సాక్షి,ముంబై:ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఖర్చులనుతగ్గించుకునే పనిలో దిగ్గజ సంస్థలు కూడా వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపిస్తున్నారు. ప్రతీ రోజు ఏదో ఒక కంపెనీ ఉద్యోగాల కోతను ప్రకటిస్తోంది. తాజాగా వస్తువుల కొనుగోలు, అమ్మకాల సంస్థ, నాస్పర్స్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ గ్రూప్ ప్రోసస్ క్లాసిఫైడ్స్ యూనిట్ ఓఎల్‌ఎక్స్ గ్రూప్ 15 శాతం సిబ్బందిని ఇంటికి పంపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,500 మందిని తొలగించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను నియంత్రించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. భవిష్యత్తు ఆశయాల రీత్యా కంపెనీ అంతటా వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తునట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికల్లో భాగంగా, ఓఎల్‌ఎక్స్ గ్రూప్ తన ఇండోనేషియా కార్యకలాపాలను తగ్గించు కోవాలని చూస్తోందట. ఇప్పటికే ఆటో వ్యాపారాన్ని అమ్మకానికి ఉంచిందని డీల్‌స్ట్రీట్ ఆసియా గత వారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది.కాగా ప్రపంచవ్యాప్తంగా, ఓఎల్‌ఎక్స్ 10,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment