Reliance Digital Electronic Sale: Offer On Phones Home Appliances And More - Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఎలక్ట్రానిక్స్‌ సేల్‌’.. కళ్లు చెదిరే ఆఫర్లు అప్పటివరకే!

Published Sat, Aug 13 2022 4:55 PM | Last Updated on Sat, Aug 13 2022 9:36 PM

Reliance Digital Electronic Sale: Offer On Phones Home Appliances And More - Sakshi

ముంబై: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఎలక్ట్రానిక్స్‌ సేల్‌ – డిజిటల్‌ ఇండియా సేల్‌’ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల విక్రయాల కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్టు 16వ తేదీ వరకు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, గృహోపకరణాలు, యాక్సెసరీల కొనుగోళ్లపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చని తెలిపింది. ప్రముఖ బ్యాంకుల కార్డులపై 10% డిస్కౌంట్‌ అందిస్తోంది. అలాగే 10% డిస్కౌంట్‌ వోచర్‌లను పొందవచ్చు. తదుపరి కొనుగోలుపై ఈ డిస్కౌంట్‌ను వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా రిలయన్స్‌ డిజిటల్, మై జియో స్టోర్లతో పాటు Reliancedigitalలో కూడా ఆఫర్ల విక్రయాలు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. 

అదిరిపోయే ఆఫర్లు
సేల్‌లో భాగంగా 65 ఇంచెస్‌ UHD ఆండ్రాయిడ్ టీవీలు ₹49,990 ప్రారంభ ధరకు అందుబాటులో ఉన్నాయి.  43 ఇంచెస్‌ టీవీ ధర ₹19,990 నుంచి ప్రారంభమవుతుంది. రిలయన్స్ డిజిటల్ సేల్‌లో, ఇంటెల్ కోర్ i3, 8GB RAM, 512 SSD స్టోరేజ్‌తో కూడిన HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ రూ. 43,999కే అందుబాటులో ఉంది.  రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 35 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. యాపిల్, సామ్‌సంగ్‌, మోటోరోలా, వన్‌ప్లస్‌, షావోమీ, రియల్‌మీ సహా మరిన్ని బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్‌లు ఆఫర్లతో లభిస్తున్నాయి. బ్లూటూత్ స్పీకర్లు, ఇయర్‌ఫోన్స్‌పై 70శాతం వరకు ఆఫర్లు ఇస్తున్నట్టు రిలయన్స్ డిజిటల్ పేర్కొంది. 

చదవండి: Ola Electric Car: ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఒక్క చార్జింగ్‌తో 500 పైగా కిలోమీటర్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement