creation
-
మార్పు మనుగడ కోసమే...
జీవితంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులకు మనం ఏ విధంగా స్పందిస్తాం... వాటిని ఏ కోణంలో చూస్తామనే విషయం మీదే మన అభివృద్ధి, ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.. మనసు బాగోలేనపుడు చాలా విషయాలను మనం సమస్యలుగా చూస్తాం.. ప్రశాంతంగా ఉన్నపుడు అవే పరిస్థితులను సవాళ్లుగా భావిస్తాం. అందువల్ల మన అభివృద్ధి ఏదైనా అది మనం ఆయా సమస్యలను స్వీకరించే స్థితి మీదే ఆధార పడి ఉంటుంది..మనిషి జీవితం పూల పాన్పు కాదు.. అదేవిధంగా ముళ్ళ కిరీటం కూడా కాదు.. ఈప్రాథమిక సూత్రాన్ని అవలోకనం చేసుకుని మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును ఆహ్వానించినపుడే మన జన్మకు సార్ధకత లభిస్తుంది.. బతుకూ పండుతుంది. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు వెరుస్తూ, మార్పును ఆహ్వానించకపోతే అది మనలో ఆత్మన్యూనతను పెంచుతుంది. ఒక పనిలో విఫలమైనపుడు దానిలో ఎందుకు విఫలమయ్యామా... అని బుర్ర బద్దలు కొట్టుకుని మనసు పాడు చేసుకునే కన్నా, ఏం జరిగినా అది మన మంచికోసమేనని ఆత్మను సంతృప్తి చేసుకుంటే మనసు కుదుట పడుతుంది. ఆనందం సొంతమవుతుంది. జీవితంలో ఎదురయ్యే మార్పును ఎప్పటికప్పుడు ఆహ్వానించి, దానిని మన జీవితానికి సోపానాలుగా మార్చుకోవాలి తప్ప, ఆత్మన్యూనతతో కుంగి పోకూడదు.కనుక మార్పు అన్నది ఈ సృష్టిలో నిరంతరం జరిగే ఒకానొక సహజమైన ప్రక్రియ... పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మనలో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా సంఘపరంగా, ఆత్మపరంగా ఇంకా అనేకానేక కోణాలలో, అనేకానేక స్థితులలో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి... అనివార్యం గా ఇలా మనలో జరిగే ప్రతి ఒక్క మార్పునూ మనం అంగీకరించాలి.కురుక్షేత్ర సంగ్రామంలో తాను అస్త్ర సన్యాసం చేస్తానని అర్జునుడు చింతించినపుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు. మార్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, ఇది çసృష్టి ధర్మమని, మార్పును అంగీకరించినపుడే భవిష్యత్ నిర్దేశం కలుగుతుందని బోధించాడు. అలా శ్రీ కృష్ణభగవానుడి స్ఫూర్తితో అర్జునుడు యుద్ధం చేసి ధర్మ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించాడు.ప్రతి ఒక్కరూ మార్పును అంగీకరించాలి. ఆధునిక పోకడలకు అనుగుణంగా వేగంగా దూసుకువెళ్లాలి. ఉన్నతంగా ఎదగాలనే వారు.. మనతో మనం పోటీ పడాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. మార్పును అంగీకరించకపోతే, మన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంటుంది. కనుక మొదట్నుంచీ తల్లిదండ్రులు మార్పుకు అనుగుణంగా జీవితాలను మలచుకోవాలనే దృక్పథాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. వర్తమాన ప్రపంచానికి, పరిస్థితులకనుగుణంగా వారికి వారు నైపుణ్యాలు పెంచుకునే విధంగా ్రపోత్సహించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే హక్కును కూడా ఇవ్వాలి అలాగే, వారి వ్యక్తిత్వాలు, ్రపాధాన్యతలు, పరిమితులను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. కుటుంబాలు, పాఠశాలలు పిల్లల సామర్థ్యం, ఉత్సుకత, సృజనాత్మకత, అలవాట్లను పిల్లల భావి జీవితానికనుగుణంగా తీర్చిదిద్దినపుడు జీవితంలో వస్తున్న మార్పులను అంగీకరించే సామర్థ్యాన్ని ΄÷ంది, పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారన్న వాస్తవాన్ని గుర్తించి మసలుకోవాలి. దాసరి దుర్గాప్రసాద్ -
ప్రేమించు... జీవించు...
ఈ సృష్టి సమస్తం ప్రేమ మయం.. సృష్టిలో సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం చెబుతోంది. ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు ప్రేమ ఎంతో అవసరం. ప్రేమకు కొలతలు లేవు. తరతమ భేదాలు లేవు. అది అనంతమైనది. విశ్వవ్యాప్తమైనది.. మనిషి సంఘజీవి. ఏకాకిగా అతడు సంఘంలో ఎక్కువ కాలం ఉండలేడు. అతడు జీవించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ లేనిదే మనిషి జీవితం వ్యర్ధం. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాలు నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీయువకుల మధ్య ఉండే ప్రేమ.. కేవలం యువతీయువకులదే కాదు ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. సమస్త మానవాళిలో ఉన్న ప్రేమను అవగతం చేసుకుంటే అది మానవ జీవితానికి పరిపక్వతనిస్తుంది. ప్రేమ గురించి సంపూర్ణంగా తెలిసినవారే, దాన్ని ఆస్వాదిస్తారు. ఇతరులకు పంచగలుగుతారు. ప్రేమ మనిషిని దైవంగా మారుస్తుంది.. ఆ దైవత్వంతోనే మనిషి ఎలాంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు.. ప్రేమ గురించి , దాని శక్తి గురించి స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్త్ లాంటి ఎందరో మహనీయులు ఈ లోకానికి తెలియ చేశారు. ఈ క్రమంలో ప్రేమతత్వం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేశారు. ప్రేమలో నిర్భయత్వాన్ని, ఆనందాన్ని సాధించే మార్గాలను వారు ఈ లోకానికి అందించారు. అయితే ప్రేమ అనేది కేవలం మనుషుల మధ్యనే కాదు అది సమస్త జీవరాశుల మీదా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రకతి అంతా ప్రేమ మయంగా అందంగా, ఆహ్వాదంగా కనిపిస్తుంది. బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత ధర్మరాజుకు ఉంది. ఆయన స్వర్గానికి వెళ్ళే సమయంలో ఓ కుక్క అతని వెంట పడుతుంది. ఆ కుక్కను ప్రేమగా చూసిన ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి అంగీకరించడు. ఇలా చివరి క్షణంలో సైతం కుక్క మీద ప్రేమ కురిపించి మూగజీవాల పట్ల తన దయాగుణాన్ని చాటుకున్నాడు. సాక్షాత్తు శిరిడీ సాయి నాధుడు ఎప్పుడూ ప్రజలతో పాటు మూగ జీవాలను కూడా ఎంతగానో ప్రేమించేవారు. అలాగే రమణ మహర్షితో పాటు ఇంకా అనేక మంది యోగులు, మునులు, సిద్ధులు తమ ప్రేమను జంతు జీవాలపై కురిపించి విశ్వ మానవ ప్రేమను చాటుకున్నారు...ఇలా ఆపదలో ఉన్నవారిని, రోగ గ్రస్తులను మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను ప్రేమించిననాడే మానవ జీవితానికి పరిపక్వత సిద్ధిస్తుంది. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడుతుంది. జీవితంలో ప్రతి మనిషి తన స్నేహితులను, తల్లితండ్రులను, పిల్లలనూ ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే సుందరమైన నదులు, కొండలపై జారు జలపాతాలు, ఇసుకతో కూడిన ఎడారులు, ప్రకతి శోభ, చెట్టు చేమ, జంతువులు, పక్షుల, వింతగా కనిపించే మబ్బులు, మిణుకు మిణుకుమనే నక్షత్ర సముదాయం, రోదసి, అందం, సుందరం, బుజ్జి పాపాయి అమాయక నవ్వు, మనుషుల స్నేహం, అభిమానం, వీటి అన్నింటిలో కూడా ప్రేమ కనిపిస్తుంది. వికసిస్తుంది. ప్రేమ మనకు ప్రకృతి ఇచ్చిన వరం.మనిషి మౌలికంగా దైవస్వరూపుడని, శరీరంలో నివసించే ఆత్మే దైవమని అనేక మంది మహనీయులు సెలవిచ్చారు. జ్ఞానం పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత వికసిస్తుంది. అలా వికసించినపుడే అన్ని భేదాలు అంతరించి ప్రేమతత్వం సాధ్యపడుతుంది. ఏవిధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, మంచి మనసుతో మనం ఒకరి పట్ల చూపే నిస్వార్థమైన ఆదరణే ప్రేమ‘. ఇది ఒక ఉన్నతమైన, పవిత్రమైన, గొప్పదైన భావన.– దాసరి దుర్గాప్రసాద్ -
‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్‌తో పనిలేదు..!
రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫిడ్జ్. ఒకప్పుడూ అది అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడూ మధ్య తరగతి ఇళ్లల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ పేదవాళ్లకు మాత్రం ఇప్పటికీ అపురూపమైన వస్తువే. పైగా కొనాలంటే రూపాయి, రూపాయి పోగు చేసుకుని అప్పోసొప్పో చేసుకుని కొంటారు. పైగా దీన్ని వేసవిలోనే జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే..? దీనికి అయ్యే కరెంట్ బిల్లు కూడా ఎక్కువే. ఒకవేళ పాడైతే బాగు చేయించుకోవాలన్న కష్టమే. అలాంటి వాటికి చెక్‌పెట్టేలా ఎకో ప్రెండ్లీగా మట్టితో ఫ్రిడ్జ్‌ని ఆవిష్కరించారు గుజరాత్‌కి చెందిన డ భాయ్ ప్రజాపతి. ఎలా రూపొందించారంటే..‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్..ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్ అని పేరు పెట్టి, మార్కెట్లోకి తెచ్చాడు ,మన్సుఖ్ . ఈ ఫ్రిడ్జ్ కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి. ఇందులో 5 కిలోల కూరగాయలు, పండ్లను నిల్వ చేయవచ్చు. విద్యుత్ కోతలు తరచుగా ఉండే ప్రాంతాల్లో, మట్టి రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగిస్తున్నారు. మిట్టి కూల్లో పైన ఉన్న అరలో 2 లీటర్ల నీటిని పోయాలి. ఈ ఫ్రిజ్ బాష్పీభవన సూత్రాలపై పనిచేస్తుంది. దీనికి నిర్వహణ ఖర్చు కూడా ఉండదని కనగరాజ్ తెలిపారు.విద్యుత్ అవసరం లేదుసాధారణంగా విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఫ్రిడ్జ్‌లో ఉంచిన వస్తువులు తింటే కొంత అనారోగ్యానికి గురవుతారు. కాని మట్టితో తయారు చేసి.. సహజసిద్దంగా ఉండే మట్టితో తయారు చేసి ఈ మిట్టి కూల్ లోని వస్తువులు తింటే ఎలాంటి అనారోగ్యం రాదని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ మిట్టి కూల్ కు అత్యంత డిమాండ్ ఉంది. ఇందులో ఉంచిన ఆహార పదార్ధాల్లో రుచిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు మన్సుక్భాయ్ ప్రజాపతి.ప్రజాపతి నేపథ్యం..ప్రజాపతి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని మోర్బిలోని నిచ్చిమండల్ గ్రామంలో జన్మించాడు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి.. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసేవాడు. అతను చిన్నతనం నుంచి సాంప్రదాయక మట్టి వస్తువుల తయారీపై సమగ్రమైన పరిజ్ఞానం ఉంది. దీంతో 1988లో ప్రజాపతి రూ. 30,000 చెల్లించి మట్టి పలకల తయారీకి సంబంధించిన తన సొంత కర్మాగారాన్ని ప్రారంభించాడు. కానీ మట్టి చిప్పల మన్నిక గురించి అతనికి చాలా ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1990లో అతని కంపెనీ రిజిస్టర్ అయ్యింది.ఇక 2001లో మిట్టికూల్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయబడింది. ఆ తర్వాత 2002 నుంచి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేయడం మొదలు పెట్టారు. అదే ఏడాది GIANగా ప్రసిద్ధి చెందిన గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్‌వర్క్‌తో ప్రపంచానికి పరిచయమై.. ఈ మిట్టీకూల్ గురించి అందరికీ తెలియడం జరిగింది. ఇక బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిడ్జ్‌ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్‌లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు రూ. 8,500/అంతే!.(చదవండి: జపాన్ బుల్లెట్ రైలు తరాతని మార్చిన కింగ్‌ఫిషర్!) -
Niyamat Mehta: శిల్పకళకు తను ఒక ‘మెరుపుల మెరాకీ’
నియమత్ మెహతా దిల్లీలో ఏర్పాటు చేసిన ఫస్ట్ సోలో ఎగ్జిబిషన్ ‘మెరాకీ’కి మంచి స్పందన లభించింది. ‘మెరాకీ’ అనేది గ్రీకు పదం. దీని అర్థం మనసుతో చేయడం. ఈ ఎగ్జిబిషన్‌లోని 27 బ్రాంజ్, హైడ్రో రెసిన్ స్కల్ప్చర్లు కళాప్రియులను ఆకట్టుకున్నాయి. మన పౌరాణికాల నుంచి సాల్వడార్ డాలీ, లియోనార్డో డావిన్సీ, లియోనోరా కారింగ్టన్, ఎంఎఫ్ హుసేన్లాంటి మాస్టర్ల కళాఖండాల వరకు స్ఫూర్తి పొంది ఈ శిల్పాలకు రూపకల్పన చేసింది మెహతా. బీథోవెన్ సంగీతం, లార్డ్ బైరన్ పదాల ప్రభావం మెహతా శిల్పకళపై కనిపిస్తుంది. లండన్ నుంచి రోమ్ వరకు తాను చూసిన, పరవశించిన ఎన్నో ఆర్ట్ షోల ప్రభావం ఆమె కళాత్మక ప్రయాణాన్ని ప్రకాశవంతం చేశాయి. ఒక చిన్న శిల్పం తయారుచేయడానికి నెల అంతకుమించి సమయం తీసుకుంటుంది. ఎగ్జిబిషన్లో అత్యంత ఆకర్షణీయమైన ‘మిస్టర్ సినాట్రా’ శిల్పం రూపొందించడానికి ఆమెకు ఎనిమిది వారాలు పట్టింది. ఎరుపు రంగు జాకెట్‌తో కనిపించే ఈ శిల్పం పాత కాలం బ్రిటిష్ పబ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చిన వ్యక్తిలా కనిపిస్తుంది. ‘మన దేశంలో శిల్పకళకు అత్యంత ఆదరణ ఉంది’ అంటున్న నియమత్ శిల్పకళపై ఆసక్తి ఉన్నవారికి సలహాల రూపంలో తనవంతుగా సహాయం చేస్తోంది. View this post on Instagram A post shared by Niyamat Mehta (@niyamat_mehta) -
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్‌కుమార్. హైదరాబాద్‌కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్‌టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్‌లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్‌లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్‌ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్‌కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్‌పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్‌పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్‌లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్‌పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్‌పాత్‌ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్‌లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్‌పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్‌గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్‌తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్‌ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్‌లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్‌లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా..
యావత్తు సృష్టిని ఒక్క గంటలో తయారుచేయగలిగిన దేవుడు "స్త్రీ మూర్తిని" తయారుచేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడట ఎందుకో తెలుసా!.. మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక "స్త్రీ"ని సృష్టించడం మొదలు పెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు. "స్త్రీ" సృష్టి కోసం మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు ఇంతగా తలమునకలై పోవడం చూసిన దేవత అడిగింది. "స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?". అప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా అంటూ 'ఆమె శక్తి' గురించి చెప్పుకొచ్చాడు ఇలా.. శారీరీకంగా కోమలమైంది మానసికంగా.. ఇష్టాయీష్టాలకు అతీతంగా ఉండాలి. సృష్టి వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసుల వరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈజీవి ఎదుర్కోవాలో తెలుసా. ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా. ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు. రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే" అన్నాడు. "ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. "ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. ఆప్పుడు దేవుడు"ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమ, అనురాగాలను." అన్నాడు. "ఓహో ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు"ఎందుకాలోచించదు అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు." అన్నాడు. దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా ఏంటిది? " అని అడిగింది. ఆమె కన్నీటికి ఉన్న శక్తి అనంతం.. అప్పుడు దేవుడు "అదా కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం. పైగా మరో జీవీకి ప్రాణం పోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే." అని చెప్పింది. అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకూ తెలియనట్టే ఉంటుంది." అవసరమైనప్పుడు ఆ శక్తి ముందూ ఎవరూ నిలబడలేరు అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని. అందుకనే ఏమో} స్త్రీని పుడమితల్లితో పోల్చారు. (చదవండి: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు) -
వాట్ ఏ క్రియేషన్! కప్పులో దీపాలు!
కప్పులో టీ కామన్.. టీ కప్పులో తుఫాను.. ఒక ఎక్స్ప్రెషన్! టీ కప్పు దీపాలు.. ఇక్కడ విశేషం!! ఇప్పుడు ఇంటి అలంకరణలో ఈ టీ కప్పు దీపాలూ కాంతులీనుతున్నాయి! ఎలాగంటే.. మైనం రంగులు: టీ, కాఫీల్లో ఎన్ని రకాల రుచులు ఉంటాయో.. అన్ని రకాల రంగులు ఉంటాయి. ఆ థీమ్‌తోనే మైనాన్ని తీసుకొని, కొన్ని రంగులను జత కలిపి.. కప్పులో పోస్తున్నారు. వాటిలో వత్తి వేసి, అందంగా ముస్తాబు చేస్తున్నారు. సువాసనల దీపం: మైనం రంగుల ఎంపికలే కాదు.. వీటికి రకరకాల సువాసనలను జోడిస్తున్నారు. దీంతో ముచ్చటైన వెలుగులు.. ఆ వేడికి కరిగిపోతూ వెదజల్లే రోజ్, జాస్మిన్.. ఫ్లోరల్ పరిమాళాలనూ ఆఘ్రాణించవచ్చు. రీ యూజ్: కప్పులు పాత బడిపోయినా, పగుళ్లు బారినా వాటిని పడేస్తుంటాం. అభిరుచికి పదునుపెడితే పాత టీ కప్పులను మైనపు దీపాలుగా మార్చుకోవచ్చు. డిజైన్ బట్టి ధర: పింగాణీ కప్పుల ధర, ఎంపిక చేసుకున్న పరిమళాలు.. వెలుగులను బట్టి వీటి ధరలు వందల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెట్లోనూ కొనుక్కునే వీలుంది. (చదవండి: ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు) -
Aston University: వైరస్‌కు ప్రతి సృష్టి!
లండన్: మానవ చరిత్రలో తొలిసారిగా వైరస్‌కు కంప్యూటర్ సాయంతో యథాతథంగా ప్రతి సృష్టి చేశారు! గతంలోనూ ఇలాంటివి జరిగినా జీవపరంగా, 3డి నిర్మాణపరంగా, జన్యుపరంగా ఓ వైరస్‌ను అచ్చుగుద్దినట్టుగా పునర్నిర్మించడం ఇదే తొలిసారట! బ్రిటన్‌లోని ఆస్టన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ద్మిత్రీ నెరుక్ ఈ ఘనత సాధించారు! అత్యాధునిక సూపర్ కంప్యూటర్లు వాడినా కూడా ఈ పరిశోధనకు ఏకంగా మూడేళ్లు పట్టిందట! ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైరస్ నిర్మాణాలను క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ, కంప్యుటేషనల్ మోడలింగ్ సాయంతో పరిశీలించారు. ‘‘ఇంతకాలం పాటు వైరస్ల పూర్తి జన్యు నిర్మాణక్రమం అందుబాటులో లేని కారణంగా వాటి తాలూకు జీవక్రియలపై మనకు సంపూర్ణ అవగాహన లేదు. తాజా అధ్యయనం ఈ విషయంలో దారి చూపగలదు’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘అంతేగాక ఈ పరిశోధన వల్ల యాంటీబయాటిక్స్‌కు మెరుగైన, సమర్థమైన ప్రత్యామ్నాయాల దిశగా కొత్త దారి దొరుకుతుంది. యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియా సమస్యకూ పరిష్కారం లభిస్తుంది’’ అని వారంటున్నారు. ఈ అధ్యయనం ఫారడే డిస్కషన్స్ జర్నల్‌లో పబ్లిషైంది. -
నీలగిరులపై కురింజ రాగం
సృష్టిలో అరుదైనవీ, అపురూపమైనవీ కొన్ని ఉంటాయి. సృష్టికే అందాన్నిస్తాయవి. నీలగిరులపై కనిపించే నీలకురింజి పూలు అలాంటి అపురూపాలే!అత్యంత అరుదైన నీలకురింజి పూలు పన్నెండేళ్లకోసారి పూస్తాయి. కేరళ, తమిళనాడుల్లో నీలగిరుల పరిసరాల్లో నివసించే గిరిజనులకు ఈ పూలు కొండగుర్తులు.వీటి పూత ఆధారంగానే వారు తమ వయసును చెప్పుకొంటారు. బ్రిటిష్ హయాంలో తొలిసారిగా వీటిని 1838లో తెల్లదొరలు గుర్తించారు.పుష్కరకాలం పాటు మళ్లీ ఇవి కనిపించనే లేదు. తిరిగి 1850లో కనిపించాయి.అలా పన్నెండేళ్లకు ఒకసారి ఇవి పూస్తాయనే సంగతిని గుర్తించారు.ఈ ఏడాది కూడా నీలకురింజి పూలు నీలగిరులపై విరిశాయి. శరదృతువు ప్రారంభంలో కనిపించే పూలు కొద్ది రోజుల వ్యవధిలోనే రాలిపోతాయి. ఒకసారి రాలిపోయాక మళ్లీ పన్నెండేళ్లకుగాని కనిపించవు. ఈ అరుదైన పూలను కెమెరాలో బంధించడానికి ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ విశాల్‌విజయవాడ నుంచి కేరళలోని నీలగిరుల వరకుబైక్‌యాత్ర చేశారు. ఆయన కెమెరాకు చిక్కిన కొన్ని దృశ్యాలివి. -
వాటర్ బైక్..లీటర్‌కు 100 కి.మీ.మైలేజ్
-
ఓయ్... నిన్నే
హిట్టు... ఎస్వీకె సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన తొలి సినిమా ‘సోలో’ హిట్టు! నిర్మాతగా తొలి అడుగును విజయవంతంగా వేశారు. ‘సోలో’ తర్వాత వంశీకృష్ణ నిర్మించిన ‘నువ్వా–నేనా, ‘రారా.. కృష్ణయ్య’ సినిమాలూ హిట్టే! ముచ్చటగా మూడు హిట్స్ తర్వాత భరత్, సృష్టిలను హీరో హీరోయిన్లుగా, సత్య చల్లకోటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన సినిమా ‘ఓయ్.. నిన్నే’. ఈ నెల రెండో వారంలో పాటల్ని, నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రమిది. కుటుంబ విలువలు, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయి’’ అన్నారు వంశీకృష్ణ శ్రీనివాస్. తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేశ్, తులసి, ప్రగతి, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్, సంగీతం: శేఖర్ చంద్ర. -
నా దివ్యమహిమలు వర్ణింపశక్యం కావు
మామిడిపూడి ‘గీత’ విభూతి యోగం అర్జునుని ప్రార్థనను అంగీకరించి శ్రీకృష్ణ పరమాత్ముడు తన విభూతులను ఇలా చెబుతున్నాడు. ‘‘అర్జునా! నా దివ్యమహిమలు అనంతాలు. అవి వర్ణింపశక్యమైనవి కావు. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని మాత్రం వినిపిస్తాను. విను. సర్వభూతాలలోనూ ఉండే ఆత్మను నేనే. సమస్తభూతాల సృష్టి స్థితి లయములకు కారణభూతుడను నేనే. సర్వక్షేత్రములయందును క్షేత్రజ్ఞుడను నేనే. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత! (13-33) ఒక్క సూర్యుడు సమస్త లోకాన్ని ఎట్లా ప్రకాశింపజేస్తున్నాడో అట్లే నేను క్షేత్రజ్ఞుడనై ఎల్ల క్షేత్రాలను ప్రకాశింపజేస్తున్నాను. నా జ్యోతి పరంజ్యోతి. సూర్యచంద్రాదులను ప్రకాశింపజేస్తోంది. అర్జునా! సమస్త చరాచర భూతాల లోపల వెలుపల నేను నిండి ఉన్నాను. కానీ నా సూక్ష్మత్వ కారణం వల్ల నన్ను తెలుసుకోవడం సులభం కాదు. - కూర్పు: బాలు-శ్రీని -
అదే మన గొప్పతనం!
ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయంటుంది వేదం. ఈ జీవరాశులన్నింటినీ నాలుగు తరగతులుగా వర్గీకరించారు. జరాయుజములు-మావితోపుడతాయి: అండజములు-గుడ్డుబద్దలు కొట్టుకుని బయటికి వస్తాయి: స్వేదజములు-చెమటనుండి పుడతాయి..పేలవంటివి: ఉద్బుజములు-భూమిని చీల్చుకుని పైకి వస్తాయి..చెట్లవంటివి. ఈ నాలుగురకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల జన్మలు తిరిగి తిరిగి... అంటే పుట్టీ చచ్చీ, పుట్టీచచ్చీ... దాన్ని సంసార చక్రం అంటారు. అంటే-జనన మరణ చక్రమందు తిరుగుట అని. దీనికి అంతుండదు. శరీరం తీసుకోవడం...విడిచిపెట్టడం, తీసుకోవడం.. విడిచిపెట్టడం.. ఈ సంసార చక్ర పరిభ్రమణం తాపం అంటే వేడితో ఉంటుంది. ఎందుచేత ? అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికయిందేమీ కాదు. భాగవతంలో ’కపిలగీత’ చదివితే పుట్టుక ఇంత భయంకరంగా ఉంటుందా! అనిపిస్తుంది. శుక్రశ్రోణితములు కలిసిన దగ్గర్నుంచీ తల్లి కడుపులో బుడగగా ఆకృతి ఏర్పడి, తర్వాత ఆ పిండం పెరిగి పెద్దదై, మెల్లమెల్లగా అవయవాలు సమకూరిన తరువాత తలకిందకు, కాళ్లు పైకీ పెట్టి గర్భస్థమైన శిశువు పడి ఉన్నప్పుడు దానికి నాభిగొట్టం ద్వారా ఆహారం అంది చైతన్యాన్ని పొంది జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత సున్నితమైన క్రిములు కరిచేస్తుంటే, తొమ్మిదినెలలు అమ్మ కడుపులో కటిక చీకట్లో కొట్టుకుని కొట్టుకుని పరమేశ్వరుని ప్రార్థన చేసి ఆయన అనుగ్రహించి ప్రసూతివాయువు బయటికి తోసేస్తే అమ్మకడుపులోంచి బయటికి వచ్చి పడిపోతాడు. ఈ మనుష్యజన్మ ఎత్తడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో! ఆఖరికి చేసుకున్న పాపాలన్నీ చాలా భాగం తగ్గిపోయిన తర్వాత జన్మపరంపరలో పూర్తి చేసుకోవడానికి అవకాశమివ్వబడే చిట్టచివరి శరీరం-మనుష్య శరీరం. ఇదే మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం అంటారు శంకరులు. జననమరణాలు పోగొట్టుకునే అవకాశం ఒక్క మనుష్య శరీరానికి తప్ప మరే శరీరానికీ ఉండదు. దానితో ఒక్క మనుష్యుడు మాత్రమే కర్మానుష్ఠానం చేయగలడు. మనుష్యజన్మ వైశిష్ట్యాన్ని అంతసేపు చెప్పి చివరన ’కురుపుణ్య మహోరాత్రం’ అన్నాననుకోండి. అంటే మంచి కర్మలు చేయండి అన్నప్పుడు మనుష్య శరీరం కానప్పుడు అదెలా సాధ్యం? మనుష్య శరీరం కానిది కేవలం నమస్కారం కూడా చేయలేదు. రెండు చేతులు కలిపి -అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి తలమీద ఉంచి బుద్ధిస్థానాన్ని దానితో కలిపి పదకొండింటినీ భగవంతుని పాదాలవద్ద న్యాసం చేయడం నమస్కారం. ఇలా ఏ ఇతర ప్రాణీ చేయలేదు. అందుకే అలా కర్మలను చేయుటవలన భక్తితో జీర్ణించిన కారణంచేత ఈశ్వరుని అనుగ్రహం ఏదో ఒకనాటికి కలుగుతుంది, అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. అందుకే ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అంటారు శంకరాచార్యులు. అంటే మనుష్యుడు కూడా జంతువే. మనుష్యుడు జంతువెలా అవుతాడు? జంతువును సంస్కృతంలో ‘పశు’ అంటారు. పాశంచేత కట్టబడినది కాబట్టి పశువు అయింది. నాలుగు కాళ్ళు, రెండు కాళ్ళు ఉన్నవే కాదు, శాస్త్రంలో మనుష్యుడు కూడా జంతువుగానే పరిగణింపబడతాడు. ఎందుకంటే తత్త్వాన్నిబట్టి మనకు కూడా ఆ మూడూ ఉంటాయి. అందువల్ల మనల్ని కూడా పశువులు అని పిలుస్తారు. అయితే అలా అంటే మనం చిన్నబుచ్చుకుంటామేమోనని... శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అదేదో తనమీద పెట్టుకున్నారు.‘‘ఓ పరమేశ్వరా! నేను పశువుని. నీవు పశుపతివి.’’అన్నారు. మనకూ పశువుకులాగే ఒక శరీరం, మెడలో ఒక తాడు. ఆ తాడు కట్టడానికి ఒక రాయి. మెడలో తాడు అంటే కర్మపాశాలు. కర్మపాశాల చేత జన్మ అనే రాయికి కట్టబడతాడు. అలా కట్టబడి ఉంటాడు కనుక మనిషిని కూడా పశువు అని పిలుస్తారు. ఏ జంతువయినా పాశాలను విప్పుకుంటే... యజమానిపట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించిందని గుర్తు. కానీ మనుష్యుడి విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. సాధన చేత మనుష్యుడి తాళ్ళు తెగిపడిపోతాయి. అంటే ఇక మళ్ళీ పుట్టనటువంటి స్థితిని పొందాడని గుర్తు. ఇది మిగిలిన జంతువులకు, మనిషికి ఉండే తేడా. కర్మపాశాల ముడి విప్పడం కాదు. కర్మపాశాన్ని పరమేశ్వరుడు తెంచేస్తాడు. అందుకే భగవంతుని స్వరూపాలన్నింటిలో ఏదో ఒక చేతిలో గొడ్డలి లేదా కత్తి కనిపిస్తుంది. దానితో కర్మపాశాలను తెంపి, భక్తి పాశం వేసి ఆయన తన దగ్గరకు లాక్కుంటాడు. తన పాదపంజరంలో కూర్చోబెట్టుకుంటాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరంలేని స్థితి కల్పిస్తాడు. ఇంత అదృష్టం ఒక్క మనుష్య శరీరానికే సాధ్యం. అందుకే శంకరుల వారు’ జంతూనాం నరజన్మ దుర్లభం’ అన్నది. -
నేడు కొత్త జిల్లాల ఏర్పాటుపై మరోసారి చర్చ
-
విశ్వమంతా ఆత్మజ్యోతి ప్రకాశమే
అంగిరసుడు శౌనకునికి బ్రహ్మవిద్యను ఇలా కొనసాగిస్తున్నాడు. శౌనకా! నేను చెప్పేది నిత్యసత్యం. బాగా మండే మంటల్లో నుంచి వేల సంఖ్యల్లో నిప్పురవ్వలు పుట్టినట్టు అక్షరపరబ్రహ్మం నుంచి సాకారమైన అనేకజీవులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తాయి. మళ్లీ అక్కడే లీనమవుతాయి. దివ్యమూ, రూపరహితమూ. అతిప్రాచీనమూ, లోపలా బయటా ఉన్నదీ, పుట్టుకలేనిదీ, ప్రాణం లేనిదీ, మనస్సు లేనిదీ, స్వచ్ఛమైనదీ, నాశనం లేనిదీ, సృష్టి అంతటికీ అవతల ఉండేదే పరబ్రహ్మం. దానినుంచి ప్రాణం, మనస్సు, అగ్ని, ఇంద్రియాలు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, విశ్వాధారమైన భూమి(పంచభూతాలు) ఏర్పడుతున్నాయి. పరబ్రహ్మమే అగ్ని శిరస్సు. చంద్రసూర్యులు నేత్రాలు. దిక్కులు చెవులు. తెరిచి ఉంచిన వేదాలు నోరు. వాయువు ప్రాణం. విశ్వం హృదయం. పరబ్రహ్మ పాదాలనుంచే భూమి ఏర్పడుతోంది. అన్ని ప్రాణుల్లో ఉండే అంతరాత్మ పరబ్రహ్మమే! దానినుంచి అగ్ని పుట్టింది. అది వెలగటానికి సూర్యుడు సమిధ అవుతున్నాడు. చంద్రుణ్ణించి మేఘాలు, భూమినుంచి ఓషధులు జన్మిస్తున్నాయి. పురుషుడు ఆ ఓషధులను తినటం ద్వారా ఏర్పడిన వీర్యాన్ని స్త్రీయందు నిక్షేపించ గా, అసంఖ్యాకంగా జీవులు పుడుతున్నాయి. ఇవన్నీ పరబ్రహ్మం నుంచే ఆవిర్భవిస్తున్నాయి. దానినుంచే ఋక్కులు, సామ, యజుర్వేదాలు, యజ్ఞదీక్షలు, క్రతువులు, దక్షిణలు, సంవత్సరం, యజమానుడు (యజ్ఞం చేసేవాడు) సూర్యచంద్రులు ప్రకాశించే లోకాలు పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మం నుంచే దేవతలు, అనేకరూపాల సాధ్యులు, మనుష్యులు, పశువులు, పక్షులు, ప్రాణ, అపానవాయువులు, వరి, గోధుమ వంటి ధాన్యాలు, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్య విధులు ఏర్పడుతున్నాయి. దానిలోనుంచే ఏడుప్రాణాలు, ఏడు అగ్నులు, సమిధలు, ఏడు హోమాలు, ఏడులోకాలు, గుండెగుహలో ఉండే ప్రాణాలు అన్నీ ఏడు ఏడుగా సృష్టింపబడుతున్నాయి. ఆ పరమాత్మ నుంచే సముద్రాలు, కొండలు, అన్ని నదులూ, అన్ని ఓషధులూ, పంచభూతాలతో ఏర్పడే శరీరాన్ని పోషించే రసమూ, మూలికలూ అన్నీ వస్తున్నాయి. పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతమ్ ఏ తద్యో వేద నిహితం గుహాయాం సో విద్యాగ్రంథం వికి ర తీహసౌమ్య నాయనా! ఈ విశ్వం, కర్మలు, తపస్సు అన్నీ అమృత స్వరూపమైన పరబ్రహ్మమే. దీనిని ఎవరు తెలసుకుంటారో వారి హృదయంలో ఉండే అవిద్య, అజ్ఞానం అనే ముడి విడిపోతుంది. శౌనకా! అంతటా ప్రత్యక్షస్థితి కలిగినదై, సన్నిహితమై, హృదయమనే గుహలో ఉండే పరబ్రహ్మానికి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. కదిలేది, ఊపిరి పీల్చేది, కనురెప్పలు ఆర్పేది, ఆర్పనిది ఏ జీవి అయినా పరబ్రహ్మలోనివే అది కంటికి కనపడే, కనపడని వాటన్నింటికంటే శ్రేష్ఠం. మానవ విజ్ఞానానికి అందనంత గొప్పది. మహాకాంతిమంతం, అణువుకన్నా పరమాణువు, అన్ని లోకాలు, వాటిలో ప్రాణులు తానే అయినది అక్షర పరబ్రహ్మం. అదే ప్రాణం. వాక్కు, మనస్సు, సత్యం, అమృతం. తెలియవలసినది, తెలుసుకోవలసిందీ అదే. సౌమ్యా! తెలుసుకో. లక్ష్యాన్ని సాధించు. ఉపనిషత్ విజ్ఞానమనే ధనుస్సు తీసుకుని, ఉపాసన అనే బాణాన్ని సంధించు. ఎటూ చెదరని ఏకాగ్రమైన మనస్సుతో ఆ వింటి త్రాటిని చెవిదాకా లాగు. అక్షరమైన పరబ్రహ్మాన్నే లక్ష్యంగా ఎంచుకో. ఓంకారమే ధనుస్సు. బాణం ఆత్మ. పరబ్రహ్మమే లక్ష్యం. అప్రమత్తతతో గురిచూసి కొట్టాలి. బాణంలాగా నువ్వు దానిలోకి ప్రవేశించాలి. ఆకాశం, భూమి, అంతరిక్షం, మనస్సు, పంచప్రాణాలు అన్నీ అల్లుకున్న కేంద్రమే ఆత్మ అని తెలుసుకో. అనవ సరమైన మాటలు విడిచిపెట్టు. చావుపుట్టుకలనే రెండు గట్టులను కలిపే అమృతమనే వంతెన ఇదే. రథచక్రంలోని ఆకులన్నిటికీ ఇరుసు కేంద్రమైనట్టు నాడులన్నీ కూడిన హృదయంలో ఆత్మ ఉంటుంది. ఓంకారధ్యానంతో అది తెలుస్తుంది. చీకటికి అవతలి వెలుగు కనిపిస్తుంది. సర్వజ్ఞుడూ, సర్వవేత్త అయిన పరబ్రహ్మమే సర్వవ్యాప్తం. హృదయాకాశంలోని వెలుగు అనే బ్రహ్మపురంలో పరమాత్మ ప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు మనస్సంతా నిండి ఉంటాడు. ప్రాణ, శరీరాలను నడిపిస్తాడు. ఈ విజ్ఞానంతో ధీరులు అమృతమైన ఆనందరూపమైన పరమాత్మను చూడగలుగుతున్నారు. వారిలోని అజ్ఞానం తొలగిపోతోంది. కర్మలన్నీ తగ్గిపోతున్నాయి. ఆ బంగారు గుహలో వెలిగే పరబ్రహ్మ నిర్మలుడు, నిర్గుణుడూ, వెలుగులకు వెలుగు, పరమపవిత్రుడు. అతనేనని ఆత్మవేత్తలు తెలుసుకోగలరు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు, తారలు, మెరుపులు ఏవీ వెలగవు. అగ్ని అసలు ఉండదు. ఆ పరమాత్మ వెలుగులోనుంచి ఇవన్నీ కాంతిని పొంది ప్రకాశిస్తాయి. విశ్వమంతా ఆత్మజ్యోతిప్రకాశమే. శౌనకా! ఈ విశ్వమంతా శాశ్వత పరబ్రహ్మమే. ముందు, వెనక, కుడిపక్క, ఎడమపక్క, కింద, పైన, అంతటా పరబ్రహ్మమే వ్యాపించి ఉంది. అదే అత్యున్నతం. అథశ్చోర్థ్యం చ ప్రసృతం బ్రహ్మైదం విశ్వమిదం వరిష్ఠమ్ఇలా అంగిరసుడు శౌనకునికి ద్వితీయ ముండకం ప్రథమ ఖండంలో సాకారంగా, ద్వితీయ ఖండంలో సర్వవ్యాప్తంగా ఉన్న పరబ్రహ్మాన్ని బోధించాడు. తృతీయ ముండకం రెండు ఖండాల్లో మరింత లోతుగా సాగే ఈ విశ్లేషణను వచ్చే వారం తెలుసుకుందాం. - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఉపనిషత్ విజ్ఞానమనే ధనుస్సు తీసుకుని, ఉపాసన అనే బాణాన్ని సంధించు. ఎటూ చెదరని ఏకాగ్రమైన మనస్సుతో ఆ వింటి త్రాటిని చెవిదాకా లాగు. అక్షరమైన పరబ్రహ్మాన్నే లక్ష్యంగా ఎంచుకో. ఓంకారమే ధనుస్సు. బాణం ఆత్మ. పరబ్రహ్మమే లక్ష్యం. అప్రమత్తతతో గురిచూసి కొట్టాలి. బాణంలాగా నువ్వు దానిలోకి ప్రవేశించాలి. ఆకాశం, భూమి, అంతరిక్షం, మనస్సు, పంచప్రాణాలు అన్నీ అల్లుకున్న కేంద్రమే ఆత్మ అని తెలుసుకో. అనవ సరమైన మాటలు విడిచిపెట్టు. చావుపుట్టుకలనే రెండు గట్టులను కలిపే అమృతమనే వంతెన ఇదే. -
జాతీయ జెండా ఏర్పాటులో రికార్డు
20 రోజుల్లో దేశంలోనే అత్యంత ‘ఎత్తై’ జెండా సిద్ధం జూన్ 2న ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి ‘ఎత్తయిన’ జాతీయ పతాకాన్ని తయారు చేయడంలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 20 రోజుల్లో అత్యంత ‘ఎత్తై’ జెండాను సిద్ధం చేసింది. గతంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. ఈ జెండా తయారీకి రెండు నెలలు పట్టిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ఎత్తయిన పోల్, పెద్ద జెండా తెలంగాణలో ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 303 అడుగుల ఎత్తున ఈ జెండా ఏర్పాటు చేసే బాధ్యతను కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. మొత్తం 14 విడి భాగాలుగా ఈ జెండా పోల్‌ను తయారు చేశారు. అయితే పౌర విమానయాన శాఖ అభ్యంతరం తెలపడంతో జెండా ఎత్తు తగ్గించనున్నట్లు తెలిసింది. దీంతో 299 అడుగులు లేదా 300 అడుగుల ఎత్తున జెండాను ఏర్పాటు చేస్తారు. దేశంలో ఇదే ‘ఎత్తై’ జెండా కావటంతో మరో అరుదైన రికార్డును తెలం గాణ సొంతం చేసుకోనుంది. జూన్ 2న ఉదయం 9.45 గం.కు సంజీవయ్య పార్క్‌లో సీఎం ఈ జెండాను ఆవిష్కరించనున్నారు. -
కృపాచార్యుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 17 శరద్వంతుడనే గౌతమ వంశీయుడు తపస్సుతో ధనుర్వేదాన్ని నేర్చుకొన్నాడు. కొంతమంది చదువు అంటకపోయినా, ఆటల్లోనో నటనలోనో ఇతర కళల్లోనో రాణించినట్టుగా ఈ గౌతముడికి వేదా భ్యాసమంటే గిట్టేది కాదు గానీ, విలువిద్య అంటే మహాపిచ్చి ఉండేది. తపస్సుతోనే ఆ ధనుర్విద్యలో పారంగతుడయ్యాడు. తపస్సంటే ఇంద్రియాల స్వేచ్ఛను అపహరించడమే; వాటిని అదుపులో పెట్టడమే. ఇంద్రియాలకు రాజు మనస్సు. మనస్సు రెండు రకాలుగా ఉంటుంది: ఇంద్రియ సంబంధమైనది ఒకటి; రెండోది దివ్యమైనది. పురాణాల్లో కనిపించే ఇంద్రుడు మొదటి రకం మనస్సు, తపస్సును భ్రష్టుపట్టిద్దామన్న యావతో తన ఇంద్రియ రాజ పదవికి ముప్పు రాకుండా చూసుకొనే కరడుగట్టిన స్వార్థం లాగ అనిపిస్తుంది గానీ నిజానికి అది పెట్టేది ఒక గడ్డు పరీక్ష; వేదంలో అవుపించే ఇంద్రుడు రెండో రకం మనస్సు, సాక్షిభూతమూ కూటస్థమూ ధ్రువమూ స్థిరమూ అయిన విజ్ఞానం. మొదటి మనస్సు మానుషమైనదిగా అనిపిస్తుంది; రెండోది దివ్యమైనది. మానుషమైన మనస్సుకు ఏ తపస్సైనా కంటగింపే. ఆ మనస్సు అప్సరసల్ని పంపించి తపస్సును పాడు చేద్దామని చూస్తుంది. ‘ప్సా’ అనే క్రియకు తినడం, అంటే, అనుభవించడం అని అర్థం. ‘అప్సా’ అంటే, అందుచేత, ‘తినకూడనిదీ’, ‘అనుభవించకూడనిదీ’ అని అర్థం. అనుభవించకూడని రసమే ‘అప్సరస’. ఈ అనుభవించకూడని రసమేమిటి? అప్సరసలు ‘అప్సు’, అంటే, నీళ్లల్లోంచి పుట్టారని పురాణాలు ఒక కథను చెబుతాయి. అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు విషమూ లక్ష్మీ చంద్రుడూ ఐరావతమూ ఉచ్చైశ్శ్రవమూ మొదలైనవాటితో సహా అప్సరసలు పుట్టుకొచ్చారని ఆ కథ చెబుతుంది. అమృతం కోసం ప్రయత్నించేవాళ్లకు పైన చెప్పినవన్నీ అడ్డులే. నీళ్లు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. అచ్చూ మచ్చూ అలాగే ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా ప్రవహించేవి కర్మలు. ఒక పని తరవాత మరో పని వరసగా మీదకు దాడి చేస్తూన్న ట్టుగా వస్తూనే ఉంటుంది ఆపుదల లేకుండా. సంస్కృతంలో ‘అప్పు’లంటే నీళ్లనీ కర్మలనీ రెండు అర్థాలూ ఉన్నాయి. ఇంతకీ అప్సరసలంటే, ఇప్పుడు తేలిం దేమిటంటే, అనుభవించకూడని కర్మఫల రసాలని. కర్మఫలాలను అనుభవించాలని ఉవ్విళ్లూరితే ఎడతెగని బంధాలనే అప్పుల్లో పీకలదాకా మునిగిపోతాం: జన్మమీద జన్మ పోటీపడ్డట్టుగా ఎడతెరిపి లేకుండా అవశంగా వస్తూనే ఉంటుంది. మనస్సును అదుపులో పెట్టుకొని, తపస్సు చేద్దామని చూసే ప్రతి సాధక రుషికీ ఆ మనస్సే ‘అప్సరసల’ను ఎరగా చూపిస్తూ ఉంటుంది. పురాణాల్లో చెప్పిన ఇటువంటి రుషులందరూ మార్కండేయుడిలాగ అసలు లొంగ కుండానో ఇప్పటి గౌతముడిలాగ తాత్కాలికంగానో కొంతమంది విశ్వామిత్రుడిలాగ చాలాకాలం పాటో లొంగి, పాట్లను పడుతూ ఉంటారు. ఇక్కడ గౌతముణ్ని ఊరిద్దామని వచ్చిన దివ్యకన్య పేరు ‘జానపది’: ‘జానం’ అంటే పుట్టుక. పుట్టుకకు పదం, అంటే, స్థానమైనది ‘జానపది’. పుట్టుకకు స్థానం, అంటే, కారణం తెలివి మాలినతనమనే పాపం. గౌతముడంటే ఇంద్రియాలను బాగా అణిచినవాడని అర్థం. కానీ ఆ జానపదిని చూడగానే అతని ధైర్యం ఆ క్షణంలో సడలిపోయింది. ఇంతలోనే మెలకువను తెచ్చుకొని, విల్లూ అమ్ములూ అక్కడే వదిలేసి, ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని ధైర్యం తాత్కాలి కంగా దెబ్బతిన్న కారణంగా అక్కడ ఒక పిల్లాడూ ఒక పిల్లా పుట్టారు. ‘జానపది’ పని అయిపోయింది కాబట్టి ఆవిడా జారుకుంది. అక్కడ ఆ రెల్లుగడ్డి మధ్యలో ఉన్న పసికందుల్ని, వేటకు వెళ్లిన శాంతను మహారాజు చూసి జాలితో వాళ్లను సాకాడు. కనకనే వాళ్లకు ‘కృప’, ‘కృపి’ అనే పేర్లు పెట్టారు. పుట్టిన కొడుక్కి అతని తండ్రి రహస్యంగా వచ్చి విలువిద్యను నేర్పాడు. ‘కృప’ అనే మాటకు జాలి అని అర్థమేగాక, ‘కృప’ అనే ధాతుపరంగా కల్పన చేయడం అన్న అర్థం కూడా ఉంది. అదీగాక, దౌర్బల్యమనీ సామర్థ్యమనీ కూడా అర్థాలున్నాయి. మనుషుల్ని దౌర్బల్యంగా చేసే సామర్థ్యమున్నది అభూతకల్పనకు లోనుజేసే అవిద్య. అవిద్య మాయకు కూతురు. మాయ మొత్తం లోకంలోని అందర్నీ మోసం చేస్తుంది. మాట వరసకు, ఆకాశానికి ఏ రంగూ లేకపోయినా మనందరికీ నీలంగా అవుపిస్తూ ఉంటుంది. అంతేగాదు, అది మహా నిజమైనట్టు, వినీలాకాశమంటూ కవుల కవిత్వాలూ వినిపిస్తూ ఉంటాయి. ఆకాశంలో ఎగురుతూండే దుమ్ముకణాల మీద కాంతికిరణాల విక్షేపం వల్ల ఈ రంగు అవుపిస్తుంది. కానీ, ఎంత తెలిసినా, దాన్ని రంగులేనిదానిగా చూడడం నేలమీద తిరిగే మనకు పడదు. అవిద్య అనేది మనిషి మనిషికీ వేరు వేరుగా ఉండే భ్రమ. ఇది అతని స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. అవిద్య అంటే, విద్య లేకపోవడమని అర్థంగాదు. శుభ్రంగా లేనిదాన్ని శుభ్రంగా ఉందను కోవడమూ, మారిపోయేదాన్ని అసలు మారిపోకుండా ఎప్పటికీ ఉంటుందను కోవడమూ, దుఃఖాన్ని సుఖమను కోవడమూ - అన్నీ ఇలాగ తారుమారుగా కల్పించుకొంటూ అనుకోవడమే అవిద్యకు గుర్తు. మాటవరసకు, పొద్దున్న వండిన అన్నం సాయంత్రానికి పాసిపోతుంది. ఆ అన్నాన్ని తిని పెరిగే ఈ శరీరం ఎప్పుడూ ఉంటుందని ఊహించడం అందరికీ ఉన్న అవిద్యే, తెలివిమాలినతనమే. దీన్ని ఆలోచనతో రూఢి చేసుకొన్న మనిషి మొదట్లో అందరిలాగే శరీరాన్ని నిత్యమని భ్రమపడినా, తాను పోగుచేసుకొన్న జ్ఞానంతో నెమ్మదినెమ్మదిగా దాన్ని పోగొట్టుకోగలుగుతాడు. ఆ విధంగా అవిద్యా స్థాయిల్లో తేడాలుంటాయి. ఈ అవిద్యే మనుషులందరికీ మొదటి ఆచార్యుడు. పాండవులకూ కౌరవులకూ యాదవులకూ అందరికీ కృపాచార్యుడే మొదటి గురువు. ఆ తరవాతనే ద్రోణా చార్యుడి పాఠాలు వచ్చాయి. కృపాచార్యుడి తోబుట్టువు కృపి, ద్రోణాచార్యుడికి భార్య అయింది. కృపీ ద్రోణాచార్యుల సంతానమే అశ్వత్థామ. అంచేత, కృపాచార్యుడికి అశ్వత్థామ మేనల్లుడన్నమాట. వీళ్లు ముగ్గురూ అధర్మానికే కొమ్ముకాస్తూ కౌరవులవైపే యుద్ధం చేశారు. దానిలో జరిగిన రెండు అకృత్యాల్లో కృపాచార్యుడూ అశ్వత్థామా భాగస్వాములయ్యారు. మొదటిది, అభి మన్యుణ్ని ఏకాకిని చేసి ఒకేసారి ఆరుగురు దాడిచేసి చంపడం. అర్జునుణ్ని చంపిగానీ యుద్ధాన్ని విరమించమని శపథం చేసి సుశర్మతో సహా పదివేల మంది అతన్ని దూరంగా తీసుకొనిపోయారు. ఆ సంశప్త కులతో అక్కడ యుద్ధం జరుగుతూన్న ప్పుడు, ద్రోణాచార్యుడు చక్రవ్యూహం పన్నాడు. దానిలోకి చొరబడడమైతే వచ్చును గానీ బయటపడడం మాత్రం చేతగాదు అభిమన్యుడికి. అయితే, అర్జునుడు సంశప్తకులతో యుద్ధం చేస్తూ ఉండడంతో, ఇక్కడ అభిమన్యుడు వ్యూహంలోకి చొరబడవలసివచ్చింది గత్యంతరం లేక. ద్రోణుడూ అశ్వత్థామా కృపుడూ కృతవర్మా కర్ణుడూ బృహద్బ లుడూ అనే ఆరుగుర్నీ వేరువేరుగా ఓడించాడు అభిమన్యుడు. అప్పుడు ద్రోణుడు విల్లునొకణ్నీ గుర్రాలనొకణ్నీ రథానికి అటుపక్కా ఇటుపక్కా రక్షిస్తూ ఉండే పార్శ్వరక్షకుల్ని ఒక్కణ్నీ పడగొట్ట మని పథకం వేశాడు. కర్ణుడు విల్లు విర గ్గొడితే, గుర్రాల్ని కృతవర్మ చంపాడు; కృపుడు పార్శ్వరక్షకుల్ని మట్టుబెట్టాడు. అలా ఒక్కణ్ని చేసి అభిమన్యుణ్ని చంప డంలో కృపాచార్యుడి చెయ్యి కూడా ఉంది. రెండోది, నిద్రపోతూన్న ఉప పాండవుల్నీ ధృష్టద్యుమ్నుణ్నీ శిఖండినీ చంపడం. దుర్యోధనుడు కూడా చని పోయిన తరవాత, సౌప్తికపర్వంలో అశ్వ త్థామకు సాయపడ్డవాళ్లు కృతవర్మా కృపా చార్యుడూను. సౌప్తిక పర్వమనేది నిద్ర పోతూన్నప్పుడు యోద్ధల్ని పశువుల్ని చంపినట్టు చంపిన కథనాన్ని చెప్పే భాగం. దుర్యోధనుడి చేత చివరి సేనాపతిగా తిలకాన్ని పెట్టించుకొన్న అశ్వత్థామ, తనతోబాటు బతికి ఉన్న కృపుడూ కృతవర్మలతో కలిసి శత్రువులకు అవుపడ కుండా రాత్రి అడవిలో ఒక మర్రిచెట్టు కింద ఉన్నాడు. వాళ్లిద్దరూ నిద్రపోయారు గానీ అశ్వత్థామకు కునుకు పట్టలేదు. అక్కడ అతను ఒక గుడ్లగూబ ఆ చెట్టు మీదున్న గూళ్లల్లో నిద్రపోతూన్న కాకుల్ని చంపడాన్ని చూశాడు. తాను కూడా తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుణ్ని అలాగే చంపాలని నిశ్చయం చేసుకొన్నాడు. ఆ ఆలోచనను విన్న మేనమామ కృపా చార్యుడు బోధ చేశాడు: అద్య స్వప్స్యన్తి పఞ్చాలా విముక్తకవచా విభో విశ్వస్తా రజనీం సర్వే ప్రేతా ఇవ విచేతసః॥యస్తేషాం తదవస్థానాం ద్రుహ్యేత పురుషో నృజుః వ్యక్తం స నరకే మజ్జేదగాధే విపులే ప్లవే॥(సౌప్తికపర్వం 5-13, 14): ఈ రోజు రాత్రి పాంచాలురందరూ గెలిచామన్న ధీమాతో, కవచాలు తీసేసి నిశ్చింతగా నిద్రపోతూంటారు. ఆ అవస్థలో ఎవడైనా క్రూరుడై ద్రోహం చేస్తే, వాడు ఘోర నరకంలో మగ్గిపోవడం ఖాయం. ఇంత చెప్పినా, మేనల్లుడు మేనమామ మాటను పెడచెవిన పెట్టాడు. అశ్వత్థామ ఒక్కడూ వాళ్ల శిబిరానికి బయలుదేరుతూంటే, కృతవర్మా కృపుడూ సాయంగా వెళ్లారు. శిబిర ద్వారం దగ్గర నిలుచుని, ఎవరైనా పారిపోతూంటే వాళ్లను చంపడానికి సన్నద్ధులై పొంచి కాపలా కాశారు. ఇంతగా పాండవులకు విరుద్ధంగా ప్రవర్తించి కూడా చివరికి బతికినవాళ్లు కౌరవుల్లో ఈ ముగ్గురే. నిజానికి వీళ్లు కౌరవులు కారు, కౌరవుల అధర్మానికి కొమ్ముకాసినవాళ్లు. అశ్వత్థామ ద్రోణా చార్యుడి కొడుకు; కృతవర్మ భోజవంశం వాడైన యాదవుడు; కృపాచార్యుడు గౌతమ వంశంవాడు. అశ్వత్థామ తాను చేసిన జుగుప్సాకరమైన పనివల్ల అడవు ల్లోనే అజ్ఞాతంగా ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు. కృపాచార్యుడు పాండవులతో సంధి చేసుకొని, వాళ్ల దగ్గరే ఉన్నాడు. అభిమన్యుడి భార్య ఉత్తరకు పరీక్షిత్తు పుట్టిన తరవాత, ఆ కుర్రాడికి విలువిద్యను కృపాచార్యుడే నేర్పాడు. అంటే, మొదటి పాఠం మళ్లీ అవిద్యకు ప్రతీక అయిన కృపాచార్యుడిదేనన్నమాట. కృపాచార్యుడిలాగ తన బతుకును పొడిగిస్తూ ఉండడమంటే, ఈ సాపేక్షక ప్రపంచంలో ఈ అవిద్య ఎప్పటికీ లేకుండా పోదని అర్థం. అవిద్యే తప్పుకుంటే, సృష్టిలోని రూపాలన్నీ అరూపమైన పరమాత్మగా అయిపోయి సృష్టి కనుమరుగైపోతుంది. -
సృష్టిలో తండ్రి పాత్ర ప్రత్యేకమైంది
చిక్కడపల్లి: మన అభ్యున్నతి కోసం తోడ్పడేది తల్లిదండ్రులని, సృష్టిలో తండ్రి పాత్ర ప్రత్యేకమైనదని పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఎన్.గోపి అన్నారు. అభినందన, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో కళాసుబ్బారావు కళావేదికలో గురువారం రాత్రి అంతర్జాతీయ పితృదినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా మాదిరాజు శ్రీనివాసరావు (అభినందన భవాని నాన్న), గురజాడ భుజంగరావు (డాక్టర్ శోభాపేరిందేవి నాన్న) పురస్కారాలను చారిత్రక నవలాచక్రవర్తి ముదిగొండ శివప్రసాద్, ఆలిండియా రేడియో రిటైర్డ్ అదనపు డెరైక్టర్ జనరల్ డాక్టర్ అనంత పద్మనాభరావులకు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోపి మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల పట్ల గాఢమైన ప్రేమకు ప్రతీకగా ఈ పురస్కారాలను అందజేస్తున్నామని, దీని వల్ల ఈ పురస్కారాలకు శోభపెరిగిందన్నారు. కార్యక్రమంలో దూరదర్శన్ కార్యక్రమం నిర్వహణాధికారి డాక్టర్ ఓలేటి పార్వతీశం, బైస దేవదాసు, పొత్తూరి సుబ్బారావు, కళాదీక్షితులు, అభినందన భవాని, శోభాపేరిందేవి, రమా, ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
విషాదం నింపిన ‘అనైతికం’
మంగళగిరి: ఓ వివాహిత, యువకుడు మధ్య ఏర్పడిన అనైతిక బంధం వారిని ఆత్మహత్యకు పురిగొల్పడంతోపాటు, రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఓ భర్తకు భార్యను...ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. వివాహేతర సంబంధం వదులుకోలేక యువకుడు, అతడిని వదిలి వుండలేని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళగిరి పట్టణంలో కలకలం రేపింది. సోమవారం ఉదయం మంగళగిరి ఓవర్‌బ్రిడ్జి దిగువన వివాహిత సృజన (36), సుధీర్ (32) అనే యువకుడు రైలు కింద పడి మృతి చెందారు. * సుధీర్ విజయవాడ పటమటలోని ఓ మెడికల్ ట్రాన్స్‌లేట్ కార్యాలయంలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్నాడు.ై రెల్వే ఉద్యోగి అయిన తండ్రి కామినబోయిన ప్రసాద్‌తో కలసి విజయవాడ దేవినగర్ హోమ్లైన్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. * కొటికలపూడి గ్రామానికి చెందిన కనకమేడల రఘు తన కుటుంబంతో గొల్లపూడిలో ఉంటూ ప్రింటింగ్ మెషిన్లకు మరమ్మతులు చేస్తుంటాడు. అతని భార్య సృజన ఐదేళ్లుగా సుధీర్ పనిచేస్తున్న కంపెనీలోనే ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తోంది. * ఈ నేపథ్యంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. రఘుకు విషయం తెలియడంతో భార్య సృజనను కొంతకాలంగా హెచ్చరిస్తున్నాడు. మరో వైపు సుధీర్‌కు ఇంట్లో వివాహ సంబంధాలు చూస్తున్నారు. ఇదిలావుండగా, సోమవారం ఆఫీసుకు సెలవుకావడంతో సృజన, సుధీర్‌లు దూరప్రాంతానికి వెళ్లి సరదాగా గడపాలని ప్లాన్ చేసుకున్నారు. * దీనిలో భాగంగానే ఆదివారం రాత్రి పదింటికి సృజన ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించి రఘు నిలదీయడంతో భార్యాభర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బయటకు వెళుతుండగా ప్రశ్నించిన భర్తకు ‘సుధీర్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్ చేశాడు..తనని ఇంటికి పంపి వస్తా’ అని చెప్పిన సృజన ఉరుకులాంటి పరుగుతో బయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. * అప్పటికే గొల్లపూడిలోని పెట్రోలు బం కు సమీపంలో కారుతో సిద్ధంగా సుధీర్‌తో కలిసి మంగళగిరి టీబీ శానిటోరియం వద్దకు చేరుకున్నారు. ఉదయం ఆరుగంటల వరకు అక్కడ ఉన్న సుధీర్, సృజనలు అకస్మాత్తుగా ఓవర్‌బ్రిడ్జి దిగువకు వెళ్లారు. విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. * సమాచారం అందడంతో పట్టణ సీఐ రావూరి సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ లభించిన పర్సు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరువైపు బంధువులు, స్నేహితులకు కబురు పంపారు. రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు రైల్వే హాస్పటల్‌కు తరలించారు. * తన కుమారులను వదిలి వెళ్లిపోయిందంటూ సృజన భర్త రఘు భో రున విలపించారు. సృజనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఎని మిదో తరగతి, మరొకరు నాలుగో తరగతి చదువుతున్నారు. వివాహేతర సంబంధం వదులు కోలేక ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. -
అచ్చ తెలంగాణకే