
ముంబై: కరోనా వైరస్ దెబ్బతో అన్ని రంగాలు కుదేలయిన విషయం తెలిసిందే. అయితే మహిళలకు కరోనా సంక్షోభం వరంగా మారనుంది. కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. మహిళలు మాత్రం తమ కుటుంబ సభ్యుల సెంటిమెంట్‌తో స్థానికంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తారు. గతంలో ప్రాజెక్టుల పూర్తికావడానికి గతంలో ఒకే షిఫ్ట్‌లో ఉద్యోగులు పని చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయాలని లక్ష్యంతో క్లయింట్లు(ప్రాజెక్ట్ అప్పగించే వ్యక్తులు) కంపెనీ యాజమాన్యాలను ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్, తదితర రంగాలలో ఎక్కువ వైట్ కాలర్(పరిపాలన విభాగం) ఉద్యోగాలను సంస్థలు మహిళలకు ఆఫర్ చేస్తున్నాయి. కాగా అధిక స్థాయిలో మహిళా ఉద్యోగులను నియమించుకుంటామని క్వెస్ క్వార్ప్ సంస్థ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీలు ఉద్యోగుల వలసలతో తీవ్రంగా నష్టపోయావని, రాబోయే కాలంలో మహిళా ఉద్యోగులను(50లక్షల మంది) నియమించుకునే అవకాశం ఉందని అవసర్ హెఆర్ సర్వీసెస్ ఉన్నతాధికారి నవనీత్ సింగ్ తెలిపారు. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో 5,000 మంది మహిళ ఉద్యోగులను కంపెనీలు నియమించుకోనున్నాయి.
కాగా దుస్తుల తయారీ సంస్థలైన (బడ్డీ, ఉన్న)లు 80శాతం మహిళా ఉద్యోగులను నియమించుకుంటాయని ప్రకటించాయి. అయితే గుర్‌గావ్‌కు చెందిన మాట్రిక్స్ సంస్థ ఎండీ గౌతమ్ నేర్ వంద శాతం మహిళ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపారు. మహిళ ఉద్యోగులు నిబద్దత, వినయం, సహనం అధికంగా ఉంటాయని కొన్ని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా భవిష్యత్తుల్లో వైట్ కాలర్ ఉద్యోగాలలో మహిళల ప్రాధాన్యం మరింత పెరగవచ్చని తెలుస్తోంది. (చదవండి: కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ)
Comments
Please login to add a commentAdd a comment