కొత్త సంవత్సరం 2025 వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికం కంపెనీ జియో (Jio)తన వినియోగదారుల కోసం ప్రత్యేక “న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్”ని (new recharge plan) ప్రారంభించింది. విస్తృతమైన కనెక్టివిటీ, ఖర్చు ఆదా, ప్రత్యేకమైన డీల్స్‌తో రూ. 2025 ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వినియోగదారులకు మెరుగైన మొబైల్ అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం.
రూ.2025 ప్లాన్ ప్రయోజనాలు
జియో రూ.2025 ప్లాన్‌తో సబ్‌స్క్రైబర్‌లు అపరిమిత 5జీ ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ పరిమితి 2.5 జీబీతో మొత్తం 500 జీబీ 4జీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఎస్‌ఎంఎస్ పంపవచ్చు. పెద్ద మొత్తంలో డేటా వినియోగించేవారికి, కమ్యూనికేషన్ కోసం ఫోన్‌లను విస్తృతంగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.
రూ.2150 విలువైన కూపన్‌లు
జియో భాగస్వామి బ్రాండ్‌ల నుండి అదనపు విలువను పొందడం ఈ ప్లాన్ ప్రత్యేకమైన ఫీచర్‌లలో ఒకటి. వినియోగదారులు ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్‌లను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అజియో (AJIO) నుండి కనీసం రూ. 2500 కొనుగోలుపై రూ. 500 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విగ్గీలో రూ. 499 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్‌లపై రూ. 150 తగ్గింపును పొందొచ్చు. ఇక ఈజ్‌మైట్రిప్‌లో (EaseMyTrip) విమాన బుకింగ్‌లపై రూ. 1500 ఆదా చేసుకోవచ్చు.
డిసెంబర్ 11న ప్రారంభమైన రూ. 2025 ప్లాన్ 2025 జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు కొత్త సంవత్సరాన్ని అదిరిపోయే సేవింగ్స్, ఆఫర్స్‌తో మొదలు పెట్టవచ్చు. హై-స్పీడ్ 5జీ, పుష్కలమైన డేటా, అపరిమిత కాల్స్, పార్ట్‌నర్ డిస్కౌంట్స్ వంటి ఫీచర్‌లతో జియో రూ. 2025 ప్లాన్ ఆధునిక వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment