించగా, 2022 జూలై 26న ఫోన్లో మాట్లాడిన తర్వాత అతను బయటికి వెళ్లాడని, తిరిగిరాలేదని చెప్పారు. వీడియోను పంపించి బ్లాక్మెయిలర్స్ డబ్బు డిమాండ్ చేయడంతో సు«దీర్ అవమానంగా భావించి ఉంటాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయాడని అనుమానిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా రెండేళ్లుగా అతీగతీ లేకపోవడంతో తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. ఎప్పటికైనా తమ కొడుకు తిరిగివస్తాడనే ఆశతో తెలిసిన ప్రతి చోట వెతుకుతున్నారు. తమ కుమారుడు తిరిగి వస్తాడనే ఆశతో ఇన్నాళ్లు ఈ విషయాన్ని మీడియా దృష్టికి కూడా తీసుకురాలేదని సుధీర్ తల్లిదండ్రులు కన్నీటిపర్యవంతమయ్యారు. -
అందంగా చూపిస్తారు.. అందుకే తెలుగు సినిమాలంటే ఇష్టం: హీరోయిన్ హాసినీ సుధీర్ (ఫొటోలు)
-
నిజాయితీగా శ్రమిస్తే సక్సెస్ గ్యారంటీ
‘సత్యం’ రాజేశ్, మేఘా చౌదరి హీరో హీరోయిన్లుగా, ఎస్తేర్ ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘టెనెంట్’. వై. యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత సాహు గారపాటి, నటుడు ‘సుడిగాలి’ సుధీర్ అతిథులుగా హాజరై ‘టెనెంట్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సినీ పరిశ్రమను నమ్ముకుని నిజాయితీగా శ్రమిస్తే ఆలస్యమైనా సక్సెస్ తప్పకుండా వస్తుందనడానికి నిదర్శనం ‘సత్యం’ రాజేశ్, ‘సుడిగాలి’ సుధీర్. ఈ ఇద్దరూ కష్టపడి హీరోలుగా నిరూపించుకున్నారు. యుగంధర్ ప్రతిభ గల వ్యక్తి’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాహు గారపాటి. ‘‘సత్యం’ రాజేశ్‌గారు వరుస హిట్స్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ సినిమా కథలోని ఎమోషన్స్‌కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. -
సక్సెస్‌ను హ్యాండిల్ చేయడం కష్టం
‘‘బుల్లితెర షోలకు టీఆర్పీ రేటింగ్స్‌కు ఎక్కువ ప్రాంధాన్యత ఉంటుంది. కానీ సినిమాలకైతే దర్శకుల భవిష్యత్, నిర్మాత డబ్బులు, వినోదాన్ని ఆశించి థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకులు.. ఇలా చాలా విషయాలు ఆలోచించాలి. నా ‘గాలోడు’ సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదు. ఫెయిల్యూర్‌ను హ్యాండిల్ చేయడం సులభమే. కానీ సక్సెస్‌ను హ్యాండిల్ చేయడం కష్టం’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. అరుణ్ విక్కీరాల దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా రూపొందిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘సుడిగాలి’ సుధీర్ మాట్లాడుతూ– ‘‘కాలింగ్ సహస్ర’ కథ చెప్పినప్పుడు ఇందులోని ఓ పాయింట్ కొత్తగా అనిపించింది. నా కెరీర్లో ఇది ప్రయోగాత్మక సినిమా’’ అని చెప్పుకొచ్చారు. -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో గ్యాంగ్ లీడర్ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనతో పాటు తక్కువ ధరకే బంగారం, నోట్ల మార్పిడి తదితర నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లీడర్ దేవరకొండ సుదీర్ అలియాస్ అజయ్‌రెడ్డిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించి ఎయిర్ గన్లు 4, హ్యాండ్‌కప్స్ 4, వాకీటాకీలు 4, కత్తులు రెండు, ఫోల్డింగ్ ఐరన్ స్టిక్‌లు రెండు, జామర్స్ 2, పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్, నగదు రూ.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై రాష్ట్రంలోని 10 పోలీస్ స్టేషన్లలో 25 కేసులున్నాయని, కావలి టూ టౌన్ పోలీసుస్టేషన్లో సస్పెక్టెడ్ షీటు ఉందన్నారు. నిందితుడు అనుచరులతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం, నోట్ల మార్పిడి, నకిలీ పోలీసుల అవతారంలో నేరాలు, మోసాలకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు. ఇటీవల నిందితుడి మోసాలపై పలువురు ఫిర్యాదులు చేయగా.. వాటిపై కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ హిమవతి, కావలి డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో దేవరకొండ సుధీర్ !
నెల్లూరు(క్రైమ్): కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ అలియాస్ అజయ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య స్థావరంలో విచారిస్తున్నట్లు తెలిసింది. గత నెల 26వ తేదీన కావలి మద్దూరుపాడు వద్ద సుధీర్, అతని అనుచరులు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. ఈ ఘటనపై కావలి రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుధీర్‌తోపాటు మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సుధీర్ పూటకో సిమ్‌కార్డు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండడంతో అతనిని పట్టుకోవడం కష్టతరంగా మారింది. దీంతో పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితుడిని చైన్నెలో అదుపులోకి తీసుకుని రహస్య స్థావరానికి తరలించినట్లు సమాచారం. సుధీర్, అతని అనుచరులు తక్కువ ధరకు బంగారం పేరిట పలువురిని మోసగించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత సోమవారం స్పందన కార్యక్రమంలో ముగ్గురు బాధితులు సుధీర్ మోసాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో సుధీర్ మోసాలపై సైతం క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. సుధీర్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
స్వగ్రామానికి తెలుగు విద్యార్థి మృతదేహం
జి.కొండూరు: కొలంబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి బేతపూడి సుధీర్‌కుమార్ మృతదేహం స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరుకు సోమవారం ఉదయం చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ కృషి, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బాధిత తల్లిదండ్రులకు కుమారుడి చివరిచూపు దక్కింది. జి.కొండూరుకు చెందిన బేతపూడి దేవదాసు కుమారుడు సుదీర్‌కుమార్ అలియాస్ జోషీ (34) ఎంఎస్ చదివేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అనేక కారణాలతో ఎంఎస్ పూర్తి చేయలేకపోయాడు. అక్కడే ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. గతనెల 15వ తేదీన తన స్నేహితురాలైన తోటి విద్యార్థి జెస్సికా జన్మదిన వేడుకల నిమిత్తం కొలంబియా వెళ్లాడు. 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ కుమారుడి ఆఖరి చూపు క ల్పించాలని వారు అభ్యర్థించారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ద్వారా కొలంబియాలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి, జి.కొండూరు తరలించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. బంధువులు, కుటుంబ సభ్యుల చివరిచూపు అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమారుడి చివరిచూపును కల్పించిన ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి తామెప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం
అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యాలతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. ప్రాచీన కళను కాపాడుతూ.. ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్‌కు చెందిన సుధీర్ చరణ్ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడులోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు. వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్ చరణ్ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు. ఎలా తయారు చేస్తారంటే.. ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రతతో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వరకూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చేసి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీటి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వామి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. సత్యదేవునికీ ముత్తంగి సేవ సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమవారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది. – ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం -
భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం.. పారా పవర్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది. గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 20పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది. కాగా పారా పవర్ లిఫ్టింగ్‌లో విజేతను పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారి శరీర బరువు అలాగే అతను ఎత్తే బరువు ఆధారంగా పాయింట్లు లెక్కిస్తారు. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అతను నైజీరియన్ పవర్‌లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో రెండవ ప్రయత్నంతో సుధీర్ రెండోస్థానానికి పడిపోయాడు. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని భారత అథ్లెట్ రెండవ ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు క్రిస్టియన్ ఉబిచుక్వు తన చివరి ప్రయత్నంలో 203 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఇది సుధీర్ బంగారు పతకం అవకాశాలను మెరుగుపరచింది. ఇదే ఈవెంట్లో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు, క్రిస్టియన్ ఉబిచుక్వు 133.6 స్కోరుతో రజతం గెలుచుకోగా, స్కాట్లాండ్కు చెందిన మిక్కీ యూల్ 130.9 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నాడు. క్రిస్టియన్ 197 కిలోలు ఎత్తగా, యూల్ 192 కిలోలు ఎత్తాడు. హర్యానాలోని సోనిపట్ లో ఓ రైతు కుటుంబంలో సుధీర్ జన్మించారు. తీవ్ర జ్వరం కారణంగా నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. కానీ అతనికి వైకల్యం అడ్డురాలేదు. క్రీడలపై జీవితాంతం ఆసక్తిని కనబర్చాడు. HISTORIC GOLD FOR INDIA 🔥🔥🔥 Asian Para-Games Bronze medalist, #Sudhir wins 🇮🇳's 1st ever GOLD🥇 medal in Para-Powerlifting at #CommonwealthGames with a Games Record to his name 💪💪 Sudhir wins his maiden 🥇 in Men's Heavyweight with 134.5 points (GR) at CWG#Cheer4India 1/1 pic.twitter.com/cBasuHichz — SAI Media (@Media_SAI) August 4, 2022 This is so special 😍 6 gold 🥇for Bharat 🇮🇳 thanks to Sudhir lifting 212 kg in para power lifting setting new Games record !! Many congrats to u bhai 👏👏 Billion Indian’s proud of you 👏 #ParaPowerlifting #Sudhir pic.twitter.com/TZ6VEnef4b — Soug (@sbg1936) August 4, 2022 చదవండి: CWG 2022: మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం -
రిపబ్లిక్ వేడుకల్లో తెలుగు కళారూపం
సాక్షి, హైదరాబాద్: తెలుగు కలంకారీ కళాకారుడు సుధీర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ వేడుకల్లో సుధీర్ కలంకారీ కళారూపానికి చోటు దక్కింది. పంజాబ్‌లోని రాజ్‌పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్‌లో స్క్రోల్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న కొన్ని సంప్రదాయ రీతులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్ పథ్‌లో ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా రాజ్‌పథ్‌లోని ఓపెన్ గ్యాలరీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఎ) భారీ స్క్రోల్స్‌ను ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా కళాకారులు (వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు) దీనిని చిత్రించారు. కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కళారూపం కూడా ఉండటం విశేషం. సుధీర్ అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు, పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై చేసే చేతి పెయింటింగ్ పురాతన శైలి. ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలుంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్‌లు, పువ్వులు, నెమలి, పైస్లీలు మొదలు మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి. -
‘మా’ ఎన్నికలు : అందుకే సుధీర్, అనసూయలను తీసుకున్నాం: ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుడు ప్రకాశ్ రాజ్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల తేది(అక్టోబర్ 10)దగ్గర పడుతుండటంతో ప్రచారం ముమ్మరం చేశాడు. శుక్రవారం సిని‘మా’బిడ్డలు అనే పేరుతో తన ప్యానల్ సభ్యులను కూడా ప్రకటించారు. అందులో ప్రకాశ్‌రాజ్ (అధ్యక్షుడు), నాగినీడు (ట్రెజరర్), బెనర్జీ, హేమ (ఉపాధ్యక్షులు), శ్రీకాంత్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), జీవితా రాజశేఖర్ (జనరల్ సెక్రటరీ), అనితా చౌదరి, ఉత్తేజ్ (జాయింట్ సెక్రటరీ). ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా అనసూయ, అజయ్, బి.భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూమ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, డి.సుబ్బరాజు, సురేశ్ కొండేటి, తనీశ్, టార్జాన్ ఉన్నారు. (చదవండి: అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న జీవితా రాజశేఖర్, హేమ) అయితే వీరిని మాత్రమే ఎందుకు తీసుకున్నారో కూడా వివరించారు. కొత్త వారికి, కుర్రాళ్లకి, మహిళలకు, బుల్లితెరకు అందరికీ ఇలా సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ప్యానెల్‌ను డిజైన్ చేశామని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఈ క్రమంలో బుల్లితెర యాంకర్ అనసూయ, నటుడు సుధీర్లను ఎగ్జిక్యూటీవ్ కమిటీ మెంబర్స్‌గా ఎందుకు తీసుకున్నారో కూడా వివరించారు. ‘అనసూయ గొప్ప యాంకర్ .అందరితో కలిసి మాట్లాడగలికే శక్తి ఉన్న లేడి. బుల్లితెర నటీనటుల కష్టాలు ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమెను సెలెక్ట్ చేశాం’అన్నారు. ఇక సుధీర్ గురించి మాట్లాడుతూ..‘యూత్ ఐకాన్ సుధీర్. అలాంటి కుర్రాళ్లతో కలిసి పని చేస్తే మాక్కుడా కొత్త ఆలోచనలు వస్తాయి. వచ్చే తరాలకు వీళ్ల ఐడియాలు పనికొస్తాయి. ఆ కారణంగానే సుధీర్‌ని సెలెక్ట్ చేశాం’అని ప్రకాశ్ రాజ్ అన్నారు. -
నూతన సీఐసీగా సుధీర్ భార్గవ
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా కేంద్ర ప్రభుత్వం సుధీర్ భార్గవను నియమించింది. ఈయనతో పాటు మరో నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చేపట్టింది. భార్గవ సీఐసీ సమాచార కమిషనర్‌గా చేశారు. ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి మొత్తం 11 మంది ఉండాల్సిన ఈ కమిషన్‌లో ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి అయిన యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజా ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ నీరజ్ కుమార్ గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్ చంద్రలను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ ఏడాదే ప్రభుత్వోద్యోగులుగా పదవీ విరమణ పొందారు. ఇటీవల ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథుర్‌తో పాటు ముగ్గురు సమాచార కమిషనర్లు శ్రీధర్ ఆచార్యులు, యశోవర్ధన్ ఆజాద్, అమితవ భట్టాచార్య పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడున్న ఇతర ముగ్గురు కమిషనర్లు వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నియామకాల్లో పారదర్శకత ఏది?: మాడభూషి సాక్షి, న్యూఢిల్లీ: సీఐసీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని మాజీ సీఐసీ మాడభూషి శ్రీధరాచార్యులు కోరారు. కేవలం పరిపాలన రంగానికి చెందిన అధికారులనే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారినీ కమిషనర్లుగా నియమించాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఖర్గేకు లేఖలు రాశారు. సీఐసీ సభ్యుల ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులు. సీఐసీ సభ్యుల ఎంపిక సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నందునే పలువురు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్)లు దాఖలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘సీఐసీ కమిషనర్లుగా కేవలం పరిపాలన వర్గాల వారినే ఎందుకు నియమిస్తున్నారు? న్యాయం, సామాజిక సేవ, మీడియా, జర్నలిజం, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల వారినీ నియమించాలన్న సమాచార హక్కు చట్ట నిబంధనలను ఎందుకు పాటించరు? ఇటీవల నియమించిన నలుగురినీ బ్యూరోక్రాట్ల నుంచే ఎందుకు ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. సీఐసీతోపాటు రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్(ఎస్ఐసీ)లలో సకాలంలో నియామకాలు చేపట్టాలన్న నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. -
సోలాంగ్
నైట్ డ్యూటీలో ఉన్నాడు సోలాంగ్. రాత్రి పదకొండు అవుతుండగా తన ఫ్లోర్‌లోంచి పైఫ్లోర్లోని ఆఫీస్ డైనింగ్ హాల్లోకి వెళ్లాడు. దేనికైనా అందరూ ఒకేసారి వెళ్లిరావాలనే ‘హాఫేనవర్ బ్రేక్’లు ఉండే ఆఫీస్ కాదది. ‘ఎప్పుడెలా చస్తారో మీ ఇష్టం. ఇన్ టైమ్‌లో వర్క్ ఫినిష్ అయితే చాలు..’ అన్నట్లుంటాయి అక్కడి రూల్స్ అన్నీ.నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు రోజూ అదే టైమ్‌కి భోజనానికి లేస్తాడు సోలాంగ్. అప్పటికైనా ఆకలి కొరికేస్తోందని అతడు లేవడు. ఇంటి నుంచి ఏవో రెండు గిన్నెలు తెచ్చుకుంటాడు. అవి ఖాళీ చేయడం కోసం లేస్తాడు. ఆ గిన్నెలు కూడా అతడు పెట్టించుకుని తెచ్చుకున్నవి కావు. భార్య పెట్టిస్తే తెచ్చుకున్నవి. ఆ గిన్నెల్లో ఏం పెట్టావని అతడెప్పుడూ ఆఫీస్‌కు బయల్దేరే ముందు గానీ, ఆఫీస్‌కి వచ్చాక గానీ భార్యను అడగలేదు. కొత్తల్లో ఒకసారి అతడు అడక్కుండానే భార్యే చెప్పింది.. పై గిన్నెలో మీకిష్టమైన బంగాళదుంప వేపుడు, చల్ల మిరపకాయలు ఉన్నాయని. ఆమె అలా చెప్పినప్పుడు.. అతడన్నమాట.. ‘ఏదైతేనేం.. నోట్లోనే ఉండిపోయేదా! కడుపులోకి వెళ్లేదే కదా’ అని! ఆ లాజిక్ ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. ఆ రోజు నుంచీ గిన్నెల్లో ఏం పెట్టిందీ చెప్పడం మానేసింది. అప్పుడే ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఏదో ఒకటి తినడం తప్ప, ఏదైనా ఒకటి తినాలని తన భర్తకు ప్రత్యేకంగా ఏమీ ఉండదని. అలాగని అతడికి ఇష్టమైనవి చేసి గిన్నెల్లో సర్దడం మానలేదు ఆమె. తనకు ఇష్టమైనవి ఇష్టంగా తింటున్నానన్న స్పృహైతే లేకుండా అతడు తినేసేవాడే కానీ, ఆమె మాత్రం పూర్తి స్పృహతో అతడు ఏవైతే ఇష్టంగా తింటాడో అవి మాత్రమే చేసి గిన్నెల్లో పెట్టేది. క్యారియర్ తెరిచాడు సోలాంగ్. పెద్ద కంపెనీకి తగినంత పెద్ద డైనింగ్ హాల్ అది. ఓ యాభై వరకు టేబుల్స్ ఉంటాయి. సోలాంగ్ వెళ్లేటప్పటికి అవన్నీ ఖాళీగా ఉన్నాయి. సోలాంగ్ ఆ టైమ్‌కే డైనింగ్ హాల్‌కి రావడానికి అదొక కారణం. ఎవరూ ఉండరు. తనొక్కడే ఉంటాడు. ఒక్కడే కూర్చొని తింటూ ఆలోచనల్లో పడిపోవడం అతడి అలవాటు. ఆలోచనల మధ్య తింటుంటాడు తప్ప, తింటూ మధ్య మధ్య ఆలోచించడు. ఇంట్లో కూడా అంతే. ఎదురుగా భార్య కూర్చొని ఉన్నా.. తన ఆలోచనల్ని తను తింటుంటాడు. ఆమెతో మాట్లాడడు. కొంచెం పెట్టమనీ, ఇంక చాలనీ అనడు. భర్త ఏం తిన్నాక ఏం తింటాడో, ఏది ఎంత తింటాడో పెళ్లయిన ఆ మూడేళ్లలోనూ పెద్ద పీహెచ్‌డీనే చేసింది ఆమె. డైనింగ్ హాల్లో ఒక్కడే తింటున్నాడు సోలాంగ్. అతడు తింటుంటే.. ఎప్పటిలాగే అతడిని ఆలోచనలు కొరుక్కుతింటున్నాయి. సోలాంగ్ ఎప్పుడూ ముగ్గురి గురించి ఆలోచిస్తుంటాడు. దేవుడు.. దెయ్యం.. మనిషి!ఈ ముగ్గురి మధ్య ఉండే సంబంధమే అతడి నిరంతర ఆలోచన. సోలాంగ్ తింటూ ఉంటే.. (ఆలోచిస్తూ ఉంటే).. డైనింగ్ హాల్లోకి ఎప్పుడొచ్చాడో గానీ ఓ వ్యక్తి నేరుగా సోలాంగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, ‘‘నేనూ మీతో కలిసి కూర్చోవచ్చా?’’ అన్నాడు తన క్యారియర్‌ను బయటికి తీస్తూ. సోలాంగ్ అతడివైపు మౌనంగా చూశాడు. ‘‘ఒక్కణ్ణే తినడం నాకు అలవాటు లేదు’’ అన్నాడు ఆ వచ్చిన అతను. ‘‘కానీ నాది ఐపోవచ్చింది. మధ్యలోనే లేచి వెళ్తాను’’ అన్నాడు సోలాంగ్. ఎలాగైనా అతడిని అక్కడ కూర్చోనివ్వకపోవడం సోలాంగ్ ఉద్దేశం. అతడు నవ్వాడు. ‘‘రెండు క్షణాల్లో తినేస్తాను. బహుశా మీకంటే ముందే తినేస్తానేమో కూడా’’ అన్నాడు. అతడి డబ్బాలవైపు చూశాడు సోలాంగ్. అవి రెండు క్షణాల్లో అయిపోయేలా లేవు.. అతడు దెయ్యమో, దేవుడో అయితే తప్ప! అదే మాట అన్నాడు కూడా.ఆ మాటకు పెద్దగా నవ్వాడు అతను. ‘‘రండి. కూర్చోండి’’ అన్నాడు సోలాంగ్. అతడి జీవితంలో ఒక వ్యక్తిని అలా తన టేబుల్ మీదకు ఇన్వైట్ చెయ్యడం అదే మొదటిసారి.‘‘మిమ్మల్ని ఆఫీస్‌లో చాలాసార్లు చూశాను. ఎప్పుడూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తుంటారు కదా’’ అన్నాడు అతను. సోలాంగ్ నవ్వాడు. ఆ ‘సుదీర్ఘత’నే ఇంగ్లిష్‌లోకి అనువదించి అతడికి ఆఫీస్‌లో అంతా సోలాంగ్ అనే పేరు పెట్టారని కూడా ఆ వచ్చినతనికి తెలుసు. అయితే ఆ మాట పైకి అనలేదు. ‘‘నా పేరు విశిష్ట’’ అన్నాడు.. తన గిన్నెలు ఓపెన్ చేస్తూ. ‘అవునా’ అన్నట్లు చూశాడు సోలాంగ్. ఆ తర్వాత కొద్దిసేపటికే వాళ్లిద్దరి టాపిక్.. దెయ్యాల మీదకు, దేవుడి మీదకు మళ్లింది! ‘‘నాకు ఈ దెయ్యాల మీద, దేవుళ్ల మీద, మనుషుల మీద నమ్మకం లేదు’’ అన్నాడు విశిష్ట. పెద్దగా నవ్వాడు సోలాంగ్. ‘‘కనీసం మీ మీదైనా మీకు నమ్మకం ఉండాలి కదా’’ అన్నాడు. ‘‘మీరన్నది నాకు అర్థమయింది. మీ ఎదురుగా ఉన్న నేను.. దెయ్యమో, దేవుడో, మనిషో కాకుండా ఇంకొకరు అవడానికి అవకాశమే లేనప్పుడు.. ఈ ముగ్గురిలో నేను ఎవరో.. ఆ ఎవరినోనైనా నేనునమ్మకపోవడం ఎలా సాధ్యమౌతుందనే కదా మీరు అనడం’’ అన్నాడు విశిష్ట. ‘అంతే కదా’ అన్నట్లు చూశాడు సోలాంగ్.‘‘కానీ సుధీర్.. ‘నాకు నమ్మకం లేదు’ అని నేను అన్నది ఆ ముగ్గురి ఉనికి గురించి కాదు. ఆ ముగ్గురినీ నేను విశ్వసించను అని’’ అన్నాడు విశిష్ట. అదిరిపడ్డాడు సోలాంగ్. అయితే ఆ అదురుపాటును దాచుకుంటూ.. ‘‘నా పేరు మీకెలా తెలుసు?’’ అన్నాడు. ‘‘మీ పేరు అదే అయినప్పుడు.. ఆ పేరేగా నాకు తెలుస్తుంది’’ అన్నాడు విశిష్ట. సోలాంగ్కి చాలా సంతోషం వేసింది. విశిష్ట తనకు ఆప్తుడిలా అనిపించాడు. తనని అతడు తనలాగే గుర్తించాడు. తన ‘సుదీర్ఘత’కు ఎలాంటి గుర్తింపునూ ఇవ్వకుండా. ఇద్దరి భోజనాలు పూర్తయ్యాయి. టాపిక్ మాత్రం పూర్తి కాలేదు. అది పూర్తయ్యేలా లేదనిపించి.. ‘‘ఇక నేను వెళ్తాను’’ అని పైకి లేచాడు విశిష్ట. సోలాంగ్ లేవలేదు.విశిష్ట లేచి, ఆ డైనింగ్ హాల్లోనే ఓ మూల.. మలుపులో ఉన్న సింక్ దగ్గరికి వెళ్లి గిన్నెల్ని కడుక్కుని, వాటిని మళ్లీ టేబుల్ దగ్గరకు తెచ్చి, టేబుల్ మీద ఉన్న లంచ్ బ్యాగ్‌లో సర్దుకుని కింది ఫ్లోర్‌లోకి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కు తిరిగి ‘బై’అన్నట్లు సోలాంగ్ వైపు చెయ్యి ఊపాడు. సోలాంగ్ కూడా చెయ్యి ఊపాడు. సోలాంగ్కి, తిన్న తర్వాత గిన్నెలు కడిగే అలవాటు లేదు. వాటిని అలాగే లంచ్ బ్యాగ్‌లో పెట్టేస్తాడు. చేతులు కడుక్కోవడం తప్పదు కాబట్టి.. వాటిని మాత్రం కడుక్కుంటాడు. విశిష్ట వెళ్లిపోయాక కూడా, కొద్దిసేపు అలాగే కూర్చొని.. చేతులు ఎండిపోతున్నట్లుంటే అప్పుడు లేచి, సింక్ వైపు నడిచాడు సోలాంగ్. సింక్‌లో నీళ్ల చప్పుడు అవుతోంది! ట్యాప్‌ను సరిగా కట్టేయకుండా వెళ్లాడేమో విశిష్ట.. అనుకున్నాడు.మరో నాలుగడుగులు వేసి, మలుపు తిరిగి, సింక్ ఉన్న రూమ్‌లోకి వెళ్లాడు.నిజమే. లోపల ట్యాప్‌లోంచి నీళ్లు పడుతున్నాయి. అయితే అవి విశిష్ట తిప్పేసి వెళ్లడం వల్ల పడుతున్న నీళ్లు కాదు. ట్యాప్ తిప్పి విశిష్ట చేతులు కడుక్కుంటున్నప్పుడు పడుతున్న నీళ్లు!గుండె చిక్కబట్టుకుని ఒక్కసారిగా అక్కణ్ణుంచి డైనింగ్ హాల్ బయటికి పరుగులు తీశాడు సోలాంగ్. ఆ తర్వాతెప్పుడూ అతడు ఆఫీస్ డైనింగ్ హాల్లో ఒక్కడే కూర్చొని తినలేదు. - మాధవ్ శింగరాజు -
సారీ బ్రదర్..!
శ్రీకాకుళం : ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రయత్నించినా రాకపోవడం, ప్రమాదంలో కాలికి తీవ్ర గాయమై దివ్యాంగుడిగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘సారీ బ్రదర్...’ అంటూ సోదరుడికి సందేశం పంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంపురం గ్రామానికి చెందిన గెడ్డం సుధీర్ బీటెక్ పూర్తి చేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే పోటీపరీక్షలకు శిక్షణ పొందుతున్నాడు. సోదరుడు సంతోష్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడి సాయంతో సుధీర్ అక్కడే ఉండేవాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధీర్ కాలికి బలమైన గాయమైంది. దివ్యాంగుడిగా మారడంతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపం చెంది హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరిగా తన సోదరుడు సంతోష్‌కు ‘సారీ బ్రదర్..’ అంటూ తన ఆవేదన తెలియజేస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఫోన్‌కు సందేశం పంపాడని గ్రామస్తులు తెలిపారు. సుధీర్ తండ్రి తులసీదాస వలసకూలీ. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. తల్లి భూదేవి గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతిచెందాడనే వార్త తెలుసుకున్న తల్లి కుమిలిపోతోంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరితరం కావటం లేదు. సుధీర్ మృతదేహానికి హైదరాబాద్‌లో పోస్టుమార్టం పూర్తిచేసి, ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. మరోవైపు తండ్రి తులసీదాస్ కూడా హుటాహుటిన ఆదివారం ఇక్కడికి వస్తున్నారు. సుధీర్ మృతదేహం ఆదివారానికి గ్రామానికి చేరుతుందన్నారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. -
12% పెరగనున్న డిజిటల్ విద్య
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ 97.8 బిలియన్ డాలర్లు కాగా దాన్లో డిజిటల్ ఎడ్యుకేషన్ వాటా రెండు బిలియన్ డాలర్లకు చేరిందని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సిస్కో ఇండియా, సార్క్ కమర్షియల్ సేల్స్ ఎండీ సుధీర్ నాయర్ చెప్పారు. రెండేళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ 11 నుంచి 12 శాతం మేర వృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. ఇక్కడి ఐఎస్బీ ప్రాంగణంలో ‘బ్లూ ప్రింట్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సిస్కో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సుధీర్ నాయర్ మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటలైజేషన్ ప్రభావానికి గురవుతున్న 14 రంగాల జాబితాలో విద్యా రంగం ఏడో స్థానంలో ఉందని, దీన్ని బట్టే విద్యా రంగంలో డిజిటల్ నైపుణ్యాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత వెల్లడవుతోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాము పలు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్‌లను రూపొందించినట్లు తెలియజేశారు. ‘‘దీన్లో స్పార్క్ యాప్ విభిన్నమైనది. దీని ద్వారా విద్యార్థులకు వర్చువల్ క్లాస్ రూమ్స్, లెక్చర్స్ అరచేతిలో అందుబాటులోకి వస్తాయి’’ అన్నారాయన. తెలంగాణ ప్రభుత్వంతోనూ ఒప్పందం: డిజిటల్ ఎడ్యుకేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోణంలో తెలంగాణ ప్రభుత్వంతోనూ ఒప్పందం చేసుకున్నట్లు ఈ సందర్భంగా సుధీర్ చెప్పారు. ‘‘ఈ ఒప్పందంలో భాగంగా టి–హబ్ ప్రాంగణంలో ఇన్నోవేషన్ హబ్, లివింగ్ ల్యాబ్‌లను నెలకొల్పాం. హైటెక్ సిటీ ప్రాంతంలో 2.2. కి.మీ. మేర డిజిటల్ జోన్ ప్రాజెక్ట్‌ను రూపొందించాం. దీనిలో భాగంగా స్మార్ట్ వై–ఫై, స్మార్ట్ లైటింగ్, ట్రాఫిక్ ఎనలిటిక్స్, స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి’’ అని వివరించారు. డెలివరింగ్ రిమోట్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో నెలకొన్న పది పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. -
మళ్లీ వేడెక్కిన దక్షిణపు గాలి
దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. కాబట్టి బీజేపీ జాతీయవాద రాజకీయ ఎత్తుగడను నిరోధించడానికి ఈ పార్టీల అధినేతలు తమ అస్తిత్వం కార్డును ప్రయోగించే అవకాశం ఉంది. కానీ ఇది పెద్దగా అనుకూలించకపోవచ్చు. కేంద్రం తనది పై చేయిగా ఉండడానికి రాష్ట్రాల మధ్య ఉండే విభేదాలను ఉపయోగించుకుంటుంది. తెలుగు ప్రాంతమే ఒకటిగా ఉండలేక పోవడంతో 2014లో కేంద్రం విభజించి, తెలంగాణను ఏర్పాటు చేసింది. వింధ్య పర్వతాలకు దిగువన, అంటే దక్షిణ భారతంలో ఇప్పుడు ఓ బృందగానం వినిపిస్తోంది. అది ఢిల్లీ ఆధిపత్య «ధోరణికి నిరసనగా వినిపిస్తోంది. కేంద్రం రాష్ట్రాలను తోలుబొమ్మల మాదిరిగా ఆడించాలని చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ నెలలోనే విమర్శలు గుప్పించారు. సమాఖ్య వ్యవస్థ లక్షణాన్ని మరచి కేంద్రం రాష్ట్రాల మీద స్వారీ చేయాలని చూస్తోందని ఆయన తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు కూడా. అంతకు ముందు ఒక నెల క్రితం ఆయన కుమారుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు కూడా దక్షిణ భారత రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమం మీద కేంద్రానికి శ్రద్ధ లేదని ఆరోపించారు. ఢిల్లీ–ముంబై పారిశ్రామిక నడవా అభివృద్ధి పట్ల ఉన్న దృష్టి దక్షిణాది మీద లేదని ఆయన చెప్పారు. అదే సమయంలో కర్ణాటక నుంచి కూడా నిరసన గళం వినిపించింది. తీసుకునేది ఎక్కువ ఇచ్చేది తక్కువ భారతదేశం మొత్తం మీద వసూలవుతున్న పన్నులలో 9 శాతం కర్ణాటక నుంచి వెళుతున్నాయనీ, కానీ కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి అందుతున్నది మాత్రం 4.65 శాతమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆక్రోశం వెళ్లగక్కారు. ఇది ఆ మధ్య ఆయన తన ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్య. కాబట్టి వసూలవుతున్న పన్నులు మొత్తాన్ని బట్టి చూస్తే దేశంలో కర్ణాటక మూడో స్థానంలో ఉందని కూడా ఆయన చెబుతున్నారు. కర్ణాటక శాసనసభకు ఈ వేసవిలోనే ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక పట్ల చూపుతున్నట్టు చెబుతున్న ఈ వివక్ష ఆ ఎన్నికలలో ఒక కీలకాంశంగా మారుతుంది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ దాదాపుగా ఒక ప్రాంతీయ పార్టీ అవతారంలోనే, ఆ పార్టీ సామంతుడు సిద్ధరామయ్య నాయకత్వంలో పోరాడబోతున్న విషయం కూడా సుస్పష్టం. కాబట్టి ఇలాంటి అంశాలు ఓటర్లలో భావావేశాన్ని రేకెత్తిస్తాయని ఆ పార్టీ అంచనా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పన్ను రూపంలో ప్రతి ఒక్క రూపాయికి, తిరిగి 1.79 రూపాయలు పొందుతోందని కూడా కర్ణాటక కాంగ్రెస్ వాదిస్తోంది. ఆ రాష్ట్రంతో పోల్చి చూసినప్పుడు కర్ణాటక చెల్లించే ప్రతి రూపాయికీ తిరిగి పొందుతున్నది కేవలం 47 పైసలు. తమిళనాడు పరిస్థితి ఇంతకంటే కనాకష్టం. ఆ రాష్ట్రానికి దక్కుతున్నది కేవలం నలభయ్ పైసలు. ఇలాంటి ప్రశ్నలు సహజంగానే అభివృద్ధికి దక్కే ప్రతిఫలం ఇదా అన్న సందేహానికి తావిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కేంద్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా కేంద్రం వైఖరి మీద ఆమధ్య రుసురుసలాడినవారే. పార్టీల పరంగా చూస్తే కర్ణాటకలో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య అనివార్యం. కానీ ఈ పోటీని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకూ, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య పోటీ స్థాయికి దించాలని చూస్తున్నారు. బీజేపీని లక్ష్యం చేసుకోవడానికి ఇదొక వ్యూహం కూడా. అదెలాగంటే, దక్షిణాది దృష్టిలో బీజేపీ హిందీ ప్రాంతానికి చెందిన పార్టీ. అలాగే ఈ వాదన వింధ్య పర్వతాలకు ఆవల ఉన్న ఆ ప్రాంతం దక్షిణ ప్రాంత వనరులను దోచుకుపోతున్నదని కూడా ధ్వనింపచేస్తుంది. సినిమా రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన కమల్ హాసన్ మొన్న ఫిబ్రవరిలో మధురైలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఒక జెండాను కూడా ఆవిష్కరించారు. దాని మీద ఆరు చేతులు గొలుసుకట్టుగా ఒకదానిని ఒకటి పట్టుకున్నట్టు చిత్రించారు. ఇదే చాలామందికి ప్రశ్నార్థకమైంది. ఆ ఆరు చేతులు దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాలను ప్రతిబింబిస్తాయనీ, ఒక దానికొకటి బాసటగా కలసి ఉన్నాయనీ కమల్ వివరణ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలసి ఒక ప్రెషర్ గ్రూప్‌గా కలసి ఉండాలని చెప్పడానికి ఇది దృశ్యాత్మక అభివ్యక్తిగా భావించవచ్చు. విధాన నిర్ణయాలలో గానీ, కేంద్రం కల్పించే ఆర్థిక ప్రయోజనాల విషయంలో గానీ దక్షిణ భారతదేశాన్ని ఢిల్లీ గమనంలోకి తీసుకోవడం లేదు. ఈ అంశంలో పరిగణనలోనికి తీసుకోవలసిన విషయం ఇంకొకటి ఉంది. కమల్ పెరియార్ ద్రవిడ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఆ సిద్ధాంతంలోని చాలా కోణాలలో ద్రవిడనాడు ఆలోచన కూడా ఒకటి. ద్రవిడనాడు వాంఛించదగినదా? అంటూ గడచిన వారం ఈరోడ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎంకే నాయకుడు ఎంకె స్టాలిన్‌ను ఒకరు ప్రశ్నించారు. ‘అలాంటి ఒక డిమాండ్ వినిపిస్తే, అది స్వాగతించదగినదే. అలాంటి డిమాండ్ వస్తుందనే ఆ ఊహ కూడా’అని స్టాలిన్ చెప్పారు. అయితే ఆధునిక భారత దేశంలో ద్రవిడనాడు అనే భావనను దేశ వ్యతిరేకంగా విశ్లేషిస్తున్నారు. దీనితో స్టాలిన్ సమాధానం మీద కొంత రగడ చెలరేగింది. అయితే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం నుంచి పొందవలసి ఉన్న ప్రయోజనాల విషయంలో గళమెత్తాయి. ఆ క్రమంలో, ఆ రగడలో స్టాలిన్ ప్రకటన వివాదాల వరకు వెళ్లలేదు. అలాగే ఆ మరునాడే స్టాలిన్ కూడా, ద్రవిడనాడును తానే కోరినట్టు పత్రికలు తప్పుగా రాశాయని వివరణ ఇచ్చారు. కానీ తమిళనాడులో హిందీ వ్యతిరేకతకు తోడు ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యమన్న భావన మరింత బలంగా ఉంటుంది. ఈ మధ్యనే మైలురాళ్ల మీద హిందీ అక్షరాలు రాయడం గురించే అక్కడ పెద్ద ఎత్తున అలజడి రేగింది. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేరళలో పర్యటించినప్పుడు, వైద్య విధానం ఎలా ఉండాలో మా రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలంటూ ఇచ్చిన ఉపన్యాసం ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను కదిలించింది. ఎందుకంటే గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందుబాటులో లేకపోవడం వల్ల చిన్నారులు మరణించారు. అలాగే ఝాన్సీ ప్రభుత్వ వైద్యశాలలో తొలగించిన కాలునే దిండుగా చేసుకుని పడుకున్న ఉదంతం కూడా చోటు చేసుకుంది. అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వచ్చి మాట్లాడిన ఇలాంటి మాటలు కేరళలో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. నిజానికి కేరళలో సమస్యలు లేవని కాదు. కానీ ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించుకునే వెసులుబాటు అక్కడ ఉంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలని అనాలోచితమైనవిగా తీసుకోవాలా? లేకపోతే, ఇది దేశంలోని ఒక లోపంగా భావించాలా? అంతకు మించి, ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశానికి తక్కువ లోక్‌సభ స్థానాలు మిగులుతాయని, దీనర్ధం రాజకీయాధికారంలో దక్షిణాదిని పలచన చేయడమేనని రాజకీయ నాయకులు చెప్పే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ ఉత్తర, దక్షిణ భారత విభజన సోషల్ మీడియాలోనే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజాభిప్రాయానికి ఇదొక కొలబద్ద. కానీ దీనికి గొప్ప కచ్చితత్వం మాత్రం లేదు. రాజకీయ నాయకులు ఆ మనోభావాలను ఉపయోగించుకుంటున్నారు. అస్తిత్వం కార్డుతో రాష్ట్రాలు ప్రస్తుతం దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. కాబట్టి బీజేపీ జాతీయవాద రాజకీయ ఎత్తుగడను నిరోధించడానికి ఈ పార్టీల అధినేతలు తమ అస్తిత్వం కార్డును ప్రయోగించే అవకాశం ఉంది. కానీ ఇది పెద్దగా అనుకూలించకపోవచ్చు. కేంద్రం తనది పై చేయిగా ఉండడానికి ఉప ఖండంలో రాష్ట్రాల మధ్య ఉండే విభేదాలను ఉపయోగించుకుంటుంది. తెలుగు ప్రాంతమే ఒకటిగా ఉండలేక పోవడంతో 2014లో కేంద్రం విభజించి, తెలంగాణను ఏర్పాటు చేసింది. అలాగే కావేరీ జలాల గురించి తమిళనాడు, కర్ణాటక మధ్య విభేదాలు ఉన్నాయి. ముళ్ల పెరియార్ డ్యామ్ విషయంలో తమిళనాడుకు కేరళతో కూడా వివాదం ఉంది. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న ప్రశ్న ఏమిటంటే, దేశంలో భాగంగా ఉన్నప్పుడు ప్రాంతీయ అసమానతలను తొలగించుకోవలసిన బాధ్యత దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఉంది కదా! ఎందుకంటే, ఉత్తరాదికి కూడా సముద్రతీరం ఉంటే ఇక్కడి రాష్ట్రాలు కూడా దక్షిణాదితో సమంగా ఉండేవని వారు వాదించవచ్చు. మిగిలిన భారతదేశం మొత్తం నుంచి వలసలు జరగడం లేదా అంటూ అపహాస్యం చేసినా, బిహార్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలను అలా వెనుకబడిన ప్రాంతాలుగా మిగిల్చితే, దక్షిణ భారతదేశంతో పాటు, ముంబై వంటి నగరాలు కూడా వలసలకు కేంద్రాలవుతాయన్నది నిజం. కాబట్టి దక్షిణ భారతదేశం తన వాటాను పంచడంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దానితో ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది. ఇక ఈ అంశం గురించి ఇంత కలత ఎందుకంటే, ఈ విషయాన్ని శాంతిపూర్వకంగా పరిష్కరించే నాయకత్వం ప్రస్తుతం కేంద్రంలో లేదు. దక్షిణాదిన బీజేపీ అధికారంలో లేదు. కనుక ఈ ప్రాంతం అంటే ఆ పార్టీకి ఆఖరి ప్రాధాన్యతాంశంగానే ఉంటుంది. ఇదే ఆ ప్రాంతంలోని రాష్ట్రాలకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఉపఖండం ముక్కలు కావాలని ఎవరూ సలహా ఇవ్వడం లేదు. కానీ మనసులు విడిపోతే భవిష్యత్తులో జరిగే నష్టం అంతకంటే ఎక్కువే. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
సీపీఎం అడుగులు ఎటు?
పార్టీలో కాంగ్రెస్ పట్ల ప్రతికూల పవనాలు వీస్తున్న సంగతిని యేచూరి అప్పుడే గుర్తించి ఉండవలసింది. కాబట్టి కలకత్తా సమావేశాలలో జరిగిన పరిణామం రెండోసారి ఆయనకు ఎదురైన ఓటమి. ఒక సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో భారత రాజకీయాలలో సంభవించిన ఈ పరిణామం అర్థం ఏమిటి? బీజేపీని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్‌కు సీపీఎం లేదా వామపక్షం అండగా నిలబడగలదన్న భ్రమలలో మనం మిగిలిపోకూడదు. ఆ వాతావరణం లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గురించి ఏదైనా చెప్పడానికి ఉన్నదీ అంటే, అది– ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మిగిలి ఉంది అని చెప్పడమే. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం పనిచేస్తోందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే, సీపీఎం కలకత్తా సభలలో జరిగిన పరిణామం దేశంలోని మరే ఇతర రాజకీయ పార్టీలో అయినా చోటు చేసుకుకోగలదంటే నమ్మడం సాధ్యం కాదు. రాహుల్ గాంధీ, అమిత్‌షా, లేదంటే కె. చంద్రశేఖరరావు ఏదైనా ఒక రాజకీయ ప్రతిపాదన చేస్తే వారి నాయకత్వంలోని పార్టీల సభ్యులు దానిని ఓడిస్తారని మనం కలలో అయినా ఊహించగలమా? కలకత్తాలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగబోయే సమావేశానికి అజెండాను తయారు చేసి పెట్టిన సమావేశం ఇది. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో వ్యూహాత్మక అవగాహన కుదుర్చుకోవాలని ఆ పార్టీలో ఒక ప్రతిపాదన ఉంది. ఈ ఆలోచనకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మద్దతు ఉంది. కానీ ఇలాంటి ఆలోచనకు సీతారాం యేచూరి కంటే ముందు ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న ప్రకాశ్ కారత్‌తో పాటు, పార్టీ కేరళ శాఖ కూడా ప్రతిఘటించడం జరిగింది. దీని మీదే తీవ్ర స్థాయి చర్చ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఓటింగ్ పెట్టడంతో 31 ఓట్లతో సీతారాం యేచూరి ప్రతిపాదన వీగిపోయింది. ఆయన చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా 55 ఓట్లు వచ్చాయి. దీని అర్థం కాంగ్రెస్ చేయి, సీపీఎంకు అండగా ఉండదు. హైదరాబాద్ సభల నిర్ణయమే కీలకమా? అయితే హైదరాబాద్ సభలో తీసుకునే నిర్ణయమే అంతిమ నిర్ణయమవుతుం దని యేచూరి వర్గీయులు మాత్రం లోపాయికారీగా ఇప్పటికీ వాదిస్తున్నారు. ఈ వర్గంలో ఎక్కువగా బెంగాల్ శాఖ సభ్యులే ఉన్నారు. అలాగే ఫిబ్రవరిలో జరగబోయే త్రిపుర ఎన్నికల తరువాత పరిస్థితులు మారతాయని కూడా ఆశాజనకంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలలో బీజేపీ నాయకత్వంలోని కూటమి నుంచి సీపీఎం నాయకత్వంలోని కూటమి గట్టి పోటీని ఎదుర్కొం టున్నది. కానీ కేరళ పార్టీ శాఖ తన విధానాన్ని మార్చుకోదు. ఆ రాష్ట్ర పరిస్థితి అనే పట్టకం నుంచి చూసుకుని ప్రస్తుత విధానాన్నే కొనసాగిస్తుంది కూడా. ఆ రాష్ట్ర రాజకీయాలలో సీపీఎం నాయకత్వంలోని కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమితో తలపడుతుంది. కాబట్టి జాతీయ స్థాయి ఒప్పందం యోచనకు అంగీకరించదు. దీని వల్ల బీజేపీకి ప్రతిపక్ష స్థానం లభిస్తుందని సీపీఎం భయపడుతోంది. నిజానికి బీజేపీ కూడా అలాంటి అవకాశం కోసమే అక్కడ ఎదురుచూస్తున్నది. యేచూరి ప్రతిపాదనను ఓడించడానికి కారత్ శిబిరం 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మందుగుండులా ఉపయోగించుకుంది. ఆ ఎన్నికలలో బెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నాయి. అయితే సీపీఎం కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు లభించాయి. కారత్ చెప్పినది వాస్తవమని రుజవయిందని చెప్పడానికి ఆ ఎన్నికల ఫలితాలే ఉపయోగపడినట్టు కనిపిస్తున్నది. అప్పుడు కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు కారత్ వర్గం వ్యతిరేకించింది. ‘నేను ముందే చెప్పలేదూ!’ అన్న భావాన్ని గొంతు నిండా నింపుకుని ప్రకాశ్ కారత్ కలకత్తా సభలకు వచ్చారు. కాగా, పార్టీలో జరిగిన అత్యున్నత స్థాయి ఎన్నికలలో తన ప్రతిపాదన వీగిపోవడమంటే, పార్టీలో తన స్థానం ఎక్కడో యేచూరికి అవగతమయ్యేటట్టు చేసినట్టే. ఇంకా చెప్పాలంటే కేంద్ర కమిటీలోని 91 మంది సభ్యులలో మూడింట ఒక వంతు మంది మద్దతును మాత్రమే యేచూరి కూడగట్టగలరని కూడా వెల్లడయింది. ఇది సహజంగానే ఆయనను నిరాశకు గురి చేసి, రాజీనామాకు సిద్ధపడేటట్టు చేసింది. అయితే ఆయనను ఆ పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించడం లేదు. ఎందుకంటే పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఆయన నిష్క్రమణకు వీర మరణం స్థాయి దక్కకూడదని భావిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ సమావేశాల కంటే ముందే సీపీఎంలో చీలిక అవకాశాలను తోసిపుచ్చలేం. నిజానికి ఈ ఎన్నిక పార్టీలోని దోషాన్ని కూడా ఎత్తి చూపింది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తుకు కూడా అంగీకరించకుండా కేరళ శాఖ ఓటు వేసింది. ఇక బెంగాల్ శాఖలో అయితే ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన వారంతా యేచూరి ప్రతిపాదనకు మద్దతు పలికారు. దేశ రాజకీయ వ్యవస్థలో వేగంగా ప్రాధాన్యం కోల్పోతున్న పార్టీకి ఇది మంచిది కాదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం యేచూరికి ఇదే మొదటిసారి కాదు కూడా. రాజ్యసభ బరిలోకి యేచూరి దిగితే సీపీఎంకు తమ మద్దతు ఉంటుందని జూలై , 2017లో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఆయనను మూడోసారి కూడా ఎగువ సభకు పంపించడానికి సీపీఎం కేంద్ర కమిటీ నిరాకరించింది. ఎందుకంటే ఆ పార్టీలో ఎవరికీ రెండు పర్యాయాలకు మించి ఆ అవకాశం ఇవ్వరు. పార్టీ నిర్మాణం పని మీద యేచూరి మరింత సమయం కేటాయించవలసి ఉంది. చివరిగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం సీపీఎంకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇందులో చివరి కారణమే రాజకీయంగా చాలా ప్రాధాన్యం కలి గినది. పార్టీలో కాంగ్రెస్ పట్ల ప్రతికూల పవనాలు వీస్తున్న సంగతిని యేచూరి అప్పుడే గుర్తించి ఉండవలసింది. కాబట్టి కలకత్తా సమావేశాలలో జరిగిన పరిణామం రెండోసారి ఆయనకు ఎదురైన ఓటమి. ఒక సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో భారత రాజకీయాలలో సంభవించిన ఈ పరిణామం అర్థం ఏమిటి? వామపక్షాల ప్రభావం నిజంగా ఎంత? బీజేపీని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్‌కు సీపీఎం లేదా వామపక్షం అండగా నిలబడగలదన్న భ్రమలలో మనం మిగిలిపోకూడదు. ఆ వాతావరణం లేదు. నిజం చెప్పాలంటే వామపక్షం ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో కేవలం లెటర్‌హెడ్ పార్టీ స్థాయికి కుంచించుకుపోయింది. ఎన్నికలలో వరస అపజయాలు, వివిధ రాష్ట్రాలలోని ప్రధాన స్రవంతి పార్టీలకు తోక పార్టీలుగా వ్యవహరించడం కూడా ఆ పరిస్థితిని తెచ్చి పెట్టింది. తనకు సిద్ధాంతపరమైన గౌరవం ఉందని ఆ పార్టీ అభిప్రాయం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ – ఈ జాబితా ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఈ అన్ని రాష్ట్రాలలోను వామపక్షం రాజకీయ పక్షంగా ప్రాధాన్యం కోల్పోయింది. వీటితో పాటు తనను తాను ఆత్మ పరిశీలన చేసుకునే స్థితిలో కూడా వామపక్షం లేదు. ఇది కూడా ఒక వాస్తవమే. అమెరికాకు వ్యతిరేకంగా వారు ఇచ్చే సామ్రాజ్య వ్యతిరేక నినాదాలు 21వ శతాబ్దపు భారతదేశంలో చర్విత చర్వణంగా మాత్రమే ఉన్నాయి. అయితే కేంద్రంలోను, రాష్ట్రాలలోను బీజేపీ నుంచి ఎంతటి ప్రతికూలత ఎదురవుతున్నప్పటికీ వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో చురుకుగానే ఉన్నాయి. విశ్వవిద్యాలయాల స్థాయి రాజకీయాలకీ; కేంద్ర రాష్ట్ర స్థాయి రాజకీయాలకూ మధ్య వచ్చిన శూన్యాన్ని నింపడం ఎలాగో కూడా సీపీఎం ఆలోచించాలి. విశ్వవిద్యాలయాల స్థాయిలో మొదటిసారి ఓటు హక్కు విని యోగించుకుంటున్నవారిని సాధారణ ఎన్నికలలో తమ బలంగా ఎందుకు మలుచుకోలేకపోతున్నారు? ఇందుకు కారణం కొన్ని భ్రమలలో ఆ పార్టీ చిక్కుకుని ఉండడమే. బీజేపీని తన ప్రధాన శత్రువని సీపీఎం పేర్కొంటున్నది. అయినప్పటికీ, బీజేపీ కంటే తక్కువ శత్రువైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి అది సుముఖంగా లేదు. ప్రజా ప్రయోజనం కంటే అహంభావానిదే పై చేయి అయ్యేటట్టు చేస్తోందనడానికి ఇదే నిదర్శనం. వామపక్షం గళం బొత్తిగా కరవైపోతున్న కాలమిది. సాపేక్షంగా చూసినప్పుడు యేచూరి వంటి యువ నాయకుడి అవసరం ఇప్పుడు రాజ్యసభలో ఉందన్న వాస్తవాన్ని పార్టీ గుర్తించడం లేదు. పైగా నిబంధనలంటూ మంకు పట్టుకు పరిమితమైంది. కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు వామపక్షాలు తిరస్కరించడం అంటే అది విపక్ష కూటమి ఏర్పాటు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది క్షేత్రస్థాయిలో కాకపోవచ్చు. కానీ అవగాహనకు సంబంధించి ఎక్కువ ప్రభావం చూపుతుంది. కలకత్తా సభ తరువాత సీపీఎం నిర్ణయం మీద కొన్ని చతురోక్తులు ఇప్పటికే జనంలోకి వచ్చాయి కూడా. అక్కడ జరిగిన నిర్ణయం సీపీఎంలో బీజేపీ విజయమని ఆ చతురోక్తులు పేర్కొంటున్నాయి. ఇంకా పలువురు ఇది సీపీఎం పార్టీ చేసిన రెండవ చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానిస్తున్నారు. 1996లో జ్యోతిబసు ప్రధాని కావడానికి వచ్చిన అవకాశాన్ని కాలదన్నడం మొదటి చారిత్రక తప్పిదమని చెబుతూ ఉంటారు. ఆ రెండుచోట్ల మినహాయించినా... సీపీఎం నిర్ణయాన్ని గుడ్డిలో మెల్లగా భావించాలి. ముఖ్యంగా బెంగాల్ రాజకీయాల విషయంలో అయితే అదే నిజం. అక్కడ కాంగ్రెస్, వామపక్షాలు ఖాళీ చేసిన ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి దీటుగా నిలబడగలిగిన ప్రధాన వ్యతిరేక శక్తి. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలి. 2019 ఎన్నికలలో కలసి పోటీ చేయడానికి సోనియాగాంధీ, మమతా బెనర్జీల మధ్య ఉన్న స్నేహాన్ని ఉపయోగించాలి. సీట్ల సర్దుబాటు విషయంలో మమత కొన్ని చిక్కులు సృష్టించవచ్చు. కానీ రాహుల్ మాత్రం సీపీఎం చేసిన తప్పిదాన్ని పునరావృతం చేయరాదు. రాహుల్ ఢిల్లీలో ఉంటూ కలకత్తా పట్టకం నుంచి చూసి పరిస్థితులను అంచనా వేయరాదు. కేరళకు సంబంధించి ఢిల్లీలో దోస్తీ, కేరళలో కుస్తీ వంటి మాటలతో బీజేపీ ఎద్దేవా చేసే పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చుకోకూడదు. మరొక విపక్షంగానే భావిస్తూ అక్కడ కాంగ్రెస్ కూటమి పినరాయ్ విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్తో పోరాడగలదు. సీపీఎం, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగినా అక్కడ మూడో పక్షానికి స్థానానికి దొరకడమనేది అరుదని గతాన్ని చూస్తే తెలుస్తుంది. బీజేపీ పరిస్థితి అక్కడ అదే. తన ప్రతిపాదన గురించి సభ్యులకు అవగాహన కల్పించడానికి సీతారాం యేచూరికి ఇంకా రెండు మాసాల గడువు ఉంది. కేరళ, బెంగాల్‌లను మినహాయించి మిగిలిన చోట్ల కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి సీపీఎంకు కొంత అవకాశం ఉంది. కానీ దీనితో ప్రయోజనం తక్కువే. ఇలాంటి ప్రయత్నం మూడోసారి కూడా విఫలమైతే యేచూరికి రాజీనామా చేయడం తప్ప మరో దారి లేదు. ఎందుకంటే ఇలాంటి వాతావరణం పార్టీలో బలం లేని వాస్తవాన్ని ఏ నాయకుడికైనా అర్థమయ్యేటట్టు చేస్తుంది. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
కర, కమల సమరాంగణం
నవ కర్ణాటక పరివర్తన యాత్రలో యోగి దర్శనమిచ్చి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల గోదాను హనుమాన్, టిప్పుసుల్తాన్ల బరిగా మార్చేశారు. ఈ రాష్ట్రం నుంచి ప్రజలు కాంగ్రెస్‌ను కనుక పంపివేస్తే, ఇక టిప్పును తలుచుకునేవారే ఉండరని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో హనుమంతుడు, ఇతర మహర్షులు, గొప్ప ఆధ్యాత్మికవేత్తలను ఆరాధిస్తారే తప్ప, టిప్పును కాదని మీరు స్పష్టం చేస్తారని కూడా అన్నారు. కర్ణాటకలోనే హనుమంతుడు జన్మించాడన్న విశ్వాసం ఆధారంగా యోగి ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే పూర్వకాలంలో అయితే మైసూర్ రాజ్యం మీద అయోధ్య పాలకుల దండయాత్ర అని పేరు పెట్టొచ్చు. కానీ 2018 నాటి రాజకీయ పరిభాషలో అయితే మాటల యుద్ధం అంటే సరిపోతుంది. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరు ప్రాంతం వారే కూడా. ఆయనతో మాటల యుద్ధానికి తలపడినవారు యోగి ఆదిత్యనాథ్. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. గడచిన ఒక నెల నుంచి యోగి తనకున్న సమయాన్ని ఉత్తరప్రదేశ్, కర్ణాటకల కోసం సమంగా వెచ్చిస్తున్నారు. బీజేపీకి సంబంధించినంత వరకు కర్ణాటక కూడా గుజరాత్ మాదిరిగానే ప్రాణం నిలబడేటట్టు చేయగలిగేదేనని అనిపిస్తుంది. పశ్చిమ భారత్‌లోని గుజరాత్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తన పార్టీ బీజేపీ కోసం విశేషంగా ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోను ఆయన ఎన్నికల నగరాను మోగించినట్టే కనిపిస్తోంది. అక్కడ మరో ఐదు మాసాలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ ఎన్నికలలో యోగి ప్రచారం వల్ల పార్టీకి ఎంతో లబ్ధి చేకూరింది. కమలం పరిస్థితి గడ్డుగా ఉన్న నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన 35 సభలలో ఆయన పాల్గొన్నారు. వాటిలో 22 నియోజక వర్గాలు కమలం ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు కర్ణాటకలో గెలుపు కూడా బీజేపీకి కీలకమే. ఎందుకంటే దక్షిణాదిన అడుగు మోపడానికి ఆ పార్టీకి ప్రధాన ద్వారంలా పని చేస్తున్నది కర్ణాటకే. మరొక అంశం కూడా ఉంది. ఇప్పుడు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పాలనలో ఉన్న పెద్ద రాష్ట్రాలు రెండంటే రెండే. మొదటిది పంజాబ్, రెండోది కర్ణాటక. ఈ విషయం కూడా బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఉత్సాహపరుస్తూ, కచ్చితంగా గెలిచి తీరాలన్న కసిని పెంచుతోంది. యోగి వెంట కర్ణాటక కర్ణాటకలో యోగి పాల్గొన్న నవ కర్ణాటక పరివర్తన యాత్ర చిత్రాలను చూస్తే ఆయన నాయకత్వంలో నడవడం అనివార్యమన్నది స్పష్టమవుతుందని కర్ణాటక శాఖ నాయకులే అంగీకరిస్తున్నారు. ఆ చిత్రాలలో ఒకదాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వినమ్రంగా యోగి ముందు చేతులు జోడించి, కొంచెం ముందుకు వంగి కనిపిస్తారు. యోగి కటాక్ష వీక్షణాలతో కనిపిస్తారు. పార్టీ అధిష్టానం కరుణను పొందడానికి కూడా ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు కూడా అయిన యడ్యూరప్పకు ఇంతకు మించిన ప్రచారం మరొకటి దొరకదు. కానీ ప్రస్తుతం కథల ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతోనే అసలు సమస్య. కొన్ని మాసాల నుంచి ఆ సమస్య మొదలైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యర్థి బీజేపీని విమర్శించడానికి, ఇరుకున పెట్టడానికి వచ్చిన ఏ సదవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. లింగాయత్‌లకు హిందువేతరులన్న స్థాయి కల్పించాలన్న ప్రతిపాదనకు సిద్ధరామయ్య మద్దతు ఇచ్చారు. లింగాయత్‌లు కర్ణాటక జనాభాలో 17 శాతం ఉన్నారు. సంప్రదాయకంగా వీరు బీజేపీ మద్దతుదారులు. యడ్యూరప్ప కూడా ఆ వర్గానికి చెందిన ప్రముఖుడే. వీరికి రాష్ట్రంలో ఓబీసీ హోదా ఉంది. లింగాయత్‌లు 12వ శతాబ్దానికి చెందిన సంస్కర్త బసవేశ్వరుని సిద్ధాంతాలను పాటిస్తారు. బసవన్న అని అంతా పిలుచుకునే బసవేశ్వరుడు హిందూ సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడినవారు. ఆ క్రమంలోనే ప్రత్యేకమైన ఒక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అదే వీరశైవం. ఈ పరిణామమే లింగాయత్ శాఖ సంప్రదాయ హిందూ ధర్మానికి చెందినది కాదన్న వాదనకు దారి తీసింది. ఈ వాదనకే కాంగ్రెస్ మద్దతు చెబుతోంది. దీనితో ఆ వర్గంలో చీలిక వచ్చింది. ఇదే బీజేపీని ఇరకాటంలోకి నెడుతోంది. ఆ వర్గం ఓటుబ్యాంక్‌ను కోల్పోవడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. లింగాయత్‌లను హిందూయేతర శాఖగా గుర్తించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, సిద్ధరామయ్య ఆ విషయం గురించి మళ్లీ పట్టించుకోకపోయినా, ఆ వర్గానికి చెందిన కొన్ని ఓట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళతాయి. ప్రత్యేక మతశాఖగా గుర్తించాలన్న డిమాండ్‌కు వెనుక కొన్ని ఆర్థిక కోణాలు కూడా ఉన్నాయి. ఆ వర్గం నడుపుతున్న విద్యా సంస్థలకు మైనారిటీ హోదా లభిస్తుంది. రుణమాఫీ పేరుతో కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కులం ఆధారంగా సిద్ధరామయ్య వేసిన ఈ ఎత్తుకు పై ఎత్తు వేయాలని, మతం ఆధారంగా బీజేపీ కథనాలు ఆరంభించింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆదిత్యనాథ్ రంగ ప్రవేశం చేయడంతోనే వారి గెలుపునకు మత కథనం పాఠ్యాంశమయింది. స్థలపురాణాలతో సమరం నవ కర్ణాటక పరివర్తన యాత్రలో యోగి దర్శనమిచ్చి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల గోదాను హనుమాన్, టిప్పుసుల్తాన్ల బరిగా మార్చేశారు. ఈ రాష్ట్రం నుంచి ప్రజలు కాంగ్రెస్‌ను కనుక పంపివేస్తే, ఇక టిప్పును తలుచుకునేవారే ఉండరని యోగి అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో హనుమంతుడు, ఇతర మహర్షులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలను ఆరాధిస్తారే తప్ప, టిప్పు సుల్తాన్‌ను కాదని మీరు స్పష్టం చేస్తారని కూడా అన్నారు. ప్రస్తుతం కర్ణాటక అని పిలుచుకుంటున్న చోటే హనుమంతుడు జన్మించాడన్న విశ్వాసం ఆధారంగా యోగి ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒక సిద్ధాంతం ప్రకారం హంపీలో ఉండే ఆంజనేయ పర్వతం మీదే మారుతి జన్మించాడు. కర్ణాటక పశ్చిమ తీరంలోని గోకర్ణ పుణ్యక్షేత్రానికి దగ్గరగా ఉండే ఒక కొండ మీద ఉన్న గుహ ఆయన జన్మస్థలమని చెప్పే స్థల పురాణం కూడా ఉంది. అయితే అంజనీపుత్రుడి జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్పే కథలు కూడా వినిపిస్తాయి. మారుతి జన్మించిన గడ్డ మీద టిప్పు పేరుతో ఉత్సవాలు జరపడం ఏమి సబబని బీజేపీ ప్రశ్నిస్తోంది. టిప్పు మహమ్మదీయ పాలకుడని, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి తరం యోధులలో ఒకడు కూడా కాదని చెప్పడమే ఈ ప్రచారం లక్ష్యం. అలాగే టిప్పు ఉత్సవాలు జరపడం సమర్థనీయమేనని కాంగ్రెస్ చేత చెప్పించడం కూడా. తద్వారా ఆ పార్టీ ముస్లిం అనుకూల పార్టీ అని ముద్ర వేసి, హిందూ ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకోవడమే బీజేపీ వ్యూహం. అయితే ఉత్తరాదిన పనిచేసిన ఈ వ్యూహం వింధ్య పర్వతాలకు ఇవతల దక్షిణాదిన ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి. టిప్పు మీద కన్నడిగుల దృష్టి వేరు అయితే ఉత్తరాది నాయకత్వం అవలంబిస్తున్న ఈ తరహా వ్యూహంతో కర్ణాటక పార్టీ శాఖలోని వారంతా ఏకీభావం ఉన్నవారు కాదు. రాష్ట్ర బీజేపీ నేతలు ఎంత చెబుతున్నా కన్నడ ప్రాంత హిందువులు చాలామంది టిప్పును కరుడు గట్టిన మహమ్మదీయునిగా పరిగణించడం లేదు. పైగా మైసూర్ సింహంగానే చూస్తున్నారు. గుజరాత్లో వలెనే చర్చను ఎవరు మంచి హిందువు, లేదా ఎవరు పెద్ద హిందువు అన్న విషయం వరకు తెచ్చి పలచన చేశారు. ‘నా పేరేమిటి? సిద్ధరామ. నా పేరులోనే రాముడు ఉన్నాడు. మనం రామ జయంతి, హనుమత్ జయంతి జరుపుతాం. అలాగే టిప్పు జయంతి కూడా జరుపుతాం. అందరి జయంతులు మనం జరుపుకుంటాం’ అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి. అయితే సమీకరణలను మార్చే ఇలాంటి కథనం వల్ల కర్ణాటక కోస్తా తీరంలో బీజేపీకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతం బీజేపీకి కంచుకోట. ఈ పరిణామాలతో ఆ బలం మరింత పటిష్టమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎజెండా మర్మమేమిటో వివరించే ప్రయత్నం చేయకుండా యోగి ఆదిత్యనాథ్‌ను సోషల్ మీడియా కేంద్రంగా ఇరుకున పెట్టేందుకు చూస్తున్నది. దీనితో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆన్లైన్లో వ్యంగ్య విమర్శలు, చురకలు వేసుకుంటూ మాటల యుద్ధానికి దిగే పరిస్థితి ఏర్పడింది. ‘మీరు మా నుంచి నేర్చుకోవలసింది చాలానే ఉంది సార్! మీరు రాష్ట్రంలో ఉన్నప్పుడు మా ఇందిరా క్యాంటీన్‌ను, రేషన్ దుకాణాన్ని పరిశీలించండి. మీ రాష్ట్రంలో జరుగుతున్న ఆకలిచావులకు పరిష్కారం ఏమిటో అవి మీకు తెలిసేటట్టు చేస్తాయి’ అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఇందుకు, ‘మీ కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు, ముఖ్యంగా మీ హయాంలో చాలా ఎక్కువ జరిగాయని విన్నాను. మీరు వాటిని పట్టించుకోకుండా నిజాయితీపరులైన అధికారులను బదలీచేయడం మీద దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీ మిత్రులు సృష్టించిన విషాదాన్ని తుడిచిపెట్టడానికి కృషి చేస్తున్నాను’ అంటూ యోగి కూడా స్పందించారు. గుజరాత్ బాటలోనే ఎవరు నిజమైన హిందువు, ఎవరు పెద్ద హిందువు అన్న అంశం కూడా ముందుకు వచ్చింది. హిందువులు గోమాంసం తినరాదంటూ యోగి చెప్పడం గురించి కూడా సిద్ధరామయ్య స్పందించారు. ‘సిద్ధరామయ్య హిందువు కాలేరు. ఎందుకంటే ఆయన గోమాంస భక్షణ చేయవచ్చునని చెబుతారు. సిద్ధరామయ్య కనుక హిందువే అయితే ఆయన హిందుత్వ గురించి మాట్లాడితే ఆయన గోమాంస భక్షణ చేయకూడదు. గోవధను అనుమతించరాదు’ అని యోగి అన్నారు. ఇందుకు సిద్ధరామయ్య ఇలా చెప్పారు, ‘చాలామంది హిందువులు గోమాంసం తింటారు. నేను కూడా తినాలనుకుంటే తింటాను. గోమాంసం తినవద్దని నాకు చెప్పడానికి వారు ఎవరు? కానీ నేను తినను. ఎందుకంటే నాకు రుచించదు కాబట్టి తినను.’ ఈ ధోరణి నుంచి కర్ణాటక బీజేపీ ఎప్పుడు బయటపడుతుంది? యోగి ముందుకు తెస్తున్న చిన్న చిన్న అంశాల నుంచి ఎప్పుడు దృష్టి మళ్లించుకుంటుంది? రాష్ట్ర పార్టీ శాఖలో ఐక్యత లేదు. ఈసారి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పనే ప్రతిపాదిస్తున్నారు. కానీ, పార్టీ ఎంతో కీలకమని భావిస్తున్న వచ్చే ఎన్నికల సమరంలో నాయకులందరినీ కలుపుకుని పోగల సత్తా ఆయనకు ఉందా లేదా అన్నది ఇప్పటికీ సందేహమే. పార్టీలో పెద్ద తలలు లెక్కకు మించి ఉన్నాయి. ఎవరి ఆశలు, స్వప్రయోజనాలు వారివే. అయితే ఎన్నికలకు కాస్త ముందు అనంత్‌కుమార్ హెగ్డేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు యడ్యూరప్పలో అభద్రతాభావాన్ని కలగచేస్తున్నాయి. ఇందుకు కారణం ఉంది. వివాదాస్పద ప్రకటనలకు పేర్గాంచిన ఈ డాక్టరు పార్టీ ఆశయం మేరకే అలా వ్యహరిస్తున్నారు. కర్ణాటక ఎప్పుడూ రాజకీయ నాటకానికి ప్రసిద్ధి. ఒక విభజన అంకానికి ఈ వేసవి వేదిక కావచ్చు. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
అత్యుత్సాహం ఖరీదు ఒక ప్రాణం
జయలలిత అధికారంలో ఉండగా ఫుట్‌పాత్‌లపై హోర్డింగ్‌లను తొలగించినందుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై కేసు నమోదైంది. కోయంబత్తూర్‌లో హోర్డింగ్‌ల ఏర్పాటుపై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదు. మున్సిపల్ మంత్రి ఎస్పీ వేలుమణి స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించడం గమనార్హం. ఆ ప్రాంతంలో వేలుమణి బలమైన నాయకుడు కూడా. హోర్డింగ్ ఏర్పాటుకు ఆదేశించిన వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీని గురించి విపక్ష డీఎంకే మాత్రమే నిరసన ప్రకటిస్తున్నది. తమిళనాడు సీఎం ఇంతవరకూ నోరు విప్పలేదు. ‘రఘును ఎవరు చంపారు?’ తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక రోడ్డు మీద ఈ ప్రశ్న రాశారు. మొన్న శుక్రవారం ఉదయం రఘుపతి అనే ముప్పయ్ సంవత్సరాల యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రమాదానికి గురై మరణించిన చోటు సరిగ్గా అదే. కడుపు మంటతో, తీవ్ర నిరాశా నిస్పృహలకు గురైన ఇద్దరు అబ్బాయిలు చొరవ చేసి రోడ్డుకు అడ్డంగా ఆ అక్షరాలు రాశారు. ఇలాంటి దుర్ఘటన గురించి తమిళనాడు, కోయంబత్తూరు మరచి పోలేదని గుర్తు చేయడానికీ, దీని మీద సమాజంలో తగినంత కదలిక తెచ్చేందుకు ఆ అబ్బాయిలు ఇద్దరూ ఆ ప్రయత్నం చేశారు. అన్నాడీఎంకే అత్యుత్సాహం ముందు ఈ దుర్ఘటన గురించి తెలుసుకుందాం. అమెరికాలో ఉంటున్న రఘు భావి జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ వచ్చాడు. ఇదే సందర్భంలో కోయంబత్తూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పళని అనే పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి ఉదయాన్నే బయలుదేరాడు. మోటార్ బైక్ మీద మొదట బస్టాప్ దాకా వెళ్లాలని అనుకున్నాడు. అక్కడ నుంచి బస్సు మీద పళని వెళ్లాలని ఆయన ఆలోచన. అయితే ఒక లారీ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా తప్పు దారిలో రఘు మీదకు దూసుకు వచ్చింది. దానిని తప్పించుకోవడానికి రఘు అనివార్యంగా ఎడమ వైపునకు బైకును తిప్పవలసి వచ్చింది. కానీ ఆ దిశలోనే భారీ హోర్డింగులు వేలాడదీయడం కోసం పాతిపెట్టిన కర్రలు ఉన్నాయి. ఆ వేకువ చీకటిలో అతడు వాటిని గమనించుకోలేదు. డిసెంబర్ 3వ తేదీన జరిగే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎమ్జీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలలో హోర్డింగులు తగిలించడం కోసం వారం ముందే ఆ కర్రలను ఆ పార్టీ కార్యకర్తలు పాతిపెట్టారు. పనివాడు పందిరి వేస్తే పిచ్చుకలు కూలగొట్టాయన్న సామెత చందంగా ఏ మాత్రం పటిష్టంగా లేని ఆ కర్రల ఏర్పాటు అక్కడి రోడ్డును నలభై శాతం ఆక్రమించింది. పైగా రోడ్డు ఆక్రమణ గురించి వాహన చోదకులను హెచ్చరించే రిఫ్లక్టర్స్ వంటి ఎలాంటి సాధనాలను అక్కడ ఏర్పాటు చేయలేదు. ఈ కర్రలకే రఘు గుద్దుకుని రోడ్డు మీద పడిపోయాడు. అతడి మీద నుంచి లారీ వెళ్లిపోయింది. అసలు అక్కడ ఆ కర్రలను అలా పాతిపెట్టడమే చట్ట విరుద్ధమైతే, ఈ దుర్ఘటన పట్ల అన్నాడీఎంకే స్పందించిన తీరు మరింత వికృతంగా ఉంది. రఘు మద్యపానం మత్తులో వాహనాన్ని నడుపుతున్నాడని నమ్మించడానికి వారు ప్రయత్నించారు. మరికొందరైతే రఘు మీద నుంచి లారీ దూసుకుపోవడంతోనే మరణించాడు తప్ప, హోర్డింగ్ కర్రలకు, ఆ దుర్ఘటనకు ఎలాంటి సంబంధం లేదని దబాయిస్తున్నారు. అయితే అది ఆరు లేన్ల రహదారి. అనివార్యంగా రఘు బైకు తిప్పిన ఎడమ వైపున హోర్డింగ్ లేకుంటే అతడు సులభంగా తనవైపు దూసుకొచ్చిన లారీని తప్పించుకునేవాడనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. న్యాయం వైపు నిలిచినందుకు శిక్ష రఘు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మరికొందరు తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాదనలో కొంత హేతుబద్ధత ఉన్నా అన్నాడీఎంకే కార్యకర్తలు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చలేరు. దారుణ ఘటనకు బాధ్యులను గుర్తించి, శిక్షించాల్సిన కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తుంటే, తమ రాతలతో వ్యవస్థను నిలదీసిన యువకులనే పోలీసులు తీసుకుపోయి ప్రశ్నించడం గమనార్హం. ఆ అబ్బాయిలిద్దరికీ ఏమైనా రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా అని ఆరా తీసిన పోలీసులకు అలాంటిదేమీ లేదనే సమాచారం లభించింది. రాజకీయ హంగామా కోసం బహిరంగ ప్రదేశాలను, రహదారులను ఆక్రమించి ప్రచార ఆర్భాటాలతో రెచ్చిపోవడం అన్నా డీఎంకేకు అలవాటేననే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. డిసెంబర్ 2015లో జనరల్ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా చెన్నై నగరాన్ని ఆ పార్టీ హోర్డింగ్‌లతో ముంచెత్తింది. నగరంలోని పేవ్‌మెంట్స్‌ను సయితం ఆక్రమించుకున్నారు. పాదచారులకు ఇబ్బందికరంగా ఉన్న హోర్డింగ్‌లను తొలగించేందుకు ప్రయత్నించిన అరప్పోర్ ఇయకం(అవినీతిపై పోరాడే ఎన్జీవో) కార్యకర్తలను ఏఐఏడీఎంకే కార్యకర్తలు అడ్డుకుని దాడులకు దిగడం మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలో దాడికి దిగిన పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టి ముగ్గురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేసి చెన్నై సెంట్రల్ జైలుకు తరలించడం, పార్టీ కార్యకర్తలపై ఈగ వాలనీయకపోవడం విస్మయం కలిగించింది. ఇక జయలలిత అధికారంలో ఉండగా ఫుట్‌పాత్‌లపై హోర్డిం గ్లను తొలగించినందుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై కేసు నమోదైంది. కోయంబత్తూర్‌లో హోర్డింగ్‌ల ఏర్పాటుపై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదు. మున్సిపల్ మంత్రి ఎస్పీ వేలుమణి స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించడం గమనార్హం. ఆ ప్రాంతంలో వేలుమణి బలమైన నాయకుడు కూడా. హైకోర్టు ఆదేశాలు గాలికి! హోర్డింగ్ ఏర్పాటుకు ఆదేశించిన వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీని గురించి విపక్ష డీఎంకే మాత్రమే నిరసన ప్రకటిస్తున్నది. రాజకీయ పక్షాలు రాచరిక వ్యవస్థను తలపించేలా అహంభావపూరితంగా వ్యవహరించరాదని డీఎంకే స్పష్టం చేసింది. అయినా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఈ దారుణోదంతం గురించి ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జీవించి ఉన్న వ్యక్తుల కటౌట్లు ఏర్పాటు చేయరాదని నెల కిందట మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పళనిస్వామి, పన్నీర్‌సెల్వంల నిలువెత్తు కటౌట్ల స్థానంలో వారి రూపాలను ముద్రించిన పెద్ద పెద్ద బెలూన్లు ఆకాశమంతా దర్శనమిచ్చాయి. మంత్రికి వంత పాడుతున్న పోలీసులు రఘు దుర్మరణం పాలైన కొద్దిరోజుల్లోనే తేని జిల్లాలోనూ ఇటువంటి భారీ హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. ‘అడ్డంకిగా, ప్రమాదకరంగా’ ఉండే హోర్డింగులను ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నదని తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎం.కె. స్టాలిన్ ఆరోపించారు. ఇటీవలకాలంలోనే రాజకీయాలలోకి వచ్చినట్టు ప్రకటించిన ప్రముఖ చలనచిత్ర నటుడు కమల్‌హసన్ కూడా ఈ దుర్ఘటన గురించి ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ట్వీట్ చేశారు. ‘ఏ ప్రభుత్వమైనా సరే, జీవితాలను బలితీసుకుని అధికారాన్ని, కీర్తిని నిలబెట్టుకోవా లని అనుకుంటే, అలాంటి ప్రభుత్వం పతనం కాక తప్పదు’ అని కమల్‌హసన్ హెచ్చరించారు. కానీ ఈ విమర్శలు ఏవీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి మార్పును తీసుకురాలేదు. మున్సిపల్ పరిపాలనా వ్యవహారాల మంత్రి వేలుమణి కోయంబత్తూరులో రోడ్డు మీద పాతిన కర్రల వ్యవహారం చట్టవిరుద్ధమేమీ కాదని నిస్సంకోచంగా చెప్పారు. ఇందుకు సంబంధించి విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎదురుదాడికి కూడా దిగారు. కోయంబత్తూరు పోలీసులు కూడా మంత్రి వాదం వైపు మొగ్గు చూపుతున్నారు. లారీ వచ్చి డీకొనడం వల్లనే ఆ ప్రవాస భారతీయ ఇంజనీర్ మరణించాడని వారు కూడా చెప్పారు. పాలకవర్గం ధోరణి కేవలం ప్రజలపట్ల సానుభూతిరాహిత్యం, జవాబుదారీతనం లోపించిన వైనాన్నే ప్రతిబింబిస్తున్నది. ఒక నిర్లక్ష్యం ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వివాదంగా మిగిలిపోవడం ఆశ్చర్యకరం. రఘు విషాదం మీద ప్రజలలో నిరసన పెల్లుబుకుతోంది. ఈ విషాదం గురించి ప్రచారం చేసేందుకు, బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు ఒత్తిడి పెంచేలా ఛేంజ్.ఓఆర్జీలో పిటిషన్లపై ఉద్యమ స్ఫూర్తితో సంతకాలు జరుగుతున్నాయి. ఈ తరహా దారుణ ఘటనలకు చరమగీతం పాడాలని, రఘు వంటి అమాయకుల ప్రాణాలను ఇక తమిళనాడు త్యాగం చేయబోదనే గట్టి సందేశం బలంగా వినిపించాలనే ఆకాంక్ష తమిళనాడు రాష్ట్రమం తటా వ్యక్తమవుతోంది. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఈ ఎరుపేంటి?
క్రైమ్ కామెడీ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎరుపు’. వెంకట్‌కృష్ణ దర్శకత్వంలో సుధీర్, ప్రత్యూష జంటగా ‘ఓయ్’ చిత్ర దర్శకుడు ఆనంద్ రంగ, శేషారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హీరో సిద్ధార్థ్‌లు ట్విటర్ ద్వారా టీజర్‌ను, పాటలను విడుదల చేయనున్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సమర్పణ: అనిల్ - భాను, సహ నిర్మాతలు: తంబరి క్రియేషన్స్. -
ఐ హేట్ గర్ల్స్
'నాకు అమ్మాయిల మీద విరక్తి పుట్టింది.. నన్ను ఓ అమ్మయి మోసం చేసింది.. అమ్మాయిలంతా అంతే.. అమ్మాయిలను నమ్మకండి' అని గోడల మీద రాసి ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్ కే టీఆర్ కాలనీలోని ఎస్వీపీ రెసిడెన్స్‌లో సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గల్లా సుధీర్(21) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మోసం చేయడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి తన ఫ్లాట్‌లో పార్టీ చేసుకున్న అనంతరం సోమవారం తెల్లవారుజామున కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు స్నేహితులకు వీడ్కోలు పలికి ఇంట్లోని గోడలపై 'అమ్మాయిలను నమ్మకండి.. నన్ను ఓ అమ్మాయి మోసం చేసింది..' అని రాసి పెట్టాడు. సోమవారం ఫ్లాట్ తలుపు తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు తలుపులు పగ లగొట్టి చూడగా.. సుధీర్ అప్పటికే మృతిచెందాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యువులోనూ ఐదుగురికి పున ర్జన్మ
లబ్బీపేట: అవయవదానంపై నగర ప్రజల్లో చైతన్యం వచ్చింది. తమ బిడ్డలు ప్రాణాలు వదులుతున్నారని తెలిశాక, పుట్టెడు దుఖఃలోను మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారనే ఆత్మసంతృప్తితో అవయవాలు దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మొన్న మణికంఠ, నేడు సుధీర్ మృత్యువులోనూ తమ అవయవాలతో మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించారు. ఎనికేపాడుకు చెందిన ధనేకుల శివరామప్రసాద్, విజయలక్ష్మి ఇద్దరూ ప్రయివేటు ఉద్యోగులే. వారి పెద్దకుమారుడు సుధీర్ సరోజిని ఇంజినీరింగు కళాశాలలో ఈ ఏడాది మార్చిలో ఇంజినీరింగు పూర్తి చేశారు. చిన్నకుమారుడు సీఏ చేస్తున్నారు. సుధీర్ ఉద్యోగావకాశాల కోసం కంప్యూటర్ శిక్షణ పొందుతూ సర్టిఫికెట్ల కోసం ఈ నెల 21న కళాశాలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తొలుత ప్రభుత్వాస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సుధీర్ బ్రెయిన్‌డెత్‌కు గురయ్యాడని నిర్ధారిం చారు. కుమారుడిని మంచి ఇంజినీర్‌కు చూడాలనుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లారు. సుధీర్ ప్రాణాలను నిలిపే అవకాశం లేనందున అవయవదానం ద్వారానే మరో ఐదుగురికి పునర్జన్మను ఇవ్వవచ్చని అతని స్నేహితులు సలహా ఇవ్వడంతో తండ్రి శివరామ్‌ప్రసాద్ అంగీకరించారు. ఈ విషయంలో ఆంధ్రా హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమణమూర్తి కూడా చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని జీవన్‌దాన్ సంస్థకు సమాచారం తెలపడంతో వారి సూచన మేరకు ఆంధ్రా హాస్పిటల్లోనే సుధీర్ గుండె, ఊపిరి తిత్తులు, లివర్, కళ్లు, కిడ్నీలను సేకరించి వివిధ ప్రాంతాలకు తరలించారు. ఆస్పత్రి నుంచి ఆ అవయవాలను తరలిస్తుండగా, సన్నిహితులు, బంధువులు పూలు చిమ్ముతూ అంజలి ఘటించారు. సుధీర్ తరచూ రక్తదానంచేసే వాడని, అదే స్ఫూర్తితో ఐదుగురికి పునర్జన్మను ఇవ్వాలని అవయవాలు దానం చేశామని అతని తండ్రి శివరామప్రసాద్ తెలి పారు. మట్టిలో కలిసిపోయే కన్నా, మరో ఐదుగురికి పునర్జన్మను ఇస్తాయనే దానం చేశామని పేర్కొన్నారు. అవయవదానం చేసిన శివరామప్రసాద్, విజయలక్ష్మి దంపతులను ఆంధ్రా హాస్పిటల్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు, న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. -
ప్రాణభిక్ష పెట్టరూ..
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందిపడుతున్న తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు నర్మెట : ఇంజినీరింగ్ విద్యార్థి ఒకరు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆదుకునే వారికోసం ఎదురు చూస్తున్నాడు. కొడుకుకు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నర్మెట మండల కేంద్రానికి చెందిన దేవరకొండ భాగ్యలక్ష్మి-శంకరయ్య దంపతులకు ఒక్క కొడుకు, ఇద్దరు బిడ్డలు. మోచీ పనిచేసి బతికే వీరి కొడుకు దేవరకొండ సుధీర్ ఖమ్మం కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బిటెక్ చదువుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న కడుపునొప్పితో బాధపడడంతో వ రంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు హైదారాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు సుధీర్‌కు వివిధ పరీక్షలు నిర్వహించి బ్లడ్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యూరు. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం తమిళనాడులోని వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. వైద్యం కోసం రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. ఉన్న ఇంటిని అమ్మేశారు. ఇంకా రూ.24 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కూటికి గతి లేని తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ రోదిస్తున్నారు. ఏమిచేయూలో తెలియక తల్లడిల్లుతున్నారు. మానవతావాదులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బిడ్డను ఆదుకుని కొడుకుకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. సుధీర్‌కుమార్‌కు సాయం చేయాలనుకున్న వారు 09652383426 మొబైల్ నంబర్‌కు లేదా ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నెం.026110025051399లో డబ్బులు జమచేయూలని కోరుతున్నారు. -
నిజంగా కుందనపు బొమ్మే!
అందమైన పల్లెటూరి ప్రేమకథగా వర ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుందనపు బొమ్మ’. సుధీర్, చాందినీ చౌదరి జంటగా కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల మూడో వారంలో పాటలను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘స్వచ్ఛమైన తెలుగుదనం ఉట్టిపడే కథగా ఈ చిత్రాన్ని వర ముళ్లపూడి తెరకెక్కించారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇందులో కథానాయిక నిజంగా కుందనపు బొమ్మలాగానే ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మల్లాది సత్య శ్రీనివాస్, సహ నిర్మాతలు: నడింపల్లి నరసరాజు, జి.అనితాదేవి. -
టీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం
లింగాలఘణపురం : టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్ష పదవి తనకు రాలేదనే మనస్తాపంతో పటేల్గూడేనికి చెందిన ఆ పార్టీ నాయకుడు కాసర్ల సుధీర్ శనివారం ఆత్మహత్యకు యత్నిం చాడు. సీనియర్ కార్యకర్త అరుున తనకు టీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష పదవి తనకు రాకుండా కొందరు నాయకులు అడ్డుకున్నారంటూ పురుగుల మందు డబ్బాతో మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్దకు వచ్చాడు. గ్రహించిన మాజీ సర్పంచ్ సత్యనారాయణ , ఆయన బావ అక్కడికి చేరుకుని అతడికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. పురుగుల మం దు డబ్బా పట్టుకుని విగ్రహం వద్ద విలపిస్తుండ గా మహిళా విభాగం మాజీ మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి వచ్చి ఆయనను శాంత పరిచే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ఆయన బావ, బావమరిది వచ్చి బలవంతంగా పురుగుల మందు డబ్బాను సుధీర్ నుంచి లాక్కుని దూరంగా పారేశారు. అనంతరం ఆయనను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. కాగా, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుల నియామకం అనంతరం నేలపోగుల, చీటూరు, నాగారం గ్రామా ల్లో అధ్యక్ష పదవిని ఆశించిన నాయకులు నిరస న వ్యక్తం చేశారు. చీటూరులో ఎంపీటీసీ మధు ఆధ్వర్యంలో ఆరుగురు వార్డు సభ్యులు కలిసి ఐల లక్ష్మయ్యను, నాగారంలో సానికె కృష్ణను అధ్యక్షుడిగా నియమించాలని సంతకాలతో కూడిన ప్రతులను అధిష్టానానికి పంపారు.