Tata Sons
-
చిప్ ప్రాజెక్టుల కోసం మాతోనే టాటా గ్రూప్ జట్టు ..
ముంబై: సెమీకండక్టర్ల తయారీ ప్రణాళికల్లో ఉన్న టాటా సన్స్ తమ దేశాన్ని కీలక భాగస్వామిగా ఎంచుకుంటుందని సింగపూర్ ధీమా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ దేశంగా తమకు పేరుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపింది. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం సింగపూర్ హోమ్ అఫైర్స్ శాఖ మంత్రి కె. షణ్ముగం ఈ విషయాలు తెలిపారు. సమావేశంలో సెమీకండక్టర్లపై విస్తృతంగా చర్చించినట్లు వివరించారు. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు అంతర్జాతీయంగా సెమీకండక్టర్ పరికరాల ఉత్పత్తిలో 20 శాతం వాటా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. చిన్న దేశమే అయినప్పటికీ తమ దేశంలో 25 సెమీకండక్టర్ల ఫౌండ్రీలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో, దాదాపు అయిదు దశాబ్దాలుగా సింగపూర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ తమతో జట్టు కట్టగలదని షణ్ముగం చెప్పారు. టాటా గ్రూప్ రూ. 91 వేల కోట్లతో గుజరాత్లో, రూ. 27,000 కోట్లతో అస్సాంలో సెమీకండక్టర్ల ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇందుకోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో (పీఎస్ఎంసీ) చేతులు కలిపింది. -
నోయల్ టాటా ఎంట్రీ: ఒకేసారి రెండు బోర్డులలో..
దివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే తాజాగా ఆయన టాటా సన్స్ బోర్డులో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా వెల్లడించింది.2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు.ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇకపైన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించనున్నారు.ఎవరీ నోయల్ టాటానోయల్ టాటా.. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. టాటా ఇంటర్నేషనల్‌లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నోయల్ టాటా గ్రూపుతో 40 సంవత్సరాల అనుభవం ఉంది. కంపెనీలోని వివిధ బోర్డుల్లో వివిధ పదవులను నిర్వహించారు. అప్పటికి కేవలం ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్.. నోయల్ సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్‌కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్‌సైడ్ రిటైల్ చెయిన్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుంచి 3 బిలియన్ డాలర్లకు ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్‌గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. -
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అస్తమయం... అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
-
వ్యాపార దిగ్గజం.. దాతృత్వ శిఖరం 'రతన్ టాటా' అస్తమయం
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. ఆయన తనకు గొప్ప మిత్రుడు, గురువు, మార్గదర్శకుడు అని చెప్పారు. రతన్ టాటా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. ఆయనొక విజనరీ బిజినెస్ లీడర్, అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు సుస్థిరమైన నాయకత్వాన్ని అందించారని చెప్పారు. మెరుగైన సమాజం కోసం కృషి చేశారని, ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూత అందించారని గుర్తుచేశారు. విద్యా, వైద్యం, పారిశుధ్యం, జంతు సంరక్షణ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించారని పేర్కొన్నారు. విశిష్టమైన వ్యక్తిత్వంతో ఎంతోమందికి ఆప్తుడైన రతన్ టాటా దూరం కావడం చాలా బాధాకరమని ఉద్ఘాటించారు. రతన్ టాటా కుటుంబానికి ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. ‘రతన్ టాటా ఒక టైటాన్’ అని ప్రశంసిస్తూ వ్యాపారవేత్త హర్‡్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రతన్ టాటా ఇక లేరు అనే నిజాన్ని తాను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వివిధ రంగాలలో రతన్ టాటా సంస్థలు సంపదలో 65% విరాళం రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా, సూనూ టాటా. ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. 1991 నుంచి 2012 దాకా, తర్వాత 2016 నుంచి 2017 టాటా సంస్థ చైర్మన్‌గా సేవలందించారు. పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రతన్ టాటా వితరణశీలిగా పేరుగాంచారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అనితరసాధ్యుడు..బాల్యం..విద్యాభ్యాసం.. పారిశ్రామిక దిగ్గజం, వితరణ శీలి రతన్ టాటా చాలా సాధారణ జీవితం గడిపేవారు. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా కుమారుడు రతన్ జీ టాటా, దత్తత తీసుకున్న నవల్ టాటా, సూనూ టాటా ఆయన తల్లి దండ్రులు. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్జీ టాటా సతీమణి అయిన నవాజ్‌బాయ్ టాటా సంరక్షణలో పెరిగారు. జిమ్మీ టాటా ఆయనకు సోదరుడు కాగా, నోయెల్ టాటా సవతి సోదరుడు. రతన్ టాటా ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అటుపైన అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. 100 బిలియన్ డాలర్లకు టాటా గ్రూప్..రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పని చేస్తూ కుటుంబ వ్యాపార మెళకువలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎల్రక్టానిక్స్ కంపెనీ (నెల్కో)కి డైరెక్టర్ ఇంచార్జ్‌గా 1971లో ఆయన నియమితులయ్యారు. కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాలపరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. 1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్‌కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవడంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది. మొత్తానికి 1991లో జేఆర్డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమించారు. భారీ బాధ్యతలను మోయడంలో ఆయనకున్న సామర్థ్యాలపై సందేహాల కారణంగా మిగతా అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రతన్ టాటా వాటన్నింటినీ తోసిరాజని తన సత్తా నిరూపించుకున్నారు. గ్రూప్‌ను అగ్రగామిగా నిలిపారు. తన హయాంలో మేనేజ్మెంట్ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసి గ్రూప్ కంపెనీలను పరుగులు తీయించారు. 2012లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా నియమితులైన సైరస్ మిస్త్రీతో విభేదాలు రావడంతో తిరిగి 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు మరోసారి చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ఎన్.చంద్రశేఖరన్‌కు పగ్గాలు అప్పగించారు. 21 ఏళ్ల పాటు సాగిన రతన్ టాటా హయాంలో గ్రూప్ ఆదాయాలు 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో భారీగా విస్తరించారు రతన్ టాటా. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. సాఫ్ట్వేర్, టెలికం, ఫైనాన్స్, రిటైల్ తదితర రంగాల్లోకి గ్రూప్ విస్తరించింది. రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు 1991లో రూ. 10,000 కోట్లుగా ఉన్న గ్రూప్ టర్నోవరు 2011–12లో ఆయన తప్పుకునే సమయానికి 100 బిలియన్ డాలర్లకు ఎగిసింది. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని విభాగాల్లోకి విస్తరించింది. పలు విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడంతో గ్రూప్ ఆదాయాల్లో దాదాపు సగ భాగం విదేశాల నుంచే ఉంటోంది. ఆయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్‌లోకి చేరాయి. నానో, ఇండికా కార్లు ఆయన విజనే. వితరణశీలి.. ఇన్వెస్టరు.. రతన్ టాటా గొప్ప వితరణశీలి. తన సంపదలో దాదాపు 60–65% భాగాన్ని ఆయన వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళమిచ్చారు. 2008లో కార్నెల్ వర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళమిచ్చారు. ప్రధానంగా విద్య, ఔషధాలు, గ్రామీణాభివృద్ధి మొదలైన వి భాగాలపై దృష్టి పెట్టారు. ఆయన పలు అంకుర సంస్థల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు. వ్యక్తిగత హోదాలో అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా 30కి పైగా స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. శ్నాప్‌డీల్, షావోమీ, ఓలా క్యాబ్స్, మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టారు. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌కు తోడ్పాటు అందించారు. కరోనా నియంత్రణ కోసం రూ.1,500 కోట్లు అందించారు.పురస్కారాలుపారిశ్రామిక దిగ్గజంగానే కాకుండా వితరణశీలిగా కూడా పేరొందిన రతన్ టాటాను పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటు ఆయన మహారాష్ట్ర భూషణ్, అస్సాం వైభవ్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు. సిమీ గ్రేవాల్‌తో అనుబంధం..రతన్ టాటా వివాహం చేసుకోవాలనుకున్నా సాధ్యపడలేదని ఆయనే పలు సందర్భాల్లో తెలిపారు. నాలుగు సార్లు వివాహానికి దగ్గరగా వచ్చినా పలు కారణాల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. అప్పట్లో బాలీవుడ్ నటి సిమీ గ్రేవాల్‌తో ఆయన ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నారు.మిస్త్రీతో వివాదం..టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా ఏరి కోరి సైరస్ మిస్త్రీని తన వారసుడిగా నియమించారు. కానీ మిస్త్రీ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి 2016లో మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. ఆయన మార్గదర్శకత్వం అమూల్యం ఆనంద్ మహీంద్రా రతన్ టాటా లేరన్నది నేను అంగీకరించలేక పోతున్నా. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ముందడుగులో ఉంది. మనం ఈ స్థానంలో ఉండటానికి రతన్ జీవితం, పని తీరుతో చాలా సంబంధం కలిగి ఉంది. ఈ సమయంలో అతని మార్గదర్శకత్వం అమూల్యం. మన ఆర్ధిక సంపద, విజయాలకు ఆయన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. లెజెండ్స్‌కి మరణం లేదు.దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త ప్రధాని నరేంద్ర మోదీ రతన్ టాటా దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త. దయార్ధ్ర హృదయం కలిగిన అసాధారణ వ్యక్తి. భారత దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఇదే సమయంలో ఇతని సహకారం బోర్డు రూమ్‌ను మించిపోయింది. ఎంతో మందికి ఆప్తుడయ్యారు.లక్షలాది మంది జీవితాలను తాకిన దాతృత్వంరతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాము. ఎంతో మందికి అమూల్యమైన సహకారం అందించిన నిజమైన అసాధారణ నాయకుడు. టాటా గ్రూప్ మాత్రమే కాదు.. మన దేశం స్వరూపం కూడా. టాటా గ్రూప్‌కు.. ఆయన చైర్పర్సన్ కంటే ఎక్కువ. వ్యాపార వేత్తలందరికీ ఆయన ఓ దిక్సూచి. టాటా దాతృత్వం లక్షలాది మంది జీవితాలను తాకింది. విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు రాబోయే తరాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయన్ని ఇష్టపడే వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్‌కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్‌గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు
టాటా సన్స్ కంపెనీ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆగస్టు 16న కలిశారు. అదే రోజు – ‘టాస్క్ ఫోర్స్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’ కో– చైర్మన్ చంద్రశేఖర్ అని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ముఖ్య మంత్రి దీనికి చైర్మన్. ‘రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబోతున్నది. ఇందులో అగ్రశ్రేణి ఇండస్ట్రీ ‘లీడర్లు’, నిపుణులు ఉంటారు’ అని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇది విన్నాక,ముందుగా ఈ విషయం చెప్పాలి అనిపించింది. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ ‘అమెజాన్’ తన రిక్రూట్మెంట్ విభాగంలో ఇకముందు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏ.ఐ.) వాడ వద్దని నిర్ణయం తీసుకుంది. ‘రిక్రూట్మెంట్’ కోసం దరఖా స్తులు ‘స్క్రూటినీ’ చేసేటప్పుడు, ‘జెండర్’ అని ఉండేచోట– ‘ఆడ’ అని ఉంటే, ‘ఏఐ’ వాటిని తిరస్కరిస్తున్నది. అది గమ నించాక, కంపెనీ దాని వాడడం వెంటనే ఆపేసింది. అటువంటి కంపెనీలే అంత బాధ్యతగా ఉంటున్నప్పుడు, ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వాలు యువతరం జీవితా లను ప్రభావితం చేసే ఉపాధి అంశాల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది అవి గ్రహించాలి. టీడీపీ ప్రభుత్వం 2015లో ఇలాగే– ‘స్ట్రాటజిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ – ఏపీ’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసినట్లుగా వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత, దానికి కొనసాగింపు కనిపించలేదు. ‘ఫేస్ బుక్’, ‘గూగుల్’ వంటి సామాజిక మాధ్యమాల బహుళ జాతీయ కంపెనీలు కొత్తగా అమరావతికి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ‘ఏఐ’ యూనివర్సిటీ వస్తుంది అని ఆ శాఖ మంత్రి అంటున్నారు. గతంలో ‘గేమ్స్ సిటీ’ అన్నారు. అయితే ఈ దిశలో ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కసరత్తు ఇప్పటికే మొదలైతే, అది మంచిదే. అలాగే, వాటితోపాటు ఎన్నికల ముందు కూటమి వెల్లడించిన– ‘స్కిల్ సెన్సెస్’ వెంటనే పూర్తికావాలి. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు తమ వద్ద లేవనుకున్నప్పుడు ఇదొక పద్ధతి. అలా కాకుండా తాము చేసింది ఏదైనా అది ఆ ప్రాంతానికీ, ప్రజలకూ కూడా శాశ్వత ప్రయోజనం కలగాలి. తామే అందుకు ప్రత్యామ్నాయాలు వెతకాలని ప్రభుత్వం అను కొన్నప్పుడు అది మరోలా ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో ప్రారంభించిన ‘సెజ్’లో ఇప్పుడు ‘శ్రీసిటీ’గా అందరికీ తెలిసిన–‘సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ’ (టౌన్ షిప్) ఉంది. అదిప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. రాష్ట్రానికి ఏ ప్రపంచ దిగ్గజ కంపెనీ వచ్చినా వాళ్లకు ప్రభుత్వాలు ఇప్పుడు చూపించేది– ‘శ్రీసిటీ’. సీఎమ్‌గా వైఎస్ మొత్తం 22 ‘సెజ్’లకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చారు. నాన్న కృషికి కొనసాగింపు అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఖనిజ నిక్షేపాల విలువ పెంచడానికి కడప జిల్లా కొప్పర్తి వద్ద ‘మెగా ఇండస్ట్రియల్ హబ్’ కోసం 2020లో 3,155 ఎకరాలను కేటాయించారు. ఇది కర్నూల్ – రాణిపేట నేషనల్ హైవేకి, రైల్వే లైన్, కడప ఎయిర్ పోర్ట్‌కు సమీపాన ఉండడమే కాకుండా... రేణిగుంట అంతర్జాతీయ విమానా శ్రయానికి 145 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తున్న వసతులతో రూ. 25,000 కోట్ల మేర పెట్టు బడులు వస్తాయనీ, 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనీ 2020 డిసెంబర్ నాటి ప్రభుత్వ అంచనా. కనీసం శ్రీసిటీ, కొప్పర్తి వంటి పారిశ్రామిక కూడళ్ళ వద్ద, అలాగే కొత్త జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పడే మార్కెట్ డిమాండ్ దృష్ట్యా సూక్ష్మ స్థాయిలో ‘సర్వీస్ సెక్టార్’లో ‘ఐటీఐ’, ‘పాలి టెక్నిక్’ స్థాయిలో ‘కరిక్యులం’ సమీక్ష అనేది ముందు... ‘స్కిల్ సెన్సెస్’ పూర్తి అయితే అప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. దానివల్ల ‘స్టార్ట్ అప్’లకు ‘ఎంఎస్ఎంఈ’లకు అవసరమైన కొత్త ‘మ్యాన్ పవర్’ దొరుకుతుంది. కానీ ఇవన్నీ ‘పెండింగ్’లో ఉంచి, అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున –‘అంకుర యాత్ర’ పేరుతో భారీ బస్ ర్యాలీ అమరావతి నుంచి శ్రీసిటీ వరకు ప్రభుత్వం ‘ప్లాన్’ చేసింది. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘ఎన్నారై’లు మన ‘స్టార్ట్ అప్’లను ప్రోత్సహించడానికి ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే, కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ‘విజన్ డాక్యుమెంట్లు’ తయారుచేస్తారని వార్తలు వస్తున్నాయి. పరిపాలనలో ఇంత అనుభవం ఉన్న పార్టీ ప్రభుత్వానికి మళ్ళీ ఇటువంటి కసరత్తు అవసరమా? మరి ఏ ‘విజన్’ అనకుండానే గత ప్రభుత్వం ఉద్యానవనం, పరిశ్రమలు రెండింటినీ కలుపుతూ కొత్తగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ప్రారంభించింది. దాంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ఆ శాఖకు మంత్రిని నియమించింది. ఈ శాఖ ఏర్పాటుతో రైతులకు సంప్రదాయ పంటల సాగు కంటే ఉద్యా నవన ఉత్పత్తులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఇలా గత ప్రభుత్వం చూపించిన బాటలో కూటమి ప్రభుత్వం కొన సాగుతూ మైక్రో ఇరిగేషన్‌తో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2029 నాటికి రెట్టింపు చేస్తాం అంటున్నారు. కేంద్ర–రాష్ట్రాలు కలిసి ప్రస్తుతం ఇస్తున్న 55% సబ్సిడీని ఇక ముందు 90% శాతానికి పెంచాలని నిర్ణయించారు. వాస్తవానికి అభివృద్ధి ప్రణాళికల అమలు పలు దొంత ర్లుగా ఉంటుంది. అదలా ఉన్నప్పుడే, సూక్ష్మ స్థాయి వరకు ఇంకి కొన్ని తరాలు పాటు ఆ మేలు చివరి ‘మైలు’ వరకు చేరు తుంది. ఇంతకూ ‘విజన్’ అంటే ఏమిటి? ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ తాడేపల్లిగూడెం వద్ద హార్టీకల్చర్ యూనివర్సిటీ పెడితే, విభజిత ఏపీలో జగన్ ‘ఫుడ్ ఇండస్ట్రీ శాఖ పెట్టడం! ఫలితంగా ఈ ప్రభుత్వంలో దానికి కొత్తగా ఒక మంత్రి వచ్చి, పంట విస్తీర్ణం రెట్టింపు లక్ష్యంగా ప్రకటించడం. దానివల్ల ప్రయోజనాల వ్యాప్తి 26 జిల్లాలకు ఉంటుంది. అది మట్టిలో చేసే సాగుబడి నుంచి, ఆ ఉత్ప్పత్తులను ‘ఆన్ లైన్’లో మార్కె టింగ్ చేస్తూ ‘డెస్క్’ వద్దకు చేరింది! ప్రతి దశలోనూ ఇందులో యువత ప్రయోజనాలు పొందుతుంది. నిజానికి ఇది ‘ప్రాంతము– ప్రజలు’ కేంద్రిత అభివృద్ధి నమూనా.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
దేశంలో అత్యధిక వేతనం.. ఈయనదే..
దేశంలో అత్యధిక వేతనం పొందే ప్రొఫెషనల్ చీఫ్‌గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ రూ. 135 కోట్ల వేతన పరిహారాన్ని అందుకున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆయన వేతనం ఈ ఏడాది 20 శాతం పెరిగింది.చంద్రశేఖరన్ ఈ ఏడాది అందుకున్న రూ. 135 కోట్ల ప్యాకేజీలో కంపెనీ లాభాల నుండి ఆర్జించిన కమీషన్లు రూ. 122 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 13 కోట్ల జీతం, పెర్క్విజిట్‌లు ఉన్నాయి. ఇక టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ రూ. 30 కోట్లు అందుకుని టాటా సమ్మేళనంలో అత్యధిక వేతనం పొందుతున్న రెండో ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు.చంద్రశేఖరన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆరు లిస్టెడ్ టాటా కంపెనీల నుండి సిట్టింగ్ ఫీజులో అదనంగా రూ.17 లక్షలు అందుకున్నారు. ఈ సంస్థల్లో ఆయన వాటా విలువ రూ.168 కోట్లు. ఇదిలా ఉండగా విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 167 కోట్లు అందుకున్నారు. -
2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్‌ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన రెండు, సీజీ పవర్‌కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్‌కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్‌లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్‌లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్‌కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్‌లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్‌లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్‌లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్‌లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్‌లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలు’!
టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందా? ఫలితంగా ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఎయిరిండియా సంస్థలోని వరుస సంఘటనలు. టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసిన ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పటికే ప్రయాణికులపై మూత్ర విసర్జన,దుబాయ్- ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్‌పిట్‌లోకి ప్రియురాలు, మహిళ భోజనంలో రాయి వంటి వరుస వివాదాలతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా, మరో మహిళ వెజ్‌మీల్స్‌లో చికెన్ ముక్కలు కనిపించడంతో కంగుతినడం ఆమె వంతైంది. వీర్‌జైన్ అనే మహిళ ప్రయాణికురాలు కాలికట్ టూ ముంబై ఏఐ582 ఎయిరిండియా విమానం ఎక్కింది. సాయంత్రం 6.40 బయలుదేరాల్సిన విమానం 7.40కి ప్రారంభమైంది. కొన్ని సార్లు రాకపోకల కారణంగా ఫ్లైట్ జర్నీ కొంచెం ఆలస్యం అవుతుందిలే అని సర్ది చెప్పుకుంది. వీర్‌జైన్‌కు జర్నీ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బాగా ఆకలివేసిన వీర్‌జైన్ వెజ్మీల్స్ ఆర్డర్ చేసింది. సిబ్బంది వెజ్మీల్స్ తెచ్చారు. అసలే ఆకలి..పైగా ప్లేట్లో మీల్స్ వేడివేడిగా ఉండడంతో ఆతృతగా ఆరగించే ప్రయత్నం చేసింది. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్‌పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్ పీసెస్ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందని ఎయిరిండియా కేబిన్ సూపర్వైజర్ సోనాని ప్రశ్నించింది. వీర్‌జైన్‌తో పాటు తన స్నేహితురాలు సైతం తన వెజ్ ప్లేట్లో చికెన్ ముక్కలు వచ్చాయంటూ ఫిర్యాదు చేసింది. పట్టించుకోని ఎయిరిండియా సిబ్బంది? అయితే జరిగిన తప్పిందంపై ఎయిరిండియా సిబ్బంది సరిగ్గా స్పందించ లేదని.. సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగొచ్చిన ఎయిరిండియా.. ఆపై క్షమాపణలు ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఇలాగే పునరావృతమైతే ఎయిరిండియాపై ప్రయాణికులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎయిరిండియాకు ఏమైందని, ఆ సంస్థ సీఈఓ కాంప్‌బెల్ విల్సన్, మాతృ సంస్థ టాటా గ్రూప్ చర్యలు తీసుకుంటే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోనాజైన్ ఫోటోలపై ఎయిరిండియా స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. చదవండి👉 అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా! -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్‌కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
1నుంచి టీసీఎస్ బైబ్యాక్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్).. సొంత ఈక్విటీ షేర్ల కొను గోలు(బైబ్యాక్)ను డిసెంబర్ 1నుంచి ప్రారంభించనుంది. షేరుకి రూ. 4,150 ధర మించకుండా 1.12 శాతం ఈక్విటీకి సమానమైన 4.09 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 17,000 కోట్లవరకూ వెచి్చంచనుంది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 2 లక్షల పెట్టుబడిలోపుగల చిన్న ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 6 షేర్లకుగాను 1 షేరుని తీసుకోనుంది. ఇందుకు రికార్డ్ డేట్ నవంబర్ 25కాగా.. ఇతర సంస్థాగత ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 209 షేర్లకుగాను 2 షేర్లను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ షేర్ల తాజా బైబ్యాక్ ప్రభావం కంపెనీ లాభదాయకత లేదా ఆర్జనపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. బైబ్యాక్ కారణంగా పెట్టుబడులకు వినియోగించగల నిధులు మాత్రమే ఆమేర తగ్గనున్నట్లు వివరించింది. వెరసి కంపెనీ వృద్ధి అవకాశాలకు ఎలాంటి విఘాతం కలగబోదని స్పష్టం చేసింది. ప్రమోటర్ల వాటా.. టీసీఎస్‌లో ప్రమోటర్ టాటా సన్స్ 72.27 శాతానికి సమానమైన 26.45 కోట్ల షేర్లను కలిగి ఉంది. వీటిలో బైబ్యాక్‌కు 2.96 కోట్ల షేర్లను దాఖలు చేయనుంది. ఇక టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తమవద్ద గల 10,14,,172 షేర్లలో 11,358 షేర్లను టెండర్ చేయనుంది. టీసీఎస్ మొత్తం 4,09,63,855 షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది. బైబ్యాక్‌కు పూర్తిస్థాయిలో షేర్లు దాఖలైతే కంపెనీలో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 72.3 శాతం నుంచి 72.41 శాతానికి బలపడనుంది. కాగా.. బైబ్యాక్ పూర్తయిన తదుపరి ఏడాదివరకూ టీసీఎస్ మూలధన సమీకరణ చేపట్టబోదు. గతేడాది సైతం షేరుకి రూ. 4,500 ధరలో ఈక్విటీ బైబ్యాక్‌కు రూ. 18,000 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. అంతక్రితం 2020, 2018, 2017లలో సైతం బైబ్యాక్‌లకు సుమారు రూ. 16,000 కోట్లు చొప్పున పెట్టుబడులను వెచి్చంచడం విశేషం! కంపెనీ తొలిసారి 2017లో మార్కెట్ ధరకంటే 18 శాతం అధిక ధరలో షేర్ల కొనుగోలుకి తెరతీసింది. ఆపై 18–10 శాతం మధ్య ప్రీమియంలో బైబ్యాక్‌లను పూర్తి చేసింది. 2022 బైబ్యాక్‌కు 17 శాతం అధిక ధరను చెల్లించింది. తాజా బైబ్యాక్ తదుపరి షేరువారీ ఆర్జన(ఈపీఎస్) రూ. 58.52 నుంచి 59.18కి మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం లాభపడి రూ. 3,515 వద్ద ముగిసింది. -
ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
ప్రపంచం కుబేరుల జాబితాలోనే కాదు, భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్‌లో కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరు ఎందుకు లేదనే సందేహం ఇప్పటికే చాలామంది మనసులో ఒక ప్రశ్నగా మిగిలి ఉంటుంది. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో ఈయన పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బుని దాతృత్వానికి వినియోగించడమే. అపారమైన వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ కారణంగానే టాప్ 10 ధనవంతుల జాబితాలో కూడా ఉండలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! 2021 - 22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కాగా రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
నమ్మరు కానీ రతన్ టాటా తమ్ముడితడే.. చిన్న అపార్ట్మెంట్లో..
Ratan Tata Brother Jimmy Naval Tata: భారతీయ ఆటో మొబైల్ రంగానికి ఆజ్యం పోసిన టాటా కుటుంబం గురించి అందరికి తెలుసు. అయితే ఇప్పుడు టాటా గ్రూప్ అనగానే 'రతన్ టాటా' గుర్తుకు వస్తాడు. అయితే రతన్ టాటాకి వివాహం కాలేదు, కానీ తోబుట్టువులతో కూడిన ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో చెప్పుకోదగ్గ వ్యక్తి రతన్ టాటా తమ్ముడు 'జిమ్మీ నావల్ టాటా'. రతన్ టాటా తమ్ముడంటే ఆయన మాదిరిగానే వ్యాపార లావాదేవీలు బాగా చూసుకునే వ్యాపార వేత్త, బిలీనియర్ అని ఊహిస్తారు. కానీ ఆలా ఊహిస్తే మీ ఊహ తప్పే అవుతుంది. ఎందుకంటే జిమ్మీ నావల్ టాటా వారి వ్యాపార సామ్రాజ్యానికి దూరంగా సాధారణ ప్రజలలో ఒకరుగా కలిసి జీవిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ముంబైలో ఒక 2BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. జిమ్మీ నావల్ టాటా మీడియాకి దూరంగా ఉండటమే కాకూండా, వ్యాపారాలన్నింటికీ కూడా దూరంగా ఉంటూ చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. నావల్ టాటా కుమారుడు, రతన్ టాటా తమ్ముడై ఉండి ఇలాంటి జీవితం గడుపుతున్న జిమ్మీ నావల్ టాటాను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. 90వ దశకంలోనే జిమ్మీ నావల్ తన తండ్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన వస్త్ర వ్యాపారంలో వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక టాటా ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలలో పనిచేసి అనతి కాలంలోనే విరమణ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక చిన్న ఫ్లాట్‌లో సామాన్యుడిలా జీవిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) ఈ ఏడాది ప్రారంభంలో రతన్ టాటా తన తమ్ముడు జిమ్మీ టాటాతో కలిసి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'అవి సంతోషకరమైన రోజులు, మా మధ్య ఏమి రాలేదు' అని ఇందులో రాసారు. ఆ ఫోటో 1945లో తీసుకున్నట్లు ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?) రతన్ టాటా ఆస్తులు సుమారు రూ. 3500 కోట్లకంటే ఎక్కువ. అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలియని జిమ్మీ నావల్ రతన్ టాటా కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. ఎందుకు ఈయన వ్యాపారాల మీద ఆసక్తి చూపడం లేదు అనేదానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకోవడం వల్ల అన్నింటికీ దూరంగా ఉన్నాడని తెలుస్తుంది. (ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు) Did you know of Ratan Tata's younger brother Jimmy Tata who lives a quiet reticent life in a humble 2 bhk flat in Colaba, Mumbai! Never interested in business, he was a very good squash player and would beat me every time. Low profile like the Tata group! pic.twitter.com/hkp2sHQVKq — Harsh Goenka (@hvgoenka) January 19, 2022 RGP ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయాంక్ గతంలో షేర్ చేసిన ఒక ట్విటర్ పోస్ట్‌లో జిమ్మీ టాటా ఒక చిన్న ఫ్లాట్‌లో ఉన్నారని, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. అంతే కాకుండా అతడు మంచి స్క్వాష్ ప్లేయర్ అని తనని (గోయెంకాను) ఎప్పుడూ ఓడించేవాడని చెప్పుకొచ్చాడు. కొన్ని వార్తా పత్రికలు అందించిన సమాచారం ప్రకారం.. జిమ్మీ టాటాకు మొబైల్ ఫోన్ లేదని, కేవలం వార్తాపత్రిక ద్వారా అతని అన్ని అప్డేట్లను పొందుతారని తెలిసింది. -
టాటా ట్రస్ట్స్ తొలి సీవోవోగా అపర్ణ ఉప్పలూరి
సాక్షి,ముంబై: టాటా ట్రస్ట్స్ కొత్త సీఈవో, సీవవో లను ఎంపిక చేసింది. సిద్ధార్థ్ శర్మను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, అపర్ణ ఉప్పలూరిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించింది. ఈ నియామకాలు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని సంస్థ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపింది. టాటా ట్రస్ట్స్ తొలి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా అపర్ణ ఉప్పలూరి (48) ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం ఫోర్డ్ ఫౌండేషన్‌లో భారతదేశం, నేపాల్ శ్రీలంకలకు ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు ఆమె. 2018, మేలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఫౌండేషన్‌లో చేరిన ఆమె పరోపకారం, మహిళల హక్కులు, ప్రజారోగ్యం, కళలు సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మక ప్రణాళిక కార్యక్రమాల అభివృద్ధిలో పాపులర్ అయ్యారు అపర్ణ. జెండర్ ఈక్వాలిటీ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఫోర్డ్ ఫౌండేషన్‌లో గ్రాంట్-మేకింగ్ కార్యక్రమాల నిర్వహణలో 20 ఏళ్ల లీడర్షిప్ , మేనేజ్మెంట్ అనుభవం ఆమె సొంతం. ఇక 2022లో టాటా ట్రస్ట్‌ల సీఈవో పదవికి రాజీనామా చేసిన ఎన్ శ్రీనాథ్ ప్లేస్‌లో సిద్ధార్థ్ శర్మ శర్మ ఎంపికైనారు. కాగా టాటా ట్రస్ట్స్, భారతదేశంలోని పురాతన స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి, టాటా సన్స్‌లో 66 శాతం వాటాను టాటా ట్రస్ట్స్ సొంతం. -
‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్ వైరల్!
రతన్ టాటా.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా తన దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తన పోస్ట్‌లతో పలకరిస్తూ భారీగా ఫోలోవర్స్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రగతి కోసం తన వంతు కృషి చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన టాటా ఇండికా కారుని ప్రారంభించ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని గుర్తుచేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. అందులో .. ‘25 ఏళ్ల క్రితం టాటా ఇండికా ప్రారంభం కావడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా మనస్సులో ప్రత్యేక స్థానం ఉందంటూ..’ టాటా ఇండికాతో దిగిన ఫోటో షేర్ చేశారు. 1998లో ఇండికా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చింది. ఇందులోని ఫీచర్లు, అందుబాటు ధరల కారణంగా త్వరగా ఈ కారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇరవై సంవత్సరాల తర్వాత, టాటా మోటార్స్ ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత 2018లో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) చదవండి: ‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’.. అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ -
సంస్కరణలతో భారత్ వృద్ధికి దన్ను
న్యూఢిల్లీ: రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత్‌కు వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు ఊతంగా నిలవనున్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ముందు, తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలకు గట్టి పునాదిగా ఉండగలవని చంద్రశేఖరన్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటి కి భారత్ 25–30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించగలదని ఆయన తెలిపారు. అయితే, అసంఘటిత రంగంలోని వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహిళలు సహా ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చంద్రశేఖరన్ పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మహమ్మారి సమయం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు మరింతగా పుంజుకున్నాయని ఆయన చెప్పారు. -
బీ20 చెయిర్‌గా ‘టాటా’ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: జీ–20లో భాగమైన బీ20 ఇండియా చెయిర్‌గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ వెల్లడించింది. జీ–20 దేశాల వ్యాపార వర్గాలకు బిజినెస్ 20 (బీ–20) చర్చా వేదికగా ఉండనుంది. ప్రస్తుతం జీ–20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమ వర్గాల అజెండాను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు తెలియజేయడానికి కూడా బీ20 తోడ్పడనుంది. సమతూక అభివృద్ధి సాధన దిశగా గ్లోబల్ బీ20 అజెండాను ఇది ముందుకు తీసుకెళ్లగలదని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కార మార్గాలను కనుగొనడంలో జీ–20కి సహాయకరంగా ఉండగలదని చంద్రశేఖరన్ చెప్పారు. -
Cyrus Mistry: గౌరవం కోసం పోరాటం..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీనితో, కొన్నాళ్ల క్రితమే టాటా గ్రూప్ నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీ తాజాగా జీవితం నుంచి కూడా అర్ధాంతరంగా నిష్క్రమించినట్లయింది. టాటా సన్స్‌లో అత్యధికంగా 18 శాతం పైగా వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తరఫున 2012లో టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టే వరకూ.. కుటుంబ వ్యాపార వర్గాల్లో తప్ప సైరస్ మిస్త్రీ పేరు పెద్దగా బైట వినిపించేది కాదు. 1991లో మిస్త్రీ తమ కుటుంబ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో (ఎస్పీ) డైరెక్టరుగా చేరారు. 1994లో ఎండీగా నియమితులయ్యారు. ఎస్పీ గ్రూప్ కార్యకలాపాలు మెరైన్, ఆయిల్, గ్యాస్, రైల్వే తదితర రంగాల్లోకి విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2006లో కీలకమైన టాటా సన్స్ బోర్డులో చేరారు. అప్పటివరకూ ఆయన పలు టాటా కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. సాధారణంగా నలుగురిలో ఎక్కువగా కలవకపోయినా.. తెలిసినంత వరకూ వ్యాపార దక్షత విషయంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ఇదే టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటా తన వారసుడిగా మిస్త్రీని ఎంచుకునేలా చేసింది. వాస్తవానికి టాటా పగ్గాలు చేపట్టడానికి మిస్త్రీకి ఇష్టం లేకపోయినప్పటికీ రతన్ టాటా స్వయంగా నచ్చచెప్పడంతో ఆయన అంగీకరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతాయి. అలా 44 ఏళ్ల వయస్సులో, దేశంలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న మిస్త్రీ సంస్థను కొత్త బాటలో నడిపించే ప్రయత్నం చేశారు. టాటాల కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరొకరు టాటా గ్రూప్‌నకు సారథ్యం వహించడం అదే ప్రథమం. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఆయన దృష్టి పెట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థలను, ఉత్పత్తులను నిలిపివేసి.. లాభదాయక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటివరకూ ఎక్కువగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ)కి పరిమితంగా ఉంటున్న సంస్థ .. మరింతగా వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలవైపు మళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం తగు సిఫార్సులు చేసేందుకు టాటా గ్రూప్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలతో ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను (జీఈసీ) ఏర్పాటు చేశారు. టాటాతో విభేదాలు.. ఉద్వాసన .. అయితే, ఈ క్రమంలో వ్యాపార వ్యవహార శైలి విషయంలో మిస్త్రీ, రతన్ టాటాల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి 2016 అక్టోబర్‌లో ఆయన అర్ధాంతరంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత టాటా సన్స్ డైరెక్టరుగా కూడా ఆయన్ను తప్పించారు. మిస్త్రీ కుటుంబం అతి పెద్ద వాటాదారే అయినప్పటికీ సైరస్ తన పదవిని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్ చంద్రశేఖర్ (టీసీఎస్ చీఫ్) .. గ్రూప్ పగ్గాలు అందుకున్నారు. న్యాయస్థానాల్లో చుక్కెదురు.. అవమానకరంగా తనను పంపించిన తీరుపై మిస్త్రీ న్యాయపోరుకు దిగారు. స్వయంగా టాటాపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘అహంభావంతో ఒక్కరు’’ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో గ్రూప్ వ్యాపారానికి నష్టం జరుగుతోందని, టాటా వాస్తవాలు మాట్లాడటం లేదని ఆరోపించారు. తనను తొలగించడంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించారు. అంతకు కొన్నాళ్ల క్రితమే తన పనితీరు అద్భుతమని ప్రశంసించి, అంతలోనే అలా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాంబే డయింగ్ చీఫ్ నుస్లీ వాడియా, ఆయన చిన్ననాటి స్నేహితురాలు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఆయన పక్షాన నిల్చారు. అయితే, బోర్డు, మెజారిటీ వాటాదారులు ఆయనపై విశ్వాసం కోల్పోయారంటూ ఎన్సీఎల్టీ 2018లో మిస్త్రీ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై ఆయన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ దీనిపై టాటాలు సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా 2021 మార్చిలో ఇచ్చిన తుది తీర్పులో.. అత్యున్నత న్యాయస్థానం టాటాల పక్షం వహించింది. అయితే, అంతకు ముందు తీర్పులో ఆయనపై చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం ద్వారా కొంత ఊరటనిచ్చింది. -
క్యాంప్‌బెల్ విల్సన్: ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది!
ఎయిరిండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంబెల్ విల్సన్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టాటా సన్స్ ప్రకటించింది. 50ఏళ్ల విల్సన్‌కు విమానయాన రంగంలో 26ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్ఐఏ) అనుబంధ సంస్థ అయిన స్కూట్‌కు సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విల్సన్‌ను ఎయిరిండియాకు సీఈవోగా నియమించడం పట్ల ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడంలో విల్సన్‌తో కలిసి చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఐకానిక్ ఎయిరిండియా “ఐకానిక్ ఎయిరిండియాకు నాయకత్వం వహించడానికి, అత్యంత గౌరవనీయమైన టాటా గ్రూప్‌లో భాగస్వామి అవ్వడం గౌరవంగా ఉంది. ఎయిరిండియా ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా అవతరించే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. భారతీయ ఆతిథ్యం ప్రతిబింబించేలా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందిస్తోంది. ఆ ఆశయాన్ని సాకారం చేసే లక్ష్యం దిశగా ఎయిరిండియా, టాటా సహోద్యోగులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది"అంటూ ఎయిరిండియా కొత్త బాస్ విల్సన్ తెలిపారు. ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగిన కొత్త ఎయిర్ ఇండియా బాస్ క్యాంప్ బెల్ విల్సన్ న్యూజిలాండ్ కాంటర్బరీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా..ఎందుకో మనసు యూరప్, అమెరికాపై మళ్లింది.ఆ రెండు దేశాలు తిరిగి స్వదేశమైన న్యూజిల్యాండ్‌కు వచ్చిన ఆయనకు జర్నీలపై పిచ్చి పెరిగింది. ఆ జర్నీ పిచ్చే విల్సన్ ఎయిరిండియా సీఈవో అయ్యేందుకు దోహద పడిందనే చెప్పుకోవాలి. ఇక న్యూజిల్యాండ్‌కు తిరిగి వచ్చిన ఆయనకు విమానయాన రంగంపై మక్కువతో సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్ఐఏ)లో మేనేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు దాని అనుబంధ సంస్థ స్కూట్కి సీఈవో స్థాయికి చేరుకున్నారు. అనేక పదవుల్లో చక్రం తిప్పారు ఏప్రిల్ 1996 నుండి ఎస్ఐఏ గ్రూప్‌లో ఉన్న అతను అనేక పదవులు చేపట్టారు. మే 2011లో అంటే స్కూట్‌లో చేరడానికి ముందు సింగపూర్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్‌గా,హాంకాంగ్‌కు ఎస్ఐఏ జనరల్ మేనేజర్‌తో పాటు, కెనడా ఎస్ఐఏకు వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్ఐఏ హెడ్ ఆఫీస్ నెట్వర్క్ ప్లానింగ్, నెట్వర్క్ రెవెన్యూ మేనేజ్మెంట్ విభాగాలలో 3ఏళ్లు విధులు నిర్వహించారు. విల్సన్ ఎస్ఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్, మార్కెటింగ్)గా పనిచేశారు. దీంతో పాటు ధర, పంపిణీ, ఇ-కామర్స్, మర్చండైజింగ్, బ్రాండ్ అండ్ మార్కెటింగ్, గ్లోబల్ సేల్స్, ఎయిర్‌లైన్ యొక్క విదేశాల్లో ఉన్న ఎస్ఐఏ కార్యాలయాల్ని పర్యవేక్షించారు. ఏప్రిల్ 2020లో స్కూట్ సీఈవోగా పదోన్నతి సాధించారు. ఇప్పుడు ఎయిరిండియా సీఈవోగా ఆ సంస్థ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. చదవండి👉టాటా గ్రూపుకి షాక్! సీఈవో పోస్టు వద్దన్న ఇల్కర్ ఆయ్‌సీ -
ఎయిర్ఏషియా ఇండియాపై ఎయిరిండియా కన్ను
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్‌కు అనుమతులు ఇవ్వాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 83.67 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌కు మిగతా వాటాలు ఉన్నాయి. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను టాటా సన్స్‌లో భాగమైన టాలేస్ ఇటీవలే కొనుగోలు చేసింది. వీటితో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ విస్తారాను కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. విమానయాన సేవలను కన్సాలిడేట్ చేసుకునే క్రమంలో ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో గుత్తాధిపత్య సమస్య తలెత్తకుండా నిర్దిష్ట డీల్స్‌కు సీసీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొనుగోలుతో దేశీయంగా పోటీపై, మార్కెట్ వాటాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సీసీఐకి చేసుకున్న దరఖాస్తులో ఎయిరిండియా పేర్కొన్నట్లు సమాచారం. -
ఎయిరిండియాకు కొత్త బాస్..
ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో ఎండీని నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు సమావేశంలో ఐకెర్ ఆయ్‌సీని కొత్త బాస్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు టర్కీ ఎయిర్వేస్కి చీఫ్‌గా ఐకెర్ ఆయ్‌సీ ఉన్నారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ఆయన ఎయిరిండియా చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. బిల్కెంట్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిష్టేషన్ పట్టాను 1994లో పొందరు ఐకర్ ఆయ్‌సీ. అనంతరం యూకేలని లీడ్స్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా సాధించారు. టర్కీ ఫుడ్ ఫెడరేషన్ బోర్డ్ మెంబర్‌గా కూడా ఐకెర్ ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా ఇటీవల టాటా సన్స్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి పాలనపరమైన సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కొత్త సీఈవో, ఎండీలను నియమిస్తున్నట్టు టాటాసన్స్ చీఫ్ చంద్రశేఖరన్ వెల్డించారు. -
ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొద్ది రోజుల క్రితం తన సొంత గూటి(టాటా)కి చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఎయిర్ ఇండియాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తూ టాటా గ్రూప్ ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది. సుమారు 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎయిర్ ఇండియాకు ఆ పేరు పెట్టడం వెనుక జరిగిన ఆసక్తికర ప్రక్రియను తన ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆ పేరు పెట్టడానికి అప్పటి టాటా సంస్థ ఉద్యోగులు యాజమాన్యానికి ఎలా సహకరించారో సంస్థ వివరించింది. 1946లో టాటా సన్స్ విభాగం నుంచి టాటా ఎయిర్ లైన్స్ ఒక సంస్థగా విస్తరించినప్పుడు, సంస్థ దానికి ఒక పేరు పెట్టవలసి వచ్చింది. భారతదేశం మొదటి విమానయాన సంస్థకు సంస్థ 4 పేర్లను(ఇండియన్ ఎయిర్‌లైన్స్, పాన్-ఇండియన్ ఎయిర్‌లైన్స్, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్-ఇండియా)లను ఎంపిక చేసింది. ఆ నాలుగు పేర్లలో ఒక పేరును ఎంపిక చేసేందుకు ప్రజాస్వామ్య బద్దంగా బాంబే హౌస్‌లోని టాటా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఉద్యోగులు తమ మొదటి, రెండవ ప్రాధాన్యతలను సూచించమని సంస్థ వారిని కోరింది. (2/2): But who made the final decision? Read this excerpt from the Tata Monthly Bulletin of 1946 to know. #AirIndiaOnBoard #WingsOfChange #ThisIsTata pic.twitter.com/E7jkJ1yxQx — Tata Group (@TataCompanies) February 6, 2022 మొదటి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 64 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్'కు - 51 ఓట్లు, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు -28 ఓట్లు, పాన్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు - 19 ఓట్లు వచ్చాయి. ఇందులో అధిక ఓట్లు వచ్చిన మొదటి రెండు పేర్లను ఎంపిక చేసి మరలా ఓటింగు ప్రక్రియను చేపట్టింది. అయితే, రెండవసారి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 72 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్ కు 58 ఓట్లు వచ్చాయి. దీంతో తమ తమ నూతన విమానయాన సంస్థకు 'ఎయిర్-ఇండియా' అని పేరు పెట్టినట్లు ఆ ట్వీట్లో సంస్థ పేర్కొంది. (చదవండి: జియోబుక్ ల్యాప్‌టాప్ గురించి అదిరిపోయే అప్డేట్..!) -
విస్తారా ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్.. రూ.977కే ఫ్లయిట్ జర్నీ!
విస్తారా ఎయిర్‌లైన్స్ కంపెనీ విమానయాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నేటి(జనవరి 6) నుంచి 48 గంటల స్పెషల్ సేల్‌ను ప్రయాణికుల కోసం ముందుకు తీసుకొచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఐఏల జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్‌లైన్స్ తన 7వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాలలో విమాన ప్రయాణాలపై స్పెషల్ ధరలను ప్రకటించింది. దేశీయ విమాన టిక్కెట్ ధర ఎకానమీ క్లాస్‌కి కేవలం రూ.977 నుంచే ప్రారంభిస్తున్నట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. జనవరి 6, 2022 నుంచి జనవరి 7, 2022 అర్ధరాత్రితో ముగిసే 48 గంటల స్పెషల్ సేల్‌లో ప్రయాణికులు పాల్గొని టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఈ సరికొత్త ఆఫర్ ధరలను ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఆఫర్ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న టిక్కెట్స్ మీద మాత్రమే వర్తిస్తాయి. 7వ వార్షికోత్సవ ఆఫర్లో భాగంగా అందిస్తోన్న ఈ టిక్కెట్ల ప్రయాణ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టాటా సన్స్ కి 51 శాతం మెజారిటీ వాటా ఉంది. విస్తారా వెబ్సైట్ ప్రకారం.. దేశీయ ప్రయాణానికి వన్ వే ఆల్ ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్ కోసం ధర రూ. 977, ప్రీమియం ఎకానమీ కోసం ధర రూ. 2677, బిజినెస్ క్లాస్ కోసం ధర రూ. 9777 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. అంతర్జాతీయం ప్రయాణానికి రిటర్న్ ఆల్-ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఢాకా) ధర రూ.13880, ప్రీమియం ఎకానమీ(ముంబై-మాల్దీవులు) ధర రూ. 19711, బిజినెస్ క్లాస్ (ముంబై-సింగపూర్) ధర రూ. 47981 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. సంస్థ పేర్కొన్నట్లు రూ.977 టిక్కెట్ ధర జమ్ము-శ్రీనగర్ మార్గంలో ఉంది. విస్తారా వెబ్సైట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ద్వారా ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే విస్తారా టిక్కెట్ ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రయాణికులకు సూచించింది. (చదవండి: 2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్కరణ!) -
ఎయిరిండియా జాతీయీకరణ ఒక భారీ కుట్ర!
మన దేశంలో టాటా గ్రూప్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేశంలో ఏ ప్రైవేట్ సంస్థకు లేని ఆదరణ టాటా గ్రూప్ సొంతం. ఇంత పెద్ద టాటా గ్రూప్, ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, టాటా సన్స్ ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు దక్కించుకున్నప్పుడు రతన్ టాటా ఒక బావోద్వేగా ట్వీట్ చేశారు. జెఆర్‌డీ టాటా ప్రస్తుతం జీవించి ఉంటే చాలా సంతోషించి ఉండేవారిని ఆ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. చాలా వరకు మన దేశంలోని ప్రజలు, మేధావి వర్గాలు ప్రైవేట్ కరణను వ్యతిరేకిస్తారు. కానీ, టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. అయితే, ఈ ఎయిరిండియా కొనుగోలు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. రతన్ టాటా అలా ట్వీట్ చేయడం వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు మనం ఆ స్టోరీ గురుంచి తెలుసుకుందాం.. ఎయిరిండియాను వ్యాపారం కోసం రతన్ టాటా దక్కించు కోలేదు. ఎయిర్ ఇండియా అనేది జెఆర్‌డీ టాటా కలల ప్రాజెక్టు. టాటా ఎయిర్ లైన్స్ ఏప్రిల్ 1932లో జెహంగీర్ రతన్ జీ దాదాభోయ్(ప్రేమగా జెఆర్‌డి అని పిలుస్తారు) టాటా నాయకత్వంలో ప్రారంభించారు. ఈ ఎయిర్ లైన్స్ ముఖ్య ఉద్దేశ్యం సామాన్య ప్రజానీకానికి సాధ్యమైనంత తక్కువ ధరలో వరల్డ్ క్లాస్ సదుపాయాలతో విమానయాన సౌకర్యాన్ని కల్పించడం. భారతరత్న అందుకున్న భారతదేశపు మొదటి పౌర విమానయాన పైలట్ టాటా గ్రూప్ ఛైర్మన్, ఏకైక పారిశ్రామికవేత్త జెఆర్‌డి. భారతీయ వాణిజ్య పౌర విమానయానం కథ అక్టోబర్ 15, 1932న ప్రారంభమైంది. Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV — Ratan N. Tata (@RNTata2000) October 8, 2021 ఎయిరిండియా ఇంటర్నేషనల్ జెఆర్‌డి కరాచీ డ్రిగ్ రోడ్ ఏరోడ్రోమ్ నుంచి తన మొదటి అధికారిక టాటా ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరి అప్పటి బొంబాయి జుహు ఎయిర్ స్ట్రిప్ వద్ద ల్యాండ్ అయ్యారు. తర్వాత 5 సంవత్సరాలలో టాటా ఎయిర్‌లైన్స్ లాభాలు గణనీయంగా పెరిగాయి. బాహ్య ప్రపంచంతో, 99.4% సమయపాలనతో సేవలు అందించే ఈ విమానయాన సేవలను భారత రాకుమారులు చాలా ఇష్టపడ్డారు. ఇక స్వాతంత్ర్య అనంతరం టాటా ఎయిర్ లైన్స్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి శరణార్థులను తరలించింది. 1947 అక్టోబరులో టాటా సన్స్ అంతర్జాతీయ వైమానిక సేవను ఎయిరిండియా ఇంటర్నేషనల్ పేరుతో స్థాపించాలని అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కోరితే వారు కూడా మూడు వారాల్లో ఆమోదించారు. బాంబే నుంచి లండన్ కు మొదటి ఎయిరిండియా ఇంటర్నేషనల్ విమానం జూన్ 1948లో సకాలంలో(కైరో, జెనీవా వద్ద ఆగిపోయిన కూడా) దిగింది. స్వాతంత్ర్యం తర్వాత పాన్ అమెరికన్, ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, కెఎల్ఎమ్, ఎయిర్ ఫ్రాన్స్ వంటి ఎయిర్ లైన్స్ దేశంలో విమానయాన సేవలు అందిస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ సోదరి దౌత్యవేత్త విజయలక్ష్మీ పండిట్ స్వతంత్ర భారత తొలి రాయబారిగా మాస్కోకు ఎయిరిండియా విమానంలో వెళ్ళింది. ఆమె విమానయాన సంస్థ సేవలు, ప్రమాణాల గురించి పొగుడుతూ జెఆర్‌డీ టాటాకు లేఖ రాసింది. ఇక క్రమ క్రమంగా ఎయిరిండియాకు ప్రజాదరణ వస్తుంది. ఈ సమయంలోనే అసలు సమస్య ఉత్పన్నం అయ్యింది. ఒడిదుడుకులు ప్రారంభం అప్పటి దేశ కమ్యూనికేషన్ మంత్రి భారతదేశం నాలుగు మూలలను కలిపే తపాలా సేవలను ప్రారంభించడానికి ఎయిరిండియా సేవలను కోరారు. ఆ ఆలోచన చాలా మంచిదే కానీ, ఎయిర్ ఇండియా ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి ముందు రాత్రి ల్యాండింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జెఆర్‌డి టాటా అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల రాత్రి వేల తపాలా సేవలను అందించాలని భావించారు. కానీ, ప్రభుత్వం అంగీకరించలేదు. రాను రాను ప్రభుత్వానికి, జెఆర్‌డీ టాటాకు మధ్య దూరం పెరిగింది. దీంతో అప్పటి కమ్యూనికేషన్ మంత్రి మరిన్ని ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో అనేక దేశాల కంపెనీలు మన దేశంలో అడుగ పెట్టాయి. అయితే, రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ అనేక డకోటా విమానాలను మన దేశంలో విమానయాన సేవల కోసం మార్కెట్లోకి పంపింది. ఏటువంటి వ్యాపార అనుభవం లేకుండా మార్కెట్లోకి అడుగు పెట్టడంతో కొన్ని సంస్థలు నష్ట పోయాయి. పోస్టల్ సర్వీస్ ఆలోచనను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి ఎయిరిండియా, ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా, ఎయిర్ వేస్(ఇండియా), ఇండియన్ నేషనల్ ఎయిర్ వేస్లతో ఒక సమావేశాన్ని జెఆర్‌డి టాటా ఏర్పాటు చేశారు. ఈ సమావేశ విషయం దేశ కమ్యూనికేషన్ మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ కి తెలవడంతో చాలా కలత చెందాడు. హిమాలయన్ ఏవియేషన్ అతను 1948లో హిమాలయన్ ఏవియేషన్ అనే కొత్త విమానయాన సేవలను ప్రారంభించాడు. జెఆర్‌డి టాటా, కమ్యూనికేషన్ మంత్రికి బహిరంగ లేఖ రాశారు. లాభాల గురించి మేము విమానయాన సేవలను నడిపించడం లేదు అని అతనికి రాశాడు. ఈ బహిరంగ లేఖతో కోపంతో ఉన్న కిద్వాయ్ జెఆర్‌డి టాటాకు ఒక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం కాస్త అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూకు తెలిసింది. టాటాలు మంచి పని చేస్తున్నారని, ఎయిరిండియా సమర్థవంతమైన, స్నేహపూర్వక సేవలను అందిస్తుందని బహిరంగంగా ప్రకటించారు. మంత్రికి, జెఆర్‌డి టాటాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి జెఆర్‌డి టాటా ప్రతిపాదనను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సూచించారు. అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.ఎస్.రాజధ్యక్ష ఆధ్వర్యంలో నిర్ఘాంతకమిటీ ఆర్థిక సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా లైసెన్స్ లు జారీ చేసినందుకు ప్రభుత్వాన్ని మందలించింది. “నాలుగు కంపెనీలు మనుగడ సాగించలేని చోట విచక్షణారహితంగా డజనుకు పైగా లైసెన్స్ లను జారీ చేయడం ఏకపక్షంగా ఉంది” అని కమిటీ తెలిపింది. దీంతో కమ్యూనికేషన్ మంత్రి కుట్ర వైఖరి నిరూపితమైంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా జాతీయీకరణ త్వరలోనే ఎయిరిండియా జాతీయీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఆర్‌డి టాటా ఈ రంగాన్ని జాతీయం చేయడం దేశానికి మంచిది కాదని, ఇది రాజకీయం చేయడానికి దారితీస్తుందని, ఇది వినాశకరమైనదని అన్నారు. జాతీయసంస్థల కోసం పనిచేసే బ్యూరోక్రాట్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదించారు. ఈ రంగంలో పోటీ తట్టుకోవాలంటే స్వతంత్ర నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోలేరు అని అన్నారు. ప్రధానమంత్రికి ఆయన ఇంటర్వ్యూ కాపీని నెహ్రూకు పంపారు. నెహ్రూ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. త్వరలోనే జెఆర్‌డి టాటా భయపడినట్లుగా అంబికా ఎయిర్ లైన్స్, జూపిటర్ ఎయిర్ వేస్ అనే రెండు కంపెనీలు దివాలా ప్రకటించాయి. చివరగా 1953లో అన్ని విమానయాన సంస్థలను ఒకటిగా విలీనం చేసి ప్రభుత్వం కిందకు తీసుకొని వచ్చింది. చివరి ప్రయత్నంగా, జెఆర్‌డి టాటా రెండు కంపెనీలగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకటి దేశీయ రంగానికి, మరొకటి అంతర్జాతీయ కార్యకలాపాల కోసం తెలిపారు. కాని నెహ్రూ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. విలీనం అవుతున్న కంపెనీలకు పరిహారం చెల్లించడానికి స్వతంత్ర కమిటీని నియమించాలని జెఆర్‌డి టాటా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిని కూడా తిరస్కరించారు. దీంతో జెఆర్‌డి టాటా తీవ్రంగా కలత చెందారు. ఆయన ఇంకా పట్టు విడవలేదు. ఆ తర్వాత వచ్చిన అప్పటి కమ్యూనికేషన్స్ మంత్రి జగ్జీవన్ రామ్ తో జరిగిన సమావేశంలో జెఆర్‌డి టాటా ఇలా అడిగారు.. “మీరు ఇతర విభాగాలను నడుపుతున్న విధంగా విమానయాన సంస్థను నడపడం సులభమని మీరు భావిస్తున్నారా? మీరే చూస్తారు” అని అన్నారు. దానికి జగ్జీవమ్ రామ్ ఇలా జవాబిచ్చాడు” ఇది ప్రభుత్వ శాఖ కావచ్చు, కానీ మీ సహాయంతో దానిని నడపాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. ఆ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. టాటాలకు కేంద్ర ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత జెఆర్‌డి టాటా ఆ విమానయాన బోర్డులో ఒక సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 1957 అక్టోబరు 15న భారత పౌర విమానయానం రజతోత్సవాన్ని దేశం జరుపుకోవడంతో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ భారతదేశాన్ని ప్రపంచ విమానయాన పటంలో నిలిపినందుకు జెఆర్‌డి టాటాని ప్రశంసించారు. ఆయనకు పద్మవిభూషణ్ తో సత్కరించారు. 1978 ఫిబ్రవరిలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియా అధ్యక్షపదవి నుంచి, ఇండియన్ ఎయిర్ లైన్స్ డైరెక్టర్ పదవి నుంచి జె.ఆర్.డీ.ని తప్పించింది. పైసా పారితోషికం తీసుకోలేదు ఈ నిర్ణయంతో ఒక్క పైసా పారితోషికం తీసుకోకుండా 45 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. కానీ, అతని కలల ప్రాజెక్టు విషయంలో భాగ కలత చెందాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఆమె చైర్మన్ గా కాకపోయినా రెండు విమానయాన సంస్థల బోర్డులో జె.ఆర్.డీ.ని తిరిగి నియమించింది. ఎయిర్ ఇండియా చైర్మన్ గా రతన్ టాటా నియమితులైన సంవత్సరం 1986 వరకు జె.ఆర్.డీ.ని బోర్డులలో సేవలను కొనసాగించారు. 1990లో ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం టాటాలను కొత్త దేశీయ విమానయాన సంస్థను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తుందా అని ప్రశ్నించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మరొక అవకాశం వచ్చింది, టాటాలు ఈ ప్రతిపాదనను ఒకే చేసే లోపే ప్రభుత్వం పడిపోయింది. 1994లో ప్రధానమంత్రి నరసింహారావు ఓపెన్ స్కైస్ పాలసీ ప్రకారం ఎయిర్ కార్పొరేషన్ చట్టం-1953 చట్టం ప్రకారం వైమానిక రవాణా సేవలు జాతీయం చేసిన వాటిని రద్దు చేయాలని చూశారు. సంకీర్ణ ప్రభుత్వాలు రావడం బలమైన నిర్ణయాలు తీసుకోలేకుండా పోయింది. ఆ తర్వాత 1995 నుంచి 1997 మధ్య ఎయిర్ ఇండియా వల్ల ₹671 కోట్ల నష్టం వచ్చింది. ఇలా నష్టాలతో కొనసాగుతున్న సంస్థను 2001లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40% వాటాను అమ్మకానికి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాలో ఒక్కొక్కటి 20% వాటాను కొనడానికి ఎస్ఐఎ(సింగపూర్ ఎయిర్ లైన్స్), టాటా సన్స్ ముందుకు వచ్చాయి. కొందరు పెట్టుబదుదారుల కుట్రలు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల పరిస్థితులు క్షీణించాయి. ఈ పరిణామాలతో ఎస్ఐఎ తన భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంది. విమానయాన రంగంలో టాటాల ప్రవేశం నిలిచిపోయింది. అలా అప్పటి నుంచి ఆ కొనుగోలు ఒప్పందం అగుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాదిలో ఎయిర్ ఇండియాను కొనుగోలు టాటా సన్స్ దక్కించుకుంది. -
ఎయిరిండియా విక్రయ ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి టాటా సన్స్, కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సంతకాలు చేశాయి. ఎయిరిండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాదీ, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర మిశ్రా, టాటా గ్రూప్‌నకు చెందిన సుప్రకాష్ ముఖోపాధ్యాయ్.. షేర్ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ... మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయం ట్వీట్ చేశారు. టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఎయిరిండియాలో 100 శాతం వాటాలను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ సుమారు రూ. 18,000 కోట్లు. ఇందులో రూ. 2,700 కోట్ల మొత్తాన్ని టాలేస్ నగదు రూపంలో చెల్లించనుండగా, మిగతా రూ. 15,300 కోట్ల రుణభారం కంపెనీకి బదిలీ కానుంది. ఎయిరిండియా విక్రయాన్ని నిర్ధారిస్తూ అక్టోబర్ 11న టాటా గ్రూప్‌నకు కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) జారీ చేసింది. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణ భారం రూ. 61,562 కోట్లుగా ఉంది. ఇందులో 75 శాతం భారాన్ని (రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్‌ఎల్‌కు ప్రభుత్వం బదలాయిస్తోంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలను రూ. 12,906 కోట్ల రిజర్వ్ ధరతో వేలం వేయగా, అత్యధికంగా కోట్ చేసి టాటా గ్రూప్ విజేతగా నిల్చింది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ రూ. 15,100 కోట్లకు బిడ్ వేశారు. -
ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్న సంతోషం ఆస్వాదించకముందే టాటా గ్రూపుకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరోసారి మహారాజా స్టేటస్‌ని తెచ్చి పెట్టాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితిలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి. ఆస్తులపై పేచీ ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణలో భాగంగా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల టాటా సన్స్ రూ. 18,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించి ఎయిరిండియాను దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా స్థిర, చర ఆస్తులన్నీ టాటా సన్స్ స్వంతం అవుతాయి. ఇందులో బోయింగ్ విమానాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్, కార్గో స్టేషన్లు ఇతర విలువైన భూములు కూడా ఉన్నాయి. క్వార్టర్లు ఖాళీ చేయండి నిబంధనల ప్రకారం ప్రైవేటీకర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆరు నెలలలోపు ప్రస్తుతం ఎయిరిండియా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బంది వాటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఎయిరిండియా కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎయిరిండియా ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉన్న పళంగా మమ్మల్ని క్వార్టర్లు ఖాళీ చేయమనడం దారుణమంటూ మండి పడుతున్నారు. సమ్మెకు రెడీ ఎయిరిండియాలో ప్రస్తుతం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగులు 8084, కాంట్రాక్టు ఉద్యోగులు 4001 మంది ఉన్నారు. ఇందులో చాలా మందికి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర ఏరియాల్లో క్వార్టర్లు కేటాయించారు. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ జారీ చేసిన నోటీసులు వెనక్కి తీసుకోకుంటే నవంబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. కనీసం మాట్లాడరా ? ఎయిరిండియాను ప్రైవేటీకరించిన తర్వాత సెటిల్మెంట్, తమ భవిష్యత్తుకు భరోసా అందించేందుకు కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని, కానీ ఇప్పటికిప్పుడు ఇళ్లు వదిలేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇవ్వడం అమానవీయమని ఉద్యోగులు అంటున్నారు. కనీసం తమతో చర్చలు జరిపేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిక్కుముళ్లు ఏవియేషన్ రంగంలో తమదైన ముద్ర వేయాలని టాటాగ్రూపు ఎప్పటి నుంచో ఆశిస్తోంది. విస్తారాలో పెట్టుబడులు పెట్టినా పూర్తి స్థాయిలో టాటాల ఆశయం నెరవేరలేదు. ఈ సమయంలో ఎయిర్ ఇండియా ద్వారా ఏవియేషన్ రంగంలో దూసుకుపోవాలని టాటా యోచిస్తోంది. అయితే అంతకు ముందు ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్లు తదితర చిక్కుముళ్లు వీడాల్సి ఉంది. చదవండి : ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే ! -
‘దేశంలో రాజాలు ఎందరున్నా.. మహారాజా ఒక్కడే’
ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూపు తిరిగి దక్కించుకోవడం పట్ల పారిశ్రామిక వర్గాల్లో సానుకూల స్పందన లభిస్తోంది. ప్రైవేటీకరణ అంటే సాధారణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ టాటా గ్రూపు విషయానికి వస్తే... ఈ వ్యతిరేకత కొంత తక్కువే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని అద్దం పట్టే సోషల్ మీడియాలో ఈ డీల్ పట్ల సానుకూల స్పందనే వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హార్ష్ గోయెంకా ఎయిరిండియా ప్రైవేటీకరణపై స్పందించారు. మస్కట్ మహారాజాతో పోలిక పెడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. వారిలో చాలా మందిని రాజా అని పిలస్తూ ఉండవచ్చు. కానీ దేశంలో మహారాజు అని పిలిచే గ్రూపు ఒక్కటే ఉంది. అది టాటా అని ఆయన పేర్కొన్నారు. There are very very rich people who may be the ‘Rajas’ of India. But there is only one group who can be called the ‘Maharaja’ of our Country. pic.twitter.com/M4b2eX53M2 — Harsh Goenka (@hvgoenka) October 9, 2021 మరోవైపు ఆనంద్ మహీంద్రా సైతం ఈ డీల్‌ను ఉద్దేషిస్తూ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే ‘ఈ టేకోవర్ ప్రాముఖ్యతపై నేను చేసే వ్యాఖ్యలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల భారత వ్యాపార వాతావరణానికి ప్రభుత్వం పునర్వైభవం తీసుకొస్తోందని నేను భావిస్తున్నాను. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రైవేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోంది’ అని పేర్కొన్నారు. I may be accused of overstating the importance of this event but I think this divestment amounts to a ‘reset’ of the Indian business environment. Yes, the Govt. is dispensing of a cash drain; But it’s also renewing faith-after decades-in the potential efficiency of the Pvt.sector https://t.co/iZKgt2L7cD — anand mahindra (@anandmahindra) October 8, 2021 చదవండి : వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా - రతన్ టాటా -
మళ్ళీ టాటాల చేతుల్లోకే ఎయిర్ ఇండియా
-
టాటా చేతికే ఎయిరిండియా!
ఇంత కాలం ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇకపై ప్రైవేటు పరం కానుంది. ఇకపై ఎయిరిడియా టాటా గ్రూపు చేతిలోకి వెళ్లనుందని సమాచారం. రూ. 20,000 వేల కోట్లు ? పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిరిండియాలో వంద శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించగా టాటా గ్రూపు సంస్థ ఇందులో విజేతగా నిలిచినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా విమనాలతో పాటు సంస్థ స్థిర, చర ఆస్తులు టాటా గ్రూపునకు దక్కనున్నాయి. ఈ పెట్టుబడుల ఉపసంహారణ ద్వారా కేంద్రం రూ.20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. టాటాకే దక్కింది ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇటీవల కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. టాటా గ్రూపుకి సంబంధించిన టాటా సన్స్‌తో పాటు స్పైస్ జెట్ సంస్థ బిడ్లను దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన కేంద్ర మంత్రి అమిత్‌షా నేతృత్వంలో మంత్రుల బృందం చివరకు టాటా గ్రూపునకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ బిడ్డింగ్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 1932లో ప్రారంభం స్వాతంత్రానికి పూర్వమే జంషెడ్జీ టాటా 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో ఎయిర్ ఇండియా పేరు మార్చారు. అయిత ఆ తర్వాత 1953 సెప్టెంబరు 29న టాటా ఎయిర్‌లైన్స్‌ని కేంద్రం జాతీయం చేసింది. దీంతో ప్రైవేటు ఎయిర్‌లైన్స్ కాస్తా ప్రభుత్వ ఎయిరిండియాగా మారింది. నష్టాల ఊబిలో విదేశాలకు నడిపే విమానాలు ఎయిరిండియా, దేశీయంగా నడిపే విమాన సర్వీసులను ఇండియన్ ఎయిర్‌లైన్స్‌గా వ్యవహరించారు. అయితే ఈ రంగంలో రాజకీయ జోక్యం పెరిగి పోవడం, నిర్వాహాణపరమైన లోపాల కారణంగా గత ఇరవై ఏళ్లుగా నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. దీంతో ఈ సంస్థను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. 67 ఏళ్ల తర్వాత ఉప్పు నుంచి హెలికాప్టర్ల వరకు అనేక రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోన్న టాటా గ్రూపు ఎప్పటి నుంచో విమానయాన రంగంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా 67 ఏళ్ల తర్వాత తాము స్థాపించిన సంస్థను తిరిగి టాటా గ్రూపు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని ప్రచారాలే మరోవైపు తాజా మీడియా నివేదికలను ప్రభుత్వం ఖండించింది. ఇంతవరకు ఎయిరిండియా ఇన్వెస్ట్మెంట్ బిడ్‌కు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఆమోదం ఇవ్వలేదని తెలిపింది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియాకు తెలియచేస్తామంటూ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ట్వీట్ చేసింది. మీడియా నివేదికలు తప్పు అని పేర్కొంది. Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken. pic.twitter.com/PVMgJdDixS — Secretary, DIPAM (@SecyDIPAM) October 1, 2021 చదవండి : ఎయిరిండియా రేసులో టాటా -
ఎయిరిండియా రేసులో టాటా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎయిరిండియా కొనుగోలుకి దేశీ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఫైనాన్షియల్ బిడ్‌ను దాఖలు చేసింది. ఇదే విధంగా అందుబాటు ధరల ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్.. చీఫ్ అజయ్‌సింగ్ సైతం బిడ్ చేయడం ద్వారా పోటీ పడుతున్నారు. చివరి రోజు బుధవారానికల్లా ఎయిరిండియా కొనుగోలుకి ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా వెల్లడించారు. అయితే ఎన్ని సంస్థలు రేసులో నిలిచిందీ వెల్లడించలేదు. టాటా సన్స్ బిడ్‌ను దాఖలు చేసినట్లు గ్రూప్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. మరోపక్క స్పైస్‌జెట్ ఎండీ, చైర్‌పర్శన్ అజయ్ సింగ్ వ్యక్తిగత హోదాలో పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ బాటలో పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయ లావాదేవీల నిర్వాహక సంస్థకు పలు ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు పాండే తెలియజేశారు. దీంతో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశ(కన్‌క్లూడింగ్ స్టేజ్)కు చేరినట్లు ట్వీట్ చేశారు. 100 శాతం వాటా: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాలోగల 100 శాతం వాటాతోపాటు.. ఏఐ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో ఎయిరిండియాకుగల 100 శాతం వాటాను సైతం విక్రయించనుంది. అంతేకాకుండా ఎయిరిండియా సాట్స్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ ప్రయివేట్‌లోగల కంపెనీకిగల 50 శాతం వాటాను సైతం బదిలీ చేయనుంది. 2020 జనవరిలో ప్రారంభమైన విక్రయ సన్నాహాలు కోవిడ్–19 కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎయిరిండియా కొనుగోలుకి అవకాశమున్న సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్‌ను ప్రభుత్వం ఆహా్వనించింది. వీటికి గడువు ఈ బుధవారం(15)తో ముగియనుంది. బయటకు వెల్లడికాని రిజర్వ్ ధరకు ఎగువన దాఖలైన బిడ్స్‌ను సలహాదారు సంస్థ పరిగణించనుంది. అధిక ధరను కోట్ చేసిన బిడ్స్‌ను ఎంపిక చేయనుంది. తద్వారా వీటిని క్యాబినెట్ అనుమతి కోసం పంపనుంది. -
టాటా గ్రూప్ కిట్‌లో 1ఎంజీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ హెల్త్‌కేర్ మార్కెట్‌ప్లేస్.. 1ఎంజీ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు టాటా సన్స్ సొంత అనుబంధ సంస్థ టాటా డిజిటల్ తాజాగా పేర్కొవాటా విలువను వెల్లడించలేదు. కంపెనీ ఇటీవలే ఫిట్నెస్ సంబంధ సేవలందించే క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్‌లో 7.5 కోట్ల డాలర్లు(రూ. 550 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా క్యూర్‌ఫిట్‌లో వాటాను సొంతం చేసుకోనుంది. కాగా.. విభిన్న విభాగాలలో వినియోగదారుడి అవసరాలను ఒకే గొడుగు కింద అందించేందుకు వీలుగా డిజిటల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా డిజిటల్ వివరించింది. ఈ ప్రణాళికల్లో భాగంగానే 1ఎంజీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్ వ్యవస్థలో ఈఫార్మసీ, ఈడయాగ్నోస్టిక్స్, టెలి కన్సల్టేషన్ కీలక విభాగాలుగా నిలవనున్నట్లు వెల్లడించింది. ఇవి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా హెల్త్‌కేర్ విభాగం మరింత జోరు చూపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ విభాగంలో 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 7,300 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు తెలియజేసింది. వార్షికంగా 50 శాతం చొప్పున వృద్ధి సాధిస్తున్నట్లు వివరించింది. 1ఎంజీ బ్యాక్‌గ్రౌండ్ 2015లో ప్రారంభమైన 1ఎంజీ ఈహెల్త్ విభాగంలో మెడిసిన్స్, వెల్నెస్ ప్రొడక్టులు, డయాగ్నోస్టిక్ సర్వీసులు, టెలి కన్సల్టేషన్ తదితర పలు సేవలు అందిస్తోంది. ఆధునిక డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లతోపాటు.. మెడిసిన్స్, ఇతర ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తుల పంపిణీ నిర్వహిస్తోంది. కాగా.. ఈ వారం మొదట్లో రూ. 550 కోట్లతో క్యూర్‌ఫిట్‌లో వాటా కొనుగోలు చేస్తున్నట్లు టాటా సన్స్ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా క్యూర్‌ఫిట్ వ్యవస్థాపకుడు, సీఈవో ముకేశ్ బన్సల్‌కు టాటా డిజిటల్లో ప్రెసిడెంట్‌గా ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలియజేసింది. -
దేశవ్యాప్త లాక్డౌన్లు పరిష్కారం కాదు: టాటా
న్యూఢిల్లీ: భారత్‌కు సాధ్యమైనని కరోనా టీకాల అవసరం ఉందని.. వాటికి లైసెన్స్‌లు ఇవ్వడంతోపాటు.. రెండో విడత ఇన్ఫెక్షన్ కేసులు తీవ్రతరం అయిన నేపథ్యంలో టీకాల ఉత్పత్తిని యుద్ధప్రాతిపదికన పెంచాలని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఏఐఎంఏ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. కరోనా రెండో విడత ఆందోళన కలిగిస్తోందన్నారు. కేసులను గుర్తించడం, టీకాలు ఇవ్వడం, వ్యాక్సిన్ల సరఫరాను పర్యవేక్షించడం చేయాలన్నారు. దేశవ్యాప్త లాక్డౌన్లు పరిష్కారం కావంటూ ఆర్థిక వ్యవస్థపైనా ప్రజల జీవితాలపై ఇది ప్రభావం చూపిస్తుందన్నారు. ‘ప్రస్తుత పరిస్థితి నిర్వహణ బాధ్యతలను మీకు అప్పగిస్తే ఎలా వ్యవహరిస్తారంటూ’? ఎదురైన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘నిజంగా దీన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి. అవసరమైన పెట్టుబడులను స్వల్ప వ్యవధిలోనే చేయాలి. దాంతో ఉత్పత్తిని పెంచొచ్చు. పెద్ద ఎత్తున ఎలా ఉత్పత్తి చేయగలమో స్పష్టతకు రావాలి. అప్పుడే అవసరాలను చేరుకోగలం’’ అని బదులిచ్చారు. ఒకవైపు ప్రజల ప్రాణాలను పోకుండా చూడడంతోపాటు మరోవైపు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ.. దీన్ని చాలా సున్నితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. చదవండి: (కరోనాపై ఏం చేద్దాం చెప్పండి..) -
మిస్త్రీకి టాటా రైటే..!
దేశీ కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్‌లో మిస్త్రీకి చెందిన ఎస్పీ గ్రూప్ వాటాల వేల్యుయేషన్‌ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ సూచించింది. సుప్రీం ఉత్తర్వులపై టాటా గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌తో నాలుగేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. టాటా సన్స్ చైర్మన్‌గా ఆయన్ను పునర్నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో టాటా సన్స్ అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ‘2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నాం. టాటా గ్రూప్ అప్పీళ్లను అనుమతిస్తున్నాం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (మిస్త్రీ కుటుంబానికి చెందిన గ్రూప్) అప్పీళ్లను తోసిపుచ్చుతున్నాం‘ అని ఆదేశాలు ఇచ్చింది. దీనితో మిస్త్రీ తొలగింపుపై దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది. టాటా సన్స్ యాజమాన్య అధికారాలను విభజించాలన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎస్పీ గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థలు వేసిన పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే టాటా సన్స్ బోర్డులో సముచితంగా ప్రాతినిధ్యం కల్పించాలంటూ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ చేసిన అప్పీళ్లను కూడా తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై టాటా సన్స్‌తో పాటు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల తరబడి టాటా గ్రూప్ పాటిస్తున్న అత్యుత్తమ గవర్నెన్స్ ప్రమాణాలకు ఇది గుర్తింపు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రతన్ టాటా వారసుడిగా 2012లో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో పగ్గాలు చేపట్టడం, 2016లో ఆయన్ను అర్ధాంతరంగా తప్పించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ మిస్త్రీ, ఉద్వాసనను సమర్ధించుకుంటూ టాటా గ్రూప్ అప్పట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్నాయి. మిస్త్రీకి అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టాటా గ్రూప్, కంపెనీలో గవర్నెన్స్ లోపాలపై తాము లేవనెత్తిన అంశాలను ఎన్సీఎల్ఏటీ పరిష్కరించలేదంటూ మిస్త్రీ గ్రూప్.. సుప్రీంను ఆశ్రయించాయి. వేల్యుయేషన్‌పై... టాటా గ్రూప్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటాల విలువ ఎంత ఉంటుందనేది తేల్చుకోవడాన్ని ఇరుపక్షాలకు వదిలేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకోసం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 75 లేదా ఇతరత్రా న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చని సూచించింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) ఎస్పీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ లెక్కగట్టింది. తదనుగుణంగానే గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతోంది. అయితే, ఈ వాటాల వేల్యుయేషన్ రూ. 70,000–80,000 కోట్లే ఉంటుందని టీఎస్పీఎల్ వాదిస్తోంది. కేసు సాగిందిలా.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాలు చేయడంతో పాటు టాటా సన్స్ మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన 2 సంస్థలు ఎన్సీఎల్టీ (ముంబై)ని ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా అప్పటి టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ నియామకం. అదే ఏడాది ఫిబ్రవరి 6న మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ డైరెక్టర్‌గా తొలగించారు. మార్చి, ఏప్రిల్‌లో మిస్త్రీ కంపెనీల పిటీషన్లను ఎన్సీఎల్టీ (ముంబై) తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మిస్త్రీ కంపెనీలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. దాని ఆదేశాల మేరకు మరోసారి ఎన్సీఎల్టీకి వెళ్లాయి. ► 2018 జూలై 9: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు ఇతరత్రా అంశాలపై దాఖలైన పిటిషన్లను ఎన్సీఎల్టీ ముంబై మరోసారి తోసిపుచ్చింది. దీనిపై మిస్త్రీ కంపెనీలు మళ్లీ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా పునర్నియామకానికి అనుకూలంగా ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు టాటా గ్రూప్‌నకు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ► 2020 జనవరి 2: ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీంను ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్ 17న తుది ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ► 2020 మార్చి 26: మిస్త్రీ పునర్నియామకంపై ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను తోసిపుచ్చుతూ సుప్రీం తుది ఉత్తర్వులు ఇచ్చింది. మా విలువలకు నిదర్శనం.. గెలుపోటములకు సంబంధించిన అంశం కాదిది. నా నిబద్ధతపైనా, గ్రూప్ నైతిక విలువలపైనా నిరంతరంగా ఆరోపణల రూపంలో దాడులు జరిగాయి. అంతిమంగా టాటా సన్స్ అప్పీళ్లకు అనుకూలంగా తీర్పు రావడం మా విలువలు, నైతికతకు నిదర్శనం. చిరకాలంగా ఇవే మార్గదర్శక సూత్రాలుగా గ్రూప్ ప్రస్థానం సాగుతోంది. – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్ టాటా షేర్లు రయ్.. సుప్రీం కోర్టులో అనుకూల ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం జోరుగా పెరిగాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ 6%, టాటా పవర్ 5 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 4 శాతం, టాటా మోటార్స్ సుమారు 4 శాతం ఎగిశాయి. టాటా మెటాలిక్స్ 3 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ .. టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ చెరి 2.6 శాతం, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ .. వోల్టాస్ .. టాటా కెమికల్స్ దాదాపు 2 శాతం మేర పెరిగాయి. -
కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించిన టాటా సన్స్
న్యూఢిల్లీ, సాక్షి: గత కేలండర్ ఏడాది(2020)లో దేశీయంగా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా అతిపెద్ద ప్రమోటర్‌గా టాటా సన్స్ ఆవిర్భవించింది. తద్వారా పలు పీఎస్‌యూలలో మెజారిటీ వాటాలు కలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించింది. 2020 డిసెంబర్ చివరికల్లా టాటా సన్స్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 9.28 లక్షల కోట్లను తాకింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పీఎస్‌యూల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 9.24 లక్షల కోట్లకు పరిమితమైంది. ఏడాది కాలంలో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 34 శాతానికిపైగా బలపడటం విశేషంకాగా. పీఎస్‌యూల విలువ దాదాపు 20 శాతం క్షీణించడం గమనార్హం! వెరసి రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం నిలుపుకుంటూ వస్తున్న టాప్ ర్యాంకును టాటా సన్స్ చేజిక్కించుకున్నట్లు ఆంగ్ల పత్రిక బిజినెస్ స్టాండర్ట్ నివేదిక పేర్కొంది. (జేవీకి.. ఫోర్డ్, మహీంద్రాల ‘టాటా’) ఏడాది కాలంలో.. నిజానికి 2019 డిసెంబర్‌కల్లా ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ రూ. 18.6 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో టాటా సన్స్ గ్రూప్ లిస్టెండ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 11.6 లక్షల కోట్లుగా మాత్రమే నమోదైంది. ఈ సమయంలో టాటా సన్స్ గ్రూప్ కంపెనీల విలువతో పోలిస్తే ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వ కంపెనీల విలువ 67 శాతం అధికంకావడం గమనార్హం! కాగా.. 2020 డిసెంబర్‌కల్లా మొత్తం టాటా సన్స్ గ్రూప్ కంపెనీల విలువ రూ. 15.6 లక్షల కోట్లకు చేరగా.. పీఎస్‌యూలలో కేంద్ర వాటాల విలువ రూ. 15.3 లక్షల కోట్లుగా నమోదైనట్లు నివేదిక పేర్కొంది. -
టాటా ట్రస్టులకు తొలగిన పన్ను చిక్కులు!
న్యూఢిల్లీ: మూడు టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపు హోదా సమంజసమేనని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రూలింగ్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 2019లో ఇచ్చిన ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’ ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఐటీఏటీ ముంబై బెంచ్ ప్రెసిడెంట్ జస్టిస్ పీపీ భట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ సోమవారంనాడు మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. . దీనితో రతన్ టాటా ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించినట్లయ్యింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్లో ఈ మూడు ట్రస్టులకూ 66 శాతం వాటా ఉంది. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూలింగ్‌లో ఎటువంటి మెరిట్స్ లేవని ఈ ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే... మూడు ట్రస్ట్‌లకూ టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయన్న కారణంగా పన్ను మినహాయింపు రద్దును కోరుతూ ఆదాయపు పన్ను కమిషనర్– మినహాయింపులు (సీఐటీ–ఈ) గత ఏడాది మార్చిలో ఒక రివిజన్ (అభిప్రాయ వ్యక్తీకరణ) ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీకి సంబంధించి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సమర్పించిన పత్రాలను పరిశీలనలోకి తీసుకున్నారు. టాటాసన్స్లో వాటాలు కలిగిఉంటూ, పన్ను మినహాయింపులు పొందడం ఆదాయపు పన్ను చట్టాలకు విఘా తమని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ట్రస్టు లో ట్రస్టీలు ఎవరికీ టాటా సన్స్‌లో ఎటువంటి స్వప్రయోజనాలూ లేవు. టాటాసన్స్లో పెట్టుబడు లు పెట్టి, స్వలాభాలు పొందాలన్న అభిప్రా యం ఇక్కడ కనిపించడంలేదు. టాటా గ్రూప్ కంపెనీల విజయం ద్వారా వచ్చిన ఫలాలను విస్తృత ప్రాతిపదికన ప్రజా ప్రయోజనాలకు పంచాలన్నదే ట్రస్టు ల లక్ష్యం’’ అని ఉత్తర్వులో అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. అలాగే టాటాసన్స్ ట్రస్టీలకు చేస్తున్న చెల్లింపులు వారి సేవలకు ఇస్తున్న ప్రతిఫలంగానే చూడాలి తప్ప, మరో విధంగా కాదని పేర్కొంది. సైరస్ మిస్త్రీ ప్రవర్తన అనైతికం... కాగా, బాధ్యతల్లో నుంచి తప్పించిన ఎనిమిది వారాల తర్వాత సైరస్ మిస్త్రీ సంబంధిత డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించడాన్నీ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. కార్పొరేట్ ప్రపంచంలో కనీవినీ ఎరుగని అనైతిక ప్రవర్తనకు మిస్త్రీ పాల్పడ్డారని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కంపెనీ అనుమతి కూడా లేకుండా ఈ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించింది. మిస్త్రీ డాక్యుమెంట్ల సమర్పణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, ఇందుకు సంబంధించి ఆయన ఉద్దేశాలు ‘‘తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది. టాటా సన్స్‌లో 2006 నుంచీ ఆయన డైరెక్టర్‌గా ఉన్నారనీ, 2013 నుంచీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారనీ పేర్కొన్న ట్రిబ్యునల్, అప్పుడు అంతా మంచిగా కనిపించిన ఆయనకు, బాధ్యతల నుంచి తొలగించిన వెంటనే తప్పులు ఎలా కనబడతాయని ప్రశ్నించింది. 2013లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసిన సంగతి తెలిసిందే. టాటా ట్రస్టుల కేసుకు బలం! కాగా తాజాగా ఐటీఏటీ ఇచ్చిన రూలింగ్, టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్ రద్దు కేసుకు బలం చేకూర్చినట్లయ్యింది. ఆదాయపు పన్ను శాఖ 2019 అక్టోబర్‌లో ఆరు టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ కేసు ఐటీఏటీ ప్రత్యేక బెంచ్ వద్ద విచారణలో ఉంది. ఎయిర్–ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు మరింత వాటా అదనంగా 32 శాతం వాటా కొనుగోలు ఎయిర్–ఏషియా ఇండియా(ఏఏఐఎల్)లో టాటా సన్స్ సంస్థ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది. ప్రస్తుతం ఏఏఐఎల్ఎల్లో టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాకు 49 శాతం చొప్పున వాటాలున్నాయి. తాజాగా టాటా సన్స్ సంస్థ అదనంగా 32 శాతం వాటాను ఎయిర్ఏషియా నుంచి 3.76 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఏఏఐఎల్లో టాటా సన్స్ వాటా 83.67 శాతానికి పెరుగుతుంది. ఎయిర్ఏషియా వాటా 13 శాతానికి పరిమితమవుతుంది. ఎయిర్–ఏషియా ఇండియా కంపెనీ 2014 జూన్‌లో దేశీయ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్ ఇండియా కోసమే...!: ఎయిర్ ఇండియా టేకోవర్‌కు ఎయిర్ఏషియా ఇండియాను ఇన్వెస్ట్మెంట్ వెహికల్‌గా వినియోగించుకోవడానికి ఎయిర్ఏషియా ఇండియాలో తన వాటాను టాటా సన్స్ మరింతగా పెంచుకున్నారని సమాచారం. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో ఎయిర్ఏషియా వాటా 7.1 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరుతో మరో విమానయాన కంపెనీని కూడా నిర్వహిస్తోంది. -
టాటా–మిస్త్రీ వివాదం సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు సంబంధించి దాఖలైన క్రాస్ అప్పీల్స్‌పై తీర్పును సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసుకుంది. రెండు గ్రూపులూ తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలనీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టాటా గ్రూప్ చీఫ్‌గా మిస్త్రీ తొలగింపు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) పునఃనియామకం ఉత్తర్వులు, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన క్రాస్ అప్పీల్స్ గురువారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఎస్. బోపన్న, వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కేసు పూర్వాపరాలు ఇవీ... 2012లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసింది. తనను తొలగించడంపై ఎన్సీఎల్ఏటీని సైరస్ మిస్త్రీ ఆశ్రయించారు. ఈ కేసులో సైరస్ను తిరిగి నియమిస్తూ, 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే 100 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.7,50,000 కోట్లు) గ్రూప్ పాలనా అంశాలకు సంబంధించి తగిన ఆదేశాలు రాలేదని, ట్రిబ్యునల్ ఆదేశాల్లో వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంటూ మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సైరస్ మిస్త్రీ పునఃనియామకాన్ని సవాలుచేస్తూ, టాటా సన్స్ కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది. తద్వారా రెండు గ్రూప్‌లూ వివాదంపై క్రాస్ అప్పీల్స్ దాఖలు చేసినట్లయ్యింది. డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ జారీ చేసిన పునఃనియామక ఉత్తర్వులపై జనవరి 10వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్)లో తమకున్న షేర్లను తనఖా పెట్టడంకానీ లేదా బదలాయించడంగానీ చేయరాదని కూడా ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. చైర్మన్‌గా మిస్త్రీని తొలగింపు విషయంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అలాగే కంపెనీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ ఆరోపిస్తోంది. అయితే టాటా గ్రూప్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. వాటా విలువలపైనా వివాదం టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా 18.37 శాతం విలువ ప్రస్తుతం రెండు గ్రూప్‌ల మధ్య తాజా న్యాయపోరాటానికి వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా విలువ రూ.70,000 కోట్లు–రూ.80,000 కోట్ల మధ్య ఉంటుందని డిసెంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టుకు టాటా గ్రూప్ తెలిపింది. టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టుకు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ అప్పటికే సమర్పించింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు అక్టోబర్ 29న సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మిస్త్రీకి మరోసారి షాకిచ్చిన టాటా సన్స్
సాక్షి, న్యూఢిల్లీ: వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి. హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాలకు బదులుగా టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను కేటాయించాలంటూ ఎస్పీ గ్రూప్ ప్రతిపాదించింది. అయితే, ఇది అర్థరహితమైన ప్రతిపాదనంటూ టాటా సన్స్ తోసిపుచ్చింది. అలా చేస్తే టాటా గ్రూప్‌లో భాగమైన ఇతర లిస్టెడ్ కంపెనీల్లో ఎస్పీ గ్రూప్ మళ్లీ మైనారిటీ వాటాలు తీసుకున్నట్లవుతుందే తప్ప పెద్ద తేడా ఉండబోదని పేర్కొంది. టాటా సన్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, ఎస్పీ గ్రూప్‌నకు సంబంధించిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీఏ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై విచారణ సోమవారం కూడాకొనసాగనుంది. టాటా సన్స్‌తో విభేదాల నేపథ్యంలో అందులో వాటాలు విక్రయించి వైదొలగాలని ఎస్పీ గ్రూప్ భావిస్తోంది. అయితే, వేల్యుయేషన్ విషయంలో సమస్య వచ్చి పడింది. టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాల విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ వాదిస్తుండగా, ఇది కేవలం రూ. 70,000-80,000 కోట్ల మధ్య ఉంటుందని టాటా సన్స్ చెబుతోంది. -
టీసీఎస్ షేర్ల బైబ్యాక్ !
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్ షేర్లను బైబ్యాక్ చేసే అవకాశాలున్నాయి. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై రేపు(బుధవారం) జరిగే బోర్డ్ సమా వేశంలో చర్చించనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లకు నివేదించింది. అదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కంపెనీ వెల్లడించనున్నది. రెండో మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. టీసీఎస్ 2018లో రూ.16,000 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఒక్కో షేర్‌ను రూ.2,100 ధరకు మొత్తం 7.61 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ కంపెనీ బైబ్యాక్ చేసింది. 2017లో కూడా ఇదే రేంజ్లో షేర్లను బైబ్యాక్ చేసింది. ప్రస్తుత బైబ్యాక్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కానప్పటికీ, రూ.20,000 కోట్ల రేంజ్లో షేర్ల బైబ్యాక్ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాటా సన్స్ కోసమే షేర్ల బైబ్యాక్ ? ఈ షేర్ల బైబ్యాక్ వల్ల టీసీఎస్ ప్రమోటర్ టాటా సన్స్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగనున్నది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్న టాటా మోటార్స్, ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడానికి టాటా సన్స్‌కు నిధుల అవసరం ఉందని, దాని కోసమే టీసీఎస్ షేర్ల బైబ్యాక్ చేయనున్నదని విశ్లేషకులంటున్నారు. ఇతర ఐటీ కంపెనీలూ ఇదే బాటలో....! డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) కారణంగా పలు కంపెనీలు డివిడెండ్ల చెల్లింపుల కంటే షేర్ల బైబ్యాక్కే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులంటున్నారు. కాగా నిధులు పుష్కలంగా ఉన్న ఇతర ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్ బాట పట్టే అవకాశాలే అధికంగా ఉన్నాయని వారంటున్నారు. -
ప్రత్యర్థులకు షాక్ : త్వరలో టాటా సూపర్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ విభాగంలోకి దేశీయ అతిపెద్ద వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు మరింత వేగంగా దూసుకు వస్తోంది. ఇందుకు ఒక సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా ప్రతిదీ ఆర్డర్ చేసేలా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో “సూపర్ యాప్” ను ఆవిష్కరించనుంది. తద్వారా బిలియనీర్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ లాంటి ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా సాల్ట్ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వరకు విస్తరించి టాటా గ్రూపు గత ఏడాది టాటా డిజిటల్ పేరుతో డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో ప్రాచుర్యం పొందిన టెన్సెంట్, అలీబాబా తరహాలో ఇక్కడ కూడా సూపర్ యాప్‌ను తీసుకు రానుంది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని లాంచ్ చేయనుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నట్లు పలు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే సూపర్ యాప్‌నకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ఫ్యాషన్ షాపింగ్ యాప్ టాటా క్లిక్, కిరాణా ఇ-స్టోర్ స్టార్‌క్విక్ ఆన్లైన్, ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫాం క్రోమా ద్వారా ఇప్పటికే సేవలను అందిస్తున్న టాటా గ్రూప్, వీటన్నింటి సమ్మితంగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త సూపర్ యాప్ ను రూపొందించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్ యాప్ ద్వారా ఫుడ్, కిరాణా, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ లాంటి వాటితో పాటు ఇతర పేమెంట్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. ఇదొక సూపర్ యాప్. ఇందులో పలు యాప్స్ ఉంటాయి. డిజిటల్ సేవల్లో తమకు అపారమైన అవకాశాలున్నాయని చంద్రశేఖరన్ వెల్లడించారు. భారతదేశంలోఅనేక కోట్లాదిమంది వినియోగదారులను అనుసంధానిస్తూ వారికి సరళమైన ఆన్లైన్ అనుభవాన్ని అందించనున్నామని పేర్కొన్నారు. కాగా గోల్డ్‌మన్ సాచ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతాన్ని డిజిటల్ వ్యాపారం ఆక్రమించనుంది. సుమారు15 రెట్లు పుంజుకుని 300 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు తాజా వ్యూహాలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
గ్రూప్ కంపెనీలకు టాటాసన్స్ చేయూత
కోవిడ్-19 ధాటికి కుదేలైన గ్రూప్ వ్యాపారాలు కోలుకునేందుకు నిధుల సాయం చేయాలని టాటాగ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్ భావిస్తోంది. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో టాటాల ఎయిర్‌లైన్స్, హోటల్, హౌసింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 1బిలియన్ డాలర్ నిధులను మూలధన కేటాయింపు రూపంలో ఆయా వ్యాపార కంపెనీల్లోకి జొప్పించాలని టాటాబోర్డు నిర్ణయం తీసుకుంది. టాటాగ్రూప్ సాధారణ బోర్డు సమావేశం శుక్రవారం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిర్వహించారు. కరోనా ఎఫెక్ట్‌తో పాటు సుప్రీంకోర్టు ఏజీఆర్‌తో తీర్పుతో దివాళా దిశగా సాగుతున్న టెలికాం సర్వీసెస్‌కు అధిక నిధులను కేటాయించాలని బోర్డు భావిస్తోంది. అలాగే టాటా పవర్లో రుణ తగ్గింపుపై కూడా చర్చించింది. టాటా గ్రూప్‌లో ఒక్క టీసీఎస్ తప్ప మిగిలిన ప్రతీ వ్యాపారంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కోంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా యూరప్‌లో టాటా స్టీల్, జాగ్వర్ లాండ్ లోవర్ ప్లాంట్‌ను కొంతకాలం పాటు నిలిపివేశాయి. తర్వాత పరిమిత సంఖ్య స్థాయి కార్మికులతో ఉత్పత్తిని ప్రారంభించాయి. జేఎల్ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ పదవీ కాలం ఈ సెప్టెంబర్‌లో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో తర్వలో కొత్త సీఈఓను ప్రకటించనుంది. లాక్‌డౌన్‌తో పూర్తిగా దెబ్బతిన్న ఎయిర్లైన్్స, హోటల్ వ్యాపారాలపై కూడా చర్చించింది. గతనెలలో తన ఎయిర్‌లైన్ కంపెనీలో అదనపు పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా రానున్న రోజుల్లో ఎయిర్‌లైన్ వ్యాపారం మరింత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని బోర్డు అంచనావేసింది. టాటాగ్రూప్ యాజమాన్యం ఆర్థిక సంవత్సరం 2020లో రూ.20వేల కోట్లను డివిడెండ్ల రూపంలో పొందింది. -
200 కోట్లు కొట్టేద్దామని ప్లాన్ చేశారు!
పల్ఘర్: టాటా సన్స్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి రూ. 200 కోట్లు కాజేద్దామనుకున్న ఏడుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు తమ వ్యూహాన్ని అమలు చేసే ముందే అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికోసం వారు ఇండస్ఇండ్ బ్యాంకులో పని చేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా ఖాతా వివరాలను తెలుసుకున్నారు. అయితే ఆ ఖాతాపై ఎలాంటి హ్యాక్ ప్రయత్నాలు జరగలేదని, తమ భద్రతా విభాగాలకు ఎలాంటి సమాచారం లేదని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకు పాలసీని దాటి వ్యవహరించే సిబ్బందిని తొలగిస్తామని చెప్పింది. అరెస్టైన వారిని నసీమ్ సిద్దిఖి (35), గునజివ్ బారాయియా (56), సరోజ్ ఛౌధరి (25), సతీశ్ గుప్తా (32), అనంత్ ఘోష్ (34), ఆనంద్‌నలవాడె (38)లుగా గుర్తించారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. (చదవండి: అప్పటిదాకా రూ. 50వేల విత్‌డ్రాయల్‌కే అనుమతి) -
సైరస్ మిస్త్రీకి సుప్రీం షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునరుద్ధరిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌క్లాట్) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. టాటా గ్రూప్ చీఫ్‌గా సైరస్ మిస్ర్తీ పునరుద్ధరణకు గత ఏడాది డిసెంబర్లో ఎన్‌క్లాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారం రోజుల్లోనే స్టే ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. సదరు వాణిజ్య సంస్ధ చీఫ్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలనే ట్రిబ్యునల్ నిర్ణయం మొత్తం తీర్పును ప్రభావితం చేసే తీర్పు లోపంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే అభివర్ణించారు. కాగా ఎన్‌క్లాట్ ఉత్తర్వులను సవాల్ చేసిన టాటా గ్రూప్ మిస్త్రీ పునర్నియామకం కంపెనీలో వేళ్లూనుకున్న కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలతో పాటు మొత్తం సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుందని పిటిషన్లో పేర్కొంది. మిస్ర్తీని టాటా సన్స్ చీఫ్‌గా పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్ తీసుకున నిర్ణయం చట్టవిరుద్ధమని ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. చదవండి : టాటా గ్రూప్ చైర్మన్ హోదా అక్కర్లేదు: సైరస్ మిస్త్రీ -
టాటాకు మరోసారి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: టాటాకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. టాటాసన్స్ నుంచి ఉద్వాసన పలికిన సైరస్ మిస్త్రీ వివాదంలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తన తీర్పును సమీక్షించేందుకు నిరాకరించింది. గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నియామక తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అభ్యర్తనను ఎన్సీఎల్ఏటీ తిరస్కరించింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ ఆర్వోసీ (రిజిష్టర్ ఆఫ్ కంపెనీస్)పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. గతంలో వెల్లడించిన తీర్పును సమీక్షించేది లేదని ఎన్సీఎల్ఏటీ తేల్చి చెప్పింది. ఎన్సీఎల్ఏటీ వెల్లడించిన తీర్పును సమీక్షించాలని ఆర్వోసీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. టాటా చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం చెల్లదని ఎన్సీఎల్ఏటీ డిసెంబర్ 18, 2019న ఆదేశించింది. మరోవైపు సైరస్ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదానికి సంబంధించిన వాదనలు త్వరలోనే సుప్రీం కోర్టులో జరగనున్నాయి. చదవండి: టాటా గ్రూప్ చైర్మన్ హోదా అక్కర్లేదు: సైరస్ మిస్త్రీ -
సైరస్ మిస్ర్తీ సంచలన వ్యాఖ్యలు..
ముంబై : టాటా సన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తన నియామకాన్ని పునరుద్ధరిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌క్లాట్) తీసుకున్న నిర్ణయం తనను చట్టవిరుద్ధంగా తొలగించిన విధానంతో పాటు, తనను రతన్ టాటా ఇతర ట్రస్టీలు అణిచివేతకు గురిచేసిన తీరును గుర్తించిందని సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఎన్‌క్లాట్ ఉత్తర్వులు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సహా, టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ర్టీస్‌లో డైరెక్టర్ పదవుల కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చీఫ్‌గా పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్‌క్లాట్ ఉత్తర్వులు టాటా గ్రూపు కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌తో పాటు సంస్థలో దశాబ్ధాల తరబడి నెలకొన్న విధానాలను దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సంస్థ పేర్కొంది. -
సైరస్ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్
న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఆదేశాలను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, టాటా సన్స్‌ను ప్రైవేట్ సంస్థగా మార్చడంలో తమ పాత్రను తప్పుపడుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాల్సిందిగా కోరుతూ ఎన్సీఎల్ఏటీలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) గురువారం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కంపెనీల చట్టం ప్రకారం ప్రైవేట్, పబ్లిక్ కంపెనీల నిర్వచనాలు, పెయిడప్ క్యాపిటల్ అవసరాలు మొదలైన వివరాలను సమర్పించాల్సిందిగా సూచించింది. 2016లో అర్ధంతరంగా టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఎన్సీఎల్ఏటీ.. టాటా సన్స్‌ను పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడంలో ఆర్వోసీ పాత్రపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీటిపైనే ఇటు టాటా సన్స్.. సుప్రీం కోర్టును, అటు ఆర్వోసీ.. ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
మిస్త్రీ రీఎంట్రీపై సుప్రీంలో టాటా సన్స్ వాదన..
సాక్షి, న్యూఢిల్లీ : టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్ర్తీ పునర్నియమకంపై కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్‌క్లాట్ గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా సన్స్ గురువారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని టాటా సన్స్ పిటిషన్లో కోరింది. ఒక్క కలం పోటుతో ఎన్‌క్లాట్ ఇచ్చిన ఉత్తర్వులు టాటా సన్స్ వ్యవస్ధాపకులు గత శతాబ్ధ కాలంగా వ్యయప్రయాసలతో తీర్చిదిద్దిన సంస్థ పాలనను, అంతర్గత కార్పొరేట్ వ్యవస్థను కుదిపివేసిందని పిటిషన్లో పేర్కొంది. సైరస్ మిస్ర్తీ నియామకాన్ని పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్ జారీ చేసిన ఉత్తర్వులు గ్రూపు సంస్ధల్లోని కొన్ని లిస్టెడ్ కంపెనీల పనితీరులో గందరగోశానికి దారితీసిందని తెలిపింది. టాటా సన్స్ చైర్మన్, డైరెక్టర్‌గా సైరస్ మిస్త్రీ పదవీకాలం 2017 మార్చిలో ముగిసిందని, ఆయన తనను తిరిగి నియమించాలని కోరకపోయినా ఎన్‌క్లాట్ అత్యుత్సాహంతో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు నివేదించింది. -
మిస్త్రీ వివాదం : సుప్రీంకోర్టుకు టాటా సన్స్
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలన్న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తీర్పుపై టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని టాటా సన్స్ కోరుతోంది. మరికొన్ని రోజుల్లో టీసీఎస్ బోర్డు సమావేశంజరగనున్న నేపథ్యంలోదీనిపై తక్షణమే స్టే తెచ్చుకోవాలని సంస్థ భావిస్తోంది. అయితే ఇటీవలి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి జనవరి 6న వాదనలు విననుందని అంచనా. మరోవైపు జనవరి 9న బోర్డు సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా టీసీఎస్ కూ3 ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. టాటా సన్స్ అప్పీల్‌ను సైరస్ మిస్త్రీ, అతని కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని..ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని అమలు చేయాలని సైరస్ కుటుంబం డిమాండ్ చేయవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతి క్వార్టర్ ఫలితాలు విడుదల చేయడానికి కంపెనీలకు 45 రోజుల సమయముంటుందని, టాటా సన్స్‌కు ఫిబ్రవరి వరకు సుప్రీం నిర్ణయం కొరకు వేచి చూసే అవకాశం ఉందని ఎస్‌అండ్‌ఆర్ అసోసియేట్స్ ప్రతినిథి మహాపత్ర పేర్కొన్నారు. టాటా సన్స్ 2016 లో మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగించి, కొన్ని నెలల తరువాత ఎన్ చంద్రశేఖరన్‌ను నియమించింది. ప్రస్తుతం టాటా గ్రూప్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఇది విలువలు సాధించిన విజయం.. -
ఇది విలువలు సాధించిన విజయం..
సాక్షి, న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చీఫ్‌గా సైరస్ మిస్త్రీ తిరిగి బాధ్యతలు చేపట్టాలన్న నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌క్లాట్) ఉత్తర్వులపై మిస్త్రీ స్పందించారు. ట్రిబ్యునల్ తీర్పును సుపరిపాలన సూత్రాల విజయంగా ఆయన అభివర్ణించారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నియామకాన్ని ఎన్‌క్లాట్ పునరుద్ధరించిన అనంతరం ట్రిబ్యునల్ తీర్పును స్వాగతిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈరోజు వెలువడిన తీర్పు తనకు వ్యక్తిగత విజయం ఎంతమాత్రం కాదని, సుపరిపాలన సూత్రాలు, టాటా సన్స్ మైనారిటీ వాటాదారు హక్కుల విజయమేనని వ్యాఖ్యానించారు. మిస్ర్తీ కుటుంబం గత యాభై సంవత్సరాలుగా టాటా సన్స్‌లో ప్రాముఖ్యత కలిగిన మైనారిటీ వాటాదారుగా దేశం గర్వించదగిన సంస్థకు బాధ్యతాయుతమైన సంరక్షకుడిగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు. మూడేళ్ల కిందట టాటా సన్స్ చీఫ్‌గా బోర్డు తనను తొలగించిన అనంతరం తాను చేపట్టిన పోరాటానికి ఫలితంగానే ఈ తీర్పు వెలువడిందని అన్నారు. కాగా, టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తిరిగి పగ్గాలు చేపట్టాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. చదవండి : సైరస్ మిస్త్రీకే టాటా సన్స్ పగ్గాలు -
ఔను.. జెట్ రేసులో ఉన్నాం!
ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి వస్తున్న వార్తలపై పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఎట్టకేలకు స్పందించింది. దీనిపై చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తామింకా నిర్మాణాత్మకంగా ఎలాంటి ప్రతిపాదన కూడా చేయలేదని స్పష్టంచేసింది. జెట్ టేకోవర్‌పై చర్చించేందుకు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఈ విషయం వెల్లడించింది. తద్వారా జెట్ కొనుగోలుపై కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను అధికారికంగా ధృవీకరించినట్లయింది. ‘జెట్ ఎయిర్వేస్ టేకోవర్‌పై టాటా సన్స్ ఆసక్తిగా ఉందంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే, ఈ అంశంపై చర్చలు ప్రాథమిక స్థాయిలోనే జరిగాయని స్పష్టం చేయదల్చుకున్నాం. నిర్దిష్ట ప్రతిపాదనేదీ మేం ఆఫర్ చేయలేదు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసే విషయంపై శుక్రవారం బోర్డు సమావేశంలో టాటాలు సానుకూల నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాల నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించే విషయంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగిందని, కంపెనీని కొనుగోలు చేసేలా టాటా సన్స్‌కు సూచనలు చేసిందన్న వార్తలు కూడా వచ్చినప్పటికీ కేంద్రం వాటిని తోసిపుచ్చింది. గురువారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన వివరణలో కూడా టేకోవర్ వార్తలన్నీ ఊహాగానాలేనంటూ జెట్ ఎయిర్వేస్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. జెట్ ఎయిర్వేస్లో ప్రమోటరు, చైర్మన్ నరేష్ గోయల్, ఆయన కుటుంబానికి 51%, ఎతిహాద్ ఎయిర్వేస్కు మరో 24% వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి జీ తాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోతోంది. వరుసగా గత మూడు త్రైమాసికాల్లో భారీ నష్టాలు ప్రకటించింది. తాజా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 1,261 కోట్ల నష్టం నమోదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నరేష్ గోయల్ పూర్తిగా తప్పుకుని, నిర్ణయాధికారం పూర్తి గా తమదిగా ఉండే పక్షంలో మాత్రమే డీల్ కుదుర్చుకోవాలని టాటా సన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జెట్‌పై వ్యూహం.. జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసిన పక్షంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యంలో దేశీయంగా ఏర్పాటు చేసిన విస్తార విమానయాన సంస్థలో భాగం చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విస్తారకు దేశీయంగా 22 విమానాలు, 3.8 శాతం మాత్రమే మార్కెట్ వాటా ఉంది. మరోవైపు, అనుబంధ సంస్థ జెట్లైట్తో కలిపి జెట్‌కు 124 విమానాలు, 15.8 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశ, విదేశాల్లో 66 ప్రాంతాలకు విమాన సేవలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ రూట్లలో విస్తార కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నా అందుకు సంబంధించిన అనుమ తులు మంజూరు కావడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జెట్‌ను కొనుగోలు చేసి విస్తారలో విలీనం చేస్తే.. నేరుగా విదేశీ రూట్లలో సర్వీసులు ప్రారంభించేందుకు వెసులుబాటు లభించే అవకాశం ఉంది. 2008లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా విదేశీ రూట్లలో సర్వీసులు మొదలుపెట్టేందుకు ఇదే తరహాలో ఎయిర్ డెక్కన్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అయిదేళ్ల కార్యకలాపాలు పూర్తయితే గానీ దేశీ ఎయిర్‌లైన్స్‌కు విదేశీ రూట్లలో సేవలకు అర్హత లభించేది కాదు. ఎయిర్ఏషియాకి ’టాటా’ .. జెట్ ఎయిర్వేస్పై కన్నేసిన టాటా గ్రూప్.. ఏవియేషన్ వ్యాపారంలో మరో వెంచర్ నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్ ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ)తో కలిసి విసార పేరుతో పూర్తి స్థాయి విమానయాన సంస్థను, మలేషియాకి చెందిన ఎయిర్ఏషియా బెర్హాద్‌తో కలిసి చౌక చార్జీల ఎయిర్ ఏషియా ఇండియాను నిర్వహిస్తోంది. ఎయిర్ఏషియా ఇండియా నుంచి వైదొలగాలని టాటా సన్స్ యోచిస్తున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఒకవేళ జెట్ ఎయిర్వేస్ డీల్ సాకారమైతే దాన్ని విస్తారలో విలీనం చేసి మొత్తం మీద ఒక్క విమానయాన వెంచర్‌కే పరిమితం కావాలని భావిస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు 49 శాతం, ఎయిర్ఏషియా బెర్హాద్‌కు మిగతా వాటాలు ఉన్నాయి. కంపెనీకి 19 విమానాలు ఉన్నాయి. ఒకవైపున జెట్ ఎయిర్వేస్ టేకోవర్‌కు టాటా సన్స్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎయిర్ఏషియా ఇండియా నుంచి తప్పుకోవడంపై కూడా చర్చలు ప్రాథమికంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, ఎయిర్ఏషియా ఇండియా పరిమాణం తక్కువగా ఉండటం, మందగతిన కార్యకలాపాల విస్తరణ, నష్టాలు, ఎయిర్ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్.. ఇతర అధికారుల అనుమానాస్పద లావాదేవీలపై సీబీఐ విచారణ తదితర అంశాల కారణంగా కొనుగోలుదారును పట్టుకోవడం టాటాలకు కాస్త కష్టతరంగానే ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయంగా ఫెర్నాండెజ్ స్వయంగా తన వాటాలను అమ్మేసి వైదొలిగే అంశాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. ‘తనమీద కేసులు దాఖలు కావడంతో భారత్‌లో వ్యాపారం చేయడం టోనీ ఫెర్నాండెజ్‌కు మరింత కష్టతరంగా మారుతోంది. దీంతో కంపెనీలో తన వాటాలను అమ్మేసే అవకాశాలను ఆయన పరిశీలించవచ్చు. అయితే, ఒకవేళ తాను వైదొలగాలని అనుకుంటే.. విమానయాన సంస్థలో తన వాటాలకు మంచి గిట్టుబాటు రేటు వస్తే తప్ప ఆయన తప్పుకోరు‘ అని కంపెనీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు, ఫెర్నాండెజ్ వాటాలను కొనుగోలు చేసి ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్నా టాటాలకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఇన్ఫ్రా, అకౌంటింగ్, రిజర్వేషన్ వ్యవస్థ మొదలైనవన్నీ ఎయిర్ఏషియా బెర్హాద్ లేదా దాని అనుబంధ సంస్థలు మలేషియా నుంచి నిర్వహిస్తుంటాయని, టాటాలకు కేవలం లైసెన్సు, స్లాట్స్ మాత్రమే దక్కుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జెట్ షేరు జూమ్.. టాటా సన్స్ టేకోవర్ చేయొచ్చంటూ వస్తున్న వార్తలు జెట్ ఎయిర్వేస్ షేరుకు గణనీయంగా లాభించాయి. గడిచిన అయిదు ట్రేడింగ్ సెషన్స్‌లో సంస్థ షేరు ఏకంగా 40 శాతం దూసుకెళ్లింది. టాటా సన్స్ బోర్డు సమావేశంలో టేకోవర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలతో శుక్రవారం జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 14 శాతం గ్యాప్ అప్‌తో ప్రారంభమైంది. చివరికి 8 శాతం లాభంతో రూ. 346.85 వద్ద క్లోజయ్యింది. అటు ఎన్ఎస్ఈలో 8 శాతం పెరిగి రూ. 341 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.366.95 స్థాయిని కూడా తాకింది. -
టాటా సన్స్ బూస్ట్ : జెట్ ఎయిర్వేస్ జూమ్
సాక్షి, ముంబై: రుణ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జెట్ ఎయిర్వేస్కు అనూహ్య బాసట దొరకనుంది. టాటా గ్రూప్‌లోని వాటా సన్స్ జెట్ ఎయిర్ వేస్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందన్న అంచనాల నేపథ్యంలో ఈ కౌంటర్ గురువారం నాటి తారాజువ్వలా ఎగిసి పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 26 శాతం లాభాలతో ముగిసింది. తొలి నుంచీ జోరందుకున్న జెట్ ఎయిర్వేస్ కౌంటర్ మిడ్‌సెషన్ నుంచీ మరింత జోరందుకుంది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తదుపరి దశలో ప్రమోటర్ నరేష్ గోయల్ కుటుంబీకుల వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ప్రకటించిన జెట్ ఎయిర్వేస్ వరుసగా మూడవ క్వార్టర్లో కూడా నష్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాల్లో రూ.1,297 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అధిక ఇంధన ధరలు, డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండడంతో భారీ నష్టాలను నమోదయినట్లు సంస్థ పేర్కొంది. -
జెట్‌లో వాటాలపై టాటాల ఆసక్తి..
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్వేస్లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడంపై టాటా సన్స్ మరింతగా దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చురుగ్గా చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇంకా ఖాతాల మదింపు, ఇతరత్రా కీలక గణాంకాల పరిశీలన స్థాయి దాకా రాలేదని వివరించాయి. వ్యయాలు, వ్యూహాలపరంగా జెట్ కొనుగోలు లాభసాటిగానే ఉంటుందా, తమ ఏవియేషన్ వ్యాపారానికి అనుగుణంగా దీన్ని మల్చుకోవడానికి వీలుంటుందా అన్న కోణంలో టాటా సన్స్ ప్రధానంగా దృష్టి పెడుతోందని వివరించాయి. ఈ నేపథ్యంలో కంపెనీని పూర్తిగా కొనడం కాకుండా.. జెట్‌కి చెందిన విమానాలు, పైలట్లు, స్లాట్లు మొదలైనవి మాత్రమే తీసుకునే విధంగా టాటా సన్స్ ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీంతో పాటు పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వివరించాయి. ఏదేమైనా జెట్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ తప్పుకునేట్లు ఉంటేనే ఏదైనా డీల్ కుదిరే అవకాశం ఉండొచ్చని పేర్కొన్నాయి. కంపెనీని మళ్లీ గాడిన పెట్టేందుకు నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తి అధికారాలు తనకు లభించేట్లు ఉంటేనే టాటా సన్స్ ముందుకెళ్లొచ్చని వివరించాయి. టాటా గ్రూప్ ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తార పేరుతో పూర్తి స్థాయి విమానయాన సంస్థను, మలేíసియాకి చెందిన ఎయిర్ఏషియా గ్రూప్‌తో కలిసి చౌకచార్జీల సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను నిర్వహిస్తోంది. జెట్‌లో నరేష్ గోయల్‌కు 51 శాతం, ఎతిహాద్ ఎయిర్వేస్కు 24 శాతం వాటాలు ఉన్నాయి. నష్టాల జెట్.. ముడిచమురు ధరల పెరుగుదల, బలహీన రూపాయి, చౌక చార్జీలు, తీవ్రమైన పోటీ తదితర అంశాలతో నరేష్ గోయల్ సారథ్యంలోని జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు చెల్లింపులు జరపడంలోనూ విఫలమవుతోంది. ఇటీవల రెండో త్రైమాసిక ఫలితాల్లో ఏకంగా రూ. 1,261 కోట్ల నష్టాలు ప్రకటించింది. దీంతో కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు.. లాభసాటిగా లేని రూట్లలో ఫ్లయిట్స్‌ను, వ్యయాలను తగ్గించుకోవడం, ఆదాయాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు జెట్ వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర ఈ ఏడాది ఇప్పటిదాకా 70 శాతం పడిపోయింది. -
టాటా సన్స్ చేతికి జెట్ ఎయిర్వేస్..?
సాక్షి, ముంబై : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు టాటా సన్స్ కసరత్తును వేగవంతం చేసింది. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్‌లు సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. టాటా సన్స్ అంతర్గత బృందం జెట్ ఎయిర్వేస్లో మెజారిటీ వాటా కొనుగోలును మదింపు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరికొన్ని వారాలు సాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు పేర్కొంది. మరోవైపు వరుసగా మూడో క్వార్టర్లోనూ నష్టాలు ప్రకటించిన జెట్ ఎయిర్వేస్ లాభదాయకం కాని రూట్లలో విమానాలను తగ్గిస్తామని, లాభదాయ రూట్లలో సామర్థ్య పెంపు చేపడతామని పేర్కొంది. ఖర్చులు తగ్గించుకుని, ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు జెట్ ఎయిర్వేస్ యోచిస్తోంది. వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థ పెరుగుతున్న చమురు ధరలు, ఇంధన పన్నులు, క్షీణిస్తున్న రూపాయి విలువతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. -
వాటాలు విక్రయించాలని మిస్త్రీని బలవంతపెట్టొద్దు
న్యూఢిల్లీ: టాటా గ్రూపు కంపెనీల మాతృ సంస్థ ‘టాటాసన్స్’లో మిస్త్రీ కుటుంబానికి ఉన్న వాటాలను విక్రయించాలంటూ బలవంతం చేయవద్దని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) టాటాలను ఆదేశించింది. అలాగే, టాటాసన్స్ను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి అనుమతిని హోల్డ్‌లో ఉంచింది. ఈ విషయమై మిస్త్రీ పిటిషన్‌ను అనుమతించిన అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది. సైరస్ మిస్త్రీని టాటాసన్స్ చైర్మన్‌గా తప్పించిన తర్వాత, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని కాస్తా ప్రైవేటు కంపెనీగా మార్చేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. అయితే, మిస్త్రీ పిటిషన్ నేపథ్యంలో టాటాసన్స్ను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చడంపై అనుమతిని నిలిపివేస్తూ ట్రిబ్యునల్ శుక్రవారం మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. టాటాసన్స్లో 18.4% వాటాతో మిస్త్రీ కుటుంబం మైనారిటీ వాటాదారుగా ఉంది. టాటాసన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తప్పించే అధికారం కంపెనీ బోర్డుకు ఉందంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) ముంబై బెంచ్ ఇటీవలే ఆదేశాలు వెలవరించగా, దీన్ని మిస్త్రీ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సవాల్ చేశాయి. అలాగే, టాటాసన్స్ను ప్రైవేటు కంపెనీగా మార్చుతూ, వాటాదారులు తమ స్వేచ్ఛ ప్రకారం తమ వాటాలను విక్రయించుకోకుండా నిరోధించడం, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 75 కింద వాటాదారులు తమ వాటాలను విక్రయించేలా బలవంత పెట్టే అధికారం బోర్డుకు కల్పించడాన్ని కూడా సవాల్ చేశాయి. ‘‘వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న మీదట అప్పీల్ పెండింగ్‌లో ఉంచడం జరిగింది. అప్పీలుదారు (మిస్త్రీ) తన వాటాలను విక్రయించేందుకు బలవంతం చేస్తే అప్పీల్ మెరిట్స్‌పై ప్రభావం చూపిస్తుంది. వారు కంపెనీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న కాలంలో ఆర్టికల్ 75 కింద మైనారిటీ వాటాదారుల షేర్లను బదిలీ చేసే విషయంలో ఎలాంటి నిర్ణయంవద్దని ప్రతివాదుల(టాటాలు)ను ఆదేశిస్తున్నాం’’ అని చైర్పర్సన్ జస్టిస్ ఎస్జే ముకోపాధ్యాయ అధ్యక్షతన గల ఇద్దరు సభ్యుల అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. స్పందన తెలియజేసేందుకు టాటాలకు పది రోజుల గడువు ఇచ్చింది. ప్రైవేటు కంపెనీగానే ఉంది... టాటాసన్స్.. నిజానికి ప్రైవేటు సంస్థ మాదిరిగానే ఉందని, కాకపోతే కంపెనీ పరిమాణం, పాత న్యాయ నిబంధన మేరకు పబ్లిక్ లిమిటెడ్‌గా పరిగణించడం జరిగిందని టాటాసన్స్ ఈ సందర్భంగా వాదించింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా అన్నది వాటాదారులు తమ వాటాలను బదిలీ చేసే విషయంలో ఎంతో సౌకర్యాన్ని కల్పిస్తోందని, ఈ చట్టబద్ధమైన హోదా మార్పిడికి గాను టాటా సన్స్ వాటాదారులను అనుమతిస్తూ మార్పులు చేసినట్టు తెలిపింది. టాటాలు ఆదరాబాదరగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ముంబై కార్యాలయాన్ని సంప్రదించగా, టాటాసన్స్ ప్రైవేటు లిమిటెడ్‌గా మారుస్తూ సర్టిఫికెట్‌ను వెంటనే జారీ చేసినట్టు వాదనల సందర్భంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు నివేదించాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో వాటాదారులు తమ షేర్లను ఎవరికైనా విక్రయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లో వాటాదారులు ఎవరైనా తమ వాటాలను బయటి వ్యక్తులకు విక్రయించేందుకు అనుమతి ఉండదు. -
రతన్ టాటాకు ఊరట
ముంబై : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో రతన్ టాటాకు ఊరట లభించింది. తనను చైర్మన్ పదవి నుంచి అర్ధంతరంగా తొలగించారంటూ మిస్త్రీ టాటా గ్రూప్‌పై న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించారు. తన కుటుంబానికి టాటా గ్రూప్‌లో 18.4 శాతం వాటాలున్నట్టు ఆయన పేర్కొన్నారు. రతన్ టాటా, టాటా సన్స్ బోర్డ్ మైనార్టీ షేర్ హోల్డర్స్ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆయన మరో అంశాన్ని కూడా తన పిటిషన్లో పొందుపర్చాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మిస్త్రీ అభ్యర్థనను తొసిపుచ్చుతు సోమవారం తీర్పు వెలువరించింది. అలాగే రతన్ టాటాకు ఈ వ్యవహారంలో క్లీన్ చీట్‌నిచ్చింది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ను తొలగించడానికి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్కు తగిన అధికారాలు ఉన్నాయని ట్రిబ్యూనల్ తెలిపింది. బోర్డ్ మెంబర్స్ మిస్త్రీపై నమ్మకం కొల్పోవడం వల్లే పదవి నుంచి తొలగించారని ట్రిబ్యూనల్ తన తీర్పులో పేర్కొంది. మిస్త్రీ లెవనెత్తిన వాదనలో చెప్పుకోదగ్గ అంశాలు లేవని వెల్లడించిది. ప్రస్తుత కాలంలో యాజమాన్యాలు, వాటా దారులకు జవాబుదారీ తనంగా ఉండాలని ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది. 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ బోర్డ్ మెంబర్స్ మిస్త్రీని చైర్మన్ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన 2016 డిసెంబర్లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. -
టాటా కమ్యూనికేషన్స్‌లో టాటా పవర్ వాటా విక్రయం
ముంబై: టాటా గ్రూపు పరిధిలో ఒక కంపెనీ మరో కంపెనీలో వాటాలను తగ్గించుకోవాలన్న కార్యక్రమంలో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. టాటా కమ్యూనికేషన్స్‌లో తనకున్న వాటాలను, అనుబంధ సంస్థ ప్యానటోన్ ఫిన్‌వెస్ట్‌ను మాతృ సంస్థ టాటాసన్స్కు రూ.2,150 కోట్లకు విక్రయించాలని టాటా పవర్ నిర్ణయించింది. దీనికి టాటా పవర్ బోర్డు ఆమోదం తెలిపింది. టాటా కమ్యూనికేషన్స్‌లో ప్యానటోన్ ఫిన్‌వెస్ట్‌కు 30.1 శాతం వాటా ఉంది. ప్రాధాన్యేతర ఆస్తులను నగదుగా మార్చుకోవడం, మలి దశ వృద్ధికి గాను బ్యాలన్స్ షీటును బలోపేతం చేసుకునేందుకే ఈ విక్రయమని కంపెనీ తెలిపింది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ.2,150 కోట్లు సమకూరనున్నట్టు అంచనా వేస్తున్నామని పేర్కొంది. గతేడాది ఫిబ్రవరిలో టాటా గ్రూపు చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ వచ్చాక గ్రూపు కంపెనీల మధ్య స్థిరీకరణపై దృష్టి పెట్టారు. టాటా గ్రూపునకు 30 లిస్టెడ్ కంపెనీలుండగా, చాలా కంపెనీలు మరో కంపెనీలో వాటాలు కలిగి ఉన్నాయి. అదే సమయంలో మాతృ సంస్థ టాటా సన్స్‌కు మాత్రం గ్రూపు కంపెనీల ఈక్విటీలో మూడో వంతే వాటాలుండటం ఆయన నిర్ణయానికి కారణం. ఇందులో భాగంగా టాటా స్టీల్, టాటా మోటా ర్స్ పరస్పర వాటాలను తగ్గించుకున్నాయి. -
టాటా సన్స్ ప్రైవేటీకరణకు ఇన్వెస్టర్ల ఆమోదం
సాక్షి, ముంబై: టాటా గ్రూపు సంస్థల ప్రమోటర్ టాటాసన్స్..పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అవతరించేందుకు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఏజీఎంలో ఇన్వెస్టర్లు ఆమోదం తెలిపారు. టాటా సన్స్ వాటాదారుల సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) లో ఈ మేరకు ఆమోదం లభించిందని తెలిపింది. అన్ని తీర్మానాలకు మెజారీటీ వాటాదారులు ఆమోదం తెలిపారని టాటా సన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభిస్తే టాటా సన్స్ ప్రైవేటీకరణ ప్రక్రియ ముగిసినట్టే. మరోవైపు టాటా సన్స్ ప్రయివేటీకరణకు వ్యతిరేకిస్తూ టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ పెట్టుకున్న పిటీషన్‌ను ఎన్సీఎల్ఏటీ తిరస్కరించింది. అయితే మిస్త్రీ సంస్థలకు కనీస వాటాదారుల ప్రమాణాల నుంచి మినహాయింపు ఇచ్చింది. ముంబై ఉన్‌సీఎల్‌ఏటీలో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. దీన్ని మిస్త్రీ స్వాగతించారు. కార్పొరేట్ గవర్నెన్స్ గరిష్ట ప్రమాణాలను కొనసాగించాలని, టాటా గ్రూపులో పారదర్శకత కాపాడాలని డిమాండ్ చేశారు. కాగా గత ఏడాది అక్టోబరు 24న అనూహ్యంగా టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని పదవిని తొలగించింది. అలాగే ఫిబ్రవరి 6, 2017 న హోల్డింగ్ కంపెనీ బోర్డు డైరెక్టర్‌గా కూడా తొలగించిన సంగతి తెలిసిందే. -
టాటా సన్స్ ప్రతిపాదనపై మిస్త్రీ ఫైర్
సాక్షి, ముంబై: టాటా గ్రూపులోని టాటా సన్స్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ లిమిటెడ్‌గా అవతరించనుంది. టాటా సన్స్ సంస్థను ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చే ప్రతిపాదనను మైనారిటీ షేర్‌హోల్డర్ల అనుమతి కోరేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్లలో మార్పులు చేయాల్సి ఉండగా.. దీనికి వాటాదారుల అనుమతి కంపెనీ కోరనుంది. అయితే మిస్త్రీ కుటుంబానికి చెందిన పెట్టుబడి సంస్థ సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రెవేట్ లిమిటెడ్ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ హక్కుల అణచివేసేందుకు తీసుకున్న చర్య అంటూ బోర్డు కు ఒక లేఖ రాసింది. ఈ ప్రతిపాదన మైనారిటీ వాటాదారులను మరింత అణిచివేసే "మరొక ఆయుధం" గా పేర్కొంది. మరోవైపు టాటా సన్స్ ఒక ప్రైవేటు కంపెనీగా మారితే, మైనారిటీ వాటాదారుల హక్కులను మరింత నిరుత్సాహపరుస్తుందని ప్రాక్సీ సలహా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇది ఒక తిరోగమన దశ అని పేర్కొన్నారు. ఒకవేళ టాటాసన్స్ ప్రతిపాదనను షేర్హోల్డర్లు ఆమోదిస్తే, టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా కంపెనీ పేరు మారుతుంది. సెప్టెంబర్ 21న వార్షిక సర్వ సభ్య సమావేశం జరగనుండగా.. దీనికి ముందుగా ఈ ప్రతిపాదన రావడం విశేషం. అయితే.. దీనికి నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ ఆమోదం రావాల్సి ఉంటుంది. దీంతో పాటు 75 శాతం మైనారిటీ వాటాదారులు కూడా అనుమతించాలి. సైరస్ మిస్త్రీ ని టాటా సన్స్ బోర్డు ఛైర్మన్‌గా తొలగించిన తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. -
టాటా సన్స్.. ‘ప్రైవేట్’!
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్పునకు సన్నాహాలు ► షేర్ హోల్డర్ల అనుమతి కోరిన కంపెనీ ► వ్యతిరేకిస్తూ మిస్త్రీ సంస్థ లేఖ ► మైనారిటీ వాటాదారుల్ని అణిచేయటానికేనని ఆరోపణలు న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటాలకు మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా సంస్థ కార్పొరేట్ స్వరూపాన్ని మార్చేసేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా నుంచి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చే దిశగా మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌కు తగు మార్పులు చేర్పులు చేసే ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరింది. ఈ మేరకు ఈ నెల 21న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు షేర్హోల్డర్లకు సంస్థ సమాచారం ఇచ్చింది. పేరును కూడా టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మార్చే ప్రతిపాదన ఇందులో ఉంది.కంపెనీ ప్రయోజనాల కోసమే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు టాటా సన్స్ వర్గాలు తెలిపాయి. తమకున్న ‘డీమ్డ్ పబ్లిక్ కంపెనీ’ హోదాకు .. కంపెనీల చట్టం 2013 కింద గుర్తింపు లేకపోవడం వల్లే ఈ మేరకు మార్పులు తలపెట్టినట్లు పేర్కొన్నాయి. ఒకవేళ ఈ తీర్మానం గానీ ఆమోదం పొందిన పక్షంలో.. వాటాదారులు స్వేచ్ఛగా షేర్లను విక్రయించుకోవడంపై నిర్ధిష్ట నియంత్రణలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం సంస్థలో గణనీయమైన వాటాలున్న మిస్త్రీ కుటుంబం.. ఆ షేర్లను బయటి ఇన్వెస్టర్లకు అమ్ముకోకుండా చెక్ చెప్పేందుకే టాటా సన్స్ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్వరూపం మార్చాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మిస్త్రీ కుటుంబం భావిస్తోంది. కార్పొరేట్ స్వరూపం మార్పునకు ప్రత్యేక తీర్మానం కావాలి. దీనికి మద్దతుగా కనీసం 75 శాతం మేర షేర్‌హోల్డర్ల ఓట్లు అవసరమవుతాయి. వీటితో పాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర కూడా అవసరమవుతుంది. మిస్త్రీ సంస్థల అభ్యంతరం.. టాటా సన్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నందున .. అందులో గణనీయమైన వాటాలు ఉన్న మిస్త్రీల కుటుంబం తమ షేర్లను చట్టబద్ధంగా టాటాల పోటీ సంస్థలకు కూడా విక్రయించుకోవచ్చు. ఇది కంపెనీల చట్టం చెబుతున్న నిబంధన. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే దాని షేర్‌హోల్డరుకు ఈ వెసులుబాటు ఉండదు. ఈ నేపథ్యంలో.. టాటా సన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చే ప్రతిపాదనపై మిస్త్రీ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మెజారిటీ షేర్ హోల్డర్లు మైనారిటీ వాటాదారులను అణచివేసేందుకు చేస్తున్న మరో ప్రయత్నమిది. దీనివల్ల టాటా సన్స్‌కి ఎటువంటి ప్రయోజనం ఉండదు. దురుద్దేశాలు, దుర్బుద్ధితోనే ఈ ఏజీఎం ఏర్పాటు చేస్తున్నారు‘ అని వ్యాఖ్యానించింది. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ ఈ మేరకు టాటా సన్స్ బోర్డుకు లేఖ రాసింది. టాటా సన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం వల్ల షేర్లను స్వేచ్ఛగా బదలాయించుకునేందుకు వీలు లేకుండా నియంత్రణలు అమల్లోకి వస్తాయని, ఇది ఓ రకంగా మైనారిటీ వాటాదారులను మెజారిటీ షేర్హోల్డర్లు అణిచివేసేందుకు చేస్తున్న ప్రయత్నమని పేర్కొంది. సైరస్ మిస్త్రీని గతేడాది చైర్మన్‌గా తొలగించిన నేపథ్యంలో టాటా సన్స్‌తో మిస్త్రీ కుటుంబం న్యాయ పోరాటం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి 18.4 శాతం వాటాలు, టాటా ట్రస్ట్స్‌కి 66 శాతం వాటాలు ఉన్నాయి. -
టాటా గ్రూపులోకి రూపా పురుషోత్తమ్
ముంబై: టాటా గ్రూపు కీలకనియామకాన్ని చేపట్టింది. టాటా సన్స్ చీఫ్ ఎకానమిస్ట్‌గా రూపా పురుషోత్తంను నియమించింది. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా సన్స్ తన ప్రధాన ఆర్ధికవేత్తగా, పాలసీ అడ్వకసీగా రూప్ పురుషోథామాన్ నియామకాన్ని గురువారం ప్రకటించింది. టాటూ గ్రూపు వ్యాపారాలకు సంబంధించి రూపా పురుషోత్తం మాక్రో ఎకానమికస్రీసెర్చ్, అలాగే అన్ని విధాన, న్యాయవాద కార్యక్రమాలు నిర్వహిస్తారని టాటా సన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమెకు సుదీర్ఘమైన అనుభవం ఉందనీ, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలపై పరిశోధనలతో అనేక రీసెర్చ్ పేపర్లను ప్రచురించినట్టు తెలిపింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ, "ఆర్ధిక విషయాలపై, పోకడలు, ప్రజా విధానం, న్యాయవాదలపై రూపా యొక్క లోతైన జ్ఞానం ఎంతో విలువైనది. సామాజిక రంగంలో తన అభిరుచి ,చొరవ తమకుఎంతో ఉపయోగపడుతుందన్నారు. తన నియామకంపై రూప పురుషోత్తం స్పందిస్తూ భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన , బహుముఖ పాత్రను పోషిస్తున్న వాటిల్లో టాటా గ్రూప్ ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో టాటా గ్రూప్‌లో చేరడం నిజంగా ఒక ప్రత్యేక అవకాశమని వ్యాఖ్యానించారు. కాగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, యాలే యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన రూప గతంలో గోల్డ్‌మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ లో వైస్ ప్రెసిడెంట్ , ప్రపంచ ఆర్థికవేత్తగా పనిచేశారు. -
టాటాలపై మిస్త్రీ అప్పీలు
► పిటిషన్‌కు వీలు కల్పించాలని అభ్యర్థన ► దిగువ ట్రిబ్యునల్ ఉత్తర్వుల సవాలు న్యూఢిల్లీ: టాటా సన్స్‌లో అవకతవకలపై పిటిషన్‌కు వీలు కల్పించాలని, ఇందుకు సంబంధించి అర్హత నిబంధనలను సడలించాలని కోరుతూ టాటా సన్స్ బహిష్కృత చైర్మన్ మిస్త్రీ శుక్రవారం నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో అప్పీలు చేశారు. దీనికి సంబంధించి ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, ఆయన ఎన్సీఎల్ఏటీలో ఈ అప్పీల్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే... టాటా సన్స్‌లో అవకతవకలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారన్న ఆరోపణలపై పిటీషన్ వేయడానికి వీలుగా.. అర్హత నిబంధనలు సడలించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్సీఎల్టీ బెంచ్ నాలుగురోజుల క్రితం తోసిపుచ్చింది. కంపెనీల చట్టం నిబంధనల నుంచి మినహాయింపునిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. టాటా సన్స్ నుంచి మిస్త్రీ ఉద్వాసనను సవాల్ చేస్తూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థలు రెండు .. ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. టాటా సన్స్‌లో నిర్వహణ లోపాలున్నాయని, మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించాయి. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసేందుకు సంబంధించి పిటిషనర్‌కు ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌లో కనీసం పదో వంతు లేదా మైనారిటీ షేర్హోల్డర్లలో కనీసం పదో వంతు వాటాలు ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ కోరాయి. కానీ, ప్రిఫరెన్స్ క్యాపిటల్ కూడా కలిపితే.. మొత్తం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌లో పిటిషనర్ సంస్థలకు కేవలం 2.17 శాతం వాటా మాత్రమే ఉంటుందని టాటా సన్స్ వాదించింది. ఈ నేపథ్యంలో అర్హత ప్రమాణాల కోణంలో పిటి షన్ సాధ్యపడదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. చైర్మన్ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని అప్పీలేట్ ట్రిబ్యునల్ వచ్చేవారం మిస్త్రీ అప్పిలేట్ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
టాటా సన్స్‌కి వెళ్లారు, కోట్లు పోయాయ్!
ముంబై : దేశంలోనే అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసు సీఈవో పదవి నుంచి ఏకంగా టాటా గ్రూప్‌లోనే అత్యంత కీలకమైన చైర్మన్ పదవి ఎన్ చంద్రశేఖరన్ ను వరించింది. ఉప్పు నుంచి సాప్ట్ వేర్ వరకు ఉన్న 103 బిలియన్ డాలర్ల గ్రూప్ కు రథసారిథిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన వేతనం మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయింది. కనీసం సీఈవోగా ఉన్నప్పుడు ఇచ్చే వేతనాన్ని కూడా టాటా బోర్డు ఆఫర్ చేయడం లేదు. టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు రూ.14.4 కోట్ల వార్షిక వేతనం మాత్రమే ఇవ్వనున్నట్టు బోర్డు సభ్యులు నిర్ణయించారు. బేసిక్ వేతనం కింద రూ.4.8 కోట్లను అదనంగా 200 శాతం లేదా రూ.9.6 కోట్ల వేరియబుల్ కంపోనెంట్లను అందించనున్నట్టు బోర్డు ప్రకటించింది. అది కూడా కంపెనీ, ఆయన పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. వాటికి తోడు అదనంగా కంపెనీ నుంచి వచ్చే కమిషన్ కు ఆయన అర్హులని తెలిపింది. కానీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవోగా ఉన్నప్పుడు చంద్రశేఖరన్ దానికంటే ఎక్కువ వేతనాన్నే ఆర్జించేవారు. 2016 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.25.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. అదనంగా రూ.10 కోట్లను కంపెనీ బోనస్ ల కింద ఆయనకి ఇచ్చింది. టీసీఎస్ సీఈవో నుంచి టాటా సన్స్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టాకా ఆయనకు వేతనం పెరగాల్సింది పోయి తగ్గినట్టు తెలిసింది. టాటా సన్స్ కు అంతకముందు చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీకి కూడా 2015లో కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఆ సమయంలో టీసీఎస్ సీఈవోగా ఉన్న చంద్రశేఖరన్ రూ.21.28 కోట్లు ఆర్జించారట. గతేడాది అక్టోబర్ లో అర్థాంతరంగా మిస్త్రీకి ఉద్వాసన పలికి, ఆ స్థానంలో టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ ను కూర్చోపెట్టిన సంగతి తెలిసిందే. -
మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!
-
మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!
పిటిషన్లు చెల్లుబాటు కావన్న కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై: టాటా సన్స్‌పై న్యాయపోరాటంలో సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. టాటా సన్స్‌కు వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేయగా... అవి విచారించడానికి అర్హమైనవి కాదని ట్రిబ్యునల్ సోమవారం పేర్కొంది. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే విషయంలో అర్హత ప్రమాణాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్... టాటాసన్స్ చైర్మన్‌గా మిస్త్రీ తొలగింపును ట్రిబ్యునల్‌లో సవాల్ చేయడం తెలిసిందే. మైనారిటీ వాటాదారుల హక్కులను సైతం కాలరాస్తున్నారని ఆరోపించాయి. అయితే, విచారణ సందర్భంగా ఈ పిటిషన్లను టాటా సన్స్ వ్యతిరేకించింది. కంపెనీల చట్టం ప్రకారం మైనారిటీ వాటా కలిగిన పిటిషనర్లు ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసే అవకాశం లేదని టాటా సన్స్ వాదించింది. కనీసం 10% వాటా కలిగి ఉండాలన్న అర్హతా ప్రమాణాల విషయంలో విఫలమైనందున ఈ పిటిషన్లు కొనసాగించగలిగినవి కావని ట్రిబ్యునల్ పేర్కొంది. దీనికి మిస్త్రీ కుటుంబ కంపెనీలు స్పందిస్తూ... జారీ మూలధనంలో పిటిషనర్ పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా లేదా మైనారిటీ వాటాదారుల్లో పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా చట్ట ప్రకారం ఈ నిబంధనను ట్రిబ్యునల్ రద్దు చేయవచ్చని పేర్కొన్నాయి. అయితే, సైరస్ కుటుంబ కంపెనీలు రెండిం టికీ కలిపి మొత్తం జారీ మూలధనంలో 2.17% వాటాయే ఉందని, పిటిషన్లను దాఖలు చేసే సమయంలో అర్హత నిబంధనను రద్దు చేయాలని కోరకుండా, ఈ దశలో అడగలేరని టాటా సన్స్ వాదించింది. ట్రిబ్యునల్ ముందు న్యాయపోరాటానికి కనీసం 10% వాటా నిబంధనను రద్దు చేయాలన్న సైరస్ కంపెనీల అభ్యర్థనపై వాదనలను మంగళవారం వింటామని ట్రిబ్యునల్ బెంచ్ పేర్కొంది. -
డొకోమోతో వివాదానికి ‘టాటా’!
⇒ 1.18 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకారం... ⇒ సెటిల్మెంట్ కుదిరిందని టాటా సన్స్ ప్రకటన ⇒ భారత్ నుంచి వైదొలిగేందుకు డొకోమోకు లైన్‌క్లియర్ న్యూఢిల్లీ: జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమోతో వివాదానికి టాటా గ్రూప్ ముగింపు పలకనుంది. తమ టెలికం జాయింట్ వెంచర్ సంస్థ నుంచి డొకోమో వైదొలిగే విషయంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న న్యాయ వివాదంపై కోర్టు వెలుపల సెటిల్మెంట్కు అంగీకరించినట్లు టాటా సన్స్ మంగళవారం ప్రకటించింది. ఈ కేసులో డొకోమోకు 1.18 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 7,900 కోట్లు) పరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. ‘జూన్ 22, 2016న లండన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు(ఎల్‌సీఐఏ) డొకోమోకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు మేం అంగీకరిస్తున్నాం. దేశంలో సానుకూల పెట్టుబడి పరిస్థితులు కొనసాగేవిధంగా జాతీయ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని దీనికి ఓకే చెప్పాం. కాంట్రాక్టు నిబంధనలను పక్కాగా పాటించే విషయంలో అంతర్జాతీయంగా టాటా గ్రూప్ పేరొందింది. దీనికి అనుగుణంగానే డొకోమోకు అనుకూలంగా ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుపై భారత్‌లో లేవనెత్తిన అభ్యంతరాలను వెనక్కితీసుకోవాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది’ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తమ మధ్య జరిగిన సెటిల్మెంట్కు అనుమతించడంతోపాటు.. ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియను నిలిపివేయాలని(సస్పెండ్) ఢిల్లీ హైకోర్టుకు డొకోమో, టాటా సన్స్ విన్నవించాయి. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడం... కొత్త చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ వివాదానికి తెరపడుతుండటం గమనార్హం. చట్టపరమైన చర్యలకు బ్రేక్: డొకోమో ‘ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం టాటా సన్స్ 1.18 బిలియన్ డాలర్లను ఇప్పటికే డిపాజిట్ చేసింది. తాజాగా కుదిరిన సెటిల్మెంట్ మేరకు ఈ మొత్తాన్ని ఇక కోర్టు మాకు చెల్లించేందుకు దోహ దం చేస్తుంది. టాటా టెలిసర్వీసెస్‌లో మా వాటా షేర్లను టాటా సన్స్‌కు బదలీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది’ అని డొకోమో ఒక ప్రకటన లో పేర్కొంది. వివాదాన్ని సంయుక్తంగా భారత్‌లో నే పరిష్కరించుకుంటున్న నేపథ్యంలో... అమెరికా, బ్రిటన్లలో టాటాలపై తాము చేపట్టిన చట్టపరమైన చర్యలను సస్పెండ్ చేసేందుకు అంగీకరించామని డొకోమో తెలిపింది. తాజా పరిణామాలతో భారత్ నుంచి డొకోమో పూర్తిగా వైదొలిగేందుకు లైన్ క్లియర్ అయింది. కాగా, డొకోమోతో భవిష్యత్తులో మళ్లీ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని టాటా సన్స్ పేర్కొంది. మరోపక్క, టాటాసన్స్‌తో కొత్త భాగస్వామ్య ఒప్పందం కింద మళ్లీ తాము భారత్‌లో పెట్టుబడులను పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని డొకోమో కూడా చెప్పడం గమనార్హం. వివాదం సంగతిదీ... ⇒ 2009 నవంబర్‌లో టాటా టెలిసర్వీసెస్‌లో జపాన్ కంపెనీ ఎన్టీసీ డొకోమో 26.5% వాటాను కొనుగోలు చేసింది. టాటాడొకోమో జాయింట్ వెంచర్(జేవీ)లో భాగస్వామిగా చేరింది. షేరుకి రూ.117 చొప్పున దాదాపు రూ.12,740 కోట్లను టాటా టెలి హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌కు చెల్లించింది. ⇒ అయితే, తాము గనుక ఐదేళ్ల వ్యవధిలోపే ఈ జేవీ నుంచి వైదొలగిన పక్షంలో తాము చెల్లించిన ధరలో కనీసం 50 శాతాన్ని తమకు వెనక్కి ఇవ్వాలని డొకోమో షరతు పెట్టింది. దీనికి టాటా సన్స్ కూడా అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది. ⇒ వ్యాపార ప్రతికూలతలతో డొకోమో 2014లో జేవీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. డీల్ మేరకు షేరుకి రూ.58 చొప్పున రూ.7,200 కోట్లు చెల్లించాలని టాటాలను కోరింది. ⇒ అయితే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం షేరుకి రూ.23.34 చొప్పున మాత్రమే తాము ఇవ్వగలమని టాటా గ్రూప్ పేర్కొంది. ⇒ దీనిపై డొకోమో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. టాటాలు డొకోమోకు 1.18 బిలియన్ డాలర్లను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ⇒ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల మేరకు ఆర్బీఐ తన విదేశీ మారక చట్టం నుంచి మినహాయింపునివ్వాలని డొకోమో కోరింది. ఈ మినహాయింపు కోసం ఆర్బీఐ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. అయితే, ఈ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. కాగా, టాటా–డొకోమోకు ఓకే చెబితే చాలా కేసుల్లో ఇలాంటి మినహాయింపులు ఇవ్వాల్సివస్తుందన్న కారణంతోనే ఆర్థిక శాఖ నిరాకరిస్తున్నట్లు సమాచారం. తాజా సెటిల్మెంట్తో బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులోకి చేరింది. -
ఇక టాటా సన్స్ సారథి ‘చంద్ర’
నేడు చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ ముంబై: పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతా ’చంద్ర’గా పిల్చుకునే చంద్రశేఖరన్ (54).. టాటా గ్రూప్ 150 ఏళ్ల చరిత్రలో తొలి పార్సీయేతర చైర్మన్ కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఆయన టాటా గ్రూప్‌లో భాగమైన ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు సారథ్యం వహించారు. ట్రస్టీలతో విభేదాల నేపథ్యంలో సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన టాటా గ్రూప్.. జనవరి 12న చంద్రశేఖరన్‌ను ఆయన స్థానంలో నియమించిన సంగతి తెలిసిందే. ఫొటోగ్రఫీపై మక్కువ కలిగిన చంద్ర .. ప్రపంచవ్యాప్తంగా పలు మారథాన్స్‌లో కూడా పాల్గొన్నారు. కొత్త హోదా తనపై మరింత భారీ బాధ్యత మోపిందని, ఇందులో ఇటు సవాళ్లతో పాటు అటు అవకాశాలు కూడా ఉన్నాయని చంద్రశేఖరన్ గత వారం వ్యాఖ్యానించారు. సవాళ్లతో స్వాగతం..: కొత్త హోదాలో చంద్రశేఖరన్‌కి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. ముందుగా టాటా స్టీల్ యూరప్ కార్యకలాపాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. టాటా స్టీల్ ఇప్పటికే బ్రిటన్‌లోని కొన్ని అసెట్స్‌ను విక్రయించడం మొదలుపెట్టింది. అయితే, ఎంత మేర అసెట్స్‌ను విక్రయించాలి, కార్యకలాపాలను మళ్లీ గాడిలో పెట్టడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై చంద్రశేఖరన్ కసరత్తు చేయాల్సి రానుంది. ఇక రతన్ టాటా కలల ప్రాజెక్టు నానో కార్ల విషయంలోనూ ఆయన తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా నష్టాలతో టాటా మోటార్స్‌కి నానో ప్రాజెక్టు గుదిబండగా మారింది. ఇవి కాకుండా మిస్త్రీకి ఉద్వాసన వ్యవహారంలో కేంద్ర బిందువులైన టాటా ట్రస్ట్స్, ట్రస్టీలతో చంద్రశేఖరన్ ఏవిధంగా నడుచుకోబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. టీసీఎస్ చైర్మన్‌గా చంద్రశేఖరన్; సీఈఓగా గోపీనాథన్ టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్ నేటి నుంచి టీసీఎస్ చెర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా కంపెనీ ఎండీ, సీఈఓగా ఆయన వ్యవహరించారు. ఇక ప్రస్తుత టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజేష్ గోపీనా«థన్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు తీసుకుంటారు. కొత్త సీఎఫ్ఓగా వి. రామకృష్ణన్‌ను నియమించారు. మరోపక్క, సీఓఓ ఎన్.గణపతి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. -
టాటా సన్స్ నుంచి సైరస్ మిస్త్రీ ఔట్
డైరెక్టర్ పదవినుంచి తొలగింపు • ఈజీఎమ్‌లో తీర్మానాన్ని ఆమోదించిన వాటాదారులు • టాటా గ్రూప్‌తో తెగిన చివరి అనుబంధం ముంబై: టాటా గ్రూప్‌తో సైరస్ మిస్త్రీకి మిగిలిన చివరి అనుబంధం(హోదా పరంగా) తెగిపోయింది. టాటా సన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. సోమవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో డైరెక్టర్‌గా సైరస్ మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి వాటాదారులు తగిన మెజారిటీతో ఆమోదం తెలిపారని టాటా సన్స్ పేర్కొంది. ఈ పరిణామం కారణంగా టాటా సన్స్ కంపెనీలో 18.5 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి పదేళ్ల తర్వాత తొలిసారిగా ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. షాపూర్జీ పల్లోంజీ కుటుంబం ఈ కంపెనీలో 1965 నుంచి వాటాదారుగా ఉంది.1980లో మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ డైరెక్టర్‌గా చేరారు. 2004లో వైదొలిగారు. రెండేళ్ల తర్వాత 2006లో సైరస్ మిస్త్రీ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన టాటా సన్స్ చైర్మన్ అయ్యారు. పనితీరు బాగా లేదంటూ చైర్మన్ పదవి నుంచి ఆయనను టాటా సన్స్ కంపెనీ గత ఏడాది అక్టోబర్ 24న తొలగించింది. తదనంతరం టాటా మోటార్స్, టీసీఎస్ తదితర ఆరు టాటా గ్రూప్ కంపెనీలు ఆయనను డైరెక్టర్‌గా తమ తమ డైరెక్టర్ల బోర్డ్ నుంచి తొలగించాయి. విఫలమైన మిస్త్రీ ప్రయత్నాలు డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించడానికి అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్) నిర్వహించనున్నామని గత నెలలోనే టాటా సన్స్ ప్రకటించింది. దీనిని న్యాయపరంగా అడ్డుకోవడానికి మిస్త్రీ చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈజీఎమ్ నిర్వహణను అడ్డుకోవాలంటూ మిస్త్రీ వేసిన పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ గత నెల 31న కొట్టేసింది. ఈ ఈజీఎమ్‌కు వ్యతిరేకంగా మిస్త్రీకి చెందిన రెండు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్లను గత వారంలో నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది. దీంతో ఈజీఎమ్‌కు మార్గం సుగమం అయింది. ఈ ఈజీఎమ్‌లో డైరెక్టర్‌గా ఆయనను తొలగించే తీర్మానం ఆమోదం పొందింది. -
టాటా సన్స్‌పై మిస్త్రీ పిటిషన్ తిరస్కృతి
న్యూఢిల్లీ: టాటా సన్స్‌పై ఆ గ్రూప్ బహిస్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తోసిపుచ్చింది. మిస్త్రీని బోర్డ్ డైరెక్టర్ బాధ్య తల నుంచి తొలగించడానికి టాటా సన్స్ సోమవారం నిర్వహించతలపెట్టిన షేర్ హోల్డర్ల సమావేశాన్ని నిలుపుచేయాలని కోరుతూ మిస్త్రీ నేతృత్వంలోని రెండు కంపెనీలు తొలుత ముంబై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించాయి. జనవరి 31న ఎన్సీఎల్టీ దీనిని తోసిపుచ్చడంతో అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను మిస్త్రీ ఆశ్రయించారు. తాజాగా ఇక్కడా ఆయనకు ప్రతికూల తీర్పు వెలువడింది. ‘‘మేము ఎలాంటి సానుకూల రూలింగ్‌నూ ఇవ్వడం లేదు. ఇందుకు సంబంధించి మూడు అప్పీళ్లనూ తిరస్కరిస్తున్నాం. తరువాత సవివరమైన ఉత్త్తర్వులను వెలువరిస్తాం’’ అని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. గౌరవనీయ పరిష్కారం... మిస్త్రీ కంపెనీల పిటిషన్‌ను తిరస్కరించిన అప్పిలేట్ ట్రిబ్యునల్, కేసు పరిష్కారం విషయంలో కీలక సూచనలూ చేసింది. ‘‘ఈ కేసులో పార్టీలు గౌరనీయమైన ఒక పరిష్కారానికి రావాలి. అలాకాని పక్షంలో ఇరువైపుల ప్రతిష్ట దెబ్బతింటుంది. వాణిజ్య ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుంది. అలాగే ఉద్యోగుల నైతికతా దెబ్బతింటుంది.’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
మిస్త్రీ ధిక్కరణ పిటిషన్‌పై 18న ఉత్తర్వులు
ముంబై: రతన్‌టాటా, టాటాసన్స్ డైరెక్టర్లపై సైరస్ మిస్త్రీ నేతృత్వం లోని రెండు సంస్థలు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌పై తన ఉత్తర్వులను ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఈ నెల 18వ తేదీ వరకూ రిజర్వ్ చేసింది. ఎన్సీఎల్టీ డిసెంబర్ 22న ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చి మిస్త్రీని బోర్డ్ నుంచి తొలగించడానికి టాటా సన్స్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది పిటిషనర్ల ఆరోపణ. బీఎస్వీ ప్రసాద్ కుమార్ (మెంబర్–జ్యుడీషియల్), ఎన్ నల్లసేనాపతి (మెంబర్–టెక్నికల్)లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఇరువర్గాల వాదనలు సోమవారం ముగిశాయి. తనను బోర్డ్ నుంచి తొలగించేందుకు జరపతలపెట్టిన ఫిబ్ర వరి 6 ఈజీఎంను నిలిపివేయాలని, ఇలాంటి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తదుపరి సమావేశాలనూ నిరోధించాలని పిటిషన్లో మిస్త్రీ కంపెనీలు కోరాయి. -
కోహ్లీ రిసర్చ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా కొత్త సారథి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కోహ్లి రిసర్చ్ బ్లాక్‌ను టాటా సన్స్ కాబోయే చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సోమవారం ప్రారంభించారు. ఇంటెల్లిజెంట్ సిస్టమ్స్ రంగంలో పరిశోధన, బోధన, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఫౌండేషన్ కోహ్లి సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ కేంద్రం ఐటీ రంగంలో అభివృద్ధికి ప్రేరణ కలిగిస్తుందని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇంటెల్లిజెంట్ సిస్టమ్స్ రంగంలో అధునాతన పరిశోధనకై విద్యావేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ఆటోమేషన్ సంచలనాలను సృష్టిస్తుందని, అత్యుత్తమ పరిశోధనకు కోహ్లి రిసర్చ్ సెంటర్ కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. -
30 ఏళ్ల... ‘చంద్ర’యాన్
కాలేజీ నుంచి టీసీఎస్ ఉద్యోగానికి • కెరీర్ మొత్తం అక్కడే; ఇపుడు గ్రూపు చైర్మన్‌గా • నా సామర్థ్యానికి గౌరవమిది: చంద్రశేఖరన్ పూర్తిపేరు నటరాజన్ చంద్రశేఖరన్. అందరూ పిలిచేది మాత్రం చంద్ర... అనే. వయసు 54 ఏళ్లు. తమిళనాడులోని తిరుచ్చి రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి బయటకొచ్చిన తరవాత ఆయన ఎంచుకున్నది టీసీఎస్‌నే. తన పూర్తి సామర్థ్యాన్ని కంపెనీకే ధారపోసిన చంద్రశేఖరన్... 2009 నాటికి టీసీఎస్ ఎండీ, సీఈవో స్థాయికి చేరుకున్నారు. 2014లో ఐదేళ్ల పదవీ కాలం ముగిసినా... రెండోసారీ దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన మర్నాడే చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డులోకి తీసుకున్నారు. తాజాగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలకు ఎంపిక చేశారు. టీసీఎస్ విజయం వెనక ‘చంద్ర’ చంద్రశేఖరన్ విషయంలో చెప్పుకోవాల్సింది ఒకటుంది. ఇప్పటిదాకా టాటా సన్స్ పగ్గాలు దక్కించుకున్నది టాటాల కుటుంబీకులు... లేదా వాటాదారులు మాత్రమే. ఒక ఉద్యోగికి ఈ స్థాయి దక్కటం ఇదే తొలిసారి కూడా. రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా, జేఎల్ఆర్కు చెందిన రాల్ఫ్ స్పెత్, పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి తదితరులతో పోటీ పడి మరీ అగ్ర పీఠాన్ని దక్కించుకున్నారు. విశేషమేంటంటే ఒకదశలో టాటా అగ్రపీఠానికి టీసీఎస్ మాజీ సీఈఓ రామదురై పేరు కూడా వినిపించింది. టీసీఎస్ ఎండీ కావటానికి ముందు... నాటి సీఈవో రామదొరైకు సహాయకుడిగా చంద్ర సేవలందించారు కూడా. రెండు దశాబ్దాల కాలంలో ప్రత్యర్థి కంపెనీలను దాటుకుని దేశీయ అగ్రగామి ఐటీ కంపెనీగా టీసీఎస్ అవతరించడం, రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో టాటా గ్రూపునకు కల్పవృక్షంగా మారటం వెనక చంద్ర కృషి చాలా ఉంది. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఆయన టీసీఎస్‌ను అగ్రగామిని చేశారు. టాటా గ్రూపు లాభాల్లో 80 శాతానికి పైగా టీసీఎస్ నుంచే వస్తుండటం గమనార్హం. 2015లో ఐటీ సేవల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా టీసీఎస్ ఖ్యాతిని సొంతం చేసుకుంది కూడా. 2015–16లో 16.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. దేశంలో 3.78 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది కూడా. సానుకూలతలే కాదు... సవాళ్లూ ఉన్నాయ్ టీసీఎస్‌లో సుదీర్ఘ అనుభవం, గ్రూపునకు ఆశాకిరణంగా కనిపిస్తున్న జేఎల్ఆర్లు చంద్రకు సానుకూలాంశాలు. అయితే గ్రూపులోని పలు కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి గాడిన పెట్టడం పెద్ద సవాలే. చంద్రకు భార్య లలిత, కుమారుడు ప్రణవ్ ఉన్నారు. ఇండో–యూఎస్, భారత్–బ్రిటిష్ సీఈవోల ఫోరంలో చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐటీ పరిశ్రమ అసోసియేషన్ నాస్కామ్కు 2012–13లో చైర్మన్‌గా పనిచేశారు. మార్పు దశలో టాటా...: చంద్రశేఖరన్ టాటా గ్రూపు మార్పు దశలో ఉందని ఆ గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎంపికైన చంద్రశేఖరన్ అన్నారు. టాటాలు సృష్టించిన విలువలు, నైతికత, సంస్కృతితో గ్రూపును ప్రగతి దిశగా నడిపించడమే తన కర్తవ్యమన్నారు. టాటా సన్స్ తనను చైర్మన్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ‘‘కొత్త పాత్ర ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని నాకు తెలుసు. దేశ ప్రజల్లో సమున్నత స్థానాన్ని ఆక్రమించిన ఓ గొప్ప సంస్థను నడిపించేందుకు నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. టాటా గ్రూపుతో 30 ఏళ్ల పాటు కలసి నడుస్తూ ఈ స్థాయికి చేరుకోవడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారాయన. -
‘టాటా’ మనిషికే పగ్గాలు
టాటా సన్స్ చైర్మన్‌గా టీసీఎస్ చంద్రశేఖరన్ • గురువారం సాయంత్రం బోర్డు భేటీలో నిర్ణయం • అనిశ్చితికి తెర; ఫిబ్రవరి 21న బాధ్యతలు ముంబై: టాటా సన్స్‌కు కొత్త చైర్మన్ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్.చంద్రశేఖరన్‌ను టాటా గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించారు. సైరస్ మిస్త్రీ వ్యవహారంతో ఇబ్బందులెదుర్కొన్న రతన్ టాటా... ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా తనకు నమ్మకంగా ఉండే చంద్రశేఖరన్వైపు మొగ్గు చూపించారని తెలుస్తోంది. దీనికితోడు గ్రూపులో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అయిన టీసీఎస్‌ను విజయవంతంగా నడిపిస్తున్న చరిత్ర కూడా చంద్రశేఖరన్‌కు ఉంది. గురువారం సాయంత్రం ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నూతన చైర్మన్‌గా ఆయన్ను టాటా సన్స్ ఎంపిక చేసింది. ఇక కొత్త బాధ్యతలను చంద్రశేఖరన్ ఫిబ్రవరి 21న స్వీకరిస్తారు. ‘‘టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్S.చంద్రశేఖరన్ టాటాసన్స్ డైరెక్టర్ల బోర్డు గురువారం నాటి సమావేశంలో నియమించింది. ఎంపిక కమిటీ ఏకగ్రీవ సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది’’ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాకపోతే చంద్రశేఖరన్ పదవీ కాలం ఎన్నాళ్లుంటుంది? రతన్‌టాటాకు గ్రూపులో కొత్తగా ఏవైనా బాధ్యతలు అప్పగిస్తున్నారా? వంటి వివరాలను మాత్రం టాటా సన్స్ వెల్లడించలేదు. ఎంపిక కమిటీ ఏకగ్రీవ సిఫారసు గతేడాది అక్టోబర్ 24న టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ పీ మిస్త్రీని తప్పించడంతో తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా పగ్గాలు చేపట్టారు. ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు భిన్న రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న 103 బిలియన్ డాలర్ల విలువగల టాటా గ్రూపు చైర్మన్‌గా అర్హత కలిగిన వ్యక్తి ఎంపిక కోసం... అదే రోజున రతన్‌టాటా, టీవీఎస్ గ్రూపు హెడ్ వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్యతో ఓ కమిటీ ఏర్పడింది. కమిటీకి కొత్త చైర్మన్ ఎంపిక కోసం 4 నెలల సమయం ఇచ్చారు. కానీ కమిటీ దీన్ని 2 నెలల్లోనే ముగించింది. తాజా నిర్ణయంతో టాటా గ్రూపు నాయకత్వంపై రెండు నెలలుగా ఏర్పడిన సందిగ్ధతకు తెరపడినట్లే. మిస్త్రీ కుటుంబం టాటా సన్స్‌పై న్యాయపోరాటం చేస్తున్న కీలక సమయంలో ‘చంద్ర’ టాటా చైర్మన్ బాధ్యతల్లోకి వస్తుండడం గమనార్హం. చంద్రశేఖరుడిపై ఆశలు... ‘‘చంద్రశేఖరన్ టీసీఎస్ సీఈవో, ఎండీగా ఉత్తమనాయకత్వాన్ని అందించారు. టాటా గ్రూపు మొత్తం తన సామర్ధ్యాన్ని గుర్తించడంతోపాటు ఆయా వ్యాపారాల్లో నాయకులుగా రాణించేందుకు ఆయన స్ఫూర్తినిస్తారని నమ్ముతున్నాం. అలాగే, మా విలువలతో కూడిన వ్యవస్థను, నైతికతను కొనసాగిస్తారని, టాటా గ్రూపు విధానాలను అనుసరిస్తారని భావిస్తున్నాం’’ అని టాటా సన్స్ ప్రకటనలో పేర్కొంది. నియమకాన్ని ఆహ్వానిస్తున్నాం.. టాటాసన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ నిర్ణయంతో టాటా గ్రూపు దేశ వ్యాపార రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషిని కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ సారథ్యానికి తగిన వ్యక్తి... టీసీఎస్‌ను ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి స్థాయికి తీసుకె ళ్లారు. అంతర్జాతీయంగా చంద్రశేఖరన్కున్న అనుభవం, వ్యాపార చతురత, టాటాలతో సుదీర్ఘ అనుబంధం నూతన బాధ్యతలకు ఆయన తగిన వారని నిరూపిస్తుంది. – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో సవాళ్లను ఎదుర్కోనే సత్తా చంద్రకు ఉంది.. టాటా గ్రూపు చైర్మన్‌గా చంద్రశేఖరన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ సామర్థ్యం తనకు ఉందని ఆయన ఇప్పటికే టీసీఎస్‌లో నిరూపించుకున్నారు. – ఎన్.నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఇండియన్ ఐకాన్ రక్షకుడు.. కొత్త బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్‌ను అభినందనలు. మీరిప్పుడు ఇండియన్ ఐకాన్ సంరక్షకులు. ఆ బాధ్యతను చేపట్టగల విశాలమైన భుజస్కంధాలు మీకున్నాయి. – ఆనంద్ మహింద్రా, మహింద్రా గ్రూపు చైర్మన్ -
ఇక్కడ అన్న..అక్కడ తమ్ముడు
ముంబై: టాటా మిస్త్రీ బోర్డ్ వార్ లో టాటా గ్రూప్ లో కీలక నియామకాలు గురువారం చోటు చేసుకున్నాయి. టాటాసన్స్ కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. గురువారం నిర్వహించిన టాటా సన్స బోర్డ్ సమావేశంలొ ఈ మేరకు నిర్ణయం జరిగింది. దీంతో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ సీఈవో గా రాజేష్ గోపీనాథన్ ను టాటా గ్రూపు నియమించింది. అలాగే ఎన్ జీ సుబ్రమణియం కొత్త సీవోవోగా ఎంపికయ్యారు. అయితే ఎన్ జీ సుబ్రమణియం చంద్రశేఖరన్ కు సోదరుడు. టీసీఎస్ విజన్ రోడ్ మ్యాప్ లో ఎలాంటి మార్పులు ఉండవని టీసీఎస్ కొత్త బాస్ గోపీనాథన్ ప్రకటించారు. తన ఎంపికపై సంతోషాన్ని ప్రకటించిన టాటా సన్స్ కొత్త ఛైర్మన్ చంద్రశేఖరన్ టీసీఎస్ కు గోపీనాథన్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు మంచి వ్యాపార దక్షత ఉందని కొనియాడారు. టీసీఎస్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ లో అపారమైన అనుభవం ఉందన్నారు. ఆయన నేతృత్వంలో టీసీఎస్ మరింత వ్యాపారంలో్ మరింత ఎత్తుకు ఎదగగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు టాటాసన్స్ కొత్త చైర్మన్ గా చంద్రశేఖరన్ ఎంపిక పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య, నీతి ఆయోగ్ ఛైర్మన్ అమితాబ్ కాంత్ తదితర ప్రముఖులు చంద్రశేఖరన్ నియామకాన్ని స్వాగతించారు. -
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక
-
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక
ముంబై: టాటా- మిస్త్రీ బోర్డ్ వార్ అనంతరం కీలక పరిణామం చేసుకుంది. టాటా సన్స్ బోర్డ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం గురువారం టాటా సన్స్ బోర్డ్ కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం బోర్డ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీసీఎస్ చీఫ్ నటరాజన్ చంద్రశేఖరన్ ను టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా ఎంపిక చేశారు. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 21 నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే దీనిపై టాటా గ్రూపు అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ కొత్త చీఫ్ గా రాజేష్ గోపీనాథ్ ఎంపిక ఖాయమైనట్టు తెలుస్తోంది. టాటా సన్స్ మధ్యంతర ఛైర్మన్ రతన్ టాటా, టీవీఎస్ గ్రూపు చైర్మన్ వేణు శ్రీనివాసన్, బైన్ కేపిటల్ అమిత్ చంద్ర, రోనన్ సేన్ ,లార్డ్ కుమార్ భట్టాచార్యలతో కూడిన ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ సమావేశంలో కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ బాస్ ను ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే ఎన్. చంద్రశేఖరన్ టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా ఎంపిక కానున్నారనే అంచనాలపై పలువురు పారిశ్రామికవేత్తలు, మార్కెట్ నిపుణులు ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి స్పందిస్తూ టాటా సన్స్ చైర్మన్ గా ఆయన సక్సెస్ అవుతారనే దానిపై ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి అని, చంద్రశేఖరన్ ను ఎంపిక చేస్తే ఐటీ రంగానికి మంచిదేనంటూ వ్యాఖ్యానించారు. చంద్రశేఖరన్ ఎంపిక అంచనాలపై మరో ఐటీ మేజర్ విప్రోతోపాటు, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా , టైటన్ ఎండీ భాస్కర్ భట్ కూడా హర్షం వ్యక్తం చేశారు. -
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక మరి కొద్దిసేపట్లో?
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్ గా ఎవరు అనే సస్పెన్స్ కు మరి కొద్ది పేపట్లో తెరపడనుంది. సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం నూతన చైర్మన్ ఎంపిక కసరత్తు ఈ రోజుతో ముగియనుంది. గురువారం అనుకోని బోర్డు సమావేశంలో ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రం 5 గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో మార్కెట్ వర్గాల్లో ప్రముఖమైన వ్యక్తినే ఈ పదవికి ఎంపిక చేసు అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే టాటా సన్స్ బోర్డు వైస్ ఛైర్మన్ అ భ్యర్థి ఎంపికను ఈ సమావేశంలోనే ఎంపిక చేయనున్నారు. కాగా గత ఏడాది అక్టోబర్ లో మిస్త్రీ తొలగింపు తర్వాత రతన్ టాటా మధ్యంతర ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
రతన్ టాటాపై కోర్టు ధిక్కార పిటిషన్
• టాటా సన్స్‌పై మిస్త్రీ న్యాయ పోరాటం • బోర్డ్ నుంచి తొలగింపు ప్రయత్నం జరుగుతోందని విమర్శ ముంబై: టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటాసహా హోల్డింగ్ కంపెనీ– టాటా సన్స్ డైరెక్టర్లపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో సైరెస్ మిస్త్రీ నేతృత్వంలోని రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు తాజాగా ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాయి. బోర్డ్ నుంచి మిస్త్రీని తప్పించడానికి చర్యలు ప్రారంభిస్తూ, ట్రిబ్యునల్ గత ఉత్తర్వుల ఉల్లంఘనలకు టాటా సన్స్ పాల్పడుతోందన్నది బుధవారం దాఖలు చేసిన ఈ పిటిషన్ ప్రధాన ఆరోపణ. ఫిబ్రవరి 6వ తేదీన టాటా సన్స్ ఈజీఎం జరగనుందని, ఈ సమావేశాన్ని నిలుపుచేయడంతోపాటు, ఆ తేదీసహా మరే రోజునా... గతంలో ట్రిబునల్ ఇచ్చిన రూలింగ్‌ను ఉల్లంఘిస్తూ చర్యలు తీసుకోకుండా ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ పిటిషన్లో సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కోరాయి. జైలుశిక్ష.. జరిమానా విధించండి... టాటా బోర్డ్ నుంచి డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించడానికి సంబంధించి జనవరి 3న టాటా సన్స్ ఒక ప్రత్యేక నోటీసు జారీ చేసిందని పిటిషన్ పేర్కొంది. డిసెంబర్ 22న ఎన్సీఎల్టీ జారీ చేసిన ఉత్తర్వును పూర్తిస్థాయిలో ఉల్లంఘించడం కిందకే వస్తుందని పిటిషన్ వివరించింది. ఈ ఉల్లంఘనలకు గాను టాటాసహా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జి ట్రస్ట్ డైరెక్టర్లకు ఆరు నెలల వరకూ వర్తించే విధంగా సాధారణ జైలు శిక్ష లేదా రూ.2,000 జరిమానా లేదా రెండు శిక్షలూ విధించాలని పిటిషన్ ట్రిబునల్ను ఆశ్రయించింది. మిస్త్రీ పిటిషన్లో ఉన్న డైరెక్టర్లలో ఎన్ఏ సూనావాలా, ఆర్కే కృష్ణకుమార్, ఆర్ వెంకటరమణలు ఉన్నారు. ఇంతక్రితం తాము దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేస్తూ... ఈ అంశాన్ని పరిష్కారించేంతవరకూ దీనిపై ఎటువంటి చర్యలు లేదా ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశించిందని దిక్కార పిటిషన్ పేర్కొంది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ– టాటాసన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించడానికి ఫిబ్రవరి 6వ తేదీన షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించడానికి రంగం సిద్ధం అయిన నేపథ్యంలో మిస్త్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి అక్టోబర్ 24న మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన ఆరు కంపెనీల బోర్డులకూ రాజీనామా చేశారు. అయితే టాటా సన్స్, ఆ కంపెనీ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేట్ నియమనిబంధనలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. -
మర్యాదగా చెబితే మిస్త్రీ వినలేదు!
ఉద్వాసనకు ముందే రాజీనామా కోరిన టాటా • తిరస్కరించడంతో తొలగింపు • ఆయనపై నమ్మకం కోల్పోవడం వల్లే • కంపెనీ లా ట్రిబ్యునల్‌కు టాటాసన్స్ వెల్లడి ముంబై: టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికే ముందు టాటా సన్స్ ఆయనకు రాజీనామా చేసే అవకాశం ఇచ్చిందట. టాటా సన్స్ బోర్డు మిస్త్రీపై నమ్మకం కోల్పోవడంతో రాజీనామా చేయాలని ఆయన్ను రతన్‌టాటా స్వయంగా అడిగారు. కానీ, రాజీనామా చేసేందుకు మిస్త్రీ నిరాకరించడంతో మెజారిటీ ఓటు మేరకు తొలగించాల్సి వచ్చిందని టాటా సన్స్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వివరించింది. మిస్త్రీ కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు టాటాసన్స్, రతన్టాటాలకు వ్యతిరేకంగా కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి పిటిషన్లకు సమగ్రమైన స్పందనను 204 పేజీల అఫిడవిట్ రూపంలో టాటా సన్స్ దాఖలు చేసింది. మిస్త్రీ నాయకత్వంలో ఎటువంటి పురోగతి లేకపోవడం లేదా చాలా తక్కువగా ఉండడంతో గతేడాది అక్టోబర్ 24న చైర్మన్‌గా ఆయన్ను తొలగించినట్టు తెలిపింది. టాటాసన్స్ బోర్డులోని తొమ్మిది మంది డైరెక్టర్లకు గాను ఫరీదా ఖంబటా గైర్హాజరు కాగా... మిగిలిన వారిలో ఏడుగురు మిస్త్రీని మార్చేందుకుఅనుకూలంగా ఓటు వేశారని, డైరెక్టర్‌గా మిస్త్రీని ఓటు వేసేందుకు అనర్హుడిగా ప్రకటించినట్టు పేర్కొంది. ‘‘2016 అక్టోబర్ 24న టాటాసన్స్ బోర్డు సమావేశానికి ముందే రతన్‌టాటా, నితిన్ నోహ్రియా సైరస్ మిస్త్రీతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్చైర్మన్ పదవికి రాజీనామా చేసే అవకాశం ఆయన ముందుంచారు. కానీ, తప్పుకునేందుకు మిస్త్రీ తిరస్కరించారు’’ అని టాటాసన్స్ తెలిపింది. అంతేకానీ, ఈ నిర్ణయం ఆకస్మికంగా, తొందరపాటుతో తీసుకోలేదని పేర్కొంది. టాటా గ్రూపు నిర్మాణాన్ని బలహీనపరిచారు.. ‘‘నాలుగేళ్ల మిస్త్రీ నాయకత్వంలో కలతకు గురిచేసే ఎన్నో వాస్తవాలు చోటు చేసుకున్నాయి. మూలధన కేటాయింపు నిర్ణయాల్లో క్రమశిక్షణ లోపించింది. నిర్వహణలో జాప్యం, వ్యూహాత్మక, వ్యాపార ప్రణాళికలు లేకపోవడం, వృద్ధికి అవకాశం ఉన్నకొత్త వ్యాపారాల్లోకి అడుగు పెట్టే అర్థవంతమైన చర్యలు లోపించడం, ఉన్నత స్థాయి యాజమాన్యం బలహీనపడడం వంటివి జరిగాయి. టాటా గ్రూపులోని మేజర్ కంపెనీల్లో టాటాసన్స్ డైరెక్టర్ల ప్రాతినిథ్యాన్ని తగ్గించేందుకు మిస్త్రీ క్రమపద్ధతిలో ప్రణాళికమేరకు వ్యవహరించారు. క్రమపద్ధతిలో పలుచన చేసే ఈ చర్యలు... టాటా విలువలు, సంస్కృతి, పరిపాలన మార్గదర్శకాలు, గ్రూపు వ్యూహాత్మక విధానాలు, నిర్మాణాన్ని నిర్వీర్యపరిచాయి’’ అని అఫిడవిట్లో టాటాసన్స్ వివరించింది. నాయకుడిగానూ విఫలం: వెనుకటి నుంచీ ఉన్న సమస్యలకే మిస్త్రీ దృష్టి పరిమితం అయిందని విమర్శించింది. ఇన్వెస్టర్లు, వాటాదారులతో సానుకూల సంబంధాలు నెలకొల్పడం నాయకుడి ప్రధాన విధుల్లో భాగమని, వీటిలోనూ మిస్త్రీవిఫలమయ్యారని పేర్కొంది. దీంతో టాటాసన్స్, టాటా ట్రస్ట్‌ల మధ్య విశ్వాస అంతరం పెరిగిపోయిందని పేర్కొంది. టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని రతన్ టాటానే ఆహ్వానించారని... ఆ హోదాలోనే రతన్Sటాటా టాటాసన్స్ బోర్డు డైరెక్టర్ల సమావేశాల్లోపాల్గొనే హక్కు కలిగి ఉన్నారని పేర్కొంది. అయినప్పటికీ గతేడాది అక్టోబర్ 24 నాటి సమావేశానికి ముందెప్పుడూ రతన్‌టాటా గౌరవ చైర్మన్ హోదాలో పాల్గొన్న సందర్భం లేదని వివరించింది. మిస్త్రీ కుటుంబానికి ఆ హక్కులేదు... టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌ను నియమించే హక్కు మిస్త్రీ కుటుంబానికి లేదని టాటా సన్స్ స్పష్టం చేసింది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం ఇందుకు అవకాశం లేదని తెలిపింది. టాటా గ్రూపు నిర్వహణ కంపెనీ అయిన టాటా సన్స్... డైరెక్టర్పదవి నుంచి మిస్త్రీని తప్పించేందుకు ఫిబ్రవరి 9న సమావేశం కానున్న విషయం తెలిసిందే. ‘‘టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి 1965 నుంచీ 18.4 శాతం వాటా ఉంది. అయినప్పటికీ పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ టాటా సన్స్ బోర్డులోడైరెక్టర్గా 1980లో తొలిగా నియమితులయ్యారు. 2004లో రిటైర్ అయ్యారు. రెండేళ్ల తర్వాత రతన్ టాటా ప్రతిపాదించగా ఆయన కుమారుడైన సైరస్ మిస్త్రీ టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌గా చేరారు. అంతేగానీ పల్లోంజీ మిస్త్రీ లేదా సైరస్ మిస్త్రీ నైతికంగానియామక హక్కు కలిగి లేరు’’ అని టాటా సన్స్ తన అఫిడవిట్లో పేర్కొంది. -
టాటా సన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీపై వేటు!
వచ్చే నెల 6న ఈజీఎం న్యూఢిల్లీ: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) వచ్చే నెల 6న జరగనున్నది. సైరస్ మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని టాటా సన్స్ తెలిపింది. చైర్మన్‌గా తొలగించిన తర్వాత మిస్త్రీ టాటా గ్రూప్ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో నిరాధార ఆరోపణలు చేశారని, కంపెనీ రహస్య ఫైళ్లను బహిర్గతం చేశారని పేర్కొంది. ఆయన కారణంగా టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ పడిపోయిందని, వాటాదారులకు పరోక్షంగా నష్టం వాటిల్లిందని వివరించింది. చైర్మన్‌గా మిస్త్రీని టాటా సన్స్ గతం ఏడాది అక్టోబర్ 24న తొలగించిన విషయం తెలిసిందే. మిస్త్రీ డైరెక్టర్‌గా ఉన్న టాటా గ్రూప్ కంపెనీల నుంచి ఆయనను తొలగించడానికి ఆయా కంపెనీలు ఈజీఎంలను కూడా నిర్వహించాయి. ఈజీఎంలు జరుగుతుండగానే ఆయన ఆరు టాటా కంపెనీల డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు తనను చైర్మన్‌గా తొలగించినందుకు టాటా సన్స్, ప్రస్తుత చైర్మన్ రతన్ టాటాలపై సైరస్ మిస్త్రీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలు చేశారు. -
రహస్య పత్రాలను 48 గంటల్లో వెనక్కిచ్చేయండి
మిస్త్రీకి టాటా సన్స్ మరో లీగల్ నోటీసు... సమాచారం బయటపెట్టనని హామీ ఇవ్వాలంటూ డిమాండ్ న్యూఢిల్లీ: కంపెనీకి సంబంధించిన రహస్య సమాచార పత్రాలన్నింటినీ తమకు వెంటనే తిరిగి స్వాధీనం చేయాలని టాటా సన్స్... సైరస్ మిస్త్రీని కోరింది. కంపెనీ ఆంతరంగిక సమాచారాన్ని బయటపెట్టడం ద్వారా గోప్యతా నిబంధనల్ని మిస్త్రీ ఉల్లంఘించారంటూ టాటా సన్స్ ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. తప్పుడు పద్ధతుల్లో, విశ్వాసరహితంగా, తమ అనుమతి లేకుండా కంపెనీ నుంచి ఈ పత్రాలను తీసుకెళ్లినట్టు ఆరోపించింది. చట్ట ప్రకారం శిక్షించదగిన నేరంగా దీన్ని పేర్కొంది. వెంటనే 48 గంటల్లోపు వాటిని తమకు స్వాధీనం చేయాలని, కాపీలను కూడా తన దగ్గర ఉంచుకోవద్దని కోరింది. ఆ సమాచారాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ బహిర్గతపరచనని, గోప్యతను కాపాడతానని హామీ పత్రంపై సంతకం చేయాలంటూ గురువారం లీగల్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో మిస్త్రీకి ఇది రెండో లీగల్ నోటీసు కావడం గమనార్హం. ‘‘టాటా సన్స్‌తోపాటు, నిర్వహణ కంపెనీలకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా వ్యవహరించిన మీ దగ్గర కంపెనీకి సంబంధించిన రహస్య, వాణిజ్యపరంగా సున్నితమైన సమాచారం ఉంది. చట్ట ప్రకారం విధుల్లో భాగంగా ఆ గోప్యతను, డైరెక్టర్‌గా మీకు తెలిసిన రహస్య సమాచారాన్ని కాపాడాల్సి ఉంటుంది. దీన్ని వెల్లడించరాదు. ఈ సమాచారాన్ని దేనికీ వినియోగించరాదు. అలాగే, అనుబంధ సంస్థలు, బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయరాదు’’ అంటూ టాటా సన్స్ తన నోటీసులో మిస్త్రీని కోరింది. చట్టబద్ధమైన ఈ విధులను ఉల్లంఘిస్తే టాటా సన్స్‌కు కోలుకోలేని నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. టాటా సన్స్, టాటా గ్రూపునకు సంబంధించి ఎంతో విలువైన సమాచారం మిస్త్రీ వద్ద ఉందని పేర్కొంది. అభ్యర్థన మాత్రమే... టాటా సన్స్ పంపిన లీగల్ నోటీసుపై మీడియా విచారణలకు మిస్త్రీ కార్యాలయం స్పందించింది. నోటీసుగా పేర్కొంటున్న టాటా లేఖ... కోర్టులు, ట్రిబ్యునళ్లకు డాక్యుమెంట్లను, రికార్డులను అందించవద్దని, అవి గోప్యంగా ఉంచాల్సినవంటూ చేసిన అభ్యర్థన మాత్రమేనని పేర్కొంది. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించబోమని, వార్తల కోసం ప్రత్యుత్తరం ఇవ్వబోమని మిస్త్రీ కార్యాలయం స్పష్టం చేసింది. గోప్యత అంటూ వారు తమ లేఖలను మీడియాకు విస్తృతంగా పంపిణీ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. ఈ విధమైన ప్రవర్తన న్యాయ వ్యవస్థ పరిధిలో జోక్యం చేసుకోవడంగా భావిస్తున్నట్టు మిస్త్రీ కార్యాలయం ప్రకటన జారీ చేసింది.