
పల్ఘర్: టాటా సన్స్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి రూ. 200 కోట్లు కాజేద్దామనుకున్న ఏడుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు తమ వ్యూహాన్ని అమలు చేసే ముందే అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికోసం వారు ఇండస్‌ఇండ్ బ్యాంకులో పని చేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా ఖాతా వివరాలను తెలుసుకున్నారు. అయితే ఆ ఖాతాపై ఎలాంటి హ్యాక్ ప్రయత్నాలు జరగలేదని, తమ భద్రతా విభాగాలకు ఎలాంటి సమాచారం లేదని ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకు పాలసీని దాటి వ్యవహరించే సిబ్బందిని తొలగిస్తామని చెప్పింది. అరెస్టైన వారిని నసీమ్ సిద్దిఖి (35), గునజివ్ బారాయియా (56), సరోజ్ ఛౌధరి (25), సతీశ్ గుప్తా (32), అనంత్ ఘోష్ (34), ఆనంద్‌నలవాడె (38)లుగా గుర్తించారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. (చదవండి: అప్పటిదాకా రూ. 50వేల విత్‌డ్రాయల్‌కే అనుమతి)
Comments
Please login to add a commentAdd a comment