Electronics
-
జపాన్ కంపెనీల హవా.. చైనా బ్రాండ్లకు దెబ్బ!
కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు భారత్‌లో జపాన్ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలు కొంతకాలంగా తగ్గిపోయాయి. ఇటీవల కాలంలో జపాన్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల వల్ల తిరిగి ఇండియాలో వాటి ఉత్పత్తుల అమ్మకాలు పుంజుకుంటున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. సోనీ , పానాసోనిక్, హిటాచీ వంటి జపాన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కానీ కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు వాటి అమ్మకాలు స్థానికంగా తగ్గిపోయాయి. దాంతో జపాన్ కంపెనీలు కొత్త విధానాలను అమలు చేస్తూ తిరిగి వాటి ఉత్పత్తుల అమ్మకాలను పునరుద్ధరిస్తున్నాయి.ఎక్కువ మార్జిన్లు ఉండే ఉత్పత్తులు, బిగ్‌స్క్రీన్ టీవీలను విక్రయించడం, తక్కువ మార్జిన్లు ఉండే వాటిని నిలిపేయడం వంటి విధానాలను పాటిస్తున్నాయి. ప్రధానంగా జపాన్ కంపెనీలు ఇండియాలో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర గృహోపకరణాలను విక్రయిస్తున్నాయి. పానాసోనిక్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెరిగాయి. దాదాపు ఆరేళ్ల పాటు వృద్ధి, అమ్మకాల విషయంలో తిరోగమన పథంలో ఉన్న కంపెనీ ఉత్పత్తులు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 30% పైగా పుంజుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2,338 కోట్ల వ్యాపారంతో పోలిస్తే వినియోగదారుల విభాగంలో 2025లో రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.అమ్మకాలు జూమ్సోనీ ఇండియా గత ఎనిమిదేళ్లలో ఈసారి అత్యుత్తమ నికర లాభాన్ని నమోదు చేసింది. సోనీ బ్రావియా టెలివిజన్ల అమ్మకాల్లో 20% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో సోనీ ఇండియా అమ్మకాలు రూ.7,663 కోట్లుగా ఉన్నాయి. 2014-15లో గరిష్టంగా కంపెనీకి రూ.11,000 కోట్ల రెవెన్యూ సమకూరింది. తర్వాత ఈసారి వచ్చిన ఆదాయమే అధికంగా ఉంది.చైనా బ్రాండ్లతో పోటీపానాసోనిక్ ఇండియా బిజినెస్ ఛైర్మన్ మనీష్ శర్మ మాట్లాడుతూ..‘జపాన్ బ్రాండ్లు ధరల విషయంలో పోటీ పడటం లేదు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాయి. వైఫల్యాల రేటును గణనీయంగా తగ్గించుకోవాలనుకుంటున్నాం. భారత్‌లో క్రమంగా విక్రయాలు పెరుగుతున్నాయి. షావోమీ, హైసెన్స్, హాయర్ వంటి చైనీస్ బ్రాండ్లు, కొడాక్, థామ్సన్ వంటి ఆన్లైన్ కేంద్రీకృత బ్రాండ్ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలున్నాయి. కొరియన్ కంపెనీలైన ఎల్జీ, సామ్‌సంగ్‌లతో కూడా జపాన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటనఎయిర్ కండీషనర్ తయారీ రంగంలో ఉన్న జపాన్ కంపెనీ హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లాభాలు నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదిక 64% అమ్మకాలు పెరగడం ద్వారా రూ.1,392 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ తెలిపింది. -
టాటా ఎల్రక్టానిక్స్ కొత్త ఒప్పందం.. తొలి చిప్ ఫ్యాక్టరీ
న్యూఢిల్లీ: ధొలేరా చిప్ తయారీ ప్లాంటు కోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో (పీఎస్ఎంసీ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా ఎల్రక్టానిక్స్ తెలిపింది. దీని ప్రకారం ఈ ప్లాంటుకు సంబంధించి డిజైన్, నిర్మాణ, సాంకేతికాంశాల్లో పీఎస్ఎంసీ సహాయ, సహకారాలు అందిస్తుంది.పీఎస్ఎంసీ సాంకేతికత, నైపుణ్యాలు భారత్‌లో సెమీకండక్టర్ల తయారీని వేగవంతం చేయగలవని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. గుజరాత్‌లోని ధొలేరాలో టాటా గ్రూప్ రూ. 91,000 కోట్లతో చిప్‌ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. నెలకు 50,000 వేఫర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. దీనితో 1,00,000 పైచిలుకు నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఉపకరణాలే కాదు.. డేటా కూడా ముఖ్యం
సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రపరిచే విషయంలో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, లాప్‌ట్యాప్‌లను, అందులో ఉన్న డేటాను ఒరిజినల్ రూపంలోనే భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. ఉపకరణాలంటే అందులో ఉన్న డేటా కూడా అని, దానిని కూడా భద్రపరచడం తప్పనిసరని తెలిపింది. డేటా అత్యంత కీలకమంది. తన ఫిర్యాదు మేరకు జత్వానీ తదితరులపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఆమెకు చెందిన పలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను జప్తు చేశారని, అందులో కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జత్వానీ నుంచి జప్తు చేసిన ఉపకరణాలన్నింటినీ భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మరోసారి విచారణ జరిపారు. వెనక్కి ఇచ్చేసేందుకే వాటిని తెప్పించారురాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు ఇతర ఉపకరణాలను ఆమెకు తిరిగి ఇచ్చే ఉద్దేశం ఏమీ ప్రస్తుతానికి దర్యాప్తు అధికారికి లేదని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) వద్ద ఉన్న జత్వానీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకు ఇచ్చేస్తున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అసలు ఆ ఉపకరణాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి వద్ద ఉన్నాయని దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఈ సమయంలో విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఎఫ్ఎస్ఎల్ వద్ద విశ్లేషణ నిమిత్తం ఉన్న జత్వానీ మొబైల్ ఫోన్లు తదితర ఉపకరణాలను వెనక్కు ఇచ్చేందుకు హడావుడిగా తెప్పించారని తెలిపారు. ఆ ఉపకరణాలను విశ్లేషించి, అందులో ఉన్న వివరాలతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందచేయాల్సి ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు జప్తు చేసిన నేపథ్యంలో, అందులో ఉన్న సిమ్ కార్డ్ స్థానంలో తాజా సిమ్ కార్డ్‌ను జత్వానీకి ఇవ్వాలని సంబంధిత ఆపరేటర్‌ను పోలీసులు ఆదేశించే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే ఆ సిమ్‌లో ఉన్న డేటా మొత్తం పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు గురించి జత్వానీ ఇష్టమొచ్చినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్డీటీవీకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు. ఈ సమయంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని పునరుద్ఘాటించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ మొత్తం వ్యవహారంలో వారం కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు జత్వానీ, ఆమె తల్లిదండ్రులు కోర్టులో హాజరయ్యారు. -
KLHలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్
-
భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..
భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా కంపెనీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తమ అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు చెప్పినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.భారత్‌లో మరిన్ని డిజైన్లను రూపొందించడానికి యాపిల్ వంటి ఎలక్ట్రానిక్స్ తయారీదారులను ప్రోత్సహించే విధానాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకు తమ అవసరాలేమిటో గుర్తించి వాటిని తేర్చేలా కంపెనీలను, పరిశ్రమ వర్గాలను సంప్రదిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఇప్పటికే ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) వంటి పరిశ్రమ సంస్థలతో సమావేశాలను నిర్వహించింది. ఈ సంస్థలో యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడంలో ఎదురయ్యే సాంకేతికపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ కొన్ని ఐఐటీలను కూడా సంప్రదించిందని తెలిసింది. ఎలక్ట్రానిక్స్ సప్లై చెయిన్‌లో స్థానికంగా ఏ భాగాలు రూపొందించబడుతాయి.. ఎలా తయారు చేస్తారు.. దేశీయ విలువ జోడింపును పెంచడానికి ఎలాంటి విధానాలు పాటించాలి అనే అంశాలను గుర్తించడం దీని లక్ష్యం అని ఓ అధికారి తెలిపారు.ఇదీ చదవండి: తగ్గుతున్న ఐఫోన్ విక్రయాలు.. భారత్‌లో ఎలా ఉందంటే..ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులకు గిరాకీ ఎర్పడనుందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. గ్లోబల్ లీడ్ కంపెనీలు ఇన్నోవేషన్, డిజైన్, తయారీరంగంలో భారత్‌ను తమ హబ్‌గా ఎంచుకోవడానికి ప్రభుత్వం అనుకూలమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అమెరికాకు ఎల్రక్టానిక్స్ ఎగుమతులు రెండు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ నుండి అమెరికాకు ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య వార్షిక ప్రాతిపదికన రెండు రెట్లు పెరిగి 6.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఇండస్ట్రీ బాడీ– ఐసీఈఏ (ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్) తెలిపింది. 6.6 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు భారత్ నుంచి ఆల్ టైమ్ గరిష్ట స్థాయని ఐసీఈఏ చైర్మన్ మహీంద్రూ తెలిపారు. ఆయన తెలిపిన సమచారం ప్రకారం, చైనా నుండి అమెరికా మార్కెట్లోకి దిగుమతి అయ్యే ఎల్రక్టానిక్స్ ప్రొడక్టుల వాటా తగ్గింది. ఇటీవలి గణాంకాల ప్రకారం, భారతదేశ ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల నమోదయ్యింది. 2021–22 జనవరి–సెపె్టంబర్ మధ్య అమెరికాకు భారత్ ఎల్రక్టానిక్స్ ఎగుమతుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ సుమారు 253 శాతం పెరిగి 6.6 బిలియన్లకు చేరుకుంది. 2018లో ఈ విలువ 1.3 బిలియన్ డాలర్లయితే, 2022లో 4.5 బిలియన్ డాలర్లని మహీంద్రూ వెల్లడించారు. భారత్–అమెరికాల మధ్య మధ్య ద్వైపాక్షిక ఎల్రక్టానిక్స్ వాణిజ్యం కూడా 84 శాతం మేర రికార్డు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. 2021–22 జనవరి–సెపె్టంబర్ మద్య ఈ విలువ 4.9 బిలియన్ డాలర్లయితే, 2022–23 ఇదే కాలంలో ఈ విలువ 9 బిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. 2023లో ద్వైపాక్షిక ఎల్రక్టానిక్స్ వాణిజ్య విలువ 8.4 బిలియన్ డాలర్లుకాగా, దశాబ్ద కాలంలో ఈ విలువను 100 బిలియన్ డాలర్లు చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బాటలో ఇండో–అమెరికా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ లక్ష్యం సాధనే ధ్యేయం కాగా, భారత్–అమెరికా టాస్క్ ఫోర్స్ ఫర్ ఎల్రక్టానిక్స్ కేవలం స్వల్ప కాలిక ప్రయోజనాలకు సంబంధించినది కాదని టాస్క్ ఫోర్స్ ఆన్ ఎల్రక్టానిక్స్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. భారీ ఎగుమతులకు సంబంధించి ఒక లక్ష్యాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించినదని వివరించారు. ‘‘ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం 9 నెలల్లో 9 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇది చక్కటి అభివృద్ధిగా మేము పరిగణిస్తున్నాము. ఇప్పుడు మా లక్ష్యం ఈ వేగాన్ని మరింత పెంచడం. అమెరికా ఎల్రక్టానిక్స్ మార్కెట్లో భారత్ స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచాలన్నది మా లక్ష్యం‘ అని మీడియాతో ఆయన అన్నారు. అమెరికాకు భారత్ ఎల్రక్టానిక్స్ ఎగుమతుల పెరుగుదల ప్రపంచ ఎల్రక్టానిక్స్ మార్కెట్లో మన దేశ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచ ఎల్రక్టానిక్స్ వాణిజ్యంలో భారత్ ప్రాముఖ్యతను వెల్లడిస్తోందన్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులపై భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఈ విభాగంలో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో 5 రెట్లు వృద్ధిని భారత్ సాధించగలమని తాము భావిస్తున్నట్లు తెలిపారు. చైనా నుంచి భారీగా తగ్గుదల చైనా నుండి అమెరికాకు మొత్తం దిగుమతుల్లో ఎల్రక్టానిక్స్ వాటా 2018లో 46 శాతం. జనవరి–సెపె్టంబర్ 2023లో ఇది 24 శాతానికి తగ్గింది. 2018 అనేక చైనా వస్తువులపై 25 శాతం సుంకాలను (ట్రంప్ టారిఫ్‌లు) అమెరికా విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు వియత్నాం, తైవాన్‌ల నుంచి అమెరికాకు 2018 నుంచి 2022 మధ్య భారీగా ఎల్రక్టానిక్స్ ఎగుమతులు పెరగడం గమనార్హం. ఆయా దేశాల నుంచి వరుసగా ఎగుమతులు 420 శాతం, 239 శాతం మేర పెరిగాయి. క్లిష్టమైన భౌగోళిక రాజకీయ సమస్యలు, సరఫరా గొలుసులను వైవిధ్యం వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. 4 ఏళ్లలో భారీ వృద్ధి దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదిగే సామర్థ్యం ఉంది. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయి. రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుంది. దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం. – అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి -
CES 2024: కొత్త టెక్నాలజీలతో అబ్బురపరుస్తున్న లేటెస్ట్ ప్రొడక్ట్స్ (ఫోటోలు)
-
ఎల్రక్టానిక్స్ తయారీ 4 రెట్లు అప్..
-
4 ఏళ్లలో భారీగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
నోయిడా: దేశీయంగా ఎల్రక్టానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని మంత్రి చెప్పారు. ‘దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్‌కి చెందిన నాలుగో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. డిక్సన్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎల్రక్టానిక్స్ దీన్ని రూ. 256 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు వార్షిక సామ ర్ధ్యం 2.5 కోట్ల యూనిట్లు కాగా, చైనా కంపెనీ షావో మికి కోసం స్మార్ట్ఫోన్లను తయారు చేస్తారు. ఎల్రక్టానిక్స్ సంస్థల సమాఖ్య ఎల్సినా అంచనల ప్రకారం 2021–22లో దేశీయంగా మొత్తం విడిభాగాల మార్కెట్ 39 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 68 శాతం వాటా దిగుమతులదే ఉంటోంది. -
గ్రహాంతరవాసులతో ఆ ఊరి వాళ్లకి సంబంధం ఏంటి? అడుగుపెట్టగానే..
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపూట భోజనం అయినా మానేస్తాం గానీ ఫోన్ లేకుండా ఉండలేం అనేంతగా అడిక్ట్ అయిపోతున్నాం. అయితే ఓ ఊళ్లో నివసించే ప్రజలు మాత్రం మొబైల్, టీవీ , రేడియో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. వినడానికి వింతగా ఉన్నా ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే నియమాన్ని పాటిస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ ఊరు ఎక్కడుంది? సెల్‌ఫోన్స్ లేకుండా అక్కడివాళ్లు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా వెస్ట్ వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్‌పై ఇక్కడ నిషేధం ఉండటంతో ఎవరూ స్మార్ట్‌ఫోన్స్, వైఫై వంటివేవీ ఉపయోగించడానికి వీల్లేదు. ఈ ఊళ్లు సెల్‌ఫోన్స్, వాటి సిగ్నల్ టవర్స్ ఎక్కడా కనిపించవు. గత యాభై ఏళ్లుగా ఇదే నిబంధన అమల్లో ఉంది. ఈ రూల్స్ పాటించేవాళ్లు ఊళ్లో ఉంటారు. అందుకు తగ్గట్లుగా ముందే రెంటల్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేకపోతే ఊరు ఖాళీ చేయొచ్చు కానీ రూల్స్ మాత్రం మార్చరు. నో సిగ్నల్స్.. కారణమిదే 2010 గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 150 మంది కంటే తక్కువే.(ఆ తర్వాత అధికారులు డాటాను వెల్లడించలేదు) సోలార్ పవర్, పాడిపరిశ్రమే అక్కడి వారి జీవనాధారం. వారంతంలో పర్యాటకులు అక్కడికి వచ్చినా సెల్ఫోన్లు పనిచేయకుండా ప్రత్యేకంగా జామర్లు కూడా ఏర్పాటు చేశారు. గ్రీన్‌బ్యాంక్ సిటీలోని ప్రజలు టెక్నాలజీకి దూరంగా ఉండటానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియా టెలిస్కోప్ ఉంది. ఖగోళంలోని రహస్యాలను చేధించేందుకు సుమారు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం పరిశోధనులు కొనసాగుతున్నాయి. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. అందుకే రేడియా టెలిస్కోప్కి ఎలాంటి డ్యామేజీ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పని చేసే ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అనుమతించరు.అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై ఇక్కడ నిషేధం ఉంది.మరి కమ్యూనికేషన్ ఎలా అంటారా?.. ఊరికి దూరంగా ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్ బూత్‌లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. -
పీఎల్ఐ ద్వారా ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు రూ.1000 కోట్లు
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) సాధికార కమిటీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలకు రూ.1000 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం లభించినట్లు అధికారులు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద మొత్తం రూ.3,400 కోట్ల క్లెయిమ్‌లు రాగా.. 2023 మార్చికి ప్రభుత్వం రూ.2,900 కోట్లు పంపిణీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇదే తొలి నగదు పంపిణీ. ఎలక్ట్రానిక్ తయారీ, వైట్ గూడ్స్, జౌళి, ఔషధ పరికరాల తయారీ, వాహన, స్పెషాలిటీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, సోలార్ పీవీ మాడ్యుల్స్, అడ్వాన్డ్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్స్, ఔషధ వంటి 14 రంగాలకు పీఎల్ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశీయ తయారీ, ఉద్యోగాల సృష్టి, ఎగుమతులకు ఊతమిచ్చేందుకు 2021లో ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది. పీఎల్ఐ పథకం కింద ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న 32 భారీ సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో 10 కంపెనీలు మొబైల్ తయారీ సంస్థలే. ఈ పథకం కింద అదనంగా రూ.10లక్షల కోట్ల ఉత్పత్తి; 7 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా. -
భారత్‌కు థామ్సన్ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న థామ్సన్.. భారత ల్యాప్టాప్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రారంభ, మధ్య, ప్రీమియం విభాగాల్లో 2024 మార్చి నాటికి ల్యాప్‌టాప్స్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యూఎస్, ఫ్రాన్స్, యూరప్‌లో వీటిని విక్రయిస్తోంది. అలాగే భారత్‌లో తయారైన స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో థామ్సన్ బ్రాండ్ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ రూ.300 కోట్లతో అత్యాధునిక ప్లాంటును ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ వద్ద స్థాపిస్తోంది. ప్లాంటు అందుబాటులోకి వస్తే టీవీల తయారీలో సూపర్ ప్లాస్ట్రానిక్స్ వార్షిక సామర్థ్యం 20 లక్షల యూనిట్లకు చేరుతుంది. 15 ఏళ్ల విరామం తర్వాత 2018లో సూపర్ ప్లా్రస్టానిక్స్ భాగస్వామ్యంతో థామ్సన్ భారత్‌లో రీఎంట్రీ ఇచి్చంది. స్మార్ట్ టీవీలతోపాటు వాషింగ్ మెషీన్స్, ఎయిర్ కండీషనర్స్, చిన్న ఉపకరణాలను భారత్‌లో విక్రయిస్తోంది. టాప్–5లో భారత్.. అంతర్జాతీయంగా భారత్‌ను టాప్–5లో నిలబెట్టాలని లక్ష్యంగా చేసుకున్నట్టు థామ్సన్‌ను ప్రమోట్ చేస్తున్న యూఎస్‌కు చెందిన ఎస్టాబ్లి‹Ù్డ ఇంక్ సేల్స్ డైరెక్టర్ సెబాస్టియన్ క్రాంబెజ్ తెలిపారు. ‘భారత్‌లో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యూరప్‌లోని భాగస్వాములను ప్రోత్సహిస్తాం. వారు డబ్బులు ఆదా చేయడంతోపాటు ఇక్కడి ఉత్పత్తులు పోటీ ధరలో లభిస్తాయి. నాణ్యత కూడా బాగుంది. వారు భారత్ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశాలు టీవీలకు మాత్రమే పరిమితం కాదు. ల్యాప్టాప్స్, స్మార్ట్‌ఫోన్స్‌కు కూడా విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించారు. సూపర్ ప్లా్రస్టానిక్స్‌కు భారత్‌లో కొడాక్, బ్లాపంక్ట్, వైట్ వెస్టింగ్‌హౌజ్ టీవీ, వైట్ వెస్టింగ్‌హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల హక్కులు సైతం ఉన్నాయి. -
పాడైపోయిన మొబైల్ ఫోన్లు,ల్యాప్‌ట్యాప్‌లు ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ భారత్‌లో తొలిసారిగా ‘మిషన్ ఈ–వేస్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ–వేస్ట్‌ను సేకరించి, రీసైక్లింగ్ చేపడతారు. ఇందుకోసం కంపెనీ స్టోర్లలో బిన్స్‌ను ఏర్పాటు చేస్తామని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు. పాడైన, వినియోగించని మొబైల్ ఫోన్లు, చార్జర్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ను సెలెక్ట్ స్టోర్లకు తీసుకువస్తే చాలు. రూ.10,000 వరకు డిస్కౌంట్ కూపన్ అందుకోవచ్చు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ–వేస్ట్ పోగవుతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో ఈ–వేస్ట్ నిర్వహణను తమ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. మొత్తం పరిశ్రమకు మిషన్ ఈ–వేస్ట్ ప్రేరణగా నిలుస్తుందని సెలెక్ట్ ఈడీ మురళి రేతినేని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
భారీగా తగ్గనున్న, ఫ్రిజ్ లు, టీవిల ధరలు
-
ప్రభుత్వ కార్యాలయాల్లోని ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు ఏర్పాట్లు
-
ఆడంబరాలొద్దు.. ఆదా ముద్దు
సాక్షి, అమరావతి: మారుతున్న కాలంతో పాటు మనుషుల పద్ధతులు మారుతుంటాయి. ఒకప్పుడు రూపాయి ఖర్చు చేయాలంటే కూడా లెక్కలేసుకునేవారు. అవసరమైన వాటికే ఖర్చు చేసేవారు. ఆ తరువాత కొన్ని పరిణామాల వల్ల.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కొలువుల్లో ఊహించని వేతనాలు, అందుబాటులోకి వచ్చిన ఈ–కామర్స్ ఆన్లైన్ సైట్ల కారణంగా అవసరం లేనివాటిని కూడా విచ్చలవిడిగా కొనడం మొదలైంది. కాలచక్రం గిర్రున తిరుగుతున్నట్టే మళ్లీ పాత రోజులొస్తున్నాయి. ఇలాంటి వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ప్రజలు ప్రయత్ని స్తున్నారు. ఆన్లైన్ షాపింగ్‌లను కట్టడి చేసుకుంటూ.. వీధిచివర దుకాణానికి వెళ్లి మరీ పచారీ సరుకులు, వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అమెరికాకు చెందిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) అనే సంస్థ భారత్‌లో గ్లోబల్ కన్స్యూమర్ ఇన్సైట్స్ పల్స్–2023 పేరుతో జరిపిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెరుగుతున్న ధరలు, ఆన్లైన్ డెలివరీలో అవకతవకలు, ఆలస్యం వంటి కారణాలు కొనుగోలుదారుల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. మన దేశంలో 74% మంది.. ప్రపంచవ్యాప్తంగా 50% మంది వినియోగదారులు జీవన వ్యయం, వ్యక్తిగత ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. 12 నగరాలు.. 25 ప్రాంతాలు విశాఖపట్నంతోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కోల్‌కతా, నాగ్‌పూర్, జలంధర్, హైదరాబాద్, మీరట్ రాజ్‌కోట్ మెట్రో నగరాల్లోని 25 ప్రాంతాల్లో 9,180 మంది వినియోగదారుల నుంచి సర్వే సంస్థ పీడబ్ల్యూసీ అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 57 శాతం మంది పురుషులు కాగా.. 43 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 63 శాతం మంది అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నామని వెల్లడించారు. 75 శాతం మంది వినియోగదారులు తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్స్, లగ్జరీ వస్తువులను కొనడం మానుకుంటున్నారు. లగ్జరీ, ప్రీమియం, డిజైనర్ ఉత్పత్తులు 38 శాతం, వర్చువల్ ఆన్లైన్ యాక్టివిటీస్ 32 శాతం, కన్స్యూమర్ ఎల్రక్టానిక్స్ 32 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులు (దుస్తులు, పాదరక్షలు) 31శాతం కొనుగోళ్లు పడిపోయాయి. 38 శాతం మంది ఇతరులు కొంటున్నారు కాబట్టి తామూ కొనాలని అనవసర ఖర్చు చేస్తున్నారు. అయితే.. 54 శాతం మంది మాత్రం వస్తువుల్లో నాణ్యత చూస్తున్నారు. ఆఫర్ ఉంటే చూద్దాంలే కొంతకాలం క్రితం ప్రతి వస్తువునూ ఇంటి వద్దకే తీసుకువచ్చి ఇస్తామనే ప్రకటనలు ఎక్కువగా వచ్చేవి. కూరగాయలు, ఆహారం, కిరాణా సరుకులు, పాలు, దుస్తులు, గృహోపకరణాలు ఇలా ఆన్లైన్లో ఏది ఆర్డర్ పెట్టినా ఇంటి వద్దకే చేరేవి. కానీ.. కొంతకాలంగా ఈ డెలివరీకి కూడా చార్జీలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఈ–కామర్స్ నిర్వాహకులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. నేరుగా డెలివరీ చార్జీలు తీసుకోకుండా కొంత మొత్తం నగదు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే డెలివరీ చార్జీలు ఉండవనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. లేదంటే ఆర్డర్ పెట్టిన సరుకు రావడానికి వారం పది రోజులు వేచి ఉండక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్లైన్ స్టోర్లకు బదులుగా ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోళ్లు జరపడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, 45 శాతం మంది మాత్రం ఈ–కామర్స్ సైట్లలో ప్రమోషన్, ప్రత్యేక రోజుల్లో ఆఫర్లు పెట్టినప్పుడు కొనుగోలు చేస్తున్నారు. 44 శాతం మంది నాణ్యత గల సరుకులను అందించే రిటైల్ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. 38 శాతం మంది బ్రాండెడ్ వస్తువులకు బదులు చవకైనవి కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇందుకోసం బ్రాండెడ్ వస్తువుకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో లభించే అలాంటి వస్తువు కోసం వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారు. సొంత బ్రాండ్లకు డిమాండ్ డబ్బును పొదుపు చేయడం కోసం రిటైలర్ల వ్యక్తిగత బ్రాండ్లను 33 శాతం మంది కొనుగోలు చేస్తున్నారు. అంటే రిలయన్స్, డీ మార్ట్, మోర్, విశాల్ మార్ట్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్ వంటి కొన్ని భారీ దుకాణాల్లో వారి బ్రాండ్ పేరుతోనే వస్తువులు, దుస్తులు, సరుకులు లభిస్తుంటాయి. ఇవి మిగతా వాటితో పోలి్చతే కాస్త తక్కువకే దొరుకుతుంటాయి. అలాంటి వాటిని కొందరు కొంటున్నారు. మన దేశంలోని వినియోగదారులలో సగం మంది దుకాణంలో షాపింగ్ చేసేటప్పుడు ధరలు పెరిగిన విషయం తెలుసుకుని ఇబ్బందిగా భావిస్తున్నారు. దానికి తోడు భారీ దుకాణాల్లో రద్దీ, బిల్లింగ్ కోసం ఎక్కువ సేపు లైన్లలో నిలబడటం వంటి సమస్యలు 35 శాతం మందిని ఆ దుకాణాలకు దూరం చేస్తున్నాయి. ఇలాంటి రిటైల్ దుకాణాల్లో వచ్చే ఆరు నెలల్లో వినియోగదారులు తమ వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారు. చిత్రంగా 88 శాతం కంటే ఎక్కువ మంది స్థానికంగా ఉత్పత్తి చేసిన వాటిని కొనాలనుకుంటున్నారు. పర్యావరణ అనుకూల పదార్థాలతో తయారైన వస్తువులను 87 శాతం మంది ఇష్టపడుతున్నారు. మరోవైపు ఆన్లైన్ షాపింగ్‌లో వినియోగదారులు డేటా గోప్యత విషయంలో ఆందోళన చెందుతున్నారు. వాటి నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్‌తో ఎక్కువగా విసిగిపోతున్నారు. ఫలితంగా, 41 శాతం మంది వ్యక్తిగత డేటాను అంటే ఫోన్ నెంబర్‌ను బిల్లింగ్ సమయంలో ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. -
Amazon Mega Electronics Day sale: అద్భుతమైన ఆఫర్లు, డోంట్ మిస్!
సాక్షి,ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్‌పై మరో సేల్‌ను ప్రకటించింది. మెగా ఎలక్ట్రానిక్స్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు హెడ్ఫోన్లు తదితర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. మార్చి 14 వరకు కొనసాగనున్న ఈ స్పెషల్ సేల్ ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ ‘రిథమ్’ సన్‌గ్లాసెస్: భారీ తగ్గింపుతో) మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఈవెంట్లో శాంసంగ్, యాపిల్, బోట్, పైర్ బాల్ట్, లెనోవో, ఆసుస్, కెనాన్, సోనీ లాంటి ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులు తగ్గింపు ధరల్లో అందించనుంది. హెడ్ఫోన్లు, టాబ్లెట్లు,పీసీ యాక్సెసరీలు, కెమెరాలతో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డీల్స్ , ఆఫర్లను అందిస్తుంది. దీంతోపాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. మెగా సేల్‌లో కొన్ని ప్రత్యేక ఆఫర్లు ♦ ఆసుస్ వివో బుక్ 14 ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 35,990కి అందుబాటులో ఉంది ♦ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 33,490కే కొనుగోలు చేయవచ్చు ♦ ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ స్మార్ట్ వాచ్ రూ. 1,699కే లభ్యం. ♦ రూ. 34,990కే యాపిల్ వాచ్ ఎస్ఈ లభిస్తుంది. బ్యాంకు కార్డ్ కొనుగోళ్లగా రూ. 1500 తగ్గింపు అదనం ♦ ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో రూ. 1,599కి, నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ రూ. 1,199కి అందుబాటులో ఉంది. ♦ సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1 రూ. 69,490కి లభిస్తోంది. -
ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఏపీకి అపార అవకాశాలు
(విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : ఆత్మనిర్భర్ భారత్ విధానంలో భాగంగా కేంద్రం 14 కీలక రంగాల్లో ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలను అమలు చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆహార ఉత్పత్తులు, వైద్య పరికరాలు మొదలైనవి వీటిలో ఉన్నాయని చెప్పారు. శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..ఏపీకి ఉన్న సానుకూలతల దృష్ట్యా మెరైన్ ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో వృద్ధి చెందడానికి రాష్ట్రానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి తోడ్పాటుపందిస్తుందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ తరహా సహకారం కీలకంగా ఉంటుందన్నారు. 2014లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు 2021–22 నాటికి రెట్టింపై 85 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. వ్యాపారాలను సులభతరం చేసే విధానాల్లో భారత్ ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుందన్నారు. పన్నుల విధానాల్లో, కార్పొరేట్ చట్టాల్లోనూ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల అంకుర సంస్థలు)కు సంబంధించి ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. -
ఆఫ్‌లైన్‌లోనే ప్రీమియం ఎలక్ట్రానిక్స్: పెరుగుతున్న ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022లో 15 -16 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. ఇందులో ఆన్లైన్ వాటా ఏకంగా 53 శాతం కైవసం చేసుకుంది. ఆఫ్‌లైన్‌ను మించి ఆన్లైన్ విభాగం దూసుకెళ్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 2023లో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, స్టోర్ల ఏర్పాటుపై ఫోకస్ చేశాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంతో తయారీ సంస్థలు ప్రీమియం ఉపకరణాలపై దృష్టిసారించాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక సామర్థ్యం, వినూత్న సాంకేతికతతో తయారైన ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగిందని ఎల్జీ చెబుతోంది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు వినియోగదారులు ఇలాంటి ప్రీమియం ఉత్పత్తులను స్వయంగా పరీక్షించి, అనుభూతి చెందాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, ఔట్లెట్స్ ఏర్పాటు తప్పనిసరి అని కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ ఉపకరణాల తయారీతోపాటు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న సంస్థలు ఆఫ్‌లైన్‌లో విస్తరణకు వరుస కట్టాయి. ఒకదాని వెంట ఒకటి.. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ ప్రీమియం ఉపకరణాలను ప్రదర్శించేందుకు అతిపెద్ద ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభించింది. అలాగే బెంగళూరులోని శామ్సంగ్ ఓపెరా హౌజ్ స్టోర్‌లో కొత్త గేమింగ్, స్మార్ట్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను ఏర్పాటు చేసింది. పర్సనల్ కంప్యూటర్ల తయారీ దిగ్గజం హెచ్‌పీ ఈ నెలలోనే ఏడు ప్రధాన నగరాల్లో గేమింగ్ స్టోర్స్‌ను తెరిచింది. పీసీలు, యాక్సెసరీస్ అందుబాటులో ఉంచడమేగాక కస్టమర్లు గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. 2023లో ఇటువంటివి 40 కేంద్రాలు తెరవాలన్నది హెచ్‌పీ ఆలోచన. వన్‌ప్లస్, ఆసస్, రియల్మీ సైతం ఔట్లెట్లను స్థాపించాలని భావిస్తున్నాయి. మూడవ ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెల ఢిల్లీలో ఆసస్ ప్రారంభించింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్ అమ్మకాలు 2022లో విలువ పరంగా తొమ్మిది రెట్లు మెరుగ్గా నమోదయ్యాయి. ధరలు దూసుకెళ్తున్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాలు ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. విలువ పరంగా గతేడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. రూ.30 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల మొత్తం విక్రయాలు ఏకంగా 94 శాతం వృద్ధి సాధించాయి. టీవీ పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందితే.. 55 అంగుళాలు, ఆపైన సైజులో ఉండే ప్రీమియం టీవీ మోడళ్లు 95 శాతం ఎగశాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రీమియం విభాగంలో ఇవి 45 శాతం అధికం అవడం విశేషం. ప్రీమియం విభాగం పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. -
ఆఫ్‌లైన్‌లోనే ప్రీమియం ఎలక్ట్రానిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022లో 15–16 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. ఇందులో ఆన్లైన్ వాటా ఏకంగా 53 శాతం కైవసం చేసుకుంది. ఆఫ్‌లైన్‌ను మించి ఆన్లైన్ విభాగం దూసుకెళ్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 2023లో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, స్టోర్ల ఏర్పాటుపై ఫోకస్ చేశాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంతో తయారీ సంస్థలు ప్రీమియం ఉపకరణాలపై దృష్టిసారించాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక సామర్థ్యం, వినూత్న సాంకేతికతతో తయారైన ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగిందని ఎల్జీ చెబుతోంది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు వినియోగదారులు ఇలాంటి ప్రీమియం ఉత్పత్తులను స్వయంగా పరీక్షించి, అనుభూతి చెందాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, ఔట్లెట్స్ ఏర్పాటు తప్పనిసరి అని కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ ఉపకరణాల తయారీతోపాటు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న సంస్థలు ఆఫ్‌లైన్‌లో విస్తరణకు వరుస కట్టాయి. ఒకదాని వెంట ఒకటి.. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ ప్రీమియం ఉపకరణాలను ప్రదర్శించేందుకు అతిపెద్ద ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభించింది. అలాగే బెంగళూరులోని శామ్సంగ్ ఓపెరా హౌజ్ స్టోర్‌లో కొత్త గేమింగ్, స్మార్ట్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను ఏర్పాటు చేసింది. పర్సనల్ కంప్యూటర్ల తయారీ దిగ్గజం హెచ్‌పీ ఈ నెలలోనే ఏడు ప్రధాన నగరాల్లో గేమింగ్ స్టోర్స్‌ను తెరిచింది. పీసీలు, యాక్సెసరీస్ అందుబాటులో ఉంచడమేగాక కస్టమర్లు గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. 2023లో ఇటువంటివి 40 కేంద్రాలు తెరవాలన్నది హెచ్‌పీ ఆలోచన. వన్‌ప్లస్, ఆసస్, రియల్మీ సైతం ఔట్లెట్లను స్థాపించాలని భావిస్తున్నాయి. మూడవ ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెల ఢిల్లీలో ఆసస్ ప్రారంభించింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్ అమ్మకాలు 2022లో విలువ పరంగా తొమ్మిది రెట్లు మెరుగ్గా నమోదయ్యాయి. ధరలు దూసుకెళ్తున్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాలు ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. విలువ పరంగా గతేడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. రూ.30 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల మొత్తం విక్రయాలు ఏకంగా 94 శాతం వృద్ధి సాధించాయి. టీవీ పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందితే.. 55 అంగుళాలు, ఆపైన సైజులో ఉండే ప్రీమియం టీవీ మోడళ్లు 95 శాతం ఎగశాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రీమియం విభాగంలో ఇవి 45 శాతం అధికం అవడం విశేషం. ప్రీమియం విభాగం పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. (ఇదీ చదవండి: హైడ్రోజన్‌తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి) -
ELECRAMA 2023: ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయండి
నోయిడా: అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ సంస్థలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. అలాగే వర్ధమాన దేశాలే కాకుండా సంపన్న మార్కెట్లనూ లక్ష్యంగా చేసుకోవాలని పేర్కొన్నారు. ఎలెక్‌రమా 2023 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నేరుగా సంపన్న దేశాల మార్కెట్లలోకి వెళ్లి భారతదేశ సామర్థ్యాలను చాటి చెప్పాలని తయారీ సంస్థలకు మంత్రి సూచించారు. కోవిడ్–19 మహమ్మారి తర్వాత విశ్వసనీయ భాగస్వాములతోనే కలిసి పని చేయడం ఎంత ముఖ్యమో యావత్ ప్రపంచం గుర్తెరిగిందని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలు లావాదేవీలు జరిపేటప్పుడు పారదర్శకత, సమగ్రత, నిజాయితీని కోరుకుంటున్నాయని గోయల్ తెలిపారు. ఈ నేపథ్యంలో బంగారంలాంటి అవకాశాన్ని వదులుకోకుండా సత్వరం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. -
ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు : రూ.1.6 లక్షల కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 36.8 శాతం వృద్ధితో రూ.1.6 లక్షల కోట్లు దాటతాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో మొబైల్స్ వాటా దాదాపు సగ భాగం ఉంటుందని భావిస్తోంది. ‘దేశం నుంచి 2021-22లో రూ.1,16,937 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ పలు దేశాలకు సరఫరా అయ్యాయి. ఇందులో మొబైల్స్ వాటా రూ.45,000 కోట్లు. 2022-23లో ఇది రూ.76,000 కోట్లు దాటుతుంది. 2022 ఏప్రిల్-డిసెంబర్లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఎలక్ట్రానిక్స్ విలువ రూ.1,33,313 కోట్లు. ఇందులో మొబైల్స్ వాటా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. 2021 ఏప్రిల్-డిసెంబర్లో మొబైల్స్ ఎగుమతులు రూ.27,288 కోట్లు. యూఏఈ, యూఎస్, నెదర్లాండ్స్, యూకే, ఇటలీకి అధికంగా మొబైల్స్ సరఫరా అయ్యాయి’ అని ఐసీఈఏ వివరించింది. -
ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి!
మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రస్తుతం భారత ప్రజలు డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు అంతా ఆన్లైన్ వైపు మళ్లారు. ఇటీవల ఇంటర్నెట్ వినియోగం పెరగడం, మరో వైపు ఆన్లైన్ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. పుడ్, దుస్తులు, వస్తువులు ఇలా ప్రతీది నెట్టింట చెల్లిస్తూ ఇంటికే పరిమితం అవుతున్నారు ప్రజలు. వీటి కారణంగా దేశంలోని ఇ-కామర్స్ కంపెనీల వ్యాపారంలో నిరంతర వృద్ధి నమోదు అవుతోంది. ఈ క్రమంలో అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మింత్రా ( Myntra), జియో మార్ట్ (Jio Mart) కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు , డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. కొన్నిసార్లు కస్టమర్లు ఈ ఆన్లైన్ షాపింగ్‌లో మోసాలకు గురవుతుంటారు. అయితే మనం నేరుగా షాపింగ్ చేసిన వాటిలో మోసాలకు పాల్పడితే ఫలానా వ్యక్తిని వెళ్లి ప్రశ్నించవచ్చు. కానీ ఆన్లైన్ అలా కుదరుదు. వీటికంటూ ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఈ క్రమంలో ఫిర్యాదుకు సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఓ సారి చూద్దాం! ఇవే నిబంధనలు... ఈ తరహా మోసాలకు సంబంధించి భారత ప్రభుత్వ వినియోగదారుల విభాగం కొన్ని నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, అతను దీన్ని సులభంగా చేయగల హక్కు కస్టమర్‌కు ఉంది. నిబంధనల ప్రకారం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఏదైనా కస్టమర్ ఫిర్యాదుపై 48 గంటల్లోగా స్పందించాలి. కస్టమర్ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, సదరు కంపెనీ ఆ ఫిర్యాదును ఒక నెలలోపు పరిష్కరించడం కూడా తప్పనిసరి. కస్టమర్లు తమ ఫిర్యాదులను కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా, సందేశం పంపడం ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. చదవండి: అమ్మకానికి బంకర్.. అణుదాడి జరిగినా తప్పించుకోవచ్చు! -
కొరియన్ కంపెనీతో మిందా జట్టు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డేసంగ్ ఎల్టెక్‌తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిందా కార్పొరేషన్ తెలిపింది. దీని కింద కొత్త తరం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) సొల్యూషన్స్‌ను భారత ఆటోమోటివ్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. రాబోయే కొన్నేళ్లలో పలు ఏడీఏఎస్ ఫీచర్లు సర్వత్రా వినియోగంలోకి వస్తాయని కార్ల తయారీ దిగ్గజాలు అంచనా వేస్తున్నట్లు మిందా కార్పొరేషన్ ఈడీ ఆకాశ్ మిందా తెలిపారు. ఇప్పటికే దేశీ మార్కెట్లో ఇందుకు సంబంధించి తొలి సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్(ఐఈటీఈ) ఫెలోగా ఎన్నికయ్యారు. సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఐఆర్‌వో) గుర్తింపుతో 1953లో ఏర్పడిన ఈ సొసైటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాలకు చెందిన నిష్ణాతులు సభ్యులుగా ఉంటారు. చదవండి: ఆ అగ్రిమెంట్లో తప్పేముంది? ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ తరఫున 1.25 లక్షల మందికి పైగా నిపుణులు దేశ, విదేశాల్లో 63 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు. మంత్రి డాక్టర్ సురేష్‌ను ఐఈటీఈ సొసైటీ విజయవాడ కేంద్రం నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరింది. డాక్టర్ సురేష్ కర్ణాటకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతీయ రైల్వేలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇంజనీరింగ్‌లో పరిశోధనలు చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ అందుకున్నారు. -
గజియాబాద్ పేలుడు ఘటన.. టీవీలు పేలడానికి ప్రధాన కారణాలు ఏవో తెలుసా!
ఇటీవల ఎలక్ట్రిక్ బైకులు, స్మార్ట్ఫోన్లు పేలిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదాల కారణంగా కొందరు తీవ్రంగా గాయపడగా, ఇంకొందరి ప్రాణాలు కూడా పోయాయి. తాజాగా గజియాబాద్‌లో టీవీ పేలి ఓ టీనేజర్ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఎలక్ట్రిక్ పరికరాల వాడడంపై కాకుండా సురక్షితం ఎలా వాడాలో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా టీవీలు పేలడం అరుదుగా జరిగే ఘటనలే అయినప్పటికీ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని గజియాబాద్ సంఘటన చెప్తోంది. ఈ నేపథ్యంలో వీటి పేలుడుకి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. గజియాబాద్ ఘటనలో టీవి పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇంటి గోడ ఎల్ఈడీ టీవీలు పేలడానికి గల కారణాలు ఇవే! ఎల్ఈడీ టీవీలు పేలడానికి రకరకాల కారణాలున్నాయి. టీవీలో ఉండే కెపాసిటర్లు వల్ల పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే కెపాసిటర్ అంటే విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుని.. బ్యాటరీలా పని చేస్తుంది. టీవీ ఆపరేట్ చేయడానికి, అవసరమైన సమయంలో స్టాండ్‌బై మోడ్‌లో ఉండటానికి అవసరమైన కొద్దిపాటి శక్తిని నిల్వ చేస్తుంది. అయితే క్వాలిటీ కెపాసిటర్ వాడడం వల్ల, లేదా టీవీలోని కెపాసిటర్లు పాతవి కావడం వల్లే పేలుళ్లు సంభవిస్తాయి. అయితే గజియాబాద్ పేలుడు ఇంత తీవ్రస్థాయిలో ఉండడానికి గది వాతావరణం కూడా కారణమై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవర్ హీటింగ్ ఎలక్ట్రికల్ డివైజ్‌లు చాలా వరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు లేదా పేలుడుకు గురవుతాయి. టీవీలను ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు లేదా చాలా పరికరాలను టీవీలకు కనెక్ట్ చేసి వాడుతున్న సమయంలో అవి సులభంగా వేడెక్కుతుంది. ఈ క్రమంలో వేడెక్కిన పరికారాలు వాటి పరిమితి దాటిన వెంటనే పేలుడికి దారితీస్తాయి. అకస్మాత్తుగా వోల్టేజ్లో మార్పు.. భారత్ వంటి దేశాలలో టీవీ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణాలలో ఒకటి విద్యుత్ లేదా వోల్టేజ్లో ఆకస్మిక పెరుగుదల కూడా ఒకటి. దీనినే మరో రకంగా పవర్ సర్జ్ అని కూడా అంటాం. తప్పుడు వైరింగ్ ఉన్న ప్రాంతాల్లో ఇది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆకస్మిక విద్యుత్ పెరుగుదల నుంచి డివైజ్ డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంచేందుకు కంపెనీలు టీవీలో అనేక పరికారలను ఏర్పాటు చేస్తాయి. తద్వారా ఆది ఆకస్మిక వోల్టేజ్ పెరుగుదలను తట్టుకోగలదు, అయినప్పటికీ, అవి కూడా కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అందుకే ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాల సమయంలో టీవీలను ఆఫ్ చేయమని చెబుతుంటారు. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
హైదరాబాద్: మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. లేట్ చేయకండమ్మా!
లాట్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లు మొబైల్ రిటైల్‌రంగంలో ఏపీ, తెలంగాణల్లో వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను ప్రారంభించింది. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, హోం థియేటర్ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్ట్ కాలింగ్ వాచ్, టవర్ ఫ్యాన్, టీడబ్ల్యూఎస్ ఎయిర్ పాడ్స్, పోర్టబుల్ స్పీకర్, నెక్‌బ్యాండ్ హోం థియేటర్ కాంబో ఆఫర్లు లభిస్తాయన్నారు. స్మార్ట్ టీవీ రూ.8,999, ల్యాప్టాప్స్ రూ.17,499కే లభిస్తాయని తెలిపారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ పండుగలకు సంప్రదాయంతోపాటు ఆధునికత ఉట్టిపడే సరికొత్త వస్త్రాలతోపాటు నగలనూ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచినట్లు ఆర్ఎస్ బ్రదర్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్వదినాలను తెలుగు మహిళలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. షాపింగ్ చేసిన వారికి 2.5 కేజీల బంగారం, 80 కేజీల వెండి, 150 శాంసంగ్ టీవీలు, 600 గ్రైండర్లు, 1,375 ఎలక్ట్రిక్ కుక్కర్లతోపాటు మరెన్నో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. సౌత్ ఇండియా డిస్కౌంట్లు దసరా, దీపావళి పండుగల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్‌ను అందజేస్తోంది. చీరలు, మెన్స్‌వేర్‌పై డిస్కౌంట్‌తోపాటు అతి తక్కువ తరుగుతో బంగారు ఆభరణాలను, తరుగు, మజూరీ లేని వెండి ఆభరణాలను అందుబాటులో ఉంచినట్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ పి.వి.ఎస్.అభినయ్ తెలిపారు. దసరా–దీపావళి లక్కీ బంపర్‌డ్రాలో భాగంగా రూ.ఆరుకోట్ల విలువైన బహుమతులను రెండువేల మంది విజేతలకు అందజేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా ఈనెల 5న, దీపావళి సందర్భంగా ఈనెల 25న బంపర్‌డ్రా ఫలితాలు వెల్లడించినున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్! -
రూ.9,75,600 కోట్ల ఎగుమతులు
చెన్నై: దేశం నుంచి 2025–26 నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.9,75,600 కోట్లకు చేరతాయని కేంద్రం ఆశిస్తోంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ రూ.6,09,750 కోట్లుగా అంచనా. 2026 మార్చినాటికి తయారీ విలువ రూ.24,39,000 కోట్లకు చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. చెన్నై సమీపంలో రూ.1,100 కోట్లతో పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా నెలకొల్పిన ప్లాంటును శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014 నాటికి భారత్ 90 శాతం మొబైల్ ఫోన్స్‌ను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో 97 శాతం దేశీయంగా తయారైనవే. ఏటా రూ.50,000 కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం. వీటిలో ఐఫోన్స్, శామ్సంగ్, ఇతర బ్రాండ్స్ ఉన్నాయి. ఎనమిదేళ్లలో సున్నా నుంచి ఈ స్థాయికి వచ్చాం. భారత్ సాధించింది అతి స్వల్పమే. 2025–26 నాటికి రూ.1,62,600 కోట్ల విలువైన మొబైల్స్ భారత్ నుంచి విదేశాలకు సరఫరా అవుతాయని భావిస్తున్నాం. పెగాట్రాన్ సదుపాయాన్ని ప్రారంభించడం, నోయిడా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఇతర తయారీ యూనిట్ల విజయం.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయని ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని రాజీవ్ తెలిపారు. -
Climes: కర్బన తటస్థత, కర్బనరహిత వ్యవస్థ.. కాఫీ తాగినంత సులువు!
‘కర్బన తటస్థత’.. ‘కర్బనరహితం’ గురించి మాట్లాడటానికి ‘కాప్26’ మాత్రమే వేదిక కానక్కర్లేదు. మన ఇల్లు కూడా అందుకు వేదిక కావచ్చు. పర్యావరణ అనుకూల జీవనశైలికి వ్యవస్థాగత ప్రయత్నాలే కాదు, వ్యక్తిగత స్థాయిలో జరిగే ప్రయత్నాలు కూడా ముఖ్యం అని నమ్ముతుంది క్లైమెస్... ‘ఇచట ఉంది...అచట లేదు’ అని కాకుండా ఎక్కడ చూసినా కర్బన ఉద్గారాలు కలవరపరుస్తూనే ఉన్నాయి. కర్బన ఉద్గారాలు అనే మాట వినబడగానే పెద్ద పెద్ద పరిశ్రమలు మాత్రమే మనకు గుర్తుకు వస్తాయి. అయితే మెయిల్, మెసేజ్‌లు పంపడం, ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవడం, ఆన్లైన్ షాపింగ్ నుంచి విమాన ప్రయాణం వరకు వివిధ రూపాల్లో కర్బన ఉద్గారాలు వెలువడడానికి మనం ఏదో రకంగా కారణం అవుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 3.7 శాతం వాటా ఇంటర్నెట్, వివిధ రకాల గ్యాడ్జెట్లదే. విమానాల నుంచి వెలుబడే ఉద్గారాలకు ఇది సమానం! ఈ నేపథ్యంలో బెంగళూరు, దిల్లీ కేంద్రంగా సిద్దార్థ జయరామ్, అనిరుథ్ గుప్తాలు క్లైమెట్ యాక్షన్ ఫైనాన్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్ క్లైమెస్ మొదలుపెట్టారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పొలిటికల్ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన అనిరుథ్ గుప్తా ఒక స్వచ్ఛందసంస్థను మొదలుపెట్టాడు. ఆ తరువాత జయరామ్‌తో కలిసి ‘క్లైమెస్’కు శ్రీకారం చుట్టాడు. జయరామ్ ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ చేశాడు. హోటల్లో కప్పు కాఫీ తాగడం నుంచి విమాన ప్రయాణం వరకు వివిధ కారణాల వల్ల వెలువడే కర్బన ఉద్గారాల గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది క్లైమెస్. ‘క్యాలిక్లెట్, ట్రాక్ అండ్ రెడ్యూస్’ అనే నినాదంతో కర్బనరహిత విధానాల ఆచరణపై అవగాహన కలిగిస్తుంది. రిలయన్స్‌తో సహా దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు నిర్దిష్టమైన కాలవ్యవధితో శూన్య ఉద్గారాల స్థాయికి చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కృషి చేస్తున్నాయి. 2070 నాటికి జీరో ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనేది మన దేశ లక్ష్యం. అది విజయవంతం కావాలంటే వ్యవస్థగతంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా కార్యాచరణ కావాలి. దీనికి క్లైమెస్ నిర్మాణాత్మక రూపాన్ని ఇస్తుంది. ‘తెల్లారి లేచింది మొదలు ఏదో ఒక సమయంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ప్రభావం గురించి ఆందోళన పడుతుంటాం. మనిషి మనుగడ, కర్బన ఉద్గారాలు అవిభాజ్యం అని కూడా అనిపిస్తుంటుంది. కాని ఇది నిజం కాదు. కర్బన తటస్థత, కర్బనరహిత వ్యవస్థ సాధ్యమే. అది జటిలమైన ప్రక్రియ కాదు. కాఫీ తాగినంత సులువు’ అంటోంది క్లైమెస్. ప్రస్తుతం ఎనిమిది బ్రాండ్లతో మాత్రమే కలిసి పనిచేస్తున్న ‘క్లైమెస్’ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. అయితే దానికి బలమైన భవిష్యత్ ప్రణాళిక ఉంది. ‘రాబోయే నెలల్లో కొన్ని బ్రాండ్ల నుంచి ఎన్నో బ్రాండ్లకు విస్తరిస్తాం’ అనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు జయరామ్. ‘క్లైమెట్–పాజిటివ్ ఫీచర్స్‌తో సులభంగా యాక్సెస్ అయ్యే సౌకర్యం, పారదర్శకత, ఆర్థిక భారం లేకుండా ఉంటే ప్రజలు మనకు మద్దతు ఇస్తారు’ అంటున్నాడు అనిరుద్. రాబోయే కాలంలో మనకు ఎదురయ్యే అతి పెద్ద సవాలు వాతావరణంలో చోటు చేసుకొనే మార్పులు. ‘మన వంతుగా ఏ ప్రయత్నం చేయకపోతే భవిష్యత్ మసక బారే ప్రమాదం ఉంది’ అని హెచ్చరిస్తున్నారు ఇద్దరు మిత్రులు. వ్యక్తిగత స్థాయిలో మనం ఏంచేయగలం అని తెలుసుకోవడానికి ‘క్లైమెస్’ సైట్లోకి వెళితే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. కొత్త దారి దొరుకుతుంది. చదవండి: Cyber Security Tips: పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? డిజిటల్ రాక్షసులుగా మారకుండా.. Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. -
రిలయన్స్ డిజిటల్ ‘ఎలక్ట్రానిక్స్ సేల్’.. కళ్లు చెదిరే ఆఫర్లు అప్పటివరకే!
ముంబై: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్ డిజిటల్ ‘ఎలక్ట్రానిక్స్ సేల్ – డిజిటల్ ఇండియా సేల్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాల కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్టు 16వ తేదీ వరకు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, యాక్సెసరీల కొనుగోళ్లపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చని తెలిపింది. ప్రముఖ బ్యాంకుల కార్డులపై 10% డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే 10% డిస్కౌంట్ వోచర్లను పొందవచ్చు. తదుపరి కొనుగోలుపై ఈ డిస్కౌంట్‌ను వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లతో పాటు Reliancedigitalలో కూడా ఆఫర్ల విక్రయాలు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. అదిరిపోయే ఆఫర్లు సేల్‌లో భాగంగా 65 ఇంచెస్ UHD ఆండ్రాయిడ్ టీవీలు ₹49,990 ప్రారంభ ధరకు అందుబాటులో ఉన్నాయి. 43 ఇంచెస్ టీవీ ధర ₹19,990 నుంచి ప్రారంభమవుతుంది. రిలయన్స్ డిజిటల్ సేల్‌లో, ఇంటెల్ కోర్ i3, 8GB RAM, 512 SSD స్టోరేజ్‌తో కూడిన HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ రూ. 43,999కే అందుబాటులో ఉంది. రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్‌లో స్మార్ట్ఫోన్లపై 35 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. యాపిల్, సామ్సంగ్, మోటోరోలా, వన్‌ప్లస్, షావోమీ, రియల్మీ సహా మరిన్ని బ్రాండ్స్ స్మార్ట్ఫోన్లు ఆఫర్లతో లభిస్తున్నాయి. బ్లూటూత్ స్పీకర్లు, ఇయర్‌ఫోన్స్‌పై 70శాతం వరకు ఆఫర్లు ఇస్తున్నట్టు రిలయన్స్ డిజిటల్ పేర్కొంది. చదవండి: Ola Electric Car: ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఒక్క చార్జింగ్‌తో 500 పైగా కిలోమీటర్లు! -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్:స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్
సాక్షి, హైదరాబాద్: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022కు తెరతీసింది. నేటి (జూలై 23న) అర్థరాత్రి నుంచిబిగ్ సేవింగ్డేస్ సేల్ షురూ కానుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్‌లో కస్టమర్లు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్లు, స్పెషల్ డీల్స్‌ను పొందవచ్చు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపును, టీవీలు, ఇతర ఉపకరణాలపై 70 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఒప్పో, ఆపిల్, వివో, మోటరోలా తదితర స్మార్ట్ఫోన్లపై తగ్గింపు రేట్లు అందిస్తోంది. అలాగే హెడ్ఫోన్లపై 70 శాతం వరకు తగ్గింపును కూడా అందజేయనుంది. మౌస్, రూటర్లు, కీబోర్డులు తదిర కంప్యూటర్ ఉపకరణాలు రూ.99 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. బిగ్ స్క్రీన్ టాబ్లెట్ కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లు 45 శాతం తగ్గింపుతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్‌లపై 65 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. అంతేకాదు సేల్ ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటలకు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు తాజా డీల్స్‌ను కూడా ప్రకటిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకు, కోటక్ బ్యాంక్ ,ఆర్బిఎల్ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ‘ప్లస్’ సభ్యుల కోసం ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ డే సేల్ కూడా జూలై 23 అర్ధరాత్రి నుండి ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు -
తక్కువ ధరలో టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఎలక్ట్రానిక్స్ సేల్ ఉందిగా!
సాక్షి, ముంబై: వాషింగ్మెషీన్లు, ఏసీలు,టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లపై ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ధరల సేల్ ప్రారంభించింది. ముఖ్యంగా టీవీలపై భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 23 నుంచి 27 వరకు కొనసాగనుంది. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 తగ్గింపు కూడా లభ్యం. వూ ప్రీమియం అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ (4కే ) ఎల్ఈడీ టీవీ ఎలక్ట్రానిక్స్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 26,999లకే లభ్యం. దీని ఎంఆర్పీ ధర రూ. 45,000. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎంఐ 5 ఎక్స్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ (4కే)టీవీని ఫ్లిప్‌కార్ట్ ఇపుడు రూ. 31,999 దీని ఎంఆర్పీ ధర రూ. 49,999. 8 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్. HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 2,000 తగ్గింపు. రియల్మీ హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32-అంగుళాల హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని ఫ్లిప్‌కార్ట్ రూ. 15,999లకే సొంతంచేసుకోవచ్చు. దీని ఎంఆర్పీ ధర రూ. 17,999. దీంతోపాటు 8 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభ్యం. Axis Bank కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC వోల్టాస్ 1.5 టన్న 5 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ తక్కువ ధర రూపాయలలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రూ. 67,990 ల ఏసీని ఈ సేల్ లో కేవలం రూ. 37,999లకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 2022 సందర్భంగా. Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్. శాంసంగ్ సింగిల్ డోర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ శాంసంగ్ 198 లీటర్ల 198 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ రూ. 18,000 (ఎంఆర్పీ ధర రూ. 21,990). 12 వేల రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఒనిడా 7కేజీ 5 స్టార్ వాషింగ్ మెషీన్ ఒనిడా 7కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ తగ్గింపు ధరలో రూ.13,490కి లభ్యం. దీని ఎంఆర్పీ ధర. రూ. 21,990 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. -
ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త సేల్.. వాటిపై అదిరిపోయే ఆఫర్స్!
Flipkart Big Bachat Dhamaal: ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఏడాది వరుస పెట్టి ఒక సేల్ తర్వాత మరొక సేల్ తీసుకొని వస్తుంది. తాజాగా బిగ్ బచత్ ధమాల్ పేరుతో మరొక సేల్ తీసుకొని వచ్చింది. మార్చి 4 నుంచి మార్చి 6 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్‌లో యుపీఐ లావాదేవీలపై రూ.1000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్, వేరబుల్స్, టీవి మోడల్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో వంటి ఫోన్ల అమ్మకాలు కూడా ఈ సేల్‌లో భాగంగా ప్రారంభమవుతాయి. అలాగే, కస్టమర్లు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ మీద ప్రత్యేక డీల్స్ పొందవచ్చ. ఇంకా, వినియోగదారులు బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలకు చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉండే 'లూట్ బజార్' కూడా ఇందులో ఉంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ ప్లాన్, పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ పై డీల్స్, ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ అప్ గ్రేడ్ ఆప్షన్, మొబైల్ ప్రొటెక్షన్ ఆఫర్లను కూడా తీసుకురానున్నారు. (చదవండి: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!) -
300 బిలియన్ డాలర్లకు చేరుకొనున్న దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ!
దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2026 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పరిశ్రమ సంస్థ ఐసీఈఏ సోమవారం ఒక నివేదికలో తెలిపింది. నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్(ఎన్పీఈ) 2019 ప్రకారం.. 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా గతంలో నిర్దేశించింది. అయితే, ఈ రంగంపై కోవిడ్-19 మహమ్మారి ప్రతికూల ప్రభావం కారణంగా.. నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2019 నిర్దేశించిన లక్ష్యాన్ని పరిశ్రమ సాధించలేకపోతుందని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2019 లక్ష్యాన్ని 300 బిలియన్ డాలర్లకు తగ్గించడం సమంజసం అని ఈ నివేదికలో వివరించింది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ నివేదిక వివరాలను పంచుకుంటూ.. తగ్గించిన లక్ష్యం 300 బిలియన్ డాలర్లను చేరుకోవడానికి ప్రస్తుత స్థాయి నుంచి 400 శాతం వృద్దిని సాధించాలని పేర్కొన్నారు. అందుకు, అనుకూలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ప్రయత్నాలు అవసరం. పరిశ్రమతో సంప్రదింపులు జరపకుండా పన్ను సుంకంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయరాదని ఆయన అన్నారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మొహింద్రూ అన్నారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల డిమాండ్ 2025-26 నాటికి సుమారు 180 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. "భారతదేశం 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారీ చేయగలిగితే, దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చవచ్చు. అలాగే, 120 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయవచ్చు" అని నివేదిక తెలిపింది. (చదవండి: ఓలా పెను సంచలనం.. ఆ జాబితాలో చేరిన తొలి ఎలక్ట్రిక్ కంపెనీ!) -
లక్ష కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ. 75 లక్షల కోట్లు) ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 2 డిజిటల్ దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వచ్చే 25 ఏళ్ల ప్రణాళికలను మంత్రి వివరించారు. ప్రభుత్వ సర్వీసులను మరింతగా డిజిటలీకరించడం, సమ్మిళిత వృద్ధికి తోడ్పడేలా అస్పష్టతకు తావు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం వంటి అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. ఇంటర్నెట్, టెక్నాలజీలు సురక్షితంగా, విశ్వసనీయంగా. అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ‘‘కొంగొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, సైబర్ సైక్యూరిటీ లాంటి అనేక విభాగాల్లో మనం లీడర్లుగా ఎదగాలి’’ అని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే అంశంలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్ని చెప్పారు. ప్రస్తుతం సర్వీసులు వివిధ మాధ్యమాల ద్వారా లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఏ సర్వీస్ అయినా, ఏ మాధ్యమంలోనైనా లభించే పరిస్థితి రావాలని ఆయన పేర్కొన్నారు. అటు సైబర్ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి రాజేంద్ర కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో భారత్.. ప్రపంచంలోనే 10వ స్థానం లో ఉందని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లుగా సైబర్ సెక్యూరిటీ అంశంలో భారత్ గణనీయంగా పురోగతి సాధించిందని వివరించారు. -
ధన్‌తేరస్‌కు గృహోపకరణాల జోరు
న్యూఢిల్లీ: ధన్‌తేరస్‌కు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ధన త్రయోదశికి విక్రయాలు 45 శాతం దాకా పెరిగాయని కంపెనీలు అంటున్నాయి. భారీ తెర గల టీవీలు, ప్రీమియం ఉత్పత్తులతో ఈ పండుగ సీజన్లో అమ్మకాలు మెరుగైన వృద్ధిని సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరతతోపాటు నిరంతర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కంపెనీలు సానుకూల ఫలితాలను నమోదు చేశాయి. ‘ఈ పండుగల సీజన్లో కస్టమర్ల సెంటిమెంట్ ఆల్–టైమ్ హైలో ఉంది. మహమ్మారి తర్వాత బలంగా ఉద్భవించిన ఈ–కామర్స్ రంగం గ్రామీణ, చిన్న మార్కెట్లలో బ్రాండ్లు చొచ్చుకుపోవడానికి సహాయపడుతోంది’ అని కంపెనీలు చెబుతున్నాయి. ఓనమ్, దసరాతో మొదలైన కొనుగోళ్ల జోరు దీపావళి వరకు కొనసాగుతుందని పరిశ్రమ ఆశగా ఉంది. ఏడాదిలో జరిగే మొత్తం అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా 30 శాతం దాకా ఉంది. ప్రీమియం టెలివిజన్లకు.. ఈ ధన్‌తేరస్‌కు పెద్ద తెర గల ప్రీమియం టెలివిజన్లకు మంచి డిమాండ్ ఉందని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. ప్రధానంగా 55 అంగుళాలు, ఆపైన సైజు టీవీలకు అద్భుత స్పందన ఉందన్నారు. అన్ని రకాల సౌండ్ బార్స్ సైతం అమ్ముడయ్యాయని చెప్పారు. కిత్రం ఏడాదితో పోలిస్తే ఈ ధంతేరస్‌కు 30–35 శాతం అధిక వ్యాపారం చేశామన్నారు. ఫెస్టివల్ సీజన్ అయ్యేంత వరకు ఈ జోష్ ఉంటుందన్నారు. 2020తో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని ప్యానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా సీఈవో మనీశ్ శర్మ తెలిపారు. పండుగల సీజన్ పూర్తి అయ్యేసరికి 50 శాతం అధిక విక్రయాలు నమోదు చేస్తామన్నారు. స్మార్ట్ 4కే ఆన్‌డ్రాయిడ్ టీవీలు, స్మార్ట్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్స్ ఈ వృద్ధిని నడిపిస్తున్నాయని వివరించారు. బలంగా సెంటిమెంట్.. పండుగ సీజన్ పూర్తి అయ్యేనాటికి వృద్ధి మరింతగా ఉంటుందని కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు. కొనుగోళ్ల విషయంలో కస్టమర్ల సెంటిమెంట్ బలంగా ఉందని శామ్సంగ్ చెబుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది ధంతేరస్‌కు 20 శాతం అధికంగా అమ్మకాలు సాధించామని శాంసంగ్ ఇండియా కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఎస్వీపీ రాజు పుల్లన్ వెల్లడించారు. ఓఎల్ఈడీ టీవీ, అల్ట్రా హెచ్డీ టీవీ, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్, చార్కోల్ మైక్రోవేవ్స్ వంటి ఉత్పత్తులకు స్థిరమైన వృద్ధి చూస్తున్నామని ఎల్జీ ఇండియా కార్పొరేట్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ తెలిపారు. గోద్రెజ్ అప్లయాన్సెస్ 45 శాతం వృద్ధి నమోదు చేసింది. 2019లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్ భారత్‌లో సుమారు రూ.76,400 కోట్లు ఉంది. -
టెక్నాలజీ దిగ్గజంగా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను మరింత బలమైన టెక్నాలజీ దిగ్గజంగా రూపొందించేందుకు ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రధాని కొన్ని కీలకమైన ఆశయాలను నిర్దేశించుకున్నారని.. వీటి సాకారానికి గాను పోటీతత్వం, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలైన క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామి కానున్నట్టు తెలిపారు. సీఐఐ నిర్వహించిన టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలను డిజిటైజ్ చేసే దిశగా గడిచిన ఆరేళ్లలో కీలక అడుగులు పడ్డాయని చెప్పారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సమయంలో బలంగా నిలదొక్కొం దని అభిప్రాయపడ్డారు. -
రిలయన్స్ డిజిటల్లో ఎలక్ట్రానిక్స్‌పై భారీ ఆఫర్లు
హైదరాబాద్: ఈ పండగ సీజన్‌ను మరింత వేడుకగా జరుపుకునేందుకు రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ పేరుతో ప్రత్యేక సేల్ తీసుకువచ్చింది. ఈ సేల్‌లో భాగంగా మీకు నచ్చిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌తో పాటు రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో ఈ సేల్ అక్టోబర్ 3 నుంచి మొదలవుతుంది. అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్స్ పై కొనుగోలుదారులు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ ₹2,000/ వరకు పొందవచ్చు. స్టోర్స్‌లో అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిపే కొనుగోళ్లపై, రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో అక్టోబర్ 3 నుంచి 10 వరకు జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. పేటీఎం ద్వారా ₹4,999/- కనీస చెల్లింపు చేస్తే ₹1,000/- వరకు క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. ఇవేకాదు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. అన్ని ఆఫర్లు, ధరలకు నియమనిబంధనలు వర్తిస్తాయి. టీవీల్లో సాంసంగ్ నియో క్యూలెడ్ కొనుగోలుపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% వరకు క్యాష్‌బ్యాక్, రూ.37,400 విలువైన సాంసంగ్ సౌండ్ బార్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఎల్జీ ఓలెడ్ రేంజ్ స్మార్ట్ టీవీలపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.(చదవండి: అమెజాన్‌లో మొబైల్స్‌పై అదిరిపోయే ఆఫర్స్) -
శామ్సంగ్ గుడ్‌న్యూస్, 50వేల మందికి శిక్షణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శామ్సంగ్.. ఎలక్ట్రానిక్స్ రిటైల్ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో (ఎన్ఎస్డీసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా 50,000 మంది యువతకు శామ్సంగ్ శిక్షణ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఎస్‌డీసీకి చెందిన 120 కేంద్రాల్లో శామ్సంగ్ దోస్త్ (డిజిటల్, ఆఫ్‌లైన్ స్కిల్స్ ట్రైనింగ్) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. 200 గంటలపాటు తరగతి గది, ఆన్లైన్ పాఠాలు ఉంటాయి. ఆ తర్వాత అయిదు నెలలపాటు శామ్సంగ్ రిటైల్ స్టోర్‌లో శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో పరిశ్రమ ప్రమాణాల ప్రకారం అభ్యర్థులకు భత్యం చెల్లిస్తారు చదవండి : పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం -
ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్ పండగ: భారీగా ఆఫర్లు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ "బిగ్ సేవింగ్ డేస్ సేల్" పేరుతో మరోసారి సరికొత్త డిస్కౌంట్ సేల్‌ను తీసుకొని వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ డిస్కౌంట్ సేల్ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్, ఒప్పో, వివో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా కిచెన్ వంటి పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. గత కొద్ది రోజుల క్రితమే జూలై 25 నుంచి జూలై 29 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో సేల్ నిర్వహించింది. ఇప్పుడు మరోసారి అదే పేరుతో సేల్ తీసుకొని వచ్చింది. ఎప్పటిలాగే, ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగానే సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్లస్ సభ్యులు డీల్స్ ను ముందస్తుగా యాక్సెస్ చేసుకోగలరు. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపురేట్లను అందించనుంది. ఇంకా ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వైర్లెస్ రౌటర్లు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై తగ్గింపును లభించనుంది. అమ్మకం సమయంలో కంపెనీ మొబైల్స్, టాబ్లెట్లపై డిస్కౌంట్ అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ & యాక్ససరీలపై 80 శాతం వరకు, టీవీ & ఉపకరణాలపై 75 శాతం వరకు, దుస్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్: స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 25 ఆదివారం నుంచి జూలై 29 వరకు కొనసాగుతుంది. బిగ్ సేవింగ్ డేస్‌లో భాగంగా ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్,రియల్‌మి, పోకో, మోటరోలా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. బిగ్ సేవింగ్ డేస్‌లో భాగంగా ఈ రోజు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డుపై కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. ప్రస్తుతం సేల్ లైవ్‌లో కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న డిస్కౌంట్ ధరలు ఆపిల్ ఐఫోన్ 12 మినీ తగ్గింపు ధర రూ. 57,999, అసలు ధర రూ. 69,990 ఆపిల్ ఐఫోన్ 12 తగ్గింపు ధర రూ. 67,999, అసలు ధర రూ. 79,990 మోటోరోలా రేజర్ తగ్గింపు ధర రూ. 54, 999 అసలు ధర రూ. 1,49,999 ఆసుస్ రాగ్ ఫోన్ 3 తగ్గింపు ధర రూ. 39,999 అసలు ధర రూ. 55,999 మోటోరోలా జీ10 పవర్ తగ్గింపు ధర రూ. 9,999 అసలు ధర రూ. 12,999. రియల్ మీ 8 తగ్గింపు ధర రూ. 13,999, అసలు ధర రూ 16, 999. శాంసంగ్ ఎఫ్62 తగ్గింపు ధర రూ. 17,999 అసలు ధర రూ. 29,999. ఎలక్ట్రానిక్స్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న డిస్కౌంట్ ధరలు గో ప్రో 9 తగ్గింపు ధర రూ. 37, 499, అసలు ధర రూ. 47,000 శాంసంగ్ గెలాక్సీ వాచ్ ఆక్టివ్ 2 తగ్గింపు ధర రూ. 14, 990 అసలు ధర రూ. 25,990 నోకియా మీడియా స్ట్రీమర్ తగ్గింపు ధర రూ 1,899 అసలు ధర రూ. 4,999 ఆసుస్ వివోబుక్ గేమింగ్ కోర్ ఐ5 ల్యాప్‌టాప్ తగ్గింపు ధర రూ. 52, 490, అసలు ధర రూ. 76, 990. -
ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్ పండగ: భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ ఐదు రోజుల డిస్కౌంట్ అమ్మకాలకు తెరతీసింది. జూలై 25 ఆదివారం నుండి జూలై 29 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్,రియల్‌మి, పోకో, మోటరోలా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మినీ ఫ్లాష్ అమ్మకాలను కూడా నిర్వహించనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై 24 అర్ధరాత్రి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అందుబాటులోఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపురేట్లను అందించనుంది.ఇంకా ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వైర్లెస్ రౌటర్లు ఇతరఎలక్ట్రానిక్స్పై తగ్గింపును లభించనుంది. దీనికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ ఈఎంఐ కూడా లభ్యం. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఫ్లిప్‌కార్ట్ తన డిస్కౌంట్ అమ్మకాలను మొదలు పెట్టడం విశేషం. రూ. 1 చెల్లించి ప్రీబుకింగ్ : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కేవలం ఒక రూపాయితో ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశాన్నిస్తోంది. సేల్ ప్రారంభం తరువాత మిగిలిన ధరను చెల్లించి సంబంధిత వస్తువునుకొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ధరలు ఐఫోన్ 12 రూ. 67,999 (ఎంఆర్పి రూ .79,999) ఐఫోన్ ఎస్ఇ రూ. 28,999 (ఎంఆర్పి రూ .39,900) మోటరోలా రేజర్ రూ. 54,999 (ఎంఆర్పి రూ. 1,49,999) శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రూ. 9,999 రియల్మీ సి 25 రూ. 9,999 (ఎంఆర్పి రూ .10,999) పోకో ఎక్స్ 3 రూ. 15,999 (ఎంఆర్పి రూ .19,999) ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 రూ. 6,499 (ఎంఆర్పి రూ .7,999 ఫ్లిప్‌కార్ట్ మినీ ఫ్లాష్ సేల్:అతి తక్కువ ధరకే రానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 ,సాయంత్రం 4 గంటలకు మినీ ఫ్లాష్ సేల్‌ను నిర్వహించనుంది. అంటే పలు ప్రొడక్ట్స్ నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. దీంతోపాటు ఎంపిక చేసిన ఉత్పత్తులపై టిక్ టాక్ డీల్స్ ఫ్లాష్ సేల్‌ను కూడా ప్రకటించింది. ఇందులో ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు అతి తక్కువ ధరలకే పలు ఉత్పత్తులు లభించనున్నాయి. -
చిప్ తయారీ ఇక ‘లోకల్’
న్యూఢిల్లీ: దేశంలో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలను భారత్‌కు రప్పించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీఐఏ టెక్నాలజీస్, యునైటెడ్ మైక్రో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, ఇంటెల్, మైక్రాన్ టెక్నాలజీ, ఎన్ఎక్స్పీ సెమీకండక్టర్స్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఫుజి ఎలక్ట్రిక్ కంపెనీ, ప్యానాసోనిక్, ఇన్ఫీనియాన్ టెక్నాలజీస్ ఏజీ, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎస్కే మైనిక్స్, శామ్సంగ్ కంపెనీలతో ఒక జాబితాను రూపొందించింది. అంతర్జాతీయ కంపెనీలతోపాటు, దేశీయ కంపెనీల జాయింట్ వెంచర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ శాఖా ఆహ్వానం పలికింది. ప్రాథమిక స్థాయి ప్రాజెక్టు నివేదికను సమర్పించేందుకు ఈ నెల 31వతేదీ వరకు గడువు ఇచ్చింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలను రాబట్టే చర్యలను మొదలు పెట్టింది. 400 డాలర్లకు పైగా (రూ.30వేలు) ఖరీదైన ల్యాప్‌టాప్‌లను తయారు చేసే, 200 డాలర్లకు పైగా ఖరీదైన ట్యాబ్లెట్లను (రూ.15వేలు) తయారు చేసే సంస్థలకు, సర్వర్లు, పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థలకు పీఎల్ఐ పథకం కింద విక్రయాలపై 2–4 శాతం వరకు ప్రోత్సాహకంగా ఇచ్చే ప్రణాళికలతో ఎలక్ట్రానిక్స్ శాఖా ఉంది. మూడు దశల్లో.. తైవాన్‌కు చెందిన క్వాంటా కంప్యూటర్ ఇన్కార్పొరేటెడ్, ఫాక్స్‌కాన్, ఏసర్, ఆసుస్, ఇన్వెంటెక్ కార్పొరేషన్.. అమెరికాకు చెందిన డెల్, యాపిల్, సిస్కో సిస్టమ్స్, ఫ్లెక్స్, భారత్‌కు చెందిన కోకోనిక్స్, హెచ్‌ఎల్‌బీఎస్ టెక్నాలజీస్లను ఆకర్షించే ప్రణాళికలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖా ఉంది. పీఎల్ఐ పథకం కింద రూ.7,350 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను రాబట్టడంలో మూడు దశలను అనుసరించనుంది. మొదట ఇంటెగ్రేటెడ్ డిజైన్ తయారీదారులు, ఫౌండ్రీలు లేదా భారత కంపెనీల భాగస్వామ్యంతో ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయదలిచిన సంస్థలను తీసుకురావాలన్న ప్రణాళికతో ఉంది. లేదా ఇప్పటికే ఉన్న ప్లాంట్ విస్తరణ ప్రతిపాదలను అయినా అనుమతించనుంది. ప్రతీ నెలా 30,000 వేఫర్ స్టార్స్ సామర్థ్యంతో (300ఎంఎం వేఫర్ సైజ్) కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సయిడ్ సెమీకండక్టర్ టెక్నాలజీతో చిప్‌లను తయారు చేయాల్సి ఉంటుంది. ఇక రెండో దశలో 200 ఎంఎం వేఫర్సైజ్తో కూడిన చిప్‌లను అత్యాధునిక టెక్నాలజీల సాయంతో తయారు చేసే సంస్థలకు ఆహ్వానం పలకనుంది. మూడో దశలో భారత సంస్థల భాగస్వామ్యంతో సెంమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసే సంస్థలను తీసుకురానుంది. ఎటువంటి మద్దతుకైనా సిద్ధమే.. తమ నుంచి ఏ తరహా ఆర్థిక మద్దతు కావాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంస్థలను కోరింది. ఈక్విటీ రూపంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ డేలా వయబులిటీ గ్యాప్ ఫండ్, దీర్ఘకాల వడ్డీ లేని రుణాలు, పన్ను ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలు.. ఏ విధమైన మద్దతు కావాలో చెప్పాలని కోరింది. ఆసక్తి కలిగిన కంపెనీలు తమ పెట్టుబడుల ప్రతిపాదనలను, టెక్నాలజీల వినయోగం వివరాలను సమర్పించాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా ఇప్పటికే స్పష్టం చేసింది. కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా దేశంలో ఫ్యాబ్రికేషన్ సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆకర్షణీయమైన పథకాన్ని రూపొందించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం
కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం కురిసింది. కరోనా మహమ్మారి కారణంగా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ చితికిపోతే, కరోనా పుట్టిలైన చైనాలో మాత్రం కాసుల వర్షం కురవడం విశేషం. చైనా ఎగుమతులలో వృద్ధి రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా అత్యధిక స్థాయికి చేరుకుంది. అదే సమయంలో దిగుమతులు కూడా పెరిగినట్లు ఆ దేశం కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. కరోనా కాలంలో మాస్క్‌ల వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రి, ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఎలక్ట్రానిక్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దింతో చైనా ఎగుమతులు భారీగా పెరిగాయి. జనవరి-ఫిబ్రవరి కాలంలో ఎగుమతులు సంవత్సరానికి 60.6శాతం పెరిగితే, అలాగే విశ్లేషకుల అంచనాలకు మించి దిగుమతులు 22.2 శాతం పెరిగాయి. దీనికి సంబందించిన అధికారిక సమాచారం చైనా విడుదల చేసింది. తాజా కస్టమ్స్ గణాంకాలు గత ఏడాది ఇదే సమయంలో చైనా ఎగుమతులు 17 శాతం తగ్గిపోగా, దిగుమతులు 4 శాతం పడిపోవడం గమనార్హం. కరోనా కాలంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 54.1 శాతం, టెక్స్టైల్స్ ఎగుమతులు 50.2 శాతం మేర పెరిగినట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే, చైనా మొత్తం వాణిజ్య మిగులు 103.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. చదవండి: రూ.1.97లక్షల కోట్ల ఎలాన్ మస్క్ సంపద ఆవిరి కరోనాతో ప్రజలకు రూ.13లక్షల కోట్ల నష్టం -
మరిన్ని సంస్థల కొనుగోళ్లపై కన్నేసిన రిలయన్స్
కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్ఫార్మ్. జియోమార్ట్‌ను మరింత పటిష్టం చేసే ప్రయత్నాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ముమ్మరం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇటీవలనే నెట్‌మెడ్స్ (ఆన్లైన్ ఫార్మసీ సంస్థ)ను కొనుగోలు చేసింది. జియోమార్ట్ కోసమే ఈ కొనుగోలు జరిగింది. జయోమార్ట్ కార్ట్‌లో ఆన్లైన్ ఫార్మసీతో పాటు భవిష్యత్తులో మరిన్ని విభాగాలు జత చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. మరోవైపు 2019 నుంచి కొంటూ వస్తున్న వివిధ సంస్థలను (గ్రాబ్, ఫైండ్ తదితర సంస్థలు) పూర్తిగా రిలయన్స్ రిటైల్‌లో సమ్మిళితం చేసి జియోమార్ట్‌ను మరింత పటిష్టం చేయనున్నది. రిలయన్స్ రిటైల్‌కు ఇప్పటికే ట్రెండ్స్, డిజిటల్, జ్యూయల్ విభాగాలున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ జియోమార్ట్ పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ) విక్రయిస్తోంది. త్వరలోనే మరిన్ని వ్యాపార విభాగాలు–ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్ జత చేయనున్నది. ఫ్యాషన్ స్టార్టప్ జివామెలో రోనీ స్క్రూవాలకు ఉన్న 15 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ బ్రాండ్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో మరింత వాటాను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థ, అర్బన్ ల్యాడర్‌ను, గ్రోసరీ డెలివరీ సంస్థ మిల్క్ బాస్కెట్‌ను కూడా రిలయన్స్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. (వాటా విక్రయం ఉండదని, త్వరలోనే ఐపీఓకు వస్తామని ఇటీవలే మిల్క్ బాస్కెట్ స్పష్టం చేసింది) ఆన్లైన్ సంబంధిత స్టార్టప్‌లను.. కుదిరితే పూర్తిగా కొనేయడమో లేదంటే ఎంతో కొంత వాటానైనా చేజిక్కించుకోవడమో... ఇది రిలయన్స్ జియోమార్ట్ వ్యూహం. నిధులు పుష్కలం... గత రెండు నెలల్లో 8.5 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్ రిటైల్ రూ.37,710 కోట్లు సమీకరించింది. జియోమార్ట్ విస్తరణ కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నది. కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలు–అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల పంట పడింది. మరింత మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం ఈ రెండు సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అమెజాన్ సంస్థ వంద కోట్ల డాలర్లు కేటాయించింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ సంస్థ 120 కోట్ల డాలర్ల నిధులు సమీకరించింది. సూపర్ మార్కెట్ల చెయిన్‌లో సంచలనం సృష్టించిన డీమార్ట్, దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్(బిగ్‌బాస్కెట్‌లో టాటాలకు వాటా ఉంది) కూడా అన్లైన్ గ్రోసరీ మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. సగం సరుకులు జియోమార్ట్వే ఇటీవలే మొదలైనా జియోమార్ట్ అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లకు ధీటుగా వేగంగా వృద్ధి చెందే ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్గా అవతరించనున్నది. కార్యకలాపాలు ప్రారంభించి కొద్ది కాలమే అయినప్పటికీ, రిలయన్స్ దన్నుతో ఈ సంస్థ దూసుకుపోతోంది. కొన్నేళ్లలో భారత్‌లో ఆన్లైన్లో అమ్ముడయ్యే మొత్తం సరుకుల్లో(వస్తువులు)సగం రిలయన్స్ జియోమార్ట్వే ఉండనున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో వెల్లడించింది. ఈ కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం జియోమార్ట్ వాటా 1 శాతంగానే ఉందని, ఐదేళ్లలో ఇది 31 శాతానికి ఎగబాకుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. వాట్సాప్ ద్వారా చెల్లింపులకు ఆమోదం లభించడం జియోమార్ట్‌కు మరింత కిక్‌ను ఇవ్వనున్నది. (వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ ఇటీవలనే రిలయన్స్ జియోలో భారీగా పెట్టుబడులు పెట్టింది) ఇక జియోమార్ట్ 1,700 మంది మర్చంట్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 20 నగరాల్లో కిరాణా వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు పోటీ సంస్థలు గ్రోఫర్స్, స్విగ్గీ స్టోర్స్, బిగ్‌బాస్కెట్ తదితర సంస్థల విస్తరణ అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం జియోమార్ట్‌లో రోజుకు నాలుగు లక్షల ఆర్డర్లు వస్తున్నాయని అంచనా. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కూడా ఆన్లైన్ ద్వారా సరుకుల అమ్మకాలు జోరు తగ్గలేదు. ఆర్థిక మందగమన కాలంలో ఆకర్షణీయ డిస్కౌంట్లు ఇస్తుండటమే దీనికి ఒక కారణం. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల గ్రోసరీ విభాగాల అమ్మకాలు అంతకంతకూ పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. జోరుగా యాప్ డౌన్లోడ్లు... రిలయన్స్‌కు చెందిన జియోమార్ట్ (గ్రోసరీ), అజియో(దుస్తులు) యాప్‌ల డౌన్లోడ్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ యాప్‌ల డౌన్లోడ్ల కంటే రెట్టింపు జియోమార్ట్ యాప్‌ల డౌన్లోడ్లు జరుగుతున్నాయి. డౌన్లోడ్లు జోరుగా ఉంటే లావాదేవీలు జరిగినట్లు కానప్పటికీ, భవిష్యత్తులో లావాదేవీలు పెరగడానికి ఈ డౌన్లోడ్లు ఒక సంకేతమని గోల్డ్‌మన్ శాక్స్ అంటోంది. సరైన బిజినెస్ మోడల్ లేదు...! ప్రస్తుతం ఈ గ్రోసరీ మార్కెట్లో బిగ్బాస్కెట్దే పై చేయి. తర్వాతి స్థానంలో గ్రోఫర్స్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ సూపర్‌మార్ట్, ఫ్లిప్కార్ట్క్విక్ పేరుతో గ్రోసరీలను విక్రయిస్తోంది. అమెజాన్ సంస్థ ప్యాంట్రీ, ఫ్రెష్ సంస్థల ద్వారా సరుకులను అందిస్తోంది. ప్రస్తుతానికి జియోమార్ట్‌తో బిగ్‌బాస్కెట్‌కు, గ్రోఫర్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా, భవిష్యత్తులో మాత్రం ఈ రెండు కంపెనీలకు జియోమార్ట్ గట్టిపోటీనే ఇచ్చే అవకాశాలున్నాయి. భారీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి రావడంతో మార్జిన్లు తక్కువగా ఉండటం, సరఫరా, డెలివరీ తదితర సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏ సంస్థకూడా ఈ గ్రోసరీ సెగ్మెంట్లో సరైన ‘బిజినెస్ మోడల్’ను ఏర్పాటు చేయలేకపోయాయి. అయితే ఈ సంస్థల వద్ద పుష్కలంగా నిధులు ఉండటంతో ఇవి వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తున్నాయి. -
ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ల దిగుమతి సుంకాన్ని 2.5 శాతం పెంచింది. విడిభాగాల పరికరాలకు కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 15 శాతానికి పెంచడంతో వీటి ధరలు పెరుగుతాయని నగర సెల్‌ఫోన్ దుకాణ నిర్వాహకులు అంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల ధరలు మాత్రం ఏప్రిల్ నుంచి మరింత ప్రియమవుతాయని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులైన రిఫ్రిజ్రేటర్, ఎయిర్ కండిషన్ కంప్రెషర్లలపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని 12.5 నుంచి 15 శాతానికి పెంచడం కూడా ఆయా వస్తువుల ధరలపై ప్రభావాన్ని స్పష్టంగా చూపెడుతుందని వ్యాపారులు అంటున్నారు. నగరంలో వేలల్లో సెల్‌ఫోన్ దుకాణాలతో పాటు వందల్లో ఎలక్ట్రానిక్ షోరూమ్‌లు రూ.వందల కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల పెంపు మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలపై మరింత భారం కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత భారమే.. స్మార్ట్ఫోన్ల ధరలు మరింత పెరగనున్నాయి. ప్రతి ఒక్కరికీ సమాచార మార్పిడికి ఫోన్లు తప్పనిసరి కావడంతో ధరలు పెరిగినా కొనడం మాత్రం ఆగడంలేదు. అయితే అతి కష్టంమీద సెల్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి మాత్రం ఈ నిర్ణయం గుదిబండలా మారింది. – ఎల్.నరేష్, ఆర్పీ మొబైల్ షాప్, వనస్థలిపురం తప్పదు వాడకం.. ఎలా కొనడం? కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండడంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇన్నాళ్లూ కేవలం తల్లిదండ్రులు మాత్రమే వాడగా.. ఇప్పుడు పిల్లలకు చదువు కోసం కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్య, పేద తరగతి ప్రజలకు భారమే. – రితిక, సీబీఐటీ కాలేజీ విద్యార్థిని, గండిపేట సామాన్యుడిపై భారమే... ఇంట్లో అవసరాల కోసం రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు కొనుగోలు చేసేవారికి భారమే. వచ్చే జీతం ఇంటి అద్దెకు, అవసరాలకు, పిల్లల చదువులకే సరిపోతున్నాయి. కేంద్రం తాజా బడ్జెట్‌తో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలకు రెక్కలు రానుండడంతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది. – పి.శేఖర్, ఎల్బీనగర్ -
ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ : ఆఫర్లు
సాక్షి,ముంబై: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి తగ్గింపు ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవల ఐదు రోజుల బ్లాక్ ఫ్రైడే అమ్మకాన్ని చేపట్టిన సంస్థ తాజాగా ప్రతీ నెల మొదటి రోజుల్లో ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ పేరుతో బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. రేపటి ( 2020, డిసెంబర్ 1-3 వరకు) అందిస్తున్న ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం తగ్గింపును అందిస్తోంది. అలాగే టీవీలు, ఏసీలు రిఫ్రిజిరేటర్లలో 50 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇంకా బట్టలు, పాదరక్షలు, ఉపకరణాలు, బ్యూటీ, క్రీడలు, ఫర్నిచర్, గృహాలంకరణ ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్, ఆఫర్లను ప్రకటించింది. ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్.కామ్లోఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే వెబ్సైట్లో అమ్మకం కోసం ల్యాండింగ్ పేజీని తీసుకొచ్చింది. పాదరక్షలు, బట్టలు, క్రీడా పరికరాలు, ఫర్నిచర్, గృహాలంకరణ తదితర ఉత్పత్తులపై కూడా తగ్గింపును ప్రకటించింది. హెడ్ఫోన్లు, స్పీకర్లపై 70శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ల్యాప్‌టాప్‌లపై 30శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లాంటిపై కూడా తగ్గింపులో ధరల్లో అందిస్తోంది. 8,999 రూపాయలు ధర వద్దే స్మార్ట్ టీవీలను అందిస్తోంది.స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ బ్యాండ్లు ప్రారంభ ధర 1,299 గా ఉంచింది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వారంటీ పొడగింపు వంటి సదుపాయం కూడా ఉంది. -
ఎలక్ట్రానిక్స్.. నో స్టాక్!
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజూ కొత్త కొత్త మోడళ్లు.. బ్రాండ్ల మధ్య నువ్వా నేనా అన్న పోటీ.. ఇదీ మొబైల్స్, ల్యాప్టాప్స్, టెలివిజన్ సెట్ల పరిశ్రమలో నాలుగు నెలల క్రితం వరకు ఉన్న పరిస్థితి. కోవిడ్–19 కారణంగా ఇప్పుడు వాతావరణం మారిపోయింది. కొత్త మోడళ్ల రాక తగ్గిపోయింది. విక్రేతల వద్ద నిల్వలు నిండుకున్నాయి. పాత స్టాక్‌తోనే ఇప్పటి వరకు అమ్మకందార్లు నెట్టుకొచ్చారు. ప్రస్తుతం కొత్త స్టాక్ రాక సగానికి తగ్గింది. కొన్ని నెలలుగా విదేశాల నుంచి ముడి సరుకు రాక తగ్గడంతో దేశీయంగా పరిశ్రమ తయారీ అడ్డంకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు తాజాగా ఎలక్ట్రానిక్ విడిభాగాలు పోర్టుల వద్ద నిలిచిపోయాయి. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఇవి ఎదురు చూస్తున్నాయి. ముడి సరుకు లేక ప్లాంట్లు మూసివేత దిశగా సాగుతున్నాయి. మరోవైపు ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు సగానికి పడిపోయాయని పరిశ్రమ చెబుతోంది. మూసివేత దిశగా ప్లాంట్లు.. ప్రధానంగా చైనా నుంచి వచ్చిన ముడిసరుకు నిల్వలు పోర్టుల వద్ద కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. షావొమీ, ఒప్పో, రియల్మీ, హాయర్, క్యారియర్ మిడియా వంటి కంపెనీల ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. కొన్ని తయారీ కేంద్రాల్లో విడిభాగాలు లేక ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ వారం ప్లాంట్లను మూసివేయక తప్పదని కొన్ని కంపెనీలు అంటున్నాయి. జైనా గ్రూప్ ఇటీవలే ప్లాంటును మూసేసింది. కార్బన్ మొబైల్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీకి సాన్సూయ్ టీవీ తయారీ లైసెన్స్ ఉంది. 15 రకాల బ్రాండ్ల ఎల్ఈడీ టీవీలను తయారు చేస్తున్న వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ సైతం ముడిసరుకు లేక ఇబ్బంది పడుతోంది. మొబైల్ ఫోన్లు, టెలివిజన్లకు సంబంధించి 65–70% విడిభాగాల కోసం చైనాపై భారత్ ఆధారపడింది. ఏసర్, హెచ్‌పీ, డెల్, లెనోవో, ఆసస్ కంపెనీల ల్యాప్‌టాప్‌ల సరఫరా సైతం తగ్గింది. కంపెనీల నుంచి సరఫరా 50 శాతమే ఉంటోందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అధికం కావడంతో ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఆందోళనలో రిటైలర్లు.. కోవిడ్–19 విస్తృతి, దాని ప్రభావంతో మొబైల్స్ విక్రయ రంగం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందోనని పరిశ్రమ ఆందోళనగా ఉంది. నిరుద్యోగిత పెరిగితే స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లు పడిపోతాయి. ఈఎంఐ ద్వారా మొబైల్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య గతంలో 35–40 శాతముండేది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈఎంఐల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ఇప్పుడీ సంఖ్య 5 శాతానికి వచ్చింది. పైగా డౌన్‌పేమెంట్ 35 శాతం కట్టాల్సిందే అన్న నిబంధన అమలు చేస్తున్నారు. దుకాణాలు తెరుచుకున్నా అమ్మకాలు 50 శాతం కూడా లేవు. దీంతో విక్రేతలు ఆందోళనగా ఉన్నారు. అధిక అద్దెలతోనే ముప్పు.. సాధారణ దుకాణాలతో పోలిస్తే మొబైల్ రిటైల్ ఔట్లెట్లు చెల్లిస్తున్న అద్దె ఎక్కువే. ప్రధాన ప్రాంతాల్లో అయితే ఇది ఏకంగా 40–50% అధికంగా ఉంటోంది. దీనికంతటికీ కారణం రిటైలర్ల మధ్య తీవ్ర పోటీయే. అయితే లాక్డౌన్ కారణంగా దుకాణాలు మూసివేశామని, వ్యాపారం జరగనందున అద్దె చెల్లించలేమని రిటైలర్లు భవన యజమానులకు తేల్చిచెప్పారు. అద్దె పూర్తిగా మినహాయింపు ఇస్తేనే వ్యాపారాలు చేసుకోగలమని వారు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని దుకాణాలను మూసివేయాల్సిన స్థితికి వచ్చామని ఓ రిటైలర్ వ్యాఖ్యానించారు. ఫోర్స్ మెజోర్ నిబంధనను అడ్డుపెట్టుకుని జాతీయ బ్రాండ్లు అద్దె చెల్లించడం లేదని ఆయన గుర్తు చేశారు. అయితే ఏదైనా మొబైల్ షాపు ఖాళీ అయితే.. అట్టి దుకాణాన్ని అద్దెకు తీసుకోరాదని దక్షిణాదికి చెందిన మొబైల్ ఫోన్ల రిటైలర్లు నిర్ణయించడం కొసమెరుపు. -
ఫోన్‌ను ఈ శానిటైజర్‌తో క్లీన్ చేయండి
న్యూ ఢిల్లీ: ఇంట్లో ఉన్నప్పుడు చేతులు కడుక్కునేందుకు సాధారణంగా సబ్బు వినియోగిస్తాం. బయట ఉన్నప్పుడైతే శానిటైజర్ వాడుతాం. అది సరే.. మరి ఫోన్లను శుభ్రం చేసేందుకు..? శానిటైజర్ ఉపయోగిస్తే స్క్రీన్ పాడైపోతుందేమోనని భయపడిపోతాం. కానీ మార్కెట్లో వచ్చిన కొత్తరకాల శానిటైజర్లతో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టేయొచ్చు. మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ రిమోట్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను శుభ్రం చేసేందుకు మార్కెట్లో ఎన్నో శానిటైజర్లు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి రెండు రకాలుగా లభ్యమవుతున్నాయి. మొదటిది స్ప్రే శానిటైజర్, రెండోది యూవీ బాక్స్ శానిటైజర్. వీటిలో కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల గురించి గురించి తెలుసుకుందాం.. స్ప్రే శానిటైజర్: వీటి ధర 230 రూపాయల నుంచి 250 వరకు ఉంటుంది. ఈ శానిటైజర్‌ను ఫోన్ లేదా ల్యాప్‌ట్యాప్ వంటి వస్తువులపై స్ప్రే చేసి అనంతరం కాటన్ వస్త్రంతో తుడవాలి. అయితే ఇష్టమొచ్చినట్లుగా కాకుండా నెమ్మదిగా రుద్దాల్సి ఉంటుంది. ► పోరట్రానిక్స్ స్వైప్: ఇది వాడటానికే కాకుండా మీ వెంట తీసుకెళ్లడానికి కూడా సులభంగా ఉంటుంది. ఇందులో స్ప్రేయర్తోపాటు శుభ్రం చేసేందుకు వీలుగా చిన్న వస్త్రాన్ని కూడా ఇస్తారు. దీని ధర 249 రూపాయలు. ► మొబివాష్ మొబైల్ శానిటైజర్: ఇది శానిటైజింగ్తోపాటు క్లెన్సింగ్, డియోడరైజింగ్ వంటి పనులను కూడా చేసి పెడుతుంది. దీని వెంట కూడా ఒక కాటన్ వస్త్రం వస్తుంది. పైన చెప్పిన దానిలాగే దీన్ని ఫోన్‌పై స్ప్రే చేసి సుతారంగా తుడిచేయాలి. (చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ) యూవీ(అల్ట్రా వయొలెట్) బాక్స్ శానిజైజర్: వీటి ధర 3000 రూపాయల నుంచి 5 వేల వరకు ఉంటుంది. మీ ఫోన్‌పై ఉండే వైరస్ కణాలను నాశనం చేయాలనుకుంటే వీటిని ఎంచుకోవడమే ఉత్తమం. ♦ నైకా జెనరిక్ యూవీ-సీ పోర్టబుల్ శానిజైజింగ్ బాక్స్: పేరు చదవగానే అర్థమై ఉంటుంది. ఇది అతినీల లోహిత కిరణాలు, ఓజోన్ క్రిమిసంహారకాలను ప్రసరింపజేసి ఫోన్‌పై ఉండే బాక్టీరియా, వైరస్‌ను నాశనం చేస్తుంది. ఇందులో అరోమా థెరపీ సౌలభ్యం కూడా ఉంది. ఇది 99.9 శాతం క్రిములను సంహరిస్తుందని పేర్కొంటోంది. దీన్ని నైకా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. దీని ధర 3,200 రూపాయలు. ♦ డెయిలీ ఆబ్జెక్ట్స్ పోర్టబుల్ మల్టీ ఫంక్షనల్ యూవీ స్టెరిలైజర్ అండ్ వైర్లెస్ చార్జర్: ఇది కూడా పైదానిలాగే పని చేస్తుంది. ఇక 5 నిమిషాల్లో మీ ఫోన్‌పై ఉండే సూక్ష్మ క్రిములను మటుమాయం చేస్తామని సదరు కంపెనీ చెబుతోంది. ఈ పరికరం 15 వాట్ల వరకు చార్జింగ్ అవుతుంది. దీన్ని వైర్‌లెస్‌గానూ ఉపయోగించవచ్చు. దీని ధర 4,800 రూపాయలు. ఇది మీకు కావాలనుకుంటే డెయిలీ ఆబ్జెక్ట్స్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆర్డర్ చేసుకోండి. (కొత్త వాదన: ఇక్కడ శానిటైజర్లకు నో!) -
ఎలక్ట్రానిక్స్‌కు ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయ్..
ముంబై: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎలక్ట్రానిక్స్ దిగుమతులను భారత్ నిజంగానే తగ్గించుకోదల్చుకుంటే ప్రత్యామ్నా య మార్కెట్లు చాలానే ఉన్నాయని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముంబై (డబ్ల్యూటీసీ) వెల్లడించింది. సింగపూర్, మలేసియా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతులను పెంచుకునే అంశం పరిశీలించవచ్చని పేర్కొంది. డబ్ల్యూటీసీ గణాంకాల ప్రకారం చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, టీవీ సెట్లు ఉంటున్నాయి. చమురుయేతర ఉత్పత్తుల దిగుమతుల్లో చైనాకు 14% వాటా ఉంటోంది. ‘2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలం లో మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతుల విలువ రూ.3.59 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువ సుమారు రూ. 1.42 లక్షల కోట్లు.. అంటే దాదాపు మొత్తం దిగుమతుల్లో 40% వాటా’ అని డబ్ల్యూటీసీ తెలిపింది. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతుల్లో అత్యధిక వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక దిగుమతులు, కంప్యూటర్, ఐటీ హార్డ్‌వేర్, మొబైల్ ఫోన్స్ మొదలైనవి) ఉంటోంది. మొబైల్ దిగుమతులు తగ్గినా.. చైనాదే హవా.. గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల దిగుమతులు మొత్తం మీద తగ్గినప్పటికీ చైనా వాటా మాత్రం పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్ – 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో సెల్ ఫోన్ దిగుమతులు సగానికి సగం పడిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని రూ. 11,304 కోట్ల నుంచి రూ. 6,313 కోట్లకు క్షీణించాయి. దేశీయంగా తయారీ పెరగడం, హ్యాండ్‌సెట్స్‌పై దిగుమతి సుంకాలు పెంచడం ఇందుకు కారణం. అయితే, చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గినప్పటికీ మొత్తం దిగుమతుల్లో దాని వాటా 55 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది. దేశీయంగా ఉత్పత్తికి ఊతం... కేంద్రం ఇటీవల కొన్నాళ్లుగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పలు స్కీములను అమలు చేస్తోంది. దీంతో 2014–2020 మధ్య కాలంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 20.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.73 లక్షల ఓట్లుగా ఉన్న స్థానిక ఉత్పత్తి 2019–20లో రూ. 5.33 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ పరిస్థితులు చూస్తే ఇది మరింత వేగంగా వృద్ధి చెందనుందని డబ్ల్యూటీసీ అంచనా వేసింది. అయితే, దేశీయంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగే దాకా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకునే క్రమంలో ఇతర మార్కెట్లవైపు చూడవచ్చని తెలిపింది. సింగపూర్, అమెరికా, మలేసియా, జపాన్ నుంచి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కలర్ టీవీ సెట్లను, సింగపూర్, తైవాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్ నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. -
కరోనా ఎఫెక్ట్: మహిళా ఉద్యోగులకు వరం
ముంబై: కరోనా వైరస్ దెబ్బతో అన్ని రంగాలు కుదేలయిన విషయం తెలిసిందే. అయితే మహిళలకు కరోనా సంక్షోభం వరంగా మారనుంది. కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. మహిళలు మాత్రం తమ కుటుంబ సభ్యుల సెంటిమెంట్‌తో స్థానికంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తారు. గతంలో ప్రాజెక్టుల పూర్తికావడానికి గతంలో ఒకే షిఫ్ట్‌లో ఉద్యోగులు పని చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయాలని లక్ష్యంతో క్లయింట్లు(ప్రాజెక్ట్ అప్పగించే వ్యక్తులు) కంపెనీ యాజమాన్యాలను ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్, తదితర రంగాలలో ఎక్కువ వైట్ కాలర్(పరిపాలన విభాగం) ఉద్యోగాలను సంస్థలు మహిళలకు ఆఫర్ చేస్తున్నాయి. కాగా అధిక స్థాయిలో మహిళా ఉద్యోగులను నియమించుకుంటామని క్వెస్ క్వార్ప్ సంస్థ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీలు ఉద్యోగుల వలసలతో తీవ్రంగా నష్టపోయావని, రాబోయే కాలంలో మహిళా ఉద్యోగులను(50లక్షల మంది) నియమించుకునే అవకాశం ఉందని అవసర్ హెఆర్ సర్వీసెస్ ఉన్నతాధికారి నవనీత్ సింగ్ తెలిపారు. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో 5,000 మంది మహిళ ఉద్యోగులను కంపెనీలు నియమించుకోనున్నాయి. కాగా దుస్తుల తయారీ సంస్థలైన (బడ్డీ, ఉన్న)లు 80శాతం మహిళా ఉద్యోగులను నియమించుకుంటాయని ప్రకటించాయి. అయితే గుర్గావ్కు చెందిన మాట్రిక్స్ సంస్థ ఎండీ గౌతమ్ నేర్ వంద శాతం మహిళ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపారు. మహిళ ఉద్యోగులు నిబద్దత, వినయం, సహనం అధికంగా ఉంటాయని కొన్ని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా భవిష్యత్తుల్లో వైట్ కాలర్ ఉద్యోగాలలో మహిళల ప్రాధాన్యం మరింత పెరగవచ్చని తెలుస్తోంది. (చదవండి: కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ) -
పేటీఎం మాల్ సరికొత్త వ్యూహం..
బెంగుళూరు: కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాపార వృద్ధికి కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగా భారత ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ పీటీఎం మాల్ త్వరలో గ్రోసరీ మార్కెట్(సూపర్ మార్కెట్)రంగంలో ప్రవేశించనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రామాణికమైన స్థానిక వ్యాపారులతో (కిరాణా దుకాణాల) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పేటీఎం మాల్లో గ్రోసరీ మార్కెట్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్ తదితర వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఆన్లైన్ టూ ఆప్లైన్ అన్ని రకాలుగా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ఈ మాల్ సేవలందించనుంది. కాగా వస్తువుల పంపిణీకి లాజిస్టిక్స్ వ్యాపారులను(గిడ్డంగులు, ప్యాకేజింగ్) సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అయితే ఫార్మా రంగానికి చెందిన మందుల పంపిణీలో సంక్లిష్టత కారణంగా ఈ రంగంలో ప్రవేశించడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం పేటీఎమ్ మాల్ స్థానిక కిరాణా, మధ్యస్థాయి దుకాణాదారుల సమన్వయంతో వినియోగదారులను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోంది. సంస్థ వృద్ధి చెందేందుకు సరికొత్త వ్యూహాన్ని రచిస్తుంది. పేటీఎం సంస్థ లాక్డౌన్ కారణంగా కేంద్ర కార్యాలయాన్ని బెంగుళూరుకు మార్చింది. త్వరలో ప్రారంభించబోయే పేటీఎం మాల్గ్రోసరీ మార్కెట్)ను పరుగులు పెట్టించేందుకు 10,000 కిరాణా స్టోర్స్, చిన్న మధ్య స్థాయి దుకాణాదారులతో ఒప్పందం కుదుర్చుకోనుంది. కాగా, గ్రోసరీ మార్కెట్లో వృద్ధి చెందేందుకు గ్రోఫర్స్, మిల్క్ బాస్కెట్ తదితర ఆన్లైన్ సంస్థల భాగస్వామ్యంతో పేటీఎం సంస్థ పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లాక్డౌన్ ప్రభావం వల్ల గ్రోసరీ మార్కెట్ వైపు ఈకామర్స్ కంపెనీలు దృష్టి సారించాయి. ఇదే బాటలో దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ గ్రోసరీ మార్కెట్ వైపు దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. (చదవండి: వ్యాపారుల కోసం పేటీఎం ఆల్–ఇన్–వన్ క్యూఆర్) -
అతిపెద్ద మొబైల్ మేకర్‌గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా నిలిచిందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 200కి పైగా మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించారు. భారతదేశంలో ఇప్పటివరకు 330 మిలియన్ మొబైల్ హ్యాండ్సెట్లు తయారైనట్టు చెబుతూ దీనికి సంబంధించిన డేటాను కేంద్ర మంత్రి షేర్ చేశారు. 2014లో కేవలం 2 ప్లాంట్లలో 60 మిలియన్ల మొబైల్ ఫోన్లు మాత్రమే తయారు అయ్యాయి. వీటి విలువ కూడా 2014లో 3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2019లో 30 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే రేపు (జూన్ 2న) మధ్యాహ్నం 12:00 గంటలకు విలేకరుల సమావేశంలో భారతీయ ఎలక్ట్రానిక్ రంగం కోసం కొత్త పథకాలను ప్రకటించనున్నారు. భారీ దిగుమతిదారుగా ఉన్న భారత్ గత ఐదేళ్లలో బలమైన ఎగుమతిదారుగా అవతరించిందని ఎలక్ట్రానిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. Under the leadership of PM @narendramodi, India has emerged as the 2nd largest mobile phone manufacturer in the world. In the last 5 years, more than 200 Mobile Phone Manufacturing units have been set up. #ThinkElectronicsThinkIndia pic.twitter.com/fGGeCRpj87 — Ravi Shankar Prasad (@rsprasad) June 1, 2020 చదవండి : సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్ షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే -
లాక్డౌన్ ఎఫెక్ట్.. కోటి మొబైళ్లు ఖరాబ్..!
సాక్షి, హైదరాబాద్: కరోనా పుణ్యమా అని విధించిన లాక్డౌన్ కారణంగా గృహోపకరణాల (ఎలక్ట్రానిక్ వస్తువులు) మరమ్మతులకు తీవ్ర జాప్యం నెలకొనేలా కనిపిస్తోంది. ప్రతీ వ్యక్తికి సాధారణ అవసరాలుగా మారిన ఫ్రిజ్, టీవీ, మొబైల్ ఫోన్లు లక్షలాదిగా రిపేర్ల కోసం ఎదురుచూస్తున్నాయి.దేశవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ సర్వీసుసెంటర్లు మూతపడటమే ఇందుకు కారణం. మార్చి 25 నుంచి ఇప్పటి దాకా దేశంలో లక్షన్నర ఫ్రిజ్‌లు, లక్షకుపైగా టీవీలు, కోటి వరకు మొబైల్ఫోన్లు రిపేర్లు లేక మూలనపడ్డాయట. ఈ విషయం సెల్యూలార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగదారులు, తయారీదారుల సంఘ సంయుక్త సర్వేలో వెల్లడైంది. కాలక్షేపానికీ కష్టకాలం.. కరోనా కట్టడిలో భాగంగా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కాలక్షేపానికి కనిపించిన ప్రతీసీరియల్‌ను, సినిమాను వదలకుండా చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో అందరూ చూసిన ప్రోగ్రాములను మళ్లీ చూస్తున్నారు. అలాంటి చాలా ఇళ్లల్లో టీవీలు పాడయ్యాయి. దీనికితోడు లక్షన్నర వరకు రిఫ్రిజిరేటర్లు, అరవై వేల వరకు ఏసీలు చెడిపోయాయి. స్మార్ట్పోన్లు, ఇతర మొబైల్ ఫోన్లు అన్నీ కలిపి సుమారుగా కోటి వరకు పాడై ఉంటాయని సర్వే అంచనా వేస్తోంది. ఉపాధి లేని మెకానిక్‌లు.. లాక్‌డౌన్‌తో దేశంలోని చాలా ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ సేల్స్ – సర్వీసు రంగం తీవ్రంగా నష్టపోయింది. విక్రయాల మాట ఎలా ఉన్నా.. సర్వీసింగ్ చేసేందుకూ అనుమతి లేకపోవడంతో చిరు మెకానిక్‌లకు పూటగడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. కొన్ని గృహోపకరణాల సంస్థలు మాత్రం ఫోన్లో సంప్రదిస్తే.. చిన్న మరమ్మతులకు సలహాలు సూచనలు ఇస్తున్నాయి. -
వారంటీ పొడిగిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులకు వారంటీని పొడిస్తున్నాయి. వీటిలో శామ్సంగ్, వన్‌ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు ఉన్నాయి. మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ముగిసే అన్ని రకాల ఉత్పత్తులకు మే 31 వరకు వారంటీ పొడిగిస్తున్నట్టు శామ్సంగ్ ప్రకటించింది. మార్చి 1 నుంచి మే 30 వరకు ముగిసే వాటికి మే 31 వరకు వారంటీ ఇస్తున్నట్టు వన్ ప్లస్ తెలిపింది. ఒప్పో సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. అలాగే ఆన్లైన్ రిపేర్ సర్వీస్‌ను సైతం అందిస్తోంది. పరిస్థితి సర్దుమణగగానే కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా సర్వీసు అందిస్తామని షావొమీ స్పష్టం చేసింది. రియల్మీ మే 31 వరకు వారంటీ ఎక్స్టెండ్ చేసింది. మార్చి 15–ఏప్రిల్ 30 మధ్య కొనుగోలు చేసిన డివైస్‌లకు రిప్లేస్మెంట్ పీరియడ్‌ను అదనంగా 30 రోజులు పొడిగించింది. మార్చి 20 నుంచి మే 20 మధ్య వారంటీ ముగిసే ఉత్పత్తులకు 60 రోజులు పొడిగించినట్టు డీటెల్ వెల్లడించింది. మార్చి 15–మే 15 పీరియడ్‌లో వారంటీ పూర్తి అయ్యే ప్రొడక్టులకు 60 రోజులు ఎక్స్టెండ్ చేసినట్టు లావా పేర్కొంది. వారంటీ పీరియడ్‌ను రెండు నెలలు పొడిగించామని టెక్నో, ఇన్ఫినిక్స్ ప్రకటించాయి. -
టీవీలు, ఫ్రిజ్‌లకూ ‘వైరస్’!
రెండేళ్ల అంతంత మాత్రం అమ్మకాల నుంచి ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ వంటి వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కంపెనీలు గత ఏడాది కోలుకున్నాయి. గత ఏడాది ఈ వస్తువుల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఈ జోష్‌తో ఈ ఏడాది అమ్మకాలు మరింత మెరుగ్గా ఉండగలవన్న ఆశలను కోవిడ్–19(కరోనా) వైరస్ కాటేసింది. పన్నులు పెరగడం, సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, డిమాండ్ కుదేలవ్వడం, అమ్మకాలు తగ్గుతున్నా ధరలు పెంచక తప్పని విచిత్ర పరిస్థితుల్లో తయారీదారులు చి క్కుకోవడం.... ఇలా చాలా కారణాలు కన్సూమర్ డ్యూరబుల్ కంపెనీల అదృష్టాన్ని అదృశ్యం చేయనున్నాయి. కరోనా వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఈ కంపెనీల భవిష్యత్తు అనిశ్చితిగా మారిపోయింది. వివరాలు... (కేసులు 5 లక్షలు.. మృతులు 22 వేలు) అమ్మకాలు అంతంతమాత్రమే....! కరోనా ప్రభావంతో ఏసీ, ఫ్రిజ్ వంటి పెద్ద గృహోపకరణాలకు డిమాండ్ తగ్గుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో కేరళలో మండే ఎండలు మొదలవుతాయి. దీంతోనే భారత్‌లో కూడా ఎండాకాలం మొదలవుతుంది. ఏసీ, ఫ్రిజ్‌ల అమ్మకాలు కూడా ఇప్పటి నుంచే మొదలవుతాయి. కానీ, మార్చి నెల మరో నాలుగు రోజుల్లో ముగియనున్నప్పటికీ, కేరళలో డిమాండ్ పెరగకపోగా, అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండటం... కరోనా కల్లోలం ఏ స్థాయిలో ఉందో సూచిస్తోంది. ఏడాది ఏసీ అమ్మకాల్లో సగం వరకూ ఫిబ్రవరి– జూలై మధ్యనే జరుగుతాయి. కానీ ఈ ఏడాది మార్చి నెల దాదాపు ముగింపుకు వచ్చినా, ఏసీ అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో అసలు అమ్మకాలు పుంజుకోనేలేదు. వచ్చే నెల 14 దాకా దేశమంతా లాక్డౌన్ ఉండనుండటంతో అమ్మకాలపై కంపెనీలు ఆశలు వదిలేసుకున్నాయి. (కరోనా నివారణకు రూ.1500 లక్షల కోట్లు) కోవిడ్–19 వైరస్ ప్రభావం తీవ్రంగానే... సరఫరా చెయిన్‌లో ఎలాంటి సమస్యలు లేకపోయినా, కోవిడ్–19 వైరస్ ప్రభావం సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ఉండగలదని దైకిన్ ఇండి యా ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్లాంట్లన్నీ చైనాలో కాకుండా ఇండోనేషియాలో ఉన్నాయని, అందుకే విడిభాగాల సరఫరా విషయంలో తమకెలాంటి సమస్యల్లేవని దైకిన్ ఇండియా ఎమ్డీ కన్వల్జిత్ జావా పేర్కొన్నారు. అయితే కోవిడ్–19 వైరస్ ప్రభావం సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ప్రభావం చూపగలదని వ్యాఖ్యానించారు. విడిభాగాల ధరలు 25–50 శాతం అప్..! కరోనా కల్లోలం ఇలాగే కొనసాగితే, విడిభాగాల ధరలు 25–50% వరకూ పెరుగుతాయని సూపర్ప్లాస్ట్రానిక్స్(ఎస్పీపీఎల్) సీఈఓ అవ్నీత్ సింగ్ మర్హ ఆందోళన వ్యక్తం చేశారు. పులి మీద పుట్రలా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడటం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం ఈ రంగంపై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయని పేర్కొన్నారు. డిమాండ్ తగ్గుతున్నా, తప్పని ధరల పెంపు... ముడి పదార్థాల ధరలు పెరగడం, జీఎస్టీలో అధిక స్లాబ్ రేట్ కారణంగా 2017, 2018 సంవత్సరాల్లో ఏసీ, ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మెషీన్ వంటి కన్సూమర్ డ్యూరబుల్ అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే గత ఏడాది ఈ వస్తువుల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఈ ఏడాది మరింత మెరుగ్గా అమ్మకాలు ఉండగలవన్న అంచనాలను కరోనా వైరస్ కాటేసింది. అంతే కాకుండా కంప్రెసర్లు, మోటార్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లపై కస్టమ్స్ సుంకాలను కేంద్రం పెంచింది. దీంతో అమ్మకాలు తగ్గుతున్నా, ధరలను పెంచక తప్పని విచిత్ర పరిస్థితుల్లో తయారీదార్లు చిక్కుకున్నారు. అమ్మకాలు తగ్గుతున్నా, 32 అంగుళాలకు మించిన టీవీల ధరలు ఈ నెలాఖరు నుంచి 15% పెంచాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇటీవలనే మొబైల్ ఫోన్లపై జీఎస్టీని 12% నుంచి 18%కి పెంచడం మొబైల్ కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపనున్నది. జీఎస్టీ పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం... ఇలాంటి కారణాల వల్ల ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతాయని, ఫలితంగా డిమాండ్ తగ్గగలదని అసస్ ఇండియా బిజినెస్ హెడ్(మొబైల్స్) దినేశ్ శర్మ చెప్పారు. మొబైల్స్‌పై జీఎస్టీ పెంపు మొబైల్ ఫోన్ల రంగంపై తీవ్రమైన ప్రభావమే చూపుతుందని, అంతేకాకుండా వేలాది ఉద్యోగాలు పోతాయని ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసిం ది. ఇది రిటైల్ రంగాన్ని, వినియోగదారుల సెంటిమెంట్‌ను అతలాకుతలం చేయగలదని పేర్కొంది. (కోవిడ్: నిమిషాల్లోనే నిర్ధారణ!) -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్.. ఆఫర్స్ ఇవే
సాక్షి, ముంబై: ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శుభవార్తను అందించింది. మార్చి 19వ తేదీ నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆ సేల్‌లో అందివ్వనున్న ఆఫర్ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ తాజాగా వెల్లడించింది. మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ 2020 సేల్ జరగనుంది. ఈ నాలుగు రోజుల సేల్‌లో స్మార్ట్ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, టీవీలు, అప్లయెన్సెస్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, హోమ్ అండ్ ఫర్నీచర్‌పై ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్కు సంబంధించి మార్చి 15 నుంచి 17 వరకు ప్రీ బుక్ సేల్ కూడా ప్రారంభించింది. అంటే కొన్ని ప్రొడక్ట్స్‌ను మార్చి 17 వరకు బుక్ చేసుకొని కొంత డబ్బులు చెల్లించాలి. సేల్ సమయంలో మిగతా పేమెంట్ చేసి ఆర్డర్ పూర్తి చేయాలి. ప్రీ బుక్ సేల్‌లో కొనేవారికి ప్రొడక్ట్స్ కొంత తక్కువ ధరకే లభిస్తాయి. మార్చి 18 రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్యాషన్‌పై 50% నుంచి 80% వరకు, హోమ్ ఎసెన్షియల్, ఫర్నీచర్‌పై 80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపై 80% వరకు తగ్గింపు పొందొచ్చు. ఢమాల్ డీల్స్ పేరుతో మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై ఎక్స్ట్రా డిస్కౌంట్, ప్రైస్ క్రాష్ డీల్‌లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై 15% తగ్గింపు పొందొచ్చు. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో బుక్ చేసిన వారికి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. -
కోవిడ్-19 : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోంది. చైనాతో సంబంధమున్న పలు వ్యాపారాలు ఇప్పటికే దెబ్బ తినగా, చైనాలో పలు కంపెనీలు మూసివేతల వైపుగా పయనిస్తున్నాయి. తాజాగా భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ మూసివేస్తున్నట్లు ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఆఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ బుధవారం తెలిపారు. చైనాలోని వుహాన్‌లో కోవిడ్ వైరస్ వ్యాప్తి అనేక దేశాలలో వాణిజ్యం, అనేక పరిశ్రమలపై ప్రభావం చూపుతోందని మోహింద్రూ వెల్లడించారు. ముఖ్యంగా ఏవియేషన్ , ఎలక్ట్రానిక్స్ సహా భారతదేశంలో పలు రంగాలలో వైరస్ వ్యాప్తి ప్రభావం ఆందోళన కరంగా ఉందన్నారు. చైనాలోని కొన్ని కర్మాగారాలు తెరిచినప్పటికీ, కార్మికులు విధులకు హాజరవుతారా లదా అనేది ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో చైనా ప్రధాన పాత్ర పోషిస్తుందనీ, విడిభాగాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుందన్నారు. అలాగే స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లో కూడా విడి భాగాలు చాలా వరకు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయని తెలిపారు. కాగా కోవిడ్-19 శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చైనాలో పరిశ్రమలు తాత్కాలికంగా మూసివేయడంతో ఉత్పత్తులు నిలిచిపోయాయి. ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అయ్యే విడి భాగాల సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత్‌లోని ఆటో ఉత్పత్తులపై ప్రభావం పడనుందని ఆటో పరిశ్రమ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో భారత్‌లో ఆటో ఉత్పత్తులు 8.3 శాతం మేర పడిపోవచ్చునని ఫిచ్ సొల్యూషన్స్ బుధవారం అంచనా వేసింది. దేశీయ ఉత్పత్తిపై కూడా పడిపోనుందని అభిప్రాయపడింది. చదవండి : ప్రాణాంతక కరోనా పేరు మార్పు కరోనా ప్రమాదం : మన ర్యాంకు ఎంతంటే? -
ఫ్లిప్‌కా(స్టా)ర్ట్ సేల్, కొత్త ఏడాది ఆఫర్లు
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ సేల్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ పేరుతో స్మార్ట్ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. అలా 2020 ఏడాదిలో తొలి సేల్‌ను ప్రారంభించింది. జనవరి 1 అర్థరాత్రి ప్రారంభమైన మూడు రోజుల సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రియల్మీ ఎక్స్ 2, రెడ్మి నోట్ 7 ప్రో వంటి స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, అదనపు డిస్కౌంట్లను అందించడానికి బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్. ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం మినహాయింపుతో పాటు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. స్మార్ట్ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్లు రియల్ మి5 ఎస్ : ఆఫర్ ప్రైస్ : రూ .9,999 (క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, క్వాడ్ కెమెరా 48 ఎంపీప్రైమరీ లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపీ సూపర్ మాక్రో లెన్స్ 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ ప్రధాన ఫీచర్లు) రియల్మీ ఎక్స్ 2: ధర రూ .16,999 కు విక్రయిస్తోంది. (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జీ సాక్ ప్రాసెసర్, 64 +82+ 2 ఎంపీ కెమెరా 32 ఎంపీ సెల్ఫీకెమరా ప్రధాన ఫీచర్లు) రెడ్మి నోట్ 7 ప్రో : రూ. 9,999 లభ్యం. (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6.3-ఇంచ్ ఫుల్ హెచ్డీ + డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 సాక్ డుబుల్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరాప్రధాన ఫీచర్లు) ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్లపై కూడా ప్రత్యేక తగ్గింపునిస్తోంది. ఏసర్ స్విఫ్ట్ 3 (ఇంటెల్ కోర్ ఐ 5, 2 జీబీ గ్రాఫిక్స్) ను రూ. 44.990. మార్కెట్ ధర రూ. 50,000. -
కోటి ఉద్యోగాల కల్పన
న్యూఢిల్లీ: నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ సంబంధ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పడగలదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ క్యాబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. మొబైల్స్ తయారీని సుమారు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే 100 కోట్ల యూనిట్ల స్థాయికి చేర్చాలని జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం 2019లో నిర్దేశించుకున్నారు. ఇందులో రూ. 7 లక్షల కోట్ల విలువ చేసే 60 కోట్ల యూనిట్స్ ఉండనున్నాయి. అలాగే, రక్షణ శాఖ, ఇతర వ్యూహాత్మక విభాగాల ఎలక్ట్రానిక్స్ తయారీ అవసరాలను కూడా తీర్చడంపై దృష్టి సారించాలని ఈ విధానంలో నిర్దేశించుకున్నారు. 2012లో తొలిసారిగా జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం అమల్లోకి వచ్చింది. మరోవైపు, పోంజీ స్కీముల్లాంటి అనియంత్రిత డిపాజిట్ స్కీములను నిషేధించడం కోసం ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కి కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గతేడాది జూలైలో ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అటు కంపెనీలు సొంత అవసరాల కోసం తీసుకున్న గనుల (క్యాప్టివ్ మైన్స్) నుంచి ఉత్పత్తి చేసే బొగ్గులో 25 శాతాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకునే వెసులుబాటును ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. -
జోరుగా డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్) ప్రక్రియపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో (సీఈఎల్) పూర్తిగా 100 శాతం వాటాలను విక్రయించేందుకు శుక్రవారం బిడ్లను ఆహ్వానించింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు బిడ్డర్లు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) పంపాలంటూ ప్రకటించింది. ఈవోఐలు దాఖలు చేసేందుకు అక్టోబర్ 21 ఆఖరు తేదీ. 2018 మార్చి 31 నాటికి కనీసం రూ. 50 కోట్ల నికర విలువ గల సంస్థలు బిడ్లను దాఖలు చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి. 1974లో ఏర్పాటైన సీఈఎల్ ప్రస్తుతం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహణలో ఉంది. 2017 మార్చి ఆఖరు నాటి లెక్కల ప్రకారం దీని నికర విలువ రూ.50.34 కోట్లు. గతేడాదే ఈ సంస్థ విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇప్పటిదాకా భారత్–22 ఈటీఎఫ్, రైట్స్ సంస్థలో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ. 9,000 కోట్లు సమీకరించింది. రూ. 467 కోట్ల ఇర్కాన్ ఐపీవో.. రైల్వేస్ అనుబంధ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్‌లో 10 శాతం వాటాల విక్రయంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా రూ. 467 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత ఇనీ షియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) సంబంధించి ధర శ్రేణిని రూ. 470– రూ. 475గా ఇర్కాన్ నిర్ణయించింది. ఈ ఐపీవోలో కేంద్రం 99,05,157 షేర్లను విక్రయిస్తోంది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఐపీవో 19న ముగుస్తుంది. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. 1976లో ప్రారంభమైన ఇర్కాన్.. రైల్వేస్, హైవేలు, వంతెనలు మొదలైన మౌలిక రంగ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. సంస్థకు రూ. 22,406 కోట్ల మేర ఆర్డర్లున్నాయి. ఈ ఏడాది జూన్‌లోనే రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ కూడా ఐపీవోకి వచ్చింది. ఏఐఏటీఎస్ఎల్లో వాటాల అమ్మకం .. రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను గట్టెక్కించే ప్రణాళికల్లో భాగంగా అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్(ఏఐఏటీఎస్ఎల్)లో వ్యూహాత్మక వాటాల విక్రయ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. మంత్రుల బృందం(జీవోఎ) అనుమతులు వచ్చాక బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను(ఈవోఐ) ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. -
ఫ్లిప్‌కార్ట్ నుంచి ‘2గుడ్’
బెంగళూరు: భారత అతి పెద్ద ఈ–కామర్స్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్... మరమ్మతు చేసి, బాగు చేసిన (రిఫర్బిష్డ్) వస్తువుల కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. చిన్న చిన్న లోపాల కారణంగా పనికి రాకుండా పోయిన పాత వస్తువులను రిపేర్లు చేసి మళ్లీ వినియోగానికి పనికివచ్చేలా చేయడాన్ని రిఫర్బిష్డ్గా వ్యవహరిస్తారు. ఇలాంటి వస్తువుల కోసం తొలిసారిగా ఈ 2గుడ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై తొలిసారిగా స్మార్ట్ఫోన్లను, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కేటగిరీ వస్తువులను అందిస్తామని చెప్పారాయన. 3–12 నెలల వారంటీ... ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులకు 3 నుంచి 12 నెలల వారంటీని ఇస్తున్నామని, విస్తృతమైన సర్వీసింగ్ నెట్వర్క్ ద్వారా విక్రయానంతర సర్వీసులను కూడా అందించనున్నామని కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ విభిన్నమైన సెగ్మెంట్లో కొత్త వినియోగదారులను సాధించడంపై దృష్టి పెడుతున్నామని వివరించారు. అంతేకాకుండా భారత ఈ కామర్స్ రంగంలో తమ అగ్రస్థానాన్ని మరింతగా పటిష్టపరచుకోనున్నామని పేర్కొన్నారు. రిఫర్బిష్డ్ వస్తువులకు మార్కెట్లో అవకాశాలు అపారంగా ఉన్నా, సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గోటేటి చెప్పారు. -
స్కైక్వాడ్ ప్లాంటులో స్కైవర్త్ టీవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ స్కైక్వాడ్ ఎలక్ట్రానిక్స్ చైనాకు చెందిన టీవీ బ్రాండ్ స్కైవర్త్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మేడ్చల్ వద్ద ఉన్న స్కైక్వాడ్ ప్లాంటులో స్కైవర్త్ బ్రాండ్ ఎల్ఈడీ టీవీల అసెంబ్లింగ్ కోసం ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. స్కైవర్త్ ఇండియా ఎండీ డేనియల్ సాంగ్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఈ యూనిట్ కోసం రూ.25 కోట్లు ఖర్చు చేసినట్టు కంపెనీ వర్గాలు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపాయి. 14 నుంచి 55 అంగుళాల టీవీలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఇప్పటికే కంపెనీ ఆరు బ్రాండ్లతో చేతులు కలిపింది. ప్లాంటులో ఈ బ్రాండ్ల కోసం ఎల్ఈడీ ల్యాంప్స్, బల్బŠస్, ట్యూబ్స్, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, మెడికల్ ఎక్విప్మెంట్లను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ప్లాంటుకై రూ.100 కోట్లకుపైగా వెచ్చించారు. 1,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. హై వాల్యూమ్ టెలివిజన్ మార్కెట్లో విస్తరణకు తాజా ఒప్పందం దోహదం చేస్తుందని స్కైక్వాడ్ సీఈవో రమిందర్ సింగ్ సోయిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
టాప్–3లో తెలుగు రాష్ట్రాలు: ఎల్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 30 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు ఎల్జీ వెల్లడించింది. ఏటా రూ.8,000 కోట్ల వ్యాపారం జరుగుతున్న ఈ మార్కెట్లలో గత ఏడాది కంపెనీ 27 శాతం పైగా వాటాను సాధించింది. 2017లో తెలుగు రాష్ట్రాల్లో రూ.2,300 కోట్లకుపైగా టర్నోవర్ నమోదు చేశామని ఎల్జీ ఇండియా రీజినల్ బిజినెస్ హెడ్ కె.శశికిరణ్ రావు తెలిపారు. భారత్‌లో కంపెనీ 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది టర్నోవర్ 15–20% అధికం గా ఆర్జిస్తామని చెప్పారు. ఆదాయం పరంగా సంస్థకు ఢిల్లీ, తమిళనాడు తర్వాతి స్థానాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు సంయుక్తంగా కైవసం చేసుకున్నాయని వెల్లడించారు. ఎల్జీ ఇండియా ఆదాయంలో 14 శాతం ఇక్కడి నుంచి సమకూరుతోందని వివరించారు. రెండు రాష్ట్రాల్లో కొత్తగా 20 ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లను ప్రారంభిస్తామన్నారు. కాగా, 21 ఏళ్ల వేడుకల్లో భాగంగా జూన్ 10 వరకు కొన్ని రకాల ఉపకరణాల కొనుగోళ్లపై పలు బహుమతులను అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై 7.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉంది. -
ఇక మైక్రోమాక్స్ ఫ్రిజ్‌లు, వాషింగ్మెషిన్లు!
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమాక్స్’ పూర్తిస్థాయి కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా మారటానికి వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు (ఫ్రిజ్‌లు), మైక్రోవేవ్ వంటి విభాగాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందుకోసం మ్యాన్యుఫాక్చరింగ్పై రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేసి, ఈ ఆర్థిక సంవత్సరంలో టీవీ ప్యానెల్ మార్కెట్లో 8 లక్షల యూనిట్ల విక్రయాలతో 7–8 శాతం వాటాను సాధించాలని ప్రణాళికలు వేస్తోంది. మైక్రోమాక్స్ గతేడాది ఏసీల విభాగంలోకి ప్రవేశించడం తెలిసిందే. ‘వచ్చే ఏడాది కాలంలో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో 70–80 శాతం ప్రొడక్ట్ లైనప్ కలిగి ఉంటాం. ఇందులో ఏసీ, ఎయిర్ కూలర్స్, వాషింగ్ మెషీన్లు వంటివి ఉంటాయి’ అని మైక్రోమాక్స్ ఇన్ఫర్మాటిక్స్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ అగర్వాల్ చెప్పారు. మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్లను రెండేళ్ల కాలంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారాయన. సంస్థ మొత్తం ఆదాయంలో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం వాటా వచ్చే మూడేళ్లలో దాదాపు 40 శాతానికి చేరొచ్చని అంచనా వేశారు. రానున్న 2–3 ఏళ్లలో రూ.200–300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. ‘పూర్తిస్థాయి కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా ఎదగాలనేది కంపెనీ లక్ష్యం. ఏసీ, ఎల్ఈడీ టీవీ కేటగిరీల్లో సముచితమైన వాటాను కలిగి ఉన్నాం. వచ్చే ఏడాది కాలంలో మార్కెట్లోకి మరిన్ని ప్రొడక్టులను తెస్తాం. దీంతో ఆయా విభాగాల్లో మా స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటాం. అదేసమయంలో కొత్త కేటగిరీల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాం’ అని చెప్పారాయన. -
ఆవిష్కరణకు అందలం!
ఇన్నోవేషన్ పాలసీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల రంగంలో రాష్ట్ర ఇన్నోవేషన్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలను ప్రోత్సహించడం, పోటీత త్వాన్ని పెంపొందించడం, దిగువ స్థాయి వరకు నైపుణ్యాన్ని తీసుకెళ్లడం, ఆర్థిక తోడ్పాటు, అనువై న వాతావరణాన్ని కల్పించేందుకు పాలసీని తీసు కొచ్చింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కార్యక్రమ నిర్వహణ సమర్థత.. ఆర్థిక సహాయానికి సుస్థిర నమూనాలు.. ప్రాథమిక విద్య దశలోనే సృజనాత్మకత, ప్రయోగాలు చేసేలా వాతావరణం కల్పించి నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేయడం... నిరంతరం పరిశోధనలను పెంపొందించడం, వాటిని గుర్తించడానికి పరిశ్రమలతో క్రియాశీల సంబంధాలు ప్రోత్సహించడం.. అదనపు రాయితీ, ప్రోత్సాహకాలు అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్టార్టప్స్‌ను ప్రోత్సహిం చాలనే 5 ప్రధాన లక్ష్యాలను అంది పుచ్చు కోవడానికి ఈ కొత్త పాలసీని ప్రకటించిం ది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌ల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇంక్యుబేటర్లకు రాయితీలు ► తొలి సేల్ డీడ్/లీజ్ డీడ్ లావాదేవీలపై ఇంక్యుబేటర్లు, హోస్ట్ సంస్థలకు 100 శాతం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. రెండోసారి 50 శాతాన్ని చెల్లిస్తుంది. ► ఇంక్యుబేటర్లు సమీకరించే రుణాలపై కేంద్ర ప్రభుత్వ సాయంతో మ్యాచింగ్ గ్రాంట్స్ మంజూరు చేయనుంది. ► ఏడాదికి రూ.2.5 లక్షలు మించకుండా మూడేళ్లు 25 శాతం ఇంటర్నెట్ చార్జీలను తిరిగి చెల్లించనుంది. ► ఇంక్యుబేటర్ ఏర్పాటుకు ప్రభుత్వ భవనాన్ని అద్దెకు తీసుకుంటే ఇంక్యుబేటర్ నిలదొక్కునే వరకు, లేదా గరిష్టంగా 5 ఏళ్ల వరకు భవనం అద్దె, నిర్వహణ చార్జీలను మాఫీ చేయనుంది. ► ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుంటే మూడేళ్ల పాటు చదరపు అడుగుకు రూ.5 లేదా చెల్లించిన అద్దెలో 25 శాతం (రెండింట్లో ఏదీ తక్కువైతే అది)ను తిరిగి చెల్లించనుంది. ► భవనం, స్థలం ఖర్చులు కాకుండా ఇంక్యుబేటర్ ఏర్పాటుకు ఇతర పెట్టుబడుల్లో 20 శాతం రూ.30 లక్షలకు మించకుండా సబ్సిడీగా మంజూరు చేయనుంది. స్టార్టప్‌లకు రాయితీలు ► రూ.కోటి వార్షిక టర్నోవర్ గల స్టార్టప్‌లకు రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్జీఎస్టీ)ను మూడేళ్లు ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ► ట్రేడ్షోల ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ కార్యక్రమాలకు చేసే ఖర్చులో ఏటా రూ.5 లక్షలకు మించకుండా 30 శాతం ఖర్చును తిరిగి చెల్లించనుంది. ► భారతీయ పేటెంట్ పొందేందుకు రూ.2 లక్షలు, విదేశీ పేటెంట్‌కు రూ.10 లక్షల వరకు ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది. ► నియామకాలను ప్రోత్సహించేందుకు తొలి ఏడాది ఒక్కో ఉద్యోగికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకాలను స్టార్టప్‌లకు అందించనుంది. ► ఏటా 15 శాతం వార్షిక టర్నోవర్ వృద్ధి సాధించే కంపెనీలకు తొలి మూడేళ్లు రూ.10 లక్షలకు మించకుండా టర్నో వర్లో 5 శాతం ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందించనుంది. -
సృజనాత్మకతకు టీ–వర్క్స్
♦ నూతన సంస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ♦ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం ♦ హార్డ్‌వేర్ నమూనాల అభివృద్ధి, ఇంక్యూబేషన్, నైపుణ్యాభివృద్ధికి సదుపాయాలు ♦ ఆలోచనతో వచ్చి ప్రొడక్ట్‌తో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: మీ దగ్గర ఓ సరికొత్త ఆలోచన ఉందా? ఏదైనా ఒక కొత్త ఉత్పత్తిని సృష్టించాలనుకుంటున్నారా? అందుకు తగిన సదుపాయాల కోసం అన్వేషిస్తున్నారా.. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒక సృజనాత్మక ఆలోచనతో వచ్చి ఉత్పత్తి (ప్రొడక్ట్)ను అభివృద్ధి చేసుకుని వెళ్లగలిగేలా సదుపాయాలను కల్పిస్తూ ‘టీ–వర్క్స్’ పేరుతో నూతన సంస్థకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ రంగాల్లో అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు దీనిని ఏర్పాటు చేసింది. హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ స్థాయి నమూనాల రూపకల్పన (ప్రొటోటైపింగ్) సదుపాయంతో పాటు ఔత్సాహిక పరిశోధకుల అభివృద్ధి కేంద్రం (ఇంక్యుబేషన్ సెంటర్), నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఈ ‘టీ–వర్క్స్’లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు లాభాపేక్ష లేని సంస్థగా టీ–వర్క్స్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణం సృష్టించడం, హార్డ్‌వేర్ నమూనాల తయారీ సదుపాయం కల్పించడం, ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినట్లు నిపుణులైన మానవ వనుల అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేయనుంది. ఈ సంస్థకు డైరెక్టర్లుగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ (ఎలక్ట్రానిక్స్) వ్యవహరిస్తారు. టీ–వర్క్స్ ప్రధాన ఉద్దేశాలివీ..నమూనాల ఉత్పత్తి కోసం: ఏదైనా ఓ ఆలోచనతో ఔత్సాహిక పరిశోధకులు అడుగు పెట్టి.. ఉత్పత్తిని రూపొందించుకుని బయటకు వెళ్లేందుకు కావాల్సిన అత్యాధునిక సదుపాయాలు, యంత్రాలు టీ–వర్క్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తుల నమూనాల అభివృద్ధి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు. ఇంక్యుబేషన్: హార్డ్‌వేర్ ఉత్పత్తికి సంబంధించిన ఆలోచనలకు కార్యరూపం కల్పించి ఉత్పత్తుల తయారీకి సహకరించడం, హార్డ్‌వేర్ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడిదారులు, సలహాదారులు, మార్గదర్శకులను ఆకర్షించడం, హార్డ్‌వేర్ రంగ అభివృద్ధికి పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఏకమై పనిచేసేందుకు ఇంక్యుబేషన్ కేంద్రం ఉపయోగపడనుంది. -
ఇక సిలికాన్‌తో పనిలేదోచ్..!
బోస్టన్: సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో సిలికాన్ లేదా కాపర్ మెటీరియల్ ను ఉపయోగించడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ, బొగ్గు పొరలను ఉపయోగించి పనిచేసే ఎలక్ట్రానిక్ హీటింగ్ డివైజ్‌ను అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రంగంలోని మరిన్ని పరికరాల తయారీలో బొగ్గును ఉపయోగించవచ్చని చెబుతున్నారు. బొగ్గు ఉపయోగాలను పరిశీలించిన శాస్త్రజ్ఞులకు క్రమంగా సాధారణ మెటీరియల్స్‌తో పోల్చితే బొగ్గు మాలిక్యులర్ కాంప్లెక్సిటీలో భారీ తేడా కనిపించడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ వినియోగంలో వాడి విజయం సాధించారు. ఇప్పటివరకు బొగ్గుతో తయారుచేసిన ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజ్‌ను కార్లు, విమానాలు కిటికీలు, రెక్కల్లో ఉపయోగించారు. మొదటి దశలో బొగ్గులో ఉండే ఆంథ్రసైట్, లిగ్నైట్, రెండు బైట్యుమినస్ రకాల ప్రాపర్టీల్లో తేడాలను గమనించిన పరిశోధకులు సహజసిద్ధంగా లభించే బొగ్గులో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తయారీకి కావలసిన అన్నీ గుణాలు కలిగి ఉన్న దాన్ని ఎంపిక చేసుకున్నారు. తర్వాత ప్రత్యేక పద్ధతుల్లో బొగ్గును పొడిగా తయారుచేసి పలుచని ఫిల్మ్ మీద మిశ్రమాన్ని పోసి పొరలుగా తయారుచేసుకున్నారు. ఈ పొరల్ని సాధారణంగా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ తయారీ పద్ధతి ఫ్యాబ్రికేషన్‌లో సిలికాన్ స్థానంలో బొగ్గు పొరల్ని ఉంచారు. ఇలా మామూలు తయారీ పద్ధతిని ఉపయోగించి ప్రస్తుతం తయారవుతున్న అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో దీనిని ఉపయోగించొచ్చని శాస్త్రజ్ఙులు చెబుతున్నారు. దీంతో సిలికాన్‌తో పోల్చితే తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను జర్నల్ నానో లెటర్స్‌లో ప్రచురించారు. -
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో...రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు
ఐటీ మంత్రి రవిశంకర్ వెల్లడి న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని కమ్యూనికేషన్స్, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. 2014 వరకూ రూ.11,700 కోట్లుగా ఉన్న ఈ రంగంలో పెట్టుబడులు ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1.28 లక్షల కోట్లకు పైగా పెరిగాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రం, రాష్ట్రాలది కీలకమైన పాత్ర అని వివరించారు. భారత్ టెక్నాలజీ వేగంగా అందుకుంటోందని, ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో ఇంటర్నెట్ను వినియోగించే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని తెలిపారు. టైమ్స్ నెట్వర్క్ ఇక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడారు. భారతీయులు ముందుగా టెక్నాలజీని గమనిస్తారని, తర్వాత దానిని వినియోగిస్తారని, ఆ తర్వాత సాధికారత సాధిస్తారని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఆధార్‌తో రూ.50 వేల కోట్ల ఆదా.. వంద కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులున్నారని, దాదాపు 99 కోట్ల మందికి ఆధార్ కార్డులిచ్చామని, ఆధార్ అనుసంధాన బ్యాంక్ అకౌంట్లకు నేరుగా సబ్సిడీలు చెల్లించడం ద్వారా రూ.50,000 కోట్లు ఆదా చేశామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. భారత్‌లో ఈ కామర్స్ జోరుగా వృద్ధి సాధిస్తోందని, ఈ కామర్స్‌ను వినియోగిస్తున్న వారిలో 60 శాతం మంది చిన్న పట్టణాల ప్రజలేనని వివరించారు. 2.2 లక్షల గ్రామ పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానం చేసే కార్యక్రమంలో భాగంగా 1.3 లక్షల కి.మీ. మేర కొత్త పైప్లైన్లను వేశామని, 1.10 లక్షల కి.మీ. మేర ఆప్టికల్ ఫైబర్ వేశామని చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసి ఈ-బిజినెస్, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్, ఇతర ప్రాజెక్టులను గ్రామాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. చిన్న నగరాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్(బీపీఓ) జోరు పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇప్పటివరకూ 78 కంపెనీలు 190 నగరాల్లో బీపీఓ సెం టర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని వివరించారు. -
ఎలక్ట్రానిక్స్, ఐటీ సొసైటీకి గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్స్, ఐటీ సొసైటీలను ఏర్పాటు చేయాలని శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ మూడు సొసైటీలలో ఒకదాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గన్నవరంలో ఎల్అండ్ టీ కంపెనీ మేధా టవర్స్‌ను నిర్మించింది. మంగళగిరి ఆటోనగర్ వద్ద ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలకు కావాల్సిన భూములను ఏపీఐఐసీ కేటాయిస్తోంది. - విశాఖ, తిరుపతిలోనూ ఏర్పాటు - ఎలక్ట్రానిక్, ఐటీ రంగాలు అభివృద్ధికి సొసైటీ కృషి - ఇప్పటికే గన్నవరంలో మేధా టవర్స్ ఏర్పాటు సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఎలక్ట్రానిక్, ఐటీ రంగాలు, పరిశ్రమలను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్స్, ఐటీ సొసైటీలను ఏర్పాటు చేయాలని శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినేట్ సమావేశం నిర్ణయించింది. ఈ మూడు సొసైటీలలో ఒకదాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సొసైటీ ద్వారా ఈ ప్రాం తంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కేంద్రంగా.. రాజధాని కేంద్రంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే గన్నవరంలో ఎల్అండ్ టీ కంపెనీ మేధా టవర్స్‌ను నిర్మించింది. మంగళగిరి ఆటోనగర్ వద్ద ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలకు కావాల్సిన భూములను ఏపీఐఐసీ కేటాయిస్తోంది. ఐటీ సంస్థ ‘పై’ ఇప్పటికే పది ఎకరాలు కేటాయించగా, మరో రెండు పరిశ్రమలు ఇక్కడ తమ కార్యాలయాలను పెట్టేందుకు ముందుకు రావడంతో వాటికి కావాల్సిన స్థలాలను కేటాయించేందుకు ఏపీఐఐసీ సిద్ధంగా వుంది. కాగా సైబరాబాద్‌లో ఉన్న కొన్ని సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా ఇక్కడ రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు సొసైటీ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా వుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పెరగనున్న ఉద్యోగ అవకాశాలు.. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాల కోసం బెంగుళూరు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం ఇంజినీరింగ్‌విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలతోనూ ఇప్పటికే ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు. ఈ కంపెనీలు వస్తే వందల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వచ్చి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ట్యాబ్లెట్
ధర రూ. 8,999 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ అయిన మైక్రోమ్యాక్స్.. కొత్తగా కాన్వాస్ పీ690 పేరుతో ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ క్వాడ్ కోర్ 1.83 గిహెడ్జ్ను క లిగి ఉన్న ఈ ట్యాబ్లెట్ 8 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1జీబీ ర్యామ్, 5 మెగాపిక్సెల్ కెమెరా, 4,000 ఎంఎహెచ్ బ్యాటరీతో ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. 3జీ సామర్థ్యం కలిగిన ఈ ట్యాబ్ ధర రూ. 8,999. ‘‘ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా 30% వృద్ధి రేటును కనబరుస్తున్నట్లు ఈ సందర్భంగా మైక్రోమ్యాక్ ్స సీఈఓ వినీత్ తనేజా చెప్పారు. కొత్తగా విడుదల చేసిన 4వ తరం ఇంటెల్ ట్యాబ్‌తో రూ.6-15 వేల వరకు ఉన్న మార్కెట్ విభాగంలో అగ్రస్థానానికి చేరుకుం టామని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఓ కొత్త ఉత్పత్తితో మార్కెట్లోకి వస్తామన్నారు. -
మధ్యవర్తిల మహా జోరు..
భారీగా పెరుగుతున్న ఆన్లైన్ ఆగ్రిగేటర్లు ట్యాక్సీ నుంచి బీమా పాలసీల దాకా అన్నిటికీ ప్రతి రంగానికీ విస్తరిస్తున్న ఆగ్రిగేటింగ్ వెబ్సైట్లు భవిష్యత్తు దృష్ట్యా ఆకాశానికి ఎగస్తున్న వాల్యుయేషన్లు ‘ఉబెర్’ విలువ ఏకంగా రూ.2.5 లక్షల కోట్లపైనే రూ. 1,200 కోట్లు పెట్టి ట్యాక్సీ ఫర్ స్యూర్ను కొన్న ఓలా పాలసీ బజార్లో ప్రేమ్‌జీ రూ.300 కోట్ల పెట్టుబడి మధ్యవర్తి. మరోరకంగా చెప్పాలంటే దళారి పేరేదైనా... చేసే పని మాత్రం కొనుగోలుదారు, అమ్మకందారు మధ్య సంధానకర్త్తే. దుస్తులు... షూలు... కిచెన్ వేర్... ఎలక్ట్రానిక్స్... ఏ వస్తువైనా కావొచ్చు.. కొనాలనుకున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తాం? ఎకాయెకిన కొనేయకుండా నాలుగైదు షాపులు తిరిగి రేట్లు తెలుసుకుని, నాణ్యమైనది ఎక్కడ చవకగా దొరుకుతోందో చూస్తాం. అక్కడే కొనుక్కుంటాం. మరి ఇన్ని షాపుల చుట్టూ ఇలా తిరక్కుండా... అసలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాల్సిన అవసరమే లేకుండా ఆన్లైన్లోనే అన్ని షాపుల్లోని, అన్ని బ్రాండ్ల ధరలూ ఒకేచోట దొరికేస్తే! అన్ని కంపెనీల సేవలూ ఒకేచోట దొరికేస్తే..! అన్నిటినీ పోల్చిచూసుకునే అవకాశం ఒకేచోట ఉంటే...? ఉండకేం... బీమా పాలసీల నుంచి మ్యూచ్‌వల్ ఫండ్ల వరకూ... సినిమా టికెట్ల నుంచి విమానం టికెట్ల వరకూ... ట్యాక్సీ నుంచి హోటల్ ప్యాకేజీల వరకూ అన్ని సేవలనూ ‘ఒకే గేట్‌వే’ నుంచి అందించడానికి బోలెడన్ని ‘ఆగ్రిగేటర్లు’ వచ్చాయి. ఇండియాలో ఇంటర్నెట్తో పాటు ఆగ్రిగేటర్ల వాడకమూ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అసలీ ఆగ్రిగేటర్ల కథేంటి? వీటి భవిష్యత్తేంటి? వీటితో ఉపయోగాలేంటి? అనే విశ్లేషణే ఈ కథనం... సమాచార్‌తో అరంగేట్రం... ఆగ్రిగేటర్లంటే మొదట చెప్పాల్సింది వార్తల ఆగ్రిగేటర్గా అరంగేట్రం చేసిన సమాచార్ డాట్ కామ్ గురించే. 1990ల చివరల్లో ఇండియా వరల్డ్ సంస్థ ఆరంభించిన ఈ న్యూస్ ఆగ్రిగేటర్ను, మరో మూడునాలుగు వెబ్సైట్లను కలిపి అప్పట్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ... సిఫీ ద్వారా ఏకంగా రూ.499 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అప్పట్లో అదొక రికార్డు. తమక్కూడా న్యూస్ పోర్టల్ (సిఫీ.కామ్) ఉంది కనక రెండిటినీ కలిపితే విదేశాల్లోని భారతీయ నెటిజన్లంతా తమ పోర్టలే చూస్తారని, ఈ ఏకచ్ఛత్రాధిపత్యం కోసమే అంత సొమ్ము పెట్టామని అప్పట్లో సిఫీ చెప్పింది. అయితే తరువాతి పరిణామాల్లో ఇంటర్నెట్తో పాటు న్యూస్ పోర్టళ్లూ బాగా అభివృద్ధి చెంది అవే సొంతగా యూజర్ల మొబైల్స్‌కు ఫ్లాష్‌లు పంపటం, ఎక్స్‌క్లూజివ్ వార్తల్ని కూడా మెసేజ్‌లు, మెయిల్స్ ద్వారా పుష్ చేయటం మొదలెట్టాయి. ఫలితంగా యూజర్లు నేరుగా నచ్చిన సైట్‌కే వెళుతుండటంతో సొంత వార్తలతో సహా ఆగ్రిగేటర్ సేవలనూ అందిస్తున్న సమాచార్ డాట్‌కామ్ వెనకబడిపోయింది. ప్రతి పనికీ ఆగ్రిగేటర్లే! నిజానికి ఈ ఆగ్రిగేటింగ్ వెబ్సైట్లకు సొంత ఉత్పత్తులేమీ ఉండవు. వాటిని విక్రయించే వివిధ సంస్థలు, వెబ్సైట్ల నుంచి సమాచారం సేకరించి, ఒకే చోట అందించడమే వీటి పని. దీంతో కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులు లేదా సర్వీసులను వివిధ సంస్థలు ఏ రేటుకు, ఎంత నాణ్యంగా అందిస్తున్నాయో పోల్చి చూసుకుని... వీలైతే అక్కడే కొనుగోలు చేయటమో, లేకుంటే సదరు సంస్థ సొంత వెబ్సైట్లో కొనటమో చేయొచ్చు. ఇంటర్ నెట్, మొబైల్ నెట్ బూమ్‌తో ఇపుడు ఆగ్రిగేటర్ల హవా అంతకంతకూ పెరుగుతుండటంతో వాటి వాల్యుయేషన్లూ ఆకాశాన్నంటుతున్నాయి. రిఫరల్ సేవలు కూడా... ధరలను పోల్చే ఆన్లైన్ అగ్రిగేటర్ల వ్యాపార విధానాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మధ్యవర్తి విధానం కాగా.. మరొకటి రిఫరల్ విధానం. మొదటిది యాత్రా, మేక్మైట్రిప్ వంటి ట్రావెల్ పోర్టల్స్ తరహాలో ఉంటుంది. కస్టమర్ సదరు సైటును సందర్శించి... విమాన టికెట్లు, హోటళ్లు, టూర్ ప్యాకేజీల వంటి ఉత్పత్తుల గురించి తెలుసుకున్నాక ఆ సైట్ నుంచే నేరుగా కొనుగోలు చేయొచ్చు. రిఫరల్ విధానానికి వస్తే... ఇక్సిగో తదితర వెబ్సైట్లు ఈ కోవలోకి వస్తాయి. కస్టమర్ ఆగ్రిగేటర్ సైట్లోకి వెళ్లి వివిధ కంపెనీల కొటేషన్లను పోల్చి చూసుకున్నాక నేరుగా కావాల్సిన కంపెనీ సైటుకు అక్కడి నుంచే లావాదేవీని నిర్వహించుకోవచ్చు. కస్టమర్‌ను అందించినందుకు రిఫరల్ ఆగ్రిగేటరుకు కంపెనీ నుంచి కొంత కమిషన్ లభిస్తుంది. కూపన్దునియా, షాపింగ్పైరేట్స్ వంటి కూపన్ వెబ్సైట్లు ఈ కోవలోనివే. భవిష్యత్తేంటి? ఈ-కామర్స్ అభివృద్ధిపై రెండో అభిప్రాయానికి తావులేకున్నా... వాటి ఆదాయాలు, వాల్యుయేషన్లపై మాత్రం విశ్లేషకుల అంచనాల్లో ఏకాభిప్రాయం లేదు. చాలా ఈ కామర్స్ సంస్థలకు స్పష్టమైన ఆదాయ మార్గాలు లేవని, అలాంటపుడు ఈ వాల్యుయేషన్లు ఏ మేరకు కరెక్టనుకోవాలనేది వారి వాదన. ఆ లెక్కన చూస్తే ఆగ్రిగేటర్లు ఆధార పడాల్సిందల్లా రిఫర్ చేసిన సైట్లు అందించే కమిషన్‌పైనే. ఇపుడు ఈ కామర్స్ సంస్థలు భారీ ప్రచారం, ప్రత్యేక డీల్స్, షాపింగ్ ఫెస్టివల్స్ వంటి ఆకర్షణలతో నేరుగా వినియోగదారుల్ని తమ సైట్లకే రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి విజయవంతమవుతున్నాయి కూడా. మున్ముందు ఈ కామర్స్ రంగంలో పునరేకీకరణ జరిగి చిన్నచిన్న వెబ్సైట్లు టేకోవర్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అదే జరిగితే మిగిలిన పెద్ద సంస్థలు నేరుగా కస్టమర్లను తమవద్దకే రప్పించుకోవటం పెద్ద కష్టమేమీ కాబోదు. అపుడు ఈ ఆగ్రిగేటర్ల భవిష్యత్తేంటనేది ఇప్పుడే చెప్పలేం. బ్రిటన్ బీమా రంగంలో 60 మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు, 50 శాతం వ్యక్తిగత బీమా పాలసీలు అగ్రిగేటర్ల ద్వారానే అమ్ముడవుతున్నాయి. 2018 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది వద్ద స్మార్ట్ మొబైల్ ఫోన్లు ఉంటాయి, దీంతో ఆగ్రిగేటర్ల వాడకమూ పెరుగుతుంది. ఈ-కామర్స్‌లోనూ హవా జంగ్లీ.కామ్, మైస్మార్ట్‌ప్రైస్.కామ్, ప్రైస్దేఖో.కామ్, 91మొబైల్స్.కామ్... ఇలా డజన్ల కొద్దీ ఈ-కామర్స్ అగ్రిగేటర్లున్నాయి. మొబైల్ ఫోన్లు, దుస్తులు, బుక్స్, ఆభరణాలు.. ఇలా పలు ఉత్పత్తుల సంస్థలకు అగ్రిగేటర్‌గా జంగ్లీడాట్కామ్ ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫీబీమ్, స్నాప్‌డీల్, అమెజాన్ తదితర ఆన్లైన్ షాపింగ్ సైట్లలో అమ్మే ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, గృహోపకరణాల ధరలను పోల్చి చూపించేందుకు మైస్మార్ట్‌ప్రైస్ ఉపయోగపడుతోంది. ప్రైస్దేఖో కూడా అలాంటిదే. ఒకేసారి పలు ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధరలను పోల్చిచూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి స్మార్ట్‌ప్రిక్స్, 91మొబైల్స్ తదితర సైట్లు. రియల్ఎస్టేట్లో మకాన్, మ్యాజిక్‌బ్రిక్స్ లాంటి వెబ్సైట్లు... ఆటోమొబైల్స్‌లో కార్వాలే తదితర సైట్లు ఆగ్రిగేషన్ సేవలందిస్తున్నాయి. కాగా ఈ కామర్స్ భవిష్యత్తుపై నమ్మకంతో పలు ఆన్లైన్ షాపింగ్ సంస్థలు క్రమంగా అగ్రిగేటర్లుగా మారుతున్నాయి. యేభీ డాట్‌కామ్, బీస్టయిలిష్ డాట్‌కామ్ లాంటివి ఈ కోవలోనివే. ఆర్థిక సేవల్లో ముందంజ... రుణాలు, క్రెడిట్ కార్డుల సమాచారం కావాలంటే బ్యాంక్‌బజార్ డాట్‌కామ్‌కు వెళితే చాలు. ఫండ్స్ ఇండియా అనేది మ్యూచువల్ ఫండ్స్ ఆగ్రిగేటర్గా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాపారం ఏటా 300-400 శాతం వృద్ధి చెందుతోందంటే పరిస్థితి తెలుస్తోంది. ఇక వివిధ బీమా కంపెనీల పాలసీలకు అగ్రిగేటర్‌గా పాలసీ బజార్ డాట్‌కామ్ వ్యవహరిస్తోంది. 2010-11లో ఈ వెబ్సైట్ ద్వారా నెలకు 1,000 కన్నా తక్కువ లావాదేవీలు జరగ్గా... 2013-14లో ఈ సంఖ్య ఏకంగా 32,000కు చేరింది. పాలసీబజార్ ఇటీవలే మరో రూ. 300 కోట్లు నిధులు సమీకరణ కోసం ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ (విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ సంస్థ)తో డీల్ కుదుర్చుకుంది. దీని ప్రకారం పాలసీబజార్ విలువ ఏకంగా రూ. 1,200 కోట్లుగా లెక్కగట్టారు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ప్రస్తుతం మై ఇన్సూరెన్స్క్లబ్, ఎక్యూరేట్ కోట్స్, బైస్మార్ట్పాలసీ... లాంటి సంస్థలకు ఆగ్రిగేటర్లుగా వ్యవహరించేందుకు అనుమతి ఉంది. - ‘సాక్షి’ బిజినెస్ విభాగం -
హైదరాబాద్‌లో వీడియోకాన్ మొబైల్స్ ప్లాంట్
రూ.60 కోట్లతో యూనిట్ ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభం వీడియోకాన్ మొబైల్స్ సీవోవో జెరాల్డ్ పెరీరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ సంస్థ వీడియోకాన్.. మొబైల్స్ అసెంబ్లింగ్ యూనిట్‌ను హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్ వద్ద కంపెనీకి చెందిన ఉపకరణాల తయారీ ప్లాంటు వద్ద రూ.60 కోట్లతో ఈ యూనిట్‌ను నెలకొల్పుతోంది. తొలుత నెలకు 5 లక్షల ఫోన్లను అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. దశలవారీగా ఈ సామర్థ్యాన్ని పెంచనున్నారు. శంషాబాద్ ప్లాంటులో ఏడాదిలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని వీడియోకాన్ మొబైల్స్ సీవోవో జెరాల్డ్ పెరీరా సాక్షి బిజినెస్ బ్యూరోకు శుక్రవారం తెలిపారు. ఫీచర్ ఫోన్లతోపాటు స్మార్ట్ఫోన్లు కూడా ఈ యూనిట్లో తయారవుతాయని వివరించారు. వీటితోపాటు డిమాండ్‌నుబట్టి ట్యాబ్లెట్ పీసీలను సైతం అసెంబుల్ చేస్తామని వెల్లడించారు. వాటా పెంచుకుంటాం..: దేశవ్యాప్తంగా నెలకు వివిధ బ్రాండ్లవి కలిపి 1.8 కోట్ల ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో వీడియోకాన్ వాటా 2.5-3 శాతం మధ్య ఉంటుందని జెరాల్డ్ పెరీరా తెలిపారు. ఫీచర్, స్మార్ట్, ట్యాబ్లెట్స్ విభాగంలో ఏ సమయంలోనైనా 30 మోడళ్లను మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ‘మూడు నాలుగు నెలల కోసారి పాత వాటి స్థానంలో 30 శాతం మోడళ్లు కొత్తవి తీసుకొస్తున్నాం. ఫీచర్ ఫోన్లకు భారత్‌లో ఇంకా డిమాండ్ ఉంది. ఇక స్మార్ట్ఫోన్లు సైతం ఊపందుకున్న నేపథ్యంలో వీటిపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం. డిసెంబర్‌కల్లా దేశవ్యాప్తంగా మొబైల్స్ మార్కెట్లో 5 శాతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నాం’ అని వెల్లడించారు. అవసరమైతే మరిన్ని ప్లాంట్లను పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. నెలకు 30 లక్షల యూనిట్లు.. వీడియోకాన్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ ప్లాంట్లలో మొబైల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. తమిళనాడులో కొత్త ప్లాంటు సిద్ధమవుతోంది. ప్రస్తుత సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లు. డిసెంబర్‌కల్లా దీన్ని 30 లక్షలకు పెంచాలనేది కంపెనీ లక్ష్యం. కొన్ని విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నామని వీడియోకాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్స్ హెడ్ షేక్ రఫీ తెలిపారు. శంషాబాద్ వద్ద అనుబంధ యూనిట్లు కూడా రానున్నాయని తెలిపారు. -
రూ.లక్ష కోట్ల ఐటీ ఎగుమతులు మా లక్ష్యం: కేటీఆర్
* నిపుణుల సంఖ్య 10 లక్షలకు పెంచే ప్రయత్నం * ఐటీ, ఎలక్ట్రానిక్స్ వర్గాలు పెట్టుబడులు, పరిశోధనలకు ముందుకు రావాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఐటీకి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని మారుస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బహుళజాతీయ కంపెనీలకు, ఐటీ పరిశ్రమకు అవసరమైన అత్యుత్తమ విద్యా, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నైపుణ్యం కలిగిన విద్యార్థులు అందుబాటులో ఉన్నారన్నారు. బెంగళూరులో బుధవారం జరిగిన తెలంగాణ ఐటీ రోడ్ షో కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమ వర్గాలతో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేం దుకు, పరిశోధనలు చేపట్టేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక వర్గాలు ముందుకు రావాలని కోరారు. ఐటీ రంగంలో లక్ష కోట్ల ఎగుమతులే ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 3.25 లక్షల ఉద్యోగుల సంఖ్యను 10 లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక్కడి నుంచి బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని వెల్లడిం చారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్, డెల్, మొటోరోలా, డెలాయిట్, కన్వర్జీస్, యూబీఎస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, హనీవెల్, సీమెన్స్, జేపీ మోర్గాన్, యునెటైడ్ హెల్త్ గ్రూపు, ఫేస్ బుక్ తదితర 500 వరకు కంపెనీలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటన్నారు. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, ఐగేట్, సొనాట, ఇన్ఫోటెక్ తదితర సంస్థలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. అత్యుత్తమ విద్యా, పరిశోధన రంగాల్లో ఐఎస్బీ, జేఎన్టీయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, డీఆర్డీఓ సంస్థలు విద్యార్థులకు సేవలందిస్తున్నాయన్నారు. ఇతర నగరాల తో పోల్చితే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలపై వెచ్చించాల్సిన ఖర్చు తక్కువన్నారు. నిజాం కాలం నుంచే అంతర్జాతీయ గుర్తింపు ఉన్న హైదరాబాద్‌ని ఇన్నోవేషన్, టెక్నాలజీ, డెవలపింగ్ న్యూ గ్రోత్ సెక్టార్ త్రూ స్మార్ట్ సిటీ ప్లానింగ్ ద్వారా విస్తరిస్తామన్నారు. అందుబాటులోకి రానున్న మెట్రో రైలు, అత్యాధునిక ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం, ఉచిత వైఫై సేవలు తదితరాలన్నింటిని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ఆర్థిక అభివృద్ధికి ఐటీ రంగం ఇంజన్‌గా ప్రభుత్వం గుర్తిస్తోందని, దీని అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఐటీ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్, రహేజా గ్రూపు చైర్మన్ నీల్ రహేజా తదితరులు పాల్గొన్నారు. -
మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త త్రీజీ కాలింగ్ ట్యాబ్
దేశీ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ తాజాగా మరో ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఏడు అంగుళాల స్క్రీన్‌సైజుతో వస్తున్న ఈ ట్యాబ్ పీ470లో తెలుగుతోపాటు 21 భారతీయ భాషలకు సపోర్ట్ ఉండటం విశేషం. అంటే మనకు నచ్చిన ప్రాంతీయ భాషలో మెయిళ్లు, సోషల్ నెట్వర్కింగ్ పోస్టింగ్స్ సులువుగా చేసుకోవచ్చునన్నమాట. శక్తిమంతమైన 1.3 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. రెండు సిమ్ల ద్వారా ఫోన్, డేటా అందుకునే సౌకర్యముంది దీంట్లో. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తూనే 3200 ఎంఏహెచ్ బ్యాటరీని వాడటం ద్వారా అత్యధిక టాక్‌టైమ్, లేదా స్టాండ్‌బై టైమ్ లభించే అవకాశమేర్పడింది,. కంపెనీ అంచనాల ప్రకారం బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 11 గంటల టాక్‌టైమ్, 158 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుంది. మెమరీ విషయానికి వస్తే దీంట్లో ర్యామ్ 1 జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజీ 8 జీబీల దాకా ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. చివరగా ఈ ట్యాబ్లెట్లో ప్రధాన కెమెరా ఐదు, సెల్ఫీ కెమెరా 0.3 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్ కలిగి ఉన్నాయి. ధర రూ.6999 మాత్రమే. -
గూగుల్ ఆన్లైన్ షాపింగ్ సక్సెస్
1.4 కోట్లకు చేరిన హిట్స్ న్యూఢిల్లీ: గూగుల్ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జీఓఎస్ఎఫ్) విజయవంతమైందని ఆన్లైన్ సెర్చింజన్ గూగుల్ పేర్కొంది. గుంటూరు, హుబ్లి,రాంచి తదితర చిన్న పట్టణాల నుంచి వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ ఆన్లైన్ షాపింగ్‌లో జోరుగా పాల్గొన్నారని గూగుల్ ఇండియా ఇండస్ట్రీ డెరైక్టర్ (ఈకామర్స్) నితిన్ బవన్కులే చెప్పారు. శుక్రవారం ముగిసిన ఈ మూడు రోజుల షాపింగ్ కు 80 లక్షల హిట్స్ వచ్చాయని, ప్రమోషన్ పీరియడ్‌తో కూడా కలుపుకుంటే హిట్స్ సంఖ్య 1.4 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే ఇది ఏడు రెట్లు అధికమని దేశవ్యాప్తంగా 220 నగరాల నుంచి వినియోగదారులు ఉత్సాహాంగా ఈ ఆన్లైన్ షాపింగ్‌లో పాల్గొన్నారని వివరించారు. 40 శాతం మంది యూజర్లు తమ మొబైళ్ల ద్వారానే ఈ షాపింగ్‌ను యాక్సెస్ చేశారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, లైఫ్ స్టైల్, వంటగది పరికరాలు అధికంగా అమ్ముడయ్యాయని తెలిపారు. 500 ఇళ్లు, 50 కార్లు, 100 బైక్‌లు అమ్ముడయ్యాయని వివరించారు. -
ఆన్లైన్ షాపింగ్ హల్చల్..!
న్యూఢిల్లీ: భారత్‌లో ఆన్లైన్ కొనుగోళ్లు దూసుకెళ్తున్నాయని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పేర్కొంది. రెండేళ్లలో(2016 కల్లా) ఈ-కామర్స్ మార్కెట్ 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.93 వేల కోట్లు)కు ఎగబాకనున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం.. ఆన్లైన్లో షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నవాళ్ల సంఖ్య జోరందుకుంటుండటమే దీనికి కారణమని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.18,600 కోట్లు)గా పరిశ్రమ విశ్లేషకుల అంచనా. 2012లో ఆన్లైన్ కొనుగోలుదారుల సంఖ్య 80 లక్షలు కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 3.5 కోట్లకు పెరిగిందని గూగుల్ పేర్కొంది. దుస్తులు, పాదరక్షల నుంచి ఎలక్ట్రానిక్స్, సౌందర్య ఉత్పత్తులు, ఫర్నిచర్ ఇలా సమస్తం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్న ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. కాగా, 2016నాటికి ఆన్లైన్ షాపర్ల సంఖ్య మూడింతలై 10 కోట్లకు వృద్ధి చెందనుందనేది గూగుల్ అంచనా. కన్సల్టింగ్ సంస్థ ఫారెస్టర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో 6,859 మంది పాల్గొన్నారు. ఆన్‌లైన్‌పై పెరుగుతున్న విశ్వాసం... ‘వచ్చే రెండేళ్లలో మూడింతలు కానున్న ఆన్లైన్ కొనుగోలుదార్లలో 5 కోట్ల మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే జతకానున్నారు. ఈ నగరాల్లోని ఆఫ్‌లైన్ కొనుగోలుదారుల్లో(అధ్యయనంలో పాల్గొన్నవాళ్లు) 71 శాతం మంది రానున్న 12 నెలల్లో తాము ఆన్లైన్లో కొనుగోలు చేస్తామంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ విషయంలో కస్టమర్ల విశ్వాసం పుంజుకుంటోందనడానికి ఇదే నిదర్శనం. ఈ డిసెంబర్ చివరినాటికి భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30.2 కోట్లుగా ఉండొచ్చని అంచనా. తద్వారా ఆన్లైన్ యూజర్‌బేస్ విషయంలో అమెరికాను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించనుంది’ అని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనంద్ పేర్కొన్నారు. ఆన్లైన్ షాపింగ్‌పై విశ్వాసం, పెరుగుతున్న యూజర్లతో ఈ-కామర్స్ రంగం ఊహించని వృద్ధిని సాధించనుందన్న సంకేతాలు న్నాయని గూగుల్ ఇండియా డెరైక్టర్నితిన్ బావంకులే అన్నారు. పటిష్టమైన వృద్ధి ధోరణికి అనుగుణంగా యూజర్ల అవసరాలను తీర్చడంపై పరిశ్రమ దృష్టిపెట్టాలన్నారు. -
ఈ-కామర్స్‌లో నిర్మల్ బొమ్మలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, యాక్సెసరీస్ వంటివి చూశాం. ఇక నుంచి నిర్మల్ బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, పెంబర్తి పాత్రలు ఇ-కామర్స్ సైట్లలో హల్చల్ చేయనున్నాయి. ఆన్లైన్లో విక్రయానికి ఈ కంపెనీలతో మాట్లాడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు పరిమితమైన వైవిధ్య హస్తకళలను మంచి ప్యాకింగ్‌తో ప్రపంచానికి పరిచయం చేయొచ్చని అన్నారు. ఇక్కడి హస్తకళలకు మంచి ఆదరణ ఉందని చెప్పారు. అమెరికాకు చెందిన దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్.. ఎఫ్‌ఎంసీజీతోపాటు విభిన్న రంగాల్లో ఉన్న ఐటీసీ లిమిటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఆసక్తిగా ఉంది. హైదరాబాద్‌కు సమీపంలోని గజ్వేల్‌లో పార్క్‌ను స్థాపించాల్సిందిగా కంపెనీకి సూచించామని తారక రామారావు పేర్కొన్నారు. ఐటీసీతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చెప్పారు. ఐటీసీ గ్రూప్ మాదాపూర్‌లో నెలకొల్పనున్న ప్రతిపాదిత 5 స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. ఐటీసీ కోహినూర్ పేరుతో రానున్న ఈ హోటల్‌కు కంపెనీ రూ.700 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే ఐటీసీ రూ.3,000 కోట్లతో భద్రాచలం పేపర్ ప్లాంట్ విస్తరణ ప్రతిపాదనను ప్రభుత్వం స్వీకరించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ బిర్యానీ.. ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ ఎక్కువ రోజులు నిల్వ చేయగలిగే విధానమేదీ లేదని మంత్రి అన్నారు. ఈ విధానం గనక వస్తే యూఎస్ఏ వంటి సుదూర దేశాలకు ఎగుమతి చే సేందుకు వీలవుతుందని అన్నారు. ఐఐపీ డెరైక్టర్ ఎన్.సి.సాహా మాట్లాడుతూ హోటళ్లు ముందుకు వస్తే పరిశోధన సాగించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. 20 రోజుల వరకు బిర్యానీ నిల్వ చేయగలిగేలా ప్యాక్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. ‘గతంలో ప్యాకింగ్ అంటే సులువుగా పట్టుకోగలగడం, తీయగలిగేలా ఉండడం. ఇప్పుడు ఉత్తమ ముడి పదార్థాలు, వినూత్న డిజైన్, భద్రత ప్రాధాన్యతగా మారిపోయాయి’ అని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి అన్నారు. సదస్సులో ఐఐపీ చైర్మన్ ఆర్వీఎస్ రామకృష్ణ, హైదరాబాద్ చైర్మన్ ఏవీపీఎస్ చక్రవర్తి తదితరులు మాట్లాడారు. -
పండుగల వేళ.. ఆఫర్లే ఆఫర్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ కంపెనీలు పండుగల సీజన్ అమ్మకాలకు సిద్ధమవుతున్నాయి. కస్టమర్లను ఊరించే ఆఫర్లతో ప్రచారం ప్రారంభించాయి. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, బహుమతులతో అమ్మకాలు పెంచుకునేందుకు హడా వుడి చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్ అమ్మకాల్లో 20-50 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నాయి. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల పరిశ్రమ తిరిగి పుంజుకుంటుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. ఒకదాని వెంట మరొకటి.. దసరా, దీపావళి సమీపిస్తుండడంతో కంపెనీలు ఒకదాని వెంట ఒకటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని రకాల రిఫ్రిజిరేటర్లపై ట్యాబ్లెట్ పీసీని బహుమతిగా శాంసంగ్ అందిస్తోంది. బ్రేవియా టీవీలు, ఆల్ఫా కెమెరాలపై ప్రమోషనల్ ఆఫర్లను సోనీ ప్రకటించింది. ఖచ్చితమైన బహుమతులూ అందిస్తోంది. ఎంపిక చేసిన హై ఎండ్ టీవీలపై రూ.1.5 లక్షల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌తోపాటు సౌండ్ బార్, డీవీడీ ప్లేయర్, కొన్ని స్మార్ట్ టీవీ మోడళ్లపై మేజిక్ మోషన్ రిమోట్‌ను ఎల్జీ ఉచితంగా ఇస్తోంది. మైక్రోవేవ్ ఓవెన్, బ్లూరే వంటి బహుమతులను ప్యానాసోనిక్ హామీగా ఇస్తోంది. కొన్ని టీవీ మోడళ్లపై సౌండ్‌బార్, స్పీకర్ సిస్టమ్స్ ఉచితమని సాన్సూయ్ ప్రకటించింది. ఇండక్షన్ కుక్టాప్తోపాటు ఖచ్చితమైన బహుమతులను కెల్వినేటర్ అందిస్తోంది. ఎంపిక చేసిన ఉపకరణాలపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ను రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. ప్రతి పీసీపైన రూ.8 వేల విలువగల బహుమతులను అందుకోండని డెల్ అంటోంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి నూతన వాషింగ్ మెషీన్ వేరియంట్‌ను వర్ల్‌పూల్ మార్కెట్లోకి తెస్తోంది. హై ఎండ్ మైక్రోవేవ్స్ కూడా రానున్నాయి. కొత్త కొత్త వేరియంట్లను ప్రవేశపెడుతున్నట్టు హాయర్ తెలిపింది. వీడియోకాన్ నూతన 4కే యూహెచ్డీ ఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించింది. ఇ-జోన్, ఆదీశ్వర్, టీఎంసీ, బజాజ్ ఎలక్ట్రానిక్స్, యెస్మార్ట్, క్రోమా తదితర మల్టీబ్రాండ్ రిటైల్ చైన్లు ఆకర్షణీయ బహుమతులతో కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి. గతేడాది కంటే.. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్ పుంజుకుం టున్న సంకేతాలు ఉన్నాయని హాయర్ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులు నమోదు చేయడం, మార్కెట్ సెంటిమెంటు తిరిగి నిలదొక్కుకోవడం ప్రస్తుతం కలిసి వచ్చే అంశమని అన్నారు. ఎంత కాదన్నా 25 శాతంపైగా వృద్ధి కనబరుస్తుందన్న అంచనాలతో పరిశ్రమ ఉత్సాహంగా ఉందని చెప్పారు. హాయర్ ఈ సీజన్లో 40-50 శాతం వృద్ధి ఆశిస్తోందని పేర్కొన్నారు. ఎల్ఈడీ ప్యానెళ్లకు మంచి గిరాకీ ఉంటుందని ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జీఎల్ మిర్చందానీ వెల్లడించారు. ఈ సీజన్లో ఒనిడా 30 శాతం వృద్ధి ఆశిస్తోందని చెప్పారు. కాగా, ప్రజల జీవన వ్యయం పెరగడం, ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, వడ్డీ రేట్లు కిందకు రాకపోవడం వంటి అంశాలు పరిశ్రమకు మింగుడు పడడం లేదు. పెద్ద పెద్ద లక్ష్యాలతో.. గతేడాది ఆగస్టు-నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో కంపెనీ అమ్మకాల విలువ 25 శాతం వృద్ధితో రూ.5,100 కోట్లు నమోదవుతుందని సోనీ అంచనా వేస్తోంది. మార్కెటింగ్ వ్యయాల కోసం కంపెనీ రూ.250 కోట్లను కేటాయించింది. సెంటిమెంటు బలంగా ఉన్న కారణంగా తమ అమ్మకాల్లో 35 శాతం వృద్ధి ఉండొచ్చని ఎల్జీ అంటోంది. కొత్త ప్రభుత్వం రాక, డాలరుతో పోలిస్తే రూపాయి బలంగా ఉండడంతో కస్టమర్లలో సానుకూల స్పందన కనపడుతోంది. ఈ అంశాలే అమ్మకాలకు జోష్‌నిస్తాయని ప్యానాసోనిక్ చెబుతోంది. 2013తో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం వృద్ధిని కంపెనీ అంచనా వేస్తోంది. 2009, 2010లో పరిశ్రమ 30-40 శాతం వృద్ధి చెందింది. ఆ స్థాయిలో ప్రస్తుత సంవత్సరంలో అమ్మకాలు నమోదు కాకపోవచ్చని వర్ల్‌పూల్ ఇండియా తెలిపింది. ఈ సీజన్లో తమ అమ్మకాల పరిమాణంలో 20 శాతం హెచ్చుదలను వర్ల్‌పూల్ ఆశిస్తోంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విపణి పరిమాణం రూ.40 వేల కోట్లుంది. -
మళ్లీ కోత
రెండు విడతల్లో అమలు జనాలకు తప్పని అవస్థలు నేటి నుంచి ఇళ్లకు గంటలు కట్ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ప్రజలకు విద్యుత్ కోతల నుంచి ఉపశమనం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. నెల రోజులు తిరక్కుండానే విద్యుత్ వినియోగదారుల కష్టాలు మొదటికి వచ్చాయి. నగరంలో మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఇటీవల వర్షాలు పడడంతో కొద్ది రోజుల పాటు నగరంలో విద్యుత్ కోతకు సెలవిచ్చిన సంగతి తెలిసిందే. మరి కొన్నాళ్ల పాటు ఇలాగే ఉంటుందని భావించిన నగర ప్రజలకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం 400-500 మెగవాట్ల లోటు నమోదవుతుండటంతో కోతలు అనివార్యమైనట్లు సదరన్ డిస్కం ప్రకటించింది. డిమాండ్, సరఫరాల మధ్య భారీ తేడా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. గురువారం నుంచి గ్రేటర్ పరిధిలోని 33/11కేవీ ఫీడర్ల వారీగా గృహాలకు ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు గంటల చొప్పున రోజుకు నాలుగు గంటల పాటు సరఫరా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, క్రమంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రోజురోజుకు గృహాల్లో ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం మరింత పెరుగుతుండటమే దీనికి కారణమని పేర్కొంది. అయితే ఈ కోతలు బుధవారం నుంచే అమలులోకి రావడం కొసమెరుపు. ఫీడర్ల వారీగా కోతల వేళలు ఇలా.... ఉదయం 6-8 గంటలు... మధ్యాహ్నం 12-2 గంటల మధ్య... జెమ్స్స్ట్రీట్, క్లాక్ టవర్, బన్సీలాల్‌పేట్, కిమ్స్, మోండా మార్కెట్, పాటిగడ్డ, మారేడ్‌పల్లి, జింఖానా, అడ్డగుట్ట, హైదర్‌గూడ, నెహ్రూ నగర్, సీతాఫల్మండి, చిలకల్గూడ, లాలాగూడ, ఐఐసీటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రాగాటూల్స్, హెచ్ఏఎల్, ప్రశాంతినగర్, ఐడీపీఎల్, బోయిన్పల్లి, చిన్నతోకట్ట, గన్‌రాక్, భూదేవినగర్, ఆర్పీనిలయం, హకీంపేట్, మచ్చబొల్లారం, హెచ్ఎంటీ, ఫీవర్ ఆస్పత్రి, విటల్‌వాడీ, అంబర్పేట్, దుర్గానగర్, నారాయణగూడ, బతుకమ్మకుంట, ఇండస్ట్రియల్ ఏరియా, విజయ్‌నగర్ కాలనీ, బాచుపల్లి, డీపీపల్లి, సూరారం, జీడిమెట్ల, మయూరీనగర్, వేమన కాలనీ, ఆనంద్‌బాగ్, నందనవనం, తుర్కయాంజాల్, చంపాపేట్, లెనిన్‌నగర్, వనస్థలిపురం, మామిడిపల్లి, మదీనాగూడ, మౌలాలి, వాజ్పేయినగర్, వినాయక్‌నగర్, మల్కాజ్గిరి, సైనిక్‌పురి, కుషాయిగూడ, చర్లపల్లి, సాకేత్, యాప్రాల్, సీఆర్పీఫ్. ఉదయం 8-10... మధ్యాహ్నం 2-4 గంటల మధ్య ఎర్రమంజిల్, ఇందిరాపార్క్, జవ హర్‌నగర్, హైదర్‌గూడ, లేక్‌వ్యూ, హుస్సేన్‌సాగర్, లుంబినీపార్క్, ఎగ్జిబిషన్, పబ్లిక్‌గార్డెన్స్, నిజాం కళాశాల, నిమ్స్, రోడ్ నెంబర్ 12, ఎల్వీప్రసాద్మార్గ్, రోడ్ నెంబర్ 22, రోడ్ నెంబర్ 2, జూబ్లీహిల్స్, మాదాపూర్, కల్యాణ్‌నగర్, యూసఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడ, అయ్యప్పసొసైటీ, శ్రీనగర్‌కాలనీ, ఫిలింనగర్, గుడిమల్కాపూర్, ఏసీ గార్డ్స్, అసిఫ్‌నగర్, గో ల్కొండ, లంగర్‌హౌస్, టొలిచౌకి, మోతీమహల్, నాంపల్లి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, ఐజేఎం, చందానగర్, పాపిరెడ్డికాలనీ, గచ్చిబౌలి, ట్రిపుల్ ఐటీ, నానక్‌రామ్‌గూడ, ఎల్ అండ్ టీ, సెజ్, కొత్తగూడ, కొత్తపేట, మోహన్‌నగర్, మారుతీనగర్, బండ్లగూడ, ఆటోనగర్, హయత్‌నగర్, రాజీవ్‌స్వగృహ, తట్టి అన్నారం, పెద్ద అంబర్పేట్, రంగారెడ్డి జిల్లా కోర్టు, అబ్దుల్లాపూర్‌మెట్, రామోజీ ఫిలింసిటీ, నాగోల్, కొత్తపేట పండ్లమార్కెట్, భగత్‌సింగ్‌నగర్, తాండూర్, వికారాబాద్. ఉదయం 10-12... సాయంత్రం 4-6 గంటల మధ్య: ఈఎన్టీ, ఘోషామహల్, కార్వాన్, ఉస్మానియా ఆస్పత్రి, సీతారాంబాగ్, సుల్తాన్‌బజార్, కోఠి ఉమెన్స్ కాలేజ్, సీఆర్పీఎఫ్, చందులాల్ బారాదరి, ఫలక్‌నూమా, కందికల్‌గేట్, కిలావత్, మీరాలం, పేట్లబురుజు, సాలార్జంగ్ మ్యూజియం, అత్తాపూర్, ఆస్మాన్‌ఘడ్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట్, కంచన్‌బాగ్, ముసారంబాగ్, సంతోష్‌నగర్, ఆల్విన్, బేగంపేట్, ఎయిర్పోర్ట్, స్ట్రీట్‌నెం బర్ 8 (హబ్సీగూడ), ఐడీఏ ఉప్పల్, రామంతాపూర్, నాచారం, మల్లాపూర్, ట్రక్‌పార్క్, మైత్రీ వనం, మోతీనగర్, సంజీవయ్యపారు ్క, ఈఎస్ఐ, గ్రీన్లాండ్స్, కొంపెల్లి సుభాష్‌నగర్, ఉప్పర్‌పల్లి, ఇబ్రహీంబాగ్, అప్పా, ఎపీఏ, ఎండీపల్లి, ఎన్ఐఆర్డీ, కాటేదాన్, సీబీ ఐటీ, గగన్‌పహడ్, గందంగూడ. వేసవిని తలపించేలా... సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతోంది. బుధవారం గరిష్టంగా 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 48 గంటల్లో ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా. రుతుపవనాల నిష్ర్కమణ సమయంలో ఆకాశం మేఘావృతం కాకపోవడం, ఆగ్నేయ దిశ నుంచి నగరం వైపు వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడం సర్వసాధారణమేనని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. అక్టోబరు మూడో వారం వరకు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి, సుమారు 39 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. వేసవి తాపాన్ని తలపిస్తున్నప్పటికీ వేసవితో పోలిస్తే ఈ ఉష్ణోగ్రతలు అత్యధికం కాదని విశ్లేషిస్తున్నారు.