సాక్షి,ముంబై: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు వేలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి.మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలుఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!)
1956లో జాన్ మెక్‌కార్తీ ఈ అంశంపై మొదటి విద్యాసంబంధ సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. 2022లో శరవేగంగా ముందుకు దూసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు అనేది మనిషి తరహాలోనే ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోగలదు కూడా. వ్యాపార సామర్థ్యాన్ని పెంచడంలో, నిర్ణయం తీసుకోవడంలో ఖర్చులను తగ్గించడంలో కూడా ఏఐ సాయపడుతుందనేది ప్రధాన ఆలోచన. అలాగే మార్కెటింగ్‌లో, కస్టమర్ డేటాను విశ్లేషించడం, ట్రెండ్‌లను గుర్తించడంతో పాటు, కస్టమర్ల ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించేందుకు ఉపయోగ పడుతుంది.తద్వారా ప్రత్యర్థులతో పోలిస్తే మరింత ముందుగా వ్యూహ రచనలో దూసుకుపోవచ్చని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలకుపయోగపడే కొన్నిముఖ్యమైన ఏఐ టూల్స్‌గురించి తెలుసుకుందాం.
టాప్ ఏఐ టూల్స్
చాట్ జీపీటీ ( AI సంచలనం)
క్విల్‌బాట్: ఇన్‌స్టంట్ పారాఫ్రేజర్
అప్‌వర్డ్: ఇన్నోవేటివ్ సమ్మరైజర్
కెరీర్‌దేఖో ఏఐ
నెట్‌వర్క్ ఏఐ
అప్లికెంట్ ఏఐ
కిక్ రెస్యూమ్
ల్యాంగ్వేజ్‌ప్రొ
అడాప్టివ్ ఎకాడమీ
రెస్యూమ్ చెక్
ఫింగర్ పప్రింట్ సక్సెస్
అన్‌స్కూలర్
రెస్యూమ్ ఏఐ
పాయిజ్డ్
ప్రాడిజీ ఏఐ
లాంగోటాక్
Comments
Please login to add a commentAdd a comment