
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కోతలు ఉంటాయి. ఈ ప్రభావం వల్ల ప్రధానంగా మిడిల్ మేనేజ్‌మెంట్, నాన్-టెక్నికల్ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. మే నెలలో ఈ లేఆప్స్ ఉండే అవకాశం ఉంది. ఎయితే ఈ ఎఫెక్ట్ ఎంతమందిపై ప్రభావం చూపుతుందని విషయం అధికారికంగా వెల్లడికాలేదు.
అమెజాన్, గూగుల్ కంపెనీల మాదిరిగానే.. మైక్రోసాఫ్ట్ కూడా నిర్వాహక పాత్రల కంటే సాంకేతిక ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ లేఆప్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.
మైక్రోసాఫ్ట్ గతంలో కూడా.. తక్కువ పనితీరు కనపరచిన 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలో జరగనున్న ఉద్యోగాల తొలగింపు ప్రభావం కూడా పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగుల మీదనే పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఏఐలో శిక్షణ
భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గూగుల్ సీఈఓ సత్యనాదెళ్ళ గతంలోనే వివరించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.
ఇదీ చదవండి: వ్యభిచార గృహాలతో సంబంధాలు:.. అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్