1. Azadi Ka Amrit Mahotsav: ఇంటింటా ‘తిరంగ’
ఎటు చూసినా మువ్వన్నెలే.. అన్ని వైపులా త్రివర్ణ పతాక రెపరెపలే..ప్రముఖులే కాదు ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా కనిపిస్తోంది. ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ దేశం నినదిస్తోంది. 75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల లోనూ అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత
ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝున్ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్‌లో చేరారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. వెంటిలేటర్‌పై రష్దీ.. తెగిపోయిన చేతుల్లోని నరాలు, దెబ్బతిన్న కాలేయం
భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. రీ సర్వే కొత్తపుంతలు.. విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలత
వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్లతో ఆధునిక తరహాలో రీ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఇంకా ఆధునికంగా నిర్వహించేందుకు ఏరియల్ రీ సర్వేకు శ్రీకారం చుట్టింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. ఉపఎన్నిక వేడిలో ఉడుకుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. రంగంలోకి ప్రియాంక?
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందా? తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా మరింత దృష్టి పెట్టేందుకు సిద్ధమైందా? ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనున్నారా?
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. డకౌట్ అయ్యానని ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ నా చెంపపై కొట్టాడు: టేలర్
ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్‌పై సంచలన ఆరోపణులు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్ టేలర్.. తన ఆత్మకథ ద్వారా మరో దిగ్భ్రాంతికర సంఘటనను బయట పెట్టాడు. ఐపీఎల్ 2011 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. Vijay Deverakonda: ఆయన కొట్టిన దెబ్బకు రోజంతా బాధపడ్డా
నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్‌టైసన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. స్వాతంత్య్ర దినోత్సవ సంరంభం: పిల్లల్లారా పాపల్లారా భావి భారత పౌరుల్లారా
రేపు ఆగస్టు 15. భారత దేశ పురోగామి పథంలో ఒక అమృత ఘట్టం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండాయి. పెద్దలు సాధించారు. యువకులు నిర్మించారు. బాలలు భవిష్యత్తుకు వెలుతురై ప్రసరిస్తారు. ఆగస్టు 15న పిల్లలతో ఉపన్యాసాలు ఇప్పించండి. ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించండి. పాటలు పాడించండి. దేశభక్తిని తెలిపే ఆటలు ఆడించండి.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. ఐప్యాక్ నివేదిక.. దిద్దుబాటు చర్యలపై టీఆర్‌ఎస్ ఫోకస్.. ‘సోషల్’గా వెళ్లాల్సిందే!
పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా కరడుగట్టిన సోషల్ మీడియా వారియర్స్ (సామాజిక మాధ్యమ ప్రచారకర్తలు)ను తయారు చేసుకోవడంపై దృష్టిపెట్టింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment