విషాదం నింపిన ‘అనైతికం’
మంగళగిరి: ఓ వివాహిత, యువకుడు మధ్య ఏర్పడిన అనైతిక బంధం వారిని ఆత్మహత్యకు పురిగొల్పడంతోపాటు, రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఓ భర్తకు భార్యను...ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. వివాహేతర సంబంధం వదులుకోలేక యువకుడు, అతడిని వదిలి వుండలేని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళగిరి పట్టణంలో కలకలం రేపింది. సోమవారం ఉదయం మంగళగిరి ఓవర్‌బ్రిడ్జి దిగువన వివాహిత సృజన (36), సుధీర్ (32) అనే యువకుడు రైలు కింద పడి మృతి చెందారు.
* సుధీర్ విజయవాడ పటమటలోని ఓ మెడికల్ ట్రాన్స్‌లేట్ కార్యాలయంలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్నాడు.ై రెల్వే ఉద్యోగి అయిన తండ్రి కామినబోయిన ప్రసాద్‌తో కలసి విజయవాడ దేవినగర్ హోమ్‌లైన్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.
* కొటికలపూడి గ్రామానికి చెందిన కనకమేడల రఘు తన కుటుంబంతో గొల్లపూడిలో ఉంటూ ప్రింటింగ్ మెషిన్‌లకు మరమ్మతులు చేస్తుంటాడు. అతని భార్య సృజన ఐదేళ్లుగా సుధీర్ పనిచేస్తున్న కంపెనీలోనే ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తోంది.
* ఈ నేపథ్యంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. రఘుకు విషయం తెలియడంతో భార్య సృజనను కొంతకాలంగా హెచ్చరిస్తున్నాడు. మరో వైపు సుధీర్‌కు ఇంట్లో వివాహ సంబంధాలు చూస్తున్నారు. ఇదిలావుండగా, సోమవారం ఆఫీసుకు సెలవుకావడంతో సృజన, సుధీర్‌లు దూరప్రాంతానికి వెళ్లి సరదాగా గడపాలని ప్లాన్ చేసుకున్నారు.
* దీనిలో భాగంగానే ఆదివారం రాత్రి పదింటికి సృజన ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని గమనించి రఘు నిలదీయడంతో భార్యాభర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బయటకు వెళుతుండగా ప్రశ్నించిన భర్తకు ‘సుధీర్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్ చేశాడు..తనని ఇంటికి పంపి వస్తా’ అని చెప్పిన సృజన ఉరుకులాంటి పరుగుతో బయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై వెళ్లింది.
* అప్పటికే గొల్లపూడిలోని పెట్రోలు బం కు సమీపంలో కారుతో సిద్ధంగా సుధీర్‌తో కలిసి మంగళగిరి టీబీ శానిటోరియం వద్దకు చేరుకున్నారు. ఉదయం ఆరుగంటల వరకు అక్కడ ఉన్న సుధీర్, సృజనలు అకస్మాత్తుగా ఓవర్‌బ్రిడ్జి దిగువకు వెళ్లారు. విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
* సమాచారం అందడంతో పట్టణ సీఐ రావూరి సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ లభించిన పర్సు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరువైపు బంధువులు, స్నేహితులకు కబురు పంపారు. రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు రైల్వే హాస్పటల్‌కు తరలించారు.
* తన కుమారులను వదిలి వెళ్లిపోయిందంటూ సృజన భర్త రఘు భో రున విలపించారు. సృజనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఎని మిదో తరగతి, మరొకరు నాలుగో తరగతి చదువుతున్నారు. వివాహేతర సంబంధం వదులు కోలేక ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.