
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసిన గడువు ముగియడంతో తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై స్పందించారు. రిజిస్ట్రేషన్ రద్దయ్యేవరకూ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకునే వీలున్నట్లు తెలియజేశారు.
టాటా సన్స్‌సహా.. కొన్ని సంస్థలను ఆర్‌బీఐ ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌కు ఆదేశించింది. అయితే డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కీలక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ(సీఐసీ) రిజిస్ట్రేషన్‌ను అప్పగించేందుకు గతేడాది ఆర్‌బీఐకు దరఖాస్తు చేసింది.
తద్వారా తప్పనిసరి లిస్టింగ్‌ను తప్పించుకుకోనుంది. కాగా.. ఆర్‌బీఐ ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పటికే అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలుగా గుర్తింపు పొందిన 15 సంస్థలను సెపె్టంబర్ 30లోగా ఐపీవో చేపట్టమంటూ ఆదేశించింది.
టాటా సన్స్‌మినహా మిగిలిన కంపెనీలు నిబంధనలను పాటించాయి. కంపెనీ లిస్టయితే 18 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ లబ్ది పొందనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.