New Year Events
-
2025లో ఐపీవోల వెల్లువ
ప్రైమరీ మార్కెట్ల జోరు ఈ కేలండర్ ఏడాది(2025)లోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ (Kotak Mahindra Capital) కంపెనీ అభిప్రాయపడింది. పలు దిగ్గజాలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు సన్నాహాలు చేపట్టడంతో 2025లో 35 బిలియన్ డాలర్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా వేసింది.2024లో 91 కంపెనీలు ఐపీవోల (IPO) ద్వారా రూ. 1.67 లక్షల కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది మరిన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం టాప్ ర్యాంకులో నిలవనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ పేర్కొంది.హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ తదితర దిగ్గజాలు ఉమ్మడిగా 9 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ బాటలో డిజిటల్ టెక్ కంపెనీలు ఈకామ్ ఎక్స్‌ప్రెస్, ఓలా, జెప్టో, పెప్పర్ఫ్రై తదితరాలు 5 బిలియన్ డాలర్లపై కన్నేసినట్లు తెలియజేసింది. ఇష్యూ పరిమాణం అప్ పలు కంపెనీలు ఐపీవోల ద్వారా పెట్టుబడుల సమీకరణపై దృష్టి పెట్టడంతో ఇష్యూ పరిమాణంసైతం పెరిగే వీలున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వివరించింది. ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల జోరు కారణంగా 2024లో లిస్టింగ్ రోజు సగటు ప్రీమియం 33 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది.గతేడాది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సెకండరీ మార్కెట్లకంటే పబ్లిక్ ఇష్యూలపట్లే అత్యంత మక్కువ చూపినట్లు పేర్కొంది. ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ చేపట్టిన రూ. 27,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ నేపథ్యంలో పలు ఎంఎన్‌సీలు సైతం దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌వైపు ఆకర్షితమవుతున్నట్లు వివరించింది. -
అమెరికాలో వరుస దాడులు
వాషింగ్టన్: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూ ఆర్లియన్స్‌లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అను మానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తుండడం గమనార్హం. జబ్బార్ ట్రక్కులో ఐసిస్ జెండా న్యూ ఆర్లియన్స్‌లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి వాహనంతో దూసుకొచ్చాడు. ఫోర్డ్ ఎఫ్–150 అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత రైఫిల్‌తో జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును పేల్చేసిన వ్యక్తి, జబ్బార్‌కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలటరీ స్థావరంలో పనిచేశారు. న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రవాద దాడిగానే దర్యాప్తు అధికారులు పరిగ ణిస్తున్నారు. ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబ్బార్ దాడి చేశాడని అంటున్నారు. ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్‌బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే యాప్ నుంచి.. న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును, లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును ‘టూరో యాప్’ నుంచే అద్దెకు తీసుకున్నారు. వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని అన్నారు. కారులో లోపం ఏమీ లేదని స్పష్టంచేశారు. టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, సదరు దుండగుడి పేరును ఇంకా బయటపెట్టలేదు. కానీ స్థానిక మీడియా కథనం ప్రకారం... మాథ్యూ లివెల్స్బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు. అందులో బాణాసంచా, మోర్టార్స్, గ్యాస్ క్యాన్లు అమర్చాడు. అనంతరం లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ ఎదుట పేల్చేశాడు.నైట్‌క్లబ్‌లో 30 రౌండ్ల కాల్పులు మూడో ఘటన విషయానికొస్తే న్యూ యార్క్‌లో క్వీన్స్ ప్రాంతంలోని నైట్‌క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండుగులు పరారయ్యారు. -
విశాఖ : సాగర తీరంలో కొత్త సంవత్సరం జోష్.. యువత సెల్ఫీలు (ఫొటోలు)
-
కొత్త సంవత్సరం...హుసేన్ సాగర్ వద్ద సందడే సందడి (ఫొటోలు)
-
కొంచెం క్రాక్
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘సరికొత్త జోనర్లో ‘జాక్– కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ఫన్ రైడర్‌లా అందర్నీ మెప్పించే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాక్గాడిగా కనిపించే జాక్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకులను మెప్పించటం ఖాయం. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి. -
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్‌లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
New Year 2025: ఇకపై పుట్టేవారంతా ‘బీటా బేబీస్’
కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. కొంగొత్త ఆశలను, ఆకాంక్షలను మోసుకొచ్చింది. అయితే ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారి తరాన్ని జనరేషన్ బీటాగా పిలువనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలను బీటా బేబీస్ అని పిలుస్తారు. బీటా జనరేషన్(Beta Generation) సాంకేతిక యుగంలో అత్యున్నతంగా ఎదగడమే కాకుండా, మునుపటి తరాలు ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటూ, నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనరేషన్ బీటా 2035 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 16 శాతం ఉంటుందని అంచనా. నూతన దృక్పథంతో భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ తరం, 22వ శతాబ్దపు ప్రారంభానికి సాక్ష్యంగా నిలుస్తారంటున్నారు. సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ), సామాజిక మార్పుల మధ్య బీటా తరం జీవితం గడుపుతుంది. ఈ తరం ప్రతి అంశంలో సాంకేతికత వినియోగించడమే కాకుండా, పర్యావరణ, సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది.బీటా జనరేషన్ ఆల్ఫా జనరేషన్ (2010-2024 మధ్య పుట్టినవారు)ను అనుసరిస్తుంది. దీనికి ముందు జెనరేషన్ జెడ్ (1996–2010), మిలీనియల్స్ (1981–1996) జనరేషన్లు ఉన్నాయి. జనరేషన్ బీటాను బీటా బేబీస్(Beta Babies) అని కూడా అంటారు. ఈ తరం సాంకేతిక యుగంలో పెరుగుతుంది. టెక్నాలజీ యుగం సామాజిక పరిశోధకుడు మార్క్ మెక్‌క్రిండిల్ తెలిపిన వివరాల ప్రకారం జనరేషన్ బీటా జీవితాలు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ముందుకు సాగుతాయి. విద్య, ఆరోగ్యం, వినోదం, కార్యాలయ కార్యకలాపాల్లో వీరు ఏఐని విరివిగా వినియోగిస్తారు.ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది? -
New Year 2025: ప్రారంభంలోనే ‘పరీక్షా కాలం’
నేటి (2025, జనవరి ఒకటి)నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరి నెల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు పరీక్షా కాలంగా నిలిచింది. దీంతో వారు కాస్త ఆందోళనలో ఉన్నారు. ఈ పరీక్షలు జనవరి మొదటి వారం నుంచే ప్రారంభంకానున్నాయి. యూజీసీ నెట్ మొదలుకొని జేఈఈ మెయిన్ వరకూ పలు పరీక్షలు ఈ మాసంలోనే జరగనున్నాయి. సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలుఈ సంవత్సరం ప్రారంభంలోనే సీబీఎస్ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సీబీఎస్ఈ బోర్డు రెగ్యులర్ సెషన్ పాఠశాలలకు 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి 14 మధ్య జరగనున్నాయి.యూజీసీ నెట్ పరీక్షనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డిసెంబర్ 2024 సెషన్ కోసం యూజీసీ నెట్ పరీక్షను 2025, జనవరి 3, నుండి జనవరి 16 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష 85 సబ్జెక్టులలో కొనసాగుతుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలుయూపీ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 23 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష జనవరి 23 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు రెండు దశల్లో నిర్వహించనున్నారు.ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-2 పరీక్షస్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్)టైర్-2 పరీక్షను 2025, జనవరి 18, 19,20 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా గ్రూప్ బీ, సీ మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2కు హాజరుకాగలుగుతారు. మరింత సమాచారం కోసం ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.యూకేసీఎస్‌సీ ఎస్ఐ పరీక్షఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్-ఇన్స్పెక్టర్ (యూకేసీఎస్‌సీ ఎస్ఐ) పోస్టుల రిక్రూట్మెంట్ పరీక్ష తేదీని ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ పరీక్ష 2025, జనవరి 12న నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష ఉండనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను 2025, జనవరి 2 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 222 ఖాళీలను భర్తీ చేయనున్నారు.యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ఇంటర్వ్యూయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జనవరి 7 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలు, ఇతర వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించవచ్చు.జేఈఈ మెయిన్స్ పరీక్షఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి సెషన్ 2025, జనవరి 22 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది. అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు జారీ చేస్తారు. అయితే పరీక్ష జరిగే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాల కోసం nta.ac.in ని సందర్శించవచ్చు. ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది? -
కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన తారలు (ఫోటోలు)
-
అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది?
చూస్తుండగానే 2024 వెళ్లిపోయింది. 2025లోకి మనం ప్రవేశించాం. జనవరి ఒకటి సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటోంది. ఇదేవిధంగా నాటి 1978 నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచమంతా ఉత్సవవాతావరణంలో మునిగి తేలులోంది. ఇంతలో పిడుగులాంటి వార్త వినిపించింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముంబైకి మూడు కిలోమీటర్ల దూరంలో1978, జనవరి ఒకటిన ముంబైకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటుచేసుకుంది. దుబాయ్‌కి బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే నిప్పులను ఎగజిమ్మింది. విమానంలోని పరికరాలు లోపభూయిష్టంగా ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ విమాన ప్రమాదం అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు మృతిచెందారు.అంతా అనుభవజ్ఞులే..1978, జనవరి ఒకటిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855(Air India Flight 855) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అప్పట్లో ఈ విమానాశ్రయాన్ని శాంటా క్రజ్ విమానాశ్రయంగా పిలిచేవారు. తరువాత దాని పేరు సహర్ విమానాశ్రయంగా మార్చారు. ఈ విమానాన్ని 51 ఏళ్ల కెప్టెన్ మదన్ లాల్ కుకర్ నడిపారు. ఆయన 1956లో ఎయిర్ ఇండియాలో చేరారు. పైగా అతనికి 18,000 గంటల విమానయాన అనుభవం ఉంది. ఫ్లైట్ ఇంజనీర్ అల్ఫ్రెడో ఫారియా(53) 955లో ఎయిర్ ఇండియాలో చేరారు. అతనికి 11,000 గంటల అనుభవం ఉంది. అలాగే వింగ్ కమాండర్ ఇందు వీరమణి(42) భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నుండి పదవీ విరమణ పొందారు. అతనికి 11,000 గంటల విమానయాన అనుభవం ఉంది. అనుభవజ్ఞులైన వీరంతా అదే విమానంలో ఉన్నారు.ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేక..ఈ విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, విమానం అకస్మాత్తుగా ఎడమవైపుకు తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత విమానం ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేకపోయింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుండి అందిన డేటా ప్రకారం చూసుకుంటే విమానం ఎత్తును తెలిపే సూచిక పాడైపోయింది. దీంతో కెప్టెన్ ఎత్తును అంచనా వేయలేకపోయారు. చీకటిగా ఉండటానికి తోడు, కింద అరేబియా సముద్రం ఉండడంతో విమనం నడుపుతున్న సిబ్బందికి విమానం ఎత్తు, స్థానం గురించి సమాచారం లభించలేదు.ఇన్పుట్లు సక్రమంగా లేకపోవడంతో..విమానాన్ని రోలింగ్ చేసి నిఠారుగా చేసేందుకు కెప్టెన్ ప్రయత్నించగా, ఇంతలోనే అది సముద్రంలో కూలిపోయింది. విమానం 35 డిగ్రీల కోణంలో అరేబియా సముద్రాన్ని తాకింది. విమానంలోని 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. విమాన శిథిలాలను పరిశీలించగా అధికారులకు అక్కడ ఎలాంటి పేలుడు లేదా అగ్ని ప్రమాదం లేదా ఎలక్ట్రానిక్ వైఫల్యం(Electronic failure) గురించిన సమచారం లభించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన దరిమిలా.. పైలట్‌కు అందిన ఇన్పుట్లు సక్రమంగా లేవు. ఫలితంగా అతను విమానం ఎత్తును గుర్తించలేకపోయాడు. ఈ నేపధ్యంలోనే ప్రమాదం జరిగిందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు -
New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు
‘ట్రింగ్.. ట్రింగ్ ’ అని బెల్ మోగిస్తూ ఒక పోస్ట్‌మ్యాన్ ఆ కుగ్రామంలోనికి సైకిల్ మీద వచ్చాడు. ఒక ఇంటి ముందు ఆగిన ఆయన.. ‘కమలా.. పట్నం నుంచి నీ భర్త మనీ ఆర్డర్ పంపించాడు’ అని పెద్దగా చెప్పాడు. వెంటనే ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి.. ‘సారూ మా ఆయన ఎంత పంపించాడు?’ అని అడిగింది. దీనికి ఆయన 250 రూపాయలు అని చెబుతూ, ఆ మెత్తాన్ని ఆమె చేతిలో పెట్టి, తన దగ్గరున్న రిజిస్ట్రర్‌లో ఆమె చేత వేలిముద్ర వేయించుకున్నాడు’ఇది ఒకప్పటి కథ. నాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది. పాత సినిమాల్లోనూ ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. నాడు పట్టణంలో ఉద్యోగం చేసే భర్త ప్రతినెలా పంపే డబ్బు కోసం భార్య ఎదురు చూసేది. ‘మనీ ఆర్టర్’ తీసుకుని పోస్ట్‌మ్యాన్ ఎప్పడు వస్తాడా అని మహిళలు ఇళ్ల ముందు కాపలా కాసేవారు.నేటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చిచేరింది. డబ్బుతో లావాదేవీలు చేసేందుకు ఈ-బ్యాంకింగ్‌తో పాటు, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే మొదలైన యాప్‌లు మన మొబైల్లో అందుబాటులో ఉంటున్నాయి. నేడు మనం ఈ యాప్‌ల సాయంతో ప్రపంచంలోని ఏ మూలకైనా ఇన్‌స్టంట్‌గా డబ్బును పంపవచ్చు. అయితే మునుపటి కాలంలో డబ్బును పంపేందుకు మనీఆర్డర్ ఆధారంగా ఉండేది.ఉత్తరాల బట్వాడా కోసం భారత ప్రభుత్వం 1854లో పోస్టల్ శాఖను నెలకొల్పింది. ఇది జరిగిన 25 ఏళ్ల తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ 1880, జనవరి ఒకటిన మనీ ఆర్డర్(Money order) సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఎవరైనా సరే తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు జమ చేసి, వారు పంపించాలనుకుంటున్న చోటుకు నగదును పంపించవచ్చు. ఆ నగదు చేరాల్సిన పోస్టాఫీసు రాగానే, అక్కడి పోస్ట్‌మ్యాన్స్ సంబంధిత చిరునామాకు ఆ మొత్తాన్ని అందజేసేవాడు. నాటి కాలంలో పోస్టల్‌శాఖలో ఇదొక విప్లవం అని చెబుతుంటారు.మనీ ఆర్డర్ ద్వారా ఉత్తరాల మాదిరిగానే డబ్బును కూడా పంపగలగడం నాటి ప్రజలకు ఎంతో సౌకర్యంగా అనిపించింది. ఉపాధి కోసం నగరాల్లో ఉన్నవారికి.. గ్రామాల్లో ఉంటున్న వారి సంబంధీకులకు ఇదొక వారధిలా మారింది. అంతకుముందు వరకూ ఇతరులకు డబ్బు పంపడం అనేది పెద్ద సమస్యగా ఉండేది. అయితే మనీ ఆర్డర్ రాకతో ఈ సమస్యకు చెక్ పడింది. తొలినాళ్లలో పెళ్లి వేడుకలకు వెళ్లే అవకాశం లేనివారు నూతన దంపతులకు కానుకల రూపంలో మనీ ఆర్డర్ ద్వారా డబ్బును పంపేవారట.పోస్టల్‌శాఖ(Postal Department)లో మనీ ఆర్డర్ సేవ దశాబ్దాల కాలం పాటు సాగింది. ప్రజల నుంచి ఎంతో ఆదరణను కూడా పొందింది. అయితే కాలానుగుణంగా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఇన్స్టంట్ పేమెంట్ యాప్‌లు రావడంతో మనీ ఆర్డర్‌కు ప్రాధాన్యత తగ్గింది. ఈ పరిణామాల దరిమిలా 2015లో ఇండియన్ పోస్ట్ మనీ ఆర్డర్ సేవలను నిలిపివేసింది. అయితే ఆ తరువాత పోస్టల్ శాఖ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ (ఈఎంఓ), ఇన్స్టంట్ మనీ ఆర్డర్ (ఐఎంఓ)సేవలను ప్రారంభించింది. త్వరిత గతిన డబ్బును అందించేందుకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టంట్ మనీ ఆర్డర్ సర్వీస్ కింద రూ.1,000 నుండి రూ.50,000 వరకు నగదు బదిలీ చేసే సదుపాయం ఉంది. ఐఎంవో సదుపాయం కలిగిన ఏదైనా పోస్టాఫీసు నుండి, ఒక గుర్తింపు రుజువుతో పాటుగా ఇ-ఫారమ్‌ను పూరించి, ఇంటర్నెట్ ఆధారిత తక్షణ సేవ ద్వారా డబ్బును పంపవచ్చు. ఈ విధంగా నిర్దిష్ట పోస్టాఫీసుల నుండి మాత్రమే డబ్బును పంపేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్లినప్పటికీ, గతానికి సంబంధించిన అనేక విషయాలు మన మదిలో జ్ఞాపకాలుగా తారాడుతుంటాయి. మన ఇంట్లోని పెద్దలను అడిగితే, మనీ ఆర్డర్‌కు సంబంధించి వారికున్న అనుభవాలను చెబుతారు. ఇది కూడా చదవండి: ‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో.. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫోటోలు)
-
హైదరాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..శ్రీలీల,దక్ష నాగర్కర్ డ్యాన్స్ అదుర్స్ (ఫోటోలు)
-
నయా సాల్.. నయా జోష్. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు
-
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా వేడుకలు జరిగాయి. ప్రజలందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. టపాసుల మోతలతో గ్రాండ్‌గా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు.హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, విజయవాడ, విశాఖపట్నంలో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. యువత రోడ్ల మీదకు వచ్చి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలికారు. #WATCH | Vijayawada, Andhra Pradesh | People celebrate and welcome the New Year 2025. pic.twitter.com/BLOuKmIBM6— ANI (@ANI) December 31, 2024 #WATCH | Hyderabad | People celebrate as they welcome the New Year 2025. (Visuals from Tank Band, Hussain Sagar) pic.twitter.com/k7DSh0rWYh— ANI (@ANI) December 31, 2024#WATCH |Andhra Pradesh | People celebrate as they welcome the New Year 2025 in Vijayawada. pic.twitter.com/1z9q7kCIMF— ANI (@ANI) December 31, 2024అలాగే, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, యూపీ, తమిళనాడ, కేరళలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి.#WATCH | Maharashtra | People celebrate as they welcome the New Year 2025 in Mumbai. (Visuals from Bandra) pic.twitter.com/3Qsd5bEAY5— ANI (@ANI) January 1, 2025 #WATCH | Goa | People celebrate and witness fireworks as they welcome the New Year 2025.(Visuals from Baga Beach) pic.twitter.com/oI2nIv51wX— ANI (@ANI) December 31, 2024 #WATCH | Virudhunagar, Tamil Nadu | People gather to celebrate and witness the fireworks as they welcome the New Year 2025. pic.twitter.com/hi3LReXf19— ANI (@ANI) December 31, 2024న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. జపాన్‌లోని నాగసాకిలో ప్రపంచంలోనే అతి పెద్ద బాణాసంచాలను కాల్చారు. డ్రోన్ల సాయంతో వినూత్న ప్రదర్శనలు ఇచ్చారు. ఇక, దుబాయ్‌లో కూడా న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి.New Year, Dubai pic.twitter.com/TUEiIbxQny— Figen (@TheFigen_) December 31, 2024 When drones and fireworks meetpic.twitter.com/dZpnPCn1A3— Massimo (@Rainmaker1973) December 31, 2024 The world's largest firework launched over Nagasaki, Japan. pic.twitter.com/V7mP14aSYx— Pookie (@PookiesParadise) December 31, 2024అమెరికాలో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. Welcome 2025! pic.twitter.com/EkFw5O2PsS— Times Square (@TimesSquareNYC) January 1, 2025 -
జూబ్లీహిల్స్ క్లబ్లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఆలయాల్లో నూతన సంవత్సర సందడి
ప్రపంచ వ్యాప్తంగా 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జనమంతా ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి ఉన్నప్పటికీ జనం అత్యంత ఉత్సాహంగా న్యూ ఇయర్ జోష్‌లో మునిగిపోయారు.నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని హోటళ్లు, రెస్టారెంట్లు సందడిగా మారాయి. గడియారంలో 12 గంటలు చూపగానే జనమంతా పెద్ద ఎత్తున హ్యాపీ న్యూ ఇయర్(Happy New Year) అంటూ ఒకరికొకరు విష్ చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అటు జమ్ముకశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు జనమంతా నూతన సంవత్సర వేడుకల్లో తేలియాడుతున్నారు. ఇదే సమయంలో చాలామంది నూతనసంవత్సరం వేళ ఆలయాలను సందర్శిస్తూ భగవంతుని ఆశీర్వాదాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు అన్ని ఆలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. #WATCH | Maharashtra | People gather to witness the fireworks and celebrate as they welcome the New Year 2025.(Visuals from Marine Drive) pic.twitter.com/7tJizmhp8D— ANI (@ANI) December 31, 2024మహారాష్ట్రలోనూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముంబయిలోని మెరైన్‌డ్రైవ్(Marine Drive)లో బాణాసంచా కాల్చేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు పర్యాటకలు ఎంజాయ్ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా చేరుకున్నారు. ఒకరినొకరు విష్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.#WATCH | Himachal Pradesh | People gather to celebrate as they welcome the New Year 2025 in Shimla. pic.twitter.com/YXUhDGx8hI— ANI (@ANI) December 31, 2024కేరళలోని తిరువనంతపురంలో ప్రజలు బాణసంచా వెలిగించి నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.గోవాలోని పనాజీలో జనం కేక్‌లు కట్ చేస్తూ 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సమయంలో చాలామంది ఉత్సాహంగా నృత్యం చేశారు.#WATCH | Fireworks in Kerala's Thiruvananthapuram as people celebrate to welcome the New Year 2025. pic.twitter.com/18ZAbzCGh4— ANI (@ANI) December 31, 2024కొత్త సంవత్సరం సందర్భంగా అమృత్సర్(Amritsar)లోని స్వర్ణ దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు.షిర్డీలోని సాయిబాబా దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాబా దర్శనం కోసం బారులు తీరారు.ఇది కూడా చదవండి: New Year 2025: షిర్డీలో సంబరం.. రాత్రంతా దర్శనం#WATCH | Goa | People dance and cut cake as they celebrate and welcome the New Year 2025 in Panaji. pic.twitter.com/BRd67rFqSP— ANI (@ANI) December 31, 2024 #WATCH | Punjab | People visit the Golden Temple in Amritsar to celebrate as they welcome the New Year 2025. pic.twitter.com/yxmHzFzeC6— ANI (@ANI) December 31, 2024#WATCH | Maharashtra | Devotees visit Shirdi Temple as they welcome the New Year 2025. pic.twitter.com/MvWXZXz6rb— ANI (@ANI) December 31, 2024 -
‘సై’ అంటే ‘సై’... మెగా ఈవెంట్స్‌తో కొత్త ఏడాదికి స్వాగతం
మైదానంలో బరిలోకి దిగే ఆటగాళ్లకి ప్రతి రోజూ కొత్త అవకాశమే... అప్పటి వరకు అద్భుతాలు చేసినా, వైఫల్యాలతో అట్టడుగున నిలిచినా మళ్లీ పైకి లేచేందుకు సిద్ధం కావడమే... ఇక కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త టోర్నీలు, సరికొత్త తరహా ఆటతో అత్యుత్తమ ప్రదర్శనకు ‘సై’ అనడమే... ముగిసిన సంవత్సరంలో త్రుటిలో విజయాలు చేజార్చుకున్న క్షణాలు, అనూహ్యంగా ఎదురైన అపజయాలను మరచిపోయేలా అక్కడే, అదే వేదికపై తప్పులు దిద్దుకొని సత్తా చాటేందుకు కొత్త ఏడాది ఇస్తున్న మరో చాన్స్ అనుకొని చెలరేగిపోవడమే... మరోవైపు అభిమానులకు ఏడాదంతా ఆటలతో పండగనే... క్రీడాంశం ఏదైనా, టోర్నీ పేరు ఏదైనా మైదానంలోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడి నుంచైనా తాము ఆశించిన వినోదం కోసం వారు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే పోటీలైనా... ప్రతీ ఏటా పలకరించే వార్షిక టోర్నీలైనా... ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ ‘జై’ కొట్టేందుకు సిద్ధమైపోతారు... అందుకే క్యాలెండర్లో సంవత్సరం మారగానే కొత్త ఏడాదిలో వచ్చే ఈవెంట్లపై అందరికీ ఎప్పటిలాగే ఆసక్తి ఉంటుంది.2025 అలాంటి కొన్ని ఉత్సాహవంతమైన క్రీడా పోటీలతో సిద్ధమైంది. క్రికెట్ అభిమానుల కోసం వన్డే వరల్డ్‌కప్‌కు సమఉజ్జీలాంటి చాంపియన్స్ ట్రోఫీ ఏడాది ఆరంభంలోనే కనువిందు చేయనుంది. ఈ టోర్నీకి ముందు మలేసియా వేదికగా అండర్–19 మహిళల వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. ఆ తర్వాత మహిళల క్రికెట్లో వన్డే వరల్డ్‌కప్‌నకు మన దేశమే ఆతిథ్యం ఇవ్వనుంది. ఆటగాళ్లు అటు ఇటు మారడం మినహా ఎప్పటిలాగే ఐపీఎల్ వేసవిలో అలరించనుంది. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లు, బ్యాడ్మింటన్‌లో బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలు ఏడాదంతా కొత్త చాంపియన్ల కోసం తివాచీ పరచడం ఖాయం కాగా... భారత్ వేదికగానే జూనియర్ హాకీ వరల్డ్ కప్ యువ ఆటగాళ్లను పరిచయం చేయనుంది. షూటింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్వంటి క్రీడాంశాల్లో విశ్వ వేదికలపై మన ఆటగాళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాదిలో అసాధారణ ప్రదర్శనలతో అలరించిన మన చదరంగం కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని ఎత్తులు పై ఎత్తులతో కొత్త ఎత్తులకు చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో జరిగే ప్రధాన ఈవెంట్లతో కూడిన క్రీడా క్యాలెండర్ మీ కోసం... –సాక్షి క్రీడా విభాగంక్రికెట్ జనవరి 3–7: ఆ్రస్టేలియాతో ఐదో టెస్టు (సిడ్నీ) భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన జనవరి 22: తొలి టి20 (చెన్నై) జనవరి 25: రెండో టి20 (కోల్‌కతా) జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్) జనవరి 31: నాలుగో టి20 (పుణే) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబై) ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్) చాంపియన్స్ ట్రోఫీ (దుబాయ్) ఫిబ్రవరి 20: భారత్ X బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23: భారత్ Xపాకిస్తాన్ మార్చి 2: భారత్ X న్యూజిలాండ్ మార్చి 4: సెమీఫైనల్ (అర్హత సాధిస్తే) మార్చి 9: ఫైనల్ (అర్హత సాధిస్తే) ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన జూన్ 20–24: తొలి టెస్టు (హెడింగ్లే) జూలై 2–6: రెండో టెస్టు (ఎడ్జ్‌బాస్టన్) జూలై 10–14: మూడో టెస్టు (లార్డ్స్) జూలై 23–27: నాలుగో టెస్టు (మాంచెస్టర్) జూలై 31–ఆగస్టు 4: (ఓవల్) బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన ఆగస్టు: 3 వన్డేలు, 3 టి20లు భారత్‌లో వెస్టిండీస్ పర్యటన అక్టోబర్: 2 టెస్టులు ఆ్రస్టేలియాలో భారత్ పర్యటన నవంబర్: 3 వన్డేలు, 5 టి20లు భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన నవంబర్–డిసెంబర్: 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఇంగ్లండ్‌లో భారత మహిళల జట్టు పర్యటన జూన్–జూలైలో ఐదు టి20లు, మూడు వన్డేలుమహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు వేదిక: మలేసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు వేదిక: పాకిస్తాన్, దుబాయ్ ఐపీఎల్ టోర్నీ మార్చి 14 నుంచి మే 25 వరకు మహిళల వన్డే వరల్డ్ కప్ ఆగస్టు–సెప్టెంబర్ వేదిక: భారత్ బ్యాడ్మింటన్ జనవరి 7–12: మలేసియా ఓపెన్–1000 టోర్నీ (కౌలాలంపూర్) జనవరి 14–19: ఇండియా ఓపెన్–750 టోర్నీ (న్యూఢిల్లీ) ఫిబ్రవరి 11–16: ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (కింగ్డావో, చైనా) మార్చి 11–16: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్ (బరి్మంగ్‌హమ్) ఏప్రిల్ 8–13: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (నింగ్బో, చైనా) ఏప్రిల్ 27–మే 4: సుదిర్మన్ కప్ (జియామెన్, చైనా) మే 27–జూన్ 1: సింగపూర్ ఓపెన్–750 టోర్నీ (సింగపూర్ సిటీ) జూన్ 3–8: ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీ (జకార్తా) జూలై 15–20: జపాన్ ఓపెన్–750 టోర్నీ (టోక్యో) జూలై 22–27: చైనా ఓపెన్–1000 టోర్నీ (చాంగ్జౌ) ఆగస్టు 25–31: ప్రపంచ చాంపియన్‌షిప్ (పారిస్) సెప్టెంబర్ 16–21: చైనా మాస్టర్స్–750 టోర్నీ (షెన్జెన్) అక్టోబర్ 6–19: ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్ (గువాహటి, భారత్) అక్టోబర్ 14–19: డెన్మార్క్ ఓపెన్–750 టోర్నీ (ఒడెన్స్) అక్టోబర్ 21–26: ఫ్రెంచ్ ఓపెన్–750 టోర్నీ (పారిస్) డిసెంబర్ 10–14: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (హాంగ్జౌ, చైనా)ఫార్ములావన్మార్చి 16: ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రి (మెల్బోర్న్) మార్చి 23: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) ఏప్రిల్ 6: జపాన్ గ్రాండ్‌ప్రి (సుజుకా) ఏప్రిల్ 13: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి (సాఖిర్) ఏప్రిల్ 20: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి (జిద్దా) మే 4: అమెరికా గ్రాండ్‌ప్రి (మయామి) మే 18: ఇటలీ గ్రాండ్‌ప్రి (ఇమోలా) మే 25: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) జూన్ 1: స్పెయిన్ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) జూన్ 15: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్) జూన్ 29: ఆ్రస్టియా గ్రాండ్‌ప్రి (స్పీల్బర్గ్) జూలై 6: బ్రిటన్ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్) జూలై 27: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్పా ఫ్రాంకోర్చాంప్స్) ఆగస్టు 3: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్) ఆగస్టు 31: డచ్ గ్రాండ్‌ప్రి (జాండ్‌వూర్ట్) సెప్టెంబర్ 7: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) సెప్టెంబర్ 21: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి (బాకు) అక్టోబర్ 5: సింగపూర్ గ్రాండ్‌ప్రి (సింగపూర్ సిటీ) అక్టోబర్ 19: యూఎస్ఏ గ్రాండ్‌ప్రి (ఆస్టిన్) అక్టోబర్ 26: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) నవంబర్ 9: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి (సావోపాలో) నవంబర్ 22: లాస్‌వేగస్ గ్రాండ్‌ప్రి (అమెరికా) నవంబర్ 30: ఖతర్ గ్రాండ్‌ప్రి (దోహా) డిసెంబర్ 7: అబుదాబి గ్రాండ్‌ప్రి (యూఏఈ)టెన్నిస్ జనవరి 12–26: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (మెల్బోర్న్) మే 25–జూన్ 8: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (పారిస్) జూన్ 30–జూలై 13: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (లండన్) ఆగస్టు 25–సెప్టెంబర్ 7: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (న్యూయార్క్). మార్చి 5–16: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (కాలిఫోర్నియా) మార్చి 19–30: మయామి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఫ్లోరిడా) ఏప్రిల్ 5–13: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (మొనాకో) ఏప్రిల్ 22–మే 4: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (స్పెయిన్) మే 6–18: రోమ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఇటలీ) జూలై: టొరంటో ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (కెనడా) ఆగస్టు: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఒహాయో) అక్టోబర్ 1–13: షాంఘై ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (చైనా) అక్టోబర్ 25–నవంబర్ 2: పారిస్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఫ్రాన్స్) నవంబర్ 9–16: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ (ఇటలీ) నవంబర్ 18–23: డేవిస్‌కప్ ఫైనల్స్ టోర్నీ (ఇటలీ) ఆర్చరీఫిబ్రవరి 16–23: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ (బ్యాంకాక్) ఏప్రిల్ 8–13: వరల్డ్ కప్ స్టేజ్–1 టోర్నీ (ఫ్లోరిడా, అమెరికా) మే 6–11: వరల్డ్ కప్ స్టేజ్–2 టోర్నీ (షాంఘై, చైనా) జూన్ 3–8: వరల్డ్ కప్ స్టేజ్–3 టోర్నీ (అంటాల్యా, టర్కీ) జూలై 8–13: వరల్డ్ కప్ స్టేజ్–4 టోర్నీ (మాడ్రిడ్, స్పెయిన్) ఆగస్టు 17–24: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (విన్నీపెగ్, కెనడా) సెప్టెంబర్ 5–12: వరల్డ్ చాంపియన్‌షిప్ (గ్వాంగ్జు, దక్షిణ కొరియా)రెజ్లింగ్ మార్చి 25–30: ఆసియా చాంపియన్‌షిప్ (అమ్మాన్, జోర్డాన్) జూన్ 14–23: ఆసియా అండర్–17, అండర్–23 చాంపియన్‌షిప్ (వియత్నాం) జూలై 5–13: ఆసియా అండర్–15, అండర్–20 చాంపియన్‌షిప్ (కిర్గిస్తాన్) జూలై 28–ఆగస్టు 3: వరల్డ్ అండర్–17 చాంపియన్‌షిప్ (ఏథెన్స్, గ్రీస్) ఆగస్టు 18–24: వరల్డ్ అండర్–20 చాంపియన్‌షిప్ (సోఫియా, బల్గేరియా) సెప్టెంబర్ 13–21: ప్రపంచ చాంపియన్‌షిప్ (జాగ్రెబ్, క్రొయేషియా) అక్టోబర్ 20–26: ప్రపంచ అండర్–23 చాంపియన్‌షిప్ (నోవిసాద్, సెర్బియా)టేబుల్ టెన్నిస్జనవరి 30–ఫిబ్రవరి 9: సింగపూర్ స్మాష్ టోర్నీ మార్చి 11–16: చాంపియన్స్ టోర్నీ (చైనా) ఏప్రిల్ 1–6: చాంపియన్స్ టోర్నీ (కొరియా) ఏప్రిల్ 14–20: పురుషుల, మహిళల వరల్డ్ కప్ (మకావు) జూన్ 26–జూలై 2: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (తాషె్కంట్) జూలై 3–13: యూఎస్ఏ స్మాష్ టోర్నీ ఆగస్టు 7–11: చాంపియన్స్ టోర్నీ (జపాన్) ఆగస్టు 14–24: గ్రాండ్స్మాష్ టోర్నీ సెప్టెంబర్ 9–14: చాంపియన్స్ టోర్నీ (మకావు) సెప్టెంబర్ 25–అక్టోబర్ 5: చైనా స్మాష్ టోర్నీ అక్టోబర్ 11–15: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ (భారత్) అక్టోబర్ 28–నవంబర్ 2: చాంపియన్స్ టోర్నీ (ఫ్రాన్స్) నవంబర్ 23–30: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (రొమేనియా) షూటింగ్ఫిబ్రవరి 9–22: ఆసియా రైఫిల్, పిస్టల్ కప్ (బ్యాంకాక్) ఏప్రిల్ 1–11: వరల్డ్ కప్–1 రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (బ్యూనస్ ఎయిర్స్) ఏప్రిల్ 13–22: వరల్డ్ కప్–2 రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (లిమా) మే 3–12: వరల్డ్‌కప్ షాట్‌గన్ టోర్నీ (సైప్రస్) జూన్ 1–12: ఆసియాకప్ షాట్‌గన్ టోర్నీ (చైనా) జూన్ 8–15: వరల్డ్‌కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (జర్మనీ) జూలై 4–14: వరల్డ్‌కప్ షాట్‌గన్ టోర్నీ (ఇటలీ) ఆగస్టు 16–30: ఆసియా చాంపియన్‌షిప్ (కజకిస్తాన్) సెప్టెంబర్ 13–21: వరల్డ్‌కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (చైనా) అక్టోబర్ 8–19: ప్రపంచ చాంపియన్‌షిప్ షాట్‌గన్ టోర్నీ (గ్రీస్) నవంబర్ 6–16: వరల్డ్ చాంపియన్‌షిప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (ఈజిప్‌్ట) హాకీ డిసెంబర్ 28–ఫిబ్రవరి 1: పురుషుల హాకీ ఇండియా లీగ్ (భారత్) జనవరి 12–26: మహిళల హాకీ ఇండియా లీగ్ (భారత్) ఫిబ్రవరి 15–జూన్ 29: ప్రొ హాకీ లీగ్ (మహిళలు) ఫిబ్రవరి 15–జూన్ 22: ప్రొ హాకీ లీగ్ (పురుషులు) డిసెంబర్: జూనియర్ పురుషుల వరల్డ్‌కప్ (భారత్)చెస్ ఫిబ్రవరి 17–28: మహిళల గ్రాండ్‌ప్రి మూడో సిరీస్ (మొనాకో) ఫిబ్రవరి 23–మార్చి 8: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ (మోంటెనిగ్రో) మార్చి 14–25: మహిళల గ్రాండ్‌ప్రి నాలుగో సిరీస్ (సైప్రస్) ఏప్రిల్ 13–24: మహిళల గ్రాండ్‌ప్రి ఐదో సిరీస్ (భారత్) మే 6–17: మహిళల గ్రాండ్‌ప్రి ఆరో సిరీస్ (ఆ్రస్టియా) జూలై 5–29: మహిళల వరల్డ్‌కప్ టోర్నీ (జార్జియా) అథ్లెటిక్స్ సెప్టెంబర్ 13–21: ప్రపంచ చాంపియన్‌షిప్ (జపాన్)బాక్సింగ్ మార్చి 6–18: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ (బెల్గ్రేడ్) మే–జూన్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ -
న్యూ ఇయర్ ట్రెండ్..ఈ రాత్రికి '12 గ్రేప్స్' ట్రై చేసి చూస్తారా..!
ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాలకు సిద్ధమవుతోంది. కొన్ని దేశాలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేశాయి కూడా. అయితే న్యూ ఇయర్ రాగానే మొదటగా ఈ పని చేయాలి, ఇలా ఉండాలంటూ రిజల్యూషన్స్ పనిలో పడ్డారు కొందరు. నెట్టింట కూడా ఈ చర్చే. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం 12 ద్రాక్ష పండ్లను సిద్ధం చేసుకోండి అంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఏంటిది వీటిని తింటే మంచి జరుగుతుందా? నిజమేనా అంటే..న్యూ ఇయర్(New Year)కి స్వాగతం పలుకుతూ..అర్థరాత్రి(Midnight) 12 ద్రాక్ష పండ్లు(12 grapes) తినడం అనేది స్పానిష్ సంప్రదాయం. వాళ్లు ఇలా తినడం వల్ల రాబోయే ఏడాదిలో అదృష్టాన్ని ప్రేమను పొందుతారనేది వారి నమ్మకం. శాస్త్రీయంగా ఇది నిజం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు గానీ.. రానున్న కొత్త ఏడాది నేపథ్యంలో ఈ ఆచారం తెగ వైరల్ అవుతోంది సోషల్ డియాలో. ముఖ్యంగా మహిళలు ఈ ఆచారాన్ని పాటించేందుకు రెడీ అవుతున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాదు ఏడాదిలో అదృష్టాన్ని, ప్రేమను పొందేందుకు ఇది తప్పక ట్రై చేయండి అని పోస్టుల వెల్లువెత్తాయి. అంతేగాదు ఈ కొత్త ఏడాది 2025లో కొత్త భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారు లేదా పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా 12 గ్రేప్స్ తినండి అంటూ ఓ ట్రెండ్ ఊపందుకుంది. 12 పండ్లే ఎందుకంటే..ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు, స్పానిష్ సంప్రదాయంలో భాగం కూడా. దీన్ని "లాస్ డోస్ ఉవాస్ డి లా సూర్టే" అని పిలుస్తారు. దీని అర్థం '12 ద్రాక్షల అదృష్టం' అట. ఇలా ద్రాక్షలు తినే సంప్రదాయ 1800ల చివరలో ప్రారంభమైందట. అయితే ఇప్పుడు పాప్ కల్చర్‌లో భాగంగా మన దేశంలో కూడా ఈ ఆచారం ట్రెండ్ అవుతోంది. ఇక్కడ 12 ద్రాక్షల్లో ఒక్కొక్కటి కొత్త ఏడాదిలోని 12 నెలలను సూచిస్తాయి. ఇలా ఈ పన్నెండు తింటే.. ఏడాదంతా జీవితం సంతోషంగా సాగిపోతుందనేది వారి నమ్మకం. విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ట్రెండ్‌పై తమ అనుభవాలను కూడా చెప్పేస్తూ ఊదరగొట్టేస్తున్నారు. దీంతో అందరూ ఈ ట్రెండ్‌ని అడాప్ట్ చేసుకునేలా పడ్డారు. నిజానికి ఇలా చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు గానీ తేలికపాటి పండ్లే కాబట్టి నిరంభ్యంతరంగా ప్రయత్నించొచ్చు. కానీ చలికాలం కాబట్టి రాత్రి టైంలో అలా తింటే ఆరోగ్య పరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఏ ఆచారమైన మన నమ్మకాల నుంచే వస్తాయి. హాని కలిగించని ఫన్నీ నమ్మకాలతో ఈ కొత్త ఏడాదిని సంతోషభరితంగా సెలబ్రెట్ చేసుకుని ఖుషీగా ఉందాం. (చదవండి: నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!) -
New Year 2025: షిర్డీలో సంబరం.. రాత్రంతా దర్శనం
2024కి వీడ్కోలు పలుకుతూ, 2025కి స్వాగతం చెప్పే సమయం ఆసన్నమయ్యింది. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరాన మహారాష్ట్రలోని షిర్డీలో కొలువైన బాబాను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే షిర్డీ చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 31న రాత్రంతా బాబా ఆలయాన్ని తెరిచివుంచనున్నామని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలాసాహెబ్ తెలిపారు.షిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రస్తుతం నాలుగు రోజులపాటు షిర్డీ మహోత్సవ్(Shirdi Mahotsav)ను నిర్వహిస్తోంది. దీనిలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణం, సాయి ధర్మశాల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పండపాలను ఏర్పాటు చేశారు. దీనికితోడు దేశం నలుమూలల నుండి సుమారు 90 పల్లకీలు ఈ కార్యక్రమానికి తరలిరానున్నాయి.2025, నూతన సంవత్సరం వేళ భక్తులకు పంపిణీ చేసేందుకు సుమారు 120 క్వింటాళ్ల బూందీ ప్రసాదం ప్యాకెట్లు, సుమారు 400 క్వింటాళ్ల మోతీచూర్ లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఆలయ సముదాయం, దర్శనం క్యూ, సాయి కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో భక్తులకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. మరోవైపు పోలీసు ఇన్స్పెక్టర్లు, క్విక్ యాక్షన్ టీమ్‌లు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(Bomb Disposal Squad)లు షిర్డీలో అణువణువునా పహారా కాస్తున్నాయి. ఆలయ ప్రాంగణం, సాయి ఆశ్రమం, ప్రసాదాలయం తదితర ప్రదేశాలలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్స్‌లు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.డిసెంబరు 31న భక్తులకు రాత్రంతా దర్శనాలు కల్పించనున్నందున 31న రాత్రి 10 గంటలకు జరిగే హారతి జనవరి 1న ఉదయం 5.15 గంటలకు జరిగే హారతి కార్యక్రమాలను రద్దుచేశారు. కాగా ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు షిర్టీకి చేరుకున్నారు. ఆలయానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోవడంతో భక్తులు బాబా దర్శనం కోసం క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది.ఇది కూడా చదవండి: New Year 2025: జనవరి ఒకటి.. ప్రపంచ జనాభా 809 కోట్లు.. టాప్‌లో భారత్ -
#NewYear2025 : న్యూ ఇయర్ సందడి మొదలు... (ఫొటోలు)
-
New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం నుంచే రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో జనం సందడి చేయనున్నారు. న్యూ ఇయర్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు వేడుకలు సవ్యంగా సాగేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్లకు అనుసంధానమైన రహదారులపై రాత్రి 8 గంటల నుండి వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో అన్ని వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఏఐ ఆధారిత కెమెరాలతో పహారా కాస్తున్నారు. అనుమానితులపై నిఘా ఉంచేందుకు వీటిని వినియోగించనున్నారు.ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన యోధా వాహనాల్లో కమాండోలను మోహరించనున్నారు. వీరు రోడ్లపై తిరుగుతూ అల్లర్లకు పాల్పడేవారి ఆటకట్టించనున్నారు. దీనికి తోడు ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో 600 మంది పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు. కన్నాట్ ప్లేస్‌లో 50కి పైగా పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు మోటార్ సైకిళ్లపై నిరంతరం గస్తీ తిరగనున్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు సిబ్బంది జనం మధ్యలో తిరుగుతూ, ప్రజలకు రక్షణ అందించనున్నారు.నూతన సంవత్సర వేడుకల్లో రాజకీయ పార్టీలు, సంస్థలు అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదనే నిబంధన విధించారు. ఇండియా గేట్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించడానికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేపట్టనున్నారు. ఇండియా గేట్ వద్ద పార్కింగ్ స్థలం పరిమితంగా ఉన్నందున సందర్శకులు ప్రజా రవాణాను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపినా, అతివేగంగా వాహనం నడిపినా, జిగ్-జాగ్ తరహాలో ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినా వారిపై వివిధ సెక్షన్ల కింద జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు -
2025లో లాంగ్ వీకెండ్లు.. ఎంజాయ్ చేద్దామిక..
ఇక కొద్దిగంటల్లో న్యూ ఇయర్ చిందులు మొదలుకానున్నాయి. మరోవైపు కొత్త సంవత్సరం రాగానే ఈ ఏడాది ఎక్కడికి వెళ్లాలి? అని పలువురు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇందుకు తగిన విధంగా సెలవులు కూడా అవసరమవుతుంటాయి. అందుకే ఈ ఏడాది ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయా? లాంగ్ వీకెండ్ ఎప్పుడు వచ్చిందా? అని క్యాలెండర్లో చూస్తుంటారు.హోలీకి లాంగ్ వీకెండ్2025లో మొదటి లాంగ్ వీకెండ్(Long weekend) హోలీ సందర్భంగా వస్తుంది. మార్చి 14న శుక్రవారం హోలీ జరుపుకుంటారు. హోలికా దహన్ ఒక రోజు ముందు అంటే మార్చి 13న (గురువారం) జరుగుతుంది. ఈ నేపధ్యంలో హోలీ మరుసటి రోజు అంటే మార్చి 15న (శనివారం) ఆఫీసు నుండి సెలవు తీసుకోగలిగితే.. మార్చి 13 నుండి మార్చి 16 వరకు 4 రోజుల సుదీర్ఘ వీకెండ్ వస్తుంది. అంటే నాలుగు రోజుల పాటు ఎక్కడికైనా తిరిగే అవకాశం లభిస్తుంది.స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగాఆగస్ట్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా కూడా లాంగ్ వీకెండ్ వస్తుంది. ఆగస్టు 15 శుక్రవారం నాడు వచ్చింది. ఈ నేపధ్యంలో శనివారం ఆగస్టు 16న సెలవు తీసుకోగలిగే మూడు రోజుల పాటు వీకెండ్ వస్తుంది. మరోవైపు జన్మాష్టమి ఆగస్టు 16న వచ్చింది. ఒకవేళ ఆరోజున సెలవు ఉంటే ప్రత్యేకంగా సెలవు పెట్టాల్సిన అవసరం రాదు. ఈ మూడు రోజుల్లో సమీపంలోని ఏదైనా ప్రదేశానికి రోడ్ ట్రిప్‌కు వెళ్లవచ్చు. లేదా రిసార్ట్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.దసరా హాలిడేస్2025 దసరా సెలవులకు గాంధీ జయంతి మరో సెలవుగా జతచేరింది. సాధారణంగా దుర్గాష్టమి నుండి విజయదశమి వరకూ ఆఫీసులో సెలవులు ఉంటాయి. 2025లో దుర్గాష్టమి సెప్టెంబర్ 30 (మంగళవారం), మహానవమి అక్టోబర్ ఒకటి (బుధవారం), గాంధీ జయంతి(Gandhi Jayanti), విజయదశమి అక్టోబర్ 2 (గురువారం) తేదీలలో వచ్చాయి. దీని ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2 వరకు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయవచ్చు.బక్రీద్‌కు..2025 జూన్ 7న (శనివారం) బక్రీద్ జరుపుకోనున్నారు. ఆ మర్నాడు ఆదివారం. దీంతో రెండు రోజులు సెలవులు వస్తాయి. ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లివచ్చే అవకాశం ఉంటుంది.రక్షాబంధన్ సందర్భంగాఆగస్టు 9న (శనివారం) రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఆ మర్నాడు ఆదివారం. ఈవిధంగా రక్షాబంధన సందర్బంగా వచ్చే రెండు రోజుల సెలవుల్లో కుటుంబంతో పాటు ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు -
హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే..
సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ 31’ని జీరో ఇన్సిడెంట్, యాక్సిడెంట్ నైట్‌గా చేయడానికి నగర పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. న్యూ ఇయర్ పార్టీల విషయంలో సభ్యత, భద్రత మరవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. బౌన్సర్లు, నిర్వాహకులు సహా ఎవరు హద్దు మీరినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయం తర్వాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు.డిసెంబర్ 31 రాత్రి పార్టీలకు సంబంధించి పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీల నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పారీ్టలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధతీవ్రతనూ కొలుస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పోలీసులు పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ట్యాంక్‌బండ్‌పైన ఇతర కీలక ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్Œ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్, డబీర్‌పుర ఫ్లైఓవర్లు మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మంగళవారం రాత్రి మూసి ఉంచుతారు.వెస్ట్‌జోన్‌లో స్పెషల్ యాక్షన్స్... నగరంలోని మిగతా నాలుగింటితో పోలిస్తే పశ్చిమ మండలం పూర్తి విభిన్నమైంది. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం సైతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివిధ సందర్భాలు, సమయాల్లో సిటీలోని పబ్స్ కపుల్ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తుంటాయి. జంటగా వచ్చేవారు మినహా మిగతా వారిని పబ్స్‌లోకి రానివ్వరు. దీనిపై పలు సందర్భాల్లో కొందరు యువకులు గుంపులుగా వచ్చి పబ్స్ వద్ద హల్చల్ చేస్తుంటారు. స్టాగ్ గ్యాంగ్స్‌గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్‌లిస్ట్ తయారు చేస్తున్నారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగకన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. నగర వ్యాప్తంగా ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్ కంట్రోలింగ్‌కు ప్రత్యేక షీ–టీమ్స్ బృందాలు మోహరిస్తున్నారు. ఆయా కార్యక్రమాలు, వెన్యూల వద్ద ఉండే బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ‘డ్రింక్సే’ కాదు డ్రగ్సూ పట్టేస్తారు... కేవలం డ్రంక్ డ్రైవింగే కాకుండా ‘డ్రగ్ డ్రైవింగ్’కు చెక్ చెప్పాలని అధికారులు నిర్ణయించారు. డ్రగ్స్ తీసుకుని వాహనాలు నడిపే వారితో పాటు కొన్ని సందర్భాల్లో ఇతర అనుమానితులకు గుర్తించడానికి డ్రగ్ డిటెక్టర్స్ సమీకరించుకున్నారు. జర్మనీ నుంచి ఖరీదు చేసిన ఈ అత్యా«ధునిక పరికరాల్లో 75 పరికరాలను తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (టీఎస్ ఏఎన్‌బీ) అధికారులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు అందించారు. వీటి ఆధారంగా అధికారులు రహదారులపైనే కాకుండా పబ్స్, ఫామ్‌హౌస్‌లతో పాటు మరికొన్ని సున్నిత ప్రాంతాల్లోనూ తనిఖీలు చేయనున్నారు. స్నిఫర్ డాగ్స్తోనూ తనిఖీలు చేపడతారు.అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు పొడిగింపున్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైల్ సేవలు పొడిగించారు. ఈ రోజు అర్ధరాత్రి 1:15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 12.30కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు డెస్టినేషన్ స్టేషన్‌కు చేరుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. నగరంలో రాత్రి 11 నుంచి రేపు(మంగళవారం) ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓఆర్ఆర్ మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. -
బ్యాంకులకు వరుస సెలవులు
కొత్త ఏడాది (New Year 2025) మొదలవుతోంది. తొలి నెలలోనే బ్యాంకులకు వరుస సెలవులు (Bank holidays) ఉన్నాయి. వివిధ పండుగలు, విశేషమైన సందర్భాల కారణంగా జనవరిలో (January) చాలా రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో ముందుగా తెలుసుకుని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. అన్ని ప్రభుత్వ సెలవులు, అలాగే రాష్ట్రాలవారీగా మారే కొన్ని ప్రాంతీయ సెలవు రోజుల్లో కూడా బ్యాంకులను మూసివేస్తారు. ఈ ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.జనవరిలో సెలవులు ఇవే..జనవరి 1: బుధవారం- నూతన సంవత్సరాదిజనవరి 2: నూతన సంవత్సరం, మన్నం జయంతిజనవరి 5: ఆదివారం జనవరి 6: సోమవారం- గురుగోవింద్ సింగ్ జయంతి జనవరి 11: శనివారం- మిషనరీ డే, రెండవ శనివారం జనవరి 12: ఆదివారం- స్వామి వివేకానంద జయంతి జనవరి 13: సోమవారం- లోహ్రి జనవరి 14: మంగళవారం- మకర సంక్రాంతి, మాఘ బిహు, పొంగల్జనవరి 15: బుధవారం- తిరువళ్లువర్ దినోత్సవం (తమిళనాడు), తుసు పూజ (పశ్చిమ బెంగాల్, అస్సాం) జనవరి 16: ఉజ్జవర్ తిరునాల్ జనవరి 19: ఆదివారం జనవరి 22: ఇమోయిన్ జనవరి 23: గురువారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 25: శనివారం- నాల్గవ శనివారం జనవరి 26: ఆదివారం- గణతంత్ర దినోత్సవం జనవరి 30: సోనమ్ లోసర్దేశంలో రాష్ట్రాలవారీగా మారే జాతీయ సెలవులు, ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో పాటు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులను మూసివేస్తారు. బ్యాంకులు మూతపడినప్పటికీ కస్టమర్లు డిజిటల్‌గా వివిధ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చు. యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు బ్యాంకు సెలవుల సమయంలో అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు తమ పనిని ఎక్కడి నుండైనా సౌకర్యవంతంగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తాయి.