tools
-
రోదసీలో టూల్బ్యాగ్ చక్కర్లు
న్యూయార్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) బయటివైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ మళ్లీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీకొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటిపెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా). నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతంచేసింది. అసలేం జరిగిందంటే? ఆరోజు వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మోగ్బెలీ, లోరల్ ఓహారాలు ఐఎస్ఎస్ బయటివైపు ఉన్న హ్యాండ్లింగ్ బార్ ఫిక్చర్, బేరింగ్లను తొలగించి కొత్తవి అమర్చేందుకు స్పేస్‌వాక్ చేశారు. బయటే వారు ఆరు గంటల 42 నిమిషాలసేపు గడిపారు. తర్వాత స్పేస్స్టేషన్లోకొచ్చి మిగతా పనుల్లో పడిపోయారు. ‘‘వెంట తీసుకెళ్లిన వస్తువుల జాబితాను సరిచూసుకోగా ఈ బ్యాగ్ మిస్సయింది. టూల్ బ్యాగ్ దొరకలేదు. స్పేస్‌వాక్ చేసిన ప్రతిసారీ ఆ బ్యాగ్‌తో పనిపడదు. అందుకే దానిని తిరిగి వెంటతేవడం వాళ్లు మర్చిపోయారు. అంతరిక్షంలో ఆ బ్యాగ్ పథమార్గాన్ని బట్టిచూస్తే అది ఒకవేళ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొన్నా ఐఎస్ఎస్కు పెద్దగా ముప్పు వాటిల్లకపోవచ్చు’’ అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్బ్యాగ్ జాడను ఎర్త్స్కై అనే వెబ్సైట్ కనిపెట్టింది. ‘ టూల్బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నపుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు. ఐఎస్ఎస్ చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ కనబడుతుంది. అయితే ఇది అలా కొన్ని నెలలపాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచి్చన్నమవుతుంది’’ అని వెబ్సైట్ విశ్లేషించింది. ఆ టూల్బ్యాగ్లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతంచేయలేదు. టూల్బ్యాగ్లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సెపె్టంబర్ నెలలో ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్ష్యల్లో తిరుగుతున్నాయి. -
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
‘ఏఐ’పంట!
కంచర్ల యాదగిరిరెడ్డి:నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు.ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు.ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సర్విస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్‌బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. గరిష్టంగా దిగుబడులు: నేల, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఏ పంట వేస్తే గరిష్ట దిగుబడులు రాబట్టుకోవచ్చో గుర్తించగలదు. పంటల యాజమాన్య పద్ధతులను కూడా నిర్దిష్ట పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్‌సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు.వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్‌సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయతి్నస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్‌బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
సరి కొత్త ఫీచర్.. అక్షరాల పరిమితి లేకుండా ట్వీట్లు చేయొచ్చు!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ యూజర్లకు శుభవార్త చెప్పారు. ‘ఆర్టికల్స్’ పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త టూల్ సాయంతో యూజర్లు పెద్ద పెద్ద వ్యాసాలను పోస్ట్ చేసుకోవచ్చు. అంటే బుక్‌లోని సమాచారం మొత్తం ట్వీట్ చేసే వెసలుబాటు కలగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, ట్విటర్ బ్లూ సబ్‌స్కైబర్లు 10,000 వేల అక్షరాలతో ట్వీట్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకోని యూజర్లు 280 అక్షరాలకు లోబడి ట్వీట్ చేయాల్సి ఉంటుంది. అయితే తాజా ట్విటర్ తేనున్న ఆర్టికల్ ఫీచర్ యూజర్లు పెద్ద పెద్ద ఆర్టికల్స్‌ను సైతం ట్వీట్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త ఫీచర్‌పై ‘అవును ట్విటర్ కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ టూల్ సాయంతో పుస్తకంలో ఉన్న కంటెంట్ మొత్తాన్ని పోస్ట్ చేసేలా వీలు కల్పుస్తున్నామని వెల్లడించారు. మరి ఈ ఫీచర్‌ను ఎలాన్ మస్క్ ట్విటర్ బ్లూ సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేస్తారా? లేక సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తారా? అనేది తెలియాల్సివుంది. -
గూగుల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి ఆ సేవలు బంద్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 19 నుంచి తన ఆల్బమ్ ఆర్కైవ్‌ను శాస్వతంగా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాట్లు, వీడియోలు, ఫోటోలను స్టోర్ చేసుకునేందుకు ఉపయోగపడే ఆల్బమ్ ఆర్కైవ్ కనుమరుగు కానుంది. సేవలు నిలిపివేయనున్న తరుణంలో యూజర్లు ఆల్బమ్ ఆర్కైవ్‌లో ఉన్న డేటాను డౌన్లోడ్ చేసుకోవాలని గూగుల్ యూజర్లను కోరింది. సేవల నిలిపివేతపై వినియోగదారులకు మెయిల్స్ పంపుతోంది. ఆల్బమ్ ఆర్కైవ్‌ను నిలిపివేస్తున్నామని, ఇప్పటికే అందులో ఉన్న డేటాను డౌన్లోడ్ చేసుకునేలా గూగుల్‌కు చెందిన టేక్అవుట్ని ఉపయోగించుకోవాలని చెబుతోంది. గూగుల్ఈ వారం ప్రారంభంలో వినియోగదారులకు వార్నింగ్ మెయిల్స్ పంపింది ఇమెయిల్‌లను పంపింది, ఆల్బమ్ ఆర్కైవ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న కంటెంట్ జూలై 19 నుండి తొలగించబడుతుందని పేర్కొంది. 2018కి ముందు జీమెయిల్లో ఉపయోగించిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లు, ఆల్బమ్ కామెంట్స్,లైక్స్ వంటి కంటెంట్ డిలీట్ అవుతాయని వెల్లడించింది. చదవండి : ఓలా టెక్నాలజీ అదిరింది..హెల్మెట్ లేకపోతే బండి స్టార్ట్ కాదు! -
ఐటీ లేఆఫ్స్: కొత్త ఉద్యోగాల కోసం బ్రహ్మాండమైన ఏఐ టూల్స్ ఇవిగో!
సాక్షి,ముంబై: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు వేలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి.మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలుఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!) 1956లో జాన్ మెక్‌కార్తీ ఈ అంశంపై మొదటి విద్యాసంబంధ సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. 2022లో శరవేగంగా ముందుకు దూసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు అనేది మనిషి తరహాలోనే ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోగలదు కూడా. వ్యాపార సామర్థ్యాన్ని పెంచడంలో, నిర్ణయం తీసుకోవడంలో ఖర్చులను తగ్గించడంలో కూడా ఏఐ సాయపడుతుందనేది ప్రధాన ఆలోచన. అలాగే మార్కెటింగ్‌లో, కస్టమర్ డేటాను విశ్లేషించడం, ట్రెండ్లను గుర్తించడంతో పాటు, కస్టమర్ల ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించేందుకు ఉపయోగ పడుతుంది.తద్వారా ప్రత్యర్థులతో పోలిస్తే మరింత ముందుగా వ్యూహ రచనలో దూసుకుపోవచ్చని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలకుపయోగపడే కొన్నిముఖ్యమైన ఏఐ టూల్స్గురించి తెలుసుకుందాం. టాప్ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ ( AI సంచలనం) క్విల్‌బాట్: ఇన్స్టంట్ పారాఫ్రేజర్ అప్‌వర్డ్: ఇన్నోవేటివ్ సమ్మరైజర్ కెరీర్దేఖో ఏఐ నెట్వర్క్ ఏఐ అప్లికెంట్ ఏఐ కిక్ రెస్యూమ్ ల్యాంగ్వేజ్ప్రొ అడాప్టివ్ ఎకాడమీ రెస్యూమ్ చెక్ ఫింగర్ పప్రింట్ సక్సెస్ అన్స్కూలర్ రెస్యూమ్ ఏఐ పాయిజ్డ్ ప్రాడిజీ ఏఐ లాంగోటాక్ -
ఇన్‌స్ట్రాగామ్‌లో కొత్త ఫీచర్: చూశారా మీరు?
న్యూఢిల్లీ: ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్ట్రాగామ్ తాజాగా భారత్‌లో పేరెంటల్ పర్యవేక్షణ సాధనాలను ప్రవేశపెట్టింది. తమ టీనేజీ పిల్లల ఇన్స్ట్రా ఖాతాలను తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు ఇవి సహాయపడగలవని సంస్థ తెలిపింది. అలాగే ఈ విషయంలో సహాయం కోసం నిపుణులు అందించే వనరులతో ఫ్యామిలీ సెంటర్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు ఇన్‌స్ట్రాగామ్ పేర్కొంది. (ఇది చదవండి: రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట) టీనేజీ పిల్లలను ఆన్లైన్లో సురక్షితంగా ఉంచేందుకు, తల్లిదండ్రులకు మరింతగా పర్యవేక్షణా అధికారాలను ఇచ్చేందుకు ఈ సాధనాలు, వనరులు ఉపయోగపడగలవని వివరించింది. (iPhone14: గుడ్ న్యూస్.. భారీ ఆఫర్ ఎక్కడంటే?) -
ఎన్ని మొక్కలు నాటారబ్బా, గుర్తించేలా టూల్ డిజైన్
రాయదుర్గం: పట్టణాల్లో రోడ్డుకు ఇరు పక్కల ఉన్న చెట్లను లెక్కించేందుకు ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ పరిశోధకులు వినూత్నమైన పద్ధతిని రూపొందించారు. మెషీన్ లెర్నింగ్ సాంకేతికత సాయంతో పనిచేసే కంప్యూటర్ విజన్ అసిస్టెడ్ పరికరాన్ని అభివృద్ధి పరిచారు. ఈ పరికరం ఆటోమేటిక్‌గా పట్టణాల్లో చెట్ల విస్తారం ఎంత ఉందో గుర్తిస్తుందని ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు చెట్ల సంఖ్య ఎంత ఉందో నేరుగా లెక్కించడం ద్వారా కాని, కృత్రిమ ఉపగ్రహాల సాయంతో గానీ లెక్కించేవారు. ఈ సరికొత్త పరికరాన్ని ట్రిపుల్ ఐటీ– హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ సీవీ జవహర్ నేతృత్వంలో అర్పిత్ బహేతి అనే పరిశోధక విద్యార్థి రూపొందించారు. ఈ పరికరాన్ని బైక్‌కు బిగించి ఏదైనా రోడ్డు మీదుగా తీసుకెళ్తే చాలు ఆటోమేటిక్‌గా చెట్లను లెక్కించడమే కాకుండా ఆ రోడ్డుకు సంబంధించిన మ్యాప్‌ను కూడా సులువుగా అర్థం అయ్యేలా రంగులతో అందజేస్తుందని అర్పిత్ వివరించారు. చెట్ల కాండాలు లేదా మొదళ్ల ద్వారా చెట్ల సంఖ్యను లెక్కిస్తుందని తెలిపారు. ఈ పరికరాన్ని హైదరాబాద్‌తో పాటు సూరత్‌లో పరీక్షించగా, 83 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని చెప్పారు. -
టిక్‌టాక్‌కు పోటీగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సరికొత్త టూల్!
టిక్‌టాక్.. ఇప్పుడు ఎవరికి అడిగినా ఈ యాప్ గురించి టకీమని చెప్పేస్తారు. ఈ యాప్ గురించి తెలియనివారు ఉండరేమో అంటే అతియోశక్తికాదు. ప్రస్తుతం నెటిజన్లకు అందుబాటులో ఉన్న అనేక సోషల్ మీడియా యాప్‌లలో టిక్‌టాక్‌కు ఎంత ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలు మొదలు.. పండు ముసలి సైతం ఈ యాప్ ద్వారా వీడియోలు చేసి తమను తాము బాహ్య ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు. ఒకప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా వాడేవారు. అయితే ఇప్పుడు అందరి నోటా టిక్‌టాక్ మాటే వినిపిస్తోంది. ఎవర్ని చూసినా టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక కొందరైతే ఈ యాప్ ద్వారానే సెలబ్రిటీలుగా మారిపోయిన విషయం కూడా విదితమే. అయితే టిక్‌టాక్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగ్రామ్ కూడా త్వరలోనే టిక్‌టాక్‌ను పోలిన ఓ కొత్త టూల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది. టిక్‌టాక్ యాప్‌కు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇన్‌స్ట్రాగ్రామ్ కూడా సరిగ్గా అలాంటి ఫీచర్స్ ఉన్న ఓ టూల్‌ను ప్రస్తుతం డెవలప్ చేసింది. దాని పేరు సీన్స్. సీన్స్టూల్ను ప్రయోగాత్మకంగా బ్రెజిల్లో వినియోగించారు. అక్కడ సక్సెస్‌పుల్‌గా కొనసాగుతుంది. టిక్‌టాక్ మాదిరి సీన్స్‌లో కూడా 15 సెంకడ్ల నిడివి గల వీడియోను అప్లోడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మ్యూజిక్‌ని సెట్ చేసుకోవచ్చు. వీడియోను షేర్ చేసుకునే ఆప్షన్‌తో పాటు డ్యూయెట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఈ టూల్ కేవలం ఒక బ్రెజిల్‌లోనే అమలవుతుందా లేదా ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుందా తెలియదు. కానీ ఆచరణ మాత్రం సాధ్యమే. మరి ఇన్‌స్ట్రాగ్రామ్ తెచ్చే ఆ నూతన టూల్ ఎప్పుడు యూజర్లకు లభిస్తుందో, అది ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..! Instagram is working on Scenes, a TikTok-like video editing/remixing tool for Stories Other users will be able to remix your "Scenes" if your account is public You are given music, video speed, timer, AR Effect, etc to edit each clip This feature is previously known as Clips pic.twitter.com/5y1DGACFis — Jane Manchun Wong (@wongmjane) November 12, 2019 -
ఫ్లోట్ సీట్.. ఫీల్ గుడ్
ఆధునికతను అందిపుచ్చుకుంటున్న నగర యువత నూతనఆవిష్కరణలపై ఆసక్తి చూపుతోంది. సామాజిక, ఆరోగ్య స్పృహతో అత్యాధునిక సాధనాలు కనుగొంటోంది. నగర రోడ్లపై ప్రయాణంలో తమకు ఎదురైన సమస్యల పరిష్కారానికి శ్రమించిన సిటీ మిత్రత్రయం... సాఫీ ప్రయాణానికి ఫ్లోట్లు రూపొందించింది. నగరానికి చెందిన మాధవ్ సాయిరామ్ కొల్లి, విశ్వనాథ్ మల్లాది, సంతోష్‌కుమార్ సామల సూరత్‌లోని ఎన్ఐటీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. అక్కడ స్నేహితులైన వీరు స్టార్టప్ ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. 2015లో చదువు పూర్తయ్యాక సిటీకి వచ్చి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగంలో చేరారు. అయితే సిటీ రోడ్లపై ప్రయాణం వారిని ఆలోచనలో పడేసింది. చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. 70 శాతం మంది ‘కంఫర్ట్’ జర్నీ చేయలేకపోతున్నారని వీరి అధ్యయనంలో తేలింది. దీనికి పరిష్కారం కనుగొనాలని ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ‘ఫీల్ గుడ్ ఇన్నోవేషన్’ స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు. అనూహ్య స్పందన.. డ్రైవింగ్ సమయంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలను అధిగమించేలా ‘ఫ్లోట్’లను రూపొందించారు వీరు. వీటిని కార్లు, బైకులలోని సీటుపై అమర్చుకుంటే హాయిగా ప్రయాణం చేయొచ్చని చెబుతున్నారు. ‘నగర రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే గంటలకొద్దీ నిరీక్షించాలి. సుదూర ప్రయాణం చేసే సందర్భాల్లో వెన్నునొప్పి సమస్యలు వస్తాయి. రక్తప్రసరణ జరగక తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటన్నింటి నుంచి గట్టెక్కించేందుకు అతి చౌక ధరకే ఫ్లోట్లు తయారు చేశామ’ని చెప్పారీ మిత్రులు. ‘ఇటీవల గుజరాత్లో జరిగిన ఐక్రియేట్ స్టార్టప్‌ల కార్యక్రమంలో నగరం నుంచి మేం ఒక్కరమే పాల్గొన్నాం. ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మా ఐడియాకు మెచ్చుకున్నారు. మా ప్రొడక్ట్స్‌కు నగర వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నెల రోజుల్లోనే దాదాపు 1500 ఆర్డర్లు వచ్చాయి. కావాల్సినవారు https://www.fueladream.com/ వెబ్సైట్లో సంప్రదించొచ్చు. పనిచేస్తుందిలా... ‘గాలి ప్రసరణ జరిగి రైడర్‌కు హాయిని కలిగించేంచేలా ప్యూర్ లెదర్‌తో తయారు చేసిన ఫ్లోట్ బ్రీతబుల్ మెషిన్లో ఎయిర్ ప్యాకెట్లు ఉండేలా చూశాం. ఇవి ఒకదానికొకటి అనుసంధానంగా ఉండటంతో లోపల ఎయిర్ ప్యాకెట్లలో గాలి కదలాడుతుంటుంది. అవసరాన్ని బట్టి 30–70 శాతం మేర గాలి నింపుకొని బైక్, కార్లకు సీటుగా ఉపయోగించుకోవచ్చు. తొలుత 10వేల కిలోమీటర్లు పరీక్షలు చేశాం. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహకారాన్ని తీసుకున్నాం. సత్ఫలితాలు వచ్చాకే మార్కెట్లోకి వచ్చామ’ని వివరించారు. -
ఆదిమానవుల పనిముట్లు లభ్యం
చేర్యాల: వరంగల్ జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట మిధునమ్మ చెరువు సమీపంలో ఆది మానవుల కాలం (నవీనయుగం) నాటి పనిముట్లు లభ్యమైనట్లు జౌత్సాహిక చరిత్ర పరిశోధకులు రత్నాకర్‌రెడ్డి తెలిపారు. ఆదిమానవులు రాతి పనిముట్లను తయారు చేసుకున్న గుర్తులను చెరువు సమీపంలో బుధవారం కనుగొన్నారు. ఈ సందర్భంగా రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చెరువు వద్ద ఏనెపై ఇస్త్రి పెట్టెగా పిలిచే రాయికి కుడివైపున12 అడుగుల పొడవైన రాతి శిలపై 50కి పైగా బద్దులు ఉన్నాయని, వీటిని పురావస్తు శాస్త్రంలో కప్యూల్స్ అంటారని తెలిపారు. రాయితో ఆ శిలపై ఎక్కడ కొట్టినా సంగీతం వినిపిస్తోందని, ఏనె నుండి బీరప్ప దేవాలయం మధ్య ఉన్న పంచరాయి భూమిలో ఆది మానవుల ఆవాసాలను గుర్తించామని వివరించారు. రాతి పనిముట్లు, మృణ్మయ పాత్రలు, చికరా రాళ్ల (ఇనుము)ను నాడు వినియోగించారని చెప్పారు. పురావస్తు శాఖ అధికారులు వీటిని పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట కాపుల మఠం బసవేశ్వర్, సిద్దిరాం మఠం వీరయ్య ఉన్నారు. -
నైపుణ్యాల వృద్ధికి.. ఉపకరించే సాధనాలు
స్కిల్ గ్యాప్.. అంటే పరిశ్రమలు అభ్యర్థుల్లో కోరుకుంటున్న నైపుణ్యాలకు.. విద్యార్థుల్లో ఉంటున్న సాధారణ నైపుణ్యాలకు మధ్య అంతరం. నేడు ఏ కోర్సులు చదివిన విద్యార్థులకైనా జాబ్ మార్కెట్లో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అభ్యర్థులు నైపుణ్యాల లేమితో ఉద్యోగాలను దక్కించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఆశిస్తున్న స్కిల్స్.. టెక్నికల్, మేనేజీరియల్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. వీటన్నింటినీ సొంతం చేసుకుంటేనే ఆకర్షణీయమైన కెరీర్ సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సాధనలో అందరికంటే ముందు నిలవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై విశ్లేషణ.. ఇంటర్న్షిప్స్ అకడమిక్స్ స్థాయిలోనే పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను ప్రత్యక్షంగా పొందగలిగే మార్గం ఇంటర్న్షిప్స్. అంటే.. ఒక విద్యార్థి తాను చదువుతున్న కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో కొద్ది నెలలపాటు పని చేయడం ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకోవడం. దీంతో పాటు వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఇంటర్న్షిప్స్ అనే ప్రక్రియ కరిక్యులంలో భాగంగా లేనప్పటికీ.. కొన్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థలు సొంతంగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తున్నాయి. బీటెక్‌లో మూడో ఏడాది ముగిసిన తర్వాత సెలవుల సమయంలో, ఎంబీఏలో మొదటి సంవత్సరం తర్వాత సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్ ప్రక్రియ ఉంటోంది. వీటినే సమ్మర్ ఇంటర్న్‌గా పేర్కొంటున్నారు. ఈ సమయంలో విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం ఉన్న పరిశ్రమల్లో రెండు లేదా మూడు నెలల నిర్దేశిత వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే వీలుంటుంది. స్కిల్ గ్యాప్ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్న పరిశ్రమ వర్గాలు, సంబంధిత సంస్థలు కూడా ఇంటర్న్‌షిప్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్ చేసే సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఉత్పత్తి రంగంలో ఈ ధోరణి కొంత తక్కువైనప్పటికీ.. ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు ఇంటర్న్‌షిప్ ట్రైనీ అవకాశాలు బాగా కల్పిస్తున్నాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సాఫ్ట్వేర్ సంస్థలు ఇంటర్న్ ట్రైనీలను నియమించుకోవడంలో ముందుంటున్నాయి. వీటిల్లో శిక్షణ పొందడంతోపాటు ఆయా సంస్థల విధానాల ప్రకారం ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో చొరవ, తమకు కేటాయించిన విభాగంలో ప్రతిభ ద్వారా ఆయా సంస్థల గుర్తింపు పొందితే.. ఇంటర్నషిప్ పూర్తయ్యాక ఉద్యోగాన్ని కూడా దక్కించుకోవచ్చు. ప్రాజెక్ట్ వర్క్స్ విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో మరో ముఖ్య సాధనం ప్రాజెక్ట్ వర్క్స్. ప్రస్తుత కరిక్యులం ప్రకారం ప్రతి ప్రొఫెషనల్ కోర్సులోనూ ఇది తప్పనిసరి. ఆయా కోర్సుల చివరి సెమిస్టర్లో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఫలితంగా విద్యార్థులకు సదరు సంస్థ, విభాగాలపై నైపుణ్యాలు సొంతమవుతాయి. ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థులు తాము ఎంచుకున్న అంశానికి సంబంధించి.. ఏదైనా ఒక సంస్థలో ఆరు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో తాము ఎంచుకున్న అంశంలో సమస్య ఎదురైతే.. దాని పరిష్కార మార్గాలు తెలుసుకుని పరిష్కరించాలి. ఈ ప్రాజెక్ట్ వర్క్ విధానం కూడా విద్యార్థులకు భవిష్యత్తు ఉద్యోగాలను ఖాయం చేసే మార్గంగా పేర్కొనొచ్చు. ప్రాజెక్ట్ వర్క్ వ్యవధిలో సదరు సంస్థలో చక్కటి పనితీరు కనబరిచి ఉన్నతాధికారుల గుర్తింపు పొందితే అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశాలెన్నో. ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి మరో ప్రత్యామ్నాయం ఇండివిడ్యువల్/గ్రూప్ ప్రాజెక్ట్స్. సంస్థల్లో ప్రాజెక్ట్ వర్క్ అవకాశం పొందని విద్యార్థులు సొంతంగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా ప్రాజెక్ట్ చేయడం. ఈ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ ద్వారా సమస్య-పరిష్కారాలను సంస్థల దృష్టికి తీసుకెళ్లొచ్చు. మీరు చెప్పిన పరిష్కార మార్గాలు నచ్చితే మీకు ఉద్యోగం దక్కినట్లే. ఇలా తమ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్‌ను సంస్థల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయా రంగాలకు సంబంధించి నిర్వహించే సెమినార్లు, కాలేజ్ సావనీర్లు, క్యాంపస్ రిక్రూట్మెంట్ సెషన్స్‌ను వేదికలుగా ఉపయోగించుకోవాలి. కానీ.. ఇటీవల చాలా మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మార్కుల సాధన, సర్టిఫికెట్లో పర్సంటేజీ సంఖ్య పెంపుదల సాధనంగానే భావిస్తున్నారు. ఇది సరికాదు. ప్రాజెక్ట్ వర్క్ అంటే తాము అప్పటి వరకు పొందిన థియరీ నాలెడ్జ్‌ను క్షేత్ర స్థాయిలో అన్వయించడంతోపాటు.. వాస్తవ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పొందేందుకు చక్కటి సాధనంగా వినియోగించుకోవాలి అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి. ఉమామహేశ్వరరావు. అప్రెంటీస్షిప్స్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్.. విద్యార్థులు తాము ఉత్తీర్ణత సాధించిన కోర్సుకు సంబంధించిన సంస్థలో నిర్దిష్ట కాలంలో పూర్తి స్థాయిలో పని చేయడం. ముఖ్యంగా వృత్తి విద్య కోర్సుల్లో అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఎంతో కీలకమైన అంశం. అంతేకాకుండా స్కిల్ గ్యాప్‌నకు చక్కటి పరిష్కార మార్గం కూడా. నిర్ణీత వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్షిప్లో పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించడం ద్వారా క్షేత్ర స్థాయి అవసరాలపై అవగాహన పొందొచ్చు. అప్రెంటీస్‌షిప్ ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లోనే అప్రెంటీస్ యాక్ట్ పేరిట చట్టాన్ని కూడా రూపొందించింది. దీని ప్రకారం సంస్థలు మొత్తం శ్రామిక శక్తిలో పది శాతం మేర అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవాలి. అంతేకాకుండా శిక్షణలో స్టైఫండ్ చెల్లించాలని కూడా నిర్దేశించింది. ఇప్పటికే బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, బీఈఎల్, గెయిల్ వంటి మహారత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలు; ప్రైవేటు రంగంలో వేల సంఖ్యలో.. ట్రేడ్ అప్రెంటీసెస్; గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీసెస్; టెక్నీషియన్ అప్రెంటీసెస్ వంటి హోదాల్లో ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాల వరకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. నిర్ణీత వ్యవధి పూర్తయ్యాక నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, సెంట్రల్ అప్రెంటీస్ కౌన్సిల్లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ట్రేడ్ సర్టిఫికెట్లు పొందొచ్చు. కానీ.. ఇప్పటికీ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అంటే విద్యార్థుల్లో అంతగా అవగాహన ఉండట్లేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా అప్రెంటీస్‌షిప్ సదుపాయం సంఖ్య 4.8 లక్షలు ఉంటే కేవలం 2.8 లక్షల మంది మాత్రమే దీన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అప్రెంటీస్ చట్టానికి మార్పులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో స్టైఫండ్ శాతాన్ని కూడా 40 శాతం మేర పెంచింది. టెక్నికల్ కోర్సులకే పరిమితమైన ట్రైనింగ్‌ను బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులకు కూడా అందించాలని నిర్ణయించింది. ఆన్ జాబ్ ట్రైనింగ్ స్కిల్ గ్యాప్‌నకు సంబంధించి ఇటు విద్యార్థులు, అటు పరిశ్రమ వర్గాలకు చక్కటి వారధిగా నిలుస్తున్న అంశం ఆన్ జాబ్ ట్రైనింగ్. క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ద్వారా తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్న సంస్థలు.. వారికి తమ అవసరాలకు అనుగుణంగా సంబంధిత అంశాల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించేందుకు చేపడుతున్న శిక్షణ కార్యక్రమమే ఆన్ జాబ్ ట్రైనింగ్. ముఖ్యంగా బీటెక్‌లో బ్రాంచ్‌తో సంబంధం లేకుండా అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులను నియమిస్తున్న ఐటీ సంస్థలు ఆన్ జాబ్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల పాటు ఉండే ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో అభ్యర్థులకు.. వారు నియమితులైన విభాగాలకు సంబంధించి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతోపాటు సంస్థలో ఇతర విభాగాలు, వాటి విధి విధానాలు, పనితీరు వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. ఈ సదుపాయం కేవలం ఎంట్రీ లెవల్ ఉద్యోగులకే కాకుండా.. సంస్థలో అప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలోనూ అమలు చేస్తున్నాయి. మిడ్ లెవల్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు సంబంధించి.. ఆయా ఉద్యోగులు పని చేస్తున్న విభాగాలు, రంగాల్లోని తాజా పరిణామాలు, అప్డేటెడ్ నైపుణ్యాలు అందించే విధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్స్ ఉంటున్నాయి. ఫలితంగా ఉత్పాదకత పెరగడంతోపాటు, పోటీదారులకంటే ఒకడుగు ముందుండొచ్చనేది సంస్థల అభిప్రాయం. అభ్యర్థులు కూడా ట్రైనింగ్‌లో నేర్చుకున్న అంశాల ద్వారా మరింత మెరుగైన పనితీరు ప్రదర్శించి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. సర్టిఫికేషన్లు ఎన్నెన్నో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఇప్పుడు ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నికల్ కోర్సుల్లో సెంట్రల్ ఒకేషనల్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో.. విద్యార్థుల డొమైన్ అర్హతలకు ఆధారంగా పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆయా రంగాలకు సంబంధించి- పరిశ్రమ వర్గాలతో ఒప్పందం ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాటిని పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందిస్తోంది. వీటితోపాటు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఆయా ఇన్స్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ వివరాలు.. ఇన్ఫోసిస్: ఈ సంస్థ ఐటీ స్కిల్ డెవలప్మెంట్ కోసం సొంతంగా గ్లోబల్ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఐటీసీ: రిటైల్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీసీ సంస్థ- ఎన్ఐఎస్-స్పార్తా సంయుక్తంగా రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరికొన్ని బ్యాంకులు పలు ఇన్స్టిట్యూట్లతో కలిసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లు స్టాక్ మార్కెట్ నిర్వహణ సంబంధిత పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. డొమైన్తోపాటు మరెన్నో స్కిల్స్ ఇటీవల కాలంలో సంస్థలు అభ్యర్థుల్లోని డొమైన్ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా ఇతర అంశాలు వాటిలోని నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. దృక్పథం, నైతికత వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇటీవల తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆయా సంస్థలు కోరుకుంటున్న స్కిల్స్ శాతాల గణాంకాలు.. ఇంటెగ్రిటీ అండ్ వ్యాల్యూస్: 30 శాతం రిజల్ట్ ఓరియెంటేషన్:21 శాతం బెటర్ ఆప్టిట్యూడ్: 12 శాతం కోర్ డొమైన్: 14 శాతం పీపుల్ స్కిల్స్ (కల్చరల్ డైవర్సిటీ, టీమ్ వర్క్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్): 23 శాతం ఇంటర్న్షిప్స్.. వే టు ఎంప్లాయ్మెంట్ కోర్సు వ్యవధిలో విద్యార్థులు చేసే ఇంటర్న్షిప్స్ వారి భవిష్యత్తు ఉపాధికి మార్గం నిలుస్తాయి. కానీ ఇప్పటికీ ఈ విషయంలో విద్యార్థుల్లో ఆశించిన అవగాహన ఉండట్లేదు. ఇన్స్టిట్యూట్ల స్థాయిలోనే వీటి ప్రాముఖ్యాన్ని తెలియజేసి ప్లేస్మెంట్ సెల్స్, ఇతర మాధ్యమాల ద్వారా అధ్యాపకులు, మేనేజ్మెంట్ వర్గాలు తమ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలను అందించాలి. ఇక విద్యార్థులు కూడా తమకున్న పరిచయాల ద్వారా ఇంటర్న్షిప్స్ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. కరిక్యులంలో భాగంగా లేని ఇంటర్న్‌షిప్ అనే పదం విద్యార్థుల రెజ్యుమేలో కనిపిస్తే కచ్చితంగా ఎంప్లాయర్స్ను ఆకర్షిస్తుంది. సదరు విద్యార్థికి ఇతరులకంటే ఎక్కువ వెయిటేజీ లభిస్తుంది. - బి. అశోక్ రెడ్డి, ప్రెసిడెంట్- కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సయంట్ అప్రెంటీస్‌షిప్‌తో ప్రయోజనాలెన్నో టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తిస్థాయి ఉద్యోగుల మాదిరిగా విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ సమయంలో సదరు విభాగాలపై పూర్తి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. చాలా మందికి అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్, అది పూర్తయ్యాక నిర్వహించే ట్రేడ్ టెస్ట్ ప్రాధాన్యంపై అవగాహన ఉండట్లేదు. దీంతో మంచి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, ఎన్ఎస్డీసీ, ఏటీఐ వెబ్సైట్లను వీక్షిస్తే అందుబాటులో ఉన్న అప్రెంటీస్‌షిప్ సదుపాయాలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానాల వివరాలు తెలుస్తాయి. - కె.ఎస్.ఆర్. ప్రదీప్, డిప్యూటీ డెరైక్టర్, ఆర్డీఏటీ, హైదరాబాద్. స్కిల్స్‌తోపాటు పెరిగే అవకాశాలు విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తే.. అంతే స్థాయిలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ప్రాక్టికల్స్, ప్రాక్టికాలిటీ అనే పదాలు కేవలం ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులకే పరిమితం కాదు. అన్ని కోర్సులు, రంగాల్లోనూ ఇప్పుడు ఎన్నో స్కిల్స్ అవసరమవుతున్నాయి. వీటిని గుర్తించి అకడమిక్ స్థాయి నుంచే సొంతం చేసుకునేలా వ్యవహరించాలి. మేనేజ్మెంట్కు సంబంధించి పీపుల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. - వి. పాండురంగారావు, డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ -హైదరాబాద్ ఎడ్యు న్యూస్ ఇన్స్పైర్ స్కాలర్షిప్ - 2014 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండి నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో మూడేళ్ల బీఎస్సీ, బీఎస్సీ (హానర్స్), నాలుగేళ్ల బీఎస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు అందించే ‘స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్హెచ్ఈ)’కు ప్రకటన వెలువడింది. వీటిని కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) అందిస్తోంది. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్స్పైర్)’ పేరుతో ఈ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు. మొత్తం స్కాలర్షిప్స్: 10,000 స్కాలర్షిప్: ఏడాదికి రూ.60,000తోపాటు సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం రూ.20,000 అందిస్తారు. ఇలా ఐదేళ్లపాటు స్కాలర్షిప్ ఇస్తారు. అర్హత: వివిధ రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డ్ 2014లో నిర్వహించిన ఇంటర్మీడియెట్/10+2 పరీక్షల్లో ఆయా రాష్ట్రాల్లో టాప్ వన్ పర్సంట్ జాబితాలో నిలవాలి. లేదా జేఈఈ మెయిన్/అడ్వాన్స్డ్/ఏఐపీఎంటీలో టాప్ 10,000 ర్యాంకుల్లో చోటు దక్కించుకుని ఉండాలి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఫెలోషిప్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ స్కాలర్షిప్, జగదీశ్ చంద్ర బోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ విజేతలు, ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో పతకాలు గెలుచుకున్నవారు కూడా స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో విజయం సాధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ - సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్‌లో విద్యనభ్యసిస్తున్నవారు కూడా అర్హులే. ప్రస్తుతం గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కళాశాల/ఇన్స్టిట్యూట్లో నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో బీఎస్సీ/ బీఎస్సీ (హానర్స్)/నాలుగేళ్ల బీఎస్/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్/ఎంఎస్సీ కోర్సులు చదువుతుండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014 వెబ్సైట్:www.inspire-dst.gov.in/ ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్ జర్మనీలో నిర్దేశిత యూనివర్సిటీల్లో ఎల్ఎల్ఎం (యూరోపియన్ లా) చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ - ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్కు ప్రకటన వెలువడింది. స్కాలర్‌షిప్‌తో లభించేవి: సుమారు ఏడాది వ్యవధి ఉండే కోర్సులో భాగంగా నెలకు 750 యూరోల స్టైఫండ్, రానుపోను విమాన ఖర్చులకు ట్రావెల్ అలవెన్స్, స్టడీ అండ్ రీసెర్చ్ సబ్సిడీ కింద 460 యూరోలు, ఆరోగ్య, ప్రమాద బీమా. వీటితోపాటు రెండు నెలల జర్మన్ లాంగ్వేజ్ కోర్సులో భాగంగా ఉచిత నివాసం, ఫీజు మినహాయింపు, అలవెన్స్‌లు లభిస్తాయి. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: జనవరి/ఫిబ్రవరి-2015లో న్యూఢిల్లీలో నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2014 వెబ్సైట్: www.daaddelhi.org/en/ మైకాలో పీజీడీఎం - కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్‌లోని ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (మైకా).. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ (పీజీడీఎం-సి) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 10+2+3 విధానంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: క్యాట్-2014/ఎక్స్‌ఏటీ-2014, 2015/మ్యాట్-2014 /సీమ్యాట్- 2014/ఏటీఎంఏ-2014 వంటి పరీక్షల స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులకు గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.. దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2015 వెబ్సైట్: www.mica.ac.in -
మీ సమయాన్ని ఆదాచేసే 7 ఉచిత పీడీఎఫ్ టూల్స్
టూల్స్ ఎప్పుడైనా పీడీఎఫ్ ఫైలుతో మీరు విసిగిపోయారా? పీడీఎఫ్ ఫైల్ ఫార్మాట్‌ను మనం విరివిగా ఉపయోగిస్తున్నా కూడా.. అది కొన్నిసార్లు మనల్ని చాలా విసిగిస్తుంటుంది. పీడీఎఫ్ కేవలం చదవడమే అయితే ఈజీనే. కానీ, దాన్ని క్రియేట్ చేయడమో లేక ఎడిట్ చేయడమో చేయాలంటే కొన్నిసార్లు తలప్రాణం తోకకొస్తుంటుంది. ఇంతకుమించిన పనులేమైనా పీడీఎఫ్‌తో చేయాలంటే.. ఆ పని ఎక్కడో చోట ఆగినా ఆగిపోతుంది. అదష్టవశాత్తూ వెబ్‌లో మనకు ఎన్నెన్నో పీడీఎఫ్ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అందరికీ పెద్దగా తెలియని ఉపయుక్తమైన టూల్స్ మీ కోసం. వీటిలో సాదాసీదా ఎడిటింగ్, క్రియేటింగ్ గురించి కాకుండా కొన్ని కొత్త సంగతులకు సంబంధించిన వాటినే వివరించాం.. జొటి మాల్వేర్ స్కాన్ EXE , ZIP ఫైల్లో వైరస్లు దాక్కొని ఉండే అవకాశముందని మనకు తెలిసిందే. కానీ పీడీఎఫ్‌లలో కూడా అంతర్గతంగా వైరస్లు ఉండే చాన్స్ ఉందని ఎంత మందికి తెలుసు? అలా ఏదైనా పీడీఎఫ్‌లో వైరస్ ఉందా అని చెక్ చేయాలంటే ఈ జొటి మాల్వేర్ స్కాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్లోకి మీ ఫైలును అప్లోడ్ చేస్తే అది 20కిపైగా వేర్వేరు మాల్వేర్ స్కానర్లతో పరీక్షిస్తుంది. కేవలం క్షణాల్లోనే ఫలితం చూపిస్తుంది. ఆన్లైన్ ఓసీఆర్ మీరు ఓ పీడీఎఫ్ ఫైలు నుంచి ఒక పారాను టెక్ట్స్ రూపంలో కాపీ చేసుకోవాలనుకున్నారు. కొన్ని రీడర్లలో ఈ పని చాలా సులువుగా అయిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం చాలా చికాకు తెప్పిస్తుంది. దీనికి సరైన సలహా.. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) టూల్ వాడడమే. ఇది ఫైలులోని ప్రతి క్యారెక్టర్‌నూ టెక్ట్స్ రూపంలో మార్చి అందిస్తుంది. చూడ్డానికి పీడీఎఫ్‌ను వర్డ్ లోకి కన్వర్ట్ చేసినట్లు అనిపించవచ్చుగానీ.. నిజానికి ఇది కొంచెం వేరే ప్రక్రియే. ఇందులో కేవలం టెక్ట్స్ మాత్రమే కన్వర్టవుతుంది. ఇది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. డిఫ్ నౌ మీరు ఎప్పుడైనా ఒకే ఫైలుకు సంబంధించి రెండు వర్షన్లు అందుకొని వాటిలో ఏం మార్పు జరిగిందబ్బా అని ఆలోచించే పరిస్థితి ఎదుర్కొన్నారా? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫైళ్లను డిఫ్ నౌ లోకి అప్లోడ్ చేస్తే.. ఏమేం మార్పులు జరిగాయో అది ఇట్టే చెప్పేస్తుంది. ఏం కలిపారు? ఏం తీసేశారు? ఏం మార్చారు? అన్న వివరాలు తెలియజేస్తుంది. హెచ్‌టీఎంఎల్ టు పీడీఎఫ్ ఏదైనా వెబ్ పేజీని పీడీఎఫ్‌లో సేవ్ చేసుకోవాలంటే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఈ ఆన్లైన్ టూల్‌లోకి మీరు కోరుకున్న యూఆర్ఎల్ ఇచ్చి పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడమే. అలాంటి మరికొన్ని టూల్స్: పీడీఎఫ్ ప్రొటెక్ట్, పీడీఎఫ్ అన్‌లాక్, పీడీఎఫ్ కంప్రెస్... వీటి పేరును బట్టి అవి ఎందుకు ఉపయోగపడతాయో అర్థమైపోతుందిగా. -razesh007@gmail.com -
యంత్రం... సేద్యపు మంత్రం
- వ్యవసాయంలో పెరుగుతున్న యాంత్రీకరణ - యాంత్రీకరణ పథకం అమలుతో జిల్లాలో విప్లవాత్మక మార్పులు - సబ్సిడీ పరికరాల కోసం పదేళ్లలో రూ.39 కోట్లు ఖర్చు అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయ రంగంలో ఇటీవల యాంత్రీకరణ పెరుగుతోంది. పెద్ద రైతులే కాకుండా చిన్న,సన్నకారు రైతులు కూడా అత్యాధునిక యంత్రాలు, పనిముట్లను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీతో పరికరాలు అందజేస్తూ..వ్యవసాయ యాంత్రీకరణ దిశగా రైతులను ప్రోత్సహిస్తోంది. ఉపాధి హామీ పథకం, కరువు పరిస్థితుల వల్ల వలసలు పెరగడం.. తదితర కారణాలతో ఇటీవల వ్యవసాయ కూలీల కొరత ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం ముందుకు సాగాలంటే యంత్ర పరికరాలు, ఆధునిక సామగ్రిపై ఆధారపడక తప్పడం లేదు. స్ప్రేయర్లు మొదలుకుని డీజిల్ ఇంజన్లు, మినీ ట్రాక్టర్లు, రోటోవీటర్లు, కల్టివేటర్లు, గుంటకలు, గొర్రు, సీడ్ డ్రిల్లర్లు, నూర్పిడి, పంటకోత యంత్రాలు తదితర 70 రకాల యంత్ర పరికరాలను రైతులు ఉపయోగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్నేళ్లుగా యాంత్రీకరణ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వస్తున్నాయి. గత పదేళ్లలో రూ.39 కోట్లు ఖర్చు చేశాయి. అగ్రోస్ ద్వారా టెండర్లు పిలిచి ధరలు నిర్ణయించిన తరువాత అధీకృత తయారీ కంపెనీల ద్వారా యంత్ర పరికరాలను రాయితీతో రైతులకు అందజేస్తున్నారు. ఎద్దులతో నడిచే వాటికి 50 శాతం, ట్రాక్టర్‌తో నడిచే యంత్రాలకు, నూర్పిడి మిషన్లు, పంటకోత యంత్రాలకు గరిష్టంగా రూ.45 వేల వరకు రాయితీ వర్తింపజేస్తున్నారు. సాధారణ యాంత్రీకరణ పథకమే కాకుండా రాష్ట్రీయ కృషివికాస యోజన (ఆర్కేవీవై) కింద అమలు చేస్తున్న యంత్రలక్ష్మి పథకం ద్వారా, అదనపు యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు యంత్ర పరికరాలను అందజేస్తున్నారు. యంత్రలక్ష్మి పథకంలో భాగంగా 2012-13లో రూ.4.06 కోట్లు, 2013-14లో రూ.2.25 కోట్లు వ్యయం చేశారు. అదనపు యాంత్రీకరణ కింద రూ.1.10 కోట్లు వెచ్చించారు. అలాగే గతేడాది టార్పాలిన్ల పంపిణీ కోసం రూ.71 లక్షలు వెచ్చించారు. సకాలంలో అందజేయడంలో విఫలం రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను సకాలంలో రైతులకు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. ఖరీఫ్ ప్రారంభంలోనే అందజేస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. కానీ.. సీజన్ మధ్యలో ఇస్తున్నారు. రైతులు, రైతుమిత్ర గ్రూపుల నుంచి దరఖాస్తులు, డీడీలు తీసుకున్న తర్వాత వారం పది రోజుల వ్యవధిలో పంపిణీ చేస్తే ఆశించిన ఫలితం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. గత ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులోకి రావడంతో ఆ వర్గాలకు తప్పనిసరిగా 22 శాతం నిధులు ఖర్చు చేసి.. అవసరమైన పరికరాలు అందజేయాల్సి ఉంటోంది. అయితే.. ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయిస్తున్న నిధుల్లో కొంత మేరకు మిగులుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ రైతులకు రూ.70.13 లక్షలు కేటాయించగా.. రూ.25.04 లక్షలు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఎస్టీ రైతులకు రూ.28.59 లక్షలు కేటాయించగా.. కేవలం రూ.7.71 లక్షలు ఖర్చు పెట్టారు. మొత్తమ్మీద గత పదేళ్లలో జిల్లాకు 33,750 యూనిట్లు మంజూరు కాగా.. అందులో 29,074 యూనిట్లు పంపిణీ చేశారు. సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో 4,676 యూనిట్లు అందజేయలేక పోయారు