
సుందర్‌నగర్‌లో మహిళా బ్రాంచ్‌గా ముద్ర
యూనియన్ బ్యాంక్‌లో నూరు శాతం మహిళా ఉద్యోగులు
సనత్‌నగర్: ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు.. కుటుంబాన్ని నడిపించడంలోనూ మహిళల పాత్ర ఎనలేనిది. ఓ వైపు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ.. మరోవైపు ఉద్యోగ విధులను బాధ్యతాయుతంగా చేపడుతున్న మహిళలు కోకొల్లలు. అయితే అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకింగ్ రంగంలోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే నగరంలోని సుందర్‌నగర్ బ్రాంచ్‌లో మాత్రం నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ అందరూ మహిళామణులే విధులు నిర్వహిస్తుండడంతో దీనికి లేడీస్ బ్యాంక్‌గా ముద్ర పడింది.
చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
2023 డిసెంబర్‌లో మేనేజర్‌గా సునీత బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని పోస్టుల్లోనూ మహిళలే భర్తీ అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రమ్య, శృతి, సృజన, లక్ష్మీ, జ్యోతిర్మయి, ధీరజ తదితర మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ.. ఖాతాదారులకు ఎంతో ఓపిగ్గా సేవలందిస్తున్నారు.