2023కి ఈ రోజుతో వీడ్కోలు చెప్పేసి కొత్త ఏడాది 2024కి స్వాగతం పలికేందుకు అందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. ఎలా సెలబ్రెట్ చేసుకోవాలి, ఈ ఏడాది అంతా మంచే జరిగేలా ఏం చేయాలి అనే ప్రణాళికలతో తలమునకలై ఉన్నారు కూడా. ఎలాంటి చేదు అనుభవాలు, బాధలు, కన్నీళ్లు చవిచూసినా ఈ ఏడాది అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ఆశావాహ దృక్పథంతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాం. ఈ సందర్భంగా ఏయే దేశాలు న్యూ ఇయర్‌కి ముందుగా స్వాగతం పలుకుతాయి. టైమింగ్స్ ప్రకారం ఏయే దేశాల్లో ముందుగా వేడుకలు జరిపోతాయి తదితరాలు గురించి తెలుసుకుందామా!.
అందరికి న్యూ ఇయర్ ఒకే రోజు మొదలైనప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం జస్ట్ కొన్ని గంటల తేడాతో ముందుగా జరిగిపోతాయి. ప్రపంచదేశాల్లో కాలమానాల ప్రకారం కాస్త అటు ఇటుగా ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అలాంటి దేశాలు ఏవంటే..
ముందుగా సెలబ్రేట్ చేసుకునే దేశాలు..
ఫసిపిక్ దీవులైన టోంగా, సమోవా, కిరిబాటి, న్యూజిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటలుకే వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక న్యూజిలాండ్‌లో మాత్రం ఈ రోజు సాయంత్రం నుంచే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమైపోతాయి. ఇదే సమయాలనికి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాయి. ఇక భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల మనకంటే 30 నిమిషాల ముందు కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి.
చివరిగా జరుపుకునే దేశాలు..
జనావాసాలు లేని హౌలాండ్, బేకర్ దీవులలో అయితే భారత కాలమానం ప్రకారం జనవరి 1, సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. ఇక్కడే చివరిగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అంతేగాదు భారత్‌లో జరిగిన తర్వాత నాలుగున్నర గంటలకు సుమారు 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాది 2024కి స్వాగతం చెబుతాయి. వాటిలో నార్వే, ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా దేశాల తోపాటు కాంగో అంగోలా, కామెరూన్ వంటి ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి. భారత్ తర్వాత 5.30 గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్ మొదలవుతుంది. అలాగే అమెరికాలో భారత కాలమానం ప్రకారం జనవరి1 ఉదయం స్వాగతం పలుకుతుంది. కాగా, భారతదేశంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే సమయానికే శ్రీలంక వాసులు కూడా వేడుకలు జరుకోవడం విశేషం.
(చదవండి: వీధి కుక్కకు సెక్యూరిటీ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న నెటిజన్లు! ఎందుకో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment