
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దీపావళి డబుల్ ధమాకా' ఆఫర్‌ను రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఒక సంవత్సరం ఫ్రీ 'జియో ఎయిర్ ఫైబర్' సేవను ఆస్వాదించే అవకాశాన్ని పొందవచ్చు. ఇంతకీ ఈ అవకాశాన్ని ఎలా పొందాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఉచితంగా జియో ఎయిర్ ఫైబర్ పొందాలంటే?
ఫ్రీగా జియో ఎయిర్ ఫైబర్ సేవలను పొందాలంటే.. 2024 సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3వరకు ఏదైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో లేదా మైజియో స్టోర్‌లో రూ. 20000 లేదా అంతకంటే ఎక్కువ ధరకు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినవాళ్ళే ఉచిత జియో ఎయిర్ ఫైబర్ పొందటానికి అర్హులు.

ఈ ఆఫర్ కొత్త వాళ్ళకు మాత్రమే కాకుండా ఇప్పటికే జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉన్న కస్టమర్లు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు.
ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలు
అర్హత పొందిన కస్టమర్‌లు ప్రతి నెల నవంబర్ 24 నుంచి అక్టోబర్ 25 వరకు యాక్టివ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌కు సమానమైన 12 కూపన్‌లను పొందుతారు. ప్రతి కూపన్‌ను 30 రోజులలోపు సమీప రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లో రీడీమ్ చేసుకోవచ్చు. ఈ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ సంప్రదించండి.
Comments
Please login to add a commentAdd a comment