Countries
-
ఇరాన్‌పై దాడి.. మూడు దేశాల గగనతలం మూసివేత
టెహ్రాన్:తమపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున పెద్దఎత్తున దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు. ఫ్లైట్ రాడార్ 24, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. మూడు దేశాలు( ఇరాన్, ఇరాక్, సిరియా) మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు.ఈ మూడు దేశాల మధ్య విమనాలు ప్రయాణించే గగనతలం మూసివేశారు. అయితే.. దాడులు ముగిసిన అనంతరం గగనతలంలో విమాన సర్వీసుల ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా కొన్ని గంటల పాటు జోర్డాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.The airspace of #Iran, #Iraq, #Jordan, #Syria and #Israel is closed as Israeli war planes attack various locations in Iran for the last few hours. pic.twitter.com/5MEcNGaiNk— Hamdan News (@HamdanWahe57839) October 26, 2024అక్టోబర్ 1న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై 200కుపైగా రాకెట్లు, క్షిపణుల ప్రయోగించింది. ఇరాన్ వైమానిక దాడులకు ప్రతీకంగా ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. ఇజ్రాయల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇలామ్, ఖుజెస్తాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడులు పరిమిత నష్టాన్ని మాత్రమే కలిగించాయి" అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
అసియాలోనే అత్యధిక స్త్రీ అక్షరాస్యత కలిగిన దేశాలు ఇవే..
విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది.అయితే పురుషులతో పోలిస్తే స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఆసియాలో స్త్రీల సగటు అక్షరాస్యత శాతం 81.6గా ఉంది. అయితే భారత్‌లో స్త్రీ అక్షరాస్యత 65.8 శాతంగా ఉంది. భారత్ కంటే అనేక అరబ్ దేశాలు అక్షరాస్యతలో చాలా ముందంజలో ఉండటం గమనార్హం..15 ఏళ్ల కంటే ఎక్కువున్న బాలికలు, చదవడం, రాయగల సామర్థాన్ని కలిగి ఉన్నవారిని.. స్త్రీ అక్షరాస్యతగా పేర్కొంటారు. ఇది విద్య, సాధికారత ద్వారా సాధ్యమవుతుంది. మహిళ ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి, లింగ సమానత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీల అక్షరాస్యత రేట్లను మెరురుపరచడం వల్ల వారికి ఉద్యోగావకాశాలు, ఆదాయ అవకాశాలు పెరుగుతతాయి. రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం పెరుగుతుంది. అన్నీ దేశాలను గమనిస్తే..స్త్రీ అక్షరాస్యతలో ఉత్తర కొరియా 100 శాతంతో ఉంది. దీనితోపాటు సమానంగాా ఉజ్బెకిస్తాన్ కూడా 100 శాతం ఉంది. తరువాత కజకిస్తాన్ -99.7 శాతంతజకిస్తాన్-99.7 శాతంజార్జియా-99.7 శాతంఅర్మెనియా-99.7 శాతంఅజర్బైజాన్-99.7 శాతంకిరిగిస్తాన్ 99.5 శాతంసైప్రస్- 99.2 తుర్క్మెనిస్తాన్- 99.6 శాతంసిరియా-81 శాతంఇరాక్ -77.9 శాతంఇరాన్ 88.7 శాతంఇజ్రాయిల్ 95.8 శాతంజోర్దాన్ 98.4 శాతంకువైట్ 95.4 శాతంసౌదీ అరేబియా 96 శాతంటర్కీ 94.4శాతంఓమన్-92.7 శాతంయెమెన్ 55 శాతంయూఏఈ-92.7 శాతందక్షిణ కొరియా-96.6 శాతంజపాన్-99 శాతంవియాత్నం 94.6 శాతంబ్రూనై -96.9 శాతంఇండోనేషియా-94.6 శాతంమలేషియా 93.6 శాతంఫిలిప్పిన్స్-96.9 శాతంసింగపూర్-96.1 శాతంశ్రీలంక-92.3 శాతంతైవాన్-97.3 శాతంమంగోలియా-99.2 శాతంఖతర్ 94.7 శాతంచైనా-95.2 శాతంభారత్ 65.8 శాతంనేపాల్ 63.3 శాతంభూటాన్ 63.9 శాతంమయన్మార్ 86.3 శాతంథాయ్లాండ్ 92.8 శాతం కంబోడియా 79.8 శాతంఇక అన్నింటికంటే తక్కువగా చివరి స్థానంలో అప్ఘనిస్తాన్ ఉంది. ఇక్కడ స్త్రీల అక్షరాస్యత కేవలం-22.6శాతం మాత్రమే ఉంది. -
ప్రపంచ దేశాల్లో పర్యాటక రంగం కొత్త పుంతలు (ఫొటోలు)
-
ఈయూ అనుభవం నేర్పే పాఠాలు
జన్యుమార్పిడి(జీఎం) పంటలపై కేంద్రప్రభుత్వం ఆమోదయోగ్యమైన విధానాన్ని తేవాలని సుప్రీంకోర్టు కోరింది. జీఎం పంటలను చాలా రాష్ట్రాల వ్యవ సాయ సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మనుషులు, జంతువులు, మొక్కల మీద వీటి ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం, జీఎం జనరే టర్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ పంటలను సులభంగా ఆమోదించడానికి దూరంగా ఉన్నాయి. ఒకనాటి హరిత విప్లవం ఫలితంగా ఉత్పాదకత పెరిగింది. కానీ ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే జీఎం సాంకేతికతకు సంబంధించిన ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.జన్యుమార్పిడి పంటలపై ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను ఇటీవల సుప్రీంకోర్టు కోరింది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో జన్యుమార్పిడి పంటల ప్రవేశాన్ని సంశయవాదులు అడ్డుకోగలిగారు. పర్యావరణం, వ్యవ సాయ వైవిధ్యం, మానవులు, జంతువుల ఆరోగ్యంపై జన్యుమార్పిడి పంటల ప్రభావాలపై 18 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ సంఘాల నాయకులు గత వారం ఒక జాతీయ సదస్సును నిర్వహించారు. జన్యుమార్పిడి పంటలను వారు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారు.జన్యుమార్పిడి జీవులకు సంబంధించి తగిన ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించడానికి భారతదేశం పోరాడుతోంది. యూరో పియన్ యూనియన్(ఈయూ) తన సభ్య దేశాలలో జన్యుమార్పిడి ఉత్పత్తులు, విత్తనాల ప్రవేశాన్ని నియంత్రించడానికి చాలా కాలం కుస్తీ పట్టింది. సమగ్రమైనది కానప్పటికీ, మంచి విధానాన్నిరూపొందించగలిగింది. ఇది భారత్‌కు పాఠాలను అందిస్తుంది.ప్రపంచం ఇప్పటివరకు మూడు ‘హరిత విప్లవాలను’ చూసిందని వ్యవసాయ వృద్ధి చరిత్ర చెబుతోంది. మొదటిది 1930లలో యూరప్, ఉత్తర అమెరికాలో ప్రారంభమైంది. ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, వ్యవసాయ నిర్వహణను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఇది మొక్కజొన్న, ఇతర సమశీతోష్ణ వాతా వరణ పంటలలో త్వరిత దిగుబడిని పెంచింది. రెండో హరిత విప్లవం కొన్ని భారతీయ రాష్ట్రాలతోపాటు 1960లు, 1970లలో చోటు చేసు కుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఉష్ణమండలంలోపండించే పంటలకు అదే విధమైన సాంకేతికతను బదలాయించింది. స్థానిక పరిశోధనలను ఉపయోగించడం ద్వారా ఈ సాంకేతికతలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి.జన్యుమార్పిడి ఉత్పత్తులు, ముఖ్యంగా వ్యవసాయంలో జన్యు ఇంజినీరింగ్ ఉపయోగించి ఉత్పత్తి చేసిన విత్తనాలు 1970లలో కని పించాయి. వీటిని 1990లలో ప్రధానంగా ఉత్తర అమెరికాలో వాణిజ్యీ కరించారు. ఈ సాంకేతికతను ప్రబోధించినవారు వ్యవసాయ ఉత్పాద కతలో ఇది మరొక అపారమైన పెరుగుదలకు దారితీస్తుందనీ, ఆహార సరఫరాలో గుణాత్మక మెరుగుదలను అందజేస్తుందనీ పేర్కొన్నారు. మొదటి రెండు హరిత విప్లవాలకూ, మూడవ దానికీ మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, నిశ్చయాత్మకమైన కుతూహలంతో దీనిని ప్రపంచం స్వీకరించలేదు. మానవులు, జంతువులు, మొక్కల ఆరోగ్యంపై ఈ సాంకేతికతలోని ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి.అందుకే వీటి ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. అయితే అమెరికా, కెనడా, అర్జెంటీనా, బ్రెజిల్ చాలా వరకు వ్యవసాయ బయోటెక్ అను వర్తనాలను అనుమతించాయి. భారత్‌తో సహా చాలా ఇతర దేశాలు ఈ విషయంలో సరైన మార్గం కోసం పోరాడుతున్నాయి.యూరోపియన్ దేశాలు ఈ సాంకేతికతను మొట్టమొదట గట్టిగా వ్యతిరేకించి, తర్వాత తీవ్రమైన నియంత్రణ విధానాన్ని అనుసరించాయి. చాలా యూరోపియన్ ప్రభుత్వాలు, యూరోపియన్ యూని యన్ కూడా జన్యుమార్పిడి జీవులతో ముడిపడి ఉన్న ప్రమాదాల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడా నికి బదులుగా ముందు జాగ్రత్త విధానాన్ని స్వీకరించాయి.ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం, ‘అదే’ తరహా ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయాలంటే, బలమైన శాస్త్రీయ సాక్ష్యం అవసరమని అమెరికా వాదిస్తోంది (అదే తరహా ఉత్పత్తిఅంటే నేరుగా పోటీ పడే లేదా ప్రత్యామ్నాయ ఉత్పత్తి). దిగుమతి దారులు లేదా దిగుమతి చేసుకునే దేశాలు తప్పనిసరిగా జీఎం విత్తనం లేదా ఉత్పత్తి మానవ లేదా జంతువు లేదా మొక్కల ఆరోగ్యానికి సుర క్షితం కాదని తిరస్కరించలేని శాస్త్రీయ ఆధారాలను అందించాలి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విత్తనం లేదా ఉత్పత్తి ‘సురక్షి తమైనది’ అని రుజువు చేయాల్సిన బాధ్యత జీఎం విత్తన ఉత్పత్తిదారు లపై లేదా దాని ఎగుమతిదారులపై లేదు; అది ‘సురక్షితం కానిది’ అని నిరూపించాల్సిన బాధ్యత దిగుమతిదారులపై ఉంది. మరో మాటలో చెప్పాలంటే, సురక్షితమని నిరూపించడం విక్రేత బాధ్యత కాదు, అది కొనుగోలుదారు బాధ్యత. కాబట్టి, హానికారకం అని రుజువయ్యేంత వరకూ అది సరైనదే అని అన్ని దేశాలూ భావించాల్సి ఉంటుంది. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదించిన స్వేచ్ఛా వాణిజ్య విధానంలో, బలమైన శాస్త్రీయ సాక్ష్యం లేనప్పుడు అమెరికా నుండి జన్యుమార్పిడి దిగుమతులను ఈయూ నియంత్రించలేదు. అయితే అమెరికా దృక్పథంతో విభేదిస్తూ, ఈయూ తన సభ్య దేశాలచే జన్యుమార్పిడి విత్తనాలు/ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించింది. ఈ పంట రకాల ఆమోదాన్ని తాత్కాలికంగా నిలుపుదల (1998–2004) చేస్తూ దాని చర్యలను ప్రారంభించింది.ఈ నిలుపుదలను ఆగ్రహించిన అమెరికా, అర్జెంటీనా, కెనడా దేశాలు ఈయూ నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా 2003లోప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక దావాను ప్రారంభించాయి. ఈయూ విధానం చట్టవిరుద్ధమైన వాణిజ్య పరిమితులను సృష్టిస్తోందని పేర్కొ న్నాయి. దాంతో డబ్ల్యూటీవో వివాద పరిష్కార ప్యానెల్ 2006 సెప్టెంబరులో ఫిర్యాదు చేసిన దేశాలకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా తన ఆమోద ప్రక్రియను తేవాలని యూరోపియన్ యూనియన్ను కోరింది.డబ్ల్యూటీవో నిర్ణయానికి ముందే యూరోపియన్ యూనియన్ తన విధాన ప్రక్రియను మార్చుకుంది. అయితే అది ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉంది. సభ్య దేశాల శాస్త్రీయ సంస్థలతో సన్నిహిత సంప్రదింపుల ద్వారా నష్టంపై అంచనా వేయడం జరిగింది. ఈ అభిప్రాయాన్ని బహిరంగ సంప్రదింపుల కోసం ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈయూ నిబంధనల ప్రకారం, అనేక రకాల కారణాల ఆధారంగాపంట సాగును నిలిపివేయడానికీ, నిషేధించడానికీ లేదా పరిమితం చేయడానికీ సభ్య దేశాలకు హక్కు ఉంటుంది. పర్యావరణం, వ్యవ సాయ విధాన లక్ష్యాలు, సామాజిక–ఆర్థిక ప్రభావం వంటివి కారణా లుగా చూపొచ్చు. ఫలితంగా, ఐరోపాలో వాణిజ్యీకరణ కోసం చాలా తక్కువ వ్యవసాయ బయోటెక్ అప్లికేషన్లను ఆమోదించారు.ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం నుండి స్థిరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈయూ సభ్యదేశాలు, ఇతర యూరప్ దేశాలు జన్యుమార్పిడి పంటలను, ముఖ్యంగా ఆహార గొలుసులో భాగమైన వాటిని సులభంగా ఆమోదించడానికి నిరంతరం దూరంగా ఉన్నాయి. ఈయూ, ఇతర దేశాల విముఖత అనేది ప్రభుత్వాలపై డబ్ల్యూటీవో, జన్యుమార్పిడీ టెక్నాలజీ జనరేటర్ల ఒత్తిడిని బలహీనపరిచింది. ఇది భారతదేశం తన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకోవడానికి ఎంతో సాయపడుతుంది.జన్యుమార్పిడి జీవులపై సముచితమైన, ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యతను సుప్రీంకోర్టు సరిగ్గానేకేంద్రానికి అప్పగించింది. భారతీయ విధాన రూపకర్తలు తప్పనిస రిగా యూరోపియన్ అనుభవాన్ని పరిశీలించాలి. ఇంతకుముందు మనం హరిత విప్లవ సాంకేతికతను అంగీకరించాం. దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది; కానీ కొన్ని దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే ఈసారి, జన్యుమార్పిడిసాంకేతికతకు సంబంధించిన సానుకూల, ప్రతికూల ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీమాజీ ప్రొఫెసర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
చెలియలికట్ట దాటేస్తోంది..!
వాతావరణ సంక్షోభం సముద్రాలనూ అల్లకల్లోలం చేస్తోంది. వినాశకరమైన మార్పులకు కారణమవుతోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు సముద్ర మట్టాల పెరుగుదల ఊపందుకుంది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఈ ధోరణి నానాటికీ కలవరపెడుతోంది. ఏకంగా ‘ప్రపంచ విపత్తు’ స్థాయికి చేరి పసిఫిక్ దీవుల అస్తిత్వానికే ముప్పుగా పరిణమించింది! దీనిపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మనిషి చేజేతులా తెచి్చపెట్టుకున్న సంక్షోభమిది. ఇది గనుక పరాకాష్టకు చేరితే మనం సురక్షితంగా బయటపడేందుకు లైఫ్‌బోట్ కూడా మిగలదు’’ అని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే ప్రపంచం స్పందించాలని పిలుపునిచ్చారు... పసిఫిక్ ద్వీప దేశం టోంగా రాజధాని నుకులోఫాలో ఇటీవల పసిఫిక్ ఐలండ్స్ ఫోరం సమావేశం జరిగింది. ఆ వేదిక నుంచే, ‘మన సముద్రాలను కాపాడండి (సేవ్ అవర్ సీస్)’ పేరిట అంతర్జాతీయ స్థాయి పెనుప్రమాద హెచ్చరిక (గ్లోబల్ ఎస్ఓఎస్)ను ఐరాస చీఫ్ విడుదల చేశారు. ‘‘పసిఫిక్ ఉప్పొంగిపోతోంది. అక్కడి బలహీన దేశాలు అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటికి ఆర్థిక సాయాన్ని, మద్దతును భారీగా పెంచండి’’ అంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. మూడింతల ముప్పు! నైరుతీ పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1980 నుంచి ప్రపంచ సగటు కంటే ఏకంగా మూడు రెట్లు వేగంగా పెరిగినట్టు ప్రపంచ వాతావరణ సంస్థ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ పేర్కొంది. దీంతో గత 30 ఏళ్లలో అక్కడ సముద్ర మట్టాలు ప్రపంచ సగటు కంటే రెట్టింపు పెరిగాయట. సముద్ర వడగాలులూ రెట్టింపయ్యాయి. మున్ముందు అవి మరింత తీవ్రంగా, మరింత సుదీర్ఘకాలం కొనసాగుతాయి’’ అని నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధన ఉద్గారాల తాలూకు వేడిలో ఏకంగా 90 శాతం సముద్రాలే గ్రహించాయని నివేదిక వెల్లడించింది. దాంతో సముద్రపు ఉష్ణోగ్రతలు, ఫలితంగా సముద్ర మట్టం ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. వేగంగా కరిగిపోతున్న హిమానీ నదాలు, భారీ మంచు పలకలు ఇందుకు తోడవుతున్నాయి! ‘‘మున్ముందు సముద్రాలు కోలుకోలేని మార్పులకు లోనవుతాయి. మనుగడ కోసం మనిషి చేస్తున్న వినాశనమే ఈ ముప్పుకు కారణం’’ – డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి సెలెస్టే సౌలో‘‘ఇప్పుడు పసిఫిక్ వంతు. మున్ముందు అన్ని సముద్రాలకూ ఈ ముప్పు పొంచి ఉంది. ఇప్పుడే కళ్లు తెరిచి పసిఫిక్‌ను కాపాడు కుంటే మొత్తం మానవాళినీ కాపాడుకున్నవాళ్లం అవుతాం. అందుకే ప్రపంచం పసిఫిక్ వైపు చూడాలి. ఈ హెచ్చరికల్ని వినాలి’’ – ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్మహానగరాలకూడేంజర్ బెల్స్... సముద్రమట్టం పెంపు తాలూకు ముప్పు ప్రభావం ప్రస్తుతానికి పసిఫిక్ ద్వీపాలపైనే కన్పిస్తున్నా అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా లోతట్టు ద్వీపాలన్నింటికీ పాకుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అత్యధిక జనసాంద్రతతో కిక్కిరిసిపోతున్న తీర ప్రాంత మహా నగరాలు, ఉష్ణమండల వ్యవసాయ డెల్టాలు తదితరాల భద్రతకు పెను ముప్పు పొంచి ఉన్నట్టేనని అంటున్నారు. ‘‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచాలి. అంతకంటే ముందు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ లోపుకు పరిమితం చేయడంపై మరింత దృష్టి పెట్టాలి. అందుకోసం కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించాలి’’ అని రెండు నివేదికలూ ముక్త కంఠంతో పేర్కొన్నాయి.ఆ దీవులకు పెను ముప్పే..వాతావరణ సంక్షోభం, సముద్ర మట్టాల పెరుగుదల వల్ల పసిఫిక్‌కు త్వరలోనే పెను ముప్పు పొంచి ఉందని ఐరాస వాతావరణ కార్యాచరణ బృందం మంగళవారం ప్రచురించిన రెండో నివేదికలో కూడా పేర్కొంది. అందులో ఏం చెప్పిందంటే... 👉 దీనివల్ల తువలు, మార్షల్ ఐలాండ్స్ వంటి పసిఫిక్ దీవులు ప్రభావితమవుతున్నాయి. 👉 సముద్ర తాపం, సముద్ర మట్టం పెరుగుదల, ఆమ్లీకరణ... ఇలా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాయి. 👉 ఫలితంగా పర్యావరణ వ్యవస్థలు, పంటలు దెబ్బ తినడమే గాక మంచినీటి వనరుల కలుషితమవుతున్నాయి. 👉 జీవనోపాధి కూడా భారీగా దెబ్బ తింటోంది. 👉 తీవ్ర వరదలు, ఉష్ణమండల తుఫాన్లు ఇప్పటికే ఆ ద్వీపాలను నాశనం చేస్తున్నాయి. 👉 2023లో 34 భారీ తుఫాన్లు, వరద సంబంధిత ఘటనలు భారీ సంఖ్యలో మరణాలకు దారితీశాయి. 👉 ఈ ప్రాంతంలో ఏకంగా 2.5 కోట్ల మందిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. 👉 సముద్ర మట్టానికి కేవలం 1 నుంచి 2 మీటర్ల ఎత్తులో ఉన్న పసిఫిక్ ప్రాంతంలో 90 శాతం ప్రజలు తీరానికి 5 కి.మీ. పరిధిలోనే నివసిస్తున్నారు. 👉 ఇక్కడి మౌలిక సదుపాయాల్లో సగానికి సగం సముద్రానికి 500 మీటర్ల లోపలే ఉన్నాయి. 👉 ప్రస్తుత 3 డిగ్రీల సెల్సియస్ వేడి పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి పసిఫిక్ దీవుల వద్ద సముద్ర మట్టం మరో 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. 👉 ఏటా 30 రోజులకు పైగా తీరప్రాంత వరదలు ముంచెత్తుతాయి. 👉 సముద్ర మట్టం పెరుగుదల అనుకున్న దానికంటే వేగవంతమవుతుంది. 👉 ఫలితంగా పసిఫిక్ దీవులకు ముంపు ముప్పు కూడా వేగవంతమవుతుంది. -
ఈ దేశాల్లో మహిళలకు రక్షణ కరువు.. భారత్ ఎక్కడంటే?
కోల్‌కతా దారుణ హత్యాచార ఘటనో లేదంటే.. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల వల్లనో స్పష్టమైన కారణం తెలీదు.. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఇవిగో అంటూ ఒక జాబితా ట్రెండ్ అవుతోంది. ఆ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంటడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలోని దేశాల్లో ఉన్న పరిస్థితులు తెలుసుకోండి..దక్షిణాఫ్రికాఇప్పటివరకు మహిళలకు రక్షణ లేని దేశాలలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ రోడ్లపై ఒంటరిగా నడిచే మహిళలకు భద్రత చాలా తక్కువగా ఉంది. దీంతో ఇక్కడ మహిళా ప్రయాణికులు ఒంటరిగా ప్రయాణాలు చేయటం, డ్రైవింగ్ లేదా కాలినడకలో బయటకు వెళ్లటం మంచిది కాదని పలు కథనాలు వెల్లడించాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రపంచంలోనే ఆడవారికి రక్షణ విషయంలో చాలా ప్రమాదకరమైన దేశం దక్షిణాఫ్రికా అని పేర్కొంది. ఇక్కడ కేవలం 25 శాతం మంది మహిళలు మాత్రమే తాము ఒంటరిగా రోడ్లపై నడుస్తున్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు భావించటం గమనార్హం.భారతదేశంఆసియాలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్ తరచుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇటీవల ఓ స్పానిష్ జంట భారత్‌తో తాము హింస అనుభవించినట్లు నమోదైన కేసు కూడా వైరల్‌గా మారింది. భారత్‌లో మహిళలు లైంగిక వేధింపులు, వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలకు పరిశీలిస్తే.. బలవంతంగా కార్మికులుగా మార్చటం, లైంగిక వేధింపు ఘటనలు పెరగటం, మానవ అక్రమ రవాణా ఇప్పటికీ దేశ భద్రతను దెబ్బతీస్తోందని తెలుస్తోంది.ఆఫ్ఘనిస్తాన్తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని రాయిటర్స్ నివేదించింది. అయితే ఇక్కడ లైంగిక హింస కంటే.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవటం, బాలికల చదువుపై నిషేధాలు విధించటం వంటి వాటివల్ల మహిళలు ఆఫ్ఘనిస్తాన్ తమకు సురక్షితమైన దేశం కాదని భావిస్తున్నట్లు ఇప్పటికే పలు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇక్కడ తాలిబన్లు అమలు చేసే నిబంధనలు మహిళల స్వేచ్ఛను హరిస్తున్నాయి.సిరియామహిళలు తీవ్రమైన లైంగిక, గృహ వేధింపులకు గురవుతున్న మరో దేశం సిరియా. ఇక్కడ మహిళలకు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. మధ్య ప్రాచ్య దేశాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో సిరియా ఒకటి.సోమాలియామహిళల హక్కులు, భద్రతను పట్టించుకోని మరో దేశం సోమాలియా. రాయిటర్స్ నివేదించిన ప్రకారం.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు పెంచుకోవటం పరంగా మహిళలకు ఇక్కడ చాలా సవాలుతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. హానికరమైన సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులను పాటించటం ఇక్కడి మహిళలకు శాపంగా మారుతోంది.సౌదీ అరేబియామహిళల హక్కులలో సౌదీ అరేబియా కొంత పురోగతి సాధించినప్పటికీ త్రీవమైన లింగ వివక్ష కొనసాగుతోంది. పని ప్రదేశాల్లో ఉండే రక్షణ, ఆస్తి హక్కులకు సంబంధించి ఇక్కడి మహిళలకు సౌదీ అరేబియా సురక్షితంకాని దేశంగా మిగిలిపోయింది.పాకిస్తాన్‌ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం, మహిళల పట్ల వివక్ష చూపించటంలో మహిళలకు రక్షణలేని దేశాల జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి మహిళలకు హానికరమైన మత, సాంప్రదాయ పద్ధతులు సవాలుగా మారుతున్నాయి. ఇక్కడి మహిళపై దారుణమైన పరువు హత్యలు నమోదు కావటం గమనార్హం.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోఈ దేశంలో చట్టవిరుద్ధం, కక్షపూరిత అల్లర్ల కారణంగా లక్షలాది మంది ప్రజలు దారుణమైన జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మరోవైపు.. ఇక్కడి మహిళలు తీవ్రమైన వేధింపుల బారినపడుతున్నారని పేర్కొంది.యెమెన్తరచూ మానవతా సంక్షోభాలకు గురవుతున్న యెమెన్ దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు, సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులు మహిళలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే ఈ దేశం మహిళలకు సురక్షితమైన దేశం కాదని పలు వార్తలు వెలువడ్డాయి.నైజీరియా నైజీరియాలో మహిళలకు రక్షణ లేకపోవడాని అక్కడి ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ సంస్థ కారణమని ప్రజలు నమ్ముతారు. తీవ్రవాదులు పౌరులను హింసించటం, మహిళలను అత్యాచారం, హత్యలు చేయటం వంటి చర్యలకు పాల్పడుతుంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. నైజీరియన్ మహిళలు హానికరమైన సాంప్రదాయ పద్ధతులు పాటించటం, మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. దీంతో ఈ దేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా మిగులుతోంది. -
విదేశాల్లో మేడిన్ ఇండియా టూవీలర్ల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారైన ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో 12.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో తయారీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే విషయం. అలాగే టూవీలర్ల తయారీ విషయంలో భారత్ అనుసరిస్తున్న నాణ్యత, భద్రత ప్రమాణాలకు ఈ గణాంకాలు నిదర్శనం. 2024 జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో మోటార్‌సైకిళ్లు 13 శాతం వృద్ధితో 10,40,226 యూనిట్లు వివిధ దేశాలకు సరఫరా అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా ఏకంగా 83 శాతానికి ఎగసింది. స్కూటర్ల ఎగుమతులు 21 శాతం అధికమై 2,06,006 యూనిట్లుగా ఉంది. టూవీలర్స్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, ఇండియా యమహా మోటార్, హీరో మోటోకార్ప్, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా టాప్‌లో కొనసాగుతున్నాయి. అగ్రస్థానంలో బజాజ్.. ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5 శాతం వృద్ధితో ఏప్రిల్–జూలైలో 4,97,114 యూనిట్లు నమోదు చేసింది. ఇందులో 4,97,112 యూనిట్లు మోటార్‌సైకిళ్లు ఉండడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో 14 శాతం వృద్ధితో 3,13,453 యూనిట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 76 శాతం దూసుకెళ్లి 1,82,542 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 28 శాతం అధికమై 79,082 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 33 శాతం ఎగసి 73,731 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30 శాతం క్షీణించి 64,103 యూనిట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ 2 శాతం వృద్ధితో 28,278 యూనిట్లు, పియాజియో వెహికిల్స్ 56 శాతం దూసుకెళ్లి 9,673 యూనిట్ల ఎగుమతులను సాధించాయి. బైక్స్‌లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా, స్కూటర్స్‌లో హోండా, టీవీఎస్ మోటార్, ఇండియా యమహా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. -
వినాశనపు ఒడ్డున ప్రపంచం
2024 జనవరి నాటికి తొమ్మిది అణ్వాయుధ దేశాల(ఎన్9) దగ్గర 12,121 అణ్వాస్త్రాలు ఉన్నాయని ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్’ నివేదిక చెబుతోంది. ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు, ఆధునికీకరించుకునేందుకు ఈ దేశాలు (భారత్ సహా) గత ఏడాది ఏకంగా 9,100 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి. రష్యా, అమెరికా వద్ద ఉన్నన్ని ఖండాంతర క్షిపణులను సిద్ధం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని కూడా ఈ నివేదిక తెలియజేస్తోంది. ఇది దక్షిణాసియాకు క్షేమకరం కాకపోగా, పరోక్షంగా భారత్‌కు కూడా ముప్పే. శక్తిమంతమైన దేశాల మధ్య వ్యూహాత్మక అంశాల విషయంలో సమాచార వినిమయం జరగకపోవడం ఈ పరిస్థితికి కారణం. కనుచూపు మేరలో ఇది మెరుగుపడే సూచనలూ లేకపోవడం ఆందోళనకరం.ప్రపంచ వినాశనానికి హేతువు కాగల అణ్వస్త్రాలు మరోసారి పడగ విప్పుతున్నాయి. గత నెల పదిహేడున విడుదలైన రెండు అంతర్జాతీయ స్థాయి నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ భద్రతను సవాలు చేస్తున్నాయి. మొదటి రిపోర్టును ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్(ఐసీఏఎన్ ) విడుదల చేయగా... రెండోదాన్ని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ–సిప్రి) విడుదల చేసింది. రెండింటిలోని సమాచారం మానవాళిని హెచ్చరించేది మాత్రమే కాదు... భయపెట్టేది కూడా.ఆకలి కంటే అణ్వాయుధాలే మిన్నా?ఐసీఏఎన్ రిపోర్టు ప్రకారం, ప్రపంచం మొత్తమ్మీద అణ్వాయుధ సామర్థ్యమున్న తొమ్మిది దేశాలు (అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్ ్స, ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ , ఉత్తర కొరియా) తమ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు, ఆధునికీకరించుకునేందుకు గత ఏడాది ఎకాఎకి 9,100 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి. అన్ని దేశాల సమర్థింపు ఒక్కటే... ‘ఇతరుల’ నుంచి ముప్పు ఉందని! 2023లో అందరూ ఊహించినట్టుగానే అమెరికా అత్యధికంగా 5,150 కోట్ల డాలర్లు అణ్వాయుధాలపై ఖర్చు చేయగా... చైనా (1,180 కోట్ల డాలర్లు), రష్యా (830 కోట్ల డాలర్లు) ఖర్చు చేసినట్లు ఐసీఏఎన్ నివేదిక తెలిపింది. ‘‘గత ఏడాది ఈ తొమ్మిది దేశాలు కలిసికట్టుగా ప్రతి సెకనుకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టాయి’’ అని ఐసీఏఎన్ డైరెక్టర్ మెలిస్సా పార్క్ తెలిపారు. ఈ మొత్తం ప్రపంచం మొత్తమ్మీద ఆకలిని అంతం చేసేందుకు అవసరమయ్యే నిధులకంటే చాలా ఎక్కువని ఆమె వివరించారు. ఇంత మొత్తాన్ని మొక్కలు నాటేందుకు ఉపయోగించి ఉంటే ఒక్కో నిమిషానికి కనీసం పది లక్షల మొక్కలు నాటి ఉండవచ్చు అని మెలిస్సా అన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భూమ్మీద మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతున్న ఈ తరుణంలో ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే అంశాన్ని ఎత్తడం ఎంతైనా మంచి విషయమే కదా? ఈ ఏడాది వేసవి ఎంత మంట పుట్టించిందో, వడగాడ్పులకు ఎంతమంది మరణించారో మనకు తెలియంది కాదు. మనుషుల నిష్పత్తితో పోల్చినప్పుడు ఉండాల్సినన్ని వృక్షాలు లేకపోవడం వల్ల చాలా దేశాలు అనేక వాతావరణ సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశంలో పెద్ద దేశాల్లోకీ ఇండియా అత్యంత ఎక్కువగా ప్రభావితం అవుతోంది.సిప్రి ఇయర్‌బుక్–2024 అంతర్జాతీయంగా భద్రత విషయంలో వస్తున్న మార్పులేమిటి? ఆయుధాలు, టెక్నాలజీ రంగాల్లోని ముఖ్య పరిణామాలు ఏమిటి? అనేది సమగ్రంగా వివరిస్తుంది. దేశాల మిలిటరీ పెడుతున్న ఖర్చులు, ఆయుధాల ఉత్పత్తి, వ్యాపారాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఘర్షణలను కూడా ఈ ఇయర్ బుక్ వివరిస్తుంది. సంప్రదాయ ఆయుధాలతోపాటు అణ్వస్త్రాలు, జీవ, రసాయన ఆయుధాలపై కూడా ఇది దృష్టి పెడుతుంది. అణ్వాయుధాలకు సంబంధించి ఇందులో దాదాపు వంద పేజీల విలువైన సమాచారాన్ని పొందుపరిచారు. పెరిగిన చైనా అణ్వాయుధాలు...సిప్రి నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య మాత్రమే కాదు... అందులో రకాలు కూడా పెరిగాయి. మొత్తం తొమ్మిది దేశాలు అణ్వాయుధాల ద్వారా మాత్రమే తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవచ్చునని అనుకుంటున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్నే తీసుకోండి. హద్దులు దాటొద్దని నాటోను హెచ్చరించేందుకు రష్యా అణ్వాయుధాలను వాడేందుకు వెనుకాడమని చెబితే... బదులుగా నాటో, అమెరికా కూడా అణ్వాస్త్రాలతో యుద్ధానికి సిద్ధమన్నట్టు కాలు దువ్వుతున్నాయి.2024 జనవరి నాటికి తొమ్మిది అణ్వాయుధ దేశాల(ఎన్9) దగ్గర దాదాపు 12,121 అణ్వాస్త్రాలు ఉన్నాయని సిప్రి నివేదిక చెబుతోంది. ఇందులో 9,585... వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు... వీటిల్లో 3,904 అణ్వాస్త్రాలు ఇప్పటికే నిర్ణీత ప్రదేశాల్లో ఏర్పాటు చేశారనీ, 2,100 అణ్వస్త్రాలను ఆపరేషనల్ అలర్ట్‌తో ఉంచారనీ కూడా సిప్రి ఇయర్ బుక్ చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఆపరేషనల్ అలర్ట్‌తో ఉన్న అణ్వాయుధాలు ఈ ఏడాది దాదాపు వంద ఎక్కువ కావడం గమనార్హం. ప్రపంచం మొత్తమ్మీద ఉన్న అణ్వాయుధాల్లో 88 శాతం అమెరికా, రష్యాల వద్దే ఉండటం గమనార్హం. అయితే చైనా అణ్వాయుధ సంపత్తి 2023 నాటి 410 నుంచి ఈ ఏడాది జనవరి నాటికి 500కు చేరడం ఆందోళన కలిగించే అంశమని సిప్రి నివేదిక తెలిపింది. చైనా తన అణ్వాయుధాలను ఆధునికీకరించుకుంటోందనీ, రానున్న దశాబ్ద కాలంలో ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉందనీ సిప్రి నివేదిక తెలియజేస్తోంది. ‘‘రష్యా, అమెరికాల వద్ద ఉన్నన్ని ఐసీబీఎం(ఖండాంతర క్షిపణు)లను సిద్ధం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది’’ అని ఈ నివేదిక రచయితలు తెలిపారు. చైనా తననితాను అమెరికాకు ప్రత్యర్థిగా భావించవచ్చు కానీ... చైనా ఈ మధ్యకాలంలో అణ్వాయుధాలను సిద్ధం చేయడం ఎక్కువ కావడం దక్షిణాసియా ప్రాంత భద్రతకు ఏమంత మంచిది కాదు. ఇంకోలా చెప్పాలంటే భారతదేశానికి కూడా పరోక్ష ముప్పు పొంచి ఉందన్నమాట! కనబడని కాంతిప్రచ్ఛన్న యుద్ధ కాలంలో, 1945 –1991 మధ్యన అమెరికా, ఆ దేశాన్ని బలపరిచే యూకే, ఫ్రాన్ ్సలు ఒక పక్క... ఒకప్పటి సోవియట్ రష్యా మరో పక్క అన్నట్టుగా అణ్వాయుధ పోటీ నడిచింది. 1962 నాటి క్యూబన్ మిస్సైల్ ఉదంతం తరువాత ఇరు పక్షాలు కూడా అణ్వస్త్ర నిరోధకతకు అనుకూలంగా కొంత తగ్గాయి. ఆయుధాల నియంత్రణ, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ వంటి అంశాల ఆధారంగా ఈ సంయమనం సాధ్యమైంది. 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసింది మొదలు ప్రపంచం అణ్వస్త్రాల విషయంలో రెండుగా విడిపోయింది. ఒకటేమో అమెరికా నేతృత్వంలోని మిలిటరీ భాగస్వాములుగా మారితే... రెండోదేమో రష్యా– చైనా, జూనియర్ పార్ట్నర్గా ఉత్తర కొరియా కూటమిగా నిలిచాయి. భారత్, పాకిస్తాన్ , ఇజ్రాయెల్ ఏ కూటమిలోనూ చేరలేదు. కాకపోతే వాటి భౌగోళిక స్థితిని బట్టి ఎవరు ఎటువైపు అన్నది స్పష్టమే. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒకసారి ఆలోచిస్తే 2022 నాటి నుంచి ప్రపంచం మొత్తమ్మీద శక్తిమంతమైన దేశాల మధ్య వ్యూహాత్మక అంశాల విషయంలో సమాచార వినిమయం పెద్దగా జరగడం లేదని చెప్పాలి. అమెరికా దేశీయంగా ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటోంది. డోనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకోపక్క ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగించాలనే నిశ్చయాభిప్రాయంతో రష్యా ఉంది. చైనా కూడా తన సరిహద్దుల విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. నిజంగానే ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పు అని చెప్పాలి. ఐసీఏఎన్ , సిప్రి నివేదికలు ఈ ముప్పునే సవివరంగా వివరిస్తున్నాయి. కనుచూపు మేరలో పరిస్థితి మెరుగుపడే సూచనలూ లేవని చెబుతూండటం కఠోర సత్యం.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ఢిల్లీలోని సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వీసా లేకుండా 62 దేశాలు చుట్టొచ్చు
సాక్షి, అమరావతి: వీసా రహిత విదేశీ పర్యటనలకు భారతీయ పాస్‌పోర్టు విస్తృత అవకాశం కల్పిస్తోంది. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక అద్భుతాలను అన్వేíÙంచడానికి మార్గాన్ని సులభతరం చేస్తోంది. యూకేకు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్–2024 నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. గతేడాది నుంచి పాస్‌పోర్టు ర్యాంకింగ్స్‌లో భారత్ స్థిరంగా ఉన్నప్పటికీ, వీసా రహిత గమ్యస్థానాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వీసా అవసరంలేకుండా భారతీయులు ప్రయాణించగలిగే దేశాల సంఖ్య 57 నుంచి 62కు పెరిగింది. ముఖ్యంగా భారతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతోనే ఆగ్నేయాసియా, యూరప్, ఆఫ్రికా, కరేబియన్ దేశాలు తమ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, సహజమైన బీచ్‌లు, సాంస్కృతిక ప్రదేశాల్లో వీసా రహిత ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి. టాప్‌లో ఆరు దేశాలు.. అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు ప్రయాణాల్లో ఆసియా, ఐరోపా దేశాలు అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. 👉 సింగపూర్, జపాన్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలు 227 విదేశీ గమ్యస్థానాలకుగాను 194 ప్రదేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తున్నాయి. 👉 దక్షిణ కొరియా, స్వీడన్, ఫిన్లాండ్ల పాస్‌పోర్టులు 193 గమ్యస్థానాలకు యాక్సెస్‌గా ఉంటూ రెండో స్థానంలో.. 👉 ఆ్రస్టియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ 192 దేశాలకు ఉచిత వీసా అనుమతులను అందిస్తూ మూడో స్థానంలో నిలుస్తున్నాయి. 👉యూఏఈ గడిచిన దశాబ్దంగా అత్యతంగా వేగంగా వృద్ధి చెందుతూ 11వ స్థానానికి చేరుకుని 183 దేశాల్లో ఫ్రీ వీసా ప్రయాణ సౌలభ్యాన్ని సాధించింది. 👉 ఇక గతేడాదితో పోలిస్తే చైనా రెండు స్థానాలు ఎగబాకి 62వ స్థానంలో 85 దేశాలకు వీసాలేని ప్రయాణాలకు అనుమతిస్తోంది. ఏడో స్థానానికి యూఎస్ వీసా పరిమితం.. అమెరికా పాస్‌పోర్టు సామర్థ్యం దశాబ్దకాలంలో దిగజారింది. 2006–2014 మధ్య అగ్రస్థానంలో కొనసాగగా 2020 నుంచి ఏడో స్థానానికి పరిమితమైంది. పాస్‌పోర్టు ర్యాంకుల్లో ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగున నిలుస్తూ కేవలం 28 దేశాలకు మాత్రమే ఫ్రీ వీసా ప్రవేశాలు లభిస్తున్నాయి. సిరియా 29, ఇరాక్ 31, పాకిస్తాన్ 34, యెమెన్ 35 దేశాలకు ఉచిత వీసా ప్రయాణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీసా అవసరంలేకుండా సగటు ప్రయాణికులు వెళ్లిన గమ్యస్థానాల సంఖ్య 2006లో 58 నుంచి 2024 నాటికి 111కి రెట్టింపు కావడం విశేషం.భారత్ పాస్పోర్టుతో వీసాలేకుండా ప్రయాణించే దేశాలు..అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, కుక్ దీవులు, జి»ౌటి, డొమినికా, ఎల్ సల్వడార్, ఇథియోపియా, ఫిజీ, గాబన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేసియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజఖస్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావో (ఎస్ఏఆర్ చైనా), మడగాస్కర్, మలేసియా, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేíÙయా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా,ౖ సమోవా, సెనెగల్, సీషెల్స్, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్–నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్–గ్రెనడైన్స్, టాంజానియా, థాయ్‌లాండ్, తైమూర్–లెస్టే, ట్రినిడాడ్–టొబాగో, ట్యునీíÙయా, తువాలు, వనాటు, జింబాబ్వే. -
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
ఓటరా..! ఓటు వేయడం మీ బాధ్యత! అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రజలను చైతన్యపరుస్తుంది. పైగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే యత్నం కూడా చేస్తోంది.. అంతేగాక టీవీ, సామాజిక మాధ్యమాలతో సహా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే "దేవుడు హుండీలో డబ్బులు వేయడం కాదు! దేశం కోసం ఓటు వేయడం నేర్చుకో!, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకోవడం మన కర్తవ్యం వంటి మాటలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంతలా చేసినా చాలా వరకు ముఖ్యంగా విద్యావంతులే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది కూడా. అయితే ఇలా ఓటు హక్కుని వినియోగించకపోతే కొన్ని దేశాల్లో అధికారులు అస్సలు ఊరుకోరట. చాలా దారుణమైన శిక్షలు విధిస్తారట. అవేంటో తెలుసుకుందామా.!బెల్జియంఇక్కడ వరుసగా నాలుగుసార్లు ఓటు వేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఆస్ట్రేలియాఇక్కడ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది.సింగపూర్ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఆ వ్యక్తుల ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుందిగ్రీస్ఇక్కడ ఏకంగా ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్ నమోదవుతుంది..(చదవండి: పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!) -
వయసు@ 70..సోలో ట్రావెలర్
‘‘వయసు కాదు ప్రతి ఒక్కరూ తమ హృదయ లయను అర్ధం చేసుకొని, దానిని అనుసరించాలని నమ్ముతాను. ఇతరుల గుండె చప్పుడులో జీవించాలని ఎప్పుడూ అనుకోవద్దు’’ అంటోంది రిటైర్డ్ ప్రోఫెసర్ జైపూర్‌వాసి నీరూ సలూజా. జీవితం ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్ బయటే ఉంటుందనే వాస్తవాన్ని గట్టిగా నమ్మే ఈప్రోఫెసర్ డెభ్లై ఏళ్ల వయసులో సోలో ట్రావెలర్‌గా 80 దేశాలు చుట్టొచ్చింది. భిన్న సంస్కృతులను, పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి, ఎంతో మందిని కలుసుకొని కొత్త ఉత్తేజాన్ని ΄పొందడానికి ఈ ప్రయాణం ఎంతగానో తోడ్పడింది అని చెబుతుంది. ‘‘ఫసిపిక్లోని గాలా పాగోస్ దీవుల నుండి అట్లాంటిక్ మంచుతో నిండిన క్షితిజాల వరకు చేసిన పర్యటనల ద్వారా ఎన్నో స్మారక చిహ్నాలను సేకరించాను. వాటితో అలంకరించిన నా ఇంటిని చూసిన వాళ్లు ప్రపంచ మ్యాప్‌లా ఉంటుందని అంటారు. ఈ జ్ఞాపకాలు అన్నీ ఇప్పటి వరకు నేను చేసిన సాహసాలను గుర్తుచేస్తాయి. ఇంకా నా ఇంటి గోడలపై మిగిలిన ఖాళీ స్థలాలు రాబోయే చిహ్నాల కోసం నాతో సవాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. కల వెనకాల రహస్యం నాకు ప్రయాణాల పట్ల ఆసక్తి కలగడానికి స్కూల్ రోజుల్లోనే బీజం పడింది. స్కూల్‌కి సైకిల్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురై ఎడమ కాలు విరిగింది. ఫిజియోథెరపీ సెషన్లతో పాటు నెలల తరబడి బెడ్‌రెస్ట్‌లో ఉండిపోయాను. ఇతర పిల్లలు స్కూల్లో ఉంటే నేను గదికి పరిమితం అయ్యాను. అప్పుట్లో వినోదానికి టీవీ లాంటి ఏ సాధనమూ లేదు. దీంతో పడకగదిలోని కిటికీలోంచి బయటకు చూస్తూ గంటల తరబడి కాలం గడపవలసి వచ్చింది. అక్కడ నుంచి ఆకాశం కేసి చూస్తూ ఉండేదాన్ని. ప్రపంచాన్ని అన్వేషించాలనుకునేదాన్ని. దాదారు ఆరు దశాబ్దాల తరువాత అలా నా కల నిజమైంది. ప్రేమ వారసత్వం కాలేజీలోప్రోఫ్రెసర్గా ఉద్యోగ నిర్వహణ, భార్యగా విధులు, తల్లిగా బాధ్యతలు, ఇంటి నిర్మాణం.. అన్నీ నిర్వర్తించాను. నా పిల్లలు స్థిరపడ్డారు. నా భర్తతో కలిసి చాలా టూర్లకు వెళ్లేవాళ్లం. ఆయన నాకు భర్త మాత్రమే కాదు నా ట్రావెలర్ ఫ్రెండ్ కూడా. 2010లో ఆయన మరణించడంతో మా ప్రేమ వారసత్వాన్ని నేను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండలేను. ఆ విధంగా ఎనభైకి పైగా దేశాలను చుట్టొచ్చాను. ప్రపంచాన్ని అన్వేషించగలగడం ఒక అదృష్టంగా భావించకూడదు. అదొక ప్రయాణం. దృష్టి కోణాన్ని మార్చింది మొదటి ఒంటరి ప్రయాణం మాత్రం నాకు ఒక సాహసమే అని చెప్పగలను. 2014లో యూరప్ క్రిస్మస్కి క్రూయిజ్ ద్వారా వెళ్లాను. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఒంటరిగా ప్రయాణించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ యాత్రతో నాకు అర్ధమైంది. నిరుత్సాహమైనదని కొందరు అంటుంటారు. కానీ, నేనది అంగీకరించను. ప్రయాణ ప్రణాళికను బాగా ΄్లాన్ చేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందు తెలుసుకున్నాను. మనతో ఒకరు తోడు కావాలనుకుంటే మాత్రం మార్గంలో ఎంతో మంది కొత్త స్నేహితులు కలుస్తారు. కాబట్టి నిజంగా ఒంటరిగా ఉన్నాననే ఆలోచనే రాదు. ఈ యాత్ర నా దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చింది. ఒంటరిగా ప్రయాణించడం, గన్యాలను, ప్రయాణ మార్గాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదే ఒక సమూహం, కుటుంబ పర్యటన అయితే ఒక సమయపాలనకు కట్టుబడి ఉండాలి. ఆ గ్రూప్‌లో ఎవరు ఏం చేస్తారో మీరూ అదే చేయాల్సి ఉంటుంది. కానీ, ఒంటరి యాత్రికుల విషయంలో అలాంటి డిమాండ్స్ ఏవీ ఉండవు. అడుగడుగునా ఉత్సుకత నా జీవితంలో అతి ఎక్కువగా గుర్తుండిపోయేది 2017 చలికాలంలో స్వీడన్ పర్యటన. నార్తర్న్ లైట్స్‌కు ప్రసిద్ధి చెందిన స్టాక్ హోమ్ నుండి అబిస్కోకు రైలు ఎక్కడం ద్వారా ఇది ప్రారంభమైంది. మన దేశం రైళ్లకు, అక్కడి రైళ్లకు ఏ మాత్రం పోలిక లేదు. బోర్డింగ్‌లో ప్రతి వ్యక్తికీ వాష్‌రూమ్‌కి ఒక కీ ఇస్తారు. అదొక ఖరీదైన హోటల్ లాంటిది. అక్కడి బాత్రూమ్లో ఒక గంట సమయం గడపాలనుకున్నాను. తిరిగి కంపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు అది లాక్ అయిపోయింది. ఎవరూ సాయం చేసేవాళ్లు లేరు. కంగారు పడ్డాను. కానీ, చివరకు మార్గాన్ని కనుక్కోగలిగాలను. ఇలాంటి ఎన్నో ఉత్కంఠలు, ఉత్సుకతలు, సాహసాలు.. ఒక్కరోజులో చెప్పలేను. అబిస్కోలో ఒక మంచు గదిలో బస. అక్కడ అది ఎంతో అందంగా, సహజంగా ఉంది. కానీ, బాత్రూమ్లు లేవని ఆలశ్యంగా తెలసింది. అక్కడ పడిన పాట్లు ఒక్క మాటలో చెప్పలేను. మాస్కో నుండి బీజింగ్ వరకు ట్రాన్స్ –సైబీరియన్ రైలు ప్రయాణం.. అదొక ప్రపంచం. మెల్బోర్న్లో 12 వేల అడుగుల నుండి స్కై డైవింగ్ చేయడం అత్యంత ఉత్కంఠను కలిగించింది. ఇలా చెబుతూ పోతే ఎన్నో జ్ఞాపకాలు. ఒక స్వేచ్ఛ విహంగమై చేస్తున్న ప్రయాణం నాకు ఎన్నో తీరాలను పరిచయం చేస్తోంది’’ అని వివరిస్తుంది ఈ ట్రావెలర్. -
రంజాన్ నెలలో ఖర్జూరం ఎందుకు తింటారు? ఏ దేశంలో ఉత్పత్తి అధికం?
ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరాన్ని ఇష్టంగా తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. రంజాన్ మాసంలో ఖర్జూరానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉపవాసం ఉండేవారికి తగిన బలాన్ని అందిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించడానికి ఇదే ప్రధాన కారణం. అయితే మన తినే ఖర్జూరాలు ఏ దేశం నుండి వచ్చాయనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలాగే ఏ దేశం అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తుందనేది కూడా చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం దేశాలు అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేసే దేశం ఈజిప్ట్. ఈ దేశంలో ఏడాదికి దాదాపు 1,733,432 టన్నుల ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తారు. ఖర్జూరం ఉత్పత్తిలో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 1,610,731 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఏడాదిలో 1,247,403 టన్నుల ఖర్జూరాలు పండే అల్జీరియా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. నాల్గవ స్థానంలో ఇరాన్ ఉండగా, ఇక్కడ ఒక సంవత్సరానికి 1,030,459 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 7,32,935 టన్నుల ఖర్జూరం పండుతుంది. ఈ దేశాల నుంచి విదేశాలకు ఖర్జూరాలు ఎగుమతి అవుతాయి. -
విదేశాల్లో ‘మినీ ఇండియా’లు?
భారత్‌కు వెలుపల అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాలు ఏవో మీకు తెలుసా? మారిషస్, యూకే, యూఏఈ, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కొన్ని దేశాల్లో ‘మినీ ఇండియా’లు కూడా ఉన్నాయి. ఇక్కడ భారతీయుల ఇళ్లను సులభంగా గుర్తించవచ్చు. అవి ఏఏ దేశాలో ఇప్పుడు తెలుసుకుందాం. మారిషస్ మారిషస్‌లో 70శాతం జనాభా భారతీయులని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సాంస్కృతికరంగ స్వర్గధామం. ఇక్కడ భారతీయ ఆహార ఖజానా విరివిగా కనిపిస్తుంది. ఇది విదేశాల్లో స్థిరపడాలనుకున్న భారతీయుల ఉత్తమ ఎంపిక అని అంటారు. యూకే భారతదేశం- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. యూకేలో కనిపించే భారతీయ రెస్టారెంట్లు, దుకాణాలు దీనికి తార్కాణంగా నిలుస్తాయి. యూకేలో భారత సంస్కృతి కనిపిస్తుంది. యూకేలోని కొన్ని ప్రాంతాలు.. మనం భారత్‌లోనే ఉన్నామా అని అనిపించేలా ఉంటాయి. యూకేలోనూ భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్‌లో ఎక్కడికి వెళ్లినా భారతీయులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్నట్టేనని చాలామంది అంటుంటారు. యూఏఈ మొత్తం జనాభాలో భారతీయులు 42 శాతం ఉన్నారు. సౌదీ అరేబియా సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 10 శాతం నుంచి 13 శాతం వరకూ భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది. కెనడా మెరుగైన ఉద్యోగావకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తదితర అదనపు ప్రయోజనాలు భారతీయులను కెనడావైపు మళ్లేలా చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం కెనడాలో గణనీయ సంఖ్యలో భారతీయులున్నారు. ఒమన్ ఒమన్ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 20 శాతం ఉన్నారు. 2023 నాటికి ఒమన్‌లో దాదాపు తొమ్మది లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఒమన్‌లోని భారతీయులు అక్కడి సాంస్కృతిక వైభవానికి తోడ్పాటునందిస్తున్నారు. సింగపూర్ 2023లో సింగపూర్‌లో భారతీయుల జనాభా ఏడు లక్షలు. సింగపూర్ ప్రభుత్వం ‘లిటిల్ ఇండియా’ ప్రాంత అభివృద్ధికి చేయూతనందిస్తోంది. సింగపూర్ సాంస్కృతిక వైభవానికి అక్కడి భారతీయులు తోడ్పాటునందిస్తున్నారు. అమెరికా అమెరికాలో అత్యధిక సంఖ్యలో భారతీయులున్నారు. ప్రపంచంలో తమది రెండవ అతిపెద్ద భారతీయ ప్రవాసులు కలిగిన దేశమని యునైటెడ్ స్టేట్స్ పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కెరీర్‌ను మెరుగుపరుచుకోవడంలో పాటు పలు వ్యాపారాలు చేపడుతున్నారు. -
విదేశాల్లోని ప్రముఖ శివాలయాలివే..
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం, శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి 2024, మార్చి 8న వచ్చింది. ఆ రోజున శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. మహాశివుడు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పూజలందుకుంటున్నాడు. విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం(నేపాల్) మన పొరుగు దేశం నేపాల్‌లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శివాలయం పశుపతినాథ్ మందిరం. శివరాత్రినాడు లక్షలాది శివభక్తులు ఇక్కడికి మహాశివుని దర్శనం కోసం తరలివస్తారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. పశుపతినాథుని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారికి మరో జన్మలో జంతు రూపం రాదని నమ్ముతారు. మున్నేశ్వరం (శ్రీలంక) నేపాల్‌లో మాదిరిగానే శ్రీలంకలోనూ అత్యంత పురాతన శివాలయం ఉంది. దాని పేరు మున్నేశ్వరం. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుని వధించిన తరువాత రాముడు తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి ఈ ఆలయంలో పూజించాడని అంటారు. శివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారుతుంది. శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం(మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం.. ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని గాజుతో నిర్మించారు. ఆలయంలోని గోడలపై సుమారు మూడు లక్షల రుద్రాక్షలను పొదిగారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ఈ ప్రసిద్ధ శివాలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో ఉంది. ప్రంబనన్ ఆలయం ఎనిమిది దేవాలయాల సమూహం. ఈ ఆలయం 850 బీసీలో నిర్మితమయ్యింది. ఈ శివాలయం గోడలపై విష్ణువు, హనుమంతుడు, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవుళ్ళు, దేవతల గురించిన వివరాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం దీప కాంతులతో వెలిగిపోతుంది. ముక్తి గుప్తేశ్వరాలయం (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్తేశ్వరాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ శోభ రెండింతలవుతుంది. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉంది. ఈ ఆలయం చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. -
ముంచెత్తుతున్న మాంద్యం
ఒకవైపు యుద్ధాలు. మరోవైపు పర్యావరణ మార్పులు. కారణాలేమైతేనేం... ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది... ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తగ్గుదల నమోదైతే సాంకేతికంగా దాన్ని మాంద్యం కిందే పరిగణిస్తారు. 2023 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి జపాన్, బ్రిటన్ రెండూ ఈ మాంద్యం బారిన పడ్డాయి. ఇవి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో ఈ పరిణామం సర్వత్రా చర్చనీయంగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు ప్రస్ఫుటమవున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే మాంద్యం బారిన పడ్డవి కొన్ని కాగా మరికొన్ని అతి త్వరలో ఆ ముప్పు దిశగా సాగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. జపాన్, బ్రిటన్‌తో పాటు ఐర్లండ్, ఫిన్లండ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో సాంకేతిక ఆర్థిక మాంద్యం బారిన పడ్డాయి. ఐర్లండ్ జీడీపీ మూడో త్రైమాసికంలో 0.7 శాతం తగ్గగా నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే ఏకంగా 1.9 శాతం తగ్గుదల నమోదు చేసింది! ఫిన్లండ్ జీడీపీలో వరుసగా 0.4, 0.9 శాతం తగ్గుదల నమోదైంది. నిజానికి చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చాలా దేశాల నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వెల్లడయ్యాక సాంకేతిక మాంద్యం జాబితాలోని దేశాల సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోంది. అయితే కనీసం మరో 10 దేశాలు జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ తగ్గుదలను చవిచూశాయి. ఈ జాబితాలో కెనడా, న్యూజిలాండ్‌తో పాటు డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా, ఈక్వెడార్, బహ్రయిన్, ఐస్లాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వీటిలో డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా మూడో త్రైమాసికంలోనే ఆర్థిక మాంద్యం నమోదు చేశాయి! ఇవేగాక తాజాగా నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలైన మరో 9 దేశాల్లో కూడా జీడీపీ తగ్గుదల నమోదైంది. వీటిలో ఆరు దేశాల్లో ఇటీవలి కాలంలో జీడీపీ తగ్గుదల నమోదవడం ఇదే తొలిసారి! జీడీపీ తగ్గుదల జాబితాలో జర్మనీ వంటి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉండటం యూరప్‌ను మరింత కలవరపెడుతోంది. ఇది మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగో త్రైమాసికంలో యూరో జోన్ జీడీపీ వృద్ధి సున్నాగా నమోదవడం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. ఫ్రాన్స్ కూడా మాంద్యం బాట పడుతున్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ భారత్‌పై ప్రభావమెంత...? ఆర్థిక వృద్ధి విషయంలో భారత్‌కు ప్రస్తుతానికి పెద్ద సమస్యేమీ లేదు. మూడో త్రైమాసికంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. నాలుగో త్రైమాసిక అంచనా 6 శాతంగా ఉంది. కాకపోతే ప్రపంచీకరణ యుగంలో ప్రపంచవ్యాప్త పరిణామాలు భారత్‌పైనా కచి్చతంగా ప్రభావం చూపనున్నాయి. పైగా మన మొత్తం ఎగుమతుల్లో 10 శాతం వాటా మాంద్యం జాబితాలోని ఆరు పెద్ద దేశాలదే! వీటిలో బ్రిటన్‌కు 11 బిలియన్ డాలర్లు, జర్మనీకి 10 బిలియన్ డాలర్ల మేరకు మన ఎగుమతులున్నాయి. సేవలు, ఐటీ రంగంలో అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటన్నది తెలిసిందే. ఇక మాంద్యం కారణంగా ఆయా దేశాల్లో నమోదయ్యే ధరల పెరుగుదల మన దిగుమతులపైనా ప్రభావం చూపనుంది. మన దిగుమతుల్లో మాంద్యం బారిన పడ్డ జపాన్, ఆ ముప్పున్న జర్మనీ వాటా చెరో 17 బిలియన్ డాలర్లు! -
యూపీఐ పేమెంట్స్ ఏ దేశాల్లో చేయొచ్చో తెలుసా..
డిజిటల్ చెల్లింపులు వచ్చిన తరువాత భారతదేశంలో చిన్న కిరాణా షాపు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చేతిలో డబ్బు ఉంచుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. గత కొన్ని రోజుల ముందు వరకు యూపీఐ పేమెంట్స్ కేవలం దేశానికి మాత్రమే పరిమితమై ఉండేవి. కాగా మారుతున్న కాలంలో పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యూపీఐ పేమెంట్స్ విదేశాలకు కూడా వ్యాపించాయి. ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అనేది విదేశాల్లో కూడా చెల్లుబాటు అవుతుండటంతో ఆయా దేశాల కరెన్సీలతోనే చెల్లింపులు జరుగుతున్నాయి. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు ప్రత్యేకించి ఆ దేశ కరెన్సీని తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు భారతదేశంలో మాత్రమే కాకుండా.. సమీప దేశమైన శ్రీలంక, భూటాన్, మారిషస్, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, నేపాల్ దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. శ్రీలంకలో పర్యటించే భారతీయులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. మారిషస్ దేశంలో కూడా ఇండియన్స్ డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉంది. మారిషస్ వాసులకు కూడా మన దేశంలో ఆ సదుపాయం కల్పించారు, కాబట్టి వారు కూడా మనదేశంలో డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇండియాలో కాకుండా మొదటిసారి యూపీఐ సేవలను అనుమతించిన దేశం భూటాన్. 2012 జులై 13న ఆ దేశంలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని కోసం భీమ్ యాప్ & భూటాన్ రాయల్ మానిటరీ అథారిటీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి UAE, యూఏఈలోని ప్రధాన బ్యాంకు మష్రెక్‌తో కలిసి కొద్ది రోజుల క్రితం దేశంలో UPI చెల్లింపులను స్వీకరించడానికి సంబంధించి భారత ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఫ్రాన్స్ లైరా నెట్‌వర్క్‌తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే భాగస్వామ్య కుదుర్చుకున్నాయి. ఫోన్‌పే డేటాబేస్ ప్రకారం యూపీఐ చెల్లింపులకు మద్దతు ఇచ్చే బ్యాంకుల జాబితా.. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ ఇండియన్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్ పంజాబ్ & సింధ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ కాస్మోస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. -
‘ఐఎస్ఐఎస్’కి అడ్డాగా ఆఫ్రికా దేశాలు?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ‘ఐఎస్ఐఎస్’కి అనువైన గమ్యస్థానాలుగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పేదరికం,ఆకలితో పాటు పశ్చిమ ఆఫ్రికా దేశాలు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి. నైజర్, మాలి, బుర్కినా ఫాసో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ దేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు అక్కడి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ముప్పుగా పరిణమించాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ఐఎస్ఐఎస్’ విదేశాల్లో దాడులు చేయాలనుకుంటోందనే సమాచారం తమకు నిఘా వర్గాల ద్వారా అందిందని, అలాగే ఆ సంస్థ ఉగ్రవాదులు ఆఫ్రికన్ దేశాలను తమ కొత్త స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
ఇక్కడ అందరూ రిచ్.. రూ. కోటి సంపాదిస్తారు..!
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం ఏది అంటే చాలా మంది అమెరికా అని భావిస్తారు. కానీ ఆ దేశం కన్నా ధనిక దేశాలు చాలానే ఉన్నాయి. యూరప్‌లోని లక్సెంబర్గ్ దేశం ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీగా ఉంది. ఇక్కడ ప్రతిఒక్కరూ సగటున కోటి రూపాయలు సంపాదిస్తారంటే నమ్ముతారా? ఇలాంటి టాప్ సంపన్న దేశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. సాధారణంగా ఒక దేశం ఆర్థిక విజయాన్ని తలసరి జీడీపీ ఆధారంగా అంచనా వేస్తారు. అయితే ఇది వ్యక్తిగత ఆర్థిక శ్రేయస్సును చూపుతుంది. కానీ ఈ ప్రమాణం ద్వారా దేశాలను పోల్చడానికి వీలుండదు. 2022 సంవత్సరంలో తలసరి జీడీపీతోపాటు, ప్రజల కొనుగోలు శక్తి, ఉత్పాదకత ప్రమాణాల ఆధారంగా ‘ది ఎకనామిస్ట్ అండ్ సోల్స్టాడ్, సోండ్రే’ నుంచి వచ్చిన డేటా ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలేవో ఇప్పుడు చూద్దాం.. టాప్‌లో లక్సెంబర్గ్ తలసరి జీడీపీ ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో యూరప్ దేశమైన లక్సెంబర్గ్ టాప్‌లో ఉంది. 2022లో ఈ దేశం తలసరి జీడీపీ 1,26,426 డాలర్లు అంటే భారత్ కరెన్సీలో సుమారు రూ. కోటి. దీని ప్రకారం ఇక్కడ సగటున ప్రతిఒక్కరూ కోటి రూపాయలు సంపాదిస్తున్నారన్నమాట. ఇక కొనుగోలు శక్తిలోనూ ఈ దేశం టాప్‌లో ఉంది. అయితే ఉత్పాదత విషయంలో మాత్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో నార్వే అగ్ర స్థానంలో ఉంది. చిన్న దేశాలే మెరుగ్గా.. ఆర్థికంగా చిన్న దేశాలే మెరుగ్గా ఉన్నాయి. మొదటి 10 సంపన్న దేశాలను తీసుకుంటే వాటిలో ఎనిమిది దేశాల్లో జనాభా కోటి కంటే తక్కువే. తలసరి జీడీపీ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన లక్సెంబర్గ్‌లో జనాభా కేవలం 6.60 లక్షలు. దాని అనుకూలమైన పన్ను విధానాల కారణంగా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఈ చిన్న దేశం గణనీయమైన సంపద కారణంగా అక్కడి పౌరులు ఉచిత విద్య, వైద్యం, రవాణా సదుపాయాలను ఆనందిస్తున్నారు. -
ఈ పేర్లు పిల్లలకు పెడితే జైలుకే?
ఏ ఇంటిలోనైనా పిల్ల లేదా పిల్లవాడు పుడితే... ఏం పేరు పెట్టాలా?.. అని కుటుంబ సభ్యులంతా మల్లగుల్లాలు పడుతుంటారు. ఎవరికితోచిన పేరు వారు సూచిస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇంటి చుట్టుపక్కలవారు అందరూ రకరకాల పేర్లను చెబుతుంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో పిల్లల పేర్లకు సంబంధించి అనేక ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పేర్లను నిషేధించిన దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం. కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఆయా దేశాల్లో నిషేధించిన పేరు పెట్టినట్లయితే, వారు జైలు శిక్షను కూడా అనుభవించాల్సిరావచ్చు. ‘డైలీ స్టార్’తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లో పేరు పక్కన ఇంటిపేరు ఉంచుకోవడంపై నిషేధం లేదు. అయితే రిజిస్ట్రార్లు ఎలాంటి పేర్లను అంగీకరిస్తానేది తప్పకుండా గమనించాలి. పేరులో అభ్యంతరకర అక్షరాలు ఉండకూడదు. సంఖ్యలు లేదా చిహ్నాలు మొదలైనవి ఉపయోగించేటప్పుడు వాటిని సరిగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేయాలి. పేరు చాలా పొడవుగా ఉండకూడదు. అది రిజిస్ట్రేషన్ పేజీలో ఇచ్చిన కాలమ్‌లో సరిపోయినంతవరకే ఉండాలి. పేరు చాలా పెద్దగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. అమెరికన్ జనన ధృవీకరణ పత్రంలోని వివరాల ప్రకారం పిల్లలకు కింగ్, క్వీన్, జీసస్ క్రైస్ట్, III, శాంతా క్లాజ్, మెజెస్టీ, అడాల్ఫ్ హిట్లర్, మెస్సీయా, @, 1069 లాంటి పేర్లు పెట్టకూడదు. కొన్ని దేశాల్లో పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఏ దేశంలో ఏ పేరుపై నిషేధం? సెక్స్ ఫ్రూట్ (న్యూజిలాండ్) లిండా (సౌదీ అరేబియా) స్నేక్ (మలేషియా) ఫ్రైడే (ఇటలీ) ఇస్లాం (చైనా) సారా (మొరాకో) చీఫ్ మాక్సిమస్ (న్యూజిలాండ్) రోబోకాప్ (మెక్సికో) డెవిల్ (జపాన్) నీలం (ఇటలీ) సున్తీ (మెక్సికో) ఖురాన్ (చైనా) హ్యారియెట్ (ఐస్లాండ్) మంకీ (డెన్మార్క్) థోర్ (పోర్చుగల్) 007 (మలేషియా) గ్రిజ్మన్ ఎంబాప్పే (ఫ్రాన్స్) తాలులా హవాయి (న్యూజిలాండ్) బ్రిడ్జ్(నార్వే) ఒసామా బిన్ లాడెన్ (జర్మనీ) మెటాలికా (స్వీడన్) ప్రిన్స్ విలియం (ఫ్రాన్స్) అనల్ (న్యూజిలాండ్) నుటెల్లా (ఫ్రాన్స్) వోల్ఫ్ (స్పెయిన్) టామ్-టామ్ (పోర్చుగల్) కెమిల్లా (ఐస్లాండ్) జుడాస్ (స్విట్జర్లాండ్) డ్యూక్ (ఆస్ట్రేలియా) -
ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే..
ప్రతి దేశంలో ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలు ఉంటాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పలు కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలపై ఆధారపడి ఉంటుంటాయి. వాల్‌మార్ట్, ఫోర్డ్, రిలయన్స్ వంటి ‘కుటుంబ’ కంపెనీలు.. ఆయా దేశాల్లో ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఊతంగా నిలుస్తుంటాయి. ఈ అంశంపై తాజాగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ పరిశీలన జరిపింది. దేశాలవారీగా జీడీపీలో అక్కడి ‘వ్యాపార’ కుటుంబాల సంస్థల భాగస్వామ్యం ఎంత అన్న అంచనాలు వేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు క్యాపిటల్ మార్కెట్లలో కేవలం కుటుంబ కంపెనీల వాటానే 27 శాతం ఉంటుందని తేల్చింది. ఇది మరింతగా పెరుగుతూనే ఉందని పేర్కొంది. ‘వ్యాపార’ కుటుంబాల ఆదాయ శాతంలో ఇండియా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ఏటా దేశ జీడీపీలో 79 శాతం వరకు పెద్దా, చిన్నా ‘కుటుంబ’ వ్యాపారాల నుంచే సమకూరుతున్నట్టు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా వేసింది. ఈ విలువ 245 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! విలువపరంగా ‘వ్యాపార’ కుటుంబాలు సమకూర్చుతున్న మొత్తాన్ని చూస్తే.. రూ.1,205 లక్షల కోట్లతో అమెరికా ప్రపంచంలో టాప్‌లో ఉంది. 821 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. వీటి తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది. -
న్యూ ఇయర్ వేడుకలు మొదటగా ప్రారంభమయ్యే దేశం ఇదే..!
2023కి ఈ రోజుతో వీడ్కోలు చెప్పేసి కొత్త ఏడాది 2024కి స్వాగతం పలికేందుకు అందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. ఎలా సెలబ్రెట్ చేసుకోవాలి, ఈ ఏడాది అంతా మంచే జరిగేలా ఏం చేయాలి అనే ప్రణాళికలతో తలమునకలై ఉన్నారు కూడా. ఎలాంటి చేదు అనుభవాలు, బాధలు, కన్నీళ్లు చవిచూసినా ఈ ఏడాది అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ఆశావాహ దృక్పథంతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాం. ఈ సందర్భంగా ఏయే దేశాలు న్యూ ఇయర్‌కి ముందుగా స్వాగతం పలుకుతాయి. టైమింగ్స్ ప్రకారం ఏయే దేశాల్లో ముందుగా వేడుకలు జరిపోతాయి తదితరాలు గురించి తెలుసుకుందామా!. అందరికి న్యూ ఇయర్ ఒకే రోజు మొదలైనప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం జస్ట్ కొన్ని గంటల తేడాతో ముందుగా జరిగిపోతాయి. ప్రపంచదేశాల్లో కాలమానాల ప్రకారం కాస్త అటు ఇటుగా ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అలాంటి దేశాలు ఏవంటే.. ముందుగా సెలబ్రేట్ చేసుకునే దేశాలు.. ఫసిపిక్ దీవులైన టోంగా, సమోవా, కిరిబాటి, న్యూజిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటలుకే వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక న్యూజిలాండ్‌లో మాత్రం ఈ రోజు సాయంత్రం నుంచే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమైపోతాయి. ఇదే సమయాలనికి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాయి. ఇక భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల మనకంటే 30 నిమిషాల ముందు కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి. చివరిగా జరుపుకునే దేశాలు.. జనావాసాలు లేని హౌలాండ్, బేకర్ దీవులలో అయితే భారత కాలమానం ప్రకారం జనవరి 1, సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. ఇక్కడే చివరిగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అంతేగాదు భారత్‌లో జరిగిన తర్వాత నాలుగున్నర గంటలకు సుమారు 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాది 2024కి స్వాగతం చెబుతాయి. వాటిలో నార్వే, ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా దేశాల తోపాటు కాంగో అంగోలా, కామెరూన్ వంటి ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి. భారత్ తర్వాత 5.30 గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్ మొదలవుతుంది. అలాగే అమెరికాలో భారత కాలమానం ప్రకారం జనవరి1 ఉదయం స్వాగతం పలుకుతుంది. కాగా, భారతదేశంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే సమయానికే శ్రీలంక వాసులు కూడా వేడుకలు జరుకోవడం విశేషం. (చదవండి: వీధి కుక్కకు సెక్యూరిటీ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న నెటిజన్లు! ఎందుకో తెలుసా?) -
స్వలింగ వివాహాలు ఏయే దేశాల్లో చట్టబద్ధమో తెలుసా?
దేశంలో స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో అంతర్గత విషయం అని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇది కుటుంబంలో భాగం కావాలనేది మానవ లక్షణంలో ప్రధాన భాగమని, స్వీయ అభివృద్ధికి ఇది ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తాము ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టంలోని చట్టపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తున్నామని, వాటిని గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రత్యేక వివాహ చట్టం (SMA) సవరణ అంటే దేశాన్ని స్వాతంత్ర్య పూర్వ యుగానికి తీసుకుపోవడమేనని చంద్ర చూడ్ వ్యాఖ్యానించారు. కేవలం పార్లమెంట్ ద్వారానే స్పెషల్ మ్యారేజ్ యాక్టులో మార్పులు చేయాలని సూచించారు. శాసన వ్యవహారాల్లోకి కోర్టు జోక్యం చేసుకోదని సీజే స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల కలయికను లైంగిక ధోరణి ఆధారంగా పరిమితం చేయలేమన్నారు. క్వీర్ జంటలతో సహా అవివాహిత జంటలు సంయుక్తంగా దత్తత తీసుకోవచ్చని తీర్పునిచ్చారు. భిన్న లింగ (స్త్రీ-పురుష) జంటలు మాత్రమే బిడ్డకు స్థిరత్వాన్ని అందించగలరని కోర్టు వాదించ లేమన్నారు. ఈ బెంచ్‌లో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ తీర్పుతో తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు జస్టిస్ చంద్రచూడ్. అయితే భారత్‌లో స్వలింగ వివాహాల చట్టబద్ధతకు సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధృవీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల మారథాన్ విచారణ తర్వాత ఈ పిటిషన్లపై మే 11న తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర ప్రభుత్వం స్వలింగ వివాహ గుర్తింపును వ్యతిరేకిస్తోంది. అటు ఎల్జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీ కూడా భారత పౌరులేనని, వారికి కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయని, స్వీయ జీవన విధానాన్ని నిర్ణయించుకునే, నిర్ధారించుకునే హక్కు వారికి ఉంటుందని, దాన్ని చట్టబద్ధంగా అంగీకరించాలని, స్వలింగ వివాహాల (Same sex marriages) వల్ల సమాజానికి ఎలాంటి హాని జరగబోదని, స్వలింగ వివాహాలు చేసుకున్న వారిని వేధించడం తగదని, సమాజంలోని అన్ని సామాజిక ప్రయోజనాలను వారికీ కల్పించాలని సేమ్ సెక్స్ మ్యారేజెస్ మద్దతుదారుల వాదన. మరోవైపు స్వలింగ వివాహాలతో భారతదేశ సామాజిక, సాంస్కృతిక జీవనానికి పునాదిలాంటి కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని, భవిష్యత్ తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒక వర్గం వాదిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు దేశాలు దేశవ్యాప్త ఓటింగ్ తర్వాత స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. 10 దేశాలు కోర్టు నిర్ణయాల ద్వారా చట్టబద్ధం చేశాయి. అలాగే ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాల్లో, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. ఇప్పటివరకు ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించిన చివరి దేశంగా ఎస్టోనియా(2024) నిలిచింది. కాగా మానవ హక్కుల ప్రచారం వేదిక "ప్రపంచంలోని వివాహ సమానత్వం" డేటాప్రకారం, చెక్ రిపబ్లిక్, జపాన్, ఫిలిప్పీన్స్ , థాయ్‌లాండ్‌లో కూడా వివాహ సమానత్వంపై చర్చలు జరుగుతున్నాయి. 30కిపైగా దేశాల్లో స్వలింగ వివాహం చట్టబద్ధం, ఇదిగో జాబితా నెదర్లాండ్స్: 2001, బెల్జియం: 2003 2005: కెనడా, స్పెయిన్, దక్షిణాఫ్రికా: 2006 2009: నార్వే, స్వీడన్ 2010:ఐస్లాండ్, పోర్చుగల్,అర్జెంటీనా డెన్మార్క్: 2012, 2013: ఉరుగ్వే, న్యూజిలాండ్: ఫ్రాన్స్, బ్రెజిల్, 2014 ఇంగ్లాండ్ అండ్ వేల్స్, స్కాట్లాండ్ 2015 లక్సెంబర్గ్, ఐర్లాండ్,అమెరికా 2016: గ్రీన్‌ల్యాండ్, కొలంబియా 2017 ఫిన్లాండ్,జర్మనీ, మాల్టా, ఆస్ట్రేలియా 2019: ఆస్ట్రియా, తైవాన్, ఈక్వెడార్ 2020 ఐర్లాండ్,కోస్టా రికా 2022: స్విట్జర్లాండ్, మెక్సికో, చిలీ, స్లోవేనియా, క్యూబా 2023 అండోరా 2024: ఎస్టోనియా -
భారతీయులు ఉండని దేశాలు ఏవి? పాక్‌తో పాటు జాబితాలో ఏమున్నాయి?
ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో భారతీయులు స్థిరపడుతున్నారు. అయితే పాకిస్తాన్లో భారతీయులు స్థిరపడటానికి ఇష్టపడటం లేదు. ఇలా ఒక్క పాకిస్తాన్‌లోనే కాదు యూరప్‌లో కూడా భారతీయులు నివసించని దేశాలు అనేకం ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశీయులు నివసించని ప్రపంచంలోని కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో వేలాది మంది భారతీయులు స్థిరపడ్డారు. అయితే కొన్ని దేశాల్లో ఒక్క భారతీయుడు కూడా కనిపించడు. ప్రపంచంలోని దాదాపు 195 దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కానీ భారతీయులు నివసించని దేశాలు పాకిస్తాన్‌తో సహా చాలా ఉన్నాయి. వాటికన్ సిటీ యూరోపియన్ దేశం వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. అక్కడ నివసించే ప్రజలు రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు. ఈ దేశంలో జనాభా కూడా చాలా తక్కువ. ఈ దేశంలో ఒక్క భారతీయుడు కూడా నివసించడం లేదు. అయితే దీనికి భిన్నంగా భారతదేశంలో రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరించే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. శాన్ మారినో శాన్ మారినో కూడా ఐరోపాలోని ఒక రిపబ్లిక్ దేశం. ఇక్కడ మొత్తం జనాభా 3 లక్షల 35 వేల 620. ఈ దేశ జనాభాలో ఒక్క భారతీయుడు కూడా కనిపించడు. అయితే ఈ దేశంలో భారతీయ టూరిస్టులు కనిపిస్తారు. బల్గేరియా బల్గేరియా ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. ఇది ప్రకృతి అందాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 2019 జనాభా లెక్కల ప్రకారం బల్గేరియా మొత్తం జనాభా 6,951,482. ఇక్కడ నివసించే అధికశాతం జనాభా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుంది. ఈ దేశంలో భారతీయులు ఎవరూ నివసించరు. అయినా ఇక్కడ భారతీయ దౌత్యవేత్తలు కనిపిస్తారు. తువాలు తువాలు ఓషియానియా ఖండంలోని ఒక ద్వీపంలో ఉన్న దేశం. తువాలును ఎల్లిస్ దీవులు అని కూడా అంటారు. ఇది ఓషియానియాలో ఉంది. ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఈ దేశ జనాభా దాదాపు 10 వేలు. ఈ ద్వీపంలో కేవలం 8 కిలోమీటర్ల పొడవైన రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ భారతీయులెవరూ నివసించరు. ఈ దేశానికి 1978లో స్వాతంత్ర్యం వచ్చింది. పాకిస్తాన్ భారతీయులు నివసించని దేశాల జాబితాలో మన పొరుగు దేశం పాకిస్తాన్ కూడా ఉంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతీయులెవరూ ఇక్కడ నివసించడం లేదు. పాకిస్తాన్లో భారత దౌత్యవేత్తలు, ఖైదీలు తప్ప మన దేశానికి చెందినవారెవరూ కనిపించరు. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే!
పేరులోనేముంది అని చాలామంది కొట్టిపారేస్తారు గాని, పేరు మీద పట్టింపుగల వాళ్లు తక్కువేమీ కాదు. మనుషులు పేర్లు మార్చుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. చిరపరిచితమైన ఊళ్లు, దేశాల పేర్లు మారిపోతే మాత్రం విశేషమే! ‘ఇండియా దటీజ్ భారత్’ అని మన రాజ్యాంగంలోని మొదటి అధికరణలో ఉంది. విదేశీయులు మనల్ని ఇండియన్స్గానే సంబోధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన దేశానికి భారత్‌గా పునర్నామకరణం చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. ఇప్పటికైతే అధికారికంగా మన దేశం పేరు మారలేదు. త్వరలోనే మారితే మారవచ్చు కూడా! అలాగని దేశాలు పేరు మార్చుకోవడం కొత్తేమీ కాదు. ఆధునిక ప్రపంచంలో పేర్లు మార్చుకున్న దేశాలు కొన్ని ఉన్నాయి. వాటి విశేషాలు మీ కోసం... రాచరికాలు కొనసాగిన కాలంలో రాజుల ఆధిపత్యాలను బట్టి రాజ్యాల పేర్లు తరచు మారిపోతూ ఉండేవి. ఆధునిక ప్రపంచంలో దేశాల పేర్లు అంత తరచుగా మారిపోవడం లేదు గాని, అప్పుడప్పుడూ రకరకాల కారణాల వల్ల అవి మారుతూనే ఉన్నాయి. ఇరవయ్యో శతాబ్ది నుంచి ఇప్పటి వరకు పేర్లు మార్చుకున్న కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం. చెకియా చెకొస్లోవేకియా నుంచి 1992 విడివడిన తర్వాత ఈ దేశం పేరు ‘చెక్ రిపబ్లిక్’గా ఉండేది. ఈ దేశం పేరు మార్పు వెనుక ఘనమైన చారిత్రక, సాంస్కృతిక కారణాలేవీ లేవు. మరెందుకు పేరు మార్చుకున్నారంటే, ఇదివరకటి పేరు పెద్దగా ఉందట! పెద్దగా ఉన్న పేరుతో అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు పొందడం కష్టమని, విదేశీయులకు ఆ పేరు పలకడం కష్టంగా ఉందని పాలకులు భావించారు. అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకోవడానికి, మరింతగా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి 2016 ఏప్రిల్‌లో దేశం పేరును ప్రభుత్వం ‘చెకియా’గా మార్చుకుంది. అధ్యక్షుడు మిలోస్ జెమాన్ ఆధ్వర్యంలో ఈ మార్పు జరిగింది. ఇరాన్ ఇప్పుడు ఇరాన్ అంటే జనాలకు బాగా అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు పర్షియాగా ఉండేది. పర్షియా తన పేరును 1935లో ఇరాన్‌గా మార్చుకుంది. ఈ మార్పు వెనుక నాజీల ప్రభావం ఉంది. ఆర్యుల జనాభా ఎక్కువగా ఉండే దేశాలతో నాజీ జర్మనీ ‘సత్సంబంధాలు’ కలిగి ఉండేది. ‘ఆర్యన్’ నుంచి వచ్చిన పేరే ఇరాన్! జర్మనీలో అప్పటి పర్షియా రాయబారి మొహసిన్ రియాస్ ఈ పేరు మార్పు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగించాడు. బహుశా నాజీల మెప్పు కోసం ఆయన ఆ ప్రయత్నాలు చేసి ఉండవచ్చనే వాదన లేకపోలేదు. మొత్తానికి అప్పటి పర్షియా అధినేత రెజా షా పహ్లావీ 1935లో ఇకపై తమ దేశాన్ని ‘ఇరాన్’ పేరుతో గుర్తించాలని తమ దేశంతో దౌత్యసంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నింటినీ కోరారు. అవి ఆ కోరికను మన్నించడంతో పర్షియా పేరు ఇరాన్‌గా మారింది. రెండో ప్రపంచయుద్ధం ఫలితంగా జర్మనీలో నాజీ ప్రభుత్వం పతనమైన తర్వాత మిగిలిన దేశాలు కూడా పర్షియాను ఇరాన్‌గా గుర్తించడంతో అదే పేరు స్థిరపడింది. బోత్స్యానా ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉన్న చిన్న దేశం బోత్స్యానా. దీనికి ఇంతకు ముందున్న పేరు ‘బెషువాన్లాండ్ ప్రొటెక్టరేట్’. బ్రిటిష్ పాలకులు దీన్ని 1885లో ప్రొటెక్టరేట్‌గా ప్రకటించారు. స్థానిక ‘త్సా్వనా’ పదాన్ని పలకలేక వారు ‘బెషువానా’గా వ్యవహరించేవారు. చాలా పోరాటాలు, చర్చోపచర్చల తర్వాత ఈ దేశానికి 1966లో స్వాతంత్య్రం దక్కింది. సెరెత్సె ఖామా తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ‘త్వ్సానా’ తెగ ప్రజలు అత్యధికులుగా ఉన్న ఈ దేశానికి బ్రిటిష్‌వారు అపభ్రంశ పదాలతో పెట్టిన పేరును మార్చి, ‘బోత్స్యానా’గా మార్చారు. ‘బోత్స్యానా’ అంటే ‘త్వ్సానా’ ప్రజల నేల. ఈ పేరు మార్పును అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. శ్రీలంక శ్రీలంక పాత పేరు సిలోన్. బ్రిటిష్ పాలకులు ఆ పేరు పెట్టారు. ‘సహీలన్’ అరబిక్ పదం నుంచి వారు ఆ పేరు పెట్టారని చెబుతారు. అయితే, ఆ పేరు పుట్టుపూర్వోత్తరాల గురించి వేర్వేరు వాదనలు ఉన్నాయి. పదో శతాబ్దానికి చెందిన అరబిక్ రచయిత ఇబ్న్ షహ్రియార్ తన ‘అజబ్–అల్–హింద్’ పుస్తకంలో శ్రీలంకను ఉద్దేశించి ‘సెరెన్దిబ్’, ‘సహీలన్’ అనే పదాలను ఉపయోగించాడు. తొలినాళ్లలో దీని పేరు ‘తామ్రపర్ణి’గా ఉండేది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన గ్రీకుయాత్రికుడు మెగస్తనీస్ దీనినే తన రచనల్లో ‘తప్రోబన’ అని పేర్కొన్నాడు. బ్రిటిష్‌వారి కంటే ముందు ఈ ప్రాంతాన్ని పోర్చుగీసు, స్పానిష్, ఫ్రెంచ్, డచ్ వాళ్లు కూడా కొంతకాలం పరిపాలించారు. పోర్చుగీసులు దీనిని ‘సీలావో’ అని, స్పానిష్ వాళ్లు ‘సీలాన్’ అని, ఫ్రెంచ్‌వాళ్లు ‘సీలన్’ అని, డచ్‌వాళ్లు ‘జీలన్’ అని వ్యవహరించేవారు. అయితే, బ్రిటిష్ హయాంలో పెట్టిన ‘సిలోన్’ పేరు ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఈ దేశానికి 1948లోనే స్వాతంత్య్రం వచ్చినా, 1966 వరకు సిలోన్ పేరుతోనే ఉండేది. సిరిమావో బండారునాయకె ప్రధానిగా ఉన్న కాలంలో దేశం పేరును ‘శ్రీలంక’గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐర్లండ్ ఇప్పటి ప్రపంచానికి ఐర్లండ్ పేరు బాగా పరిచయం గాని, అంతకుముందు దీని పేరు ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’. ఇంగ్లిష్ వాళ్ల పాలనలో దాదాపు మూడు శతాబ్దాలు మగ్గిన దేశం ఇది. ఐరిష్ జాతీయోద్యమం తర్వాత తొలుత ఇది 1922లో బ్రిటిష్ సామ్రాజ్యంలోని స్వయంపాలిత రాజ్యంగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం 1931లో దీనిని ‘నిర్వివాద స్వతంత్ర దేశం’గా ప్రకటించడంతో ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’గా అవతరించింది. ఐర్లండ్ ద్వీపంలోని మొత్తం 32 కౌంటీలు ఉంటే, వాటిలోని 26 కౌంటీలతో ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’ ఏర్పడింది. మిగిలిన ఆరు కౌంటీలు ‘నార్తర్న్ ఐర్లండ్’గా బ్రిటిష్ సామ్రాజ్యంలోని భాగంగానే ఉన్నాయి. ఐరిష్ రాజ్యాంగం 1937లో దేశం పేరును అధికారికంగా ‘ఐర్లండ్’గా మార్చింది. ఐర్లండ్ 1949లో ‘రిపబ్లిక్’గా మారడంతో మిగిలిన ప్రపంచం అప్పటి నుంచి ఇదే పేరుతో గుర్తించడం ప్రారంభించింది. థాయ్‌లాండ్ థాయ్‌లాండ్ ఇప్పుడు అందరికీ అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు ‘సియామ్’. ‘శ్యామ’ అనే సంస్కృత పదం నుంచి ‘సియామ్’ పేరు వచ్చింది. ‘సియామ్’ అనేది ఈ దేశవాసులు పెట్టుకున్న పేరు కాదు, విదేశీయులు పెట్టిన పేరు. ఫీల్డ్ మార్షల్ ప్లేక్ ఫిబున్సాంగ్ఖ్రామ్ ప్రధాని పదవిలోకి వచ్చి, నియంతృత్వాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన 1939లో ‘సియామ్’ పేరును ‘థాయ్‌లాండ్’గా మార్చారు. ‘థాయ్’ భాషలో ‘థాయ్’ అంటే ‘మనిషి’, ‘స్వతంత్రుడు’ అనే అర్థాలు ఉన్నాయి. స్వతంత్రుల దేశం అనే అర్థం వచ్చేలా ‘థాయ్‌లాండ్’ పేరును ఎంపిక చేసుకున్నారు. మిగిలిన ప్రపంచం దీనిని గుర్తించడంతో ఇదే పేరు స్థిరపడింది. ఇస్వాతిని ఆఫ్రికా ఆగ్నేయ ప్రాంతంలోని చిన్న దేశం ఇది. ఈ దేశం ఇదివరకటి పేరు ‘స్వాజిలాండ్’. చాలాకాలం బ్రిటిష్ వలసరాజ్యంగా ఉండేది. ఇక్కడ ఎక్కువగా స్వాజీ తెగకు చెందిన ప్రజలు ఉంటారు. పూర్వీకుడైన తెగ నాయకుడి పేరు మీదుగా తమ తెగకు ‘స్వాజీ’ అని పేరు పెట్టుకున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దేశానికి రాజుగా ఉన్న మూడో ఎంస్వాతి దేశం పేరును తన పేరు కలిసొచ్చేలా ‘ఇస్వాతిని’గా మార్చారు. ఎవరితోనూ సంప్రదించకుండా రాజు ఏకపక్షంగా దేశం పేరు మార్చేశారనే విమర్శలు ఉన్నా, అంతర్జాతీయ సమాజం కొత్తగా మార్చిన పేరు గుర్తించడంతో మారిన పేరుతోనే చలామణీ అవుతోంది. నార్త్ మాసిడోనియా యూరోప్ ఆగ్నేయ ప్రాంతంలోని దేశం నార్త్ మాసిడోనియా. ఇదివరకు దీని పేరు మాసిడోనియా మాత్రమే! రెండో ప్రపంచయుద్ధ కాలంలో 1944లో ఈ ప్రాంతం ‘సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా’గా ఆవిర్భవించింది. తర్వాత 1991లో రిఫరెండం ద్వారా స్వాతంత్య్రం సాధించుకుని, ‘మాసిడోనియా’గా మారింది. ఈ ప్రాంతానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ప్రాచీనకాలంలో గ్రీకు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఇప్పటికీ మాసిడోనియా ప్రాంతంలోని కొంతభాగం ఈ దేశానికి దక్షిణాన గల గ్రీస్‌లో ఉంది. పొరుగుదేశంతో గందరగోళం తొలగించుకోవాలనే ఉద్దేశంతో 2019లో ఈ దేశం తన పేరును ‘నార్త్ మాసిడోనియా’గా మార్చుకుంది. మయాన్మార్ మన దేశానికి సరిహద్దుల్లోని ఆగ్నేయాసియాలో ఉన్న ఈ దేశానికి ఇదివరకటి పేరు ‘బర్మా’. అధికారికంగా మయాన్మార్గా మారినా, ‘బర్మా’ పేరుతో ఈ దేశాన్ని గుర్తుపట్టేవాళ్లు ఇప్పటికీ ఎక్కువమందే ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా బర్మన్ తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు. అందువల్ల ‘బర్మా’గా పేరుపొందింది. బ్రిటిష్ పాలన నుంచి ఈ దేశం 1948లో స్వాతంత్య్రం పొందింది. అలజడులతో అతలాకుతలమైన ఈ దేశం 1989లో జరిగిన సైనిక కుట్రలో పూర్తిగా సైనిక పాలనలోకి వెళ్లింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన సైనిక పాలకులు దేశం పేరును మయాన్మార్గా మార్చారు. ‘మయాన్మార్’ పదం పుట్టుపూర్వోత్తరాల గురించి ఇప్పటికీ గందరగోళం ఉంది.బెనిన్ అట్లాంటిక్ తీరంలో ఉన్న ఆఫ్రికన్ దేశం ఇది. ఆఫ్రికా పడమటి తీరాన ఉన్న ఈ చిన్న దేశానికి గతంలో ఉన్న పేరు ‘దహోమీ’. చిన్న రాజ్యంగా ఉండే ఈ దేశం పదిహేనో శతాబ్దిలో చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలను కలుపుకొని ‘దహోమీ’ రాజ్యంగా అవతరించింది. స్థానిక ఫోన్ తెగకు చెందిన ప్రజలు మాట్లాడే ‘ఫోంగ్బే’ భాషలో ‘ఫోన్ ద హోమీ’ అంటే ‘పాము పొట్ట’ అని అర్థం. దేశం ఆకారం దాదాపు అలాగే ఉండేది కాబట్టి వారు ‘దహోమీ’ అని పేరు పెట్టుకున్నారు. ఈ దేశాన్ని 1872లో ఫ్రెంచ్‌వాళ్లు ఆక్రమించుకుని, 1960 వరకు పరిపాలన కొనసాగించారు. ఫ్రెంచ్ పాలన అంతమయ్యాక 1960లో స్వాతంత్య్రం వచ్చినా, ‘దహోమీ’ పేరుతోనే పదిహేనేళ్లు కొనసాగింది. మాథ్యూ కెరెకోవు నేతృత్వంలోని సైనిక బలగాలు 1972లో అప్పటి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కెరెకోవు నేతృత్వంలోని ప్రభుత్వం 1975లో దేశం పేరును ‘బెనిన్’గా మార్చింది. ‘ఫోన్’ తెగ తర్వాత ‘బిని’ తెగవారు కూడా ఈ దేశంలో గణనీయంగా ఉంటారు. ‘బిని’ తెగ మూలం గానే బెనిన్ పేరు పెట్టారు. అయితే, ‘బిని’ తెగ జనాభా నైజీరియాలో ఎక్కువగా ఉంటారు. సూరినామా దక్షిణ అమెరికాలోని ఈశాన్యతీరంలో ఉన్న దేశం సూరినామా. దీని ఇదివరకటి పేరు సూరినామ్. స్థానిక స్రానన్ టోంగో భాషలో ‘ఆమ’ పదానికి నది లేదా నదీముఖద్వారం అనే అర్థాలు ఉన్నాయి. ఈ దేశాన్ని వేర్వేరు యూరోపియన్ దేశాల వారు ఆక్రమించుకున్నారు. బ్రిటిష్‌వారు 1630లో వలస రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అధికసంఖ్యాకులు సూరీనియన్ తెగకు చెందినవారు. స్థానిక భాష అర్థంకాని బ్రిటిష్ వలస పాలకులు దీని పేరును ‘సూరినామ్’గా వ్యవహరించేవారు. పదిహేడో శతాబ్ది చివర్లో బ్రిటిష్ వారి నుంచి ఈ దేశం డచ్ పాలకుల చేతిలోకి వెళ్లింది. అప్పట్లో ఇది డచ్ గయానాలో భాగంగా ఉండేది. డచ్ పాలకులు ఇక్కడి నుంచి భారీగా చక్కెర ఎగుమతి చేసేవారు. దాదాపు రెండు శతాబ్దాలు సాగిన డచ్ పాలన నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం లభించింది. స్వాతంత్య్రం వచ్చాక, పాశ్చాత్యులు తమ దేశానికి పెట్టిన అపభ్రంశ పదాన్ని తమ భాషకు అనుగుణంగా మార్చుకుని, 1978లో ‘సూరినామా’గా స్వతంత్ర పాలకులు ప్రకటించుకున్నారు. స్వతంత్ర దేశానికి తొలి అధ్యక్షుడైన హెంక్ ఆరన్ హయాంలో ఈ మార్పు అమలులోకి వచ్చింది. నెదర్లాండ్స్ మూడేళ్ల కిందటి వరకు ఈ దేశం పేరు హాలండ్. పశ్చిమ యూరోప్‌లోని డచ్ ప్రజల దేశం ఇది. ఇక్కడి ప్రభుత్వం 2020లో దేశం పేరును ‘నెదర్లాండ్స్’గా మార్చినట్లు ప్రకటించింది. ‘హాలండ్’ పేరు దేశంలోని రెండు డచ్ రాష్ట్రాలు గల ప్రాంతానికే వర్తిస్తుందని, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా కలుపుకొనేలా ఒక పేరుపెట్టడం బాగుంటుందని దేశ నేతలు కొంతకాలం మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ప్రధాని మార్క్ రుట్టే నేతృత్వంలోని ప్రభుత్వం ‘నెదర్లాండ్స్’ పేరును ఖాయం చేసింది. జింబాబ్వే ఆఫ్రికా ఆగ్నేయప్రాంతంలోని దేశం ఇది. దీని ఇదివరకటి పేరు ‘రొడీషియా’. ఇక్కడ బ్రిటిష్ వలస రాజ్యానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు సెసల్ రోడ్స్ పేరు మీద అప్పటి బ్రిటిష్ వలస పాలకులు ఈ దేశానికి ‘రొడీషియా’ అని పేరు పెట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1960లలో ఇక్కడి నల్లజాతీయులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఉద్యమకాలంలో వారు తమ దేశానికి ‘జింబాబ్వే’ పేరును వాడుకలోకి తెచ్చారు. ‘జింబాబ్వే’ అంటే స్థానిక ‘షువావు’భాషలో ‘రాతి ఇళ్ల దేశం’ అని అర్థం. పోరాట ఫలితంగా 1965లో స్వాతంత్య్రం వచ్చినా, పాలనలో 1979 వరకు నల్లజాతీయులు మైనారిటీలుగానే మిగిలారు. గెరిల్లా పోరాటం తర్వాత 1979లో జరిగిన ఎన్నికల్లో రాబర్ట్ ముగాబే నాయకత్వంలో నల్లజాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ముగాబే ప్రభుత్వం దేశం పేరును ‘జింబాబ్వే’గా మార్చింది. బుర్కీనా ఫాసో ఆఫ్రికా పశ్చిమ ప్రాంతంలోని చిన్న దేశమిది. స్వాతంత్య్రానికి ముందు ఫ్రెంచ్ పాలనలో ఉండేది. ఫ్రెంచ్ పాలకులు దీనిని ఫ్రెంచ్ భాషలో ‘హాట్–వోల్టా’ అని, ఇంగ్లిష్‌లో ‘అప్పర్ వోల్టా’ అని వ్యవహరించేవారు. ఈ దేశానికి ‘అప్పర్ వోల్టా’ పేరు ఎక్కువగా చలామణీలో ఉండేది. ఫ్రెంచ్ వలస పాలకుల నుంచి 1958లో ఈ దేశానికి స్వయంపాలనాధికారం లభించింది. తర్వాత రెండేళ్లకు 1960లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్ ఆఫ్ వోల్టా’గా దేశం పేరు మారింది. వలస పాలకుల ఆనవాళ్లను పూర్తిగా తుడిచివేయాలనే ఉద్దేశంతో 1984లో అప్పటి అధ్యక్షుడు థామస్ సంకారా తమ దేశానికి ‘బుర్కీనా ఫాసో’ పేరును ప్రకటించారు. స్థానిక మూరీ భాషలో ‘బుర్కీనా ఫాసో’ అంటే నిజాయతీపరుల దేశం అని అర్థం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికా మధ్య ప్రాంతంలోని రెండో అతిపెద్ద దేశం ఇది. బెల్జియం రాజు రెండో లియోపోల్డ్ 1885లో ఇక్కడ సొంతరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లియోపోల్డ్ హయాంలో ఈ దేశాన్ని ‘కాంగో ఫ్రీ స్టేట్’ అనేవారు. తర్వాత 1908 నాటికి ఇది పూర్తిగా బెల్జియం ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చింది. బెల్జియన్ల పాలనలో ఈ దేశాన్ని ‘బెల్జియన్ కాంగో’గా వ్యవహరించేవారు. బెల్జియన్ల నుంచి ఈ దేశానికి 1960లో స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్ ఆఫ్ జైరీ’గా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపు ఐదేళ్లు దేశం తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలతో అతలాకుతలమైంది. అంతర్యుద్ధంలో సైనికాధికారి మొబుటు సెసె సీకో 1965లో అధికారాన్ని చేజిక్కించుకుని నియంతృత్వ పాలన ప్రారంభించారు. దేశంలో ప్రవహించే కాంగో నది పేరు మీదుగా ఆయన దేశానికి ‘కాంగో’ పేరు పెట్టాడు. రెండేళ్లలోనే 1967లో సీకో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన తిరుగుబాటు నాయకుడు లారెంట్ డిజైర్ కబిలా దేశానికి ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ పేరును ఖాయం చేశారు. కాబో వెర్డీ ఆఫ్రికా పశ్చిమాన ఉన్న చిన్న ద్వీపసమూహ దేశం ఇది. పదేళ్ల కిందటి వరకు ఈ దేశం ‘కేప్ వెర్డీ’ అనే ఇంగ్లిష్ పేరుతోనే చలామణీ అయ్యేది. తొలుత పోర్చుగీసులు ఈ ద్వీపసమూహాన్ని 1462లో ఆక్రమించుకుని, నావికా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వస్తువులే కాకుండా, బానిసలను కూడా దేశదేశాలకు ఎగుమతి చేసేవారు. స్థానిక క్రియోలె భాషలో ఈ దీవులకు ‘కాప్–వెర్ట్’ అనేవారు అంటే, ‘ఆకుపచ్చని అగ్రం’. దాని ఆధారంగానే పోర్చుగీసులు ఈ ద్వీపసమూహానికి తమ భాషలో ‘కాబో వెర్డీ’ అనే పేరు పెట్టుకున్నారు. ఇంగ్లిష్ మాట్లాడే దేశాలతో వారు లావాదేవీలు సాగించడంతో వారికి అర్థమయ్యేలా ‘కేప్ వెర్డీ’ అనేవారు. పోర్చుగీసుల నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం వచ్చింది. దేశాధ్యక్షుడు జోస్ మారియా నెవిస్ 2013లో దేశానికి తిరిగి పోర్చుగీసు పదాన్ని అధికారికంగా వాడుకలోకి తీసుకొచ్చారు. తుర్కియే నిన్న మొన్నటి వరకు ఈ దేశం ‘టర్కీ’ పేరుతోనే చలామణీలో ఉండేది. ఇక్కడి తుర్కు ప్రజల ప్రాచీన నాగరికత, సంస్కృతి ప్రతిబింబించేలా స్థానిక భాషలోనే దేశం పేరు ఉండాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ గత ఏడాది దేశం పేరును ‘తుర్కియే’గా మార్చినట్లు ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం ఈ దేశాన్ని ఇప్పుడు ఇదే పేరుతో గుర్తిస్తోంది. నిజానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ఒక చిన్న ఇబ్బంది ఈ దేశం పేరు మార్చుకోవడానికి కారణమైంది. ‘థాంక్స్ గివింగ్ డే’ సందర్భంగా ఉత్తర అమెరికన్లు సంప్రదాయంగా ఇచ్చేవిందులో టర్కీ కోళ్లు తప్పనిసరి. టర్కీ కోళ్లను వాళ్లు ‘టర్కీ’గానే వ్యవహరిస్తారు. కోడిజాతికి చెందిన పక్షుల పేరు, తమ దేశం పేరు ఒకటే కావడంతో గందరగోళం ఏర్పడుతోందని, దీన్ని తప్పించుకోవడానికే దేశం పేరు మార్చుకోవాల్సి వచ్చిందని ‘తుర్కియే’ విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. (చదవండి: ఆదర్శగురువులెందరో..వారందరికీ ప్రణామం!) -
ముగిసిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల మధ్య తొలిసారిగా జరిగిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ నెల 20న మారిటైమ్ విన్యాసాలు మొదలయ్యాయి. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌక భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా.. రాయల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతం చేయడం, సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు పరస్పర సహకారంతోపాటు ఇండో– పసిఫిక్ సముద్ర జలాల్లో స్థిరమైన శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ త్రైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజున వ్యూహాత్మక విన్యాసాలు, క్రాస్‌డెక్ ఆపరేషన్స్, హెలికాప్టర్ల క్రాస్‌డెక్ ల్యాండింగ్ తదితర విన్యాసాలు నిర్వహించారు.