టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 22nd June 2022 | Sakshi
Sakshi News home page

Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Wed, Jun 22 2022 10:15 AM | Last Updated on Wed, Jun 22 2022 10:20 AM

Top10 Telugu Latest News Morning Headlines 22nd June 2022 - Sakshi

1. మారుతున్న మహా రాజకీయం
మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కిం‍ది. బీజేపీ ‘ఆపరేషన్‌ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని పాలక సంకీర్ణం సంక్షోభంలో పడింది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్‌నాథ్‌ షిండే మహా రాజకీయాలను ఊహించని మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. ఆటంకాలున్నా.. ఏపీలో అభివృద్ధి బాటే
సంక్షేమాన్ని అడ్డుకోవడమే విపక్షం ఏకైక అజెండా. అయినా కూడా అభివృద్ధి బాటలో ఏపీ సర్కార్‌. గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల పనుల పూర్తికి ప్రాధాన్యం. రోడ్ల నిర్మాణంతోపాటు మెరుగైన నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలన్న సీఎం జగన్‌.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఇవాళే
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను జూన్ 22వ తేదీ(బుధ‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల‌ చేయ‌నున్నారు. డైరెక్ట్‌ లింక్‌ కోసం పూర్తి కథనం మీద క్లిక్‌ చేయండి.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాయి చరణ్‌ కన్నుమూత
అమెరికా మేరీల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో నల్గొండ వాసి మృతి చెందాడు. దుండగుడి కాల్పుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సాయిచరణ్‌ (26)మృతి చెందాడు. గత రెండేళ్లుగా సాయిచరణ్‌ అక్కడ పని చేస్తున్నాడు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. ఆ‍త్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ
ఆ‍త్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్‌ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్‌ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్‌ నెగ్గిన లంక
సొంతగడ్డపై 1992 తర్వాత తొలిసారి శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో వన్డేలో లంక 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. మరింత దూకుడుగా ఎలన్‌ మస్క్‌
ఉద్యోగుల తొలగింపు అంశంలో టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లేబర్‌ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. మరింత దూకుడు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మస్క్‌ ఉద్యోగుల కోత విషయంపై క్లారిటీ ఇచ్చారు. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్‌
దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్‌ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్‌ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ సింగర్‌
ప్రమఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద తల్లయ్యారు. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్ద‌రి పిల్ల‌ల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్‌ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10.అన్నాడీఎంకే వర్గపోరు.. ‘అమ్మ’ సమాధి వద్ద ఉద్రిక్తత
అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. జూన్‌ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement