Women employees
-
May Day శ్రమైక జీవనం
కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు... ఒంటి చేత్తో తోసిరాజని....పనిలో తమను తాము నిరూపించుకున్నారు మహిళా కార్మికులు.కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణగా నవీన శక్తిలా ముందుకు వచ్చారు మహిళా కార్మికులు.శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబం అయ్యారు.‘ఈ రంగంలో మహిళలు పనిచేయలేరు’ అనుకునే రంగాలలోకి వచ్చి అ΄ోహలను బద్దలు కొట్టారు.‘పురుషులకు ఎక్కడా తీసిపోము’ అని నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. అయితే... ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళా ఉద్యోగులు, కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన చర్చను ముందుకు తెచ్చింది. వివిధ సర్వేల ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలు పనిప్రాంతంలో ఏదో ఒక రకమైన శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.మహిళా సిబ్బందికి వారి పనిప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చాలాప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేదు. సరైన నిఘా, రిపోర్టింగ్ యంత్రాంగం లేక΄ోవడంతో అనుచిత ప్రవర్తన, వేధింపులు పెరిగాయి.ప్రాంథమిక భద్రతా చర్యల గురించి చాలా సంస్థలలో మహిళా ఉద్యోగులకు అవగాహన కలిగించడం లేదు.గార్మెంట్ ఫ్యాక్టరీలలో ఎక్కువమంది కార్మికులు మహిళలే. అయితే పురుషులతో ΄ోల్చితే వారికి తక్కువ వేతనం ఇస్తున్నారు. వేతన అసమానతలతో పాటు పనిప్రాంతంలో ప్రమాదాలు, పురుషాధిపత్య వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలలో మహిళాకార్మికులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది.‘బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్’ రిపోర్ట్ మన దేశంలో గార్మెంట్ ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. నిజానికి ‘ఇది కేవలం గార్మెంట్ పరిశ్రమలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే’ అనుకోనక్కర్లేదు. చిన్నా, పెద్ద తేడాలతో ఎన్నో పరిశ్రమలలో వేరు వేరు రూపాల్లో ఇదే పరిస్థితి ఉంది.కోవిడ్ మహమ్మారి ఉమెన్ హెల్త్ వర్కర్లకు ప్రమాదాలు తెచ్చింది. విధి నిర్వహణలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.చదవండి: ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్నిరాశ పడే పరిస్థితులు రావచ్చు, భద్రతాపరమైన సమస్యలు ఉండవచ్చు....ఒకటి, రెండు అని కాదు....సవాలక్ష సమస్యలు ఎదురైనా మహిళా శ్రామిక శక్తి వెనక్కి తగ్గడం లేదు.ఎందుకంటే వారు...చరిత్ర వింటూ వచ్చారు. మరో చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఇదీ చదవండి: Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.! -
అతివలకు అడ్వైజర్లుగా మంచి కెరియర్..
చాలా మంది మహిళలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి బడ్జెట్లు చూసుకోవడం, ఖర్చుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడమనేది దైనందిన చర్యగానే ఉంటుంది. ఈ బాధ్యతలే ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం, కమ్యూనికేషన్, సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యాల్లాంటి అమూల్యమైన నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఉపయోగపడతాయి. విజయవంతమైన జీవిత బీమా అడ్వైజరు/ కన్సల్టెంటుగా మారాలంటే అచ్చంగా ఇలాంటి నైపుణ్యాలే అవసరం.అడ్వైజరు, కన్సల్టెంటుగా మారడమనేది, జీవిత లక్ష్యాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకోవడంలో ఇతరులకు తోడ్పడటంతో పాటు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం కూడా కృషి చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఆర్డీఏఐ ప్రకారం 2022 మార్చి నాటికి దేశీయంగా మొత్తం జీవిత బీమా ఏజెంట్లలో మహిళల వాటా 29 శాతంగా ఉంది. సుమారు 24.43 లక్షల మంది ఏజంట్లలో దాదాపు 7 లక్షల మంది మహిళా ఏజంట్లు ఉన్నారు. మహిళలు ముందుకొచ్చి, అవకాశాలను అందిపుచ్చుకుంటే, ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చు.అడ్వైజరుగా ఇలా మారొచ్చు..1. ప్రాథమిక అర్హతలు, శిక్షణ: బీమా పథకాలు, విక్రయించేందుకు టెక్నిక్‌లు, ఆర్థిక ప్రణాళిక సూత్రాలు మొదలైన విషయాల్లో అభ్యర్థులకు అవగాహన కల్పించేలా చాలా మటుకు కంపెనీలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. సమర్ధవంతంగా క్లయింట్లకు మార్గదర్శకత్వం వహించేందుకు మహిళలకు అవసరమయ్యే సాధన సంపత్తిని వీటి ద్వారా సమకూర్చుకోవచ్చు.2. నెట్వర్కింగ్: క్లయింట్ల నమ్మకాన్ని చూరగొనాలంటే సంభాషించే నైపుణ్యాలు, ఇతరులతో కలిసి పని చేయగలగడం, అవసరమైతే సారథ్య బాధ్యతలు చేపట్టడం, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకోగలిగే సామర్థ్యాల్లాంటివి చాలా ముఖ్యం. తాము అడ్వైజరుగా వ్యవహరించే సంస్థల సహాయంతో మహిళలు సామర్థ్యాలను మెరుగుపర్చుకుని, దీర్ఘకాలిక ప్రొఫెషనల్ కనెక్షన్లను ఏర్పర్చుకోవచ్చు.3. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవడం: డిజిటల్ యుగంలో భావి కస్టమర్లను చేరుకునేందుకు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ అనేవి శక్తివంతమైన సాధనాలుగా ఉంటున్నాయి. తమ అనుభవాన్ని తెలియజేసేందుకు, భావి కస్టమర్లలో అవగాహనను పెంపొందించేందుకు మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవచ్చు. 4. నిరంతరం నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం: పరిశ్రమలో వచ్చే కొత్త పోకడలు, కొత్త ప్రోడక్టులు, నియంత్రణ నిబంధనలపరమైన మార్పుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటే దీర్ఘకాలికంగా విజయాలకు దోహదపడుతుంది. సంబంధిత సర్టిఫికేషన్ల పొందితే కెరియర్లో పురోగమించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. చివరగా చెప్పేదేమిటంటే మహిళలు, ముఖ్యంగా గృహిణులు తమకు అంతర్గతంగా ఉండే నైపుణ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని, కెరియర్ను నిర్మించుకోవడానికి జీవిత బీమా రంగం అవకాశం కల్పిస్తుంది.సరైన శిక్షణ, సంకల్పం, నెట్వర్కింగ్ సామర్థ్యాలను అలవర్చుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా మహిళలూ విజయవంతగా రాణించగలరు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు కావడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం, వర్క్–లైఫ్ సమతుల్యత, ఇతరులకు సాధికారత కల్పించే సంతృప్తిని పొందవచ్చు.ఇదీ చదవండి: ఇక ఒక రాష్ట్రం–ఒక ఆర్ఆర్బీ!జీవిత బీమాలో కెరియర్‌తో ఆర్థిక స్వాతంత్య్రంజీవిత బీమా రంగంలో మహిళలు కెరియర్‌పరంగా పురోగమించడంతో పాటు ఆర్థికంగా సాధికారతను కూడా పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కన్సల్టెంటుగా కెరియర్ ఇటు వ్యక్తిగత బాధ్యతలు, అటు ప్రొఫెషనల్ ఆకాంక్షల మధ్య సమతౌల్యం పాటిస్తూ, ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. స్థిరమైన ఆదాయార్జన పొందడంతో పాటు అర్థవంతమైన ప్రభావాన్ని చూపేందుకు ఇందులో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. తద్వారా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవడంలో తోడ్పడటమే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం పొందేందుకు కూడా ఇది ఉపయోగపడగలదు.-సమీర్ జోషి, చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ -
కాంట్రాక్ట్ మహిళా టెకీలకు సవాళ్లు
ముంబై: కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నాలజీ ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ వారు ఎక్కువగా ఎంట్రీ స్థాయికే పరిమితమవుతున్నారే తప్ప కెరియర్లో పెద్దగా ముందుకెళ్లలేకపోతున్నారు. అలాగే పురుషులతో పోలిస్తే వేతనాల్లోనూ వ్యత్యాసాలు ఉంటున్నాయి. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, రిమోట్ వర్క్ అవకాశాలు, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే (డీఈఐ) విధానాలు గత నాలుగేళ్లలో మహిళా టెకీల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. 2020లో కాంట్రాక్టు టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య 9.51 శాతంగా ఉండగా, 2024లో ఇది 27.98 శాతానికి పెరిగింది. ఐటీ సర్వీసుల రంగంలో మహిళా సిబ్బంది వాటా 7.8 శాతం నుంచి 21.2 శాతానికి పెరిగింది. అయితే, ఇది చెప్పుకోతగ్గ స్థాయిలో కెరియర్ పురోగతికి దారితీయడం లేదు. మధ్య స్థాయి ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం 4.13 శాతం నుంచి 8.93 శాతానికి మాత్రమే పెరగడం ఇందుకు నిదర్శనం. ఎంట్రీ స్థాయిని దాటి పురోగమించేందుకు మహిళలకు గణనీయంగా అవరోధాలు ఉండటాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. 2020–2024 మధ్య టీమ్‌లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బందిలోని 13,000 మంది అసోసియేట్స్ గణాంకాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. వేతనాల్లోనూ వ్యత్యాసాలు.. వేతనాల విషయానికొస్తే పురుషులు, మహిళల మధ్య ఎంట్రీ స్థాయి కొలవుల్లో 6 శాతం, మధ్య స్థాయి ఉద్యోగాల్లో 19 శాతం వరకు వ్యత్యాసం ఉంటోంది. అయితే, సీనియర్ స్థాయిలో మాత్రం 13 శాతంగా ఉంటోంది. ‘కాంట్రాక్ట్ టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం హర్షణీయమే అయినప్పటికీ, లింగ సమానత సాధించాలంటే నియామకాల పరిధికి మించి బహుముఖ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. లీడర్షిప్ స్థానాల్లో మహిళలకు ప్రాతినిధ్యం అంతగా లేకపోవడం, పురుషులతో పోలిస్తే వేతనాల మధ్య వ్యత్యాసాలు అలాగే కొనసాగుతుండటమనేది వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పులను చేయాల్సిన ఆవశ్యకతను సూచిస్తోంది. మహిళలు ఉద్యోగాల్లో చేరడమే కాకుండా, కెరియర్లో పురోగమించేందుకు, సారథ్య బాధ్యతల్లో రాణించేందుకు అవసరమైన పరిస్థితులను కలి్పంచే దిశగా కంపెనీలు కృషి చేయాలి‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. -
ఎలాంటి ప్రశ్నలు లేకుండా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్
న్యూఢిల్లీ: సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2030 నాటికి మహిళల సంఖ్య 30 శాతం సాధన దిశగా అడుగులు వేస్తున్నామని వేదాంత తెలిపింది. మహిళా సిబ్బందిలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకొనే పదవుల్లో 28% మంది ఉన్నారని, ఇది దేశంలో మెటల్స్, మైనింగ్ కంపెనీల్లోనే అత్యధికమని పేర్కొంది.అర్హత కలిగిన మహిళలకు తగిన స్థానం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది. అనువైన పని గంటలు, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం, పిల్లల సంరక్షణ కోసం ఏడాదంతా సెలవులు, జీవిత భాగస్వామి నియామకం తదితర స్నేహపూర్వక విధానాల అమలు ద్వారా ప్రతి దశలోనూ మహిళల ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్ జింక్ ఉమెన్ ఆఫ్ జింక్ క్యాంపేయిన్ ప్రారంభించింది. మెటల్ రంగం పట్ల మహిళల్లో మరింత ఆసక్తిని పెంచడం ఈ ప్రచార కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. -
లేడీస్ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా?
సనత్‌నగర్: ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు.. కుటుంబాన్ని నడిపించడంలోనూ మహిళల పాత్ర ఎనలేనిది. ఓ వైపు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ.. మరోవైపు ఉద్యోగ విధులను బాధ్యతాయుతంగా చేపడుతున్న మహిళలు కోకొల్లలు. అయితే అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకింగ్ రంగంలోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే నగరంలోని సుందర్‌నగర్ బ్రాంచ్‌లో మాత్రం నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ అందరూ మహిళామణులే విధులు నిర్వహిస్తుండడంతో దీనికి లేడీస్ బ్యాంక్‌గా ముద్ర పడింది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!2023 డిసెంబర్లో మేనేజర్‌గా సునీత బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని పోస్టుల్లోనూ మహిళలే భర్తీ అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రమ్య, శృతి, సృజన, లక్ష్మీ, జ్యోతిర్మయి, ధీరజ తదితర మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ.. ఖాతాదారులకు ఎంతో ఓపిగ్గా సేవలందిస్తున్నారు. -
తొలి మహిళా పెట్రోల్ బంక్: 'స్త్రీశక్తి... ఇంధనమై'..
‘పెట్రోల్ బంక్‌లో మహిళలు ఉద్యోగం చేయగలరా!’ అనే పురుషాధిపత్య అనుమానాన్ని పటాపంచలు చేస్తూ... ‘బ్రహ్మాండంగా చేయగలరు’ అని నిరూపించారు మహిళలు.ఇప్పుడు ఆ దారిలో మరో ముందడుగు... తొలి మహిళా పెట్రోల్ బంక్. ఇద్దరు కలెక్టర్ల చొరవ, కృషితో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు అయింది...నారాయణపేట జిల్లాలో మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. ‘మీరు ముందుకు వస్తే పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తాను’ అని హామీ ఇచ్చారాయన. దీంతో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. డీఆర్డీఏ కార్యాలయానికి అనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో ‘అయ్యో!’ అనుకున్నారు. పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు.అయితే ప్రస్తుత కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఫైల్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోనే తొలి మహిళ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35 వేల లీటర్ల (పెట్రోల్, డిజిల్) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన ఒకాయన ఇలా అన్నాడు.... ‘ఎంతైనా ఆడవాళ్ల ఓపికే వేరు’ పెట్రోల్ బంక్‌ను విజయపథంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి.కలలో కూడా ఊహించలేదునారాయణపేటలో మహిళ సంఘం ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఇది అయ్యే పని కాదనుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో సేల్స్ ఎగ్జిక్యూటిగా ఉద్యోగంలో చేరడం సంతోషంగా ఉంది. నెలకు రూ.11 వేల జీతం వస్తుంది. కుటుంబానికి ఎంతో అండగా ఉండేందుకు తోడ్పడుతుంది.– జగదీశ్వరి, సెల్స్ ఉమన్ , జడ్.ఎం.ఎస్. పెట్రోల్ బంకు మరింత మందికి ఉపాధినారాయణపేట జడ్ఎంఎస్ అధ్యక్షురాలిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నా. జడ్ఎంఎస్కు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా, స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లం. పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది ఉపాధి అవకాశాలకు వీలైంది.– చంద్రకళ, పెట్రోల్ బంకు మేనేజర్– కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, సాక్షి, నారాయణపేట -
జీవనోపాధిలో దక్షిణాది మహిళలు అద్భుతః!
సాక్షి, విశాఖపట్నం: జీవనోపాధి రంగంలో దక్షిణాది మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మొదటి 25 నగరాల్లో 16 దక్షిణాదికి చెందినవే ఉండటం విశేషం. అవతార్ అనే ప్రముఖ ఎన్జీవో ఏటా విడుదల చేసే ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా (టీసీడబ్ల్యూఐ)’ సర్వేలో 47.15 శాతం మంది మహిళలు జీవనోపాధి పొందుతున్న బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా.. విశాఖపట్నం 25వ స్థానంలో కొనసాగుతోంది. చీకట్లను చీల్చుకుని.. పితృస్వామ్య భావజాల బంధన వలయాల్ని చీల్చుకుంటూ మహిళలు మరీ ముఖ్యంగా దక్షిణాది మహిళలు ముందడుగు వేస్తున్నారు. భవిష్యత్‌పై కోటి ఆశల కలల్ని నిజం చేసుకోవాలన్న తపనతో ఉన్నత లక్ష్యాల్ని నిర్దేశించుకుంటూ సరికొత్త ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. ఆంక్షల సంకెళ్లు దాటి.. ఆర్థిక పురోభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. ఓ వైపు భారతావనికి సేవచేసే బాధ్యతాయుత పదవుల్లోనూ అతివల ప్రాతినిధ్యం పెరుగుతున్న తరుణంలో.. తమ జీవన ప్రమాణాలు పెంపొందించే రంగాల్లోనూ మహిళలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.జీవనోపాధిలో ప్రతి మహిళా సాధిస్తున్న విజయం.. మరో మహిళకు స్ఫూర్తిగా నిలుస్తోంది. క్రమంగా స్వసంపాదన దిశగా పయనిస్తూ విజయ శిఖరాల్ని చేరుకుంటున్నారు. కుటుంబ ఆదాయ, వ్యయ అంచనాతో పాటు ప్రణాళికలను వేసుకోవడం, వివిధ పథకాలను ఉపయోగించుకోవడం, ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటి విషయాల్లో మహిళల ప్రత్యక్ష పాత్ర పెరుగుతూ వస్తోందని అవతార్ సంస్థ ప్రకటించిన టీసీడబ్ల్యూఐ–2024 నివేదిక స్పష్టం చేసింది. బెంగళూరు బెస్ట్.. చెన్నై, ముంబై నెక్స్ట్టీసీడబ్ల్యూఐ–2024 పేరుతో మిలియన్ ప్లస్ సిటీస్, లెస్ దేన్ మిలియన్ సిటీస్.. అని రెండుగా విభజించి సర్వే చేపట్టారు. సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్ (సీఐఎస్) పరంగా.. మిలియన్ ప్లస్ సిటీస్ జాబితాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నగరాల్లో బెంగళూరు 47.15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. 46.31 పాయింట్లతో చెన్నై రెండో ర్యాంకు, 41.11తో ముంబై, 38.89తో హైదరాబాద్, 36.88తో పుణె తరువాత స్థానాల్లో నిలిచాయి. సామాజిక అవకాశాలు (ఎస్ఐఎస్) కల్పించే విషయంలో మాత్రం.. చెన్నై అగ్రస్థానంలో నిలవగా.. పుణె, బెంగళూరు, హైదరాబాద్, ముంబై తర్వాత స్థానాలు పొందాయి. పారిశ్రామిక అవకాశాలు కల్పించే నగరాల్లో మాత్రం బెంగళూరు మొదటి స్థానంలోనూ, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణె తర్వాత స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా మొదటి 25 నగరాల్లో 16 నగరాలు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు చెందినవే ఉండటం విశేషం. ఏపీలో ఒకే ఒక్క నగరం మహిళా స్నేహపూర్వక కెరీర్ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, భద్రత, సాధికారత ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రభాగంలో ఉంది. తమిళనాడుకు చెందిన 8 నగరాలు టాప్–25లో చోటు దక్కించుకున్నాయి. కేరళలో 3, కర్ణాటకలో 2 నగరాలు జాబితాలో ఉండగా.. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం మాత్రమే ఇందులో నిలిచాయి. మిలియన్ ప్లస్ సిటీస్‌లో విశాఖపట్నం 17.92 శాతంతో 25వ స్థానంలో నిలిచింది. 2022–2023లో విశాఖ 37వ ర్యాంకులో ఉండేది. రాష్ట్రంలో మహిళా సాధికారతకు గత ప్రభుత్వం పెద్దపీట వేయడంతో 2023–24కి ఏకంగా 12 స్థానాలు ఎగబాకి విశాఖ టాప్–25లో నిలవడం విశేషం. ఇక సామాజిక పరంగా అవకాశాలు కల్పిస్తున్న జాబితాలో విశాఖ 33వ స్థానంలో నిలవగా.. పారిశ్రామిక అవకాశాలు కల్పిస్తున్న జాబితాలో 20వ ర్యాంక్ సాధించింది.120 నగరాల్లో సర్వే దేశ జీడీపీలో ప్రస్తుతం మహిళల పాత్ర 18 శాతమే ఉన్నా.. భవిష్యత్‌లో మరింత దూసుకుపోయే సత్తా అతివలకు ఉంది. మహిళలు విజయం సాధిస్తే.. భారత్ సాధించినట్టేనని అవతార్ సంస్థ భావిస్తోంది. దేశ జనాభాల్లో 48 శాతం మహిళలు ఉండగా.. ఇందులో 35 శాతం మంది నగరాల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నగరాలు ఎంతమేర పాత్ర పోషిస్తున్నాయనే అంశంపై అవతార్ సర్వే ద్వారా పరిశీలిస్తోంది.మహిళల వృత్తిపరమైన వృద్ధి, శ్రేయస్సు, విద్య, ఆరోగ్య సంరక్షణ, మొదలైన వనరులను పొందే నగరాలను గుర్తించింది. ఉపాధిలో లింగ అంతరాన్ని తగ్గించి, జీడీపీలో మహిళా సమానత్వాన్ని పెంపొందించి, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న నగరాలు ఏవి, మహిళలకు స్థిరమైన, సమ్మిళిత ఉపాధిని కల్పించడంలో నగరాలు, సంస్థలు చేపడుతున్న పాత్రపై అవతార్ సర్వే ఫలితాల్ని వెల్లడించింది. 2022 నుంచి మహిళల జీవనోపాధిపై సర్వే నిర్వహిస్తోంది. తొలి ఏడాది 112 నగరాల్లో చేపట్టగా.. ఈ సారి 120 నగరాల్లో మహిళల స్థితిగతులపై ఆరా తీసింది. ప్రతి పరిణామంలో తమదైన పాత్ర సమాజంలో మార్పులకు మహిళలు అంకురార్పణ చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి పరిణామంలోనూ తమదైన పాత్రను పోషిస్తూ ప్రతిభ చాటుతున్నారు. అవకాశాలు లేవు అని అనుకోవడం కాకుండా.. నగరాలు, పట్టణాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. పురుషులతో సమానంగా చదవడమేకాదు.. పోటీపడి పనిచేస్తున్నారు. ఏయే నగరాలు మహిళా సాధికారతకు ఎంతమేర అవకాశాలు కల్పిస్తున్నాయనే అంశంపై సర్వే చేసి నివేదిక అందించడం వల్ల.. ఆ ర్యాంకింగ్స్ ఆధారంగానైనా ప్రభుత్వాలు, సంస్థల తీరులో మార్పులు వస్తాయనే ఆశతోనే అవతార్ సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామిక రంగంలోనూ ఎదుగుతూ ప్రతి మహిళ పెదవిపై చిరునవ్వుల వెలుగులు విరజిమ్మాలన్నదే మా సంస్థ ముఖ్య లక్ష్యం. ఆ దిశగా.. ఏటికేడూ విభిన్న రంగాల్లో సర్వేలు నిర్వహించనున్నాం. – డాక్టర్ సౌందర్య రాజేష్, అవతార్ వ్యవస్థాపకురాలు -
దేవుడికో నూలుపోగు
‘నా వల్ల ఎక్కడ అవుతుంది’ అనుకుంటే పరిష్కారం, విజయం ఎప్పుడూ కనిపించవు. ‘నా వల్ల ఎందుకు కాదు’ అనే ఆత్మవిశ్వాసం ఏ కొంచెం ఉన్నా పరిష్కారాలు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆలయాల్లో దేవతా మూర్తుల పూజలకు అవసరమైన నూలు పోగులతో తయారైన మాలలు హైదరాబాద్, విజయవాడలాంటి పెద్ద పట్టణాల్లో కూడా దొరకడం లేదనే మాట విన్న రేఖ ఆ లోటును భర్తీ చేసేలా పవిత్ర మాలల తయారీకి పూనుకుంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూజారులు ఒకరోజు సిరిసిల్లకు వచ్చారు. తమిళనాడులో తయారైన ఒక పవిత్ర మాలను శాంపిల్‌గా తీసుకొచ్చి ‘ఇలాంటి మాలలు మాకు కావాలి. తయారు చేసి ఇవ్వగలరా’ అంటూ నేత కార్మిక కుటుంబానికి చెందిన వెల్ది రేఖ, హరిప్రసాద్ దంపతులను అడిగారు ఆ మాలలను పరిశీలించి, తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు రేఖ, హరిప్రసాద్ దంపతులు. నాలుగు వైపులా మేకులు కొట్టి వాటికి నూలు పోగులను చుడుతూ, వేలాది పోగులతో ఒక రూపం వచ్చాక దాన్ని అందమైన దండగా తీర్చిదిద్దాలి. ఈ పని చేయడానికి చాలా సమయం పడుతుంది. శ్రమ కూడా అధికమవుతుంది. పవిత్ర మాలలు హైదరాబాద్, విజయవాడలో ఎక్కడా దొరకడం లేదని, పూజాసామాగ్రి అమ్మే దుకాణాల్లో ఈ పవిత్ర మాలల కొరత ఉందని పూజారులు చెప్పారు. హరిప్రసాద్‌కు సాంచాలు (పవర్‌లూమ్స్) ఉన్నాయి. వాటిపై వినూత్నమైన వస్త్రాలను తయారు చేస్తాడు. అయితే పవిత్ర మాలలను తయారు చేసే బాధ్యతను భార్య రేఖకు అప్పగించాడు. ‘నేను చేయలేనేమో’ అని రేఖ అనుకొని ఉంటే మంచి అవకాశం చేజారి పోయి ఉండేది.కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా ప్రయత్నించడం అంటే... మొదటి నుంచి ఆసక్తి ఉన్న రేఖ ‘నేను తయారు చేయగలను’ అంటూ పనిలోకి దిగింది. నాలుగు వైపులా మేకులు కొట్టడం, దాని చుట్టూరా నూలు పోగులను ఒక్కొక్కటి చుట్టడం కష్టమైన పని కావడంతో తమ దగ్గర ఉండే నూలు బింగిరిలను, సైకిల్ హబ్‌ను, నాలుగు పట్టీలను వెల్డింగ్ చేయించి, చిన్న మోటారు సాయంతో నేరుగా నూలు పోగులు ఆ నాలుగు పట్టీలకు చుట్టుకునే విధంగా ప్రత్యేక మిషన్ ను తయారు చేయించారు రేఖ, హరిప్రసాద్.వినూత్న ఆలోచనతో మిషన్ రూపుదిద్దుకోవడంతో పని సులభమైంది. ధర్మవరం నుంచి హార్ట్ సిల్క్, పట్టు పోగుల నూలు దిగుమతి చేసుకుని ఆ మిషన్ పై దండలను తయారు చేయడం మొదలు పెట్టింది రేఖ. క్రమంగా వీటికి డిమాండ్ పెరగడం మొదలైంది. మాలల తయారీ ద్వారా ఇతర మహిళలకు కూడా ఉపాధి చూపుతోంది రేఖ. ఇప్పుడు రేఖ, ఆమె బృందం తయారు చేస్తున్న పవిత్ర మాలలు సిరిసిల్లకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్... మొదలైన పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘మరింత కష్టపడితే వ్యాపారాన్ని పెద్దస్థాయికి తీసుకువెళ్లవచ్చు అనిపిస్తుంది’ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది రేఖ. ఎన్నో పెద్ద విజయాలు చిన్న విజయాలతోనే మొదలయ్యాయి. రేఖ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మరిన్ని విజయం సాధించాలని ఆశిద్దాం.నూలు పోగులే ఆశాదీపాలై...సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగం ప్రభుత్వ ఆర్డర్లు లేక, రాక సంక్షోభంలో ఉంది. ‘టెక్స్టైల్ పార్క్’లాంటి ఆధునిక మగ్గాల సముదాయం మూతపడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోసం దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రేఖ సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ‘కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే... కొత్త దారి కనిపిస్తుంది’ అనే భరోసాను ఇస్తోంది. ఎక్కడెక్కడి నుంచో పవిత్ర మాలల కోసం సిరిసిల్లకు వస్తున్నారు. ఇక్కడ తయారైన మాలలు ఎక్కడెక్కడికో ఎగుమతి అవుతున్నాయి. ఇది చిన్న విజయమే కావచ్చు. సంక్షోభ సమయంలో స్వయంశక్తిని గుర్తుకు తెచ్చి ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. మన్ కీ బాత్‌లో మా ఆయన గురించికొత్తగా ఆలోచించడం, కష్టపడి పనిచేసే విషయంలో నా భర్త హరిప్రసాద్ నాకు స్ఫూర్తి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, ఉంగరంలో దూరిపోయే పట్టు చీరలను ఆవిష్కరించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. జీ 20 లోగోను మగ్గంపై వస్త్రంపై నేసి ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. చేనేత వస్త్రంపై జీ 20 లోగోను చూసిన ప్రధాని ‘మన్ కీ బాత్’లో హరిప్రసాద్‌ను అభినందించారు. వస్త్రాలపై చిత్రాలను ఆవిష్కరించే నైపుణ్యాన్ని అభినందిస్తూ నన్ను, మా ఆయనను అప్పటి గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్ కు ఆహ్వానించి సన్మానించారు.– వెల్ది రేఖ– వూరడి మల్లికార్జున్సాక్షి, సిరిసిల్లఫోటోలు: వంకాయల శ్రీకాంత్ -
మైక్రోసాఫ్ట్‌ను వీడుతున్న మహిళా ఉద్యోగులు..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో వింత ధోరణి కనిపిస్తోంది. సంస్థను వీడుతున్న ఉద్యోగుల్లో అత్యధికం మహిళలే ఉంటున్నారు. నిష్క్రమిస్తున్న వారిలో లాటిన్స్, నల్ల జాతీయులు ఉండటంతో కంపెనీ శ్రామికశక్తి వైవిధ్యంపై ప్రభావం చూపుతోంది.మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ అండ్ ఇన్‌క్లూషన్ నివేదిక ప్రకారం.. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీని వీడివెళ్లిన ఉద్యోగుల్లో మహిళలు 32.7% మంది ఉన్నారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోల్చితే 31% పెరిగింది. స్వచ్ఛంద నిష్క్రమణలు, తొలగింపులు అన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన ఈ రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేశారు.దెబ్బతింటోన్న వైవిధ్యంఅమెరికాకు సంబంధించిన నిష్క్రమణలలో నల్లజాతి కార్మికులు 10% ఉన్నారు. అంతకుముందు సంవత్సరం ఇది 8.7 శాతంగా ఉండేది. ఇక లాటిన్ అమెరికన్ల నిష్క్రమణలు 8% నుండి 9.8 శాతానికి పెరిగాయి. ఇక పురుషులు, ఆసియన్ ఉద్యోగుల విషయానికి వస్తే ఇది విరుద్ధంగా ఉంది. 2023లో కంటే గతేడాది వీరి నిష్క్రమణలు తక్కువగా నమోదయ్యాయి.ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమలో చాన్నాళ్లకు మారిన పరిస్థితులుప్రత్యర్థి కంపెనీలు అవలంభిస్తున్న పోకడలే ఇందుకు కారణంగా మైక్రోసాఫ్ట్ పేర్కొంటోంది. అలాగే తమ భౌతిక, ఆన్లైన్ రిటైల్ వ్యాపారాలలో మార్పులు కూడా కొంత మేరకు కారణమైన ఉండచ్చొని చెబుతోంది. పెద్దగా ప్రాతినిధ్యం లేని సమూహాల నుండి ఉద్యోగులను నియమించుకోవడాన్ని మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ కొనసాగిస్తోందని, అయితే వారిని నిలుపుకోవడానికి మరింత చేయాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే-రే మెక్‌ఇంటైర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. -
చిల్డ్రన్ కేర్: పనిచోటే లాలిపాట
‘ఎంతైనా తల్లి మనసు’ అనేది మనం తరచుగా వినే మాట. తల్లి ఎక్కడ ఉన్నా మనసు మాత్రం పిల్లలపైనే ఉంటుంది. ఆ పిల్లలు పసి పిల్లలు అయితే? ఆ బాధ తల్లికే తెలుస్తుంది. పసిపిల్లలను ఇంట్లో ఎవరికో ఒకరికి అప్పగించి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు చాలామంది మహిళా ఉద్యోగులకు లేదు. ఈ పరిస్థితుల్లో పసిబిడ్డలను తమతోపాటు తమ పని ప్రదేశానికి తీసుకువస్తారు. అలా అని వారు అక్కడ నిశ్చింతగా... సంతోషంగా ఉంటున్నారా... అంటే అదీ లేదు. ఇలాంటి పరిస్థితిని గమనించిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ అందుకు ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించారు. ‘చైల్డ్ కేర్ సెంటర్’ ద్వారా తల్లీబిడ్డలిద్దరూ సంతోషంగా ఉండే ఏర్పాటు చేశారు.పసిబిడ్డలను తీసుకుని ఉద్యోగ విధులకు హాజరు అవుతున్న మహిళా ఉద్యోగులుపాలివ్వడం నుంచి అన్ని పనులు దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. ఆఫీసులో పిల్లలు ఏడిస్తే తోటి ఉద్యోగులు చిరాకు పడతారు. కొందరైతే ముఖం మీదే ‘పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి రావచ్చుగా’ అని గట్టిగా మాట్లాడతారు. కామారెడ్డి జిల్లాపోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఏఆర్ కానిస్టేబుల్స్ కు తమ వెంట పిల్లలను తీసుకువచ్చి వాళ్ల ఆలనాపాలనా చూసుకుంటూ ఉద్యోగ విధులు నిర్వర్తించడం పెద్ద సవాలుగా మారింది.ఆఫీసులో వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన జిల్లా ఎస్పీ సింధుశర్మ పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. కార్యాలయం మొదటి అంతస్తులో ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ ఏర్పాటు చేయించారు. పిల్లలకుపాలు ఇవ్వడం నుంచి వారిని ఆడించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’లో ఏర్పాటు చేశారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలను సెలవులు ఉన్న రోజుల్లో ఇంటి దగ్గర చూసుకునేవారు ఎవరూ లేక చాలా మంది ఉద్యోగులు వారిని తీసుకొని ఆఫీసుకు వస్తుంటారు. అలాంటి పిల్లలు కూడా ‘చైల్డ్ కేర్ సెంటర్’లో సంతోషంగా గడుపుతున్నారు.ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు గార్డ్ డ్యూటీ ఉంటుంది. షిఫ్టుల వారీగా వారికి బాధ్యతలు కేటాయిస్తారు. అలాంటి సందర్భంలో పిల్లల్ని చూసుకోవడానికి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ఎంతో ఊరట ఇస్తోంది. ‘పిల్లల కంటే ఉద్యోగం ముఖ్యమా? ఉద్యోగం మానేయ్’లాంటి కరుకు మాటలు...‘నువ్వు హాయిగా డ్యూటీకి వెళ్లిపోతే పిల్లాడిని పట్టుకొని నేను నానా చావులు చావాలా!’లాంటి ఈసడింపులు ఇక ముందు వినిపించకపోవచ్చు. ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎన్నో సమస్యలు అడ్డుగోడగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో ‘చైల్డ్ కేర్ సెంటర్’ అనేది తల్లీబిడ్డల కన్నుల్లో సంతోషాన్ని నింపే ఇంద్రధనుస్సు అవుతుంది. నిశ్చింతగా ఉద్యోగం చేసుకోవడానికి అసరమైన ఆసరాను, ధైర్యాన్నీ ఇస్తుంది. – సేపూరి వేణుగోపాలాచారి ,సాక్షి, కామారెడ్డిఅందుకే... చైల్డ్ కేర్ సెంటర్మహిళాపోలీసులు పిల్లలతో డ్యూటీకి వచ్చిన సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను గమనించాను. ఏ కుటుంబంలోనైనా సరే పిల్లలు తల్లిదగ్గరే ఉండగలుగుతారు. తల్లే వారిని చూసుకుంటుంది.పోలీసు శాఖలో సాధారణ కానిస్టేబుల్ళ్లుగా 33 శాతం, ఏఆర్ విభాగంలో 10 శాతం ఉద్యోగాలు మహిళలకు రిజర్వు అవడంతో ఆయా విభాగాల్లో మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య పెరిగింది. ఏఆర్ కానిస్టేబుల్స్ హెడ్ క్వార్టర్లో ఉండి పనిచేస్తుంటారు. వారు గార్డు డ్యూటీతో సహా అన్నిరకాల విధులకు హాజరు కావలసిందే. అలాంటి సందర్భంలో పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందులు ఉండకూడదనే చైల్డ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాను. – సింధుశర్మ, కామారెడ్డి జిల్లా ఎస్పీఇబ్బందులు తీరాయిఏఆర్ విభాగంలో దాదాపు అందరు మహిళా కానిస్టేబుళ్లకు చిన్న చిన్న పిల్లలున్నారు. పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి రాలేని పరిస్థితి ఉంటుంది. వెంట తీసుకుని వస్తాం. అయితే పిల్లలతో డ్యూటీ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉండేది. పిల్లలు ఏడుస్తుండడాన్ని చూసిన ఎస్పీ మేడం పిల్లల కోసం చైల్డ్‌కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. – ఏ.మానస, మహిళా కానిస్టేబుల్, ఏఆర్ విభాగంపిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు...జిల్లాపోలీసు కార్యాలయంలో డ్యూటీ చేసేవారితోపాటు పనుల మీద వచ్చే మహిళా కానిస్టేబుళ్లు తమ వెంట ఉండే చిన్న పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్లో వదిలేస్తే అక్కడ ఆడుకుంటున్నారు. బెడ్‌పై నిద్రపోతున్నారు. తీరిక సమయంలో మేం కూడా వారితో కాసేపు గడపడానికి చైల్డ్‌కేర్ సెంటర్ అనుకూలంగా ఉంది. – వై.భార్గవి, మహిళా కానిస్టేబుల్, దేవునిపల్లి పీఎస్ -
కెరీర్ స్పీడ్‌కు ‘సెలవు’
ఎంచుకున్న వృత్తి, ఉద్యోగంలో పురుషులతో సమానంగా రాణిస్తూ... కంపెనీలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయి. కెరీర్‌ను ఒడిదుడుకులకు గురిచేస్తున్నాయి. వేతనాల విషయంలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని కంపెనీలు ఏకంగా ప్రసూతి సెలవులు పెడతారనే ఉద్దేశంతోనే కీలక పోస్టుల్లో మహిళలను నియమించేందుకు సైతం వెనుకాడుతున్నాయి. వీటితోపాటు ప్రసూతి సెలవులు అనంతరం వృత్తిపరంగా మహిళలు మరికొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్విసెస్ సంస్థ అయాన్ చేపట్టిన ‘వాయిస్ ఆఫ్ ఉమెన్ స్టడీ 2024’ సర్వేలో వెల్లడైంది. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల అనుభవాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోవడం కోసం ఈ సర్వే నిర్వహించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 560కు పైగా కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్న 24,000 మంది మహిళా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. –సాక్షి, అమరావతి వివక్షతో మహిళా భాగస్వామ్యంపై ప్రభావం » పని ప్రదేశాలు, ఉద్యోగ నియామకాల్లో లింగ వివక్ష కారణంగా దేశంలో శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువగా ఉంటోందని గతంలో ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్ 2022 వెల్లడించింది. » ప్రతి మహిళకు ఆమె ఎదుర్కొంటున్న అసమానతల్లో 98 శాతం లింగ వివక్ష, రెండు శాతం విద్యా, పని అనుభవం రూపంలో ఉంటోందని ఆ నివేదికలో తెలిపారు. » మెటెరి్నటీ బెని్ఫట్స్ యాక్ట్–2017 ప్రకారం గర్భం దాల్చిన మహిళా ఉద్యోగులకు 26 వారాల పాటు ప్రసూతి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కారణాలతో నేటికీ కొందరు యాజమానులు మహిళలను ఉద్యోగాల్లో నియమించుకోవడానికి, కీలక స్థానాల్లో ప్రోత్సహించడానికి వెనుకాడుతున్నారు. » వీరికి కీలక పదవులు అప్పగించినట్లయితే ప్రసూతి సెలవులు వంటి అంతరాయాలతో పనిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని యాజమాన్యాలు ఆలోచనలు చేస్తున్నట్లు మహిళా ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. » ఈ కారణాలతో తమను తక్కువ వేతనం, పార్ట్ టైమ్ పాత్రల్లోకి నెట్టివేస్తున్నాయని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయాన్ వాయిస్ ఆఫ్ ఉమెన్ స్టడీ–2024 సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు 75 శాతం ప్రసూతి సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరాక కేరీర్లో ఒకటి, రెండేళ్లు ఒడిదుడుకులు ఉంటున్నాయని వెల్లడించిన పని చేసే తల్లులు 40 శాతం ప్రసూతి సెలవుపై వెళ్లడం వల్ల తమ వేతనం, అంతకుముందు కంపెనీలో పోషించిన పాత్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వెల్లడించినవారు 42 శాతం పనిలో పక్షపాతం ఎదుర్కొంటున్నామని అభిప్రాయపడినవారు53 శాతం నాయకత్వ స్థానాల్లో మహిళలు ఉంటే ఆ సంస్థలోని మహిళా ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపుతుందని, తమ కెరీర్ వృద్ధిపై నమ్మకం పెరుగుతుందని తెలియజేసినవారు90 శాతం కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడం కోసం చాలెంజింగ్ ప్రాజెక్ట్‌లు చేయడానికి అదనపు సమయాన్ని వెచి్చంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినవారు -
Menstrual Leave: ఉద్యోగినులకు నెలసరి సెలవు?
ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే సంస్థలు స్త్రీలను ఉద్యోగాల్లోకి తీసుకోకపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరి మహిళలు ఏమంటున్నారు?సుజన సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఉదయం నుంచి పొత్తి కడుపులో నొప్పి, కూర్చోవడానికి వీలుకానంతగా నడుం నొప్పి. ప్రతి నెలా ఉండే సమస్యే ఇది. ఈ నెల మరీ ఎక్కువగా బాధిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు సెలవు పెట్టడానికి వీలు లేదని ఆఫీసులో ముందే హెచ్చరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధను పంటి బిగువున భరిస్తూనే ఆఫీసుకు బయల్దేరింది.మేరీ ప్రైమరీ స్కూల్ టీచర్. పిల్లలతో కలిసిపోతూ రోజంతా యాక్టివ్‌గా ఉండాలి. నెలసరి సమయం దగ్గర పడుతుందంటేనే లోలోపల భయపడుతూ ఉంటుంది. తీవ్రమైన నొప్పితో పాటు, అధిక రక్తస్రావం సమస్యతో ప్రతీసారీ ఇబ్బందే.కరుణ బట్టల షోరూమ్‌లో పనిచేస్తోంది. రోజంతా షాప్‌లో నిల్చొనే ఉండాలి. సేల్ సీజన్ కావడంతో సెలవులు పెట్టడానికి వీల్లేదని మేనేజర్ ముందే చెప్పారు. సెలవు అడిగితే ఉద్యోగం పోతుందేమో అని భయం. కానీ, నెలసరి సమయంలో విశ్రాంతి లేకుండా పని చేయడం అంటే మరింత అలసట కమ్ముకొచ్చేస్తుంది. నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది. నెలసరి సెలవులు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందా? అసౌకర్యం వేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేయడానికి మొగ్గు చూపుతారా? నెలసరి అవసరం గురించి మహిళలు స్పందన.అవసరం ఉన్నవారికే!దాదాపు తొంభై శాతం మందిలో ఒకేలాంటి సమస్య ఉండదు. కాబట్టి అందరికీ సెలవు అవసరం లేదు. నెలసరి సమయంలోనూ సమస్యలేమీ లేకపోతే సెలవు ఎందుకు తీసుకోవాలి? పైగా పని పట్ల ఇష్టం ఉన్న నాకు లీవ్ తీసుకొని ఇంటి వద్ద ఉండటం బోర్ అనిపిస్తుంది. అందుకే సమస్య ఉన్నవారు, మెడికేషన్‌లో ఉన్నవారు డాక్టర్ ప్రిస్కిప్షన్‌తో లీవ్ తీసుకోవచ్చు. స్కూల్ టైమ్‌లో నెలసరి వస్తే ఇంటికి వెళ్లే వీలు ఉండదు. çస్కూల్లోనే కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాం. సమస్య తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారు లీవ్ తీసుకుంటే సరిపోతుంది. – మృణాళిని, టీచర్ఉపయోగకరమైనదే! మహిళ ఇంటిని, ఆఫీస్ పనినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటోంది. అయితే, పీరియడ్ సమయంలో అందరికీ అన్ని వేళలా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఎవరికైతే అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, మైగ్రెయిన్, వాంతులు... వంటి సమస్యలు ఉంటాయో వారికి విశ్రాంతి అవసరం అవుతుంది. భరించలేనంత నొప్పి ఉన్నప్పుడు ఎలాగూ పని మీద దృష్టి పెట్టలేరు. సమస్య ఉన్నవారికి సెలవు ఇవ్వడం మంచిదే. ఎందుకంటే నెలసరి నొప్పి భరించలేక ఉద్యోగాలు మానేసినవారూ ఉన్నారు. కొందరు ఉద్యోగినులు హెల్త్ చెకప్‌కి లీవ్ దొరకడం లేదని చెబుతుంటారు. అలాంటి వారికి ఈ లీవ్ అవకాశం ఉపయోగపడుతుంది. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్విశ్రాంతి అవసరమే!మహిళలు కూర్చుని చేసే ఉద్యోగాల్లో సాధారణంగా నడుం నొప్పి ఉంటుంది. నెలసరి సమయంలో ఆ తీవ్రత ఇంకాస్త పెరుగుతుంది. కానీ, మాకు కేటాయించిన పనిని మరొకరికి అప్పగించలేం. సెలవు పెడితే పనిభారం పెరుగుతుందని భయం. అదీ సమస్యే. పిరియడ్ లీవ్ తప్పనిసరి చేస్తేæ వర్క్‌లోడ్ పెరగడం, ప్రమోషన్స్‌పై ప్రభావం చూపడం జరగవచ్చు. మా ఆఫీసులో వాష్‌రూమ్‌లలో ΄్యాడ్స్, విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు ఈ తరహా అవకాశాలు ఉపయోగించుకొని, పనులను యధావిధిగా చేస్తుంటాం. పిరియడ్ లీవ్ అనేది అందరికీ అవసరం కాదు. సమస్య ఉన్నవారు యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకోవచ్చు. – ఎస్.కె.బాజి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్– నిర్మలా రెడ్డి -
మాట్లాడే పనుంది ఇంటికిరా..
సాక్షి, అమరావతి/నల్లజర్ల: సచివాలయ మహిళా ఉద్యోగిపై తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం మాజీ ఉప సర్పంచ్, టీడీపీ నేత మైనం చంద్రశేఖర్ బెదిరింపులకు దిగారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ మహిళా ఉద్యోగిని తన ఇంటికి రావాలని చంద్రశేఖర్ ఆదేశించాడు. రాకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మాట్లాడే పని ఉంది ఇంటికి రమ్మనగా.. ఆ ఉద్యోగి ఏదైనా మాట్లాడాలంటే సచివాలయానికి వచ్చి మాట్లాడాలని మర్యాద పూర్వకంగా జవాబిచ్చింది. ‘నాకు సచివాలయానికి వచ్చే పనిలేదు. నువ్వే మా ఇంటికి రావాలి’ అని చంద్రశేఖర్ అనగా.. ‘ఇంటికి ఎలా వస్తామండి’ అని ఆ ఉద్యోగిని సమాధానమిచ్చింది. ‘ఫర్వాలేదమ్మా మీరు గ్రామస్థాయి ఉద్యోగులే కదా.. ఫర్వాలేదు. మీరేం మండల స్థాయి అధికారులు కాదు కదా. మా దగ్గరకురావడానికి నామోïÙగా ఉందా? మాట్లాడే పని ఉందమ్మా’ అని అతడు అన్నాడు. ఏదైనా ఉంటే సచివాలయానికి వచ్చి మాట్లాడాలని ఆమె సూచించగా.. ‘సచివాలయానికి రావాల్సిన పని నాకు లేదు. టీడీపీ నెగ్గిన వెంటనే ఒకసారి చెప్పాను. మా ఊళ్లో ఉద్యోగం చేయాలంటే మా ఇంటికి రావాల్సిందే. నీ ఫోన్లో ఈ విషయాలన్నీ రికార్డింగ్ అవుతాయా? రికార్డు చేసి నువ్వు మీపై అధికారులకు కూడా చెప్పు. మీరేం ఊరికి మొగాళ్లేం కాదు. ఈ ఆడియో ఈ గ్రామంలోని వైఎస్సార్ సీపీ మెయిన్ నాయకులకు, అధికారులకు పంపు’ అంటూ చంద్రశేఖర్ బెదిరింపులకు దిగాడు. -
కేంద్రం గుడ్ న్యూస్ : ఇకపై వారికీ ప్రసూతి సెలవు
కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. సరోగసీ ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పొందవచ్చు. ఈ మేరకు కేంద్రం 50 ఏళ్ల నాటి నిబంధనకు సవరణలు ప్రకటించింది. చైల్డ్ కేర్ లీవ్‌తో అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్, 1972ని సవరించింది.అద్దెగర్భం (సరోగసీ) ద్వారా పిల్లలు పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులు 180 రోజుల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. అలాగే సరోగసీ ద్వారా జన్మించిన పిల్లల విషయంలో,ఇద్దరు కంటే తక్కువ జీవించి ఉన్న పిల్లలను కలిగి ఉన్నపురుష ప్రభుత్వ ఉద్యోగి కూడా బిడ్డ ప్రసవించిన తేదీ నుండి 6 నెలల వ్యవధిలో 15 రోజుల పితృత్వ సెలవు తీసుకోవచ్చు. కాగా సరోగసీ ద్వారా బిడ్డ పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. -
మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO సస్పెండ్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్లు రుజువుకావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్ సింగ్ నాయక్ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి వివరాలను సేకరించారు. తమను డీఎంహెచ్‌వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు. దీంతో లక్ష్మణ్‌సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మహిళా మెడికల్ ఆఫీసర్లను లక్ష్మణ్ సింగ్ వేధిస్తున్నాడని తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. -
హైదరాబాద్‌లో మహిళల ఉపాధి ఎలా ఉందంటే..
మహిళలను వంటిట్లోకే పరిమితం చేసే రోజులుపోయాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదిగేందుకు వారికి సరైన అవకాశాలు కల్పిస్తున్నారు. ఈమేరకు దాదాపు అందరిలోనూ అవగాహన ఏర్పడుతోంది. దేశ జనాభాలో 69.2 కోట్ల మంది మహిళలు కాగా.. అందులో 37 శాతం మంది ఉద్యోగం లేదా ఉపాధి కలిగి ఉన్నారని కెరియర్‌నెట్ అనే టాలెంట్ సొల్యూషన్ల సంస్థ తన నివేదికలో పేర్కొంది. హైదరాబాద్, పుణె, చెన్నై వంటి నగరాలు మహిళా ఉపాధి విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయని తెలిపింది. 25,000 ఉద్యోగ నియామకాలను విశ్లేషించిన తర్వాత ‘ద స్టేట్ ఆఫ్ ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా’ పేరిట నివేదిక రూపొందించారు. నివేదికలోని వివరాల ప్రకారం.. 2022తో పోలిస్తే 2023లో ఉద్యోగ నియామకాల్లో మహిళల ప్రాధాన్యం 2-3% పెరిగింది. ముఖ్యంగా జూనియర్ ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ బోర్డుల్లో ఈ మార్పు కనిపించింది. గతేడాది ఉద్యోగాల్లో చేరిన 40శాతం మంది మహిళలు తాజాగా కళాశాలల నుంచి వచ్చినవారే. 0-3 ఏళ్లు, 3-7 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగాల్లో మహిళల వాటా 20-25% ఉంది. దిల్లీ, ఎన్సీఆర్ మినహా దాదాపు అన్ని నగరాల్లో మహిళా నియామకాల నిష్పత్తి పెరిగింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 34శాతం నియామక రేటు నమోదు కాగా.. పుణెలో 33 శాతం, చెన్నైలో 29 శాతం ఉంది. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో 20 శాతం క్షీణత కనిపించింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో మహిళల నియామకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్(జీసీసీలు), బహుళజాతి కంపెనీ(ఎమ్ఎన్సీ)ల ఆఫ్‌షోర్ యూనిట్లలో ఆ ధోరణి కనిపిస్తోంది. పురుషులు, మహిళల మధ్య వేతన అంతరం 2022లో 30 శాతంగా ఉండగా.. గతేడాది 20 శాతానికి తగ్గింది. ఇదీ చదవండి: పెరిగిన వెజ్ భోజనం ధర.. తగ్గిన నాన్‌వెజ్ ఖరీదు గత రెండేళ్లుగా మధ్య స్థాయి యాజమాన్య హోదాల్లో మహిళల నియామకంలో ఎటువంటి మార్పూ(23%) లేదు. తిరిగి ఉద్యోగాల్లో చేరే సమయంలో మహిళలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత అంకురాల్లో మహిళల ప్రాధాన్యం పెరుగుతోందని నివేదిక ద్వారా తెలిసింది. -
ఫ్యామిలీ పెన్షన్ నామినేషన్ : మహిళా ఉద్యోగులకు భారీ ఊరట
మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ పెన్షన్ కోసం మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు నామినేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన వారికి కుటుంబ పింఛను మంజూరు చేసేందుకు వీలు కల్పిస్తూ 2021 కేంద్ర పౌర సేవల (పెన్షన్) రూల్స్, 2021కి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) సవరణను ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకనటలో తెలిపారు దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు భర్తలను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది. మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబ సభ్యులకు పింఛను అర్హత ఉండేది. -
పింఛనుకు సంతానాన్నీ నామినేట్ చేయొచ్చు
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగుల కుటుంబ పింఛను విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబసభ్యులకు పింఛను అర్హత ఉండేది. -
ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు బంపరాఫర్. భారత్‌లో దేశీయ బ్యాంకుల నుంచి అంతర్జాతీయ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థల వరకు మహిళా ఉద్యోగుల్ని ఆకర్షిస్తూ, వారిని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. భారత్‌లోని హెచ్ఎస్బీసీ సంస్థలో ఆరేళ్లకు మించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా బోనస్‌లు అందిస్తుంది. గర్భిణీ సిబ్బంది క్యాబ్ రైడ్లకు అయ్యే ఖర్చును మోర్గాన్ స్టాన్లీ భరిస్తుంది. సిటీ గ్రూప్ సంస్థ కొత్తగా తల్లైన మహిళ ఉద్యోగుల మెటర్నిటీ లీవులు పూర్తయితే మరో ఏడాది పాటు ఇంటి వద్ద నుంచి పనిచేసేలా వెసలు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక నియామకం వరల్డ్ బ్యాంక్ జెండర్ డేటా పోర్టల్ ప్రకారం, భారత్ ఇప్పటికే పూర్తి వేతనంతో మహిళ ఉద్యోగులకు కనీసం 26 వారాల ప్రసూతి సెలవును తప్పనిసరి చేసింది. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే సదరు బ్యాంకులు మహిళలకు డేకేర్ (0-5 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల సంరక్షణ చూసుకునే బాధ్యత) సౌకర్యాల్ని కల్పించేలా చట్టాల్ని తెచ్చింది.రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ప్రతిభావంతులైన మహిళల్ని ఎంపిక చేసుకోవడం, ఇప్పటికే బ్యాంకుల్లో పనిచేస్తున్న వారి నిర్ధిష్ట అవసరాల్ని హెచ్ఎస్బీసీ తీరుస్తుంది. దీంతో పాటు మహిళా ఉద్యోగుల 0 నుంచి 6 వయస్సున్న పిల్లల సంరక్షణ కోసం నెలావారీ 216 డాలర్లను అందిస్తుంది. మెటర్నిటీ లీవులు పూర్తయితే మోర్గాన్ స్టాన్లీ ముంబై, బెంగుళూరులలో గర్భిణీ ఉద్యోగులు డెలివరీ ముందు చివరి మూడునెలల్లో ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆ కారణంతో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఇండియా హెచ్ఆర్ హెడ్ రజత్ మాథుర్ అన్నారు. కాబట్టే మెటర్నిటీ లీవులు పూర్తయిన మహిళా ఉద్యోగులు తిరిగి సంస్థల్లో పనిచేసేలా కోచింగ్‌తో పాటు శిక్షణ ఇస్తుంది. తండ్రులకు కనీసం 16 వారాల వరకు సెలవులను అందిస్తుంది. భారతీయ చట్టం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పెటర్నిటీ సెలవుల్ని అందిస్తుంది. అయితే ప్రైవేట్ రంగానికి కనీస నిబంధనలు లేవు. అమెరికాలో అంతంతమాతమ్రే ఇక్కడ ఇలా ఉంటే అమెరికాలో మాత్రం నిబంధనలు అందుకు విరుద్దంగా ఉన్నాయి. మహిళ ఉద్యోగులు సెలవుల్లో ఉంటే వారికి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలనే చట్టపరమైన నిబంధనలు లేవు. కాబట్టే జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్లు తల్లదండ్రులిద్దరికి 16 వారాల సెలవును అందిస్తుంది. గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ తల్లిదండ్రులకు 20 వారాల మెటర్నిటీ లీవ్‌ల్ని అందిస్తుంది. -
హీరో మోటోకార్ప్ డిజిటల్ రైడ్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ 2030 నాటికి డిజిటల్ వేదిక ద్వారా 30 శాతం అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా చేసుకుంది. అలాగే మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి చేర్చాలని నిర్ణయించామని హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు. 2022–23 కంపెనీ వార్షిక నివేదికలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘డిజిటల్ వేదికలను పెంపొందించాం. కొనుగోళ్లకు ముందు, తర్వాతి అవసరాలకు ప్రధాన గమ్యస్థానంగా ఈ వేదిక నిలిచింది. సమాచార సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించాం. ఆధునిక అనలిటిక్స్, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగిస్తున్నాం. ఆటోమేషన్ సాంకేతికలను అమలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ఉన్న తయారీ కేంద్రంలో స్థాపించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డిజిటల్ ఫ్యాక్టరీ లైట్‌హౌస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్పాదకతను 20 శాతం పెంచాలని లక్ష్యంగా చేసుకుంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకర వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు. భారత్‌తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 2023–24లో 65 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2022–23లో కంపెనీ 53 లక్షల యూనిట్లను తయారు చేసింది. 54 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది దారి చూపుతాం.. భారత్‌లో మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల డిమాండ్‌లో గ్రామీణ, ఉప నగర మార్కెట్లు సవాళ్లను ఎదుర్కొన్నాయని ముంజాల్ పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాణాత్మక వృద్ధి అంశాలు చెక్కుచెదరకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. ‘దేశంలోని యువ నైపుణ్యం కలిగిన జనాభా, గ్రామీణ, ఉప నగర ప్రాంతాల బలమైన ఆర్థిక వృద్ధి సామర్థ్యం, వినియోగదారులకు రుణాలు సులభంగా అందుబాటులో ఉండడం, లాస్ట్ మైల్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా విజయవంతమైన 2023–24 సంవత్సరానికి హీరో మోటోకార్ప్ దారి చూపుతుందని విశ్వసిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు సవాల్ విసురుతున్నప్పటికీ బ్రాండ్ నిర్మాణం, కొత్త ఉత్పత్తుల విడుదల, నెట్వర్క్ పరిధిని విస్తరించడంలో పెట్టుబడులను కొనసాగించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా కొత్త మార్కెట్లలో మా ఉనికిని నెలకొల్పడానికి, ఇప్పటికే ఉన్న వాటిలో వాటాను పెంచుకోవడానికి, మార్కెట్ అభివృద్ధి ప్రయత్నాలకు కట్టుబడి ఉండటానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రచించాం. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోడళ్లకు మరింత విలువ కేంద్రీకృతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’ అని ముంజాల్ పేర్కొన్నారు. -
‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు!
ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్లో ఉద్యోగులు తొలగింపులు కొనసాగుతున్నాయి. కానీ ప్రముఖ దేశీయ టెక్నాలజీ కంపెనీల్లో పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 తగ్గుముఖం పట్టి, కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్న తరుణంలో ఆయా టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమైన ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు రావాలని పిలుపునిస్తున్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం ‘ఆఫీస్‌కు వచ్చేది లేదు.. అవసరమైతే చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని’ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. India's largest female employer, TCS, is now facing a mass resignation of female employees. As the company, the end of the work-from-home arrangement after 3 years of the pandemic. This will make it difficult for women to balance their work and family responsibilities. — Neha Nagar (@nehanagarr) June 12, 2023 ఇటీవల టెక్ దిగ్గజం టీసీఎస్ రిమోట్ వర్క్‌లో ఉన్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్ పెట్టింది. దీంతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సుముఖంగా లేని ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో) మిలింద్ లక్కడ్ ఇటీవల సంస్థ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా ఇదే అంశాన్ని లేవనెత్తారు. చదవండి👉 జీతం రూ.8కోట్లు..వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నారని జాబ్‌కు రిజైన్ చేశాడు! ఉద్యోగాలకు రాజీనామా ఆఫీస్ నుంచి వర్క్ చేయాలనే సమాచారంతో రిజైన్ చేస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. వారిలో మహిళా ఉద్యోగులే ఎక్కువ. ఎందుకుంటే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి’ అని నొక్కి వక్కాణించారు. గత ఆర్ధిక సంవత్సరంలో మహిళలు, పురుషులతో కలిపి మొత్తం 20 శాతం మంది వర్క్ ఫోర్స్‌ను కోల్పోయినట్లు చెప్పిన ఆయన.. రిటర్న్ టూ ఆఫీస్ కొత్త పాలసీలో భాగంగా ఎంతమంది టీసీఎస్‌కు రిజైన్ చేశారనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కారణం అదేనా? విచిత్రంగా, టీసీఎస్‌లో పురుషుల ఉద్యోగుల కంటే మహిళా ఉద్యోగులే వేరే సంస్థలో చేరే సంఖ్య అధికంగా ఉంది. అందుకు గల కారణాలు ఏంటనేది స్పష్టత లేనప్పటికీ.. కోవిడ్ విజృంభణతో మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుగుణంగా తమ భవిష్యత్‌ను నిర్ధేశించుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆఫీస్‌కు రావాలనే నిబంధనలతో సంస్థను వదిలి వెళ్లుతున్నారేమోనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు లక్కడ్. ఆఫీస్‌కు వస్తే పరిస్థితులు అవే చక్కబడతాయని పేర్కొన్నారు. It's a concerning trend of avoiding work.#Women are often seen shying away from #responsibility and this tendency persists. Nowadays, they prefer the comfort of home over office work.TCS FEMALE EMPLOYEE RESIGN PROTESTING WFH#WomanEmpowerment#WomanLaziness pic.twitter.com/uzTTPiFdfA— NYAY PRAYAAS FOUNDATION (@NyayPrayaas) June 11, 2023 టీసీఎస్ లక్ష్యం ఒక్కటే టీసీఎస్ లక్ష్యం ఒక్కటే సంస్థలో లింగ వివక్ష లేకుండా చూడడం. అందుకే.. పురుషులు, స్త్రీలు ఇలా ఇద్దరిని సమానంగా నియమించుకునేలా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సంస్థలో మొత్తం వర్క్ ఫోర్స్ 6,00,000 మంది ఉన్నారు. వారిలో 35 శాతం మహిళా ఉద్యోగులేనని వెల్లడించారు. 25శాతం మంది ఆఫీస్ నుంచే విధులు ఇక, 20 శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు ఆఫీస్ నుంచే పనిచేస్తున్నారని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ తెలిపారు. భవిష్యత్‌లో 25*25 శాతం వర్క్ మోడల్‌ను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఈ వర్క్ పాలసీలో టీసీఎస్ దేశీ, విదేశీ ఉద్యోగుల్లో 25 శాతం మంది ఆఫీస్ నుంచి పనిచేస్తుంటే.. మరో 25 శాతం మంది ఇంటి నుంచి పనిచేయడమే దీని ముఖ్య ఉద్దేశం. పెరిగిపోతున్న వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫోర్స్ రోజులు గడుస్తున్న కొద్ది కోవిడ్-19 తర్వాత ఆఫీస్‌కు వస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 20 శాతం మంది అంటే సుమారు లక్షమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి చెప్పి రిటర్న్ టూ ఆఫీస్‌కు మొగ్గుచూపుతున్నారు. అదే సమయంలో సిబ్బంది అందించే ఇతర ప్రోత్సహకాలు 5శాతం పెరిగినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఐటీ ఉద్యోగులు:పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్! ఆఫీస్‌కు రాలేం! -
టీసీఎస్‌లో పెరిగిన మహిళా ఉద్యోగుల వలసలు
ముంబై: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌లో మహిళల అట్రిషన్ రేటు (వలసలు/కంపెనీని వీడడం) పురుషులతో సమాన స్థాయికి పెరిగింది. ఈ విషయాన్ని కంపెనీ మానవ వనరుల ముఖ్య అధికారి మిలింద్ లక్కడ్ వెల్లడించారు. చారిత్రకంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఉద్యోగుల అట్రిషన్ రేటు తక్కువగా ఉండేదంటూ, ప్రస్తుత పరిస్థితిని అసాధారణంగా పేర్కొన్నారు. ఇంటి నుంచి పనిచేసే విధానానికి ముగింపు పలకడం ఇందుకు కారణం కావొచ్చన్నారు. టీసీఎస్ మొత్తం ఉద్యోగుల్లో 35 శాతం (6 లక్షల మందికి పైగా) మహిళలే కావడం గమనార్హం. ‘‘కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కారణంగా కొంత మంది మహిళలకు ఇంటి ఏర్పాట్ల విషయంలో మార్పులకు దారితీసి ఉండొచ్చు. ఇదే వారిని తిరిగి కార్యాలయాలకు రానీయకుండా చేయవచ్చు’’అని మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో అభిప్రాయపడ్డారు. లింగ వైవిధ్యం కోసం కృషి చేస్తున్న కంపెనీకి పెరిగిన మహిళల అట్రిషన్ రేటు ప్రతికూలమన్నారు. దీన్ని తగ్గించడంపై కంపెనీ దృష్టి పెడుతుందన్నారు. మార్చి నాటికి టీసీఎస్‌లో మొత్తం మీద అట్రిషన్ రేటు 20 శాతం స్థాయిలో ఉండడం గమనార్హం. రాజేజ్ గోపీనాథన్‌కు రూ.29 కోట్లు టీసీఎస్ సంస్థ 2022–23 సంవత్సరానికి గాను సీఈవో స్థానంలో ఉన్న రాజేష్ గోపీనాథన్‌కు రూ.29.16 కోట్ల పారితోషికాన్ని చెల్లించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 13.17 శాతం ఎక్కువ. ఆరేళ్లుగా టీసీఎస్‌ను నడిపించిన గోపీనాథన్ ఇటీవలే సీఈవోగా వైదొలగగా కే.కృతివాసన్ ఈ బాధ్యతల్లోకి రావడం తెలిసిందే. కొత్త సీఈవో కృతివాసన్‌కు ప్రతి నెలా రూ.10 లక్షలు బేసిక్ వేతనంగా కంపెనీ చెల్లించనుంది. ఇది రూ.16 లక్షల వరకు పెరుగుతూ వెళుతుంది. బోర్డు నిర్ణయించిన మేరకు కమీషన్, అద్దెలేని నివాస వసతి తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ఇక కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియమ్ గత ఆర్థిక సంవత్సరానికి రూ.23.60 కోట్ల పారితోషికాన్ని (13.58 శాతం అధికం) పొందారు. -
మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్‌ను పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని నిబంధన ఉంది. దీనిని సవరించి.. మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యను సీఎం దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన టీచర్ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి అలాగే ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరగా.. దీనిపైనా సానుకూలంగా స్పందించిన సీఎం ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తాము కోరిన వెంటనే సీఎం జగన్ మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే?
బెంగళూరు: పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు. కొత్త పథకంలో భాగంగా విద్యార్థుల కోసం మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చెప్పారు. ఒక్కో తాలుకాలో కనీసం ఐదు బస్సులు నడిచేలా చూస్తామన్నారు. అవసరమైతే దీని కోసం అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్య పాత్ర పోషిస్తుందని బొమ్మై చెప్పారు. అందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత పాసులు ఇస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పినట్లు గుర్తుచేశారు. చదవండి: మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. స్నూపింగ్ కేసు విచారణకు కేంద్రం ఆమోదం.. -
జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు
గాంగ్టాక్: సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు రూ.10 వేలను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్లు, ఆపైన వయస్సుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతలను అప్పగిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డకైతే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జననాల రేటు చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లులవ్వాలనుకునే ఉద్యోగినులు పుట్టబోయే తమ సంతానం బాగోగుల గురించి ఆందోళన చెందరాదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జననాల రేటు పెంచేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా ప్రోత్సహకాలు ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారి కోసం ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స తీసుకునే వారికి రూ. 3 లక్షలు గ్రాంటుగా అందజేస్తామన్నారు. సిక్కింలోని 7 లక్షల లోపు జనాభాలో 80 శాతం మంది స్థానిక తెగల ప్రజలే. సంతానోత్పత్తి రేటు 1.1%గా ఉంది. -
మహిళలకు బంపరాఫర్.. పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ కంపెనీలు!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలు మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాయి. కాగ్నిజంట్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, కేపీఎంజీ, యాక్సిస్ బ్యాంకు, ష్నీడర్ ఎలక్ట్రిక్, సిప్లా, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ తదితర ఎన్నో సంస్థలు తమ ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల నిష్పత్తి మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండగా, మరింత పెంచాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చర్యలను కొన్ని సంస్థలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. సౌకర్యవంతంగా పనిచేసే ఏర్పాట్లు చేయడం, ట్రైనీలుగా, ఫ్రెషర్లుగా క్యాంపస్‌ల నుంచి తీసుకోవడం, సీనియర్ స్థాయిలో మార్గదర్శకులుగా నియమించుకోవడం, టీమ్ లీడ్ బాధ్యతల్లోకి మహిళలను తీసుకోవడం వంటివి సంస్థలు అమలు చేస్తున్నాయి. సెకండర్ కెరీర్ (విరామం తర్వాత మళ్లీ చేరడం) మహిలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నాయి. మంచి ఐడియాలకు నాంది ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల పరంగా మంచి వైవిధ్యం ఉంటే మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని ఎల్అండ్టీ కార్పొరేట్ హ్యుమన్ రీసెర్సెస్ హెడ్ సి.జయకుమార్ తెలిపారు. వైవిధ్యంతో కూడిన బృందం ఇతరులతో పోలిస్తే ఎంత మెరుగైన ఫలితాలు ఇస్తుందనే దానిపై అధ్యయనాలు కూడా ఉన్నట్టు చెప్పారు. మంచి నైపుణ్యాలు కలిగిన మహిళా ఉద్యోగులను తాము కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు పేర్కొన్నారు. మహిళలను ఆకర్షించేందుకు పనిలో సౌకర్యంపై దృష్టి పెట్టాలని చాలా కంపెనీల అభిప్రాయపడుతున్నాయి. ఐటీసీ అయితే మహిళా ఉద్యోగుల విధుల నిర్వహణలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. చంటి పిల్లలు ఉన్న ఉద్యోగినులకు సంరక్షకుల సేవలు, ప్రత్యేక రవాణా వసతులను సైతం సమకూరుస్తోంది. యాక్సిస్ బ్యాంకు అయితే ప్రత్యామ్నాయ పని నమూనాలతో నైపుణ్యాలు కలిగిన మహిళలను ఆకర్షిస్తోంది. ‘గిగ్–ఏ’ అవకాశాల పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం కింద 44 శాతం అధికంగా మహిళలను నియమించుకున్నట్టు బ్యాంక్ హెచ్ హెడ్ రాజ్‌కమల్ వెంపటి తెలిపారు. పోటీతత్వం.. ఎల్అండ్టీ మహిళల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోంది. ఎవరైనా వేరే పట్టణానికి బదిలీ చేయాలని కోరితే, సాధ్యమైన మేర వారు కోరిన ప్రాంతంలో సర్దుబాటుకు ప్రయత్నిస్తోంది. వైవిధ్యమైన మానవ వనరులతో పోటీతత్వం పెరుగుతుందని ఐటీసీ కార్పొరేట్ హ్యూమన్ రీసోర్సెస్ హెడ్ అమితవ్ ముఖర్జి పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో లింగ నిష్పత్తి ప్రస్తుతం 23.3 శాతంగా ఉంది. అంటే ప్రతి 100 మందికి గాను 23 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వైవిధ్యాన్ని పెంచడం కోసం గత కొన్ని త్రైమాసికాలుగా బ్యాంక్ తీసుకుంటున్న చర్యలతో ఇది పెరుగుతూ వస్తోంది. ఇందుకోసం ఓ నిర్మాణాత్మక విధానాన్ని అనుసరిస్తోంది. క్యాంపస్ నియామకాలకు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని, సెకండ్ కెరీర్ మహిళల విషయంలోనూ కంపెనీలు చూపిస్తుండడం సానుకూలం. అధిక నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్న మహిళలు తిరిగి చేరేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆహ్వానం పలుకుతోంది. ఇందుకు రెండు విధానాలను అనుసరిస్తోంది. పిల్లల కోసం కెరీర్ బ్రేక్ తీసుకున్న వారిని తిరిగి నియమించుకోవడం, గత ఐదేళ్లలో సంస్థను వీడిని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం చేస్తోంది. ఉన్న మహిళా ఉద్యోగులను కాపాడుకోవడం, కొత్త వారికి అవకాశాలు ఇవ్వడాన్ని కాగ్నిజంట్ అనుసరిస్తోంది. 2020 నుంచి డైరెక్టర్, ఆ పై స్థాయి వారికి ఇందుకోసం ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. చదవండి👉 ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి! -
ఇండియాలో కంపెనీ పేరుతో దారుణం.. మహిళా ఉద్యోగుల ఇంటికి వెళ్లి..
తిరువళ్లూరు: కార్లకు కీ తయారు చేసే కంపెనీలో మహిళ ఉద్యోగినులపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కంపెనీ డైరెక్టర్ కియాంగ్ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ తొడుగాడులో కార్లకు కీ తయారు చేసే పరిశ్రమ ఉంది. కాగా, ఈ కంపెనీలో 300 మంది పని చేస్తున్నారు. కంపెనీ డైరెక్టర్‌గా దక్షణ కొరియాకు చెందిన కియాంగ్ జూ లీ, హెచ్ఆర్గా రాము పని చేస్తున్నారు. కంపెనీలో పనిచేసే యువతులకు డైరెక్టర్ కియాంగ్ జూ లీ, హెచ్ఆర్ రాము సాయంతో తరచూ లైగింక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై బాధిత యువతులు మప్పేడు పోలీసులకు, మేనేజ్మెంట్కు గతంలో ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీకుదిర్చినట్లు తెలిసింది. దీంతో కక్ష్యకట్టిన డైరెక్టర్ లీ, తనపై ఫిర్యాదు చేసిన వారిలో కొందరిని ఉద్యోగం నుంచి తొలగించాడు. మరికొందరిని అక్కడి నుంచి వేరే బ్రాంచీకి బదిలీ చేసినట్లు తెలిసింది. పోలీసుల హెచ్చరికతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న లీ, ఇటీవల వేధింపుల పర్వానికి తెరతీశాడు. కంపెనీలో పనిచేసే యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నేరుగా యువతులు నివాసం ఉండే రూమ్‌లకు వెళ్లి వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో వేధింపులు తాళలేక బాధిత యవతులు స్థానిక పోలీసులు, పంచాయతీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఫిర్యాదులు చేశారు. తమపై లైగింక వేధింపులకు గురిచేస్తున్న కియాంగ్ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆడియో వైరల్ కంపెనీలో పనిచేసే 27 ఏళ్ల యువతిపై రెండు నెలల నుంచి లీ వేధింపుల ఎక్కువైనట్లు తెలిసింది. యువతి నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లిన లీ తనతో సహాజీవనం చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగం నుంచి బయటకు పంపుతానని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లీ బెదిరింపులపై యువతి కంపెనీ యాజమాన్యానికి ఫోన్ ద్వారా చేసిన ఫిర్యాదు ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. “నాకు త్వరలోనే వివాహం కానుంది. ఈ సమయంలో లీ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంటికి వచ్చి మరీ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని’ యువతి యాజమాన్యంతో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. -
స్ఫూర్తి..: జీవనాడిని విస్తరించింది.. రూ.60 లక్షల వ్యాపారం
పచ్చని ఆకులో భోజనం మన సంప్రదాయం అదే మన ఆరోగ్య రహస్యం. ఆ జీవనాడిని పట్టుకొని అదే వ్యాపారంగా మార్చుకున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వాసి మాధవి విప్పులంచ. బాధించిన క్యాన్సర్ నుంచి కోలుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మరలి పచ్చని విస్తరాకు ప్లేట్లను రాష్ట్రంతోపాటు ఇతర దేశాలకూ సరఫరా చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన విప్పులంచ మాధవి బీఫార్మసీ చేసి, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మోదుగ, అడ్డాకులతో ప్లేట్లు తయారు చేస్తూ, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, యేటా రూ.60 లక్షలు సంపాదిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రి టూరిజాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న మాధవిని ఆమె పర్యావరణ ప్రయాణం గురించి అడిగితే ఎన్నో విశేషాలను వివరించింది. ‘‘పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామం. అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న చింతల బలరాం కళాశాల ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. అమ్మ సరోజిని రిటైర్డ్ ఫార్మసిస్ట్. నేను డిగ్రీవరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. ఆ తర్వాత అమ్మ సలహా తో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ పూర్తి చేశాను. చదువుకునే సమయంలోనే పెళ్లైంది. ఇద్దరు కొడుకులు. నా చదువు పూర్తయిన తర్వాత నా భర్త వేణుగోపాల్‌తో కలిసి ఉద్యోగరీత్యా పూణె వెళ్లాను. అక్కడ పూణె హాస్పిటల్లో ఫార్మసిస్ట్‌గా మూడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేసి, 2007లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాం. స్కూల్‌తో మొదలు కొన్ని రోజుల్లోనే ప్రైమరీ పాఠశాలను ప్రారంభించాను. సాయంత్రం వేళల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశాను. వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో సేంద్రియ సేద్యం వైపు దృష్టి పెట్టాను. అంతా సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో కొద్దిరోజుల తేడాతో నాన్న, అక్క మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. క్యాన్సర్ నుంచి కోలుకుని.. వారి మరణం బాధ నుంచి కోలుకోక ముందే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను. అయినా భయపడకుండా ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. ఆ సమయంలో యోగా శిక్షణ నన్ను మరింత బలంగా చేసింది. ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్‌ను జయించాను. ఆ సమయంలోనే కూరగాయలు, పంటల సాగులో రసాయనాల వాడకం, కలుషితమైన వాతావరణమే నా వ్యాధికి కారణమని గ్రహించాను. నాలాగే చాలామంది ఇలాంటి సమస్యలకు లోనవుతుంటారని కూడా తెలుసుకున్నాను. అప్పుడే ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నంతలో మంచి ఆహార పంటల ఉత్పత్తులను సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నా భర్త సహకారంతో 2017లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అందులో 20 వేల వరకు మామిడి, జామ, అరటి, బత్తాయి, సపోట తోటలు పెట్టాం. ఇతర కూరగాయలు పంటలను çపండించడం మొదలుపెట్టాం. సేంద్రియ ఎరువు తయారీకి 15 ఆవులను పెంచుతున్నాం. వాటి మూత్రం, పేడతో జీవామృతం తయారుచేసి మొక్కలకు అందిస్తున్నాం. పచ్చని విస్తరాకులు పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసినప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. నా చిన్నతనంలో ఆకులతో కుట్టిన విస్తరాకుల్లోనే భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. మన సంస్కృతిలో భాగమైన విస్తరాకుల తయారీని ముందు చేత్తోనే చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీనినే 2019లో ‘ఆర్గానిక్ లీఫ్ టేబుల్’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ విస్తరాకు ల విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ సైతం ఏర్పాటు చేశాను. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ నిత్యం పోస్టులు చేయడం ద్వారా కొనుగోలుదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి జర్మనీ, హాంకాంగ్, అమెరికా దేశాలకు సైతం మా విస్తరాకులు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీకి కావాల్సిన అడ్డాకులను ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మోదుగ ఆకులు మన నేలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆకుల సేకరణ కష్టంగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తూనే రోజూ 10 వేల వరకు విస్తరాకులను తయారు చేస్తున్నాం. దాదాపు 20 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాను. ప్రతి యేడు రూ.60 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మేం పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుని వచ్చినవారికి మా స్థలంలో ఒక పిక్నిక్ స్పాట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చినవాళ్లకు రెండు మూడు రోజులపాటు వసతి సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్రి టూరిజం చేయాలనేదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను’ అని వివరించారు మాధవి. పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసి నప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: కె.సతీశ్‌కుమార్ -
మహిళా ఉద్యోగులకు తాలిబన్ల షాక్! ఆఫీస్‌కు మగాళ్లను పంపాలని ఆదేశం
కాబూల్: అధికారం చేపట్టినప్పటి నుంచి క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వార్తల్లో నిలుస్తోంది అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్లను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ మహిళా ఉద్యోగి వెల్లడించారు. 'తాలిబన్ అధికారుల నుంచి నాకు కాల్ వచ్చింది. ఆఫీస్‌లో పని భారం పెరుగుతోంది. మీరు చేయలేరు. మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపాలి అని చెప్పారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా పదవిని తగ్గించారు. 60 వేలు ఉన్న నా జీతాన్ని 12 వేలు చేశారు. ఇదేంటని మా పై అధికారిని అడిగితే దరుసుగా ప్రవర్తించారు. ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోమన్నారు. ఈ విషయంపై చర్చించవద్దన్నారు. జీతం తగ్గాక నా పిల్లాడికి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్థితి వచ్చింది. 15 ఏళ్లుగా నేను ఆర్థిక శాఖలో పని చేస్తున్నా. బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ కూడా చేశా' అని మహిళా ఉద్యోగి తెలిపారు. గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి మహిళల హక్కుల్ని కాలరాస్తున్నారు తాలిబన్లు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాలిబన్ల తీరును అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రంగా తప్పుబట్టింది. మహిళలపై ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం) నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బాహౌస్ మే నెలలోనే అంచనా వేశారు. అఫ్గాన్ పేదరికంలోకి వెళ్లిందని, ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: డెలివరీ బాయ్ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు -
యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న యోగి సర్కార్ తాజాగా మహిళలకు శుభవార్త చెప్పింది. వివరాల ప్రకారం.. యూపీలో మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్ షిప్ట్‌లు వేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయవద్దని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను కోరింది. ఈ క్రమంలోనే ఒకవేళ సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేసే మహిళా ఉద్యోగులకు ఆఫీసు యాజమాన్యం ఉచిత రవాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కంపెనీలు, ఆఫీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. అంతేకాకుండా.. ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు.. అవసరమైన సేవలు మినహా అన్ని విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలలో ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచార ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు. అలాగే, ఆఫీసుల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, త్రాగునీటి సౌకర్యాలతో పాటు పని చేసే ప్రదేశంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా.. వారు తమ కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: పోలీస్స్టేషన్ల సీసీటీవీల్లో ఆడియో ఫుటేజీ తప్పనిసరి -
మహీంద్రా సంచలన నిర్ణయం.. ఆటోమొబైల్ సెక్టార్లో తొలిసారిగా..
సంప్రదాయేతర రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టార్లో అతివల ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇప్పటికే ఓలా స్కూటర్ల తయారీలో మహిళల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా మహీంద్రా గ్రూపు సేల్స్ విభాగంలో మహిళలకు ప్రోత్సహిస్తోంది. మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో ఇటీవల నేషనల్ క్యాపిటర్ రీజియన్ ఢిల్లీలో కొత్తగా వాహనాల అమ్మకం షోరూం ఏర్పాటు చేశారు. అయితే గతానికి భిన్నంగా స్వీపర్ మొదలు మేనేజర్ వరకు ప్రతీ ఒక్క పోస్టులో మహిళలనే నియమించారు. దేశంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తొలిసారిగా మొత్తం మహిళా సిబ్బందితో నడుస్తున్న షోరూమ్‌గా ఇది నిలిచింది. ఈ విషయాన్ని ఆ గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పంచుకున్నారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా మొత్తం సమాజమే అభివృద్ధి బాట పడుతుందంటూ మహీంద్రా రైజ్ స్లోగన్‌ను జత చేశారు. Thank you @KonceptautoLN for giving me the required dose of #MondayMotivation ! https://t.co/pWoAyffj2n — anand mahindra (@anandmahindra) May 16, 2022 చదవండి: మహీంద్రా ఆన్ ది మూవ్ -
గడగడలాడిస్తున్న మహిళా ఉద్యోగులు! దిగ్గజ కంపెనీల్లో రాజీనామాల సునామీ!
ముంబై: మహిళల్లో చెప్పుకోతగ్గ మంది వచ్చే రెండేళ్ల కాలంలో ఉద్యోగాలను మానేయాలని అనుకుంటున్నారు. పనిలో అలసిపోవడం, పని వేళలు అనుకూలంగా లేకపోవడం వారిని ఈ నిర్ణయం దిశగా నడిపిస్తున్నట్టు డెలాయిట్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. కరోనా విపత్తు సమయంలో పెద్దఎత్తున ఉద్యోగాలు వీడిపోవడం (గ్రేజ్ రిజిగ్నేషన్) మహిళా ఉద్యోగుల్లో ఇంకా కొనసాగుతున్నట్టుందని డెలాయిట్ సర్వే నివేదిక ‘ఉమెన్స్ ఎట్ వర్క్ 2022’ తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే తాము ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల స్థాయి పెరిగిపోయినట్టు 56 శాతం ఉద్యోగినులు తెలిపారు. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల పరిధిలో నిర్వహించిన ఈ సర్వేలో 5,000 మంది మహిళలు పాల్గొన్నారు. పని ఒత్తిడితో అసలిపోవడమే మహిళలు ఉద్యోగాలను వదిలేద్దామనుకోవడానికి ప్రధాన కారణంగా ఉంది. 40 మంది ఇదే కారణంతో కొత్త సంస్థకు మారిపోదామని చూస్తున్నారు. సర్వేలో సగం మంది వచ్చే రెండేళ్లలో ప్రస్తుత సంస్థను విడిచిపెడతామని చెప్పారు. ప్రస్తుత సంస్థతో మరో ఐదేళ్లకు పైగా కొనసాగుతామని చెప్పిన వారు కేవలం 9 శాతంగానే ఉన్నారు. కలుపుకుని పోవడం లేదు.. పని ప్రదేశాల్లో తమను కలుపుకుని పోవడం లేదన్నది మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల్లో ప్రముఖంగా ఉంది. కొద్ది మంది అంటే 24 శాతం మంది ఈ విషయాన్ని పనిచేసే సంస్థల దృష్టికి తీసుకెళ్లారు. 12 నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తమ కెరీలో వృద్ధి అవకాశాల పట్ల ఏమంత ఆశావహంగా లేమని ఎక్కువ మంది చెప్పారు. హైబ్రిడ్ విధానంలో పనిచేసే వారు (ఇంటి నుంచి, కార్యాలయం నుంచి) ముఖ్యమైన సమావేశాలకు తమను పిలవడం లేదని భావిస్తున్నారు. చదవండి👉వందల మంది ఉద్యోగుల రాజీనామా..దెబ్బకి దిగొచ్చిన కంపెనీ.. వారానికి 4 రోజులే పని! -
ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’
గచ్చిబౌలి: ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం లాల్గాడి మలక్‌పేట్‌లోని జినోమ్ వ్యాలీ, ఫార్మా లైఫ్ సైన్సెస్ నుంచి అల్వాల్ వరకు ఎస్సీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చిన 3వ షీ షటిల్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే భద్రత వ్యవస్థలో మహిళా ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం అల్వాల్ నుంచి లాల్‌గడీ మలక్‌పేట్, తుర్కపల్లి నుంచి జనోమ్ వ్యాలీ వరకు నడుస్తుందన్నారు. ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ... ఐటీ, ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఇప్పటి వరకు 12 షీ షటిల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
తీరొక్క పూల పండుగ.. బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: ఆనందోత్సాహాల నడుమ రంగు రంగుల పూలతో మహిళలంతా కలిపి జరుపుకునే పండుగ బతుకమ్మ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగులకు ఆదివారం ఆమె చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బతుకమ్మ జరుపుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన రకరకాల పూలను వాడుతారని చెప్పారు. నిమజ్జనం తర్వాత ఈ పూలలో ఉన్న ఔషధ గుణాల కారణంగా చెరువుల్లో, నదుల్లోని నీరు స్వచ్ఛంగా మారుతుందన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. బతుకమ్మ పండుగ సమయంలో గత రెండేళ్లు రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగులకు గవర్నర్ చీరెలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. -
హెచ్‌పీసీఎల్ జాబిలమ్మలు...
ఏదీ తనంతట తాను దరిచేరదు, ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు అక్షర సత్యమని నిరూపించారీ యువతులు. పెట్రోల్ ఉత్పత్తి కర్మాగారంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నారీ మహిళలు. సంస్థ పురోగతిలో మేము సైతం అని ముందడుగు వేశారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) సంస్థ ఉద్యోగినులు. హెచ్‌పిసిఎల్ సంస్థ పనివేళలు... ఉదయం 8 నుంచి 4.30 గంటల వరకు జనరల్ షిఫ్ట్, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు సాయంత్రం షిఫ్ట్, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అర్ధరాత్రి షిఫ్ట్లుంటాయి. మోటార్ స్పిరిట్ (పెట్రోల్)ను తయారు చేసే విభాగంలో ఇంజనీరింగ్ చదివి సుశిక్షితులైన 15 మంది విధులను నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూమ్ విభాగంలో క్షణక్షణం అప్రమత్తులై కన్నార్పకుండా పరిశీలించడంతోపాటు, అత్యవసర సమయాలలో ప్లాంట్‌లో సమస్యలను గుర్తించడం, వాటిని సరిచేయడం, సరఫరా వ్యవస్థను నిరాఘాటంగా నడపడం వీరి విధులు. ప్రతి షిఫ్ట్‌లో ముగ్గురు మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి రొటీన్ సజావుగా సాగుతోంది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ మహిళలకు రాత్రి విధులు అప్పగించడానికి ముందు... వారి భద్రత గురించి చాలా కసరత్తు జరిగింది. సాయంత్ర షిఫ్ట్, అర్ధరాత్రి షిఫ్ట్‌కు హాజరయ్యే మహిళలకు క్యాబ్ సదుపాయంతోపాటు సెక్యూరిటీ గార్డులుగా కూడా మహిళలనే నియమించారు. నైట్ షిఫ్ట్ ఉద్యోగినులకు మార్షల్ ఆర్ట్స్(ఆత్మరక్షణ)లో ప్రాథమిక తర్ఫీదు ఇచ్చారు. మహిళలు డ్యూటీకి రావడానికి ఇంటి నుంచి బయలు దేరిన సమయం నుంచి హిందుస్థాన్ పెట్రోలియం ప్లాంట్‌కు చేరే వరకు, విధులు ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునే వరకు వారు ప్రయాణించే వాహనం గమనాన్ని పరిశీలించే జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ క్షణంలో స్పందించాలి పరిశ్రమలో పనిచేయడం ఎంతో సంక్లిష్టమైన విషయం. ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించాలి. ఆ క్షణంలో మేము తీసుకున్న నిర్ణయంతోపాటు అమలు చేసే విధానం కూడా వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఆపరేషన్స్ విభాగంలో పనిచేయడం ఎంతో అవసరం. ఇది మా ప్రగతికి దోహదం చేస్తుంది. – ఎం. నవ్య, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఐఐటి, ఖర్గపూర్ పూర్వ విద్యార్థి ఇది మంచి ప్రయత్నం గతంలో సేల్స్‌లో విధులు నిర్వర్తించాను. ఫిబ్రవరిలో ఎంఎస్ బ్లాక్ విధుల్లోకి వచ్చాను. మహిళలు నైట్‌షిఫ్ట్‌లలో పనిచేస్తున్న విషయం ఇంట్లో చెప్పి వారిని ఒప్పించాను. సాహసోపేతమైన నిర్ణయంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది. – వై. చందన, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఎన్ఐటి వరంగల్ పూర్వ విద్యార్థి సవాళ్ల ఉద్యోగం మేము ఎంచుకున్న రంగం ఎన్నో సవాళ్లతో కూడినదనే విషయం మాకు విద్యార్థిగా ఉన్నపుడే అర్థమైంది. మానసికంగా ముందుగానే సన్నద్ధం అయి ఉండడంతో విధి నిర్వహణ మాకు పెద్దగా కష్టం అనిపించలేదు. ప్లాంట్‌లో సమస్య రావడం, గ్యాస్ లీకవడం వంటివి జరుగుతుంటాయి. వీటిని డిటెక్టర్లతో వెంటనే గుర్తించి ప్రమాదాలను నివారించడం పెద్ద సవాలే. కానీ టాస్క్ మొత్తాన్ని మా చేతులతో పూర్తి చేసిన తర్వాత కలిగే సంతోషం కూడా అంతే పెద్దది. – ఆర్. సత్య శిరీష, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని సంస్థ నిర్ణయం ధైర్యాన్నిచ్చింది నైట్ షిఫ్ట్ కోసం మా సంస్థ ఏర్పరచిన ప్రత్యేక రక్షణ సదుపాయాలు బాగున్నాయి. కంట్రోల్ రూమ్‌లో ప్లాంట్ పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ సిస్టమ్‌ను నిర్వహించడంలో అందరం మహిళలం అయిన కారణంగా ఎటువంటి సమస్యలూ ఎదురవలేదు. విధినిర్వహణలో ఆపరేటర్లను, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేయడం, తగిన సూచనలు అందించడం మా విధి. కొన్ని సందర్భాలలో అత్యవసరంగా షట్ డౌన్ చేయాల్సి వస్తుంది కూడా. కీలకమైన విధులను కూడా విజయవంతంగా చేయగలుగుతున్నామనే తృప్తి ఉంది. – సిప్రా ప్రియదర్శిని, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఎన్ఐటి రూర్కెలా పూర్వ విద్యార్థిని నైట్ షిఫ్టే బెటర్ నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహించడం వలన పగలు తగినంత అదనపు సమయం లభిస్తోంది. వ్యక్తిగత పనులు చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంది. జనరల్ షిఫ్ట్ కంటే నైట్ షిఫ్టే బాగుంది. – శిఖ, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, జాదాపూర్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని రోజుకో కొత్త పాఠం ఇక్కడికి ప్యానల్ ఆఫీసర్ గా వచ్చాను. నైట్ షిఫ్ట్ కొత్తలో కొంత సవాలుగా అనిపించింది. మెల్లగా అలవాటైంది. మా ఉద్యోగం ఎలాంటిదంటే... విధి నిర్వహణలో ప్రతి రోజూ ఒక కొత్త సవాల్ ఎదురవుతుంటుంది. ఒక్కో అనుభవం నుంచి ఒక్కో పాఠం నేర్చుకుంటాం. – సింఘ్ ఇషిత్ రాజ్, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఐఐటి, ముంబయి పూర్వ విద్యార్థిని స్ఫూర్తిదాయకం.... విధుల్లో చేరిన నాటి నుంచి ఈ మహిళల నిబద్ధత, పనిలో చూపుతున్న ప్రగతి స్ఫూర్తిదాయకంగా ఉంది. చక్కగా సమన్వయం చేసుకుంటూ విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. మా నమ్మకాన్ని రెట్టింపు చేసారు. మేము ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం. భవిష్యత్తులో రిఫైనరీలో మరింత ఎక్కువమంది మహిళలు పనిచేయడానికి అవకాశాలు కల్పిస్తాం. – వి.రతన్ రాజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెచ్‌పిసిఎల్, విశాఖ రిఫైనరీ – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
Afghanistan: మహిళా సిబ్బంది ఇళ్ల వద్దే ఉండాలి
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు మునుపటి నిరంకుశ విధానాలను ఒక్కటొక్కటిగా తెరపైకి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు.. తాజాగా రాజధాని కాబూల్ పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక మేయర్ హమ్దుల్లా నమోనీ ఆదివారం తన మొట్టమొదటి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘మహిళా సిబ్బందిని ప్రస్తుతానికి ఇళ్ల వద్దే ఉండిపోవాలని కోరాము. మరో ప్రత్యామ్నాయం లేనందున డిజైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాలతోపాటు మహిళల టాయిలెట్ల వద్ద పనిచేసే వారిని మాత్రం విధులకు హాజరు కావాలని కోరాం’ అని అన్నారు. అయితే, మొత్తం సిబ్బందిలో ఎందరిని ఇళ్లకు పరిమితం చేసిందీ ఆయన వెల్లడించలేదు. కాబూల్ నగర పాలక సంస్థలో సుమారు 3 వేల మంది పనిచేస్తుండగా అందులో వెయ్యి మంది వరకు మహిళలున్నట్లు అంచనా. కాగా, తాలిబన్ల నిర్ణయంపై ఉద్యోగినులు కాబూల్‌లో ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులను తాలిబన్లు లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు స్వేచ్ఛ లేని సమాజం మృత సమాజంతో సమానమన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాయబార కార్యాలయాలు, నేతల ప్రైవేట్ నివాసాల వద్ద ఉన్న భద్రతా వలయాలను తొలగిస్తున్నట్లు మేయర్ హమ్దుల్లా తెలిపారు. కాబూల్‌లో పౌరుల రక్షణకు తమదే బాధ్యతని చెప్పుకునేందుకు, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మద్దతు చూరగొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. చదవండి: కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి అఫ్గన్ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’ -
వర్క్ ఫ్రమ్ హోం: ‘ఏయ్.. వీడియోలోకి రా’
Work From Home Sexual Harassment: పనిచేసే చోట లైంగిక వేధింపులు.. చర్చల్లో నడిచే ఒక ప్రధాన అంశం. అయితే కరోనా కారణంగా ఈ ఫిర్యాదులు బాగా తగ్గాయి. అది ‘వర్క్ ఫ్రమ్ హోం’ కారణంగానే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రిమోట్ వర్క్ స్పేస్‌లోనూ లైంగిక వేధింపులు ఆగట్లేదని ఎంప్లాయిస్ వాపోతున్నారు. యాంటీ-సెక్సువల్ హరాస్మెంట్ అడ్వైజరీ ‘కంప్లైకరో డాట్ కామ్’ ఈ ఏడాదికి నిర్వహించిన సర్వేలో.. వార్షిక నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో ఉన్న టాప్ 44 కంపెనీలలో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న ఎంప్లాయిస్ నుంచి లైంగిక వేధింపులపై ఫిర్యాదులు సేకరించింది కంప్లైకరో డాట్ కామ్. కిందటి ఏడాదితో పోలిస్తే తక్కువ ఫిర్యాదులు(రెండొందలకు పైగా తక్కువ) రాగా.. లైంగిక వేధింపుల కేసుల శాతం 38.26 శాతానికి పడిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇది గత రెండేళ్లతో పోలిస్తే చాలా తక్కువ. అయితే రిమోట్ వర్క్‌లోనూ ఎంప్లాయిస్ తాము ఎదుర్కొంటున్న వేధింపులను చర్చకు తీసుకురావడం విశేషం. సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ యాక్ట్ 2013 ప్రకారం.. ప్రతీ ఏడాది లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా లైంగిక వేధింపుల ఫిర్యాదుల్ని నమోదు చేయడం, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వాలకు నివేదికల్ని సమర్పించాల్సిందే. వేళకానీ వేళలో.. సర్వేలోనే సుమారు ఐదు వందల దాకా ఫిర్యాదు అందాయి. ఇవిగాక కొందరు సర్వే పోర్టల్‌కు పర్సనల్ మేసేజ్‌ల ద్వారా, మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభద్రత భావాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలో కొలీగ్స్, టీమ్ మేట్స్, టీమ్ లీడ్స్‌తో పాటు మేనేజర్, బాస్ స్థాయి వ్యక్తులపై సైతం ఫిర్యాదులు రావడం విశేషం. విపరీతమైన వర్క్ టాస్క్‌లు ఇస్తున్నారని, అవి తప్పించాలంటే తమతో సన్నిహితంగా ఉండాలంటూ ఒత్తిడి చేస్తున్నారని కొందరు వాపోయారు. ఇంకొందరు వేళకానీ వేళలో ఆన్‌లైన్‌కి, వీడియో కాల్స్‌కి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ‘అనవసరమైన-వ్యక్తిగత’ చర్చలతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇదంతా తమ మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపెడుతోందని వాపోయారు వాళ్లు. దీంతో నాలుగు గోడల మధ్య వర్చువల్‌గా జరుగుతున్న వేధింపుల వ్యవహారం ఇప్పుడు చర్చకు దారితీసింది. టార్గెట్ ఎంప్లాయిస్ కరోనా కారణంగా.. వర్క్ ఫ్రమ్ హోంకి ఎంప్లాయిస్‌కు అనుమతిస్తున్న కంపెనీల్లో చాలావరకు హైక్‌ల సంగతి పక్కనపెట్టి, ఉద్యోగాల విషయంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి ఎంప్లాయిస్‌తో పని చేయించుకుంటున్నాయి. టార్గెట్లను ఫినిష్ చేయడానికి సాధారణ పని గంటల కంటే అదనంగా (మరో నాలుగైదు గంటలు) పని చేయాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు కూడా. అయినప్పటికీ వైరస్ భయం, ఇతరత్ర కారణాలతో వర్క్ ఫ్రమ్ హోంకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఆఫీస్ స్పేస్‌లలో వేధింపులు తగ్గినప్పటికీ.. వర్క్‌ఫ్రమ్ హోంలోనూ వర్చువల్ మీటింగ్‌ల పేరుతో కొందరు ఉద్యోగిణులు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల్ని ఈ సర్వేలో ప్రస్తావనకు తెచ్చారు. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. కంపెనీల అనూహ్య నిర్ణయం -
మహిళా ఉద్యోగుల కోసం ఫిర్యాదుల కమిటీలు
సాక్షి,అమరావతి: అన్ని ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వీలుగా అంతర్గత కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్లకు శుక్రవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి మహిళా ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని అందువల్ల ఫిర్యాదుల కమిటీలను తూతూ మంత్రంగా ఏర్పాటు చేయడం కాకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ శాఖాధిపతులు చూడాలని, ఆ నివేదికలను ఎప్పటికప్పుడు మహిళా కమిషన్‌కు పంపాలని ఆదేశించారు. -
నారీ శక్తిని చాటి చెప్తున్న మహిళలు
‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే, తత్ర దేవతాః‘ అనేది ఆర్యోక్తి. ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. నిజమే మరి, సమాజంలో స్త్రీకి నేడు ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మహిళల పట్ల సమాజ దృక్పథం పూర్తిగా మారింది. అలాగే ఆమె పనిచేస్తున్న సంస్థలో భద్రతపై కూడా ప్రభుత్వాలు, ఆయా సంస్థలు బాధ్యత తీసుకొని తగిన రక్షణ కల్పించడానికి చక్కని చర్యలు తీసుకుని ఆమెను తోబుట్టువులా ఆదరిస్తున్నారు. సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర ఎంతో ఉన్నతమైనది. అందుకే స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే గొప్ప అవకాశాలను తామే స్వయంగా నిర్మించుకొని ‘స్త్రీ శక్తి ‘అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. విద్యా, వ్యాపారం, రాజకీయాలు, వైద్యం, క్రీడలు, టెక్నాలజీ, అంతరిక్షం, బ్యాంకింగ్ వంటి పలు రంగాలలో మహిళలు రాణిస్తూ రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని స్త్రీ శక్తిని చాటి చెప్తున్నారు. స్త్రీ మూర్తి అన్నం కలిపి గోరుముద్దలు తినిపించేటప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమని కూడా కలిపి మరీ తినిపిస్తుంది. ఇంత గొప్పగా ప్రేమామృతాలు కురిపిస్తున్న స్త్రీమూర్తి ఎక్కడ చూసినా వంచనకు గురవుతూనే ఉంది. ఇంటా, బయటా బాధ్యతలు సమతూకం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్న స్త్రీలపై కొంతమంది మృగాళ్లు చేసే దారుణ అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చినా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు మరింత భద్రత కల్పించే విధంగా చక్కని దిశాచట్టాన్ని ప్రవేశపెట్టి దోషికి తక్షణమే శిక్షపడేలా చట్టంలో మార్పులు తెచ్చి మహిళల రక్షణకు మేమున్నామంటూ అభివృద్ధి పథంలోకి దూసుకు వెళుతున్నాయి ప్రభుత్వాలు. మహిళలకు మరింత రక్షణగా ఉండే విధంగా మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ‘రోటీ, కపడా మఖాన్‘ ఎంత అవసరమో గుర్తించి మహిళలకు చక్కని పథకాలను ప్రవేశపెట్టి వాటిని మహిళా అవసరాలకు అనుగుణంగా అందిస్తూ ప్రతి మహిళ కళ్ళల్లో వెలుగు రేఖల్ని నింపుతున్నారు. ఇలా ప్రతి మహిళా కూడా ఈ పథకాన్ని సొంతం చేసుకుని తమ బిడ్డల్ని చక్కగా చదివిస్తూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే అదే మనకు నిజమైన మహిళా దినోత్సవం. – పింగళి భాగ్యలక్ష్మి... కాలమిస్టు, రచయిత్రి -
ధైర్యము నీవే కదా
భయంలో పిల్లాడు ‘అమ్మా’ అని వెళ్లి అమ్మ పొట్టలో తల దూరుస్తాడు. తండ్రిపులికి సిఫారసు కోసం ‘అక్కా’ అని వెళ్లి అక్కను ఆశ్రయిస్తాడు తమ్ముడు. అధైర్యంలో, అగమ్యంలో.. ఆలోచన కోసం భార్య వైపు చూస్తాడు భర్త. ‘జాబ్ వచ్చాక ఇస్తాలే’ అని గర్ల్‌ఫ్రెండ్‌ని చేబదులు అడుగుతాడు నిరుద్యోగి. కష్టాల్లో యావత్ మానవాళి ప్రత్యక్ష దైవం స్త్రీ. ‘ఆ చేత్తోనే మాకూ ఇంత అభయం ప్రసాదించమని’ ఇప్పుడీ కరోనా సంక్షోభంగా పెద్ద పెద్ద కంపెనీలు మహిళల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ‘వర్క్‌ఫ్రమ్ హోమ్’ ఇస్తున్నాయి. ఆకాశంలో సగంగా ఉన్న మహిళ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్‌లలోనూ సగంగా ఉండబోతోంది. ఎత్తులో సన్నటి తాడుపై పడిపోకుండా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నిరంతరం నడుస్తూ ఉండటమే స్త్రీకి ఇల్లూ ఆఫీస్. ఇంటిని చూసుకునేవారు ఎవరైనా ఉంటే, ఇంటిని తను కూడా చూసుకోవాలన్న తపన భర్తకూ ఉంటే ఆమె మరింత మెరుగ్గా తన ఉద్యోగ బాధ్యతల్ని నెరవేర్చగలదు. ఈ విషయం లాక్డౌన్ కాలంలో రుజువైంది కూడా. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో మహిళలు అత్యుత్తమమైన ఫలితాలను తమ కంపెనీలకు సాధించి పెట్టాయి. వారి పని తీరు మెరుగైంది. వేగవంతం అయింది. ఎక్కువ పని కూడా జరిగింది. పురుషులు మాత్రం ఆఫీస్‌లో ఎంత పని చేశారో ఇంట్లోనూ అంతే పని, లేదంటే అంతకు తక్కువ పని చేసినట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది కూడా. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ప్రస్తుత కరోనా సంక్షోభ కాలాన్ని నెగ్గుకు రావడానికి, మునుపటి లాభాల్లోకి త్వరితంగా వెళ్లిపోడానికి మహిళల్ని ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అదీ వర్క్ ఫ్రమ్ హోమ్‌లోకి! దీనివల్ల మహిళల శక్తి సామర్థ్యాలకు, నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది. మగవాళ్లు ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటే.. వాళ్ల కన్నా మిన్నగా, మెరుగ్గా మహిళలు ఇంటి నుంచి చేస్తున్నారు. ∙∙ ఒక రంగం అని కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్, మెటల్ అండ్ మైనింగ్ మహిళా శక్తిని ఆలంబనగా చేసుకుంటున్నాయి! యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, వేదాంత, ఆర్పీజీ గ్రూప్, దాల్మియా సిమెంట్, టాటా కెమికల్స్ వంటి సంస్థలు మహిళల్ని చేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనడంతో మహిళలూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు వచ్చే ఏడాది తమ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ విభాగాలకు దేశంలోని రెండు వేల క్యాంపస్‌ల నుంచి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించింది. అందులో 40 శాతం వరకు మహిళా అభ్యర్థులకే కేటాయించింది! ఇక ఇన్ఫోసిన్ కంపెనీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ‘అప్పుడే కాలేజీ నుంచి బయటపడిన’ (ఫ్రెష్ బ్యాచ్) పట్టభద్రులకు 17 వేల ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకుంది. అందులో సగం పూర్తిగా యువతులకే. దాల్మియా సిమెంట్స్ కూడా ప్రత్యేకంగా మహిళల కోసమే నియామకాల్ని చేపట్టనుంది. అందుకోసం మహిళా కళాశాలల్లో, మహిళా విశ్వ విద్యాలయాలలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. టాటా స్టీల్స్‌లో కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేనేజ్మెంట్ విభాగంలో నలభై శాతం వరకు మహిళలే ఉండబోతున్నారు. పనివేళల్ని సులభతరం చేస్తే మహిళల పని సామర్థ్యం పెరిగి మంచి ఫలితాలు వస్తాయని ఈ కంపెనీల అనుభవంలోకి వచ్చింది కనుకనే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రముఖ ‘జాబ్స్ ఫర్ హయర్’ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేహా బగారియా చెబుతున్నారు. ‘‘అంతేకాదు.. స్త్రీ, పురుషుల నియామకాలలో ప్రస్తుతం ఉన్న అంతరం తగ్గి, జెండర్ డైవర్సిటీ వృద్ధి చెందుతుంది’’ అని కూడా ఆమె అంటున్నారు. నేహా బగారియా, ‘జాబ్స్ ఫర్ హయర్’ సంస్థ సీఈవో. -
సెలవు కావాలంటే కోరిక తీర్చాల్సిందే..
సాక్షి, టెక్కలి : మహిళా ఉద్యోగుల రక్షణకు ఎన్నికఠిన చట్టాలు తీసుకువచ్చినా కీచకుల ఆగడాలు ఆగడం లేదు. ముఖ్యంగా దిగువ స్థాయి ఉద్యోగులు పట్ల లైంగిక వేధింపులు కొనసాగుతునే ఉన్నాయి. చట్టం నుండి తప్పించుకోవచ్చనే బులుపుతోనో, దిగువ స్థాయి ఉద్యోగులు అంటే అలుసో గాని మహిళ ఉద్యోగుల వృత్తి అవసరాలను అడ్డంపెట్టుకొని పెట్రేగిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్టీసీ డిపోలో కూడా ఓ అధికారి ఈ రకమైన వికృత చర్యకు పాల్పడ్డారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా.. తన మాట వినకుంటే ప్రమోషన్ లిస్ట్‌లో పేర్లు లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాధితులు తమ గోడును సాక్షి టీవీకి మొరపెట్టుకున్నారు.(ఆత్మస్థైర్యంతో కరోనాను జయించాను.. ) వివరాల్లోకి వెళితే.. టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు డిపోలోని మహిళల ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారితో అసభ్య చాటింగ్‌లు చేయడమే కాకుండా.. డ్యూటీ దిగాక తన ఆఫీస్‌కు వచ్చి వెళ్లాలని ఆదేశాలు కూడా జారీచేశారు. సెలవు కావాలంటే కోరిక తీర్చాల్సిందేనని పశువులా ప్రవర్తించాడు. వయసుతో సంబంధం లేకుండా తను చెప్పిందే చేయాల్సిందేనని ఒత్తిడికి గురిచేశాడు. తాను చెప్పినదానికి ఒప్పుకుంటే లాంగ్ డ్రైవ్‌లు, టూరిస్ట్ ప్లేస్‌లు తిప్పుతానని ఎర వేసే ప్రయత్నం చేశాడు. తన కోరిక తీర్చకపోతే ప్రమోషన్ లిస్ట్‌లో పేర్లు లేకుండా చేస్తానని బెదిరింపులుకు పాల్పడ్డాడు. అయితే ఈశ్వరరావు వ్యవహారం డైరెక్టర్ స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అయినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అతడు మరింత రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే ఈశ్వరరావు వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో మహిళా ఉద్యోగులు ఒక్కక్కొరిగా బయటకు వచ్చి అతడి బండరాన్ని బయటపెట్టారు. ఆ కీచకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.(విద్యార్థుల అభీష్టమే ఫైనల్) -
కరోనా ఎఫెక్ట్: మహిళా ఉద్యోగులకు వరం
ముంబై: కరోనా వైరస్ దెబ్బతో అన్ని రంగాలు కుదేలయిన విషయం తెలిసిందే. అయితే మహిళలకు కరోనా సంక్షోభం వరంగా మారనుంది. కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. మహిళలు మాత్రం తమ కుటుంబ సభ్యుల సెంటిమెంట్‌తో స్థానికంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తారు. గతంలో ప్రాజెక్టుల పూర్తికావడానికి గతంలో ఒకే షిఫ్ట్‌లో ఉద్యోగులు పని చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయాలని లక్ష్యంతో క్లయింట్లు(ప్రాజెక్ట్ అప్పగించే వ్యక్తులు) కంపెనీ యాజమాన్యాలను ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్, తదితర రంగాలలో ఎక్కువ వైట్ కాలర్(పరిపాలన విభాగం) ఉద్యోగాలను సంస్థలు మహిళలకు ఆఫర్ చేస్తున్నాయి. కాగా అధిక స్థాయిలో మహిళా ఉద్యోగులను నియమించుకుంటామని క్వెస్ క్వార్ప్ సంస్థ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీలు ఉద్యోగుల వలసలతో తీవ్రంగా నష్టపోయావని, రాబోయే కాలంలో మహిళా ఉద్యోగులను(50లక్షల మంది) నియమించుకునే అవకాశం ఉందని అవసర్ హెఆర్ సర్వీసెస్ ఉన్నతాధికారి నవనీత్ సింగ్ తెలిపారు. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో 5,000 మంది మహిళ ఉద్యోగులను కంపెనీలు నియమించుకోనున్నాయి. కాగా దుస్తుల తయారీ సంస్థలైన (బడ్డీ, ఉన్న)లు 80శాతం మహిళా ఉద్యోగులను నియమించుకుంటాయని ప్రకటించాయి. అయితే గుర్గావ్కు చెందిన మాట్రిక్స్ సంస్థ ఎండీ గౌతమ్ నేర్ వంద శాతం మహిళ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపారు. మహిళ ఉద్యోగులు నిబద్దత, వినయం, సహనం అధికంగా ఉంటాయని కొన్ని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా భవిష్యత్తుల్లో వైట్ కాలర్ ఉద్యోగాలలో మహిళల ప్రాధాన్యం మరింత పెరగవచ్చని తెలుస్తోంది. (చదవండి: కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ) -
నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్
న్యూఢిల్లీ: భారత నావికా దళంలోని మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి. వివక్షను అధిగమించేందుకు మహిళలకు అవకాశం కల్పించిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి’అని వ్యాఖ్యానించింది. నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. ‘సాయుధ దళాల్లో లింగ సమానత్వ విధానం అమలుకు 101 సాకులు చూపడం సమాధానం కాదు. సామర్థ్యం, పోటీతత్వం ఆధారంగా బాధ్యతలను అప్పగిస్తే వారికి వివక్షను అధిగమించే అవకాశం ఇచ్చినట్లవుతుంది. మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమే అవుతుంది’అని వ్యాఖ్యానించింది. నేవీలో మహిళా అధికారులు చూపిన ధైర్యసాహసాలు, చేసిన త్యాగాలు మరువలేనివన్న కోర్టు..‘1991, 1998ల్లో కేంద్రం ప్రకటించిన విధానాల ప్రకారం నేవీలో మహిళలను నియమించుకోవచ్చు. వారిని పురుష అధికారులతో సమానంగా పరిగణించాల్సిందే’అని తెలిపింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ వాదనలు వినిపించారు. సముద్రంలో కొన్ని విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక సామర్థ్యం పురుషులతో పోలిస్తే మహిళల్లో తక్కువన్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ మాదిరిగా కాకుండా నేవీ సిబ్బంది నెలలపాటు సముద్రంలోనే విధుల్లో ఉంటారని, అందుకే మహిళలను తీసుకోవడం లేదన్నారు. రష్యా నుంచి కొనుగోలు చేసే నౌకల్లో మహిళల కోసం టాయిలెట్ల వంటి సదుపాయాలు లేనందునే వారికి విధులు అప్పగించడం లేదని వివరించారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. మహిళల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నేవీలోని కొన్ని విభాగాల్లో మహిళలను నియమించరాదంటూ 2008లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయరాదని ధర్మాసనం ఆదేశించింది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)లోని విద్య, న్యాయం, రవాణా విభాగాల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తించే వారందరికీ శాశ్వత కమిషన్ వర్తిస్తుందని స్పష్టంచేసింది. 2008కి ముందు విధుల్లో చేరి శాశ్వత కమిషన్ లేకపోవడంతో నష్టపోయిన మహిళా అధికారులు.. రిటైరైన తర్వాత అందే పింఛను ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. -
చుక్‌బుక్ రైలే... నడిపిందీ మహిళలే!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్.. ఉదయం 7.45.. వికారాబాద్‌కు వెళ్లే ప్యాసింజర్ రైలు బయలుదేరింది. క్యాబిన్లో లోకోపైలట్ సీటులో ఓ మహిళ, సహాయంగా అసిస్టెంట్ లోకోపైలట్‌గా మరో మహిళ పరుగుపెట్టిస్తున్నారు. ఇంతలో బోగీల్లోకి టికెట్లు చెక్ చేసేందు కు ముగ్గురు టీటీఈలు వచ్చారు. వారంతా మహిళలే, రక్షణగా ఉన్న పోలీసు సిబ్బంది గస్తీకోసం బోగీల్లోకి వచ్చారు వారూ మహిళా సి బ్బందే. చివరలో ఉండే గార్డు క్యాబిన్లో విధు లు నిర్వహించిందీ స్త్రీమూర్తే. రైలును నడపటం క్లిష్టమైన ప్రక్రియే అయినా.. అత్యం త సులభంగా వారంతా నడిపి చూపించారు. మహిళా సాధికారత, లింగసమానత్వం చాటడానికి భారతీ య రైల్వే ఈనెల 1 నుంచి 10 వరకు ‘ఈచ్ ఫర్ ఈక్వల్’నినాదంతో అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారు లు శనివారం సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ వరకు ప్యాసింజర్ రైలును పూర్తిగా మహిళా ఉద్యోగుల చేత నడిపించారు. లోకోపైలట్ సరిత మేశ్రమ్, అసిస్టెంట్ లోకో పైలట్ మమత కుమారి, గార్డ్ వినీష, టీటీఈలు మంగ, కరిష్మ, పావన, ఎస్పీఎఫ్/ఆర్పీఎఫ్ నసీమాబేగం, నిరోషా విధుల్లో పాల్గొన్నారు. ఈ రైలును సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన మహిళా అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మే నేజర్ గజానన్ మాల్యా రైలు నడిపిన మహిళా ఉద్యోగులందరినీ అభినందించారు. లింగ భేదం లేకుండా వారందరికీ దక్షిణ మధ్య రైల్వే సమానావకాశాలు కల్పిస్తోందన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వ్యవహరిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే ‘మహిళా రైల్వే స్టేషన్లు’ఏర్పాటు చేసి అం దరూ మహిళలే పనిచే సే 5 రైల్వే స్టేషన్లను విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. బేగం పేట్, విద్యానగర్, చంద్రగిరి, న్యూ గుం టూర్, రామవరప్పాడు స్టేషన్లు వారి ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన చెప్పారు. మహిళలే రైలును నడపటం ఆనందంగా ఉందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేయగా, తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా రైలును నడిపి చూపించామని విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పేర్కొన్నారు. అటు వికారాబాద్ వరకు, తిరిగి సికింద్రాబాద్‌కు రైలును వారు నడిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో భవిష్యత్తులో దీన్ని వీలునుబట్టి కొనసాగించనున్నట్టు అధికారులు వెల్లడించారు. -
మహిళల ముద్ర
ఆకాశంలా.. మహిళాశక్తి అనంతం.ఈ విషయాన్ని మహిళాలోకం ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. తాజాగా ఇప్పుడు మహిళలు అధిగమించిన మరో మైలురాయి.. ముంబాయి మాహిమ్ బజార్ పోస్టాఫీస్. శనివారం మాహిమ్ బజార్ పోస్ట్ఆఫీస్ శాఖ ‘మహిళా డాక్ఘర్’గా గుర్తింపు తెచ్చుకుంది. అంటే ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ అయింది. ఈ పోస్ట్ ఆఫీస్‌లో ఇప్పుడు పోస్ట్ మాస్టర్ (ఇన్చార్జ్) నుంచి కౌంటర్ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ మహిళలే! మాహిమ్ బజార్ పోస్ట్ ఆఫీస్ శాఖకు వచ్చే వాళ్లలో 70 శాతం మంది మహిళలే. వారికి సౌకర్యంగా ఉండడం కోసమే పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ వస్తోంది. అందుకోసం అవసరమైతే మగ ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేసి మరీ మహిళలతో భర్తీ చేస్తోంది. ‘‘ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ ఒక మంచి ఏర్పాటు. ఇందువల్ల పోస్టాఫీస్‌కు వచ్చేవారికే కాక, ఇక్కడ పనిచేస్తున్న మహిళలకూ అనువైన పని వాతావరణాన్ని కల్పించడం సాధ్యమౌతుంది’’ అంటారు ముంబాయి రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ స్వాతి పాండే. ఇప్పుడు ఈ వరుసలోనే అంధేరీ, బోరివెల్లి, వదాలా శాఖలను కూడా ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్‌లుగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారామె. హెడ్ పోస్ట్ ఆఫీస్‌లను ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్‌లుగా మార్చడానికి మాత్రం కొంత సమయం తీసుకుంటున్నామని, తొలి ప్రయత్నంలో చిన్న శాఖలను మహిళా డాక్‌ఘర్‌లుగా మార్చుతున్నామని స్వాతి తెలిపారు. ప్రస్తుతం ముంబాయి రీజియన్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో స్త్రీ పురుష ఉద్యోగుల నిష్పత్తి 60–40గా ఉంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్‌లను మహిళాశక్తితో నడిపించడం కష్టమేమీ కాదు. ముంబాయి నగరంలో ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ ఇప్పటికే ఒకటి ఉంది. అది టౌన్ హాల్ పోస్ట్ ఆఫీస్. ఇప్పుడీ మాహిమ్ బజార్ శాఖ కూడా ఆ హోదాను దక్కించుకుంది. ఈ రెండిటికంటే ముందు.. న్యూఢిల్లీ ఈ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. భారతీయ తపాలా శాఖ న్యూఢిల్లీలో 2013లోనే ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్‌ను నెలకొల్పింది. -
మానవ హారాలు..మహిళా కార్మికుల నిరసనలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో మానవ హారాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంజీబీఎస్, సిటీ పరిధిలోని బస్ డిపోల వద్ద మహిళా కండక్టర్లతో నిరసనలు చేపట్టి డిమాండ్లు పరిష్కరించి విధుల్లో చేర్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటంతో పాటు సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికులకు నివాళులర్పించారు. కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 6,141 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో ఆర్టీసీ బస్సులు 4,260, అద్దె బస్సులు 1,881 ఉన్నట్లు తెలిపింది. ప్రజారవాణా ఏర్పాట్లలో ప్రయాణికుల సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. 6,058 బస్సుల్లో టిమ్‌ల ద్వారా టికెట్లు ఇవ్వగా ,63 బస్సుల్లో మాన్యువల్ పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు చెప్పింది. -
కాగ్నిజంట్‌లో లక్ష దాటిన మహిళా ఉద్యోగుల సంఖ్య
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ కాగ్నిజంట్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటింది. ఇందులో 75వేల మందికి పైగా మహిళలు భారత్‌లోనే పనిచేస్తుండడం గమనార్హం. మొత్తం ఉద్యోగులు రూ.2.88 లక్షల మందిలో మహిళలు 34 శాతానికి చేరినట్టు కాగ్నిజంట్ తెలిపింది. 100కు పైగా దేశాలకు చెందిన మహిళలు సంస్థలో పనిచేస్తున్నారు. కనీసం లక్ష మంది మహిళా ఉద్యోగులను 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉండాలని సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 2019లోనే దాన్ని సాధించేసింది. పైగా వారిలో 75 శాతం భారత్ నుంచే పనిచేస్తుండడం విశేషం. -
అతివలకు అండ
సాక్షి, కర్నూలు : మహిళల రక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు శాఖలో సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ఈ వ్యవస్థ రాష్ట్రం మొత్తం విస్తరణలో భాగంగా జిల్లాలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా కర్నూలు రేంజ్ పరిధిలోని వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లోని అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా మిత్రలను నియమించనున్నారు. మహిళా మిత్రలు ఏం చేస్తారంటే.. వివిధ రకాల ఇబ్బందులకు గురయ్యే మహిళల్లో చాలామంది..పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకొచ్చే పరిస్థితి నేటికీ పూర్తిస్థాయిలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులకు సాయపడడానికి ‘మహిళా మిత్ర’ల పేరిట సుశిక్షితులైన మహిళలను నియమించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. బాధితులకు స్వచ్ఛందంగా సేవలందించడానికి ముందుకు వచ్చేవారినే ‘మహిళా మిత్ర’లుగా ఎంపిక చేస్తారు. వారికి మహిళా రక్షణకు అందుబాటులో ఉన్న చట్టాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. ప్రతి స్టేషన్‌కు కనీసం ఇద్దరు ‘మహిళా మిత్ర’లు ఉండేలా చర్యలు చేపడతారు. అలాగే ప్రతి స్టేషన్లోనూ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సమన్వయకర్తల బాధ్యతలు అప్పగిస్తారు. ‘మహిళా మిత్ర’లు ఇచ్చే సమాచారంపై కానిస్టేబుళ్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేదా ఇతర అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటారు. ‘మహిళా మిత్ర’లు ప్రాంతాల వారీగా విద్యా సంస్థలు, అపార్ట్మెంట్లు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో మాట్లాడి.. మహిళా గ్రూపులు ఏర్పాటు చేయిస్తారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చైతన్యం తీసుకురావడానికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. మహిళల భద్రతలో విప్లవాత్మక మార్పు ‘మహిళా మిత్ర’ వ్యవస్థ ఏర్పాటు విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. చైతన్యవంతులైన మహిళలను ఈ వ్యవస్థలోకి తీసుకొని.. మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షనీయం. ఈ వ్యవస్థ వల్ల సమస్యలను ప్రాథమిక దశలోనే తెలుసుకునే అవకాశం కలుగుతుంది. –దాశెట్టి శ్రీనివాసులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు చట్టాలపై అవగాహన ఉన్నవారిని నియమించాలి పోలీసు శాఖలో మహిళా మిత్రల ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే చట్టాలపై సమగ్ర అవగాహన ఉన్న వారిని నియమిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అన్యాయానికి గురైన వారికి ఎలాంటి సాయం అందించాలనే విషయంలో వీరు వారధులుగా పనిచేయాలి. – పి.నిర్మల, న్యాయవాది, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు -
మహిళా ఉద్యోగులకు డ్రెస్ కోడ్‌పై దుమారం
లక్నో : యూపీలోని ఫతేహబాద్‌లో ఓ సహకార వైద్యారోగ్య కేంద్రంలో అధికారి ఇచ్చిన తాలిబన్ తరహా ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. మహిళా సిబ్బంది జీన్స్, టీషర్ట్లు కాకుండా సల్వార్ సూట్, చీరలు ధరించి మాత్రమే కార్యాలయానికి రావాలని ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఉద్యోగులు పనిచేసేందుకు వచ్చే సమయంలో మేకప్ వేసుకోరాదని సూచించారు. ఈ ఉత్తర్వులు మహిళా ఉద్యోగులకే కాదని, పురుషులకూ వర్తిసాయని అధికారులు చెప్పుకొచ్చారు. పురుషులు టీ షర్ట్స్, జీన్స్‌తో కార్యాలయానికి హాజరు కాకూడదని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమావేశంలో సహకార వైద్యారోగ్య కేంద్రం ఇన్చార్జ్ డాక్టర్ మనీష్ గుప్తా ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ సెంటర్ ఉద్యోగులందరూ విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆయన ప్రకటించారు. డ్రెస్ కోడ్ పాటించడంలో విఫలమైన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించడం విశేషం. డ్రెస్ కోడ్ విషయం బయటకు పొక్కడంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో ఉద్యోగులు అసలు విషయం చెప్పేందుకు తటపటాయించగా, సదరు అధికారి మాత్రం ఈ ఉత్తర్వులు పొరపాటుగా జారీ అయ్యాయని సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేశారు. డ్రెస్ కోడ్‌పై ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఎవరూ జారీ చేయలేదని చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ ముఖేష్ వివరణ ఇచ్చారు. డ్రెస్ కోడ్ ప్రకటించిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
గూగుల్‌కు ఉద్యోగుల షాక్
సింగపూర్/న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో పనిచేసే ఉద్యోగులు గురువారం ఆ సంస్థకు షాక్ ఇచ్చారు. మహిళా ఉద్యోగులపై లైంగికవేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల విషయంలో సంస్థ పక్షపాతంతో వ్యవహరించడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులు వాకౌట్ నిర్వహించారు. తొలుత జపాన్ రాజధాని టోక్యోలో ఉదయం 11.10 గంటలకు గూగుల ఉద్యోగులు అందరూ కంపెనీ నుంచి బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం అమెరికా, భారత్, స్విట్జర్లాండ్, సింగపూర్, బ్రిటన్ సహా పలుదేశాల్లోని వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఉదయం 11.10కు(స్థానిక కాలమానం ప్రకారం) కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. ఆండ్రాయిడ్ ఓఎస్ సృష్టికర్త ఆండీ రూబిన్, డైరెక్టర్ రిచర్డ్ డీవౌల్ సహా కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై గూగుల్ దశాబ్దకాలం పాటు మౌనం పాటించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల సంచలన కథనాన్ని ప్రచురించింది. కాగా, వేధింపులపై కోర్టును ఆశ్రయించేలా నిబంధనల్లో సవరణ, స్త్రీ–పురుషులకు సమాన వేతనం, కంపెనీ బోర్డులో తగిన ప్రాధాన్యం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. -
#మీటూ : భార్యకు బానిసను, అందుకే..
సాక్షి, ముంబై: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మొదలైన మీటూ ఉద్యమంలో ఒక విచిత్రకర, ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంది. మీటూ ఉద్యమం ద్వారా మేకవన్నె పులుల్లాంటి పెద్దమనుషులు అసలు స్వరూపాలు వెలుగులోకి రావడం సంచలనం రేపింది. అయితే ఈ ఉద్యమం ద్వారానైనా కార్యాలయాల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసుకునే పరిస్థితులు కావాలని, ఒకవైపు మహిళలు కోరుకుంటోంటే మరోవైపు ప్రముఖ వివాదాస్పద సినీ విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్ తీసుకున్న ఇందుకు భిన్నమైన వివాదాస్పద నిర్ణయం వార్తల్లో నిలిచింది. ఏకంగా తన ఆఫీసుల్లో పనిచేసే మొత్తం మహిళా ఉద్యోగులపై వేటు వేశాడు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఒక పోస్ట్ పోట్టాడు. ఇండియా, దుబాయ్‌లలోని తన ఆఫీసుల్లోని మహిళలందరినీ ఉద్యోగాలనుంచి తొలగించినట్టు తెలిపారు. తనకు తాను మహిళల నుండి దూరంగా ఉండాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశాడు. ఇకపై ఏ మహిళతోనూ మాటల్లేవ్.. పార్టీల్లేవ్. థ్యాంక్స్ టూ మీటూ అని ట్వీట్ చేశాడు. పైగా తాను భార్యకు బానిసను, ఇది నూటికి నూరుపాళ్లు నిజం..అందుకే ఆమె ఆర్డర్‌ను పాలో అయ్యానని పేర్కొన్నాడు. దీంతో కేఆర్కే చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు మీటూ ఉద్యమ నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు ఇపుడిపుడే మొదలయ్యాయి. లైంగిక వేధింపుల ఫిర్యాదు కమిటీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహిళలు సమాన అవకాశాలు కావాలని నినదిస్తోంటే. మహిళలను నిరుద్యోగులను చేస్తూ కెఆర్కె బాధ్యతా రాహిత్యమైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా మీడియాలో లైంగిక వేధింపులపై కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మొదలు పెట్టిన మీటూ ఉద్యమం క్రమంగా మిగతా రంగాలకు విస్తరించింది. ముఖ్యంగా సినీ, రాజకీయ రంగాల్లోని పెద్దమనుషుల బండారాన్ని బద్దలు చేసింది. గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్ అనంతరం తమిళ సినీ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపులపై అనేకమంది బాధితుల గోడు, అలాగే కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్‌పై చెలరేగిన ఆరోపణలు విస్తుగొల్పాయి. ఈ నేపథ్యంలో ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. టాటా మోటార్స్, టాటా సన్స్ సంస్థలు సంబంధిత చర్యలకుపక్రమించిన సంగతి తెలిసిందే. Yes! It’s 100% true “Ki Main Biwi Ka Ghulam Hoon” So I followed her order. And now we don’t have any female staff in any of my office in India or Dubai. No parties! No talking with any girl. Thanks to #MeToo!👏👏👏 pic.twitter.com/X463LtbDUm — KRK (@kamaalrkhan) October 29, 2018 -
ఉద్యోగం మహిళ లక్షణం!
దేశంలోని ప్రతి పది మంది కౌమార బాలికల్లో ఏడుగురు డిగ్రీ పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ఉద్యోగానికి సంబంధించి ప్రణాళికలు వేసుకున్నారు. దాదాపు ప్రతి నలుగురిలో ముగ్గురు 21 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ‘నన్హి కలి’ ప్రాజెక్టులో భాగంగా నాందీ ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైన విషయాలివీ... 25 % అమ్మాయిలు పీజీ చేయాలనుకుంటున్నారు.12 శాతం మంది ప్రొఫెషనల్డిగ్రీ కోర్సు పూర్తి చేయాలనుకుంటుండగా, 27 శాతం మంది గ్రాడ్యుయేషన్ దాకా వెళ్తామంటున్నారు. 20 శాతం మంది 12వ తరగతి దాటిపోలేమని చెబుతున్నారు. 70 % మొత్తంగా చూస్తే 70 శాతం మంది కనీసం గ్రాడ్యుయేషన్ వరకు లేదా ఉద్యోగ ప్రవేశపరీక్ష రాసేందుకు అవసరమైనంత వరకు చదువుతామని చెబుతున్నారు. ఈ లక్ష్యం పెట్టుకున్న వారిలో 76.5 శాతం మంది 16– 19 వయసున్నవారు. కానీ 19 ఏళ్లు వచ్చేసరికి 65.5% మంది మాత్రమే చదువు కొనసాగించగలుగుతుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. మొత్తంగా, కౌమార దశకు చేరేటప్పటికి ప్రతి ఐదుగురిలో ఒకరు చదువుకు దూరమవుతున్నారు. ఉద్యోగాలు చేస్తాం.. ప్రతి నలుగురిలో ముగ్గురు బాలికలు ఉద్యోగాలు చేస్తామంటున్నారు. టీచింగ్ (33 శాతం), టైలరింగ్ ( 11.5 శాతం) వైద్య (10.6 శాతం) పోలీసు, సాయుధబలగాలు (8 శాతం) నర్సింగ్ (6 శాతం) వంటి రంగాల్లో చేరుతామని చెబుతున్నారు. ఉద్యోగం చేయాలనుకుంటున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో (72 శాతం) కంటే పట్టణ ప్రాంతాల్లో (80శాతం) ఎక్కువగా ఉన్నారు. అల్పాదాయ కుటుంబాల్లో (70 శాతం) కంటే అధికాదాయ కుటుంబాల బాలికలు (80 శాతం) కెరీర్ సంబంధిత లక్ష్యాలను ఎక్కువగా నిర్దేశించుకోగలుగుతున్నారు. కెరీర్‌పై దృష్టి పెట్టిన అమ్మాయిలు గుజరాత్లో అత్యంత తక్కువ (61 శాతం). సిక్కింలో వీరి శాతం (94) ఎక్కువగా ఉంది. 61 % 61.2 శాతం మంది గ్రామీణ కౌమార బాలికలు కనీసం డిగ్రీ అయినా చదువుతామని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి వారి శాతం ఇంకా ఎక్కువే (81%). అప్పుడే పెళ్లా...? బాగా చదువుకుని, ఉద్యోగాలు చేయాలనే లక్ష్యం పెట్టుకున్న అమ్మాయిలు తాము పెళ్లికి తొందరపడబోమని చెప్పడం ఈ సర్వేలో తేలిన ఆసక్తికర అంశం. 73.3 శాతం మంది 21 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునేదే లేదని చెప్పారు. 51 శాతం మంది 21–25 ఏళ్ల మధ్య, 10.2 శాతం మంది 26–30 మధ్య, 12.1 శాతం మంది 31 ఏళ్లు లేదా ఆ తర్వాత పెళ్లాడతామంటున్నారు. 20 లోపు పెళ్లి చేసుకుంటామన్న వారు 26.7 శాతం మంది మాత్రమే. 21 ఏళ్లు లేదా ఆ తర్వాత పెళ్లాడాలనుకుంటున్న అమ్మాయిలు అల్పాదాయ కుటుంబాల్లో(65.4 శాతం) కంటే అధికాదాయ కుటుంబాల్లోనే (84.8 శాతం) ఎక్కువగా ఉన్నారు. సిక్కింలో నూటికి నూరు శాతం బాలికలు పెళ్లి 21 ఏళ్ల తర్వాతేనని కరాఖండిగా చెప్పారు. బిహార్‌లో ఇలాంటి బాలికలు 54.7 శాతం మంది మాత్రమే. 81 % మెరుగైన ఆదాయ వనరులున్న కుటుంబాల్లో 81 శాతం మంది అమ్మాయిలు గ్రాడ్యుయేషన్ వరకు చదువు కొనసాగిస్తామని చెబుతున్నారు. తక్కువ ఆదాయమున్న కుటుంబాల్లో ఇలాంటి బాలికల శాతం 61 శాతానికి పడిపోయింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తామని చెప్పిన బాలికల శాతం బిహార్‌లో అత్యంత తక్కువ (52 శాతం)గా ఉండగా, జమ్మూ, కశ్మీర్లో ఎక్కువ (90 శాతం)గా ఉంది. అధ్యయనం వెనుక.. భారత్‌లో మహిళా ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. 2015 నాటికి మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 23.7 శాతం మాత్రమే. సామాజిక ఆచారాలు, ఇంటిపని, నైపుణ్య లేమి వంటి అంశాలు ఇందుకు కారణాలవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని, దీని వల్ల వ్యవస్థకు, కుటుంబాలకు పలు రకాలుగా జరిగే మేలును ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. స్కూలుకు వెళ్లే బాలికల్ని పదిశాతం మేరకు పెంచితే స్థూల జాతీయోత్పత్తి 3 శాతం మేర పెరుగుతుందని 2014లో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ జరిపిన అధ్యయనం తేల్చింది. అమ్మాయిలు చదువుకునే కాలం పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో వారు గడించే ఆదాయమూ పెరుగుతుందని, ఈ పరిస్థితి కుటుంబాలు, కమ్యూనిటీలు పేదరికం నుంచి బయటపడేందుకు దోహదపడుతుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ 2014 అధ్యయనం చెబుతోంది. -
జీఎస్టీ మహిళా ఉద్యోగులపై వేధింపులు
సాక్షి, విజయనగరం : జిల్లాలోని జీఎస్టీ కార్యాలయ ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారంటూ ముగ్గురు మహిళా ఉద్యోగులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారికి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఆమె జీఎస్టీ కార్యాలయానికి వచ్చి విచారించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేస్తున్నారని, అడిగితే వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగినీలు వాపోయారు. లైంగింక వేధింపులపై మహిళా ఉద్యోగులను ఆరా తీయగా.. క్లోజ్డ్ గదితో చెబుతామని పేర్కొన్నారు. ఏకాంత గదిలోకి వెళ్లి మహిళా ఉద్యోగులను విచారించారు. అనంతరం నన్నపనేని మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగపరంగా మాత్రమే వేధింపులు ఉన్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. మహిళా అధికారులకు హైవేపై నైట్ డ్యూటీలు వేయకూడదని, కానీ ఇక్కడి జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ నైట్ డ్యూటీలు వేస్తున్నారని మండిపడ్డారు. విచారణకు వస్తున్నానని తెలిసినా.. జాయింట్ కమిషనర్ అందుబాటులో లేడన్నారు. ముగ్గురు మహిళా అధికారులకు నైటీ డ్యూటీలు, సండే డ్యూటీలు వేయకూడదని ఆదేశాలు జారీ చేసున్నానని నన్నపనేని పేర్కొన్నారు. -
ఆర్ అండ్ బిలో కీచకపర్వం
-
ప్రసూతి చట్టంతో భారీగా ఉద్యోగాలు గోవింద
న్యూఢిల్లీ : దేశంలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి ప్రయోజనాలను పెంచుతూ.. వారిని కెరీర్ పరంగా మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్త ప్రసూతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టం వల్ల ఇప్పటికే ఆడవాళ్లకు అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగవకాశాలు మరింత సన్నగిల్లినట్టు తెలిసింది. కొత్త ప్రసూతి చట్టం వల్ల మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని, చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు మహిళలను నియమించుకోవడం తగ్గించాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ తన అధ్యయనంలో వెల్లడించింది. మార్చి 2019 వరకు 10 రంగాలలో 11 లక్షల నుంచి 18 లక్షల మంది మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు ఈ అధ్యయనం అంచనావేసింది. ఒకవేళ అన్ని రంగాలను తీసుకుంటే, ఉద్యోగం కోల్పోయిన వారి సంఖ్య కోటి నుంచి 1.2 కోట్ల వరకు ఉంటుందని సర్వే వెల్లడించింది. ఇది భారత్‌కు బ్యాడ్‌న్యూస్ అని పేర్కొంది. అంతేకాక వర్క్‌ఫోర్స్‌లో మహిళల షేర్ 24 శాతానికి పడిపోయిందని కూడా తెలిపింది. ఒకవేళ మహిళా ఉద్యోగుల స్థాయి దేశంలో ఎక్కువగా ఉంటే, దేశ జీడీపీకి 700 బిలియన్ డాలర్లకు పైగా అదనపు సంపద చేకూరుతుందని మెక్నిన్సే అండ్ కో అంచనావేసింది. ఏవియేషన్, ఐటీ, ఐటీ సంబంధిత సర్వీసులు, రియల్ ఎస్టేట్, విద్యా, ఈ-కామర్స్, తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసులు, రిటైల్, టూరిజం రంగాలలో 300 ఎంప్లాయిర్స్పై ఈ సర్వేను టీమ్‌లీజ్ సర్వీసెస్ నిర్వహించింది. ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబాల్లో మహిళలు, బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేయడం లేదని, ఒకవేళ భర్త వేతనం తగ్గిపోతే, అప్పుడు ఉద్యోగం వైపు మొగ్గు చూపుతున్నారని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. 2004 నుంచి 2 కోట్ల మంది మహిళలు తమ ఉద్యోగాలను వదులుకున్నట్టు తెలిపింది. వర్క్ఫోర్స్ల్లో మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రసూతి చట్టాన్ని సవరించింది. 12 వారాలుగా ఉన్న ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచింది. కానీ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో పనిచేస్తూ ఉంటాయని, ఒకవేళ ఈ కంపెనీల్లో ఐదుగురు మహిళా ఉద్యోగులుంటే, వారి కనుక ప్రసూతి చట్టం కింద 28 వారాల పాటు సెలవు తీసుకుంటే, ఇక సంస్థ నడపడం కష్టతరమవుతుందని తెలిసింది. దీంతో ఈ కంపెనీలు మహిళలను నియమించుకోవడానికి నిరాసక్తి చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది. భారత్ లాంటి దేశంలో ఇప్పటికే గర్భవతి అవడాన్ని కెరీర్ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. తల్లులైనందున పదోన్నతులు కోల్పోయిన వారు ఉన్నారు. కొత్తగా తల్లులవుతున్న వారు పనిచేసే చోట వివక్షతను ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల ఇంటర్వ్యూల సందర్భాల్లోనే పెళ్లి, పిల్లలకు సంబంధించిన ప్రణాళికలను తెలసుకుంటున్నాయి. ఉద్యోగాల్లో చేరిన కొన్నేళ్లవరకు పెళ్లి చేసుకోకూడదని, పెళ్లి చేసుకున్నా పిల్లలు కనకూడదనే షరతులు విధిస్తున్న కంపెనీలు కూడా లేకపోలేదు. -
కాంట్రాక్టు ఉద్యోగినులకూ ప్రసూతి సెలవులు: సీఐసీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రసూతి ప్రయోజన చట్టం శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులందరికీ వర్తిస్తుందని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) పేర్కొంది. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగిని శ్వేతా పాఠక్ ప్రసూతి ప్రయోజన చట్టం ప్రకారం ప్రయోజనాలు తనకు వర్తిసాయోలేదో చెప్పాలని తన సంస్థను, అప్పిలేట్ అధికారిని సమాచార హక్కు చట్టం కింద కోరంగా వారు స్పందించలేదు. దీంతో ఆమె సీఐసీని ఆశ్రయించారు. ఈ చట్టం శాశ్వత ఉద్యోగులతోపాటు, తాత్కాలిక, కాంట్రాక్టు సిబ్బందికి కూడా వర్తిస్తుందని ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఆర్టీఐ దరఖాస్తుకు స్పందించకపోవడమే కాకుండా సీపీఐవో, ప్రథమ అప్పిలేట్ అథారిటీ ప్రసూతి ప్రయోజన చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. -
మెక్‌డొనాల్డ్స్‌ను తాకిన ‘మీటూ’ ఉద్యమం
న్యూయార్క్ : అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజ కంపెనీ మెక్డొనాల్డ్స్కూ ‘మీటూ’ ఉద్యమం తాకింది. మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా రెండు నేషనల్ అడ్వకసీ గ్రూప్‌లు లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశాయి. 9 నగరాల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో పనిచేస్తున్న 10 మంది మహిళల తరుఫున ఈ గ్రూప్‌లు ఈ ఫిర్యాదు దాఖలు చేశాయి. ఈ వర్కర్లలో సెయింట్ లూయస్కు చెందిన ఓ 15 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. రెస్టారెంట్లో పనిచేసే సూపర్వైజర్లు తనను లైంగికంగా వేధిస్తున్నారని, అసభ్యకరంగా వ్యవహరిస్తూ.. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ అమ్మాయి ఆరోపించింది. ఆ ఒక్క అమ్మాయి మాత్రమే కాక ఫిర్యాదుల్లో తమ గోడును వెల్లబుచ్చుకున్న మహిళలందరూ తాము ఎంత లైంగిక వేధింపులకు గురి అవుతున్నామో వివరించారు. ఉద్యోగుల తక్కువ వేతనాలపై పోరాడుతున్న ఫైట్ ఫర్ 15 డాలర్స్ ఈ వివాదాన్ని నిర్వహిస్తోంది. ఈ కేసులకు అవసరమయ్యే లీగల్ కాస్ట్లను టైమ్స్ యూపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ భరిస్తోంది. సొంతంగా ఈ కేసులను కమిషన్లు, కోర్టుల ముందుకు తీసుకురాలేని మహిళల కోసం నేషనల్ ఉమెన్స్ లా సెంటర్ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా సమాన ఉద్యోగవకాశాల సంఘం వద్ద ఫైట్ ఫర్ 15 డాలర్స్ ఈ ఫిర్యాదులను దాఖలు చేసింది. ఈ లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మెక్‌డొనాల్డ్స్ అధికార ప్రతినిధి టెర్రి హిక్కీ స్పందించారు. తమ వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపులకు, వివక్షకు చోటు లేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను కంపెనీ చాలా సీరియస్‌గా తీసుకుందని హిక్కీ చెప్పారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న రెస్టారెంట్ పేర్లలో ఫ్రాంచైజీలు నడిపేవే ఎక్కువగా ఉన్నాయని, వాటిని ప్రత్యక్షంగా మెక్‌డొనాల్డ్స్ నడపడం లేదని పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులను మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్‌కు, ఫ్రాంచైజీలకు వ్యతిరేకంగా నమోదయ్యాయి. గత రెండేళ్ల క్రితం కూడా ఇదే రకమైన లైంగిక వేధింపుల ఆరోపణల ఫిర్యాదులను మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా ఫైట్ ఫర్ 15 డాలర్స్ నమోదు చేసింది. ఆ సమయంలో ఆరోపణలను సమీక్షించి, తగిన చర్యలు తీసుకుంటామని మెక్‌డొనాల్డ్స్ హామీ ఇచ్చింది. అయితే పాలసీల్లో ఏమైనా మార్పులు చేశారా అనే విషయంపై స్పందించడానికి మాత్రం అధికార ప్రతినిధి నిరాకరించారు. -
లైంగిక వేధింపులు: బుక్కైన స్త్రీ సంక్షేమ శాఖ అధికారి
-
నా కోరిక తీర్చు.. లేకపోతే అంతే
సాక్షి, అనంతపురం : అది స్త్రీ సంక్షేమ శాఖ. అంటే మహిళలు, యువతుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ. కానీ అందులో పనిచేసే ఉద్యోగునులకే భద్రత లేకుండా పోయింది. తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ ప్రతిరోజు వేధింపులే. పైఅధికారుల తీరుతో విరక్తి చెందిన ఓ మహిళా ఉద్యోగి, తన ఉన్నతాధికారికి తగిన రీతిలో బుద్ది చెప్పింది. అధికారి భాగోతాన్ని బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం ఐసీడీఎస్ పీడీ వెంకటేశం ఓ మహిళా ఉద్యోగిపట్ల గత కొద్ది కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని లేకపోతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు వెంకటేశం ఫోన్లో సదరు మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడు. అయితే అధికారి ఫోన్‌కాల్స్ అన్నింటిని మహిళా ఉద్యోగి రికార్డు చేసి తండ్రికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉద్యోగి తండ్రి వెంకటేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే ఆడియో టేపులను బయటపెడతామని హెచ్చరించారు. దీంతో దారికి వచ్చిన వెంకటేశం తన బాగాతాన్ని బయటపెట్టొద్దని, తన ఉద్యోగం పోతుందంటూ ఫోన్లోనే క్షమాపణ కోరాడు. దీంతో విషయం కొద్ది మేర సద్దుమణిగింది. గతంలోనే వెంకటేశంపై పలు ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవెంకటేశంను సస్పెండ్ చేయాలంటూ జిల్లా ఐద్వా అధ్యక్షురాలు సావిత్రి డిమాండ్ చేశారు. -
చిన్నాచితకా ఉద్యోగాలతో సరి
మనదేశంలోని నగరాల్లో నివసిస్తోన్న మహిళల ఉద్యోగాలపై రవాణా సదుపాయాల లేమి ప్రభావం చూపుతోందని ముంబైలో జరిపిన తాజా పరిశోధనలు తేల్చి చెప్పాయి. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల వారు మెరుగైన ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోందని ఈ పరిశీలనలో వెల్లడైంది. దూరప్రయాణాలకు అనువైన రవాణా సౌకర్యాలు కరువై, తాము నివసిస్తోన్న ప్రాంతాల్లోనే తక్కువ వేతనాలు వచ్చే చిన్నా చితకా ఉద్యోగాలతో మహిళలు సరిపెట్టుకుంటున్నారని ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ(ఐటిడిఎస్) సంస్థ అధ్యయనంలో తేలింది. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే 2013లో శ్రామిక మహిళల భాగస్వామ్యం కూడా 34.8 శాతం నుంచి 27 శాతానికి దిగజారినట్టు ఇండియా స్పెండ్ నివేదిక ఇటీవల వెల్లడించింది. వ్యాపార, ఆర్థిక పరిశోధనా సంస్థ మెకెన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ 2015 నివేదిక ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో 63 శాతం మంది శ్రామిక మహిళలు ఉంటే, బీహార్‌కి వచ్చేసరికి అది 9 శాతానికి పడిపోయింది. 2017 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2004 నుంచి 2011–12 లోపల 19.2 మిలియన్ల మంది శ్రామిక మహిళలు తగ్గిపోయారు. ఎఫ్ఐఏ ఫౌండేషన్ గతంలో నిర్వహించిన çసర్వే ప్రకారం పురుషుల కంటే మహిళలే అధికంగా ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ఆధారపడుతున్నట్టు తేలింది. ప్రధానంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి, నగర ప్రాంతాల్లో నివసిస్తోన్న కుటుంబాల్లో పురుషులు 27 శాతం మంది, స్త్రీలు 37 శాతం మంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే ఎంచుకుంటున్నట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. అయితే తక్కువ ఖర్చు, భద్రత కారణాల రీత్యా మహిళలు ప్రభుత్వ రవాణావైపు మొగ్గుచూపుతున్నారని కూడా ఇందులో వెల్లడైంది. 2010 లో జగోరి అనే మహిళా రీసోర్స్ సెంటర్ యుఎన్ వుమన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఢిల్లీలో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో దాదాపు 90 శాతం మంది స్త్రీలు ఏదో రకమైన వేధింపులకు గురైనట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు 51 శాతం మంది వేధింపులకు గురయ్యామనీ, బస్సుల కోసమో, లేక రైళ్ళకోసమో వేచిచూస్తున్న సమయంలో 42 శాతం మంది వేధింపులకు గురైనట్టు వెల్లడించారు. -
కమాన్.. గుసగుస..
పక్కింటి కాంతం ఉంది చూశావూ.. వాళ్లాయనకు ఎవరితోనో లింకు ఉందటే.. నీకెలా తెలుసు అక్కాయ్.. ఎవరో చెబితే.. నేనెందుకు నమ్ముతానే.. ఎవరికి చెప్పొద్దని కాంతమే నాకు చెప్పిందే.. సినిమాల్లో చూపించినట్లు ఇలాంటి చెవులు కొరుక్కోవడాలు మహిళలకే పరిమితమని అనుకుంటూ ఉంటాం.. కానీ మగాళ్లూ ఇందులో ఏమాత్రం తీసిపోవడం లేదని ఓ అధ్యయనం తాజాగా తేల్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఏరియల్ వర్సిటీ ఈ అధ్యయనాన్ని చేసింది. ఇందుకోసం 2,200 మంది ఉద్యోగులను.. వారి గాసిప్ అలవాట్లు తదితరాలపై ప్రశ్నించింది. దీంతోపాటు వారు ఇటీవల కలుసుకున్న ఓ వ్యక్తి గురించి అభిప్రాయాన్ని తెలపమని కోరింది. అనంతరం ఫలితాలను విశ్లేషించగా.. మహిళలతో సమానంగా మగాళ్లు కూడా ఆఫీసుల్లో చెవులు కొరుక్కుంటున్నారట. అయితే.. ఈ గుసగుసల్లో భాగంగా మహిళా ఉద్యోగులు తమ సహచరుల గురించి మాట్లాడేటప్పుడు సానుకూలంగా మాట్లాడితే.. పురుషులు మాత్రం ఆఫీసుల్లో తమ ప్రత్యర్థులను దెబ్బతీయడమే లక్ష్యంగా గాసిపింగ్ చేస్తున్నారు. ‘స్త్రీలే ఎక్కువగా గ్యాసిప్‌లు వంటివి చెప్పుకుంటారన్న సాధారణ అభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు మా అధ్యయనంలో వచ్చాయి. పైగా మగాళ్లతో పోలిస్తే.. గుసగుసల విషయంలో మహిళలు చాలా మంచిగా మాట్లాడతారు కూడా’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన బెన్ హాడర్ పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ జెండర్ స్టడీస్’లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
లోదుస్తుల రంగుఅడిగారు!
ఆమెకెందుకు సార్! ఈ డిపార్ట్మెంట్ల పనెక్కువుంటది. అయ్యో ఆమెకు పనిరాదు! ఆమెకిద్దరు చిన్న పిల్లలు జల్దిసర్దుకుంటది బ్యాగు! ఆమె చాన దూరం నుంచొస్తది బస్సుపోద్దని టెన్ టు ఫైవే ఆమె టైమ్! ఆమె సీట్లనే ఉండది సార్! ఆమెకు ఫ్రెండ్సెక్కువ! చాయ్కంటది, ఫ్రెండ్సంటది, చీరలంటది! ముఖ్యమైన డిపార్ట్మెంట్లు, కీర్తి తెచ్చిపెట్టే సెక్షన్స్, పెద్దపెద్దోళ్లతోని డీల్ చేసే డిపార్ట్మెంట్స్ ఆడవాళ్లకివ్వకుండా ఉండేందుకు మగాళ్లు చెప్పే సూక్తులివేనంటారు అణచివేతల దారుల గుండా ఎదిగివచ్చిన జూపాక సుభద్ర. సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నత స్థానంలో ఉన్న జూపాక సుభద్ర తెలంగాణ పోరుగడ్డపై బలమైన దళిత గొంతుక. ఆమె కథలూ, కవితలూ సమాజంపై విసిరిన సరికొత్త సవాళ్లు. వరంగల్ జిల్లాలో దళిత వాడలో పుట్టి, అణచివేతనూ, వివక్షనూ ఎదిరించే చైతన్యాన్ని విద్యార్థిదశనుంచే అందిపుచ్చుకుని అదే స్ఫూర్తిని తన రచనల్లోనూ, కథలూ, కవితలూ, వ్యాసాల్లోనూ బలంగా వినిపిస్తూ సామాజిక అసమానతలపై కత్తులు ఝుళిపిస్తోన్న జూపాక సుభద్రని స్త్రీపురుష అసమానతలపై ‘సాక్షి’ తలపెట్టిన అక్షరయుద్ధం పై మాట్లాడమని కదిలించాము. అంతే ఒళ్లు గగుర్పొడిచే లైంగిక వేధింపులను భరిస్తూ, మండే గుండెలను చిక్కబట్టుకొని ఎప్పుడేం జరుగుతుందో తెలియక నిత్యం అవమానాలనూ, అవహేళనలనూ ఎదుర్కొంటూ అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతోన్న స్త్రీల గుండెచప్పుడును వినిపించారు. స్త్రీ అన్నదే వాస్తవం తప్ప ఆమె ఉన్నతోద్యోగంలో ఉందా, లేక ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీనా అనే తారతమ్యం ఎక్కడా లేదనడానికి తన జీవితమే ఉదాహరణ అంటోన్న జూపాక సుభద్రతో సాక్షి జరిపిన సంభాషణలోని ముఖ్యాంశాలివి. ‘‘నువ్వే కలర్ అండర్వేర్ వేసుకుంటావ్’’, ‘‘వాడితో క్లోజ్‌గా ఉంటావెందుకు? వాడికి ఎయిడ్స్ ఉంది. నాతో ఉండు’’ ఈ తరహా వేధింపులు ఎక్కడో మారుమూల పల్లెటూళ్లలోనో, ఏ కుగ్రామంలోనో మహిళా ఉద్యోగినికి ఎదురైనవి అనుకుంటే పొరబడ్డట్టే. అక్షరాలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ చక్కబెట్టే చోట పోలీసుల నిత్య పర్యవేక్షణలో ఉండే రాష్ట్ర సచివాలయంలోనే. అవసరం లేకున్నా ఐదింటి వరకు ఆఫీసరు మహిళా ఉద్యోగిని తన ముందు కూర్చోబెట్టుకోవడం ఏమిటి? ఐదింటి తరువాతే మా ఆఫీసరుకి మా పని గురించి ఆలోచించే తీరిక చిక్కడం ఏమిటి? ఎన్నాళ్ళు ‘‘కొత్త....గా’’ ఉంటావన్నాడు! నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మా ఆఫీసరు ఐదింటి తరువాత నన్ను పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. నా కొలీగ్స్‌కి చెపితే వాళ్లెళ్లి ఆమె కొత్తగా చేరింది సార్ అని చెపితే ఎన్నాళ్లు ‘‘కొత్త...గా’’ ఉంటుందని ఒత్తిపలుకుతూ అదోరకంగా ద్వంద్వార్థంతో మాట్లాడాడు. ఏడేడు తరాల్లో ఏకైక దాన్ని గ్రూప్టూ రాసి కొత్తగా ఉద్యోగంలో చేరాను. ఆఫీసరు మాటలకు బెదిరిపోయి మూడు రోజులు సెలవుపెట్టి ఇంట్లోనే ఉన్నాను. అప్పటినుంచి ఎన్నో వేధింపులు, ఎన్నో ఎన్నో జుగుప్సాకరమైన పురుషుల చేతుల పూతలు, బూతులు, గుండెలపైనే గుచ్చే చూపులు, ఏదీ కుదరకపోతే మాపైనే తిరుగుబోతులనే కారెక్టర్ అసాసినేషన్స్. కనీసం చెప్పుకునే దిక్కులేదు నేను చేరేటప్పటికి ఈ సెక్రటేరియట్లో ఆడాళ్లకి ప్రత్యేకించి టాయ్‌లెట్స్ లేవు. లంచ్రూం లేదు. ఎంతో గొడవ చేస్తే ఈ టాయ్‌లెట్స్ వచ్చాయి. కానీ వాటి నిండా బూతుబొమ్మలు, ఆడాళ్లపైన చెత్తరాతలు, లేకపోతే అక్కడే టాయ్‌లెట్ క్లీన్ చేసే అమ్మాయిల పైన అఘాయిత్యాలు కూడా జరిగాయి. ఓ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. బాత్రూం క్లీన్ చేయడానికెళ్లింది. తాగి ఉద్యోగంలో ఉన్న సెక్రటేరియట్ ఎంప్లాయీ ఆమె వెంటే వచ్చి తలుపు మూసేశాడు. ఆమె బయటకు పరిగెత్తుకొచ్చి లబోదిబోమంది. మేమంతా వెళ్లి అతనిపై కంప్లైంట్ ఇస్తే, ఏం జరిగింది? ఎక్కడ పట్టుకున్నాడు? ఆమె అక్కడేం చేస్తోంది? ఇంత పొద్దున్నే ఏం పని? ఇలా ప్రశ్నలు! అఘాయిత్యం చేసినోడిని కాదు, అందుకు బలైన అమ్మాయిని! ఆమె పేరు బయటపడితే కాంట్రాక్టరు ఉద్యోగంలోంచి తీసేస్తాడని భయంతో ఆమె పేరు చెప్పనివ్వలేదు. ఆకాశరామన్న ఉత్తరం ఒక ఉదాహరణ ఆర్కైవ్స్‌లో పనిచేసే ఒకామెపై చీకట్లో జరిగిన అఘాయిత్యాన్ని ఇన్లాండ్ లెటర్లో రాసి పేరు రాయకుండా పోస్ట్ చేస్తే ఒకరి ద్వారా మరొకరికి మొత్తం సెక్రటేరియట్ అంతా తిరిగింది. ఆ ఆకాశరామన్న ఉత్తరంలో తనను ‘‘ఆగం జేసారని రాస్తదామె’’. నా ఫ్రెండే కొన్నేళ్ల క్రితం ఒకామె ఇక్కడ వేధింపులు తట్టుకోలేక, ఇంట్లో భర్త పెట్టే వేధింపులు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకిద్దరు చిన్నపిల్లలు. ఇక ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ మీద జరిగేవేవీ భయంతో బయటకు చెప్పుకోరు. చెపితే ఉద్యోగం పోద్ది, లేదంటే భర్తే మానిపిస్తాడు. అందుకే బయటికి చెప్పరు. మేం సంఘటితం కాకూడదు! మేం ఐక్యంగా ఉండొద్దు. మాకు యూనియన్ ఉండొద్దు. ఇదే ఇక్కడి పురుషులందరి అభిప్రాయం. అందుకే మామీద ఏం జరిగినా కంప్లయింట్ చేయడానికి ఒక కంప్లయింట్ బాక్స్ ఉండదు. కనీసం ఎన్నికల్లో ఆడవాళ్ల పోటీయే లేదు. తొలిసారిగా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌బేరర్‌గా గెలిచాను. నేనొక్కదాన్నే అలా ఓటింగ్ ద్వారా గెలిచిన తొలి మహిళని. తెలంగాణ వచ్చాక మేం ఉమెన్స్ అసోసియేషన్ పెడితే మా కరపత్రాలూ, పోస్టర్లూ చింపేశారు మగ లీడర్లు. మహిళా ఉద్యోగినులకు ఏదైనా జరిగితే అప్పుడు మాదగ్గరికి ఉరికురికి వచ్చి చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెల్వదు. ఏం జేయాలో కూడా తెల్వదు. మహిళా ఎంప్లాయీస్ ఎంతో అభద్రత మధ్య, రక్షణలేని పరిస్థితుల్లో, గోడలపై లేకి రాతల పనిప్రదేశాల్లో పనిచేస్తున్నారు. సెక్రటేరియట్‌లోనే ఇలా ఉంటే మిగిలిన చోట్ల ఆడవాళ్ల పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. మా పై ఆఫీసర్‌కి చెపితే ఇవి గూడా చెప్పాల్నామ్మా గోడలకు రంగులేస్తే పోతైగద అంటడు. నిజానికి గోడలకైతే రంగులు పూసి మరకలు లేకుండా చేయొచ్చు కానీ మెదడు కేం రంగులు పూయాలే? మహిళా ఉద్యోగులపై మగ ఉద్యోగుల కామెంట్! ‘సింప్లీ సిట్టింగ్... మంత్లీ గెట్టింగ్’ - ఇంటర్వ్యూ : అత్తలూరి అరుణ -
ఉద్యోగినులకు ‘షీ–బాక్స్’ అండ
పశ్చిమగోదావరి , నిడమర్రు : పనిచేసే చోట మహిళా ఉద్యోగులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు మన దేశంలో 2013 నుంచి లైంగిక వేధింపుల చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం పరిధిలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తోన్న స్త్రీలందరూ ఉంటారు. ఈ చట్టం ప్రకారం ఆయా కార్యాలయాల్లో పిర్యాదుల కమిటీ ఉండాలి. అయితే ఈ చట్టం అమలు విషయంలో అనేక లోపాల కారణంగా లైంగిక వేధింపుల నుంచి మాత్రం ఉద్యోగినులకు విముక్తి లభించడం లేదు. పనిచేసే చోట నిత్యం ఎదురయ్యే లైంగిక వేధింపులు ఎంత నరకప్రాయమో.. ఆ బాధలు పడేవారికే తెలుస్తుంది. ఆయా సంస్థల్లో చట్టప్రకారం ఫిర్యాదు విభాగాలు ఏర్పాటుపై సరైన పర్యవేక్షణ లేనికారణంగా, ఏదైనా సమస్యతో ఉద్యోగిని ఫిర్యాదు చేసినా ఫలితం లేని పరిస్థితి కూడా అనేక సంస్థల్లో ఉంది. అందుకే, ఉద్యోగం చేస్తున్న మహిళల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్ ఫిర్యాదుల విభాగాన్ని ప్రవేశపెట్టింది. అదే షీ–బాక్స్ (సెక్సువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్). ఆ వివరాలు తెలుసుకుందాం. ఆన్లైన్లో ఫిర్యాదుకు అవకాశం మహిళలు పనిచేసే చోట నిశ్చింతగా ఉద్యోగం చేసుకుంటూ, వేధింపులకు గురికాకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఇటీవల ‘షీ–బాక్స్’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇది గత ఏడాది నవంబర్ నెల నుంచి కేంద్ర, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ ఫిర్యాదు సౌకర్యాన్ని ఉద్యోగినులకు కల్పించింది. ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో అంటే సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులైనా ఫిర్యాదు చేయ్యవచ్చు. తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి వివరంగా తెలియజేయవచ్చు. లైంగిక వేధింపులే కాదు.. ఒక్క లైంగిక వేధింపులే కాదు. మహిళలను భయపెట్టడం, జుగుప్సాకరమైన ఉద్యోగ వాతావరణం సృష్టించడం. స్త్రీలను తక్కువ చేసి మాట్లాడటం.. ఇలా ఎటువంటి ఇబ్బందినైనా నిర్భయంగా ఆన్లైన్ వేదికగా ఫిర్యాదులో పేర్కొనవచ్చు. వారి ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు కలిగించే అన్ని విషయాలనూ ఇందులో నమోదు చేయవచ్చు. ఆన్లైన్లో ఇలా.. ♦ http://shebox.nic.in/ అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. స్క్రీన్ మీద కనిపించే రిజిస్టర్ యువర్ కంప్లయింట్ మీద క్లిక్ చేయాలి. ♦ అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులా.. ప్రైవేటు ఉద్యోగులా అనే కాలంలు కనిపిస్తాయి. గవర్నమెంట్ అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులా అని అడుగుతుంది. ♦ ఆయా ఉద్యోగులకు సంబంధించిన కాలం క్లిక్ చేసిన వెంటనే ఆన్లైన్లో ఫిర్యాదు దరఖాస్తు ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఫిర్యాదుదారు పేరు, ఉద్యోగం, సెల్ నెంబరు, ఈ–మెయిల్, ఆధార్ నంబర్‌తోపాటు కార్యాలయం వివరాలు నమోదు చేయాలి. ♦ మీ ఆఫీసులో ఏ సందర్భంలో మీరు వేధింపులకు గురి అయ్యారు.. గురవుతున్నారు అనే వివరాలను పొందుపరచడానికి బ్రీఫ్ డిస్క్రిప్షన్ వద్ద అవసరమైన మెజేస్ స్పేస్ వస్తుంది. ఇలా ఫిర్యాదు నమోదు పత్రంలో సమాచారం నింపాక, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ♦ ఒకసారి ఫిర్యాదు ఇచ్చారంటే, మీ మెయిల్‌కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులో ఒక లింక్ కూడా వస్తుంది. అక్కడ మీ ఈ–మెయిల్ ఐడీని యూజర్ ఐడీగా వాడుకుని, కొత్త పాస్‌వర్డ్‌ని జనరేట్ చేసుకుని, మీ ఫిర్యాదు విచారణ ఎంతవరకు వచ్చిందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. షీ–బాక్స్ ఒక సింగిల్ విండోలా షీ–బాక్స్ ఒక సింగిల్ విండోలా పనిచేస్తుంది. ఉద్యోగం చేస్తున్న చోట వేధింపులకు గురవుతున్నవారు చేసే ఫిర్యాదు నేరుగా సంబంధిత అధికారులకు చేరుతుంది. వెంటనే వారు.. బాధితురాలు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యాలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారు. షీ–బాక్స్‌లో ఫిర్యాదు చేయడానికి ఈ–మెయిల్ ఐడీ తప్పనిసరి. ఇందులో రిజిస్టర్ చేసుకోవడం చాలా సులభం. తీసుకునే చర్యలపై నిఘా ఉంటుంది. -
గూగుల్‌ను కోర్టుకీడ్చిన మాజీ ఉద్యోగినులు
న్యూయార్క్: సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై ముగ్గురు మాజీ మహిళా ఉద్యోగినులు దావా వేశారు. కంపెనీలో మహిళా ఉద్యోగినులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, తక్కువ స్థాయి పొజిషన్లను ఆఫర్ చేస్తున్నారని ఆరోపిస్తూ వారు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఓ వైపు గూగుల్ కార్యాలయంలో ఈ పిర్యాదులపై అమెరికా కార్మిక శాఖ విచారణ జరుపుతుండగానే ఉద్యోగినులు దావా వేయడం గమనార్హం. 2015లో యూఎస్ కార్మిక విభాగం అధికారులు గూగుల్ ప్రధాన కార్యాలయంలో 21,000 మంది ఉద్యోగులను సర్వే చేసి పలు వివరాలు రాబట్టారు. వీరి విచారణలో మహిళా ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని, ప్రతి విభాగంలోనూ మహిళలకు చాలీచాలని చెల్లింపులు చేస్తున్నారని వెల్లడైంది. ఇక న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన ఉద్యోగినుల్లో ఒకరు మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా, ఒకరు మాజీ కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్, మరొకరు గతంలో గూగుల్‌లో మేనేజర్‌గా పనిచేశారు. కంపెనీలో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ వీరు రాజీనామా చేశారు. మరోవైపు వీరు గూగుల్‌పై కేసు వేయడం పట్ల కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ దీనిపై తాము పూర్తిగా సమీక్షిస్తామని, అయితే వారు చేసిన కీలక ఆరోపణలతో విభేదిస్తున్నామని వ్యాఖ్యానించారు. -
బ్యాంకు దొంగలకు చుక్కలు చూపించిన మహిళలు
-
బ్యాంకు దొంగలకు చుక్కలు చూపించిన మహిళలు
హరియాణాలోని గుర్‌గ్రామ్‌లో ఇద్దరు బ్యాంకు ఉద్యోగినులు సాహసం ప్రదర్శించారు. తమ బ్యాంకును దోచుకోడానికి వచ్చిన ఇద్దరు యువకులను పట్టుకుని చితకబాది, వాళ్లను స్థానికులకు అప్పగించారు. దాంతో వాళ్లు కూడా తమ చేతి బలాన్ని చూపించి, దోపిడీకి వచ్చినవాళ్లను చావగొట్టారు. ఇదెలా జరిగిందంటే.. ఇద్దరు యువకులు గుర్‌గ్రామ్‌లోని ఓ బ్యాంకును దోచుకోడానికి వచ్చారు. ఇద్దరిలో ఒకడు ఏమీ తెలియనట్లుగా ఏదో ఫారం నింపుతున్నట్లు నటించి కుర్చీలో కూర్చున్నాడు. మరొకడు వెనకాల బ్యాగ్ తగిలించుకుని వచ్చి, కాసేపు అతడితో మాట్లాడి తర్వాత బ్యాగ్ తెరిచి అందులో ఉన్న కత్తిని అవతలి వ్యక్తికి ఇచ్చి, తాను రివాల్వర్ పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు వెళ్లారు. రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి దాంతో బెదిరిస్తుండగా కత్తి పట్టుకున్న వ్యక్తి దాంతో దాడి చేశాడు. కౌంటర్ల వద్ద ఉన్న డబ్బు తీసుకుని వెళ్లిపోడానికి ఇద్దరూ ప్రయత్నించారు. కానీ మహిళా ఉద్యోగులు ఇద్దరూ వాళ్లను పట్టుకున్నారు. బయటకు వెళ్లనివ్వకుండా తలుపులు వేసేసి అడ్డంగా నిలబడ్డారు. అంతలో స్థానికులు కూడా లోపలకు వచ్చారు. అంతా కలిసి దుండగులు ఇద్దరినీ పట్టుకుని చేతికి అందిన వస్తువులతో వాళ్లను చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది. -
ప్రసూతి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: ప్రసూతి సెలవులను 12 వారాలు నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం–2017కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న 18లక్షల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చట్టం ద్వారా ప్రపంచంలో ప్రసూతి సెలవులు ఎక్కువ ఇచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. కొత్త చట్టం ప్రకారం 50 లేదా అంత కంటే ఎక్కువ మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థలు వారి పిల్లల కోసం కచ్చితంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. -
ప్రసూతి చట్టం-2017కు రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉద్యోగులకు శుభవార్త. ప్రసూతి సెలవులను 12 వారాలు నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం-2017కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదమూద్ర వేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 18లక్షల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చట్టం ద్వారా ప్రపంచంలో ప్రసూతి సెలవులు ఎక్కువ ఇచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. కొత్త చట్టం ప్రకారం 50 లేదా అంత కంటే ఎక్కువ మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థలు వారి పిల్లల కోసం ఖచ్చితంగా ప్రత్యేక సదూపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగులు తమ పిల్లలను రోజుకు నాలుగుసార్లు కలుసుకునే వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. పరస్పర అంగీకారంతో ప్రసూతి సెలవుల రోజుల్లో మహిళలు ఇంటినుంచి పనిచేసే అవకాశం పొందవచ్చు. పది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు మొదటి రెండు కాన్పులకు 26 వారాలు ఆ తరువాత కాన్పులకు 12 వారాలు సెలవులు తీసుకొవచ్చు. 3నెలలు లోపు పిల్లలను దత్తత తీసుకున్న, ఇచ్చిన వారికి12వారాలు సెలవులు మంజూరు చేయాలి. -
విధుల్లో ఒత్తిడికి గురికావొద్దు
మహిళా పాత్రికేయులకు సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: పాత్రికేయ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఒత్తిడికి లోనుకాకుండా ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి సూచించారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ – 12లోని ‘సాక్షి’ జర్నలిజం స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారతీరెడ్డి మాట్లాడు తూ... మహిళా ఉద్యోగులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్యం తర్వాతే మిగతా పనులన్నారు. ఘనంగా సాక్షి మహిళా దినోత్సవ వేడుకలు ఒక వైపు ఉద్యోగం... మరో వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహించే మహిళలు కుటుంబానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో డాక్టర్ సుజాత వివరించారు. పనిచేసే చోట మహిళ లు ఎలా ఉండాలనే అంశాలను డాక్టర్ ప్రణతీరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ రాణిరెడ్డి, సీఎఫ్‌వో సి.మహేశ్వరి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
మాజీ ఉద్యోగినుల కోసం అమెజాన్ రీకిండిల్
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో కొన్నాళ్ల పాటు కెరియర్ నుంచి విరామం తీసుకున్న మహిళా ఉద్యోగులు మళ్లీ ఉద్యోగాల్లోకి చేరడంలో తోడ్పాటు అందించేందుకు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ’రీకిండిల్’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉద్యోగ విధుల్లో వెసులుబాటు, నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రత్యేక శిక్షణ మొదలైన సదుపాయాలు కల్పించనుంది. ఇటు టెక్నాలజీ, ఆపరేషన్స్ కార్యకలాపాలతో పాటు అటు మానవ వనరుల నిర్వహణ తదితర కార్యకలాపాల్లోనూ పాలుపంచుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. మళ్లీ ఆయా ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించే విధంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇవన్నీ తోడ్పడతాయని అమెజాన్ డైరెక్టర్ రాజ్ రాఘవన్ తెలిపారు. -
నైట్ షిఫ్ట్‌లో మహిళలు.. ఈ సమస్య తప్పదు!
న్యూయార్క్: మహిళలు ఉద్యోగం, లేదా ఏదైనా ఉపాధికోసం పని చేయడం మంచిదే.. అయితే కొన్ని విషయాలలో వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే మహిళల్లో సంతానోత్పత్తిపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని తాజా సర్వే (స్టడీ వెనస్ డే)లో తేలింది. గతంలో పనికి, సంతానోత్పత్తికి సంబంధించి అధ్యయనాలు జరిగాయి. అయితే తొలిసారిగా షిఫ్ట్ ల వారీగా పని, ఆ పని శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటే.. దాని ప్రభావం పుట్టబోయే సంతానంపై ప్రభావం చూపనుందా అనే కోణంలో అమెరికా రీసెర్చర్స్ ఈ అధ్యయనం చేశారు. మసాచుసెట్స్‌లో సంతాన సాఫల్య కేంద్రానికి వచ్చిన దాదాపు 400 మంది మహిళల(సగటు వయసు 35)పై ఈ సర్వే చేశారు. 40 శాతం మహిళలు శారీరక శ్రమ చేస్తున్నారని, 91 శాతం మహిళలు రెగ్యూలర్ ఆఫీస్ వేళల్లో జాబ్ చేస్తున్నట్లు వెల్లడైంది. శారీరక శ్రమ చేసేవారు, నైట్ షిఫ్ట్‌లో జాబ్ చేసేవారిలో అండాల ఉత్పత్తి రేటు తక్కువగా ఉంది. ప్రతి తొమ్మిది మందిలో ఐదుగురు మహిళలు సరైన ఆహార నియమాలు పాటించడం లేదని, ఇతరత్రా కారణాల వల్ల అండాల నాణ్యత తగ్గడంతో పాటు ఉత్పత్తిరేటుపై ప్రతికూల ప్రభావం ఉందని అమెరికా రీసెర్చర్స్ తెలిపారు. వీటితో పాటు స్మోకింగ్ అలవాటు ఉంటే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లండన్ చన్న జయసేన ఇంపీరియల్ కాలేజ్ బృందం వెల్లడించింది. -
బిడ్డను కంటే.. 9 నెలల సెలవు
పిల్లలను కన్న తర్వాత వాళ్ల ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టం. అందులోనూ తల్లులు ఇంట్లో పని చేసుకుంటూ, ఉద్యోగానికి వెళ్లి వచ్చి... వీటన్నింటితో పాటు పిల్లలను కూడా చూసుకోవడం అంటే మరీ ఇబ్బంది. అందుకే తమిళనాడులో పిల్లలను కన్న తర్వాత మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవును 6 నుంచి 9 నెలలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత రెండు నెలల క్రితమే ప్రకటించారు. కానీ దాన్ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఇప్పటివరకు మాతృత్వ సెలవు 180 రోజులు ఉండేదని, దాన్ని 270 రోజులకు పెంచుతున్నామని ఆ జీఓలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెలువడేనాటికే మెటర్నిటీ లీవులో వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, అంటే వాళ్లు కూడా మొత్తం 270 రోజుల సెలవు తీసుకోవచ్చని తెలిపారు. అయితే.. ఇది కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే వర్తిస్తుందని అందులో స్పష్టం చేశారు. ఉద్యోగినులు తమ ఇష్టం ప్రకారం ఈ సెలవు ప్రసవానికి ముందు నుంచి తర్వాతి వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చనే అవకాశం అందులో కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగినులకు మాతృత్వ సెలవులను 9 నెలలకు పెంచుతామన్నది జయలలిత ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒకటి. వాస్తవానికి 2011కు ముందు మూడునెలల సెలవు మాత్రమే ఉండగా, అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆమె 6 నెలలకు పొడిగించారు. ఇప్పుడు 9 నెలలు చేశారు. -
వాళ్లు వెళ్లిపోయారు... వీళ్లు వడలిపోయారు!
జెండర్ ఫైట్ ఐస్లాండ్లో నిన్న మళ్లీ మధ్యాహ్నం 2.38 నిమిషాల తర్వాత మహిళలెవరూ ఆఫీసులలో కనిపించలేదు! గత కొన్ని సొమవారాలుగా ఆ దేశంలో ఇలా మహిళా ఉద్యోగులు మధ్యలోనే పనిమాని, లే దా పని అక్కడికి ముగించి, ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అలాగని వారి ప్రభుత్వం ఆఫ్టర్నూన్ నుంచి ఆడవాళ్లంతా హాయిగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని ఏమీ ప్రకటించలేదు. ఉద్యోగినులే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మగవాళ్లకు ఇస్తున్న జీతాలతో పోల్చిచూస్తే... తమకు వచ్చే జీతానికి తాము 2.38 గంటల వరకు మాత్రమే పనిచేస్తే సరిపోతుందని లెక్కగట్టి, అంతవరకే ఆఫీసులలో ఉంటున్నారు ఐస్లాండ్ మహిళా ఉద్యోగులు. సమానమైన పనికి సమానమైన వేతనం ఉండాలని ఎన్నిసార్లు పిడికిలి బిగించి, నినాదాలు చేసినా ఫలితం లేకపోవడంతో వాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దశాబ్దం క్రితం.. 2005లో మధ్యాహ్నం 2.08 గంటల వరకు పని చేసి వెళ్లిపోయేవారు. 2008లో ఆ వెళ్లిపోయే సమయం 2. 25 గం. అయింది. ఇప్పుడు అదే 2.38కి వచ్చింది. అంటే జీతంలోని అసమానతలు కొద్దికొద్దిగా తగ్గేకొద్దీ సోమవారాల్లో వీళ్లు పనిచేసే టైమ్ నిమిషాల వ్యవధిలో పెరుగుతూ వస్తోంది. ఈ ధోరణితో ప్రభుత్వ కార్యాలయాలు తలపట్టుకుంటున్నాయి. వారానికొకసారి కొన్ని గంటల ముందు మహిళా ఉద్యోగినులు ఇళ్లకు వెళ్లిపోతే వచ్చే నష్టం కన్నా... వాళ్లు వెళ్లిపోయాక వెలవెలపోతున్న కార్యాలయాల్లో పురుష ఉద్యోగులు ఉత్సాహం నశించి, ఈసురోమంటూ పని చేసుకుంటూ పోవడం వల్ల ఉత్పాదక తగ్గి ఎక్కువ నష్టం వస్తోందని అక్కడి సర్వేలు చెబుతున్నాయట! ఈ మాట అలా ఉంచితే... స్త్రీ పురుష వివక్ష లేని దేశంగా కొన్నేళ్ల నుంచీ ఐస్లాండ్ మార్కులు కొట్టేస్తోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వాళ్ల ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్’ ప్రకారం ఐస్లాండ్కు ‘మహిళల స్వర్గసీమ’ అన్న పేరు కూడా ఉంది. ఎంత పేరున్నా నేటికీ ఆ దేశంలోని మహిళలు మగవాళ్లకన్నా 14 నుంచి 17 శాతం తక్కువగా జీతాలు పొందుతున్నారు. -
పూలన్నీ పులకించే..
సంగారెడ్డి జోన్: పూలన్నీ పులకించి.. పుడమి తల్లి పరవశించేలా జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు హుషారుగా సాగాయి. సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సంబురాలను ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. వయోజన విద్య, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి, జడ్పీ ఉద్యోగులు సంయుక్తంగా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతిక బతుకమ్మ పండుగ అని ఎస్పీ చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో పోలీస్ మినీస్టిరియల్ స్టాఫ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు అనురాధ, మహిళ ఉద్యోగులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఊరూరా బతుకమ్మల సందడి కనిపించింది. -
బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్
- ప్రభుత్వ ఉద్యోగుల క్లెయిమ్‌లలో అత్యధికం ఈ వ్యాధివే.. - మొత్తం 40వేల కేసుల్లో క్యాన్సర్ బాధితులు 12 వేలు.. - 80 శాతం బాధితులు మహిళలు.. - రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అధికం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో కేన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అధికంగా దీని బారిన పడుతున్నట్లు తేలింది. వైద్యవిద్యా శాఖకు వస్తున్న మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులను బట్టి చూస్తే అత్యధికంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొంది ఆ తర్వాత ఆ డబ్బును రీయింబర్స్ చేసుకోవడం కోసం వైద్య విద్యా సంచాలకులకు పరిశీలనకు దరఖాస్తులు పంపిస్తారు. ఇలాంటి దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా ఏటా 40 వేలకుపైగా వస్తున్నాయి. ఇందులో 12 వేలు కేవలం క్యాన్సర్‌వే ఉండటం గమనార్హం. ఈ 12వేల కేసుల్లో 8 వేల మంది మహిళా ఉద్యోగులే ఉన్నారు. ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో వైద్యం పొందిన వారు ఉన్నారు. ఇక పురుషుల్లో ఓరల్ క్యాన్సర్ అంటే గుట్కాలు, కిల్లీలు, పాన్‌మసాలాల కారణంగా నోటి క్యాన్సర్ బాధితులు, ఊపిరితి త్తుల క్యాన్సర్ బాధితులు 4వేల మంది ఉన్నా రు. వయసుల వారీగా చూస్తే మహిళల్లో ఎక్కు వ మంది 40 నుంచి 50 ఏళ్లలోపు వారున్నారు. పురుషుల్లో 45 ఏళ్లు పైబడిన వారున్నారు. గుండె, మూత్రపిండాల వ్యాధులూ అధికం మొత్తం 40 వేల మందిలో 12 వేల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉండగా.. మూత్ర పిండాల వ్యాధులు, గుండె జబ్బు బాధితులు తర్వాతి స్థానంలో ఉన్నారు. ఏటా 8 వేల నుంచి 9 వేల వరకూ కిడ్నీ జబ్బులతోనూ, 10 వేల గుండె జబ్బుల బాధితులు దరఖాస్తులూ ఇక్కడకు వస్తున్నాయి. కిడ్నీ, గుండె జబ్బుల బాధితుల్లో 15 శాతం మహిళలుండగా, 85 శాతం పురుషులున్నారు. ఇక గుండె జబు బాధితుల్లో 40 ఏళ్లలోపు వయసున్న వారే అధికం. రాష్ట్రంలో మధుమేహ వ్యాధి అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూండటంతో ఎక్కువ మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. వీరిలో 50 ఏళ్ల వయసువారు ఎక్కువగా ఉన్నారు. వీళ్లందరూ డయాలసిస్ దశలో చికిత్స పొందుతున్న వారే. క్యాన్సర్, గుండె, మూత్రపిండాల వ్యాధులకు చెందిన వారే 30 వేలుండగా, మిగతా వ్యాధులతో చికిత్స పొంది దరఖాస్తు చేసుకున్న వారు 10 వేల మంది. దీన్నిబట్టి ఈ మూడు జబ్బుల తీవ్రత ఏంటో అర్థమైపోతుంది. -
బ్రిటన్ మహిళలకు మాతృత్వం శాపమా?
లండన్: మాతృత్వంతోనే మహిళల జన్మ సార్థకం అవుతుందంటారు. కానీ ఆ మాతృత్వం వల్లే మహిళల జీతభత్యాలు తగ్గిపోతున్నాయని, వారి పదోన్నతి అవకాకాశాలు అడుగంటుతున్నాయన్నది ఎంతమంది గుర్తిస్తారు? ప్రపంచంలోని పలు దేశాల్లో, ముఖ్యంగా మాతృత్వాన్ని ప్రోత్సహించే బ్రిటన్‌లో అమ్మతనం అనంతరం మగవారు, ఆడవారి వేతనాల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతోందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ స్టడీస్ ఓ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యత్యాసం బ్రిటన్‌లో 33 శాతం ఉంది. తొలి ప్రసూతి సెలవు అనంతరం ఉద్యోగాలకు తిరిగొస్తున్న తల్లులు వేతనాల్లో వ్యత్యాసాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మేనేజర్ పదవులకు ఎంపిక కావాల్సిన మహిళలను కూడా తల్లులైన కారణంగా ఆఫీసుల్లో, కంపెనీల్లో రొటీన్ ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొందరు తల్లులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. మరికొందరు తల్లులు పిల్లల పోషణ బాధ్యతలను చూసికోవాల్సిన అవసరం ఉండటం వల్ల, కార్యాలయాల్లో తల్లులకు తగిన పని వాతావరణం లేకపోవడం వల్ల స్వచ్ఛందంగా పార్ట్ టైమర్లుగా మారాల్సి వస్తోంది. ప్రమోషన్ల విషయంలో కూడా తల్లుల పేర్లను కంపెనీలు పరిశీలించడం లేదని ఐఎఫ్ఎస్ నివేదిక వెల్లడించింది. తల్లులైన తర్వాత 20 ఏళ్ల సర్వీసు కాలాన్ని పరిశీలిస్తే వారు మగవారికన్నా నాలుగేళ్లు మాత్రమే తక్కువగా పనిచేస్తున్నారు. 2003 సంవత్సరంలో మగ, ఆడ మధ్య వేతన వ్యత్యాసం 23 శాతం ఉండగా ఇప్పుడది 38 శాతానికి చేరుకొంది. దీన్ని గమనించి బ్రిటన్ ప్రభుత్వం వేతన వ్యత్యాసాలను సరిదిద్దేందుకు కొన్ని చర్యలను ప్రకటించింది. 250, అంతకన్నా ఎక్కువ ఉద్యోగులు కలిగిన ప్రతి కంపెనీ మహిళా ఉద్యోగులకు, పురుష ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు ఏమిటో, పదోన్నతులు ఏమిటో ప్రతి ఏడాది ప్రభుత్వానికి సమర్పించాలని నియమాన్ని తీసుకొచ్చింది. ఈ నియమాన్ని 2017 నుంచి తప్పనిసరి అమలు చేయాలని కూడా ఆదేశించింది. ముఖ్యంగా స్కాట్లాండ్లో స్త్రీ, పురుష వేతనాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉందని నివేదిక తెలియజేసింది. ఆ తేడా ఏడాదికి దాదాపు పది లక్షల రూపాయలు ఉంటోంది. అయితే, ఉత్తర ఐర్లాండ్‌లో మాత్రం ఆశ్చర్యంలో పురుషులకాన్న మహిళలకే జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క 2012లో తప్పిస్తే 2010 నుంచి ఇప్పటి వరకు మగవాళ్లకన్నా ఆడవాళ్లకే జీతాలు ఎక్కువగా ఐర్లాండ్ లో ఉంటున్నాయి. తల్లులయిన తర్వాత కూడా అక్కడ వేతనాల్లో తేడాలు లేవు. 2012లో మాత్రం స్త్రీ, పురుషుల వేతనాలు సమంగా ఉన్నాయి. -
బిడ్డను కంటే.. ఆరు నెలల సెలవు!
మాతృత్వ ప్రయోజనాల చట్టంలో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం, ఇప్పటివరకు బిడ్డను కన్న మహిళలకు మూడు నెలల సెలవు మాత్రమే ఇస్తుండగా, దాన్ని ఆరు నెలలకు పెంచారు. ఆ ఆరు నెలల పాటు ఆమె ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేకుండా, పూర్తి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాల్సి ఉంటుంది. పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోడానికి అంత సమయం అవసరమని చెబుతున్నారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే అన్ని సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీనివల్ల వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న దాదాపు 18 లక్షల మంది ఉద్యోగినులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. చట్ట సవరణలో ఇద్దరు పిల్లల వరకు అయితే ఆరు నెలలు, అంతకంటే మించితే మాత్రం మూడు నెలల సెలవు ఇవ్వాలని చెప్పారు. దాంతోపాటు బిడ్డను దత్తత తీసుకున్నవాళ్లకు కూడా మూడు నెలల సెలవు ఇస్తారు. 50 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలలో తప్పనిసరిగా పిల్లల సంరక్షణ కోసం క్రెష్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్ట సవరణలో పేర్కొన్నారు. -
ఇదేమి టీమ్ స్పిరిట్ బాబోయ్!
బీజింగ్: చైనాలోని ఓ కంపెనీ బాస్ తన మహిళా ఉద్యోగినుల మధ్య టీమ్ స్పిరిట్‌ను పెంచేందుకు ఓ ఆకతాయి పనికి ఒడి గట్టాడు. నోటిలో పెన్నును ముక్కుకు ఆనిచ్చి పట్టుకొని పెదవుల ద్వారానే ఆ పెన్నును స్వీకరించాల్సిందిగా మహిళా ఉద్యోగులను కోరారు. అలా వారు తీసుకున్న పెన్నును మళ్లీ తన పెదవుల ద్వారా వెనక్కి తీసుకున్నారు. పెన్నును కింద జారవేయకుండానే ఈ తతంగాన్ని కొనసాగాలంటూ ఉద్యోగినులను పురమాయించాడు కూడా. వారిలో ఓ మహిళ ఉద్దేశపూర్వకంగానో, పొరపాటునో పెన్నును నేలకు జార విడిచింది. అప్పుడు బాస్ పెదాలు, మహిళా ఉద్యోగి పెదాలకు తగిలినట్లు తెలుస్తోంది. ఇదో సరదా ఆటని, ఉద్యోగుల్లో ఈ ఆట టీమ్ స్పిరిట్‌ను పెంచుతుందని బాస్ వారిని ప్రోత్సహించారు. ఎవరో ఈ సన్నివేశాన్ని సెల్ఫోన్లో వీడియో తీసి దాన్ని చైనా వీడియో షేరింగ్ సైట్ అయిన ‘మియోపి’లో పోస్ట్ చేయగా, అది సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ వీడియో ‘యూట్యూబ్’లో దర్శనమిస్తూ మరింత సంచలనం రేపుతోంది. ఈ వీడియో సన్నివేశంపైనా ఎక్కువ మంది నెటిజెన్లు మండిపడగా, కొందరు మాత్రం తమదైన శైలిలో సున్నితంగా స్పందించారు. 40 సెకండ్ల ఈ వీడియో క్లిప్ మరీ మురిగ్గా ఉందని ఎక్కువ మంది కామెంట్ చేశారు. సాధారణ కంపెనీ అయితే ఈ గేమ్ మాత్రం ఆడదంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘దీన్ని బాస్ భార్య, మహిళా ఉద్యోగినుల భర్తలు చూశారా?’ అంటూ ఇంకొకరు, ‘ఇదే తరహాలో మనం ముద్దుల గేమ్ ఆడొద్దు’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంతకు ఆ కంపెనీ ఏమిటో, దాని బాస్ ఎవరో తెలియలేదు. -
మహిళా ఉద్యోగులకు 6నెలల ఉచిత వసతి
గుంటూరు: అమరావతి వచ్చే మహిళా ఉద్యోగుల వసతి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శాకాలు జారీ చేసింది. ఆరు నెలల పాటు మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా నివాస సదుపాయం కల్పించనుంది. సచివాలయ మహిళా ఉద్యోగులకు రెయిన్ ట్రీ పార్క్‌లో నివాస సదుపాయాలు కల్పించనుంది. వసతి సదుపాయం కావలసిన మహిళా ఉద్యోగులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
‘బాబోయ్..ఇక్కడ మేం పనిచేయలేం’
అమరావతి: కనీస వసతులు కూడా లేని చోట తామెలా పనిచేయగలమని ఏపీ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగులు వాపోయారు. మహిళా ఉద్యోగులు బుధవారం రెండు బస్సుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లి నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. వెలగపూడిలో సెక్రటేరియట్ నిర్మాణ పనులు జరుగుతున్న చోటును పరిశీలించారు. అక్కడ మహిళా ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా లేకపోవటంపై వారు తీవ్ర నిరాశ వెలిబుచ్చారు. అసౌకర్యాలకు నిలయంగా ఉన్న తాత్కాలిక సచివాలయంలో తాము పనిచేయలేమని తేల్చి చెప్పారు. -
బాలికల గురుకులాల్లో ఇక అందరూ మహిళా ఉద్యోగులే!
♦ కొత్త గురుకులాలతో పాటు పాత వాటిలోనూ భర్తీకి ప్రభుత్వం మొగ్గు ♦ రెండు మూడు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రారంభించనున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల బాలికల గురుకులాల్లో మొత్తం మహిళా ఉద్యోగులనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాలికల అక్షరాస్యతను పెంచడంతో పాటు, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం గురుకులాల ద్వారానే సాధ్యమని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో కొత్తగా బాలికల గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటుకానున్న బాలికల గురుకులాలతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న బాలికల గురుకులాల్లో టీచర్లు, వార్డెన్లు మొదలుకుని అన్ని విధుల్లోనూ మహిళా ఉద్యోగులనే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివ రకూ 50 ఏళ్లకు పైబడిన పురుషులను బాలికల గురుకులాల్లో నియమించేందుకు మినహాయింపు ఉండేది. ప్రస్తుతం అటువంటి మిన హాయింపు లేకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంలో సాంకేతికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయా అంశాలపై వివిధ సంక్షేమ శాఖలకు ఈ ఫైల్‌ను పంపించారు. ఆ తర్వాత సాధారణ పరిపాలన శాఖ ఆమోదముద్రకు పంపనున్నారు. ఇందుకు సంబంధించి రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవచ్చునని అధికార వర్గాల సమాచారం. బీసీ వర్గాల్లో అసంతృప్తి కొత్తగా 100 ఎస్సీ, 71 మైనారిటీ, 50 ఎస్టీ గురుకులాలను, 30 రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. తమను మినహాయించి మిగతా అన్నివర్గాలకు గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా 20 బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న 16 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఈ వర్గాల్లో పెరుగుతోంది. -
అన్ని రంగాల్లో మహిళలకు రాత్రి విధులు
- కార్మిక చట్టాల్లో మార్పులు తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం - రాత్రి విధులు ప్రస్తుతం ఐటీ, ఆరోగ్య రంగాలకు మాత్రమే పరిమితం - ఇకపై జౌళి, సేవ, రీటైల్ తదితర రంగాలకు కూడా విస్తరణ - ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు - ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన సాక్షి,బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర కార్మిక చట్టాల్లో ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని రంగాల్లో మహిళలు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకూ రాత్రి విధిలు నిర్వహించేలా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కార్మిక చట్టాలను అనుసరించి ఐటీ, ఐటీ సంబంధ రంగాలు, వైద్య, ఆరోగ్య తదితర విభాగాల్లో మాత్రమే మహిళలు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకూ (నైట్‌షిఫ్ట్‌లో) పనిచేయడానికి అవకాశం ఉంది. మిగిలిన రంగాల్లో ఈ సదుపాయం లేదు. దీని వల్ల పురుషులతో పోలిస్తే మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలింది. సమస్య పరిష్కారం కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజెడ్)లోని అన్ని రకాల సంస్థలతో పాటు, జౌళి (వస్త్ర పరిశ్రమ), సేవ, రీటైల్ రంగాల్లోనూ మహిళలు నైట్‌షిఫ్ట్‌లలో పనిచేయడానికి అవకాశం కల్పించనుంది. ఈమేరకు రాష్ట్ర కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురానుంది. ఇదిలా ఉండగా నైట్‌షిఫ్ట్‌లలో మహిళలను ఉద్యోగులుగా నియమించుకునే సంస్థలు కొన్ని నిబంధనలకు తప్పక పాటించాల్సి ఉంటుంది. ‘నైట్‌షిఫ్ట్‌లో కనీసం ఐదు మందికి తక్కువ కాకుండా మహిళా ఉద్యోగులు ఉండాలి. పనివేళలు ముగిసిన తర్వాత సదరు మహిళా ఉద్యోగులను వారి ఇంటి వద్ద దిగబెట్టడం పూర్తిగా సంస్థయాజమాన్యానిదే బాధ్యత. ఇందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు ఒకే వాహనంలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. మహిళలు ఇంటి వద్ద దిగబెట్టేంత వరకూ వారికి రక్షణ సిబ్బంది ఉండాలి.’ తదితర నిబంధనలు అందులో ముఖ్యమైనవి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లోనూ నైట్‌షిఫ్ట్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుందని కార్మికశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయం వల్ల మహిళలకు పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని కొంతమంది చెబుతుండగా నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే మహిళల రక్షణ విషయం పట్ల కార్మికశాఖలోని ఉన్నతాధికారులే ఆందోళ వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
ఉద్యోగుల ఎదురుచూపు ఓ అంతులేని కథ!
-
ఉద్యోగుల ఎదురుచూపు ఓ అంతులేని కథ!
⇒ పీఆర్సీ ప్రకటించి దాదాపు 11 నెలలు ⇒ జీవోలివ్వకుండా అంతులేని జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ పిల్లల సంరక్షణ సెలవులను కోల్పోతున్న మహిళా ఉద్యోగులు ⇒ తెలంగాణలో దీపావళి కానుకగా రెండో డీఏకి సిద్ధం ⇒ ఏపీలో ఇంతవరకూ తొలి డీఏకే దిక్కులేదు... ⇒ జేఏసీ నాయకత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ⇒ సర్కారుతో అంటకాగుతూ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం ⇒ డిమాండ్లపై కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీకి కేబినెట్ ఆమోదముద్ర వేయడం.. పీఆర్సీ జీవోల జారీ, డీఏ పెంపు, హెల్త్‌కార్డులు తదితర విషయాల్లో రాష్ట్ర సర్కారు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడం వారిని తీవ్రం గా బాధిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చెప్పినవన్నీ మాయమాటలేనని తేలిపోయింద ని వారు మండిపడుతున్నారు. ఎప్పుడడిగినా వచ్చే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామం టూ ప్రభుత్వం దాటవేస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటామని ప్రభుత్వం చెప్పడం మాటలకే పరిమితమని, పీఆర్సీ ప్రకటించి 11 నెల లు కావస్తున్నా, ఫిట్మెంట్ మినహా మరో జీవో ఇవ్వడానికీ ప్రభుత్వానికి మనసు రావట్లేదని విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది దీపావళి కానుకగా రెండో డీఏ ఇవ్వడానికి కూడా అక్కడి ప్రభుత్వం సమాయత్తమవుతోందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో తొలి డీఏకే దిక్కులేదని వారు వాపోతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తున్న విషయం తమకు అర్థమైనా.. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వం మాత్రం అర్థమైనా.. కానట్లుగా నటిస్తూ స్వార్థప్రయోజనాలకోసం సర్కారుతో అంటకాగుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగులు సంక్షేమం ప్రభుత్వానికి పట్టదని తేలిపోయినా జేఏసీ నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తుండడమేంటంటూ మండిపడుతున్నారు. సర్కారు నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టేందుకు, డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టించుకోని ప్రభుత్వం.. పీఆర్సీపై ఎప్పుడడిగినా.. వచ్చే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామంటూ మంత్రులు మభ్యపెడుతున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాజాగా నవంబర్ రెండున జరిగిన కేబినెట్ సమావేశ ఎజెండాలో కూడా పీఆర్సీ జీవోలు, డీఏ పెంపు ప్రతిపాదనను చేర్చకపోవడం శోచనీయమన్నారు. దీన్నిబట్టి ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు. పీఆర్సీ జీవోలు వెలువడడంలో జాప్యం వల్ల ఉద్యోగులకు అనేక నష్టాలు కలుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని వారు విమర్శించారు. కదలని జేఏసీ నాయకత్వం.. ఇదిలా ఉండగా తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన ఉద్యోగసంఘాల జేఏసీ నాయకత్వం చురుగ్గా వ్యవహరించట్లేదన్న అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు ఉపక్రమించాల్సిన జేఏసీ.. మీనమేషాలు లెక్కిస్తుండడం ఇందుకు నిదర్శనమంటున్నారు. నవంబర్ 2నాటి మంత్రివర్గ భేటీలో పీఆర్సీ నివేదికకు ఆమోదముద్ర వేయకపోతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని గతనెల 29న జరిగిన జేఏసీ కార్యానిర్వహకవర్గ సమావేశంలో తీర్మానించారు. అయితే కేబినెట్లో ఈ అంశం ప్రస్తావనకు కూడా రాకపోయినా జేఏసీ మౌనం పాటించడాన్ని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణను జేఏసీ ప్రకటిస్తుందని భావించినా ఎలాంటి స్పందన లేకపోవడం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిజానికి ఉద్యోగుల వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్న ప్రభుత్వపెద్దలు.. ఈ విషయంలో తమకెలాంటి ఇబ్బంది రాకుండా కొద్దిమంది జేఏసీ నేతల్ని తమ కనుసన్నల్లో ఉంచుకుంటే సరిపోతుందనే ధోరణితో ఉన్నారు. ఏడాదిగా అదేవిధానాన్ని అమలు చేస్తున్నారు. పీఆర్సీ జీవోలు, డీఏ పెంపు ప్రతిపాదనలను కేబినెట్ ఎజెండాలో చేర్చకపోయినా జేఏసీ నాయకత్వం నుంచి స్పందన లేకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. నేతలపై తీవ్రమైన ఒత్తిడి.. తమ నేతల స్వార్థ ప్రయోజనాలకు ఉద్యోగుల ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నారని, కనీసం గట్టిగా అడగడమూ చేతకావట్లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ సంఘాల నేతలపై ఒత్తిడి పెరిగింది. దీంతో వారు జేఏసీపై ఒత్తిడి తెస్తున్నారు. ‘ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపట్ల చిత్తశుద్ధితో ఉంటుందనే భ్రమలు తొలగిపోయాయి. గట్టిగా అడిగితే తప్ప.. స్పందించే పరిస్థితి లేదు. సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడానికి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకపోతే ఉద్యోగులు దారుణంగా నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా జేఏసీ నాయకత్వం తక్షణం స్పందించి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి’ అని వారు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ జీవోల జాప్యంతో నష్టాలివీ.. జీవోల జాప్యం జరిగేకొద్దీ ఉద్యోగులకు కలిగే నష్టాల్ని వివిధ సంఘాల నేతలు ఉదహరిస్తున్నారు. అవిలా.. - మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పిల్లల సంరక్షణ సెలవు ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫారసు చేసింది. అయితే రెండో బిడ్డ వయసు 18 ఏళ్లు నిండేలోపే దీన్ని వినియోగించుకోవాలనే నిబంధన విధించింది. పీఆర్సీని నోషనల్‌గా 2013 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. జీవో జారీలో జరుగుతున్న జాప్యం వల్ల.. పీఆర్సీ అమలయ్యే తేదీనాటికి 16 ఏళ్ల వయసు కలిగిన పిల్లలున్న ఉద్యోగినులు ఈ సెలవును వాడుకునే అవకాశాన్ని కోల్పోయారు. - పదో పీఆర్సీ సిఫారసు ప్రకారం.. 25 సంవత్సరాల సర్వీసు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హత లభిస్తుంది. ఈ జీవో రాకపోవడంతో.. 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి 2013 జూలై 1 తర్వాత పదవీ విరమణ చేసినవారు పూర్తి పెన్షన్ పొందే అర్హతను కోల్పోయారు. - పీఆర్సీ అమల్లోకి వచ్చిన 2013 జూలై 1 తర్వాత పదవీ విరమణ చేసినవారికి పదో పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా గ్రాట్యు టీ, కమ్యుటేషన్ పెంచాలి. కానీ ప్రభుత్వం ఈ మేరకు జీవోలివ్వకుండా తాత్సారం చేసినందువల్ల.. పెన్షనర్లకు పెన్షన్ మొత్తం ఇప్పటికీ ఖరారు కాలేదు. డీఏ కూడా గట్టిగా అడగట్లేదు.. ఉద్యోగులకు ఏటా రెండుసార్లు డీఏ పెరుగుతుంది. కేంద్రం ప్రకటించే డీఏ పెంపు ఆధారంగా రాష్ట్రంలోనూ డీఏ పెంచుతూ ఉత్తర్వులిస్తారు. రొటీన్‌గానే డీఏ ఉత్తర్వులొస్తాయి. తెలంగాణలో ఈ ఏడాది దీపావళి కానుకగా రెండో డీఏ ఇవ్వడానికి కూడా అక్కడి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తొలి డీఏకే దిక్కులేదు. డీఏ ఇవ్వాలని కూడా జేఏసీ గట్టిగా అడగట్లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఛీ ఛీ ఇదేం దూషణ!
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఓ ఉన్నతాధికారి నిర్వాకం - మహిళా ఉద్యోగుల పట్ల అసభ్య ప్రవర్తన - ‘సాక్షి’తో గోడు చెప్పుకున్న బాధితులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఏయ్.. పచ్చ రంగు చీర కట్టుకున్నదాన.. నిన్నే..! ఇటురా.. మీటింగ్‌కు వచ్చావా? లేక.. ’ ఈ మాటలు ఎవరో సభ్యత లేని మనిషివి కావు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయి అధికారి.. నర్సులను, మహిళా ల్యాబ్ టెక్నీషియన్లను ఉద్దేశించి అంటున్న మాటలు. ఉన్నతస్థాయి అధికారి దూషణ పర్వాన్ని తట్టుకోలేక కొంత మంది బాధితులు ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘వైద్య విధ్వంసం’పై ప్రచురించిన వరుస కథనాలకు స్పందించిన మహిళా ఉద్యోగులు.. ‘మీరు రాస్తున్న కథనాలతో పాటు మా వ్యథను కూడా ప్రచురించండి’ అని కోరారు. ఇంతకాలం మౌనంగా భరించిన వారు.. తమ బాధను బట్టబయలు చేశారు. ఆ చూపులు భరించలేం... ఇటీవల సమావేశానికి వచ్చిన ఓ మహిళా ఉద్యోగిని ఉద్దేశించి ‘ఏమే.. బొట్ల బొట్ల చీరకట్టుకొచ్చినవ్.. షూటింగ్‌కు వచ్చావా?’ అంటూ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటంతో సదరు ఉద్యోగి కన్నీరు మున్నీరుగా విలపించడంతో తోటి ఉద్యోగులు ఓదార్చారు. అదే రోజు జరిగిన విషయాన్ని ఆమె తన తండ్రికి వివరించింది. తండ్రి ఈ విషయాన్ని ఓ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.మరో ప్రభుత్వ ఉద్యోగి భార్యను కూడా ‘ఏమే’ అంటూ ఏకవచనంతో సంబోధించడంతో పాటు మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే చూపులతో ఇబ్బంది పెట్టినట్టు ఫిర్యాదులు అందాయి. తమ ఇంట్లో కూడా చెప్పుకోలేని దుస్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెమో ఇప్పించి.... సదరు ఉద్యోగి టార్గెట్ చేసిన మహిళా ఉద్యోగులకు చీటికి మాటికి మెమోలు ఇప్పిస్తారని, వచ్చి నేరుగా కలవాలని తన సబార్డినేట్స్‌తో ఫోన్ చేయిస్తారని, మెమో పట్టుకొని ఆయన ఆఫీసు రూంలోకి వెళ్తే నరకంలోకి వెళ్లినట్లుగా ఉంటుందని ఓ ఉద్యోగి ఉద్వేగానికి లోనయ్యారు. మీసం తిప్పుతూ ‘మీరు చెప్పినట్టు ఇక్కడ సాగవు’ అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారని, ఎదురు మట్లాడితే వేధింపులకు గురి చేస్తారని, చేయని తప్పుకు ఎక్కడ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆవేదనతో ఉన్నామని.. మరో ఉద్యోగి కన్నీళ్ల పర్యంతమయ్యారు. సదరు ఉద్యోగి మీద నిర్భయ చట్టం ప్రయోగిస్తే ఇప్పటి వరకు కనీసం 50 కేసులు పెట్టాల్సి వచ్చేదని మరో ఉద్యోగి ఆక్రోశం వెళ్లగక్కారు. ఇలాంటి అధికారిని తక్షణమే పంపించి మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడాలని వారు కలెక్టర్‌ను కోరుతున్నారు. -
మహిళా ఉద్యోగుల పెంపుతో జీడీపీకి జోష్..
ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డ్.. - డబ్ల్యూ20 పేరుతో ప్రత్యేక గ్రూప్ ప్రారంభం అంకారా: పురుష ఉద్యోగులతో సమాన స్థాయికి గనుక మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచగలిగితే.. భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) విలువ 27 శాతం మేర ఎగబాకే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ పేర్కొన్నారు. ఉద్యోగాల్లో స్త్రీ-పురుష సమానత్వం(జెండర్ ప్యారిటీ) ఉండటం వల్ల అమెరికా(5%), జపాన్(9%) ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌పైనే అత్యధిక సానుకూల ప్రభావం ఉంటుందని కూడా ఆమె వెల్లడించారు. ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నుంచి మహిళా లీడర్లతో ఆదివారమిక్కడ ప్రత్యేకంగా డబ్ల్యూ20 గ్రూప్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ లగార్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధిలో మహిళా సాధికారిత పెంపునకు డబ్ల్యూ20 ఏర్పాటు ఎంతగానో దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. సభ్యదేశాలన్నీ తమ నామినీలను నియమించిన తర్వాత తొలి డబ్ల్యూ20 సదస్సు వచ్చే నెలలో ఇస్తాంబుల్‌లో జరగనుంది. మహిళా-పురుష ఉద్యోగుల మధ్య వ్యత్యాసాన్ని 2025కల్లా 25 శాతం మేర తగ్గించాలంటూ గతేడాది నవంబర్‌లో జీ20 దేశాధినేతలు పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా లగార్డ్ ప్రస్తావించారు. దీనివల్ల ప్రపంచ ఎకానమీలో అదనంగా 10 కోట్ల కొత్త కొలువులను సృష్టించేందుకు ఆస్కారం ఉందని ఆమె అంచనా వేశారు. అధిక వేతనాలు, భద్రమైన ఉద్యోగాల్లోకి మరింత మంది మహిళలు గనుక వస్తే... తలసరి ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని చెప్పారు. ఉద్యోగాల్లో స్త్రీ-పురుష సమానత్వంతో టర్కీలో తలసరి ఆదాయం కూడా 22 శాతం మేర ఎగబాకవచ్చని.. ఇతరత్రా చాలా దేశాల్లోనూ ఇదే తరహా ప్రయోజనం ఉంటుందని లగార్డ్ అభిప్రాయపడ్డారు. 2025కల్లా జెండర్ ప్యారిటీ లక్ష్యాల సాధనకు జీ20, డబ్ల్యూ20 గ్రూప్‌లతో పాటు ఐఎంఎఫ్ సభ్యదేశాలన్నీ(188) కలసికట్టుగా కృషిచేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. -
మహిళల పట్ల కమిషనర్ అసభ్య ప్రవర్తన
బద్వేలు అర్బన్: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడంటూ మున్సిపల్ కమిషనర్ శంకరరావుపై శుక్రవారం యూనియన్ నేతలు దాడికి యత్నించారు. చాంబర్లో ఉన్న ఆయన్ను బలవంతంగా బయటకు లాక్కొచ్చి వెళ్లిపోవాల్సిందిగా ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. బద్వేలు మున్సిపల్ కమిషనర్‌గా ఎ.శంకరరావు జూన్30న బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో ముగ్గురు కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు అటెండర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమను కమిషనర్ వేధిస్తున్నారని వారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), సీపీఐ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారు యూనియన్, సీపీఐ నేతలతో కలిసి వచ్చి కమిషనర్‌తో గొడవకు దిగారు. ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు సరిగా లేదని నేతలు కమిషనర్‌ను చాంబర్ నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆయనతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేస్తూ దాడికి యత్నించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న చైర్మన్ సోమేసుల పార్థసారథి, పలువురు కౌన్సిలర్లు యూనియన్ నేతలను మందలించి కమిషనర్‌ను లోపలికి తీసుకెళ్లారు. కొద్ది రోజులు సెలవుపై వెళ్లాల్సిందిగా మున్సిపల్ చైర్మన్.. కమిషనర్‌కు సూచించారు. కాగా, సక్రమంగా విధులు నిర్వర్తించమన్నందుకే తనపై నిందలు వేస్తున్నారని కమిషనర్ శంకరరావు పేర్కొన్నారు. కార్యాలయంలో ఒకరు ఉండి.. మిగతా ఇద్దరు పారిశుద్ధ్య పనులకు వెళ్లాలని చెప్పడం వల్లే ఇలా గొడవ చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయక పోవడంతో కేసు నమోదు కాలేదు. -
మున్సిపల్ కమిషనర్‌పై ఉద్యోగుల దాడి
బద్వేలు : వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణ మునిసిపల్ కమిషనర్‌పై మహిళా ఉద్యోగులు శుక్రవారం దాడి చేశారు. మునిసిపల్ కమిషనర్ ఎ.శంకరరావు కొంత కాలంగా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సీపీఐ నాయకులతో కలసి ఉద్యోగినులు కమిషనర్‌ను ఆయన చాంబర్ నుంచి బయటకు లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. కాగా, సెలవుపై వెళ్లిపోవాలని కమిషనర్‌ను పురపాలక సంఘం చైర్మన్ పార్థసారధి కోరారు. -
‘మున్సిపల్’కు వాస్తుదోషమా!
- మున్సిపాలిటీ కార్యాలయానికి మూఢనమ్మకం బెడద - కూల్చివేశారు.. వదిలేశారు.. - నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో..? - కనీస సౌకర్యాలు లేక మహిళా ఉద్యోగుల ఇబ్బందులు సంగారెడ్డి మున్సిపాలిటీ: మున్సిపల్‌కు సైతం వాస్తు దోషం పట్టుకుంది. దీంతో కార్యాలయం కుడివైపున ఉన్న గదులను కూల్చి వేశారు. కానీ ఇంత వరకు వాటిని పూర్తి చేయకపోవడంతో కార్యాలయ సిబ్బంది తో పాటు సామాన్యులు సైతం కనీస అవసరాలు తీర్చుకోలేక తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీ కార్యాలయంలోని మున్సిపల్ కమిషనర్ చాంబర్ పక్కన (స్టోర్) గదిలో ఉన్న భవనంతో పాటు మూత్రశాలలను సైతం కూల్చి వేశారు. ఇందుకు కార్యాలయం ఎడమవైపున ఎల్ల మ్మ ఆలయం ఉండటంతో అటు వైపునే మూత్రశాలలు ఉండటం వల్లే కార్యాలయానికి అచ్చిరావడం లేదని కార్మికులు, సిబ్బంది పాలకవర్గం దృష్టికి తీసుకురాగా వాటిని కూల్చివేసి అక్కడ గదులు ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేశారు. అందుకనుగుణంగా కార్యాలయంలో ఉన్న మరుగుదొడ్లతో పాటు మూత్రశాల లను సైతం కూల్చి వేశారు. దీంతో వైస్ చైర్మన్ అనారోగ్యం పాలుకావడంతో కూల్చిన వాటిని వది లేశారు. ఇప్పటికి గదులను కూల్చి ఐదు నెలలు గడుస్తున్నా ఇంత వరకు వాటిని పూర్తి చేయలేకపోయారు. దీంతో భవన మరమ్మతులను ఎక్కడికక్కడే వదిలేశారు. ఫలితంగా కార్యాలయ సిబ్బంది, సందర్శకులు కనీస వసతులు లేకపోవడంతో మహిళా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కనీసం తాత్కాలిక ఏర్పాట్లయినా చేయలేకపోయారు. ఫలితంగా కార్యాలయ సిబ్బంది ఐదు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకోసం కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బస్టాండ్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించినా పనులు పూర్తిచేయలేకపోయారు. మొదటి పాలకవర్గ సమావేశంలో కార్యాలయంలోని గదుల మార్పులకు ఆమోదించారు. కార్యాలయంలో ఉన్న గదులను, మూత్రశాలలను కూల్చివేశారు. వాటి స్థానంలో గోడలు నిర్మించినప్పటికీ అసంపూర్తిగానే వదిలేశారు. వారంరోజుల్లో పూర్తిచేస్తాం.. అనివార్య కారణాల వల్ల మరుగుదొడ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని వాటిని వారం రోజు ల్లో పూర్తిచేస్తాం. కార్యాలయానికి వాస్తు దోషం ఉండటం వల్లనే అంద రి సూచనల మేరకు కూల్చివేయడం జరిగింది. మరమ్మతులు అసంపూర్తిగా ఉన్నాయి.. వాటిని త్వరలో పూర్తిచేస్తాం. - మున్సిపల్ చైర్మన్, బొంగుల విజయలక్ష్మి -
చిక్కుల్లో సత్య నాదెళ్ల..!
జీతాలు పెంచమని అడగక్కర్లేదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి మహిళా ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈవో ఉద్బోధ విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణ న్యూయార్క్: మహిళా ఉద్యోగుల వేతనాల అంశంపై సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వివాదంలో చిక్కుకున్నారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలని, జీతం పెరగాల్సి ఉంటే పెరుగుతుంది కానీ ప్రత్యేకంగా అడగక్కర్లేదంటూ ఆయన చేసిన ఉద్బోధ.. శుక్రవారం పెను దుమారం రేపింది. తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో నాదెళ్ల చివరికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. గ్రేస్ హాపర్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ కంప్యూటింగ్ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి దారితీశాయి. జీతం పెంచమని అడగడానికి ఇబ్బందిపడే మహిళా ఉద్యోగులకు ఎలాంటి సలహా ఇస్తారు అంటూ ఇంటర్వ్యూ చేసిన మైక్రోసాఫ్ట్ డెరైక్టర్ మరియా క్లావీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నిజం చెప్పాలంటే జీతం పెంచాలని అడిగే మహిళలకన్నా అడగని వారి దగ్గరే మరింత ఎక్కువగా అస్త్రశస్త్రాలు, శక్తి ఉన్నట్లు లెక్క. ఇలాంటివన్నీ సుకర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉన్నవి. మనం చేసిన దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. కాబట్టి జీతం పెంచాలని అడగడం కాదు.. వ్యవస్థ గురించి తెలుసుకోవాలి, దాన్ని గట్టిగా నమ్మాలి. అప్పుడే ముందుకెళుతున్న కొద్దీ సముచిత స్థాయిలో జీతాలు పెరుగుతాయి’ అంటూ నాదెళ్ల చెప్పారు. అయితే, ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో ఫేస్బుక్, ట్విటర్, లింక్డ్ఇన్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, బ్లాగ్‌లలో నాదెళ్ల కామెంట్ల మీద విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఎక్స్బాక్స్లైవ్ ధర తగ్గేదాకా కూడా నేనూ కర్మ సిద్ధాంతాన్నే నమ్ముకుని కొనకుండా నిరీక్షిస్తాను’ అంటూ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు, నాదెళ్ల వ్యాఖ్యలతో విభేదించిన మరియాకు ప్రశంసలు లభించాయి. సారీ.. సరిగ్గా చెప్పలేకపోయాను .. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో నాదెళ్ల తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయంలో తాను ఇచ్చిన సమాధానం పూర్తిగా తప్పని.. అసలు మహిళలు, పురుషులకు సమాన స్థాయిలో జీతాలు ఉండాన్నది తన అభిప్రాయమన్నారు. దీనిపై తన అభిప్రాయాన్ని వివరిస్తూ ట్విటర్లో ట్వీట్ చేయడంతో పాటు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు లేఖ రాశారు. ‘వేతనం పెంచాలని అడిగేందుకు ఇబ్బందిపడే మహిళా ఉద్యోగులకు మీరిచ్చే సలహా ఏమిటని ఇంటర్వ్యూ చివర్లో మరియా అడిగారు. దీనికి నేనిచ్చిన సమాధానం పూర్తిగా తప్పు. నా అభిప్రాయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాను. ఈ రంగంలో జీతాల పెంపునకు సంబంధించి మహిళా, పురుషుల మధ్య వివక్షకు తావులేకుండా చూడాల్సిందే’ అంటూ నాదెళ్ల ట్వీట్ చేశారు. అలాగే తమ సంస్థ సిబ్బందికి పంపిన ఈమెయిల్ మెమోకి లింకునూ అందులో పొందుపర్చారు. ఈ విషయంపై మరియా ఇచ్చిన సలహా సరైనదేనని, వేతన పెంపునకు అర్హులమని భావించిన పక్షంలో కచ్చితంగా అడగాలని నాదెళ్ల పేర్కొన్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవో బాధ్యతలను చేపట్టడం తెలిసిందే. సత్యపై పుస్తకం.. మరోవైపు, మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి దాకా నాదెళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక పుస్తకం విడుదలైంది. నాదెళ్ల: ది చేంజింగ్ ఫేస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ పేరిట జగ్మోహన్ ఎస్ భవర్ దీన్ని రచించగా, హాచెట్ ఇండియా ప్రచురించింది. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం నుంచి మైక్రోసాఫ్ట్ దాకా నాదెళ్ల ప్రస్థానం, ఆయన కుటుంబ వివరాలు, సాధించిన విజయాలు మొదలైన వాటిని రచయిత ఇందులో పొందుపర్చారు. అలాగే, కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పైనే ఆధారపడుతున్న మైక్రోసాఫ్ట్ భవిష్యత్‌లో మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై దృష్టి సారించేలా నాదెళ్ల ఏ విధంగా ప్రయత్నించవచ్చు అన్నది భవర్ ఈ పుస్తకంలో చర్చించారు. -
వంటతో తంటాలెందుకు?!
వాయనం: వంట... అలవాటైన వారికి చాలా చిన్న పని. కానీ ఉద్యోగినులకు అది చాలా పెద్ద పని. ముఖ్యంగా వంట చేసేటప్పుడు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు, తెలియనితనం వల్ల జరిగే జాప్యాలు విసిగిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి చిట్కాలు చాలా ఉపకరిస్తాయి! - రోజూ కరివేపాకును తీసి, కడిగి కూరలో వేసేబదులు... ఇంట్లో ఉన్న రోజున ఎండబెట్టి, పొడి చేసి, డబ్బాలో వేసి నిల్వ చేసుకుని వాడుకుంటే సమయం ఆదా అవుతుంది! - బెండకాయ ముక్కలు వేగడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది... దానికుండే జిగురు వల్ల. అదే కోసిన వెంటనే వాటిమీద కాసింత నిమ్మరసం చల్లారనుకోండి... జిగురూ ఉండదు, త్వరగానూ వేగిపోతాయి! - ఉప్మా ఉండ కట్టకుండా ఉండాలంటే... ముందే రవ్వకు కాస్త నూనె పూయండి. నూనె ఎక్కువవుతుందని భయమేస్తే... తాలింపులో తగ్గించుకోండి! - అరటి, బంగాళాదుంపల వేపుళ్లు చేసేటప్పుడు తక్కువ మంట మీద ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది. అంత సమయం పట్టకుండా ఉండాలంటే... ముందు ముక్కలమీద ఉప్పునీళ్లు చల్లి, పావుగంట తర్వాత వేయిం చండి... బోలెడు టైమ్ మిగుల్తుంది! - అన్నం వేడిగా ఉన్నప్పుడు పులిహోర చేస్తే ముద్దలా అయిపోతుంది. చల్లార బెట్టేంత సమయం లేకపోతే... అన్నం ఉడికేటప్పుడు ఓ చెంచాడు నెయ్యి కానీ, వెన్న కానీ వేస్తే, పొడిపొడిగా ఉండి ముద్ద అవ్వదు! - కంద, చేమ దుంపలు ఉడికించేటప్పుడు నీటిలో చిన్న బెల్లంముక్క వేస్తే త్వరగా ఉడికిపోతాయి! - ఉల్లిపాయలు వేయించేటప్పుడు కాసింత పంచదార వేస్తే, త్వరగా రంగు మారతాయి! - కూరలో ఉప్పుకానీ పసుపు కానీ ఎక్కువైనప్పుడు ఓ బ్రెడ్ స్లైస్‌ను వేస్తే... ఎక్కువైనదాన్ని పీల్చేసుకుంటుంది. కానీ ఎక్కువసేపు ఉంచితే మెత్తబడి కూరలో కలిసిపోతుంది. కాబట్టి మెత్తబడేలోపే తీసేయండి! - కూరలో పొరపాటున కారం ఎక్కువ పడితే... మళ్లీ నీళ్లు పోసి ఉడికిస్తూ పోకండి. దానివల్ల టైమ్ వేస్ట్ అవుతుంది. కాసిన్ని కొబ్బరిపాలు వేస్తే... కారం తగ్గుతుంది. రుచీ బాగుంటుంది! - టైమ్ తక్కువ ఉంది కదా అని మంట ఎక్కువ పెడితే... వంటకాలు గిన్నెకు అంటుకుని మాడిపోతాయి. అలా జరక్కుండా ఉండాలంటే... ముందు గిన్నెలో చిటెకెడు ఇంగువ వేసి, తర్వాత మిగిలిన దినుసులన్నీ వేయండి! పీనట్ బటర్ కావాలంటే... ఇదే బెటర్! వేరుశెనగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే వాటిని తగిన మోతాదులో తప్పక తీసుకొమ్మని సూచిస్తుంటారు వైద్యులు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతో అవసరం. అయితే ఎప్పుడూ మామూలుగానే తినమంటే వాళ్లు ఇష్టపడకపోవచ్చు. అదే బటర్లా చేసి, బ్రెడ్డుకు రాసి ఇవ్వండి... ఎగిరి గంతేస్తారు! నిజానికి మార్కెట్లో రెడీమేడ్ పీనట్ బటర్ దొరుకుతోంది. కానీ రేటు చాలా ఎక్కువ. ఒక డబ్బా 150 నుంచి 200 రూపాయల వరకూ ఉంటోంది. ఒకవేళ కొని తెచ్చుకున్నా... పిల్లలున్న ఇంట్లో నెలకొకటి అయిపోతుంది. ఆ లెక్కన సంవత్సరానికి ఎంత ఖర్చవుతుందో చూడండి! కాబట్టి ఈ పీనట్ బటర్ మేకర్ని కొనుక్కోవడం ఎంతైనా ఉత్తమం. దీని వెల రూ.3700 నుంచి నాలుగు వేల వరకూ ఉంటుంది. కాస్త ఎక్కువనిపించినా ఒక్కసారి కొని పెట్టేసుకుంటే బోలెడు డబ్బులు మిగులుతాయి కదా! -
కోటి బతుకమ్మల జాతర
హైదరాబాద్: సచివాలయంలో మహిళా ఉద్యోగులు రూపొందించిన కోటి బతుకమ్మల జాతర పోస్టర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యపాలనలో అణచివేతకు గురైన తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనానికి బతుకమ్మ పండుగ నాంది పలకాలని పిలుపు ఇచ్చారు. ఇకపై తెలంగాణ పండుగలకే సెలవు అని చెప్పారు. బతుకమ్మ, దసరా పండుగలను కలుపుకొని 15 రోజులు సెలవు అని ప్రకటించారు. సంక్రాంతికి రెండు రోజులే సెలవులు అని తెలిపారు. ** -
ఐటీ దిగ్గజం టీసీఎస్ సరికొత్త రికార్డు!
ముంబై: దేశ ఐటీ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల నియామకంలో లక్ష సంఖ్యను దాటేసి అరుదైన ఘనతను సొంతం చేసుకునే దిశగా ముందుకు దూసుకుపోతుంది. తాజాగా లక్షకు పైగా మహిళా ఉద్యోగ నియమాకాలు చేపట్టిన టీసీఎస్ ప్రైవేటు సెక్టార్ లో అత్యధిక మహిళా ఉద్యోగాలిచ్చిన రెండో ఐటీ సంస్థగా కూడా రికార్డు నెలకొల్పింది. భారత్ లోనే మిక్కిలి ప్రాధాన్యత ఉన్న టీసీఎస్ మూడు లక్షల ఆరువేల ఉద్యోగాల్లో ప్రథమ భాగం మహిళలకే ప్రాముఖ్యత నిచ్చింది. కాగా, మహిళా ఉద్యోగుల నియామకంలో ఐబీఎమ్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ సంస్థలో మొత్తం 4.31లక్షల ఉద్యోగులుండగా, 1.3 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉండటం విశేషం. ఆ తరువాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, విప్రోలు ఉన్నాయి. ఇన్ఫోసిస్ లో 54, 537 మహిళా ఉద్యోగులుండగా, విప్రోలు 45, 276 మంది మహిళలు ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. -
పరిషత్ ‘తొలి’ సమరం నేడే
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నిక లు ఆదివారం జరుగనున్నాయి. 18 జడ్పీటీసీ, 298 ఎం పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారు లు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ఉదయం ఏడు గం టలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. శనివారమే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలు చేరుకున్నారు. ఆయా మండ ల కేంద్రాల నుంచి పోలింగ్ బాక్సులు, ఇతర సామగ్రితో సిబ్బంది, అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో మధ్యాహ్నం బయలు దేరి సాయంత్రం వరకు పో లింగ్ కేంద్రానికి చేరుకున్నా రు. ఇందుకోసం మొత్తం 209 వాహనాలను వినియోగించారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత చీకటి పడితే, మహిళా ఉద్యోగులను సురక్షితంగా ఇళ్లకు పంపించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. మొదటి విడతలో మొత్తం 7,28,809 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పిల్లలను భర్తలకు అప్పగించి మండల కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఒక రోజు ముందుగానే బయలుదేరిన మహిళా ఉద్యోగులు తమ చిన్నారులను వదలలేక ఇబ్బం దులు పడ్డారు. పిల్లలను తండ్రికి అప్పగించి తల్లి వెళ్తుండగా పిల్లలు ఏడుపులు మొదలు పెట్టారు. ‘‘చిన్నా.. రేపటికల్లా వచ్చేస్తా ఏడవకు కన్నా’’ అంటూ తల్లులు బ్యాలెట్ బాక్సులు తీసుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పిల్లలకు సమయానికి భోజనం పెట్టు, పాలు తాగించు, రాత్రికి సమయానికి పడుకోబెట్టు అంటూ పలు సూచనలు చేస్తూ వెళ్లారు. -
టైటాన్ వాచెస్ మహిళా ఉద్యోగుల రికార్డుల పంట
సిప్కాట్ (తమిళనాడు), న్యూస్‌లైన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని హోసూరులో ఉన్న టైటాన్ వాచెస్ కంపెనీ మహిళా ఉద్యోగులు గిన్నిస్ రికార్డుల పంట పండించారు. 12 విభాగాల్లో కొత్త రికార్డులను సృష్టించారు. ప్రపంచంలో ఎక్కువ మంది మహిళలు ఒకేచోట చేరి బెలూన్లలో గాలి నింపడం, 382 మంది మహిళలు ఒకే చోట చేరి మదర్ థెరిస్సా రూపుతో ఉన్న మాస్కులను ధరించడం, అందరూ ఒకే సారి ఈల వేయడం, పేపర్ టీ కప్పులు నుదుటిపై పెట్టుకోవడం, ఒకే వ్యక్తికి ఏకకాలంలో ఎంతో మంది ఉత్తరాలు రాయడం వంటి అంశాల్లో రికార్డులను నమోదు చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నిర్వాహకులు శాంటిగర్యాంగ్, ఫ్రాన్సిస్ విలియమ్ వీటిని పర్యవేక్షించారు. -
పిల్లల చదువుల కోసం ఎస్బీఐలో రెండేళ్ల లీవు
ముంబై: ఎస్బీఐ మహిళా సిబ్బందికి ఇకపై రెండేళ్ల విద్యాసంబంధ సెలవు సౌలభ్యం కలగనుంది. పిల్లల విద్య, తల్లిదండ్రులు, అత్తమామల యోగక్షేమాలను చూసుకోవడం వంటి ప్రయోజనాలకు ఈ సెలవు కాలాన్ని వినియోగించుకునే వీలుంటుంది. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. తల్లి సంరక్షణలో లేని పిల్లల విద్యా కార్యకలాపాలకు సంబంధించి పురుష ఉద్యోగులకు సైతం ఈ ప్రయోజనం విస్తరించే అవకాశం ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఎస్బీఐ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగం- ఎస్బీఐ క్యాప్స్ చీఫ్‌గా ఆ సంస్థలో మహిళలకు ఆరేళ్ల కాలానికి భట్టాచార్య ఈ తరహా సెలవు విధానాన్ని అమలుచేశారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులో కేవలం రెండేళ్లే ఈ సెలవును మంజూరు చేయాల్సి ఉంటుందని అన్నారు.