ఈ సంవత్సరం రెండు కొనుగోళ్ల తర్వాత, భారతదేశ రెండవ అతిపెద్ద ఐటీ సర్వీస్ కంపెనీ ఇన్ఫోసిస్ మరిన్ని సంస్థలను కైవసం చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది. డేటా అనలిటిక్స్, ఎస్ఏఏఎస్ వంటి రంగాల్లో కొనుగోళ్లపై కంపెనీ ఆసక్తిగా చూపుతున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు.
450 మిలియన్ యూరోల ప్రైస్-ట్యాగ్‌తో వచ్చిన స్కేల్ మ్యాచింగ్ ఇన్-టెక్‌కి సంబంధించి మరిన్ని కొనుగోళ్లు జరగవచ్చా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఖచ్చితంగా సాధ్యమవుతుందని పరేఖ్ అన్నారు. భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన సెమీకండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్ సెమీ టెక్నాలజీ సర్వీసెస్‌లో 100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను రూ. 280 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఇన్ఫోసిస్ ఖచ్చితమైన ఒప్పందాన్ని ప్రకటించిందని వెల్లడించారు.
ఏఐ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీ క్లయింట్‌ల నుంచి బలమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్ఫోసిస్ కూడా ఈ రంగంవైపు వేగంగా దూసుకెళ్తోంది. కంపెనీలు జెన్ఏఐ నుంచి ప్రయోజనాలను, ఫలితాలను వినియోగించుకోవాలని.. ఇది తప్పకుండా కంపెనీ పెరుగుదలకు దోహదపడుతుందని పరేఖ్ అభిప్రాయపడ్డారు.
సమయం గడిచేకొద్దీ ఏఐ టెక్నాలజీ చాలా వేగవంతం అవుతుందని చెబుతూనే.. ఇది ఎంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతుందనేది తెలియాల్సి ఉందని పరేఖ్ అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇన్ఫోసిస్ క్లయింట్‌ల కోసం 225 జనరేటివ్ AI ప్రోగ్రామ్‌లపై పనిచేస్తున్నట్లు.. దీనికోసం 2,50,000 మంది ఉద్యోగులకు ఈ రంగంలో టర్నింగ్ ఇస్తున్నట్లు కూడా వెల్లడించారు.
ఏఐ ఉద్యోగులపైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు వెల్లడించారు. చెప్పినట్లుగానే చాలా లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కానీ ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగించబోదని.. రిక్రూటింగ్ కూడా పెరుగుతూనే ఉంటుందని పరేఖ్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment