తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష.
డిజిటల్ క్రియేటర్‌లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్‌లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్‌డేట్స్‌ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు.
కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు....
రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్‌లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్‌లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ.
‘క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్‌కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్....
డ్రీమ్ స్క్రీన్
యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్‌లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు.
యూట్యూబ్ క్రియేట్
వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్‌లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు.
క్రియేటర్‌ల నోట ‘హిట్ లైక్ అండ్
సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్‌లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది.
ఏఐ ఇన్‌సైట్స్
యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది.
అలౌడ్
ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ కూడా క్రియేటర్‌లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్‌లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు.
‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్‌లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్‌ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్‌సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్‌లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది.
అయిననూ...
టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్‌లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్‌లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment