సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ జనాభా నానాటికీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7.5 కోట్ల జనాభా పెరుగుతోంది. 2018 జూలై నాటికి ప్రపంచ జనాభా 760 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇదేవిధంగా పెరుగుతూ పోతే భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి 840 కోట్లు, 2050 నాటికి 960 కోట్లకు జనాభా చేరుకుంటుంది. నేడు (జులై 11) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్‌లో ముందున్న పది దేశాల గురించి తెలుసుకుందాం.
చైనా
1,415,171,198తో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా తొలి స్థానంలో నిలించింది. ప్రపంచ జనాభాలో అత్యధికంగా 18.54 శాతం జనాభా చైనాలోనే ఉంది. ఒక చదరపు కిలోమీటరులో 151 మంది ప్రజలు నివసిస్తున్నారు. చైనా జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు.
ఇండియా
1,354,464,444 జనాభాతో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 17.74 శాతం ప్రజలు భారత్‌లో నివశిస్తున్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కు 455 మంది ప్రజలు జీవిస్తున్నారు. ఇది చైనా కంటే రెండింతులు ఎక్కువ. భారతీయ జనాభాలో సగటు వయసు 27 ఏళ్లు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశంగా భారత్ తొలి స్థానంలో ఉంది.
అమెరికా
326,830,645 జనాభాతో అమెరికా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో అమెరికన్లు 4.28 శాతం మంది ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 36 మంది మాత్రమే నివశిస్తున్నారు. అమెరికన్ల జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు.
ఇండోనేషియా
266,872,775 జనాభాతో దీవుల దేశం ఇండోనేషియా నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 3.5 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు 147 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 28 ఏళ్లు.
బ్రెజిల్
266,872,775 జనాభాతో ప్రపంచంలో బ్రెజిల్ ఐదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.76 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 26 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 31 ఏళ్లు.
పాకిస్తాన్
200,919,769 జనాభాతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో పాక్ జనాభా శాతం 2.63. ఒక చదరపు కిలోమీటర్‌కి 260 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి జనాభా సగట వయసు 22 ఏళ్లు.
నైజీరియా
196,041,916 జనాభాతో నైజీరియా ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో నైజీరియన్ల్ శాతం 2.57. ఒక చదరపు కిలోమీటర్‌కి 215 మంది నైజీరియన్లు నివశిస్తున్నారు.
బంగ్లాదేశ్
166,415,337 జనాభాతో భారత సరిహద్దు దేశం బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.18. ఒక చదరపు కిలోమీటర్‌కి అత్యధికంగా 1278 మంది నివశిస్తున్నారు. వీరి జనాభా సగటు వయసు 26 ఏళ్లు.
రష్యా
143,964,017 జనాభాతో రష్యా ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 1.89 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 9 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 38 ఏళ్లు.
మెక్సికో
130,803,510 జనాభాతో మెక్సికో ప్రపంచంలో పదో స్థానం ఆక్రమించింది. ప్రపంచంలో వీరి జనాభా 1.71 శాతం.
Comments
Please login to add a commentAdd a comment