top ten
-
వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, పూనం పాండే ఎవరు? ఇదే తెగ వెదికేశారట!
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాదికూడా సెర్చ్ దిగ్గజం గూగుల్‌లో టాప్-10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ రెజ్లర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన వినేష్ ఫోగట్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ టాప్ టెన్‌లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.2024లో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా వెదికిన పదిమంది వ్యక్తులు వినేష్ ఫోగట్నితీష్ కుమార్చిరాగ్ పాశ్వాన్హార్దిక్ పాండ్యాపవన్ కళ్యాణ్శశాంక్ సింగ్పూనమ్ పాండేరాధికా మర్చంట్అభిషేక్ శర్మలక్ష్య సేన్ఇక ప్రపంచవ్యాప్తంగా, 2024లో గ్రహం మీద అత్యధికంగా వెదికిన వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిలిచారు, ఆ తర్వాతి స్థానాల్లో వేల్స్ యువరాణి కేథరీన్, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా ఉన్న కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో జేడీ వాన్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రాపర్ డిడ్డీ కూడా ఉన్నారు. -
ప్రపంచంలోనే ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు వీరికే (ఫొటోలు)
-
మెగాస్టార్ టాప్ టెన్ హిట్స్ మీకు తెలుసా?
శివశంకర వరప్రసాద్ అంటే కొందరు గుర్తు పట్టలేరమో తెలియదు కానీ.. మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండియాలో ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతలా సినీ ఇండస్ట్రీలో తన ముద్ర వేసుకున్నారు మెగాస్టార్. ఆగస్టు 22, 1955న ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో జన్మించిన చిరంజీవి తన నట జీవితాన్ని 1970లో ప్రారంభించారు. దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించిన మెగాస్టార్ ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఠాగూర్ సూపర్ హిట్ చిత్రాలతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. 1978లో పునాదిరాళ్లు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన మెగాస్టార్ ఆ తర్వాత విజేత, గూఢచారి -116 లాంటి వంటి చిత్రాలలో విభిన్న పాత్రలలో మెప్పించారు. 1980లలో చిరంజీవి ఖైదీ, జ్వాల, ఛాలెంజ్ వంటి చిత్రాలు ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, స్నేహం కోసం, ఠాగూర్ బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఆగస్టు 22, 2023న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా చిత్రాలేవో తెలుసుకుందాం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇరవైకి పైగా సినిమాలు చేశారు మెగాస్టార్. చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం ఓ రేంజ్లో క్రేజ్‌ను తెచ్చి పెట్టింది . అలాగే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్వయంకృషి ఆయన ప్రతిభను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా ఈ సినిమాకు అందుకున్నారు. 1.పసివాడి ప్రాణం 2. స్వయంకృషి 3. జగదేకవీరుడు అతిలోకసుందరి 4.గ్యాంగ్ లీడర్ 5.ఖైదీ 6. ముఠామేస్త్రి 7.ఘరానా మొగుడు 8.చూడాలని ఉంది 9.ఠాగూర్ 10.ఇంద్ర ఇవే కాకుండా అప్పట్లో చిరు ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. ఛాలెంజ్, రుద్రవీణ, అడవి దొంగ , విజేత, చంటబ్బాయి, ఆరాధన, స్టేట్ రౌడీ, ఆపద్బాంధవుడు, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్, స్నేహం కోసం, సైరా నరసింహా రెడ్డి, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమా లు చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇటీవల రిలీజైన మెగాస్టార్ 156వ చిత్రం భోళాశంకర్ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. -
అత్యంత తేలికైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
IMDb: ఈ ఏడాది టాప్ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో 'ఆర్ఆర్ఆర్'
ఈ ఏడాది ఇండియాలో టాప్ టెన్ మూవీస్‌లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబి ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2022’ పేరుతో విడుదల చేసిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యంత భారీ బడ్జెడ్ ఆర్ఆర్ఆర్తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటిస్థానంలో ఆర్ఆర్ఆర్, రెండోస్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, మూడోస్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో విక్రమ్, ఐదో ప్లేస్‌లో కాంతార నిలిచింది. ఆ తర్వాత వరుసగా రాకెట్రీ, మేజర్, సీతారామం, పొన్నియిన్ సెల్వన్, చార్లీ 777 చిత్రాలు టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ హీరో రిషబ్ శెట్టి చిత్రం కాంతార మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పట్టారు. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్- 2022 ఆర్ఆర్ఆర్ ది కశ్మీర్ ఫైల్స్ కేజీయఫ్-2 విక్రమ్ కాంతార రాకెట్రీ మేజర్ సీతారామం పొన్నియిన్ సెల్వన్ 777 చార్లీ Presenting the IMDb Top 10 Most Popular Indian Movies of the year 2022 🥁💛 How many of your favourites made it to the list?#IMDbBestof2022 pic.twitter.com/0GggT44fG8 — IMDb India (@IMDb_in) December 14, 2022 -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో ఘోర ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం కారణంగా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఈ-బైక్స్ నిర్వహణ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. పరిహారం ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ సీఎం జగన్ పర్యటన కంటే ముందే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల సస్పెండ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తనపై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పని తరుణంలోనే స్పీకర్ పోచారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని స్పీకర్ స్పష్టం చేస్తూ.. బయటకు పొమ్మని ఈటలకు సూచించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సౌతాఫ్రికా హెచ్‌కోచ్ పదవికి బౌచర్ గుడ్‌బై ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సైతం ధృవీకరించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. బిగ్‌బాస్-6 రెండోవారం నామినేషన్స్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బిగ్‌బాస్ సీజన్-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో హౌస్‌మేట్‌కు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని బిగ్‌బాస్ తెలిపాడు. మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు? చివర్లో బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఆటోలో కేజ్రీవాల్.. అడ్డుకున్న పోలీసులు గుజరాత్ పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటోడ్రైవర్ కోరిక మేరకు అతని ఇంట్లో భోజనం చేశారు. అయితే అతని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ హైడ్రామా నడిచింది. చివరకు కేజ్రీవాల్ తగ్గకపోవడంతో.. పోలీసులే వెనక్కి తగ్గారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. గోదావరి మళ్లీ ఉగ్రరూపం గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మన రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృతంగా శనివారం, ఆదివారం వర్షాలు కురువడంతో ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. త్రివిక్రమ్ కోసం సరికొత్తగా సూపర్‌స్టార్ సెట్స్‌లో మహేశ్‌బాబు యాక్షన్ ఆరంభమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. రెండేళ్ల తర్వాత చైనా బయటకు జిన్‌పింగ్.. ఒకే వేదికపై ముగ్గురూ! చైనా అధినేత జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. చైనా కంపెనీల మాస్టర్ మైండ్‌కు భారీ షాక్ : వివరాలివిగో! చైనా లింకులతో భారత్‌లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్‌మైండ్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అరెస్టు చేసింది. దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్-10 న్యూస్ రౌండప్
1. కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు, కారణం ఏంటంటే.. రెబల్‌స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు జరిగాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కాకుండా మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌజ్‌లో జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంతేకాదు.. ప్రభాస్ కాకుండా అతని సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. వైఎస్ఆర్ కల్యాణమస్తూ.. బాలికల విద్యకూ ప్రోత్సాహాం పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్) జారీ చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. జ్ఞానవాపి తీర్పు.. వారణాసిలో 144 సెక్షన్ ఉత్తర ప్రదేశ్‌లోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ(సెప్టెంబర్ 12) కీలక తీర్పును వెలువరించనుంది. మసీదుకాంప్లెక్స్లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. నానమ్మ మరణంతో యువరాజుల ఐక్యత! రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. మరోవైపు.. విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. యూఎస్ ఓపెన్‌లో 19 ఏళ్ల కుర్రాడి సంచలనం యూఎస్ ఓపెన్‌లో స్పానిష్ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం ఆర్ధ రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నార్వేజియన్ కాస్పర్ రూడ్‌ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. పాక్‌లో వరద బాధితులను... అక్కున చేర్చుకున్న ఆలయం కనీవిని ఎరగని వరదలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్లో ఓ చిన్న గ్రామంలోని హిందూ దేవాలయం అందిస్తున్న సేవలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జలాల్ ఖాన్ అనే మారుమూల కుగ్రామంలో ఉన్న బాబా మధోదాస్ మందిర్ వరదలో సర్వం కోల్పోయిన కనీసం 300 మంది ముస్లింలకు ఆశ్రయంతో పాటు భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.చెన్నై-బెంగళూరు రూట్లో ఆకాశ ఎయిర్ సర్వీసులు విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్‌వర్క్‌లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు ‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్ నుంచి మద్రాస్ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్‌కి తిరిగొచ్చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. ఆ హిమానీనదం.. కరిగితే ప్రళయమే! థ్వాయిట్స్ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్‌డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఉగ్రగోదావరి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఎగువన కురుస్తున్న వర్షాలతో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర 9 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితిని సమీకక్షించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
భారత్‌లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాలేవో తెలుసా మీకు?
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా డిమాండ్ కలిగిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలకు వీలుంటుందని లింక్డ్ఇన్ నివేదిక తెలిపింది. ఈ తరహా నైపుణ్యాల విషయంలో ఉద్యోగార్థులకు సాయం చేయడం, వారి కెరీర్‌కు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో.. ‘స్కిల్స్ ఎవల్యూషన్ 2022’, ‘ఫ్యూచర్ ఆఫ్ స్కిల్స్ 2022’ డేటాను లింక్డ్ఇన్ విడుదల చేసింది. లింక్డ్ఇన్కు భారత్‌లో 9.2 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వారి నైపుణ్యాల డేటా ఆధారంగా.. వృద్ధి చెందుతున్న టాప్10 నైపుణ్యాలు, భవిష్యత్ నైపుణ్యాల వివరాలను తెలియజేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాల్లో 25 శాతం మార్పు చోటు చేసుకుందని.. 2025 నాటికి 41 శాతం మార్పు చోటు చేసుకుంటుందని తెలిపింది. భారత్‌లో వీటికి డిమాండ్.. భారత్‌లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాల వివరాలను లింక్డ్ఇన్ తెలియజేసింది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఎస్‌క్యూఎల్, సేల్స్, జావా, సేల్స్ మేనేజ్మెంట్, మైక్రోసాఫ్ట్ అజూర్, స్ప్రింగ్‌బూట్ డిమాండ్ నైపుణ్యాలుగా ఉన్నాయి. 2015 నుంచి చూస్తే కార్పొరేట్ సేవల పరంగా నైపుణ్యాల్లో 41.6 శాతం మార్పు చోటు చేసుకుంది. ఫైనాన్షియల్ రంగంలో.. జీఎస్టీ, టీడీఎస్, స్టాట్యుటరీ ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్‌కు సంబంధించి నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. సాఫ్ట్వేర్, ఐటీ సేవల పరంగా పదింటికి గాను ఆరు నైపుణ్యాలు కొత్తవే ఉన్నాయి. మీడియా ఆన్లైన్ మాధ్యమంలో విస్తరిస్తున్న క్రమంలో.. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో), వెబ్ కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బ్రాంచ్ బ్యాంకింగ్, బ్రాంచ్ ఆపరేషన్స్ నైపుణ్యాలకు ఫైనాన్షియల్‌లో డిమాండ్ నెలకొంది. అంటే ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. హెల్త్‌కేర్ రంగంలో నైపుణ్యాల పరంగా 2015 తర్వాత 30 శాతం మార్పు చోటు చేసుకుంది. -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. Azadi Ka Amrit Mahotsav: ఇంటింటా ‘తిరంగ’ ఎటు చూసినా మువ్వన్నెలే.. అన్ని వైపులా త్రివర్ణ పతాక రెపరెపలే..ప్రముఖులే కాదు ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా కనిపిస్తోంది. ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ దేశం నినదిస్తోంది. 75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల లోనూ అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝున్ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్లో చేరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. వెంటిలేటర్‌పై రష్దీ.. తెగిపోయిన చేతుల్లోని నరాలు, దెబ్బతిన్న కాలేయం భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. రీ సర్వే కొత్తపుంతలు.. విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలత వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్లతో ఆధునిక తరహాలో రీ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఇంకా ఆధునికంగా నిర్వహించేందుకు ఏరియల్ రీ సర్వేకు శ్రీకారం చుట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఉపఎన్నిక వేడిలో ఉడుకుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. రంగంలోకి ప్రియాంక? రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందా? తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా మరింత దృష్టి పెట్టేందుకు సిద్ధమైందా? ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనున్నారా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. డకౌట్ అయ్యానని ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ నా చెంపపై కొట్టాడు: టేలర్ ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్‌పై సంచలన ఆరోపణులు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్ టేలర్.. తన ఆత్మకథ ద్వారా మరో దిగ్భ్రాంతికర సంఘటనను బయట పెట్టాడు. ఐపీఎల్ 2011 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. Vijay Deverakonda: ఆయన కొట్టిన దెబ్బకు రోజంతా బాధపడ్డా నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్‌టైసన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. స్వాతంత్య్ర దినోత్సవ సంరంభం: పిల్లల్లారా పాపల్లారా భావి భారత పౌరుల్లారా రేపు ఆగస్టు 15. భారత దేశ పురోగామి పథంలో ఒక అమృత ఘట్టం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండాయి. పెద్దలు సాధించారు. యువకులు నిర్మించారు. బాలలు భవిష్యత్తుకు వెలుతురై ప్రసరిస్తారు. ఆగస్టు 15న పిల్లలతో ఉపన్యాసాలు ఇప్పించండి. ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించండి. పాటలు పాడించండి. దేశభక్తిని తెలిపే ఆటలు ఆడించండి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఐప్యాక్ నివేదిక.. దిద్దుబాటు చర్యలపై టీఆర్ఎస్ ఫోకస్.. ‘సోషల్’గా వెళ్లాల్సిందే! పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా కరడుగట్టిన సోషల్ మీడియా వారియర్స్ (సామాజిక మాధ్యమ ప్రచారకర్తలు)ను తయారు చేసుకోవడంపై దృష్టిపెట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1.. ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చైనా అరాచకం.. తైవాన్ రక్షణ శాఖ అధికారి ఖతం! ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్ లీ–సింగ్ శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కమలం గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శ్రవణ్‌కు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు.. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్, వరుడు ఎవరంటే.. హీరోయిన్ల పెళ్లిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త గాసిప్‌లు వస్తూనే ఉంటాయి. మొన్న ఆపిల్ బ్యూటీ హన్సిక పెళ్లికి కుదిరిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా కీర్తీ సురేష్ సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే చర్చ కోలీవుడ్‌లో హాట్ హాట్‌గా జరుగుతుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. CWG 2022 IND vs AUS Final: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య ఏం జరుగు తోందో తనకు తెలియదని.. మునుగోడు సభ విషయంలో వెంకట్‌రెడ్డికి ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో? ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా? ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఆన్లైన్లో యూఏఎన్ (యూనివర్సల్ నంబర్)ను క్రియేట్ చేసుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా సభ్యులకు కేటాయించే 12-అంకెల కోడ్. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ నగరంలో సంపంగిరామనగర సీకేసీ గార్డెన్ అద్విత్ అపార్టుమెంటులో నాలుగో అంతస్తు నుంచి ఐదేళ్ల బిడ్డను కిందకు విసిరేసి హత్య చేసిన తల్లి, దంత వైద్యురాలు సుష్మాపై విచారణ సాగుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning 10 AM Top News: మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో ఓ సభలో మాట్లాడుతుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాయి. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSR Jayanthi 2022: వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. సేవకుల తయారీ విధానమది బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్‌లో చేరికలు.. అలకలు ‘ఒక్క చేరిక.. రెండు అసంతృప్తులు’ అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందనే చర్చ కార్యకర్తల్లో సాగుతోంది. కొత్త చేరికలు పాతవారి అలకలకు కారణమవుతున్నాయి. చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలో కొంతమంది పాతనేతల అసంతృప్తి క్యాడర్‌ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. The Warrior-Ram Pothineni: ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్ ‘‘నేను ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా 13 విజయాలు అందుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన మొదటి టీ20లో విజయంతో ఈ ఘనతను రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విమాన ప్రయాణికులకు బంపరాఫర్! విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్ ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్‌గా మారాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.. CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. Maharashtra Political Crisis: మీడియాకు చిక్కిన ఏక్నాథ్ షిండే.. పరుగే పరుగు! ముంబై: మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) మీడియా కంటపడ్డారు. గుజరాత్‌లోని సూరత్ విమానాశ్రయంలో ఆయన మీడియాకు చిక్కారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. Maharashtra Political Crisis: రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన అల్టీమేటం.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్తలు మహారాష్ట్ర మంత్రి, శివసేన అగ్రనేత ఏక్నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్ రాజకీయాలకు తెరలేపడంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ముందుగా గుజరాత్‌లోని సూరత్ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అస్సాంకు మకాం మార్చారు. దేశవాప్తంగా ‘మహా’ సంక్షోభం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.. CM Jagan Srikakulam Tour: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రాను న్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5..: నేనైతే పంత్ కెప్టెన్ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని! స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు రిషభ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించాల్సి కాదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ అన్నాడు. తనకే గనుక అధికారం ఉండి ఉంటే కచ్చితంగా 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేసేవాడిని కాదన్నాడు. ఆటగాడిగా పంత్ మరింత మెరుగుపడాల్సి ఉందని, పూర్తి స్థాయిలో పరిణతి చెందిన తర్వాతే కెప్టెన్‌గా భారాన్ని మోయగలుగుతాడని అభిప్రాయపడ్డాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. Chinmayi Sripada: ఎలా కన్నావని అడుగుతున్నారు? వారికి నా ఆన్సరేంటంటే.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను అటు చిన్మయితో పాటు అటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే పలువురు నెటిజన్లు చిన్మయి ఇంతకాలం తాను గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందా? లేదా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందా? అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటన్నింటికీ సమాధానమిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది సింగర్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. దటీజ్ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్! ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం పట్ల ఇండియన్ కార్పోరేట్ కంపెనీలు తమ వైఖరికి బయటపడకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ టాటాగ్రూపు ఇలా ఊరుకోలేదు. యుద్ధం కారణంగా పెచ్చరిల్లే హింస, రక్తపాతాలు, ఆర్తానాదాలను నిరసిస్తూ రష్యాతో వ్యాపార సంబంధాలు గుడ్‌బై చెప్పింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.. భారత్, చైనా, జపాన్‌లతో దాతల సమావేశం...సాయం కోరుతున్న శ్రీలంక శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం ఒక పెద్ద సవాలుగా మారింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. Monica Khanna: ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక.. 185 మందిని కాపాడి సమస్య ఉత్పన్నమైనప్పుడు సమర్థతను చూపలేక చిక్కుల్లో పడినవారున్నట్టే.. సమస్యల్లో ఉన్నవారిని అత్యంత సమర్థతతో కాపాడే ధీరులూ ఉన్నారు. ఈ రెండవ కేటగిరికి చెందుతారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.. 'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం' ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. మారుతున్న మహా రాజకీయం మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని పాలక సంకీర్ణం సంక్షోభంలో పడింది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే మహా రాజకీయాలను ఊహించని మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆటంకాలున్నా.. ఏపీలో అభివృద్ధి బాటే సంక్షేమాన్ని అడ్డుకోవడమే విపక్షం ఏకైక అజెండా. అయినా కూడా అభివృద్ధి బాటలో ఏపీ సర్కార్. గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల పనుల పూర్తికి ప్రాధాన్యం. రోడ్ల నిర్మాణంతోపాటు మెరుగైన నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలన్న సీఎం జగన్. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఇవాళే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను జూన్ 22వ తేదీ(బుధవారం) విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. డైరెక్ట్ లింక్ కోసం పూర్తి కథనం మీద క్లిక్ చేయండి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాయి చరణ్ కన్నుమూత అమెరికా మేరీల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో నల్గొండ వాసి మృతి చెందాడు. దుండగుడి కాల్పుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయిచరణ్ (26)మృతి చెందాడు. గత రెండేళ్లుగా సాయిచరణ్ అక్కడ పని చేస్తున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ నెగ్గిన లంక సొంతగడ్డపై 1992 తర్వాత తొలిసారి శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో వన్డేలో లంక 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. మరింత దూకుడుగా ఎలన్ మస్క్ ఉద్యోగుల తొలగింపు అంశంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లేబర్ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. మరింత దూకుడు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మస్క్ ఉద్యోగుల కోత విషయంపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్ దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ సింగర్ ప్రమఖ సింగర్ చిన్మయి శ్రీపాద తల్లయ్యారు. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరి పిల్లల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.అన్నాడీఎంకే వర్గపోరు.. ‘అమ్మ’ సమాధి వద్ద ఉద్రిక్తత అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
డాక్యుమెంటరీ ఫిల్మ్: ఇది నా ఇల్లు
ఎవరినైనా కలిసినప్పుడు మంచీ చెడు మధ్యలో తప్పక వచ్చే ప్రశ్న ‘మీ ఇల్లెక్కడ?!’ ‘ఇదే ప్రశ్నను లద్దాఖ్‌లోని ఓ పెద్ద మనిషిని అడిగినప్పుడు అక్కడి చుట్టూ కొండలు, విశాల మైదానాలు చూపిస్తూ... ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అని పరిచయం చేస్తే... ఆ ప్రపంచంలో 45 రోజులు ఉండి తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఇది నా ఇల్లు’ అని వివరించారు దీపాకిరణ్. ప్రపంచ వ్యాప్తంగా 75 వేల మందికి పైగా స్టోరీ టెల్లర్స్‌ను చేరుకున్న దీపాకిరణ్ హైదరాబాద్ వాసి. స్టోరీ ఆర్ట్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్, ఆర్ట్–బేస్డ్ ఎడ్యుకేషనలిస్ట్. ఈ స్టోరీ టెల్లర్ ఇటీవల ‘దిస్ ఈజ్ మై హోమ్’ అనే డాక్యుమెంటరీ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ యేడాది ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎమ్ఐఎఫ్ఎఫ్) లో ప్రదర్శనకు వచ్చిన 800 ఎంట్రీలలో ‘దిస్ ఈజ్ మై హోమ్’ టాప్ టెన్ జాబితాలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడినప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపకల్పన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘సముద్రం నుండి 3,700 మీటర్ల ఎత్తులో లద్దాఖ్ పర్వతాలలోని మారుమూల గ్రామంలో ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీని రూపొందించాను. లెహ్–లదాఖ్‌లోని రెసిడెన్షియల్ కోర్సులో భాగంగా, వర్క్ నేర్చుకుంటూ తీసిన మొదటి డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. కథ కలిపిన పరిచయాలు కిందటేడాది ఆగస్టులో రెండు వర్క్‌షాప్స్ కోసం చేసిన ప్లాన్‌లో భాగంగా లదాఖ్‌కు వెళ్లాను. లైఫ్‌లో ఒక ఛేంజ్ కోసం చేసిన ప్రయాణం కూడా. నాతో పాటు వర్క్‌షాప్ కోసం వచ్చిన స్నేహితులున్నారు. లద్దాఖ్‌లో ఒక మారుమూల ప్రాంతం అది. విసిరేసినట్టుగా ఉన్నాయి అక్కడి ఇల్లు. ఒక చిన్న కాఫీ షాప్‌లో కూర్చుని, ఫ్రెండ్స్‌తో సరదాగా ఓ కథ చెబుతున్నాను. మమ్మల్నే గమనిస్తున్న ఓ యువకుడు మేము చెబుతున్న కథ వింటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. మేమూ అతని గురించి తెలుసుకున్నాం. గ్రాఫిక్ డిజైనర్ అయిన తన పేరు వరుణ్. పట్టణాన్ని వదిలి లద్దాఖ్‌లో కుండలు తయారు చేసే పనిని నేర్చుకుంటున్నాడని తెలిసి చాలా ఆసక్తిగా అనిపించింది. వరుణ్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి ఎన్నో కుటుంబాలను కలిశాం. అలాగే, వరుణ్‌తో పాటు, వారి జీవన శైలిని ఒక కథగా తీసుకోవాలనిపించింది. అక్కడ నుంచి ప్రతీది ఒక ఆసక్తిగా మారిపోయింది. ఒక థీమ్ ప్లాన్ చేసి, వరుణ్‌తో మాట్లాడి డాక్యుమెంటరీ తీయడం ఆరంభించాను. దిస్ ఈజ్ మై హోమ్ వరుణ్ స్థానికులను కలిసి, ఒక్కో వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగుతుండగా వారు ఇచ్చిన సమాధానాలను తీసుకున్నాను. ఒక వృద్ధుడిని కలిసి మాట్లాడినప్పుడు అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. కానీ, వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని చూసి ‘పట్ణణాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నా, ఈ సంతోషం ఎక్కడా కనిపించదు ఎందుకు?’ అని అడిగినప్పుడు... ‘గదులు ఉండటం ఇల్లు కాదు. అలా చూడండి, చుట్టూ కొండలు, చూసినంత మేర పచ్చదనం. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది’ అన్నాడు. అతని మాటలు నాకు బాగా నచ్చాయి. ఒక కామిక్ స్ట్రిప్ కూడా నేను అంతకుముందే చూసి ఉన్నాను. అన్నీ కలిపి డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి ‘దిస్ ఈజ్ మై హోమ్’ టైటిల్ సరైనదనుకున్నాను. ఈ మూవీ చూసిన కొందరు డైరెక్టర్లు ‘మేమూ ఆ గ్రామంలో ఉన్నట్టు, అక్కడ వాళ్లను కలుసుకున్నట్టుగా ఉంది’ అని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. చాలా శక్తిమంతులు మంచుకొండల్లో అతి చల్లటి వాతావరణం లద్దాఖ్. అలాంటి చోట మాతోపాటు టౌన్‌కి బయల్దేరాలనుకున్న ఒక బామ్మ తెల్లవారు ఝామున నాలుగ్గంటలకే లేచి, చల్లటి నీళ్లతో తలస్నానం చేసి, రెడీ అయిపోయారు. నాకు ఆమె శక్తిని చూసి చాలా అద్భుతం అనిపించింది. మిగతావారూ అలాగే ఉన్నారు. కొత్తగా జీవించాలి.. నా రైటింగ్ బ్యాక్ గ్రౌండ్, స్టోరీ టెల్లింగ్.. నా డాక్యుమెంటరీ వర్క్‌కి బాగా పనికొచ్చాయి. ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్ పూర్తయ్యాక ముందు వరుణ్‌కి పంపించాను. వాళ్ల కుటుంబం మొత్తం ఆ డాక్యుమెంటరీ చూసి, చాలా సంతోషించారు. ఆ తర్వాత ఫిల్మ్ కాంపిటిషన్‌కు పంపించాను. టాప్‌టెన్‌లో నిలిచింది. అంతటితో నా పని పూర్తవ్వలేదు. మరిన్ని కొత్త పనులవైపు చూశాను. ఇటీవలే ఒక సర్టిఫికెట్ లైఫ్ కోచ్‌గా జాయిన్ అయ్యాను. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి మానసిక శక్తిని అందించింది లద్దాఖ్‌లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్. అక్కడి స్థానికులతో సంభాషణ, ప్రయాణం ఏదీ అంత సులువు కాలేదు. ప్రతిది ఛాలెంజింగ్. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అక్కడి మనుషులు, ప్రకృతి, నేర్చుకున్న కొత్త వర్క్ నుంచి.. మళ్లీ జీవించడం నేర్చుకున్నాను’’ అని వివరించారు ఈ స్టోరీ టెల్లర్ అండ్ డైరెక్టర్. దీపాకిరణ్ – నిర్మలారెడ్డి -
Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. Cyclone Asani: తీరంలో ‘అసని’ అలజడి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న ‘అసని’ తీవ్ర తుపాను గంటకు 25 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా 390 కి.మీ., విశాఖకు ఆగ్నేయంగా 390 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ., పూరీకి దక్షిణ దిశగా 580 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మేలు జరిగిన వారు రుణం తీర్చుకోండి.. సోనియా కీలక వ్యాఖ్యలు త్వరలో జరగనున్న చింతన్ శిబిర్ తప్పనిసరి తంతుగా మారటానికి వీల్లేదని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల సవాళ్లను, సైద్ధాంతిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పార్టీ తిరిగి జవసత్వాలు కూడదీసుకోవాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే పొరుగుదేశం ఉక్రెయిన్‌పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Andhra Pradesh: సర్కారు ఆస్పత్రుల్లో నిరంతర వైద్యం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఏమాత్రం తావులేదని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఇప్పుడు అలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పేలుడు పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్ దాడి జరి గింది. మొహాలీలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కార్యాలయం మూడో అంతస్తులోకి దుండగులు రాకెట్–ప్రొపెల్డ్ గ్రెనేడ్(ఆర్పీజీ) విసిరినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Telangana VRAs Pay Scale Issue: పది పాసైతేనే పేస్కేల్! గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పేస్కేల్ అంశాన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వీఆర్ఏల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వాలని, మిగతా వారందరికీ గౌరవ వేతనంతోనే సరిపెట్టాలనే ప్రతిపాదన సిద్ధమైందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎవరి కెరీర్‌ను ఎవరూ డిసైడ్ చేయలేరు హిట్ వచ్చినప్పుడు ఎగరకూడదు. ఫ్లాప్ వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. మా నాన్నగారి(ఈవీవీ సత్యనారాయణ) ఫ్రెండ్ అని, తెలిసినవారనీ.. ఆబ్లిగేషన్స్‌తో కొన్ని సినిమాలు చేశాను. వరుస ఫ్లాప్స్ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే... ఆబ్లిగేషన్స్ కోసం సినిమా చేయకూడదని, కథ నచ్చితేనే చేద్దామని ఫిక్సయ్యాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. కోల్‌కథ...ఇంకా ఉంది! తొలి పది మ్యాచ్‌లలో తీసింది 5 వికెట్లే... ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈసారి తన సత్తా చూపించాడు. 9 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ముంబైకి మంచి విజయావకాశం సృష్టించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. డెలివరీ గర్ల్స్ ఫుడ్ యాప్‌లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఐపీఎల్-2022 గెలుపు గుర్రాలకోసం ఫ్రాంఛైజీ వేట షురూ
-
లాజిస్టిక్స్ సూచీలో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
న్యూఢిల్లీ:ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతంగా నిల్చే లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరులో గుజరాత్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన 2021 సూచీలో వరుసగా మూడోసారి టాప్‌లో నిల్చింది. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఈ జాబితాలో 21 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో గుజరాత్ తర్వాత స్థానాల్లో హర్యానా (2), పంజాబ్ (3), తమిళనాడు (4), మహారాష్ట్ర (5) నిల్చాయి. టాప్ 10లో ఉత్తర్ ప్రదేశ్ (6), ఒరిస్సా (7), కర్ణాటక (8), ఆంధ్రప్రదేశ్ (9), తెలంగాణ (10) రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ వ్యవస్థ, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు సూచనలు మొదలైన వాటితో 2021 నివేదిక రూపొందింది. దీన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ ఆవిష్కరించారు. సూచీకి సంబంధించి మొత్తం 21 అంశాల్లో వివిధ రాష్ట్రాల పనితీరును కేంద్రం మదింపు చేసింది. ఈ ఏడాది మే–ఆగస్టు మధ్య కాలంలో ఇందుకోసం సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1,405 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంది. వచ్చే అయిదేళ్లలో లాజిస్టిక్స్ వ్యయాలను అయిదు శాతం మేర తగ్గించుకునేందుకు ఆయా వర్గాల అభిప్రాయాలు దోహదపడగలవి గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 13–14 శాతం స్థాయిలో ఉన్నాయి. -
‘వాతావరణ’ పెట్టుబడులు.. టాప్ 10 దేశాల్లో భారత్..
లండన్: గత అయిదేళ్లుగా వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న టాప్ 10 దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో నిల్చింది. దేశీ క్లైమేట్ టెక్ సంస్థలు 2016–2021 మధ్య కాలంలో 1 బిలియన్ డాలర్ల మేర వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు దక్కించుకున్నాయి. ప్యారిస్ ఒప్పందం అనంతరం అయిదేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలపై లండన్ అండ్ పార్ట్నర్స్, డీల్రూమ్డాట్కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నంబర్ వన్ అమెరికా తాజా నివేదిక ప్రకారం ప్యారిస్ ఒప్పందం తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ టెక్ కంపెనీల్లోకి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ పెట్టుబడులు అందుకున్న టాప్ 10 దేశాల్లో 48 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో, 18.6 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 5.8 బిలియన్ డాలర్లతో స్వీడన్ మూడో స్థానంలో నిలిచాయి. కాలుష్యకారక ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించే దిశగా అంతా సమిష్టిగా పనిచేయడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని నివేదిక పేర్కొంది. పర్యావరణంపై బహుళజాతి బ్యాంకులు దృష్టి పెట్టాలి - నిర్మాలాసీతారామన్ న్యూఢిల్లీ: పర్యావరణం, తత్సబంధ ప్రాజెక్టులు, పురోగతిపై ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) వంటి బహుళజాతి బ్యాంకులు దృష్టి సారించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఇందుకు ప్రైవేటు మూలధనం సమకూర్చడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆమె చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఏఐఐబీ గవర్నర్ల బోర్డ్ ఆరవ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల అవకాశాలను ఏఐఐబీ అన్వేషించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఏఐఐబీకి భారత్ అన్ని విషయాల్లో తగిన సహకారం అందిస్తుందన్నారు. రెసిడెంట్ బోర్డ్, రీజినల్ ఆఫీస్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఏఐఐబీకి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల బ్యాంక్ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందన్నారు. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి.. ప్రశ్నించడం మర్చిపోయారని ఆయన మంగళవారం ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు.. నో పార్టీ.. ఓన్లీ సేవ రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని మంగళవారం తెలిపారు. పూర్తి వివరాలు.. వెనక్కి తగ్గిన రజనీ.. కమల్ కామెంట్ ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన రాజకీయ ప్రకటనపై మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ స్పందించారు. రజనీకాంత్ ప్రకటనతో ఎంతో నిరాశ చెందినట్లు తెలిపారు. అయితే రజనీకాంత్ ఆరోగ్యమే తనకు ముఖ్యమని, ఎన్నికల ప్రచారం తరువాత రజనీని కలుస్తానని మంగళవారం కమల్ హాసన్ తెలిపారు. పూర్తి వివరాలు.. రైతు శ్రేయస్సే లక్ష్యం ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది. అందుకే తొలి రోజు నుంచీ రైతుల పక్షపాతంగా, రైతు శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా అన్నదాతల కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.61,400 కోట్లు చిరునవ్వుతో వెచ్చించాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వివరాలు.. పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. పూర్తి వివరాలు.. నేడు విజయనగరానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో సీఎం జగన్ పైలాన్ ఆవిష్కరించి, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. పూర్తి వివరాలు.. ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే నూతన సంవత్సర కానుక అందించారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని.. అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. పూర్తి వివరాలు.. తాగి నడిపేవాళ్లు తీవ్రవాదులే.. మద్యం తాగి వాహనం నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం అన్నారు. ‘మద్యం సేవించి బండి నడిపేవాళ్లు రోడ్డుపై ఏంచేస్తారో వాళ్లకే తెలియదు. పూర్తి వివరాలు.. ఇదీ మా ఎజెండా చర్చలకు సంబంధించి తమ షరతులను రైతు సంఘాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య బుధవారం జరగనున్న చర్చల ఎజెండాను మంగళవారం ఒక లేఖలో ప్రభుత్వానికి పంపించారు. పూర్తి వివరాలు.. ప్రపంచానికి తాళం ప్రపంచానికే తాళం పడింది. మార్కెట్లన్నీ మూత పడ్డాయి. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. 2020ని కరోనా వైరస్ కాలనాగై కాటేసింది. పూర్తి వివరాలు.. 2020లో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీ మూర్తులు ఊరి మీదకు రాక్షసుడొచ్చి పడ్డాడు. కొత్త ముఖం రాక్షసుడు. బండెడన్నం కాదు వాడి డిష్. రోజుకు బండెడు మనుషులు. ఊరు ఇంట్లోకి పరుగులు తీసి తలుపేసుకుంది. దబా.. దబా.. దబా.. దబా.. రాక్షసుడు తలుపు తడుతున్నాడు. పూర్తి వివరాలు.. 22 ఏళ్ల తర్వాత.. కమల్‌హాసన్–ప్రభుదేవా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్త నిజమైతే 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. పూర్తి వివరాలు.. డీమ్యాట్ ఖాతాల జోరు స్టాక్ మార్కెట్ రోజు రోజుకూ కొత్త శిఖరాలకు ఎగబాకుతుండటంతో షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్లకు మోజు, క్రేజు పెరుగుతోంది. అక్టోబర్‌లో కొత్తగా పదిలక్షలకు పైగా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు.. విజయ మధురం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను భారత్ 1–1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర ‘విభజించు.. పాలించు’ విధానంతో దుష్ట రాజకీయాలు చేయడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్రిటీష్ పాలకులను మించిపోతున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు. పూర్తి వివరాలు.. టీఆర్ఎస్లో రచ్చ: నువ్వెంతంటే.. నువ్వెంత! ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. సమావేశంలో ఆవేశకావేశాలకు లోనయ్యారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటలయుద్ధానికి దిగారు. పూర్తి వివరాలు.. సీఎంతో హీరో విజయ్ భేటీ..! సీఎం పళనిస్వామితో సినీ నటుడు విజయ్ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా ఆదివారం రాత్రి గ్రీన్‌వేస్ రోడ్డులోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. పూర్తి వివరాలు.. నేడు రైతు ఖాతాల్లోకి రూ.1,766కోట్లు రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేయనుంది. పూర్తి వివరాలు.. నరసన్న రథం రెడీ భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ప్రకటించిన గడువు కంటే ముందుగానే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయించింది. పూర్తి వివరాలు.. కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం కరోనా ప్యాకేజీపై మొండిపట్టు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మొండితనాన్ని వీడారు. పూర్తి వివరాలు.. 2025 నాటికి 25 నగరాల్లో మెట్రో ఢిల్లీ మెట్రోలో తొలి డ్రైవర్‌లెస్ ట్రైన్‌ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలను 25 నగరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలు.. 30న చర్చలకు రండి వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది..ఈ నెల 30న చర్చలకు రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపితే, తమ ఎజెండాను అంగీకరించకుండా కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. పూర్తి వివరాలు.. ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. పూర్తి వివరాలు.. బ్రహ్మోత్సవాలలోపే యాదాద్రి ప్రారంభం? బ్రహ్మోత్సవాలకు ముందే యాదాద్రి ప్రధానాలయం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో యాదాద్రి లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలు.. రామ్ చరణ్‌కి కరోనా పాజిటివ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాలు.. భారత్‌కు టెస్లా వస్తోంది అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై కంపెనీ కార్లు పరుగులు తీయనున్నాయి. పూర్తి వివరాలు.. ఆసీస్ 200 ఆలౌట్, భారత్ టార్గెట్ 70 పరుగులు బాక్సింగ్ డే టెస్టులో భారత్ లక్ష్యం ఖరారైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 200 ఆలౌట్ అయింది. దీంతో విజయం సాధించేందుకు టీమిండియా 70 పరుగులు చేయాల్సి ఉంది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
ఆ నిర్ణయాన్ని కేసీఆర్ వెనక్కి తీసుకోవాలి కొనుగోలు కేంద్రాల ఎత్తివేతని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉపసంహరించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆదివారం డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు.. వైదొలిగిన నితీష్.. కొత్త వ్యక్తికి బాధ్యతలు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజకీయపరంగా ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పూర్తి వివరాలు.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆదివారం నియమితులయ్యారు. పూర్తి వివరాలు.. నేడు చిత్తూరు జిల్లాకు సీఎం జగన్ రాక సీఎం వైఎస్ జగన్ సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. పూర్తి వివరాలు.. కళ్ల నిండా ఆనందం సొంతింటి కల ఇంత త్వరగా సాకారం అవుతుందని అనుకోలేదని చెబుతున్నారు. అద్దె కోసం ఇతర ఖర్చులు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నామని, ఇకపై ఈ కష్టం ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు.. నేడు 4 రాష్ట్రాల్లో డ్రై రన్ భారత్‌లో కరోనా టీకా పంపిణీకి యంత్రాంగం సన్నద్ధమైంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కానుంది. పూర్తి వివరాలు. నేడు పట్టాలపైకి డ్రైవర్ రహిత తొలి ట్రైన్ మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా మన దేశంలో సోమవారం పట్టాలెక్కనుంది. పూర్తి వివరాలు.. ఉద్యమం నుంచి ఉద్యమం వరకు కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది. ఒక ఉద్యమంతో మొదలై, ఒక మహమ్మారితో తీవ్రంగా వణికిపోయి, మరో మహోద్యమంతో 2020 ముగుస్తోంది. పూర్తి వివరాలు.. న్యూ ఇయర్ కానుకగా పీఆర్సీ! కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఒకట్రెండు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశముంది. పూర్తి వివరాలు.. పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు! ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. పూర్తి వివరాలు. జీఎస్టీ టీజర్ బాగుంది ‘‘నా శిష్యుడు జానకిరామ్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘జీఎస్టీ’(దేవుడు సైతాన్ టెక్నాలజీ). ఈ సినిమా టీజర్ చాలా బాగుందని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. పూర్తి వివరాలు.. కార్డులు, ఖాతాలు భద్రంగా ఉన్నాయా? మొబైల్ ఫోన్ నుంచే వ్యాలెట్ల వినియోగం, బ్యాంకింగ్ సేవలు, డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం బాగా విస్తృతమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీలతో.. వినియోగదారులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల నుంచి డిజిటల్ లావాదేవీలు చక్కబెట్టేస్తున్నారు. పూర్తి వివరాలు.. నాయకుడు నడిపించాడు టీమిండియాదే జోరు! తొలి రోజు బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. రెండో రోజు బ్యాటింగ్‌లో నిలిచింది. ఇలా ‘బాక్సింగ్ డే’ టెస్టులో రెండు రోజులు ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చాటింది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
ప్రజాస్వామ్యంపై మీ పాఠాలా? ప్రజాస్వామ్యం గురించి కొందరు వ్యక్తులు తనకు నిత్యం పాఠాలు చెబుతున్నారని, వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు.. కొండా సురేఖకు కీలక పదవి? రాష్ట్ర పార్టీలో మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరగనున్న టీపీసీసీ సంస్థాగత మార్పుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు.. శుభవార్త: రైతు బంధు ఇక ఇంటికే..! రైతుల బ్యాంకు ఖాతాలో నేటి నుంచి రైతు బంధు డబ్బు జమ కానుంది. నేరుగా రైతు చేతికే రైతుబంధు సొమ్ము అందనుంది. ఈ మేరకు తపాలా శాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. తపాలా కార్యాలయంలో ఖాతా ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలు.. ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు ప్రస్తుతం పట్టాలు పంపిణీ జరుగుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీలన్నింటిలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే నీటి వసతి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు.. ఆక్స్ఫర్డ్ టీకాకే తొలి ఛాన్స్ దేశవ్యాప్తంగా జనవరిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఒక పక్క ముమ్మరం కాగా, అత్యవసర వినియోగానికి ఆక్స్ఫర్డ్ కోవిడ్–19 టీకాకు వచ్చే వారంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు.. కొత్త వైరస్ ఆందోళన వద్దు! కరోనా కొత్త వైరస్‌తో తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. ఎక్కువ మందికి సోకి కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రముఖ వైద్యులు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. కె. శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. ఫ్రాన్స్‌కు పాకిన కొత్త కరోనా ఫ్రాన్స్‌లో తొలిసారి కొత్తరకం కరోనా వైరస్ బయటపడినట్లు ఫ్రెంచ్ వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కఠిన లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఇంగ్లండులో నివసించే ఫ్రాన్స్‌కి చెందిన వ్యక్తి 19న ఫ్రాన్స్‌కి తిరిగి వచ్చారు. ఈయనకు పరీక్షలు జరపగా కొత్తరకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. పూర్తి వివరాల కోసం.. హీరో ఈసైకిల్@ 49,000 హీరో సైకిల్స్ తాజాగా ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. F6i పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్ ఖరీదు రూ. 49,000. ఈసైకిళ్ల బ్రాండ్.. హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్‌ను 2020 మొదట్లో ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలుత ఆవిష్కరించింది. పూర్తి వివరాలు.. 2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది ఈ సంవత్సరం మనకు అన్ని సినిమాలూ పడ్డాయి కరోనా వల్ల. బయట లాక్డౌన్ సినిమా. హాస్పిటల్స్‌లో వెంటిలేటర్ల సినిమా. వ్యాన్లొచ్చి పట్టుకెళ్లే క్వారంటైన్ సినిమా. మాస్క్ సినిమా. కాఫ్ సినిమా. కోల్డ్ సినిమా...అన్నీ పడ్డాయి. వాటితో పాటు ఇంట్లో కూడా సినిమాలు పడ్డాయి. పూర్తి వివరాలు.. పైన్ అద్భుత క్యాచ్‌కు పుజారా బలి ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. 36/1 క్రితంరోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ గిల్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కమిన్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్ కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పూర్తి వివరాల కోసం... -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
21 ఏళ్లకే విజయం.. దేశంలో తొలి మేయర్ వయసు కేవలం 21 సంవత్సరాలు. చదువుతున్నది బీఎస్సీ రెండో సంవత్సరం. దక్కిన పదవి కీలకమైన నగరానికి మేయర్. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్. పూర్తి వివరాలు సొంతింటి కల సాకారం క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మంది అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నానని చెప్పారు. పూర్తి వివరాలు హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం ఉందని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. డిసెంబర్ 31న పబ్‌లు, బార్లు, హోటళ్లు, రిసార్ట్లు నిర్దేశించిన సమయానికే మూసేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని తెలిపారు. పూర్తి వివరాలు ధాబా బాబా.. కొత్త రెస్టారెంట్ విధి ఎవరిని ఎప్పుడు గెలిపిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరికి లేటు వయసులో అదృష్టం తలుపుతడుతుంది. అప్పుడు మనం ఎలా స్పందిస్తామనేదానిపై తదుపరి భవిష్యత్ ఆధారపడుతుంది. 80 సంవత్సరాల కాంతా ప్రసాద్‌కు చాలా లేటు వయసులో అదృష్టం. పూర్తి వివరాలు మీ భూములు సురక్షితం ఒప్పంద వ్యవసాయం(కాంట్రాక్ట్ ఫా మింగ్) వల్ల రైతుల భూమిని కార్పొరేట్లు స్వాధీనం చేసుకుంటారన్నది అవాస్తవమని, ఆ భయాలు పెట్టుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అపోహలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలు వారంలోనే 2,75,310 కేసులు ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ హెల్త్ సర్వీసెస్(ఎన్హెచ్ఎస్) గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కేవలం వారం రోజుల్లో 1,73,875 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. పూర్తి వివరాలు ఘోర రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఓమ్ని వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలు బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్ బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్లు మెరిశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిషాక్ ఇచ్చాడు. పూర్తి వివరాలు అదానీ బ్రాండింగ్... నిబంధనలకు విరుద్ధం నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం లీజుకిచ్చిన మూడు విమానాశ్రయాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ తన సొంత బ్రాండ్ పేరును ఉపయోగిస్తుండటంపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో సోనూసూద్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆయన స్ఫూర్తితో హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ యువకుడు నిర్వహిస్తున్న ‘లక్ష్మీ సోనూ సూద్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్’ను శుక్రవారం సందర్శించారు. పూర్తి వివరాలు యూనిఫామ్ ఆమె తొడుక్కుంటారు 2019 ఏప్రిల్‌లో భారత నావికాదళం వారి ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం జరిగి లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ మరణించేనాటికి అతనికి పెళ్లయ్యి నలభై రోజులు. భార్య కరుణ సింగ్ అతని వీర మరణాన్ని తొణకక స్వీకరించారు. పూర్తి వివరాలు -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత? బ్యాంకులను కొల్లగొట్టడంలో చంద్రబాబు అండ్ కో గ్యాంగ్‌స్టర్స్‌ని, స్కామ్‌స్టర్స్‌ని మించిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ బుధవారం ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు.. అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పూర్తి వివరాలు.. దక్షిణాఆఫ్రికాలో కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను గుర్తించారు. దీనివల్లనే అక్కడ కేసుల సంఖ్యతో పాటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని నిర్ధారించారు. పూర్తి వివరాలు.. పార్టీ ఏర్పాటుతో 24 గంటల్లో అధికారమా? ప్రజాకర్షణ లక్ష్యంగా గ్రామసభలకు డీఎంకే బుధవారం శ్రీకారం చుట్టింది. శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నం గ్రామంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పర్యటించారు. పూర్తి వివరాలు.. మరింత సమర్థవంతంగా సచివాలయాల పనితీరు గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, సమర్థవంతంగా పని చేసేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పూర్తి వివరాలు.. పులివెందులలో నేడు అపాచీ ఫుట్‌వేర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రముఖ పాదరక్షల తయారీ సంస్థ ఇంటెలిజెంట్ సెజ్ (అపాచీ) ఏర్పాటు యూనిట్‌కు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాలు.. 'దొంగలు..' బాబో! టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సన్నిహితుడైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులను మోసం చేయడంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నాడు. పూర్తి వివరాలు.. పీవీ భారతదేశ చరిత్రలో నిలిచిపోతారు: కేసీఆర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం పీవీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పించారు. పూర్తి వివరాలు.. కలకలం: పోలీసు అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే కొందరు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా తిరుగుతుండటం కలకలం రేపింది. పూర్తి వివరాలు.. న్యూజెర్సీలో తెలంగాణ వాసి మృతి అమెరికాలోని న్యూజెర్సీలో హన్మకొండ భవానీనగర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కిందపడి చనిపోయాడు. ప్రవీణ్‌కుమార్ (37) డిసెంబర్ 22న న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్షిప్ నుంచి న్యూయార్క్‌లోని ఆఫీసుకు వెళ్తుండగా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.. యూత్‌ఫుల్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఫ్యామిలీ యాంగిల్ ‘‘ఈ లాక్డౌన్ ఒక్కసారి ఆగి, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. మా ఇంటి చుట్టూ ఎన్ని రకాల పక్షులు సందడి చేస్తాయో ఈ లాక్‌డౌన్‌లోనే గమనించాను. పూర్తి వివరాలు.. మెస్సీ ప్రపంచ రికార్డు ఫుట్‌బాల్ క్రీడలో 46 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బార్సిలోనా స్టార్ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లయనెల్ మెస్సీ బద్దలు కొట్టాడు. పూర్తి వివరాలు.. డీల్ స్ట్రీట్‌లో డాన్.. రిలయన్స్ కరోనా కల్లోలం ఉన్నా, ఈ ఏడాది డీల్స్ జోరుగా జరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, పలు విదేశీ సంస్థలు మన కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
చైనాకు మరో షాకిచ్చిన అమెరికా రెండు ఆధిపత్ యరాజ్యాల మధ్య పోరు రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా చైనాకు షాకిచ్చే మరో బిల్లును పాస్ చేసింది. ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు టిబెటన్లకే కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు. ‘హోదా’ రాకపోవడానికి బాబు ప్యాకేజే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమని భావించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పూర్తి వివరాలు.. రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా! సూపర్‌స్టార్ రజనీ ఎంట్రీ దగ్గర నుంచి తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరుగా మక్కల్ సేవై కర్చీ, పార్టీ గుర్తుగా ఆటో రిక్షాను ఎంపికచేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు.. బ్రిటన్‌లో రికార్డు కేసులు కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్‌లో కోవిడ్–19 కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మహమ్మారి దేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి నమోదు కానంత భారీగా, రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు.. నేడు వైఎస్సార్ జిల్లాకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాలు.. ‘పోలవరం’ క్రెడిట్ వైఎస్‌దే పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. ఏపీ పోలీస్.. దేశానికే ఆదర్శం సమర్థవంతమైన సేవలందిస్తున్న ఏపీ పోలీస్ అనేక విషయాల్లో దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్స్‌లో గత ఏడాది అత్యుత్తమ సేవలందించిన వారికి మంగళవారం అవార్డులను అందజేశారు. పూర్తి వివరాలు.. కరోనా–2 కలకలం బ్రిటన్‌లో తాజాగా గుర్తించిన కొత్త రకం కరోనా వైరస్ భారత్‌లో కూడా అడుగుపెట్టిందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లండన్ నుంచి భారత్ లోని వివిధ రాష్ట్రాలకు వచ్చిన విమాన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాలు.. కొత్త వైరస్ కేసు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు! కొత్తరకం కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రాష్ట్రం లోకి ఇంకా కొత్త వైరస్ రాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పూర్తి వివరాలు.. 'కోబ్రా'కి ఇంకా టైముంది ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ను మళ్లీ స్క్రీన్ మీద చూపించడానికి రెడీ అయ్యారు వెంకటేశ్ అతని కో బ్రదర్ (కోబ్రా) వరుణ్ తేజ్. కానీ కోబ్రా లేకుండానే సెట్లోకి ఎంటర్ అవుతున్నారు వెంకీ. పూర్తి వివరాలు.. ‘క్యూ2’ కిక్! కరోనా కల్లోలం నుంచి భారత కంపెనీలు కోలుకుంటున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాలు దీనికి స్పష్టమైన సంకేతాలిచ్చాయి. చాలా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించాయి. పూర్తి వివరాలు.. ప్రేయసితో యువ క్రికెటర్ పెళ్లి టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ మంగళవారం ఒక ఇంటివాడయ్యాడు. కొరియోగ్రాఫర్ కమ్ యూట్యూబ్ స్టార్ ధనశ్రీ వర్మతో చహల్ కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. పూర్తి వివరాలు..