Economic recession
-
నిరసనల ధాటికి రాజీనామా చేసి.. బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు చేరిన ప్రధాని షేక్ హసీనా..
-
ఎమ్మెస్.. టైమ్ పాస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ఐటీ రంగాన్ని కుదిపివేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు విదేశీ చదువులపై దృష్టి పెట్టారు. సాఫ్ట్వేర్ రంగం గాడిన పడే వరకూ ఎంఎస్ చేయడమే మేలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021 విద్యా సంవత్సరంలో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య ఏకంగా 6.84 లక్షలకు పెరిగింది. 2023 చివరి నాటికి ఈ సంఖ్య మరో 10 వేల వరకు పెరిగిందని అంచనా. అమెరికా వంటి దేశాల్లో ఐటీ సెక్టార్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిసినా.. ఈ ఒక్క దేశానికే 2023లో 2.80 లక్షల మంది భారతీయులు విద్య కోసం వెళ్ళారు. మరోవైపు కెనడా వీసా ఆంక్షలకు నిబంధనలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నా, చదువు కోసం వెళ్ళేందుకే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే నైపుణ్యం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నది వీళ్ళే. మిగతా వాళ్ళు వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని సంబంధం లేని ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇంతకాలం వీళ్ళ అవసరం ఉండేది. అవసరమైన శిక్షణ ఇచ్చి కంపెనీలు వారి సేవలను వినియోగించుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్ ఐటీ రంగంపైనా ప్రభావం చూపించింది. ప్రధాన కంపెనీలన్నీ వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాలుమాత్రం ఇవ్వలేదు. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. ఈ కారణంగానే విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్నారు. సమయం వృథా ఎందుకుని.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. కానీ చాలా సంస్థలు ఇంత వరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నాస్కామ్ తాజాగా జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు భారత్‌లో 2.5 లక్షలు ఉంటారని తేలింది. మన రాష్ట్రంలోనే 24 వేల మందికి పైగా ఉన్నట్టు స్పష్టమైంది. మరో వైపు అమెరికా ప్రాజెక్టులు తగ్గుతున్నా యని కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నియామక ఉత్తర్వులు వస్తాయన్న భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండటం దేనికి? అని యువత భావిస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ తర్వాత జాబ్‌లోకి తీసుకోవడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపవు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పరిస్థితి చక్కబడే వరకూ ఎమ్మెస్ లాంటిది చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లభించని బ్యాంకు రుణాలు విదేశీ విద్యకు గతంలో తేలికగా రుణాలు లభించేవి. కానీ గత ఏడాది కాలంగా బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనిన విద్యార్థులు అంటున్నారు. బ్యాంకు రుణాల విధానాన్ని సవరించడమే దీనికి కారణమని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకూ అప్పు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో చదివేటప్పుడు తీర్చేద్దామన్న ధీమాతో వెళ్తున్నారు. విదేశాల్లో ఏదైనా పార్ట్‌టైం జాబ్ చేయొచ్చనేది వారి ఆలోచన. కానీ గతేడాది డిసెంబర్లో వెళ్ళిన విద్యార్థులకు అమెరికాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉందని అక్కడి విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ఐటీ కోలుకోవడంపైనే ఆశలు బీటెక్ పూర్తయ్యాక ఇండియాలో ఏడాది పాటు ఉద్యోగం కోసంవిఫల ప్రయత్నం చేశా. చివరకు అమెరికా వెళ్ళి ఎమ్మెస్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో అర ఎకరం పొలం అమ్మి డబ్బులిచ్చారు. నేను కొంత అప్పు చేశా. డిసెంబర్లో అమెరికా వచ్చా. ఇక్కడ పార్ట్ టైం జాబ్ కష్టమని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. మళ్ళీ అప్పు చేయమని తల్లిదండ్రులకు చెప్పడం ఇబ్బందిగానేఉంది. ఐటీ కోలుకుంటే పరిస్థితి మారుతుందనే నమ్మకం ఉంది. –శశాంక్ (అమెరికా వెళ్ళిన వరంగల్ విద్యార్థి) ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చారు బీటెక్ అవ్వగానే ఆఫ్ క్యాంపస్‌లో ఓ కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసింది. ఉద్యోగం వచ్చిందని నేను, మా వాళ్ళూ బంధువులందరికీ చెప్పుకున్నాం. ఆ లెటర్ పట్టుకుని ఏడాది నిరీక్షించా. ఎంతకీ అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. ఇప్పుడు చిన్నతనంగా ఉంది. అందుకే అప్పు చేసి మరీ అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నా. ఎమ్మెస్ అయిపోయే లోగా పరిస్థితి మారుతుందనే ఆశ ఉంది.– పి. నీలేశ్ కుమార్ (యూఎస్ వెళ్ళేందుకు సిద్ధమైన హైదరాబాద్ విద్యార్థి) -
ఐటీ లేఆఫ్స్: కొత్త ఉద్యోగాల కోసం బ్రహ్మాండమైన ఏఐ టూల్స్ ఇవిగో!
సాక్షి,ముంబై: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు వేలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి.మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలుఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!) 1956లో జాన్ మెక్‌కార్తీ ఈ అంశంపై మొదటి విద్యాసంబంధ సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. 2022లో శరవేగంగా ముందుకు దూసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు అనేది మనిషి తరహాలోనే ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోగలదు కూడా. వ్యాపార సామర్థ్యాన్ని పెంచడంలో, నిర్ణయం తీసుకోవడంలో ఖర్చులను తగ్గించడంలో కూడా ఏఐ సాయపడుతుందనేది ప్రధాన ఆలోచన. అలాగే మార్కెటింగ్‌లో, కస్టమర్ డేటాను విశ్లేషించడం, ట్రెండ్లను గుర్తించడంతో పాటు, కస్టమర్ల ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించేందుకు ఉపయోగ పడుతుంది.తద్వారా ప్రత్యర్థులతో పోలిస్తే మరింత ముందుగా వ్యూహ రచనలో దూసుకుపోవచ్చని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలకుపయోగపడే కొన్నిముఖ్యమైన ఏఐ టూల్స్గురించి తెలుసుకుందాం. టాప్ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ ( AI సంచలనం) క్విల్‌బాట్: ఇన్స్టంట్ పారాఫ్రేజర్ అప్‌వర్డ్: ఇన్నోవేటివ్ సమ్మరైజర్ కెరీర్దేఖో ఏఐ నెట్వర్క్ ఏఐ అప్లికెంట్ ఏఐ కిక్ రెస్యూమ్ ల్యాంగ్వేజ్ప్రొ అడాప్టివ్ ఎకాడమీ రెస్యూమ్ చెక్ ఫింగర్ పప్రింట్ సక్సెస్ అన్స్కూలర్ రెస్యూమ్ ఏఐ పాయిజ్డ్ ప్రాడిజీ ఏఐ లాంగోటాక్ -
RBI Bulletin: వృద్ధి నెమ్మదించదు..
ముంబై: ఆర్థిక మాంద్యం అంచున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ మందగించదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్ స్పష్టం చేసింది. భారత్‌లో పలు రంగాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాయని పేర్కొన్న ఆర్టికల్, ఇదే మంచి ఫలితాలు మున్ముందూ కొనసాగుతాయన్న ధీమాను వ్యక్తం చేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన ఈ కథనంలోని అభిప్రాయాలు ఆర్బీఐగా పరిగణించడానికి వీలు లేదని కూడా బులెటిన్ పేర్కొనడం గమనార్హం. ► గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల అనిశ్చితి కారణంగా 2023లో ప్రపంచ వృద్ధి మందగించడానికి లేదా మాంద్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుండి స్థిరమైన వృద్ధి ధోరణి ఊపందుకోవడం దీనికి కారణం. తొలి అంచనాలకన్నా ఎకానమీ వృద్ధి బాటన పయనిస్తోంది. మహమ్మారి తీవ్రత నుంచి సమర్థవంతమైన రీతిలో బయట పడింది. ► ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో మనం ఫలితాలను వార్షికంగా సమీక్షించుకుంటే వృద్ధి ధోరణి కనబడదు. బేస్ ఎఫెక్ట్ ఇక్కడ ప్రధానంగా శాసిస్తుంది. త్రైమాసికంగా ఈ మదింపు జరపాల్సి ఉంటుంది. ► కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్టీఏఆర్టీ) నుండి రష్యా తన భాగస్వామ్యాన్ని సస్పెండ్ చేయడం, వడ్డీరేట్లకు సంబంధించి కఠిన వైఖరి కొనసాగుతుందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) నుంచి వచ్చిన సంకేతాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ భారీ పెరుగుదల వంటి అంశాలు భారత్ మార్కెట్ల సానుకూల వైఖరిని ఫిబ్రవరి 2023 ద్వితీయార్థంలో తగ్గించాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఫిబ్రవరిలో తన తొలి లాభాలను వదులుకొని మొత్తంగా ఒక శాతం క్షీణించింది. మార్చి తొలినాళ్లలో తిరిగి కొంత కోలుకుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడం దీనికి ఒక కారణం. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ వాతావరణం దేశీయ ఈక్విటీలపై తిరిగి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో భారీగా క్షీణించాయి. 44 శాతం నీరసించి 3.7 బిలియన్ డాలర్ల(రూ. 30,560 కోట్లు)కు పరిమితమయ్యాయి. గతేడాది(2022) ఫిబ్రవరిలో ఇవి 6.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది(2023) జనవరిలో లభించిన 4.31 బిలియన్ డాలర్లతో పోల్చినా తాజా పెట్టుబడులు 13 శాతం తగ్గాయి. పరిశ్రమల లాబీ.. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదికలోని వివరాలివి. ఇతర అంశాలు చూద్దాం.. కారణాలివీ.. ప్రపంచ ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య అంచనాలను అందుకోని వేల్యుయేషన్లు వంటి అంశాలు పీఈ, వీసీ పెట్టుబడుల క్షీణతకు కారణమైనట్లు ఈవై పార్ట్నర్ వివేక్ సోని పేర్కొన్నారు. ఇటీవల సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) వైఫల్యంతో గ్లోబల్ ఫైనాన్షియల్ పరిస్థితులలో మార్పులు వచ్చినట్లు తెలియజేశారు. ఈ ప్రభావం యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలకు నిధులు అందించే మధ్యస్థాయి బ్యాంకులపై పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది అనిశ్చితికి దారితీసినట్లు తెలియజేశారు. వెరసి మధ్యకాలానికి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు అంచనా వేశారు. డీల్స్ వెనకడుగు ఈవై నివేదిక ప్రకారం గత నెలలో డీల్స్ 60 శాతం క్షీణించి 55కు పరిమితమయ్యాయి. 2022 ఫిబ్రవరిలో ఇవి 139కాగా.. ఈ జనవరిలో 75 లావాదేవీలు నమోదయ్యాయి. రంగాలవారీగా చూస్తే ఈ ఫిబ్రవరిలో రియల్టీ అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. వీటిలో కార్యాలయ ఆస్తుల ఏర్పాటుకు సీడీపీక్యూ అనుబంధ సంస్థతో కలసి టెమాసెక్ ప్రకటించిన 1.9 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్రణాళికలున్నాయి. మరోపక్క 10 కోట్ల డాలర్ల భారీ డీల్స్ 9 మాత్రమే నమోదయ్యాయి. అయితే 11 అమ్మకపు లావాదేవీలకూ తెరలేచింది. వీటి విలువ 73.1 కోట్ల డాలర్లుకాగా.. గతేడాది ఫిబ్రవరిలో 1.4 బిలియన్ డాలర్ల విలువైన 13 ఎగ్జిట్ డీల్స్ నమోదయ్యాయి. ఈ జనవరిలో 89.8 కోట్ల డాలర్ల విలువైన 20 అమ్మకపు లావాదేవీలు జరిగాయి. అయితే ఇండియాకు మాత్రమే కేటాయించిన ఫండ్స్ గత నెలలో 88.1 కోట్ల డాలర్లు సమకూర్చుకోగా.. గతేడాది ఫిబ్రవరిలో 34.7 కోట్ల డాలర్లు మాత్రమే సమీకరించాయి. వీటిలో డేటా సెంటర్ల కోసం కొటక్ ఆల్టర్నేట్ అసెట్ సమీకరించిన 59 కోట్ల డాలర్లు అత్యధికం. -
అధిక జీతాలిచ్చే 'కొలువులివే'.. డిమాండ్ అధికంగా ఉన్న ఉద్యోగాలు
ఆర్థిక మాంద్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండటం.. తాజాగా చదువులు పూర్తిచేసుకుంటున్న విద్యార్థుల్లో గుబులుపుట్టిస్తోంది. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తుండడంతో అంతే వేగంగా ఉపాధి అవకాశాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలను బట్టి ఆయా సంస్థలు వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు పూర్తయిన తర్వాత అధిక వేతనాలిచ్చే కొలువులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కూడా ఆసక్తి నెలకొని వుంది. ఈ నేపథ్యంలో.. 2023లో అధిక వేతనాలిస్తూ డిమాండ్ అధికంగా ఉన్న 10 రకాల ఉద్యోగాలను ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ సింప్లీ లెర్న్ విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ పది ఉద్యోగాల్లో వార్షిక వేతనం రూ.7 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అందిస్తున్నాయి. – సాక్షి, అమరావతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ దేశీయంగా, అంతర్జాతీయంగా అత్యధిక వేతనాలు అందిస్తున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కొలువు ఒకటి. ఖాతాదారులకు సంబంధించిన నగదును నిర్వహిస్తూ వారికి అధిక లాభాలను అందించడమే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ విధి. ఫైనాన్స్ సబ్జెక్ట్‌తో పాటు వివిధ ఫైనాన్షియల్ సేవలపై పట్టున్న వారికి ఇది సరైన కెరీర్. ఈ రంగంలో ప్రారంభ వేతనాలు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉన్నా, అనుభవమున్న వారికి రూ.40 లక్షల వరకు కూడా ఇవ్వడానికి సంస్థలు ముందుకొస్తున్నాయి. సిటీబ్యాంక్, డచ్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, గోల్డ్‌మాన్‌శాక్స్, జేపీ మోర్గాన్ ఛేజ్ వంటి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి. బ్లాక్‌చైన్ డెవలపర్ ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజీ కోర్సుల్లో అత్యధికంగా వినపడేది బ్లాక్‌చైన్ టెక్నాలజీనే. దేశాల నగదు లావాదేవీలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా సెక్యూరిటీ వంటి వాటిలో బ్లాక్‌చైన్ కీలకపాత్ర పోషిస్తుంది. కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సు చేసినవారికి సగటు ప్రారం¿ý వేతనం రూ.8,01,938 లభిస్తుంటే, అనుభవం ఉన్నవారికి రూ.45 లక్షలు వరకు ఇస్తున్నాయి. ఆక్సీసెస్, సైంజీ, ప్రిమ్చైన్, సాఫ్ట్కోల్, ఓపెన్ ఎక్సల్, మైండెఫ్ట్ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. వైద్య వృత్తి అధిక వేతనంతో అధిక డిమాండ్ ఉన్న వాటిలో వైద్య వృత్తి కూడా ఒకటి. దేశంలో వైద్య సేవలు వేగంగా విస్తరిస్తుండటంతో వైద్య నిపుణులకు అధిక వేతనం చెల్లించడానికి ఆస్పత్రులూ వెనుకాడటంలేదు. కేవలం డాక్టర్స్, సర్జన్సే కాకుండా ఈ రంగానికి అవసరమైన హెల్త్‌కేర్ అడ్మిన్, నర్సింగ్, ఫార్మసీ, హోమ్ హెల్త్ వంటి రంగాలకు డిమాండ్ ఉంటోంది. దేశంలో సగటు వైద్యుడి వేతనం రూ.10 లక్షలుగా ఉంది. జనరల్ ఫిజీషియన్స్కు రూ.6.99 లక్షలు, జనరల్ సర్జన్స్‌కు రూ.11.59 లక్షలు ఇస్తుంటే స్పెషలైజేషన్ చేసిన వారికి రూ.20 లక్షల వరకు వేతనం లభిస్తోంది. ఎయిమ్స్, ఫోర్టిస్, అపోలో, మాక్స్, కొలంబియా ఆసియా వంటి ఆస్పత్రులు అధిక వేతనాన్ని ఇస్తున్నాయి. మెషిన్ లెర్నింగ్ వ్యాపార సంస్థలు తమ వ్యాపార విస్తరణలో మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) కీలకపాత్ర పోషిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు సంబంధించిన వాటిలో మెషిన్ లెర్నింగ్ ఒకటి. ఎంఎల్ ప్రోగ్రాంల ద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన ఆల్గోరిథమ్స్‌ను ఈ నిపుణులు అభివృద్ధి చేస్తారు. ఎంఎల్ కోర్సు పూర్తిచేసిన వారికి సగటున రూ.7.28 లక్షల వేతనం లభిస్తోంది. అదే అనుభవం ఉన్న వారికి రూ.19.48 లక్షల వరకు వేతనాన్ని ఇస్తున్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, ఐటీసీ ఇన్ఫోటెక్, జైకస్, క్వాంటిపి వంటి సంస్థలు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వ్యాపార రంగంలో ఒక వస్తువును డిజైన్ చేసి, అభివృద్ధి చేసి దాన్ని వేగంగా మార్కెట్లోకి తీసుకెళ్లడం అనేది అత్యంత కీలకం. ప్రోడక్ట్ మేనేజర్లు ఒక వస్తువును డిజైన్ చేసి దాన్ని మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రంగంలో సగటు ప్రారంభ వేతనం రూ.14.40 లక్షలుగా ఉంది. ప్రారంభ వేతనం రూ.7లక్షలు లేదా రూ.8 లక్షల నుంచి, అనుభవమున్న వారికి రూ.17లక్షలు–రూ.26లక్షల వరకు ఇస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, సేల్స్‌ఫోర్స్, ఊబర్, ఓలా వంటి సంస్థల్లో వీరికి డిమాండ్ ఉంది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఎంబీఏ చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ వృత్తిని ఎంచుకున్న వారికి సగటున రూ.11.49 లక్షల వేతనం లభిస్తోంది. వీరికి ప్రారంభ వేతనం రూ.6లక్షలు–రూ.7 లక్షల నుంచి ఉంటే అనుభవం ఉన్న వారికి రూ.17లక్షలు నుంచి రూ.26 లక్షల వరకు వేతనం లభిస్తోంది. కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, మెకన్సీ, డెలాయిట్, ఎర్నెస్ట్ యంగ్, యాక్సెంచర్ వంటి సంస్థలు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అవకాశాలు కల్పిస్తున్నాయి. సీఏ, మార్కెటింగ్ మేనేజర్స్, బిజినెస్ అనలిస్ట్ వంటి రంగాల్లో కూడా రూ.4 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి. ఈ మూడు వృత్తులను ఎంచుకున్న వారికి ఈ ఏడాది దేశంలోని పలు అంతర్జాతీయ సంస్థలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్‌కు స్టాండర్డ్ చార్టర్డ్, ఎర్నెస్ట్ ఎంగ్, డెలాయిట్, కేపీఎంజీ, బీడీఓ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు.. మార్కెటింగ్ మేనేజర్లకు ఐబీఎం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టీసీఎస్, టాటా మోటర్స్ వంటి సంస్థలు.. బిజినెస్ అనలిస్ట్‌లకు మైక్రోసాఫ్ట్, సిటీ, యాక్సెంచర్, అమెజాన్ వంటి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి. డేటా సైంటిస్ట్ అంతర్జాతీయంగా ఇప్పుడు అత్యధిక డిమాండ్ ఉన్నది డేటా సింటిస్ట్లకే. అందుబాటులో ఉన్న డేటాను సేకరించి సరైన విశ్లేషణ చేసే వారికి రూ.లక్షల్లో జీతాలను ఇవ్వడానికి సంస్థలు పోటీ పడుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌లో పట్టున్న వారికి డేటా సైంటిస్ట్ రంగం సరైన వేదిక. డేటాసైన్స్ రంగం ఎంచుకున్న వారికి దేశంలో సగటున రూ.11 లక్షల వేతనం అందుతుండగా, అనుభవం ఉన్న వారికి రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వేతనం ఇవ్వడానికి కంపెనీలు వెనుకాడటంలేదు. డేటాసైన్స్ సర్టిఫికేషన్ పూర్తిచేసిన వారికి అమెజాన్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, వాల్‌మార్ట్ ల్యాబ్స్, గ్రే ఆటమ్ వంటి సంస్థలు తలుపులు తెరిచి ఉంచుతున్నాయి. -
ఓఎల్ఎక్స్లో భారీగా ఉద్యోగ కోతలు: కారణం ఏంటంటే?
సాక్షి,ముంబై:ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఖర్చులనుతగ్గించుకునే పనిలో దిగ్గజ సంస్థలు కూడా వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపిస్తున్నారు. ప్రతీ రోజు ఏదో ఒక కంపెనీ ఉద్యోగాల కోతను ప్రకటిస్తోంది. తాజాగా వస్తువుల కొనుగోలు, అమ్మకాల సంస్థ, నాస్పర్స్ యాజమాన్యంలోని ఆన్లైన్ గ్రూప్ ప్రోసస్ క్లాసిఫైడ్స్ యూనిట్ ఓఎల్ఎక్స్ గ్రూప్ 15 శాతం సిబ్బందిని ఇంటికి పంపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,500 మందిని తొలగించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను నియంత్రించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. భవిష్యత్తు ఆశయాల రీత్యా కంపెనీ అంతటా వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తునట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికల్లో భాగంగా, ఓఎల్ఎక్స్ గ్రూప్ తన ఇండోనేషియా కార్యకలాపాలను తగ్గించు కోవాలని చూస్తోందట. ఇప్పటికే ఆటో వ్యాపారాన్ని అమ్మకానికి ఉంచిందని డీల్స్ట్రీట్ ఆసియా గత వారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది.కాగా ప్రపంచవ్యాప్తంగా, ఓఎల్ఎక్స్ 10,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. -
షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థికమాంద్యం ప్రమాదం ఉద్యోగులు మెడకు చుట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికే టెక్, ఐటీ దిగ్గజాలు ఉద్యోగులు ఉపాధిపై దెబ్బకొట్టాయి.ఆదాయాలు తగ్గిపోవడం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల కోత ఆందోళన కొన సాగు తుండగానే తాజాగా ఈ భారీ తొలగింపుల సీజన్ సెగ మీడియా బిజినెస్‌ను తాకింది.(జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ యాజమాన్యంలోని సీఎన్ఎన్ ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ మేరకు నెట్వర్క్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ లిచ్ట్ బుధవారం మొత్తం టీమ్‌కు అంతర్గత సందేశంలో ఉద్యోగులను హెచ్చరించారు. ప్రధానంగా పెయిడ్ కాంట్రిబ్యూటర్స్పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. పొంచి ఉన్న మాంద్యం, పెరుగుతున్న స్ట్రీమింగ్ ఖర్చులను తగ్గించుకునేలా డిస్నీ ఉద్యోగుల తొలగింపులు, నియామక స్తంభన, ఇతర వ్యయాలను తగ్గించే కార్యక్రమాలను కూడా ప్రకటించింది. (వారికి భారీ ఊరట: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు) ఆర్థికరంగ మందగమనం ప్రభావాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యయాలను నియంత్రించు కునేందుకు ప్రధానంగా ఉద్యోగాల్లోనే కోత విధిస్తున్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, యాడ్ మార్కెట్ మందగింపుతో మీడియా వ్యాపారం కూడా దెబ్బతింటోంది. ఫలితంగా ఉద్యోగుల తొలగింపులు, నియామకాలు నిలిపివేత లాంటి ఇతర ఖర్చు తగ్గించే చర్యలను మీడియా సంస్థలు ప్రకటించాయి. సీబీఎస్, ఎంటీవీ, వీహెచ్1 లాంటి అనేక ఇతర నెట్‌వర్క్‌లను నిర్వహిస్తున్న మరో మీడియా పవర్‌హౌస్, పారామౌంట్ గ్లోబల్ ఇటీవల ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. (శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు) CNN boss Chris Licht informs employees in an all-staff note that layoffs are underway. Licht says those being notified today are largely paid contributors and then tomorrow CNN "will notify impacted employees." Licht will then provide an update to staff afterward. pic.twitter.com/nD0pt9Ruwj — Oliver Darcy (@oliverdarcy) November 30, 2022 -
చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో: అమెజాన్ సంచలన నిర్ణయం!
సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయంవైపుగా కదులుతోంది. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని కంపెనీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 10వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టర్ వర్కర్లను తొలగించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ముగిసిన అసైన్మెంట్ నోటిఫికేషన్లను ఆయా ఉద్యోగులు అందుకుంటున్నారు. దీంతో ఇ-కామర్స్ దిగ్గజం అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) కంపెనీ వార్షిక ప్రణాళిక ప్రక్రియలో భాగంగా హెడ్‌కౌంట్‌ను ఎక్కడ తగ్గించే క్రమంలో ఆయా టీంలు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థికమాంద్యం, పడిపోతున్న ఆదాయాల నేపథ్యంలో అమెజాన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎకో స్మార్ట్ స్పీకర్స్, అలెక్సా డిజిటల్ అసిస్టెంట్లకు బాధ్యత వహించే టీం, అలాగే అమెజాన్ రిటైల్ విభాగాలు, హెచ్ఆర్ విభాగంలో ఈ కోతలు ఉండనున్నాయి. (ఉద్యోగులకు అలర్ట్: ఆ బాటలో ఇన్ఫోసిస్, సూపర్ ఆఫర్ కూడా) డిసెంబర్ 31, 2021 లెక్కల ప్రకారం అమెజాన్‌లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ మొత్తం దాదాపు 16,08,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అక్టోబర్‌లో, హాలిడే సీజన్ డిమాండ్ కనుగుణంగా రెగ్యులర్ వార్షిక హైరింగ్ స్ప్రీలో భాగంగా దాదాపు లక్షా యాభై వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది. కానీ ఒక నెలలోనే పరిస్థితి తారుమారైంది. నియామకాలను నిలిపివేసిన కంపెనీ ఇపుడిక ఉద్యోగులను తగ్గించుకుంటోంది. కుదేలవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా టెక్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తున్నాని టెక్ నిపుణులు చెబుతున్నారు. ట్విటర్, మెటా పెద్ద ఎత్తున తొలగింపులను ప్రకటించగా, సోషల్‌మీడియా దిగ్గజం మెటా ఏకంగా 11వేల మందికి ఉద్వాసన పలికింది. ఇదీ చదవండి: ఎయిరిండియాకు భారీ షాక్, 122 మిలియన్ డాలర్ల జరిమానా -
అగ్రరాజ్యానికి ఆర్థిక మాంద్యం భయాలు
-
కరోనా కాటు: ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెనక్కి
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఆసియా దేశాల నుంచి ఇటీవల 26 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించినట్లు కాంగ్రెషనల్ నివేదిక తాజాగా అంచనా వేసింది. ఈ బాటలో దేశీ కేపిటల్ మార్కెట్ల నుంచి 16 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు తలెత్తనున్న అంచనాలు దీనికి కారణమైనట్లు స్వతంత్ర కాంగ్రెషనల్ రీసెర్చ్ సెంటర్(సీఆర్ఎస్) పేర్కొంది. కోవిడ్-19 గ్లోబల్ ఆర్ధిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావంపై రూపొందించిన తాజా నివేదిక వివరాలను స్వతంత్ర సీఆర్ఎస్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... మాంద్యంలో జర్మనీ, ఫ్రాన్స్, యూకే, స్పెయిన్, ఇటలీలలో 3 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ సహాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది(2020) తొలి త్రైమాసికం(జవనరి-మార్చి)లో యూరోజోన్ ఆర్థిక వ్యవస్థ 3.8 శాతం క్షీణించినట్లు గణాంకాలు వెలువడ్డాయి. 1995 తదుపరి ఒక త్రైమాసికంలో ఇది అత్యధిక క్షీణతకాగా.. క్యూ1లో యూఎస్ జీడీపీ 4.8 శాతం వెనకడుగు వేసింది. 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తరువాత మళ్లీ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు దన్నునివ్వడంతోపాటు.. క్రెడిట్ మార్కెట్లకు మద్దతుగా పలు సహాయక చర్యలు చేపట్టవలసి వచ్చింది. అంతేకాకుండా ప్రజల ప్రాణ పరిరక్షణకు వ్యాక్సిన్ల అభివృద్ధి తదితర కార్యకలాపాలపై దృష్టిసారించాయి. మూడు దేశాలు మినహా కోవిడ్-19 కారణంగా చైనా, ఇండియా, ఇండొనేసియా ఆర్థిక వ్యవస్థలు మాత్రమే 2020లో అతితక్కువగా ప్రభావితం కావచ్చు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన మిగిలిన దేశాల జీడీపీలు నీరసిస్తున్నాయి. కోవిడ్-19 సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు విభిన్న పాలసీలను అమలు చేస్తున్నాయి. దీంతో అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. భాగస్వామ్యాలు, భవిష్యత్‌పట్ల సందేహాలు వంటివి ఎదురవుతున్నాయి. వైరస్ వ్యాప్తి, లాక్‌డవున్ అమలు, బిజినెస్‌ల మూసివేత వంటి ప్రతికూలతల కారణంగా గ్లోబల్ ఎకానమీ ఊహించినదానికంటే అధికంగా బలహీనపడవచ్చని ఇటీవల ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లమంది పిల్లల చదువులు అనిశ్చితిలోపడగా.. విమానయాన రంగం 2020లో 113 బిలియన్ డాలర్లను కోల్పోనున్నట్లు అంచనా. -
2.5 కోట్ల ఉద్యోగాలకు కోత
జెనీవా: కరోనా వైరస్‌ను తక్షణమే నియంత్రించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) హెచ్చరించింది. 1930 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎల్ఒ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావంతో ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలు చేపట్టడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయని ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ విస్తరించకుండా వివిధ దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. సగం మందికి పైగా ఇల్లు కదిలి బయటకు రావడం లేదు. దీంతో ఉత్పాదకత పడిపోయింది. ఈ పరిణామంతో వివిధ దేశాలు సంస్థలను నడపలేక ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. అమెరికా, యూరప్‌లలో నిరుద్యోగం రేటు రెండు అంకెలు దాటేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ► అమెరికా గత దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. కరోనా విజృంభణ తర్వాత 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన దాని కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువ. ► యూరప్‌లో గత రెండు వారాల్లోనే 10 లక్షల మంది తమకు బతుకు గడవడమే కష్టంగా ఉందని, తమ సంక్షేమం కూడా చూడాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్‌లో ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ గత వారం రోజుల్లోనే 27% సిబ్బందిని తగ్గించారు. ► స్పెయిన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా 14% నిరుద్యోగ రేటు నమోదైంది. ► రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రియాలో తొలిసారిగా నిరుద్యోగం 12 శాతానికి ఎగబాకింది. ► జర్మనీలో గంట పనికి వేతనం ఇచ్చే విధానం అమల్లో ఉంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని గంటల్ని రికార్డు స్థాయిలో తగ్గించాయి. దేశంలో ఇంచుమించుగా 4,70,000 కంపెనీలు జర్మనీ ప్రభుత్వానికి వేతన మద్దతు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. ► ఫ్రాన్స్‌లో కూడా వివిధ వ్యాపార కంపెనీలు జీతం చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో 20% మందికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదని ప్రభుత్వమే సాయపడాలని కోరాయి ► థాయ్‌లాండ్‌లో 2.3 కోట్ల మంది (దాదాపుగా మూడో వంతు జనాభా) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి దరఖాస్తులు చేసుకున్నారు. ► చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నప్పటికీ రెండు నెలలు కరోనా సృష్టించిన కల్లోలంతో దాదాపుగా 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అంచనా. -
ముగింపు ..తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారింది. మరీ ముఖ్యంగా ముగింపు దశలోని ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు భారీగా తగ్గాయి. మరో రూ.వెయ్యికోట్లు కేటాయించినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కానీ, ప్రభుత్వం కేవలం రూ.87 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు. కోయిల్సాగర్ల కింద మొత్తంగా 8.78 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 6.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తిచేయగా, మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన పనుల పూర్తికి, 12 శాతం మేర మిగిలిన భూసేకరణకు రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి ప్రాజెక్టుకు కనిష్టంగా రూ.400 కోట్లు కేటాయించాలని కోరినా కేవలం రూ.4 కోట్లతో సరిపెట్టారు. ఈ ప్రాజెక్టు కింద పనులకు సంబంధించి రూ.70 కోట్లు, భూసేకరణకు సంబంధించి రూ.17 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ ప్రాజెక్టు కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే 3 లక్షల ఎక రాల కు నీరిచ్చే అవకాశాలుండగా, మిగతా ఆయకట్టు ను వచ్చే ఏడాదికి సిద్ధం చేయాల్సి ఉంది. ఈ నిధులతో అధి సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక భీమా, నెట్టెంపాడుల పరిధిలోనూ పెండింగ్ బిల్లులు రూ.33 కోట్ల మేర ఉన్నాయి. భూసేకరణకు మరో రూ.17 కోట్లు అవసరం. వీటి కింద నిర్ణయించిన చెరో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే కనిష్టంగా రూ.400 కోట్లు అవసరంకాగా కేవలం రూ.50 కోట్లు కేటాయించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్.. ప్రాణహిత మూలకే.. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లోని టన్నెల్ పనులు గాడిన పడే అవకాశం కనబడటం లేదు. పనుల పూర్తికి నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడమే దీనికి కారణం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా, మరో 10 కి.మీ లకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కి.మీ. టన్నెల్ పూర్తవగా తర్వాత ఐదేళ్లలో 9 కి.మీ. మేర తవ్వారు. కన్వేయర్ బెల్ట్, ఇతర యంత్రాలను మార్చాల్సి రావడంతో వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ఏజెన్సీకి రూ.80 కోట్లను అడ్వాన్సు కింద చెల్లించాలని ప్రతిపాదన వచ్చినా తుది రూపం తీసుకోలేదు. పనులకు సంబంధించి రూ.80 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులకు రూ.22 కోట్లు, భూసేకరణకు రూ.270 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దృష్ట్యా ప్రాజెక్టుకు రూ.300 కోట్ల మేర కేటాయింపులు కోరినా రూ. 17.31 కోట్లను మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ్మిడిహెట్టి కాకుండా దానికి ఎగువన వార్ధా నదిపై దీన్ని నిర్మించాలని భావిస్తుండ టంతో ప్రభుత్వం కేటాయింపులు తగ్గించింది. -
తగ్గిన చదివింపులు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం దెబ్బ విద్యాశాఖపైనా పడింది. పొదుపు పాటిస్తూ ప్రగతిపద్దుతోపాటు నిర్వహణ పద్దులోనూ కోత పెట్టింది. గతేడాది ప్రతిపాదిత అంచనాలతో పోల్చితే ఈసారి రూ.3,378.35 కోట్లకు కోత పెట్టగా, సవరించిన అంచనాలతో పోల్చితే రూ. 2,929.75 కోట్లకు కోత పడింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ విద్యారంగం వాటా 7.6 శాతం ఉండగా, ఈసారి మాత్రం 6.75 శాతానికి విద్యారంగం బడ్జెట్ తగ్గిపోయింది. గతేడాది బడ్జెట్లో విద్యాశాఖకు రూ.13,278.19 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానిని రూ. 12,823.57 కోట్లకు సవరించింది. ఈసారి రూ.1,46,492 కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యారంగానికి రూ.9,899.82 కోట్లు కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.8,209.03 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యకు రూ.1,367.88 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.322.91 కోట్లు కేటాయించింది. ఇవీ విభాగాల వారీగా కేటాయింపులు.. పాఠశాల విద్యకు కేటాయించిన మొత్తంలో పాఠశాలవిద్యకు రూ.7,781.5 కోట్లు, ప్రభుత్వ పరీ క్షల విభాగానికి రూ.24.62 కోట్లు, వయోజన విద్యకు రూ.22.76 కోట్లు, ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.51.35 కోట్లు, జవహర్ బాలభవన్ కు రూ.4.21 కోట్లు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి రూ.35.9 కోట్లు, రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రూ.147.52 కోట్లు, సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ. 135.4 కోట్లు, ఇతరాల కింద మిగతా నిధులను కేటాయించింది. ప్రగతిపద్దులో రూ.693.3 కోట్లే కేటాయించడంతో పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు ఈ కేటాయింపులు సరిపోవని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర పథకాల కేటాయింపుల్లో కోత.. గతేడాదితో పోల్చితే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన మొత్తాల్లో భారీగా తగ్గించింది. సమగ్ర శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ , ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సివిల్ వర్క్స్ వంటి వాటిల్లో కేటాయింపులను తగ్గించింది. ఈసారి ఈ పథకాల కోసం రూ.491.56 కోట్లు కేటాయించింది. వర్సిటీలకు మొండిచేయి రాష్ట్రంలో ఉన్నత విద్యకు, ముఖ్యంగా యూనివర్సిటీల వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించింది. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల నిర్వహణ కోసం, వాటిల్లో పనిచేసే అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది వేతనాల కోసం నిర్వహణ పద్దు కింద రూ.1,312.55 కోట్లు కేటాయించింది. గతేడాది ఇందుకోసం రూ.1,663.63 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి అందులోనూ దాదాపు రూ.351 కోట్లు కోత పెట్టింది. ప్రగతి పద్దు కింద మొత్తంగా రూ.55.32 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం యూనివర్సిటీలకు పెద్దగా నిధులను ఇవ్వలేదు. యూనివర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధనలు, నిర్మాణాలు ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణకు పైసా ఇవ్వలేదు. ఒక్క తెలుగు యూనివర్సిటీకి మాత్రం ఇతర సహాయక గ్రాంట్ల కింద కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. మిగతా యూనివర్సిటీలకు పైసా ఇవ్వలేదు. ప్రగతిపద్దు కింద 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.420.89 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానిని రూ. 375.64 కోట్లకు సవరించింది. 2018–19 ఆర్థికసంవత్సరంలో రూ.210.42 కోట్లను కేటాయించిన ప్రభుత్వం దాన్ని రూ.173.16 కోట్లకు సవరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఎన్ఎస్ఎస్, రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద రూ.14.85 కోట్లు కేటాయించింది. సాంకేతిక విద్యాభివృద్ధికి రూ. 2.62 కోట్లు సంప్రదాయ యూనివర్సిటీల తరహాలోనే సాంకేతిక విశ్వవిద్యాలయం, విశ్వ విద్యాలయాల కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధనలకు పైసా కేటాయించలేదు. యంత్రాల కొనుగోళ్ల కోసం రూ.2 కోట్లు, ఇతర చెల్లింపులకు రూ.60 లక్షలు, స్కాలర్‌షిప్‌ల కోసం రూ.2 లక్షలు కేటాయించింది. దీంతో అవి ఏ మూలకు సరిపోవని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గతేడాది ప్రగతి పద్దు కింద రూ.60.85 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, దానిని రూ.50.07 కోట్లకు సవరించింది. ఈసారి మాత్రం రూ.2.62 కోట్లతో సరిపెట్టింది. జీతభత్యాలు, ఇతరత్రా నిర్వహణ, ప్రయాణ ఖర్చుల కింద అవసరమైన నిధులను మాత్రమే కేటాయించింది. నిర్వహణ పద్దు కింద గతేడాది రూ.361.44 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దానిని రూ. 320.29 కోట్లకు పరిమితం చేసింది. -
గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం...
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం పంచాయతీరాజ్ శాఖను ఒడిదుడుకులకు గురిచేసింది. బడ్జెట్లో ఆ శాఖ కేటాయింపులను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్రామీణాభివృద్ధికి ఆశాజనకంగా నిధులు కేటాయించినా.. పంచాయతీరాజ్ విభాగానికి మాత్రం కోత పడింది. గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తున్న సర్కారు.. పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ బడ్జెట్లో హైలెట్. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులతో వీటిని భర్తీ చేయనుంది. గత బడ్జెట్లో పంచాయతీరాజ్‌కు మంచి ప్రాధాన్యత దక్కింది. నీటిపారుదల శాఖ తర్వాత పీఆర్కే ఎక్కువ నిధులు కేటాయించింది. ఈసారి ఇరిగేషన్‌కు కూడా నిధుల కత్తెరపడినప్పటికీ, అదేస్థాయిలో ఈ శాఖకు నిరాశే మిగిలింది. 2018–19 బడ్జెట్లో పంచాయతీరాజ్‌కు రూ.15,562 .84 కోట్లను కేటాయించగా, తాజా బడ్జెట్లో పీఆర్, గ్రామీణాభివృద్ధికి కలిపి రూ.15,124.89 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పెంచిన ఆసరా పింఛన్ల మొత్తానికి అనుగుణంగా నెలకు రూ.830 నుంచి రూ.850 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. లబ్దిదారులు అందుబాటులో లేకనో, ఇతరత్రా కారణాలతోనో ఇందులో 15శాతం వరకు వెనక్కు వస్తున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద దాదాపు 40 లక్షల మందికి ఈ పింఛన్లు అందుతున్నాయి. పింఛన్ల మొత్తాన్ని పెంచకముందు (రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నపుడు) రూ. 420–450 కోట్ల వరకు వ్యయమయ్యేది. ఆసరాకు బడ్జెట్లో కేటాయించిన మొత్తం వాస్తవ లెక్కలకు అనుగుణంగా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారుల అర్హతను 60 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాలేదు. హైదరాబాద్ మినహాయించి మిగతా జిల్లాల్లోనే 57 ఏళ్లకు పింఛను పొందేందుకు అర్హులైన వారి సంఖ్య ఆరున్నర లక్షలు ఉంటుందని సమాచారం. -
ఆర్థిక మాంద్యంలో గల్ఫ్ దేశాలు
-
ఆర్థిక మాంద్యంలో గల్ఫ్ దేశాలు
రాయికల్ : ఆయిల్ నిల్వల్లో ప్రపంచాన్నే శాసిస్తున్న యూఏఈ, ఖతర్, కువైట్, ఒమన్ దేశాల్లో ఆర్థికమాంద్యం నెలకొంది. గత రెండుమూడు నెలల నుంచి ఆ దేశాలు ఆర్థికమాంద్యంలో కొట్టమిట్టాడుతున్నాయి. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న ఈ దేశాల్లో 2008 నాటి ఆర్థికమాంద్యం మళ్లీ పునరావృతం అవుతోంది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, షార్జా, అలీన్, అజ్మాన్, రసల్ఖన స్టేట్స్‌తోపాటు ఖతర్, కువైట్, ఒమన్ దేశాల్లోని చమురు కంపెనీలు తమ భవిష్యత్ ప్రణాళికలను కొంతకాలం రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆయూ కంపెనీలపై ఆధారపడిన పరిశ్రమలకు సమస్యలు చుట్టుముట్టాయి. చమురుపై ఆధారపడిన ఆయా దేశాల్లో నిర్మాణరంగం, ఫుడ్సప్లై, ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, టూరిజం తదితర రంగాల్లోని పరిశ్రమలపై ఆర్థికమాంద్యం ప్రభావం అధికంగా ఉంది. చమురు ధరలు తారాస్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్న సమయంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ కార్మికులు ప్రస్తుతం వేతనాలు తగ్గడంతో తమ జీవన సరళిని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దుబాయ్ పెట్రోలియం వంటి పెద్ద కంపెనీలు ఎటువంటి నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించడం, జీతాలు తగ్గించడంతో కార్మికులు దినదినగండంగా రోజులు వెల్లదీస్తున్నారు యూఏఈలో గత కొన్నేళ్లుగా స్థిరపడ్డ ఉద్యోగులు తమకు వస్తున్న జీతాల ఆధారంగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకున్నారు. హఠాత్తుగా జీతాలు తగ్గిపోవడంతో తీసుకున్న లోన్లు ఎలా చెల్లించాలో తెలియక క్షోభకు గురవుతున్నారు. చమురు కంపెనీలతో పాటు వాటిపై ఆధారపడిన మిగతా కంపెనీలు సైతం కార్మికులకు గత రెండుమూడు నెలలుగా జీతాలివ్వకపోవడంతోపాటు, ఉద్యోగాల నుంచి తొలగించడంతో ఆందోళనకు గురవుతున్నారు. బ్యాంకర్లు సైతం ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో కంపెనీలకు రుణాలు మంజూరు చేయకపోవడం మరొక కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. ఖర్చులను నియంత్రించి ప్రణాళికలు వేసుకుని 2016లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను కొంతవరకు ఎదుర్కోవాలంటే చిన్నతరహా పరిశ్రమలకు మరో ఏడాదిపాటు గడ్డు పరిస్థితి తప్పదని చెబుతున్నారు. కాగా, చిన్నతరహా పరిశ్రమల్లో ఉన్న కార్మికులను సెలవులపై వెళ్లాల్సిందిగా అక్కడి రాజు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. యూఏఈలో 8 లక్షల మందికిపైగా కార్మికులు ఉన్న ఊరులో ఉపాధి కరువై లక్షల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ తదితర జిల్లాలకు చెందిన ఎనిమిది లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. అక్కడ ఆర్థికమాంద్యం ఏర్పడడంతో కంపెనీలు సరైన జీతాలు ఇవ్వకపోవడంతో పాటు పనిలోంచి తొలగించడంతో చేసిన అప్పులు తీర్చలేక స్వగ్రామాలకు తిరిగి రాలేక ఆందోళనకు గురవుతున్నారు. వెనక్కు వచ్చే కార్మికులకు రాష్ట్ర ఉపాధి కల్పించాలని దుబాయ్‌లోని గల్ఫ్ తెలంగాణ సంఘం సభ్యులు జువ్వాడి శ్రీనివాసశర్మ, రాజశ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరిస్థితులు బాగా లేవు ఆర్థికమాంద్యం కారణంగా యూఏఈలో గత రెండుమూడు నెలల నుంచి పరిస్థితులు బాగా లేవు. పెద్దపెద్ద కంపెనీల్లో మంచి హోదాల్లో ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు. - రాజశ్రీనివాసరావు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి ఆర్థికమాంద్యం వల్ల తెలంగాణకు చెందిన కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ చొరవచూపి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. - శ్రీనివాసశర్మ, గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం ఫౌండర్ మెంబర్ ఏజెంట్లను నమ్మి రావద్దు యూఏఈ, ఖతర్, ఒమన్ దేశాల్లో ఆర్థికమాంద్యంతో ఉద్యోగాలు ఊడుతున్నారుు. తెలంగాణ నుంచి నిరుద్యోగులు ఏజెంట్ల మాయమాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు రావద్దు. - శ్రీనివాసరావు, గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
జోరు తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగానికి మళ్లీ గడ్డుకాలం వచ్చింది. ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నిర్మాణరంగాన్ని ఇప్పుడు రాజకీయ అనిశ్చితి, ఎన్నికలు, కనికరించని బ్యాంకులు చుట్టుముట్టాయి. దీంతో తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ స్థిరాస్తి వ్యాపారం మందగించింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీగానే గండి పడింది. రాష్ర్ట వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని ఒకసారి పరిశీలిస్తే.. గతేడాది రూ.6,588.51 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఈ ఏడాది రూ.5,034.30 కోట్లను గడించింది. అంటే 23.59 శాతం తక్కువ ఆదాయాన్ని ఆర్జించిందని రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలే చెబుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భూములు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను ప్రభావితం చేయగా, ఆర్థిక లోటు, రాజధాని ప్రకటనపై నెలకొన్న అనిశ్చితి సీమాంధ్రలో స్థిరాస్తి వ్యాపారంపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పెపైచ్చు ఎన్నికల ప్రభావమూ ఉండనే ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రకటన వచ్చాక ఫ్లాట్ల కొనుగోళ్లు భారీగా పడిపోయాయని శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ నర్సయ్య ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. మార్చి నెలలో మా సంస్థలో కేవలం 16 బుకింగ్స్‌తో రూ. 12 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేసిందని పేర్కొన్నారు. నగరీకరణ శరవేగంగా జరుగుతుండటంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఏడాదిన్నరగా ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలిశాయి. అదే క్రమంలో బడా కంపెనీలు కూడా రాష్ట్రానికి తరలిరావడంతో శివార్లలో కూడా బడా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు పుట్టుకొచ్చాయి. దీంతో గతేడాది జూలై రెండోవారం వరకు కూడా రిజిస్ట్రేషన్లు జోరుగానే సాగాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మందగించాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలివే.. రియల్ ఎస్టేట్ వ్యాపారమంటే గుర్తొచ్చేవి హైదరాబాద్, రంగారెడ్డి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలే. గతేడాదితో పోలిస్తే ఈ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా పడిపోయింది. గతేడాది కంటే ఈ ఏడాది హైదరాబాద్‌లో 30.54 శాతం, హైదరాబాద్ దక్షిణంలో 6.33 శాతం అదేవిధంగా రంగారెడ్డిలో 21.24 శాతం, రంగారెడ్డి తూర్పులో 27.45 శాతం ఆదాయం తక్కువ వచ్చింది. ఇక సీమాంధ్ర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాదితో పోలిస్తే విశాఖపట్నంలో 26.03 శాతం, విజయవాడలో 23.39 శాతం, విజయవాడ తూర్పులో 27.33 శాతం అదేవిధంగా చిత్తూరులో 26.26 శాతం ఆదాయం తక్కువగా వచ్చింది. -
లక్ష ఫ్లాట్లు ఖాళీ!
సాక్షి, ముంబై: రండి బాబూ.. రండి..! మా ఫ్లాట్ ధరెంతో ఊహించి చెబితే పది గ్రాముల బంగారం ఉచితం..! మా ఫ్లాట్‌ను వచ్చి చూస్తే చాలు ఫైవ్‌స్టార్ హోటల్లో పసందైన విందు..! కొనుగోలుదారులను పరిచయం చేసినవారికీ తగిన బహుమతులు..! ..ఇవీ నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారసంస్థల ప్రకటనలు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనాలు, ఫ్లాట్లు కొనేవారు లేక ఖాళీగానే ఉంటుండడంతో వినియోగదారులను అకట్టుకునేందుకు రియల్ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఆ సంస్థల పాచికలేవీ పారడంలేదు. పోనీ ధరలు తగ్గించి విక్రయిద్దామనుకుంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో ధరను తగ్గించలేక, తాము చెప్పిన ధరకు కొనేవారెవరూ ముందుకురాకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారలు బెంబేలెత్తిపోతున్నారు. అంతా ఆర్థిక మాంద్యం ప్రభావమే.. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా దెబ్బతినడంతో బిల్డర్లు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది. ముంబై, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో ఇప్పటికే లక్షకుపైగా ఫ్లాట్లు అమ్ముడుపోలేక ఖాళీగానే పడిఉన్నాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు బిల్డర్లు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. అయినప్పటికీ ఎవరూ ముందుకురావడం లేదు. ఈ వ్యాపారం గత మూడు నెలల నుంచి మరింత దయనీయంగా మారిందని కొందరు బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ముంబైతోపాటు దేశంలోని ఆరు ప్రధాన నగరాలలో ఉందని లియాసెస్ ఫోరస్ రియల్ ఎస్టేట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఎండీ పంకజ్క పూర్ తెలిపారు. ఈ నగరాల్లో దాదాపు 40 శాతం ఇళ్ల డిమాండ్ పడిపోయిందని, ఒక్క ముంబైలోనే నిర్మాణం పూర్తిచేసుకొని అమ్మకానికి సిద్ధంగా ఉన్న లక్షకుపైగా ఫ్లాటు ఖాళీగా ఉన్నాయన్నారు. అంతేకాక దాదాపు ఇంతే సంఖ్యలో పెట్టుబడుదారులు కొనుగోలు చేసిన ఫ్లాట్లలో కూడా 40 శాతం ఖాళీగానే ఉన్నాయని చెప్పారు. దీంతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేవారి సంఖ్య 50 శాతానికి పడిపోయిందని, పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే ఉంటుందనే అభిప్రాయాన్ని పంకజ్‌కపూర్ వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంకు చర్యలే కారణం... భారీ పెట్టుబడులతో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్లోని ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదనే విషయమై విశ్లేషకులు అనేక కారణాలను చూపుతున్నారు. ద్రోవ్యల్బణాన్ని తగ్గించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమని చెబుతున్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనల కారణంగా ఆర్థిక సంస్థలు రుణాలను ఇచ్చేందుకు జంకుతున్నాయని, దీంతో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఆర్థిక సంస్థల నుంచి రుణాలను సేకరించడం కష్టంగా మారిందని, కొనుగోళ్లు తగ్గడానికి ఇది ప్రధాన కారణమంటున్నారు. అంతేకాక పెరిగిన పన్నులు, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఈ పరిస్థితికి కారణమేనని చెబుతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఇతర వస్తువుల ధరలతోనే విలవిల్లాడుతున్న సామాన్యుడు ఇల్లు కొనాలనే విషయమై కలలో కూడా ఆలోచించడంలేదంటున్నారు. కాస్తోకూస్తో కొనే సామర్థ్యమున్న మధ్య తరగతివారు పన్నులు, రిజిస్ట్రేషన్లకు భయపడి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారని చెబుతున్నారు. తలలుపట్టుకుంటున్న నేతలు... రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినవారిలో రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితిలో క్రయవిక్రయాలు జరగకపోవడంతో వారి డబ్బంతా ఈ వ్యాపారంలోనే చిక్కుకుపోయింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేతిలో డబ్బు ఉంటేకాని పనులు కాని పరిస్థితి. దీంతో ఈ దుస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక నేతలు తలలుపట్టుకుంటున్నారు.