
ప్రస్తుత ఏడాదిలోనూ చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా జొమాటో కూడా చేరింది. దీనికి సంబంధించినా ఒక సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే.. 300 మంది ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించారని, జొమాటో మాజీ ఉద్యోగి ఆరోపించారు. మంచి పర్ఫామెన్స్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ నన్ను కూడా కంపెనీ తొలగించిందని బాధితుడు పేర్కొన్నాడు. అయితే గత మూడు నెలలలో 28 నిమిషాలు ఆలస్యమైన కారణంగా తొలగించినట్లు మాజీ ఉద్యోగి చెప్పుకొచ్చాడు.

జొమాటో లేఆఫ్స్ ప్రభావం కేవలం నా మీద మాత్రమే కాదు, సుమారు 300 మందిపై ప్రభావం చూపిందని మాజీ ఉద్యోగి / బాధితుడు పేర్కొన్నాడు. పనిలో ఏమైనా లోపం ఉంటే.. దాన్ని సరిచేసుకోవడానికి సంస్థ ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. మేము చేసిన కృషి, మేము అందించిన ఫలితాలు కంపెనీ పట్టించుకోలేదు. ఒక్కసారిగా వందల మందిని బయటకు పంపింది.
జొమాటో తన నేడు ఈ స్థాయిలో ఉందంటే.. దీనికి కారణం సంస్థ కోసం పనిచేస్తున్న ఉద్యోగులే అని చెప్పవచ్చు. అలంటి ఉద్యోగులనే సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే ఉద్యోగంలో నుంచి తీసేయడం అనేది బాధాకరం అని బాధితుడు పేర్కొన్నాడు. చాలా కంపెనీలు ఉద్యోగులను వ్యక్తులుగా కాకుండా.. కేవలం సంఖ్యగా మాత్రమే చూస్తున్నాయని అన్నాడు.
ఇదీ చదవండి: వరుసగా తగ్గి.. మళ్ళీ పెరిగిపోతున్న బంగారం ధరలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెడ్దిట్ పోస్టు మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం 300 మందిపై ప్రభావం చూపిందని అన్నారు. కంపెనీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేఖంగా పోరాటం చేయండని మరొకరు సలహా ఇచ్చారు.