Morning Top 10 News
-
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. CM Jagan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్‌రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్‌రెడ్డికి లివర్ దెబ్బతింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీడీపీ అంతర్గత సర్వే ఏం చెబుతోంది?.. షాక్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా పార్టీలో తిరుగులేదనుకున్న దేవినేని ఉమాకు, గన్నవరం ఇన్చార్జిగా ఇటీవల వెళ్లిన బచ్చుల అర్జునుడుకు పార్టీ తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు? రాష్ట్రంలో మరిన్ని ప్రభు త్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసు, గ్రూప్స్ కొలువులకు నోటిఫికేషన్లు జారీకాగా.. తాజాగా గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ ‘‘ఆటంక్, లట్కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్ విద్యార్థినిపై ఫ్రొఫెసర్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనలో తప్పించుకున్న బాధితురాలు.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. International Disability Day: నిశ్శబ్ద విజయం పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్ శర్మ. పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సొంత ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..! ప్రస్తుతం శివారు ప్రాంతాలలో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి... ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా ఏ ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్ నిర్ణయించుకుంటాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ఆటగాడు దూరం బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియా భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో భాగంగా మహ్మద్ షమీ చేతికి గాయమైనట్లు బీసీసీఐ ఆధికారి ఒకరు తెలిపారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. లేట్ అయినా లేటెస్ట్గా వస్తామంటున్న స్టార్ హీరోలు అభిమాన హీరో సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ చెప్పిన తేదీకి ఆ సినిమా రాకపోతే నిరుత్సాహపడతారు. 2022లో అలా అభిమానులను నిరాశపరచిన స్టార్స్ ఉన్నారు. ఈ ఏడాది సిల్కర్ స్క్రీన్‌పై కనిపించాల్సిన ఆ హీరోల సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. జన సునామీ.. మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకతో మదనపల్లె కిక్కిరిసింది. సభా ప్రాంగణం, రోడ్లన్నీ కిటకిటలాడాయి. ఇంత వరకు ఏ రాజకీయ నేతకు, ముఖ్యమంత్రికి దక్కని ఘన స్వాగతం, జన నీరాజనం ఆయనకు లభించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్ మదనపల్లెలో బుధవారం సీఎం వస్తున్న దారిలో హమీదా అనే మహిళ తన ఏడాదిన్నర వయసున్న చిన్నారిని చేతులపైకి ఎత్తుకుని ‘జగనన్నా.. నా బిడ్డను కాపాడన్నా’ అని వేడుకుంది. బస్సులో నుంచి ఆ దృశ్యం గమనించిన సీఎం.. ఆమెను సభాస్థలి వద్దకు పిలిపించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కవిత, షర్మిల ట్వీట్ల యుద్ధం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.పేదల బియ్యంతో కోట్లకు పడగ రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది. గ్రామాలు, పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నా, రైస్ మిల్లులకు చేరవేయాలన్నా.. జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న తొలి విడత పోలింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 89 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. భారత్‌లో అబ్బాయిలకే కేన్సర్ వ్యాధి ఎక్కువ భారత్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా కేన్సర్ బారిన పడుతున్నారని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. సమాజంలో లింగ వివక్షే దీనికి కారణమై ఉండవచ్చునని అభిప్రాయపడింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.ఐసిస్ చీఫ్ హతం.. కొత్త అధినేతను ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం చైనాకు చెందిన అలీబాబా కంపెనీ అలీపే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో తనకున్న వాటాల నుంచి 3.07 శాతాన్ని (26,28,73,507 షేర్లు) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూపంలోనే ఈ విక్రయం జరిగింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్ బ్యూటీ మాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గార్గీ వంటి సక్సెస్‌ఫ/ల్ చిత్రంతో నిర్మాతగానూ మారారు. ఇటీవల అమ్ము అనే చిత్రంతో టైటిల్ పాత్ర పోషించింది. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అయి మంచి పేరును తెచ్చిపెట్టింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు ఊహించని షాక్! కానీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అందరి కంటే ముందుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించిన ఫ్రాన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. నేడు జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: టీచర్లు.. టీచింగ్కే విద్యారంగ సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల సమగ్ర పురోభివృద్ధికి వీలుగా ప్రభుత్వ టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని నిర్ణయించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎదురుదాడికి టీఆర్ఎస్ స్పెషల్ స్ట్రాటజీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీపై సాగుతున్న ప్రతికూల ప్రచారానికి పకడ్బందీగా అడ్డుకట్ట వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు? మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్‌తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు కర్ణాటక–సరిహద్దు వివాదంపై బుధవారం సుప్రీంకోర్టులో అతి ముఖ్యమైన విచారణ జరగనుండగా, అందరి చూపు సర్వోన్నత న్యాయస్థానంపై కేంద్రీకృతమైంది. తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ సర్కారుతో పాటు ప్రజల్లోనూ నెలకొంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గుజరాత్ ఎన్నికలు: కాంగ్రెస్‌ను ఊడ్చేస్తుందా? గుజరాత్లో అధికార పీఠం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎడాపెడా హామీలతో ప్రచార పర్వాన్ని ఇప్పటికే రక్తి కట్టించాయి. రేపు తొలి దశకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 5న రెండో, తుది దశ పోలింగ్‌తో అన్ని పార్టీల భవితవ్యమూ ఈవీఎంల్లోకి చేరనుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. యూనివర్సిటీలు ఖాళీ చైనాలో ‘జీరో కోవిడ్’ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై షీ జిన్‌పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరసనలు, ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు బలవంతంగా పంపిచేస్తుండడం గమనార్హం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. యాకమ్మ ఒక గొప్ప వెలుగు తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని. ఇంటర్లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్డి చేసింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మీరిద్దరు ఏం చేశారు? అది ఎటాక్‌లా లేదే.. దొరికిపోయావ్ శ్రీహాన్! బిగ్‌బాస్ ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ని పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. బీసీసీఐ అధ్యక్షుడిపై ఆరోపణలు.. ఆమె కారణంగా..! బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్‌కు ఫిర్యాదు చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. ఆ రెండు శాఖల్లోనే ఎక్కువ ఖాళీలు.. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే.. పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. Neena Rao: విజేత తల్లి ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! ‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. టాలీవుడ్లో మాస్ జాతర.. పూనకాలు తెప్పిస్తారట! టికెట్లు బాగా తెగాలంటే మాస్ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్ సినిమాలే ఉంటాయి. ఆ మాస్ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్‌కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 28న అకౌంట్లలో నగదు జమ 2022 ఖరీఫ్ సీజన్లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘పండంటి’ రాష్ట్రం.. దేశంలోనే ఏపీ అగ్రగామి ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే అన్నదాత అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. పండ్ల తోటలు తగ్గిపోతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులను ఉత్సాహపరుస్తున్నాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. ఆ లాకర్స్‌లో ఏమున్నాయి? తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనంగా మారింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో తీవ్ర నష్టం కలుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. యువతరం.. ఎవరి పక్షం...! ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా అందరి దృష్టి యువతపైనే. ప్రధాని మోదీకి యువతలో క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పులో కాస్త మార్పు కనిపించింది. ఈ సారి యువ ఓటర్ల మదిలో ఏముందో తెలుసుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పక్షులు చూపిన ‘బుల్లెట్’ మార్గం.. నిజమే.. ఆ కథేంటంటే జపాన్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు.. సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకూ మూలం. గంటకు నాలుగైదు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు ఆ దేశానికి ప్రత్యేకం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్స్ సేవలు అందించే సంస్థలకు కూడా లైసెన్సింగ్ విధానం, తేలికపాటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ‘తోడేలు’ మూవీ రివ్యూ తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్‌కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా పోర్చ్‌గల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని ఎంపీ రఘురామ అన్నట్లు సమాచారం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది? తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు లభించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. 2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం? క్రికెట్ మ్యాచ్‌లో వెంట వెంటనే వికెట్లు పడిపోతుంటే అభిమానుల గుండె బరువెక్కిపోతుంది తప్ప ఇతరత్రా కష్టనష్టాలు ఉండవు. అదే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు టపటప ఊడిపోతుంటే.. కుటుంబాలు కుటుంబాలు కష్టాలపాలవుతాయి. ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య ఇద్దరూ పెద్ద కంపెనీల్లో టెక్కీలు, కావలసినంత జీతం వస్తుంది, విలాసవంతమైన జీవితం ముందుంది. కానీ భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్లో ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు సత్యం స్కామ్ చార్టర్డ్ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లాతో వన్డే సిరీస్‌తో పాటు టెస్టులకు కూడా దూరమయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయం బారిన పడిన జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Kamal Haasan: కమల్ హాసన్‌కు అస్వస్థత స్టార్ హీరో కమల్‌హాసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంలో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్లో ఆయనను చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, డిశ్చార్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. ఏపీ సర్కార్ కొత్త చరిత్ర.. మీ భూమి మా హామీ అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సాకారం చేసి కొత్త చరిత్రను లిఖిస్తోంది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.ఏపీకి కేంద్ర బృందం కితాబు.. దేశమంతటా సచివాలయాలు గ్రామీణ ప్రజలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలన్నీ సర్వత్రా ప్రశంసలు అందుకోగా దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మల్లారెడ్డి కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన కుమారులు, బంధువులు, బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. దక్షిణం గాలి ఎటువైపు? ఆప్ దెబ్బకు బీజేపీ ఆశలు గల్లంతేనా? దక్షిణ గుజరాత్. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు ఆదివాసీల సమ్మేళనమైన ఈ ప్రాంతవాసులు ఎటు వైపున్నారు? 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నవతరం నయా ట్రెండ్ ‘వీ’ ట్యూబింగ్.. ఇంతకి ఏంటది? మన దేశంలో టాప్ యూట్యూబర్స్ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆర్థిక వ్యవస్థ: 40 లక్షల కోట్ల డాలర్లకు భారత్! స్వచ్ఛ ఇంధనం, డిజిటలీకరణ విప్లవాల దన్నుతో 2047 నాటికి భారత ఎకానమీ 13 రెట్లు వృద్ధి చెందనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా తెలిపారు. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 40 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని చెప్పారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. త్రిష పారితోషికం డబుల్.. ఒక్కో సినిమాకు ఎన్నికోట్లో తెలుసా? అదృష్టం ఎవరిని ఎప్పుడు? ఎలా? వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసొస్తే ప్రతిభ అనేది రెండోది అవుతుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సౌదీ అరేబియా కమాల్ కియా... లుజైల్ స్టేడియం 88 వేల మంది ప్రేక్షకులతో హోరెత్తిపోతోంది... అందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా అభిమానులే అయినా... అర్జెంటీనాను ఆరాధించేవారు కూడా తక్కువేమీ కాదు! 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా.. వరకట్న వేధింపులకు మరో అబల బలైన ఘటన నెలమంగల తాలూకా భూసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. శ్రుతి (29) తన భర్త క్రిష్ణమూర్తి చేతిలో హత్యకు గురైంది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఐదు బ్యాక్టీరియాలకు.. భారత్‌లో 6.8 లక్షల మంది బలి ఈ.కోలి. ఎస్ నిమోనియా, కె.నిమోనియా, ఎస్.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. లంకమల అడివి కానరాని కలివి కోడి.. ట్విక్–టూ.. ట్విక్–టూ అరుపులేవి! వైఎస్సార్ జిల్లాలో ఓ వైపు శేషాచలం.. మరోవైపు నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అదే జిల్లాలోని సిద్ధవటం–బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ పక్షి ‘ట్విక్–టూ.. ట్విక్–టూ’ అని అరుస్తోంది. ఎంత అన్వేషించినా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ నిశాచర పక్షిని ‘కలివి కోడి’ అని పిలుస్తున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ ఇప్పట్లో హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సిట్ గతంలో ఇచ్చిన నోటీసు మేరకు బీఎల్ సంతోష్ సోమవారం విచారణకు కావాల్సి ఉంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను? బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా? ఆది మానవుడు ఆహారాన్ని వండుకుని కాకుండా పచ్చిగానే తినేవాడని పుస్తకాల్లో చదువుకున్నాం. పచ్చిమాంసం, ఆకులు అలములు తిన్నట్లు కూడా చదువుకున్నాం. మానవుడు క్రమక్రమంగా పచ్చి ఆహారాన్ని కాకుండా వండుకుని తినడం నేర్చుకున్నాడు. అయితే, మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా?! పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్లో బీజేపీకి షాక్ తగులుతుందా? గుజరాత్లో విద్యుత్ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్ అండ్ పవర్ పర్చేజ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీపీఏ) రూపంలో పెంచింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం! జీతం మీద ఆదాయం పన్నుకి గురవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 17 (1) ప్రకారంజీతం అంటే ఏమిటో విశదీకరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో యజమాని నుండి ఒక ఉద్యోగి పుచ్చుకున్న మొత్తాన్ని జీతం అని అన్నారు. ఇంతటితో వదిలిపెట్టకుండా ఏయే అంశాలుంటాయో ఏకరువు పెట్టారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. హార్దిక్ ఆదేశించాడు.. అలా చేయమని!నేను పూర్తి చేశాను టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్.. ఇప్పడు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోను అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య అద్భుతమైన శతకం సాధించాడు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 'వారిసు' చిత్ర వివాదం.. విజయ్ ఏం ప్రకటన చేయనున్నారు? సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత ఆస్థాయిలో అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఈయన తన అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌కి రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పూజలో పాల్గొనేందుకు గుమిగూడిన జనం.. ట్రక్కు దూసుకెళ్లి 12 మంది దుర్మరణం.. బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుమిగూడిన జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్ తలసేమియా వ్యాధితో బాధపడుతోన్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్(7) చికిత్సకు సీఎం వైఎస్ జగన్ సహాయం అందించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్‌మార్టం.. ఆ నివేదికలో ఏముంది? మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం రాత్రి వరకు కొనసాగడంతో బూత్‌ల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం పోస్ట్‌మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. పీఎంఓ సీరియస్..! టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చినికిచినికి గాలివానలా మారుతుండటం, నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలపైనే ఆరోపణలు రావడంతో.. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నన్ను చంపజూసింది ప్రధానే ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను చంపేందుకు కుట్ర పన్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సెలూన్ వ్యాపారంలోకి రిలయన్స్! వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు సెలూన్ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. గ్రూప్ సంస్థ, దేశీయంగా అతి పెద్ద రిటైలింగ్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ తాజాగా చెన్నైకి చెందిన నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. తప్పయింది క్షమించండి: మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి కాంతార సినిమా తరహాలో పంజర్లి దేవుడి వేషం వేసి రీల్స్ చేసి తుళునాడు (కొడగు) ప్రజల ఆక్రోశానికి గురైన హైదరాబాద్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో క్షమాపణలు కోరారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.. విరాట్ కోహ్లి ఇవాళ(నవంబర్ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లి గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.అయితే ప్రతీ మనిషికి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రేమించొద్దని చెప్పినా వినలేదని.. ప్రేమ వ్యవహారం వద్దని నచ్చజెప్పినా వినలేదని కన్న కూతురిని తండ్రి హత్యచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. తూర్పుగోదావరికి సీఎం జగన్.. పర్యటన షెడ్యూల్ ఇదే.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. టీడీపీ దొంగాట!.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వక్రబుద్ధి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో నాన్‌టీచింగ్ సిబ్బందినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియో సంభాషణ ఇదే.. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి సంబంధించి మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో బీజేపీ దూతలుగా చెబుతున్న వారి మధ్య జరిగిన వీడియో సంభాషణల రికార్డింగ్‌ను (మొత్తం నాలుగు క్లిప్‌లు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం బహిర్గతం చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది? మునుగోడులో ఓటింగ్ సరళి, వివిధ వర్గాల ఓటర్ల స్పందనను బట్టి బీజేపీదే గెలుపు అని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు న్నారు. పెరిగిన ఓటింగ్ శాతం, సాయంత్రం దాకా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెల్లువెత్తడం వంటివి తమకు అనుకూలమని అంచనా వేస్తున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.గుజరాత్లో ముక్కోణపు పోటీ! గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలయ్యింది. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆగమనంతో ఈసారి ముక్కోణపు పోటీ జరగబోతోంది. రాష్ట్రంలో దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఎన్నికల పోటీ కొనసాగుతోంది. ఇప్పుడు ‘ఆప్’ సైతం ఆ రెండు పార్టీలకు సవాళ్లు విసురుతూ రణరంగంలోకి అడుగు పెడుతోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు ఆయన పేరు మైక్ మెరిల్. అమెరికాలోని పోర్ట్లాండ్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ‘టెక్ సపోర్ట్, వెబ్3 డెవలప్మెంట్’ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు 2008లో ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. కంపెనీలు, షేర్లు ఎందుకుగానీ.. తనకు తానే ఓ కంపెనీగా చేసుకుని, తన జీవితాన్నే షేర్లుగా మార్చి అమ్ము కోవాలని నిర్ణయించుకున్నాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Shikha Khanna: నూరు తల్లుల కథ 31 ఒక్క దేశాలు. 100 మంది తల్లులు. వారు టీచర్లు, సైంటిస్ట్‌లు, క్రీడాకారులు, సంగీతకారులు, మహిళా సైనికులు... రంగాలు వేరు. కాని మాతృత్వం ఒకటే. ఒక మహిళ నిర్వహించే అత్యుత్తమ కర్తవ్యం తల్లి కావడం. అందుకు ప్రతి తల్లీ ఒక భిన్న ప్రయాణం చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అక్టోబర్‌లో ‘సేవలు’ బాగున్నాయ్! భారత్ సేవల రంగం అక్టోబర్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుందని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సూచించింది. సెప్టెంబర్‌లో ఆరు నెలల కనిష్టం 54.3కు పడిపోయిన సూచీ, అక్టోబర్‌లో 55.1కు ఎగసింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్ బంగ్లాదేశ్‌తో అఖరి హోరాహోరీగా జరిగిన పోరులో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లా బ్యాటర్ నూరల్ హసన్ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వివాదాస్పద ఘటనపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘బనారస్’మూవీ రివ్యూ సిద్ధార్థ్(జైద్ ఖాన్) ఓ ధనవంతుడి కుటుంబానికి చెందని యువకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో తండ్రి గారాబంగా పెంచుతాడు. స్నేహితులతో పార్టీలు.. ట్రిప్స్ అంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేసే సిద్ధార్థ్.. ఓ పందెంలో నెగ్గడం కోసం ధని(సోనాల్ మోంటెరో)కి దగ్గరవుతాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. Munugode Bypoll 2022: ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు నిరీక్షిస్తున్నారు. చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. నాపై ఈగ వాలినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊరుకోదు.. ఈటల హెచ్చరిక తన హత్యకు కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని చెప్పారు. సీఎం ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, పక్కా స్కెచ్ ప్రకారమే మంగళవారం మునుగోడులో తనపై దాడి జరిగిందని అన్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పిల్లల్ని చదువుకోనివ్వండి రామోజీ! ఇంకెన్నాళ్లు కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ము కాసే ఈ రాతలు? ప్రభుత్వ స్కూళ్లపై విషం చిమ్మటం వెనక రామోజీరావు ఆందోళన ఒక్కటే. ప్రభుత్వ స్కూళ్లను ఫణంగా పెట్టి తాము పెంచిపోషించిన కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు నూకలు చెల్లుతున్నాయన్నదే!. గాలీవెలుతురూ లేని భారీ భవనాల్లో.. విద్యార్థులను బట్టీపట్టే యంత్రాల్లా మార్చేసే ఈ ‘కార్పొరేట్’ స్కూళ్లకు కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబు ఇపుడు అధికారంలో లేరన్నదే ఆయన బాధ. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. గెహ్లాట్ VS సచిన్ రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్‌పై దాడికి దిగారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో గెహ్లాట్‌పై ప్రశంసలు కురిపించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్? టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాము టైటిల్ గెలవడానికి రాలేదని, టీమిండియాను మాత్రం ఓడించితీరతామని అని షకీబ్ కామెంట్ చేశాడు. అయితే బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. డీజిల్‌పై ఇప్పటికీ రూ.4 నష్టమే! ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్‌పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పవన్‌కళ్యాణ్‌ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటకు వెళ్లినప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టు ఫోర్జరీ లేఖ వైరల్.. స్పందించిన బండి దొంగ పాస్‌పోర్టులు తయారుచేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం పెద్ద కష్టం కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫోర్జరీ లేఖ వైరల్ కావడంపై మంగళవారం రాత్రి ఆయన స్పందించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు స్థానికేతర నేతలు, శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గం బయటకు వచ్చినా ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఓటర్లపై పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రిజిస్ట్రేషన్ల అధికారంపై వ్యాజ్యం మూసివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని కల్పించడం సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని అడ్డుకున్నట్టు కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో పాటు సబ్ రిజిస్ట్రార్లు కూడా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హులేనని స్పష్టం చేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Rain Forecast: వచ్చే రెండు రోజులు వర్షాలు రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. గుర్తింపుకు నోచని రక్తచరిత్ర.. మాన్‌గఢ్ ధామ్.. మరో జలియన్ వాలాబాగ్ ఆదివాసీల ప్రాబల్యమున్న మాన్‌గఢ్ ప్రాంతమది. బ్రిటిష్ పాలనలో రక్తమోడింది. జలియన్‌వాలాబాగ్ ఘటనకి ఆరేళ్ల ముందు ఇక్కడ తెల్లదొరలు మారణహోమం సాగించి అక్షరాలా 1500 మంది ఆదివాసీల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. జాబ్ మానేయ్!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్లోకి వెళ్లి.. ఉద్యోగం చేసే స్త్రీ విషయంలో కుటుంబంలో ఎదురయ్యే ప్రతీ సమస్య ఆమెకు ఎప్పుడూ ఓ సవాల్‌గానే ఉంటుంది. పిల్లల సంరక్షణ, పెద్దల ఆరోగ్యం, ఆఫీస్ ఇంటికి దూరమైనా, ఆర్థికంగా బాగున్నాం అనుకున్నా... ముందుగా ‘ఆమె’ను ‘ఉద్యోగం మానేయ్!’ అని అంటుంటారు ఇంట్లో. ‘నిజమే కదా! నా అవసరం మొదట ఇంటికే ఉందనుకుంటూ కుటుంబం కోసం కెరియర్ను త్యాగం చేసేస్తుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా? బిలియనీర్, టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ బ్లూ టిక్ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో యూజర్లు తమ బ్లూ టిక్‌ను నిలుపు కోవాలన్నా, కొత్తగా బ్లూటిక్ కావాలన్నా ఇక చెల్లింపులు చేయాల్సిందే. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్‌కు చేరే జట్లను భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అంచనా వేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. Bigg Boss 6: నిందలు తట్టుకోలేక బాత్రూంలోకి ఇనయా.. రంగంలోకి బిగ్‌బాస్ బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్లో హౌస్మేట్స్ అంతా ఇనయాను టార్గెట్ చేశారు. ఆమె పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. ముఖ్యంగా సూర్య విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. దీంతో ఇనయా మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ నేడే అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు. లలిత్ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కల్లు కిస్తీలు రద్దు.. ఐదేళ్లకు కల్లుగీత పాలసీ మార్గదర్శకాలు విడుదల ఏపీలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదేళ్ల విధానాన్ని ప్రకటించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడుపై కేసీఆర్‌ది కపటప్రేమ.. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే.. మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే చండూరు సభలో సీఎం కేసీఆర్ కపటప్రేమ ప్రదర్శించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతూ చేయని పనులు పక్షం రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. చివరి ఘట్టానికి మునుగోడు ఉప ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి! మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం.. మునుగోడులో ఆ అభ్యర్థి కోసమే.. జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లో తనిఖీలు నిర్వహించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 89.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. జో బైడెన్, కమలా హారిస్ సంతాపం గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దం అవుతోంది. ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి తమ సెమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సమంత 'మయోసైటిస్' వ్యాధిపై కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ ఇప్పుడు చర్చంతా నటి సమంత గురించే. ఇంతకుముందు ఈమె వ్యాఖ్యలు, గ్లామరస్ పొటోలు, నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి రకరకాలుగా చర్చించుకున్న సినీ వర్గాలు ఇప్పుడు ఆమె బాధపడుతున్న వ్యాధి గురించి చర్చించుకుంటున్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. ది హిందూ ఇంటర్వ్యూ: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసు.. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం మునుగోడు నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాలకు రూ.5.24 కోట్ల బదిలీకి సంబంధించి వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీలో మారుతున్న రాజకీయం! టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మారతాయా? ఆ పరిణామాలు ఏ పార్టీకి ప్రయోజనం? ఏ పార్టీకి నష్టం ? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేనలు కలిసి పొత్తు పెట్టుకుని వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీచేస్తే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందా అన్న సందేహం కొందరికి రావచ్చు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పలకని పవన్.. నాదెండ్ల సైగ చేసినా సరే మౌన ప్రేక్షకుడిగానే ! జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈసారి విలేకరుల సమావేశంలో పూర్తి ప్రేక్షక పాత్ర వహించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్‌కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఉన్నట్టుండి బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా? మనిషి శ్వాస తీసుకుంటేనే ప్రాణాలతో ఉంటాడు. శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు ఎంతో కీలకం. మనిషి సాధారణంగా ఒక్క రోజులో దాదాపు 25,000 సార్లు ఊపిరి తీసుకుంటాడు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్, నత్రజని, తక్కువ మొత్తంలో ఇతర వాయువులు, తేలియాడే బ్యాక్టీరియా, వైరస్, వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాలు ఉంటాయి. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ట్విటర్లో ఉద్యోగాల కోతలు షురూ మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ .. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఉద్యోగులు ఎక్కువగా ఉన్న విభాగాలను భారీగా కుదించడంపై దృష్టి పెట్టారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. T20 WC 2022: మేము చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయాం! సూర్య అద్భుతం టీ20 ప్రపంచకప్-2022లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 49 పరుగులుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా? నటుడు, నిర్మాతగా బిజీగా ఉన్నా విశాల్‌పై తాజాగా ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో దొర్లుతుంది. అయితే ఇలాంటి వదంతులు ఆయనకు కొత్తేమీ కాదు. స్టార్ హీరోగా రాణిస్తున్న విశాల్ చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రధాని.. చరిత్రలో ఒకేఒక్కడు రిషి..! కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ను గాడినపెట్టే బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్‌కు మొదట్నుంచి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు ఉంది. చిన్నతనంలో తల్లి పనిచేసే ఫార్మసీ షాప్‌లో పని చేసినప్పుడే వాటి జమా ఖర్చులన్నీ చూసేవారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.ప్రధాని పదవి పూలపాన్పు కాదు.. రిషికి ముందుంది ముళ్లబాటే..! అపజయం ఎదురైన చోటే విజయాన్ని అందుకొని బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆ పదవి పూలపాన్పు కాదు. ముందున్నది అంతా ముళ్లబాటే. బ్రెగ్జిట్, కోవిడ్–19 సంక్షోభం, , రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థికంగా కుదేలైపోయిన బ్రిటన్ను దారిలోని తీసుకురావాల్సిన అతి పెద్ద సవాల్ ఆయన ఎదురుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్(800 మెగావాట్లు)ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం మొదట ఓ పిటిషన్ వేసి, ఆ విషయాన్ని దాచి పెట్టి... అదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేసిన విశాఖ వాసి పి.రంగారావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘చేనేతపై జీఎస్టీ కోరింది కేటీఆరే.. దీనికేం చెప్తరు ట్విట్టర్ టిల్లు?’ చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డీఏవీ స్కూల్ నిర్వహణలో మరో ఉల్లంఘన వెలుగు చూసింది. పాఠశాలకు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖాధికారుల పరిశీలనలో వెల్లడైంది. సఫిల్‌గూడ బ్రాంచి పేరుతో ఆరు, ఏడు తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.Deepmala Pandey: స్పెషల్ టీచర్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి! కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే! సిడ్నీలో నెట్ సెషన్ సందర్భంగా తమకు సరైన భోజనం లభించలేదంటూ టీమిండియా ఆటగాళ్లలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రాక్టీస్ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాతే వారు లంచ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా.. తన భార్య వైపు చూస్తున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ దళితుడు, అతడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా అతడి ఇద్దరు సోదరులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దామోహ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్ కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో జరిగిన యువతి దారుణ హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కుప్పం కోసం కుస్తీ: ఫోన్లు చేసినా.. బుజ్జగించినా.. మాకొద్దు బాబూ! కుప్పంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. గతనెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. 30 ఏళ్ల బానిస సంకెళ్లను తెగ్గొట్టి టీడీపీ కేడర్ మొత్తం వైఎస్సార్సీపీ వైపు చూస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అంతా గందరగోళం.. థరూర్.. ఓ విఫల ప్రయత్నం.! కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఒకపట్టాన అర్థం కావు. అంతా తెలిసినట్టుగానే ఉంటుంది. మొత్తం గందరగోళంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ చీఫ్ ఎన్నిక కూడా ప్రస్తుతం అలాగే తయారైంది. తమకిష్టుడైన ఖర్గేని హైకమాండ్ తరపున బరిలోకి దింపారు. మళ్ళీ ఎవరైనా పోటీ చేయవచ్చని కమ్మని కబుర్లు చెప్పారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.రష్యాకు మరో ఎదురుదెబ్బ ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంలో రష్యాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే వంతెనపై శనివారం పేలుడు సంభవించి కొంతభాగం దెబ్బతింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.ఈయనగారిని ఇలాగే వదిలెయ్యకండిరా.. బీజేపీ బాబులూ! సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘కేసీఆర్ ఫాంహౌస్‌లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘4జీ నుంచి 5జీకి ఇలా అప్‌గ్రేడ్ అవ్వండి’ సైబర్ నేరస్తులు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మార్కెట్ బూమ్‌ను బట్టి జేబులు నింపుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్, ఆధార్ కార్డు, బ్యాంకు సర్వీసులు, యూపీఐ పేమెంట్స్ ఇలా సందర్భాన్ని టెక్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.లాహిరి లాహిరి ‘క్రూయిజ్’లో..! సముద్రం.. ఎవరినైనా చిన్న పిల్లాడిలా మార్చేస్తుంది! ఎగసిపడే కెరటాల్లా మనసును కేరింతలు కొట్టిస్తుంది!! మరి అలాంటి సముద్రంపై ప్రయాణమంటే... అది కూడా 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్లాంటి క్రూయిజ్‌లో విహరిస్తే? తేలియాడే నగరంలో చక్కర్లు కొడితే? పోలా... అదిరిపోలా... 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.‘మెగా’ డైరెక్టర్‌తో ‘అక్కినేని’మల్టీస్టారర్.. స్క్రిప్ట్ రెడీ! తండ్రీకొడుకు నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట మోహన్ రాజా. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.'ధోని భయ్యాను చాలా మిస్సవుతున్నాం' రాంచీ అనగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చౌళూరు గ్రామంలోని ఆయన ఇంటి వద్ద వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు రాష్ట్రంలోని మరిన్ని ఆలయాల్లో స్వామివార్లకు నిత్య నైవేద్యాలు జరగనున్నాయి. ఆలయాల అభివృద్ధి, నిత్యం ధూప, దీప, నైవేద్యాలకు ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి మరో 2091 ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నడిబజారులో నిలబెడతాం.. బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ, పనికిమాలిన, ప్రచార కండూతి తప్ప మరో ధ్యాసలేని వ్యక్తి అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నేనేం సోనియా రిమోట్‌ను కాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత పార్టీకి డమ్మీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ఉండబోతారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన దీటైన సమాధానమిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం అహ్మదాబాద్‌లో ఖర్గే మాట్లాడారు.‘ నేనేం సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్‌ను కాదు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆ సత్తా భారత్ సొంతం ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతూ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం కేంద్రంగా లాజిస్టిక్ రంగం అభివృద్ధికి కీలకమైన అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధితో పాటు ఎగుమతి, దిగుమతులు సులభతరం చేసేలా 110 ఎకరాల విస్తీర్ణంలో మరో ఇండ్రస్టియల్ లాజిస్టిక్ 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి వెదుకుతున్నది దొరికితే కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అలాంటిది పారేద్దామనుకున్న టికెట్‌కు రూ.కోట్లు దక్కితే... ఆనందానికి అవధులుండవు. ఈ యూఎస్ మహిళ విషయంలో అది నిజమైంది. రోపర్‌కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్ ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్‘5’ను ఐదు డాలర్లకు కొన్నది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.. తర్వాతే.. రాజకీయ నాయకులు, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దింపి, మోసం చేసిన మాయలాడిని ఖండగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందిత మహిళ న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. అయితే పోలీసులు ఈ విషయమై అధికారికంగా సమాచారం జారీ చేయలేదు. ఆమె వద్ద 2 పెన్‌డ్రైవ్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Nayanathara: నయన్ అంత పెద్ద షాక్ ఇస్తుందా! దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి నయనతార. ఈమె గురించి నిత్యం ఏదో ఒక వార్త ప్రచారం అవుతునే ఉంటుంది. ఎక్కడో కేరళలో పుట్టి కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి కథానాయికగా గుర్తింపు పొంది నంబర్ వన్ స్థానానికి చేరుకోవడమే కాకుండా లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది టి20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రజా వెల్లడించాడు. షాహిన్ అఫ్రిది అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడని పేర్కొన్నాడు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. 'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఫ్యూచర్ కన్జూమర్ తాజాగా విఫలమయ్యాయి.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కాఫీ డే వెల్లడించింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. WHO: ఆ భారత కంపెనీ సిరప్‌లను వాడొద్దు భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఓవర్ స్పీడ్.. కేరళలో ఘోర ప్రమాదం ఓ డ్రైవర్ నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు బలిగొంది. కేరళలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కడ్ వడక్కన్‌చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అమ్మవారి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి.. 8 మంది మృతి, షాకింగ్ వీడియో విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్ నదిలోకి దిగారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియా గాంధీ గురువారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ అనారోగ్యంతో చాలాకాలంగా ఆమె పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. KCR Party: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేసిన జాతీయపార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయస్థాయిలో విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఏపీ వాసులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. YV Subba Reddy: తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు తిరుపతి శ్రీనివాససేతు రెండో దశ ఫ్లైఓవర్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.684కోట్లతో శ్రీనివాససేతు నిర్మాణంను చేపట్టినట్లు తెలిపారు. త్వరితగతిన మూడో దశ ఫ్లైఓవర్ పనులను కూడా పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సిరాజ్‌కు కలిసిరాని మూడో టీ20.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్.. కెప్టెన్ రోహిత్ సీరియస్ దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20తో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఏదీ కలిసిరాలేదు. ఎన్నో అంచనాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్ తన స్థాయి మేర రాణించలేదు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతను వికట్లేమీ లేకుండా ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్ బిగ్‌బాస్ ఫైమాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్మేట్స్ నిద్ర లేపాల్సి ఉంటుంది. ఇక ఆమె టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్న టైంలో వసంతి, మెరీనాలు దెయ్యం గెటప్‌లు వేసి ప్రాంక్ చేస్తారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన! ఒకే సమయంలో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన విప్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' పేరు మార్పు కేసీఆర్ కొత్తగా ఎలాంటి రాజకీయ పార్టీని స్థాపించడం లేదు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.. జాతీయ స్థాయి కార్యకలాపాలకు వీలుగా ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చుతున్నారు. నిబంధనల ప్రకారం పార్టీ జెండా, రంగు, ఎన్నికల చిహ్నం అన్నీ ప్రస్తుతమున్నవే కొనసాగుతాయి. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. డీజిల్ వాహనాలు.. ఇకపై ఎలక్ట్రిక్! తొలుత హైదరాబాద్‌లో ఆటోలకు బ్యాటరీల బిగింపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్ వాహనలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలుష్యనియంత్రణ దిశగా రెడ్కో ఈ చర్యలు చేపడుతోంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గుడ్‌న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’ వాతావరణంలో కాలుష్యం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం పంపింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ట్రాన్స్‌కో ఆస్తులు ప్రైవేటుకు! విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. India vs South Africa 3rd T20: చివరిది వదిలేశారు.. పోరాడకుండానే.. టీమిండియా టి20 ప్రపంచకప్ సన్నాహకం పరాజయంతో ముగిసింది. మెగా టోర్నీకి ముందు ఆడిన చివరి పోరులో భారత్ ఓటమి పాలైంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా మూడో టి20లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 49 పరుగులతో భారత్‌పై విజయం సాధించింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Godfather Twitter Review ‘గాడ్ ఫాదర్’ టాక్ ఎలా ఉందంటే.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అందుబాటులోకి 5జీ, భారత్‌లో ఇక టెక్నాలజీకి తిరుగుండదు భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రావడమనేది టెక్నాలజీని మెరుగుపర్చుకోవడానికి సంబంధించి ఒక ఉత్ప్రేరకం లాంటి ఘటనగా ఉండగలదని చిప్సెట్ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో అమోన్ తెలిపారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Dussehra 2022: పాలయమాం దేవీ! ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించే దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. ఆసేతు హిమాచలం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలలో ఒకటైన ఈ దసరా గురించి... 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఏదైనా స్పెషల్ చేసి పెట్టు, త్వరగా వస్తానంటవి.. ఇంతలోనే ఎంత పనైంది దేవుడా! విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు యమపాశాల్లా తెగిపడుతున్నాయి. వీటి బారిన పడి ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అయినా విద్యుత్ శాఖ అధికారుల్లో మార్పు రాలేదు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మునుగోడుపై టీఆర్ఎస్ ఫుల్ ఫోకస్! రంగంలోకి కేటీఆర్, హరీశ్ కూడా? మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడటంతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సర్వశక్తులూ ఒడ్డి అయినా మునుగోడులో విజయం సాధించాలని భావిస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇక కొత్త రోస్టర్.. ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెరగడంతో భారీ మార్పులు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో నూతన రోస్టర్ రూపకల్పన అనివార్యమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం ఉండగా తాజాగా 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు.. పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మరోసారి రెచ్చిపోయిన నార్త్‌కొరియా.. జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం నార్త్ కొరియా మరోసారి రెచ్చిపోయింది. మంగళవారం జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్ ప్రావిన్స్ నుంచి బాలిస్టిక్ పణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. సర్వేలో చేదు నిజాలు.. యువతలో గుండె సమస్యలు తీవ్రం ఆరోగ్య రాజధాని బెంగళూరులో యువత గుండె ఒత్తిడితో సమతమవుతోంది. మంచి చదువులు, ఉద్యోగం, ఇంకా రకరకాల లక్ష్యాలతో విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వయసుకు మించిన ఒత్తిడిని హృదయం అనుభవిస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంట్లోనే ఐపీఎస్ అధికారి దారుణ హత్య.. పనిమనిషి పరార్ జమ్ముకశ్మీర్ జైళ్ల ఉన్నతాధికారి హేమంత్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన ఇంట్లో శమమై కన్పించారు. నిందితులు ఆయనను గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గిన 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాలైన నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. IND vs SA 2nd T20: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి ఆస్ట్రేలియాపై సిరీస్ సొంతమైంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కింది. ఇక శనివారం ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరేముందు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే రెండు సిరీస్‌లు సాధించినా, ఒక ప్రధాన సమస్య మాత్రం జట్టును ఇంకా ఇబ్బంది పెడుతోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Bigg Boss 6 Telugu: ఈసారి కాస్త డిఫరెంట్‌గా.. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో రోహిత్ అండ్ మెరీనాలకు షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. గతంలో పోలిస్తే ఈసారి నామినేషన్స్ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగింది. వారిలోనే ఎవరో ఒకరు నామినేట్ అయి, మరొకరు సేవ్ అవ్వాల్సిందిగా ఆదేశించాడు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. హనీ వైద్యం కోసం రూ.కోటి మంజూరు ఓ చిన్నారి ప్రాణాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీరామరక్షలా నిలిచారు. ఆమెకు సోకిన అరుదైన వ్యాధి వైద్యానికి లక్షలాది రూపాయల ఖర్చును జీవితాంతం భరిస్తానని భరోసా ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అబద్ధాలే.. రామోజీకి నిత్యావసరం! నిత్యం అబద్ధాలాడటం... రామోజీరావుకు నిత్యావసరం!!. చంద్రబాబు నాయుడు ఐదేళ్లూ ఏమీ చేయకపోయినా... అదో గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా రోజూ కీర్తిస్తే జనాన్ని కొంతయినా నమ్మించగలమనేది ఆయన దింపుడు కళ్లం ఆశ. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కలల కొలువు సులువే పోటీ ప్రపంచంలో ఇప్పుడంతా ఆన్లైన్ మయం. ఇందులో ముందుండాలంటే మిగిలిన వారితో పోలిస్తే భిన్న ప్రతిభా పాటవాలు అవసరం. తాము చదువుకున్న కోర్సుకు సంబంధించి అదనపు నైపుణ్యాలు ఉన్న వారికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. టీఆర్ఎస్ నేతలపై గోనె ప్రకాశ్‌రావు సంచలన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పాలనలో ఎంపీటీసీలు మొదలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, అందుకే మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. దశమి రోజు ధ్వంస రచనకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు దసరా రోజున హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్రను కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో నగర పోలీసులు భగ్నం చేశా రు. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీ ఆదేశాలతో నగరంలో దసరా ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధ్వంసాలు సృష్టించడంతోపాటు నగరానికి చెందిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల్ని హతమార్చాలనుకున్న ముగ్గురు ముష్కరులను అరెస్టు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గుజరాత్లో అధికారం బీజేపీకే.. ఆప్‌కు రెండు సీట్లే! గుజరాత్లో అధికార పీఠాన్ని మళ్లీ బీజేపీ దక్కించుకోనుందని ఏబీపీ న్యూస్–సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఆదివారం వెల్లడించింది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ సంవత్సరం ఆఖర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి 135–143 సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ తెలియజేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పోరాటాలకు సిద్ధం కావాలి రాబోయే కాలంలో అతిపెద్ద పోరాటాలకు, ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటినుంచే సంసిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. స్వదేశంలో టీమిండియా కొత్త చరిత్ర.. స్వదేశంలో సౌతాఫ్రికాపై టి20 సిరీస్ గెలవలేదన్న అపవాదును టీమిండియా చెరిపేసింది. ఆదివారం గుహవటి వేదికగా జరిగిన రెండో టి20లో పరుగుల జడివానలో టీమిండియా 16 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మహేశ్-త్రివిక్రమ్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో! తెలుగు సినిమాలపై మరింత ఫోకస్ పెట్టినట్లున్నారు మలయాళ దర్శక-నిర్మాత, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్‌గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. సచివాలయాల ఉద్యోగుల కుటుంబాలపై సీఎం జగన్ ‘కారుణ్యం’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ఉదార నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఎవరైనా ప్రొబేషన్ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ గడువు పెంపు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన శనివారం వివరాలు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. వీఆర్ఏలపై సీఎం కేసీఆర్ సీరియస్.. వినతిపత్రం విసిరేసి.. వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. ఆయన స్నేహితుడు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న లక్ష్మీకాంతరావును పరామర్శించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కానరాని పాలపిట్ట.. జాడలేని జమ్మిచెట్టు! తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ ఆ రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట జరిగి 127 మంది దుర్మరణం పాలైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. 26 ఏళ్ల తరువాత న్యాయం: విధి చేసిన గాయం.. భక్తుడు చేసిన సాయం! పదవీ విరమణానంతరం తనకు రావాల్సిన నగదు మొత్తం దక్కక పోవడంతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ అధికారి ఒకరు భిక్షగాడిగా మారాడు. ఆయన దీనగాథను తన స్నేహితుడి ద్వారా తెలుసు కున్న న్యాయవాది కోర్టు తలుపుతట్టారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. హైదరాబాద్: మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. లేట్ చేయకండమ్మా! మొబైల్ రిటైల్‌రంగంలో ఏపీ, తెలంగాణల్లో వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను ప్రారంభించింది. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, హోం థియేటర్ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. DOCTOR G : మగ గైనకాలజిస్ట్ తిప్పలు ‘పేషెంట్లు మహిళా గైనకాలజిస్టునే ప్రిఫర్ చేస్తారు’ అంటాడు గైనకాలజీలో పి.జి. చేస్తున్న ఆయుష్మాన్. ‘ఈ ఆడ, మగ తేడా ఏంటి? డాక్టర్ డాక్టరే ఎవరైనా’ అంటుంది సీనియర్ మహిళా గైనకాలజిస్ట్ షేఫాలి షా. ‘పేషెంట్లు అలా అనుకోరు కదా’ అంటాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్. భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. తీవ్ర విషాదం.. రెండు రోజుల క్రితం తమ్ముడు.. ఇప్పడు రశ్మితా స్థానిక పారాబెడలో నివసిస్తున్న గదాధర నాయిక్ ఇంటిలో మరో విషాదం నెలకొంది. తన 12 ఏళ్ల కుమారుడు శిభాశిస్ నాయిక్ ఆత్మహత్య చేసుకొని మరణించి రెండు రోజులు గడవక ముందే కూతురు రశ్మితా నాయిక్(24) శనివారం ఆత్మహత్య చేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వ దీవెన రాష్ట్రంలో పేదోళ్ల ఆడ బిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం నగదు దీవెనలు అందించనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలో గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్లో గ్రూప్–1 పోస్టులతో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. గిరిజనులకు 10% కోటా.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు (జీవో నం.33) జారీ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ కౌంటర్.. చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదేళ్ల కిందట జరిగిన సాగరహారం ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ‘పిట్టపోరు’కు వేదికైంది. సాగరహారం ఫొటోలను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్లో కామెంట్ చేసిన మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాల విలీనం ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొన్ని గంటల ముందే రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై విరుచుకుపడింది. జపోరిజియా నగరంలోని మానవతా కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 30 మంది మరణించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. కాంగి‘రేసు’.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపైనే అందరి దృష్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గాంధీ కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉండడంతో పోటీ అనివార్యమైంది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది నాలుగోసారి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. మాటల మాంత్రికుడు శశి థరూర్ మామూలోడు కాదు.. అప్పుడు మోదీ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన మాటల మాంత్రికుడు శశి థరూర్ (66) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాను ఎవరో ఆడించినట్లు ఆడే తోలుబొమ్మను కాదని చెబుతున్నారు. విభిన్న రాజకీయవేత్తగా థరూర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చుట్టూ వివాదాలకు లెక్కలేదు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. రెపో రేటు పెంచుతూ ఆర్బీఐ వీర బాదుడు.. నిపుణులు ఏమంటున్నారో తెలుసా! రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ పెంపు నిర్ణయంపై నిపుణుల ఏమంటున్నారంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్ మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. Ponniyin Selvan: మణిరత్నం కల నెరవేరిందా? దర్శకుడు మణిరత్నం మూడు దశాబ్దాల కల పొన్నియిన్ సెల్వన్. దీనిని సాధ్యం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో రెండుసార్లు విఫలమయ్యారు. పరిస్థితులు అనుకూలించకపోవడమే ప్రధాన కారణం అయినప్పటికీ మణిరత్నం నిరుత్సాహ పడలేదు. తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ముగ్గురు ఎమ్మెల్యేల హత్యకు కుట్ర? టైమ్‌బాంబు తరహా పేలుళ్లకు మావోయిస్టుల ప్లాన్? ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు అలజడికి వేసిన ప్రణాళికను నిఘావర్గాలు, పోలీసులు ముందుగానే గుర్తించారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌ను హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.గుడ్ న్యూస్.. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్–4, మెడికల్ ఆఫీసర్లు, లెక్చరర్ తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. రష్యాకే జైకొట్టిన ఉక్రేనియన్లు.. త్వరలో లాంఛనంగా విలీనం! ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లెహాన్స్‌క్, జపోరిజియా, ఖెర్సన్ తదితర ఆక్రమిత ప్రాంతాలను లాంఛనంగా విలీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘మిషన్ తెలంగాణ’పై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ‘మిషన్ తెలంగాణ–2023’కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా గెలిచి కాషాయజెండా ఎగురవేసి తీరాలన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల నిర్దేశిత లక్ష్యసాధన దిశగా పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 41 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందిస్తున్నారు. 730 నంబర్ జాతీయ రహదారిపై బస్సు, మినీ ట్రక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గుండెపోటు ఎలా గుర్తించాలి.. గుండెపోటు రాకుండా ఉండాలంటే.. ఈ బిజీ జీవితంలో ఒత్తిడులు, శారీరక శ్రమ లేకపోవడం మన గుండెను ప్రమాదంలోకి నెడుతోంది. మారిన ఆహార అలవాట్లు గుండె నాళాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే.. అందువల్ల మన గుండెను మనం ఎంత ప్రమాదంలోకి నెడుతున్నామో తెలుసుకోవాల్సిన అవసరముంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మనకి అన్ని ప్రభుత్వ బ్యాంకులు అవసరం లేదు: ఎస్బీఐ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు దేశీయంగా పటిష్టమైన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొన్ని ఉన్నా సరిపోతుందని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య అభిప్రాయపడ్డారు. చిన్నా చితకా పీఎస్‌బీలను విలీనమో లేదా ప్రైవేటీకరించడమో చేయొచ్చని తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో టీమిండియా ముందంజ వేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ నానమ్మను తలుచుకుంటూ సితార సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. నిన్న(సెప్టెంబర్ 28) సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’ అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. తిరుమల: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్ తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. లిక్కర్‌పై టక్కరి ఎత్తులు! మద్యం తయారీ ధరల పెంపు కోసం డిస్టలరీలు ఎత్తులు వేస్తున్నాయి. పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని చీప్ లిక్కర్ కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దెబ్బకు దెబ్బ అన్నట్టు ఎక్సైజ్ శాఖ ఏకంగా మద్యం దిగుమతులకు సిద్ధమవుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్ఐపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఈ సంస్థతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలను చట్టవ్యతిరేక సంస్థలుగా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం! అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి! తమిళ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన బన్రూటి రామచంద్రన్‌తో అన్నాడీఎంకే ముఖ్య నేతలు మంగళవారం బంతాట ఆడుకున్నారు. ఓ వర్గం నేతగా ఉన్న పళణిస్వామి బన్రూటిని పదవీ నుంచి తప్పిస్తే.. మరో వర్గం నేత పన్నీరు సెల్వం ఆయనకు కొత్త పదవిని కట్టబెట్టారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. వీడియోలు, ఓటీటీ కంటెంట్.. 70 శాతం మంది ఆ వయసు వారే! మొబైల్ ఫోన్ దైనందిన జీవితంలో భాగమైంది. ఖాళీ సమయాల్లో 63.36 శాతం మంది యువత మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇందులో 51 శాతం మంది వీడియోలు, 29 శాతం ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. India Vs South Africa 1st T20: సఫారీతో ‘సై’ ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం గట్టి ప్రత్యర్థులతో ఏర్పాటు చేసిన సిరీస్‌లలో ఒకటి ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది. మేటి జట్టయిన దక్షిణాఫ్రికాతో మూడు టి20ల సిరీస్‌లో రోహిత్ బృందం తలపడనుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పెళ్లికి సిద్ధమవుతున్న అనుష్క? అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో విశేష గుర్తింపు ఆమె సొంతం. మంగళూరుకి చెందిన యోగా టీచర్ అయిన ఈమె 2005లో సూపర్ చిత్రంతో నాగార్జునకు జంటగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘నా పరిస్థితి ఎవరికీ రావొద్దు’.. యువతి సెల్ఫీ వీడియో కలకలం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతోపాటు అతడి బంధువుల వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటగండి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. AP Assembly: ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ గట్టి షాక్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఒడిశా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల్లో కోతలు విధించగా తాజాగా ఛత్తీస్‌గఢ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని పూర్తిగా తప్పించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. గాడి తప్పిన గురుకులం! ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిన వాస్తవాలు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంక్షేమ గురుకులాలు గాడి తప్పాయి. నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సదుపాయాలు సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పాన్ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల! జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరాను ముహూర్తంగా ఎంచుకున్నారు. విజయదశమి రోజున హైదరాబాద్ వేదికగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Regional Ring Road: రాయగిరి రైతులకు కష్టాల ‘రింగ్’! బతికేదెట్లా? అది రాయగిరి గ్రామం.. చుట్టూ పొలాలు, చేన్లతో కళకళాడేది.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు, హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉంటుంది. ఆ ప్రధాన రహదారి విస్తరణ కోసం గ్రామంలో కొంతమేర పొలాలు, భూములు పోయాయి.. అభివృద్ధి కోసమేకదా అనుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రాకుమారునిగా వెళ్లి... రాజుగా లండన్‌కు చార్లెస్ రాణి ఎలిజబెత్–2 ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే గురువారం ఉదయం రాకుమారుని హోదాలో లండన్ వీడిన చార్లెస్, ఆమె మరణానంతరం శుక్రవారం బ్రిటన్ రాజు హోదాలో తిరిగి రాజధానిలో అడుగు పెట్టారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆగండి.. ఒక్క క్షణం ఆలోచించండి! కష్టమనేది లేని రోజంటు లేదు కదా.. కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా’ అన్నారో సినీ కవి. ఇది అక్షర సత్యం. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదనేది జీవితం నేర్పిన పాఠం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలన నిర్ణయం.. వన్డేలకు గుడ్‌బై ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం విలేకరుల సమావేశంలో ఫించ్ వెల్లండించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టాలీవుడ్లో విషాదం.. ‘మహర్షి’ ఫేం నటుడు గురుస్వామి మృతి ‘మహర్షి’ ఫేం నటుడు, కర్నూలుకు చెందిన మిటికిరి గురుస్వామి (80) శుక్రవారం సాయంత్రం మరణించారు. ఆయనకు 15 రోజుల కిందట బ్రె యిన్ స్ట్రోక్ రాగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స పొంది, మూడు రోజుల కిందట కర్నూలు బాలాజీనగర్‌లోని స్వగృహానికి వచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. డిజిటల్ లెండింగ్ నిబంధనలు..వినియోగ హక్కుల పరిరక్షణ కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన డిజిటల్ లెండింగ్ నిబంధనలు వినియోగ హక్కుల పరిరక్షణకు అలాగే రెగ్యులేటరీ పరమైన అడ్డంకులను అధిగమించడానికి ఉద్దేశించినవి డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ‘నీట్–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల నీట్–అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్‌కు చెందిన తనిష్క టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ మూడో ర్యాంకు సాధించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నాడు – నేడు స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’ స్కూళ్లు విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా తాజాగా కేంద్ర ప్రభుత్వానికీ స్ఫూర్తిదాయకమైంది. నాడు – నేడు తరహాలో అన్ని సదుపాయాలతో ‘పీఎం శ్రీ’ పేరిట కొత్తగా స్కూళ్లను ప్రారంభించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. NEET Result 2022: జాతీయ స్థాయి ర్యాంకు లక్ష వచ్చినా తెలంగాణలో సీటు.. నీట్ నిపుణుల విశ్లేషణ ఇదే వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అందులో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Nims Hospital: ‘నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్సా?’ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌కు ఛాతీ నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త వినడానికే విచిత్రంగా ఉందని ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్ అభిప్రాయపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రూ.27,360 కోట్లతో ‘పీఎం–శ్రీ’ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం–శ్రీ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం–శ్రీ యోజన, పీఎం గతిశక్తికి సంబంధించిన రైల్వే ల్యాండ్ పాలసీ సవరణకు ఆమోదం తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు బ్రెజిల్లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పాకిస్తాన్ ఫైనల్‌కు.. టీమిండియా ఇంటికి భారత్ అభిమానుల్లో ఆశలు రేపేలా ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్‌లో చివరకు పాకిస్తానే వికెట్ తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. దీంతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాక్, శ్రీలంక జట్లు ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు రెండేసి విజయాలు సాధించగా, ఆడిన రెండూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్ ఆసియా కప్ టి20 టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ విడుదల, ధర ఎంతంటే! ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ గురించి ఫీచర్లు, వాటి ధరల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. డైరెక్టర్‌తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈషా రెబ్బా? టాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్తుల నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది ఈషా. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. దశాబ్దాల స్వప్నం సాకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన òనెల్లూరు బ్యారేజీను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఎస్పీ సీహెచ్ విజయారావు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Rain Alert: 9న అల్పపీడనం! రాష్ట్రంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 48 గంటల అనంతరం అంటే ఈ నెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్! మునుగోడు ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు కాకుండా జనవరిలో జరిగితే పార్టీకి మరింత ప్రయోజనమని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు ఈ అభిప్రాయంతో ఉన్నట్టు పార్టీవర్గాల సమాచారం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అప్పుడేమో పెళ్లై పిల్లలు పుట్టాక.. ఇప్పుడేమో అప్లికేషన్ పెడ్తేచాలు.. మునుగోడు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరవుతోంది. వివాహమైన ఏడాదికో రెండేళ్లకో, పిల్లలు పుట్టాక వచ్చే కల్యాణలక్ష్మి చెక్కులు.. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటికి సంబంధించిన చకచకా సాగిపోతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జింబాబ్వేను వణికిస్తున్న మీజిల్స్ వ్యాధి.. 700 మంది చిన్నారులు మృతి జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. యాత్రతో రాత మారేనా? ఎన్నికల్లో వరుస పరాజయాలు.. కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’కు బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. రోహిత్, కోహ్లి కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే! ఆస్ట్రేలియా వేదికగా జరగన్న టీ20 ప్రపంచకప్-2022కు సమయం దగ్గర పడతుండడంతో ఆయా జట్లు తమ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ మెగా ఈవెంట్‌కు ముందు ధ్వైపాక్షిక సిరీస్‌లతో జట్లు బీజీ బీజీగా గడపనునున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ! టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బాత్రూంలో ‘హెయిర్స్’ లొల్లి.. అతి చేసిన గీతూ! పక్కా లోకల్ పాటతో నిద్రలేచారు ఇంటి సభ్యులు. అభినయ శ్రీ తన మాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇంతలోనే గలాట గీతూ బాత్రూం గొడవ మొదలుపెట్టేసింది. బాత్రూంలో ఎవరివో హెయిర్స్ ఉన్నాయని, తలస్నానం చేసినప్పుడు ఎవరి హెయిర్స్ వాళ్లే తీసి పడేయాలి, బిగ్‌బాస్ తనకు ఈ టాస్క్ ఇచ్చినా చేయనని చెప్పుకొచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. హైదరాబాద్ వైద్య విద్యార్థినిపై పుదుచ్చేరిలో లైంగిక దాడి యత్నం వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడి ప్రయత్నం కేసులో పుదుచ్చేరి పోలీసుతో పాటు అతని స్నేహితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జిప్మర్ వైద్య విద్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. Azadi Ka Amrit Mahotsav: ఇంటింటా ‘తిరంగ’ ఎటు చూసినా మువ్వన్నెలే.. అన్ని వైపులా త్రివర్ణ పతాక రెపరెపలే..ప్రముఖులే కాదు ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా కనిపిస్తోంది. ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ దేశం నినదిస్తోంది. 75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల లోనూ అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝున్ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్లో చేరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. వెంటిలేటర్‌పై రష్దీ.. తెగిపోయిన చేతుల్లోని నరాలు, దెబ్బతిన్న కాలేయం భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. రీ సర్వే కొత్తపుంతలు.. విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలత వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్లతో ఆధునిక తరహాలో రీ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఇంకా ఆధునికంగా నిర్వహించేందుకు ఏరియల్ రీ సర్వేకు శ్రీకారం చుట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఉపఎన్నిక వేడిలో ఉడుకుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. రంగంలోకి ప్రియాంక? రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందా? తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా మరింత దృష్టి పెట్టేందుకు సిద్ధమైందా? ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనున్నారా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. డకౌట్ అయ్యానని ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ నా చెంపపై కొట్టాడు: టేలర్ ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్‌పై సంచలన ఆరోపణులు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్ టేలర్.. తన ఆత్మకథ ద్వారా మరో దిగ్భ్రాంతికర సంఘటనను బయట పెట్టాడు. ఐపీఎల్ 2011 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. Vijay Deverakonda: ఆయన కొట్టిన దెబ్బకు రోజంతా బాధపడ్డా నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్‌టైసన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. స్వాతంత్య్ర దినోత్సవ సంరంభం: పిల్లల్లారా పాపల్లారా భావి భారత పౌరుల్లారా రేపు ఆగస్టు 15. భారత దేశ పురోగామి పథంలో ఒక అమృత ఘట్టం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండాయి. పెద్దలు సాధించారు. యువకులు నిర్మించారు. బాలలు భవిష్యత్తుకు వెలుతురై ప్రసరిస్తారు. ఆగస్టు 15న పిల్లలతో ఉపన్యాసాలు ఇప్పించండి. ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించండి. పాటలు పాడించండి. దేశభక్తిని తెలిపే ఆటలు ఆడించండి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఐప్యాక్ నివేదిక.. దిద్దుబాటు చర్యలపై టీఆర్ఎస్ ఫోకస్.. ‘సోషల్’గా వెళ్లాల్సిందే! పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా కరడుగట్టిన సోషల్ మీడియా వారియర్స్ (సామాజిక మాధ్యమ ప్రచారకర్తలు)ను తయారు చేసుకోవడంపై దృష్టిపెట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1.జయహో జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీదే అధికారం.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తవుతున్నప్పటికీ, వైఎస్సార్సీపీ హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.అక్కడో మాట.. ఇక్కడో మాట.. అచ్చెన్న దొంగాట! పాతపట్నంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఎవరు ఎవర్ని ప్రోత్సహిస్తున్నారో, ఎవరు ఎవర్ని వాడుకుంటారో, అగ్ర నేతల మధ్య ఏ నేత బలి పశువు అవుతారో అంతు చిక్కని విధంగా తయారైంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ (75)పై శుక్రవారం అమెరికాలో హత్యాయత్నం జరిగింది. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.పడగ విప్పిన కరువు, జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్.. 500 ఏళ్ల విపత్తు! బ్రిటన్‌లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్‌లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్‌లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్ మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.ఎకానమీ.. శుభ సంకేతాలు! అంతర్జాతీయ, దేశీయ సవాళ్ల నేపథ్యంలోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. పలు రంగాలకు సంబంధించి శుక్రవారం వెలువడిన అధికారిక రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతుల గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. లైగర్ నుంచి ముచ్చటగా మూడో సాంగ్ కోకా 2.0 రిలీజ్ ఈ చిత్రంలోని ‘కోకా 2.0..’ అనే పాటని శుక్రవారం విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను గీతా మాధురి, రామ్ మిరియాల పాడారు. ఈ పాటలో పూరి జగన్నాథ్ కూడా కనిపిస్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని నిర్ధారించారు. జింబాబ్వే సిరీస్‌కు, ఆసియా కప్‌కు మధ్య తక్కువ వ్యవధి ఉండటమే అందుకు కారణం. ‘టీమిండియాకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వేకు వెళతారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య.. తులసిచెట్టుకు పూజ తనకు పెళ్లి చేయడం లేదన్న కోపంతో తండ్రిని, చిన్నాన్నను హతమార్చాడో యువకుడు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల ఉద్యోగంలో చేరిన దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించాయి. 12 మంది జెడ్పీ డిప్యూటీ సీఈవోలుగా, మరో 225 మంది డీఎల్డీవో స్థాయి హోదాలో ఒకేసారి 237 మంది ఎంపీడీవోలు గురువారం పదోన్నతుల పత్రాలను స్వీకరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా! పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది జూలై రెండో వారంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీఆర్ఎస్లో రోజుకో జిల్లాలో అసమ్మతి రాజకీయం.. ఇప్పుడు వికారాబాద్ పంచాయితీ! టీఆర్ఎస్లో రోజుకో జిల్లాకు సంబంధించిన అసమ్మతి రాజకీయం ప్రగతిభవన్‌కు చేరుకుంటోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గ నేతలు బుధవారం ప్రగతిభవన్ మెట్లెక్కారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ! పదివేలు దాటినా సీఎస్సీ పక్కా తెలంగాణ ఎంసెట్ రాసిన 1.56 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్‌లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో.. ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో సీటు దొరుకుతుంది? కోరుకున్న బ్రాంచ్‌లో సీటు రావాలంటే ఎంత ర్యాంకు రావాలి? 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. యంగిస్తాన్! నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించే మేధో సంపత్తితో కూడిన యువ శక్తి భారత దేశ సొంతం. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత యువ జనాభా మన దగ్గరుంది. మన దేశ సగటు వయసు కేవలం 28 ఏళ్లు! 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మరో సంస్థను అమ్మకానికి పెడుతోన్న కేంద్రం! మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికిగల వాటా విక్రయ నిర్వహణను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్ దూరం! స్వదేశంలో టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌కు కూడా జింబాబ్వే రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ గాయం కారణంగా దూరమయ్యాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సింగర్ కన్నుమూత సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, నేషనల్ అవార్డు విన్నర్ శివమొగ సుబ్బన్న(83) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అన్నా.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే.. ‘అన్నా.. నువు నన్ను వదిలి వెళ్లిపోయావు.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే.. ఈ రోజే రాఖీ కొని తీసుకువచ్చాను.. ఒక్కగానొక్క అన్నవు.. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోతే ఎలా.. అన్నా..’ అంటూ మృతుడి సోదరి ఉపాసన రోదించిన తీరు కంటతడి పెట్టిచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. సీఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. విద్యార్థులకు రూ.11,715 కోట్ల లబ్ధి రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. గాలి రాతలైతేనే అచ్చేస్తాం! రామోజీ పచ్చ రాతలు.. నిజాలకు పాతరేస్తూ ‘ఈనాడు’ కథనం ఓబుళాపురం ప్రాంతంలోని మూడు ఇనుప ఖనిజం గనులకు ఉన్న 50 సంవత్సరాల లీజు కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి కాలపరిమితి ముగిసిన గనులకు 1957 గనుల చట్టం ప్రకారం ఈ–ఆక్షన్ ద్వారా తిరిగి లీజులు కేటాయించాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనలు మూడు వర్ణాల్లో ఒక్కో వర్ణానిది ఒక్కో సైజు.. రంగులు సరిగ్గా అద్దక మధ్యలో తెల్లటి చారలు.. తెలుపు వర్ణం మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం పక్కకు జరగడం.. జెండాలపై చేతి రాతలు.. వెరసి జాతీయ పతాక నియమావళి (ఫ్లాగ్ కోడ్) ఉల్లంఘనలు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయజెండాను రేషన్‌కార్డు పేద లబ్ధిదారులతో బలవంతంగా కొనుగోలుచేయిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రూ.20 పెట్టి జెండా కొనాల్సిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? సాధారణంగా ఎన్ని గొడవలున్నా శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటిగా కలుసుకుంటాం. అందుకు భిన్నంగా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడంలో సిద్ధహస్తులుగా మారుతున్నారు టీడీపీ నగర నేతలు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. టీఆర్ఎస్లో టికెట్ లొల్లి.. అసమ్మతి లేఖాస్త్రం.. చల్లార్చే యత్నం మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నాయి. అయితే అధికార పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్ కంపెనీలకు భారీ షాక్! పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక...ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఒకేరోజు షూటింగ్లో గాయపడిన ఇద్దరు హీరోయిన్స్ సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్లో తీవ్రంగా గాయపడింది.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రికి వన్ జన్‌పథ్‌లో బస చేసి, 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. రివర్స్ ప్లాన్‌తో గేర్ మార్చిన కేసీఆర్.. మునుగోడుపై అదిరిపోయే వ్యూహం! కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిపై ముందే అప్రమత్తమైన కాంగ్రెస్ శుక్రవారం ఆ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించి శంఖారావం పూరించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్.. రూ.10 వేల తక్షణ సాయం, వీల్ ఛైర్ అందజేత వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా గురువారం మంజూరు పత్రం అందజేసినప్పటికీ, సీఎం ఆదేశాలతో 24 గంటలు తిరక్కుండానే శుక్రవారం పింఛన్ సొమ్ము అందజేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం సచివాలయంలో నక్కా ధర్మతేజకు ఎంపీడీఓ జె.రాంబాబు, సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యంలు పింఛన్ అందజేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రేవంత్ ‘హస్త’వాసి బాగోలేదు.. తెరపైకి సంచలనలతో సీనియర్లు క్యూ! కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అక్కడ 52 ఏళ్లుగా ఎగరని జాతీయ జెండా.. మోదీ జీ మీరైనా చెప్పండి ప్లీజ్! ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు జాతీయ జెండాను కొరియర్లో పంపారు ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మార్కం. ఖాదీతో తయారు చేసిన ఆ త్రివర్ణ పతాకాన్ని మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎగురవేయాలని కోరారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కరోనా ఎంత పనిచేసింది.. ప్రతీ 8 మందిలో వారికి ఈ లక్షణాలు! కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిపై ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందట. శ్వాసకోస సమస్యలు, నీరస, రుచి, వాసన తెలియకపోవడం వంటి వ్యాధి లక్షణాల్లో కనీసం ఒక్కటైనా వారిని చాలాకాలం బాధిస్తున్నట్టు లాన్సెట్ జర్నల్ శుక్రవారం విడుదల చేసిన తాజా సర్వే పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. రాతపూర్వకంగా కూడా తలాక్ చెల్లదు.. తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు నోటి మాటగా మూడుసార్లు తలాక్ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్‌నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దుకాదని హైకోర్టు తేల్చి చెప్పింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. నాలుగో టి20.. గెలిస్తే సిరీస్ వశం అమెరికా గడ్డపై సిరీస్ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నేడు వెస్టిండీస్‌తో నాలుగో టి20లో తలపడనుంది. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో భారత్ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం చాలు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రిస్క్‌గా మారిన రీమేక్స్.. ఇష్టం లేకున్నా మళ్లీ మళ్లీ! టాలీవుడ్ అంటేనే రీమేక్స్ అడ్డా. వేరే ఇండస్ట్రీస్‌లో సూపర్ హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. ప్రస్తుతం చిరు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మూఢ విశ్వాసం: ఆడపిల్ల దున్నితే అరిష్టమట! మహమ్మారి కమ్ముకుంటుందట! రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లో ఈ వింత జరిగింది. తన పొలంలో దున్నడానికి కొత్తగా కొనుక్కున్న ట్రాక్టర్‌తో బయలుదేరిన 22 ఏళ్ల యువతి మంజును గ్రామస్తులు ఆపేశారు. ఆడపిల్ల పొలం దున్నడం అరిష్టమన్నారు. మహమ్మారి కమ్ముకుంటుందన్నారు. జరిమానా వేస్తామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మంకీపాక్స్‌ను తేలిగ్గా తీసుకోవద్దు.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన బైడెన్ సర్కార్ ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మహమ్మారిపై పోరాటం కోసం ఎక్కువ నిధులు కేటాయించడమే గాక, సమాచార సేకరణ కోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. 'టార్గెట్ 175' కుప్పం నుంచే తొలి అడుగు రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేసే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలకు ఉద్బోధించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. చైనా ఎంత పని చేసింది.. ప్రపంచ దేశాలకు పెను సవాల్! కోవిడ్ ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రభావం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. పులి మీద పుట్రలా తైవాన్ చుట్టూ చైనా చేస్తున్న సైనిక విన్యాసాలు, క్షిపణి దాడులు ఆందోళన పెంచుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆజం ఖాన్.. పరామర్శించిన అఖిలేశ్ యాదవ్ ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ గురువారం అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆజం ఖాన్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. నగరవాసులకు అలర్ట్ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా! తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి, పీడీ యాక్టు కింద జైలు జీవితం గడిపిన ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. భారతీయులకు గుడ్‌న్యూస్.. డేటా రక్షణకు కొత్త బిల్లు వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించి కొత్త బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాటికి తీసుకొస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును లోక్‌సభ నుంచి బుధవారం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మంత్రి వైష్ణవ్ దీనిపై మాట్లాడారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టీమిండియా వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి! ఆసియా కప్ 2022కు సంబంధించి టీమిండియా జట్టును ఆగస్టు 8(సోమవారం) ప్రకటించనున్నారు. ఉపఖండంలో జరిగే ఈ మెగాటోర్నీని టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న టి20 ప్రపంచకప్‌కు ఇది సన్నాహకంగా మారుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మునుగోడులో కాల్పుల కలకలం! కారణాలివేనా? వాటర్ బాటిల్స్ సరఫరా చేసే డీలర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చి దాడి చేసి వెంటనే పరారయ్యాడు. మూడు చోట్ల బుల్లెట్ గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. రామోజీ ‘మేనేజ్మెంట్’కు ఇదో ఉదాహరణ ‘అక్రమంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేసిన మార్గదర్శి కేసులో రామోజీరావు రూ.6,000 కోట్లు జరిమానాగా కట్టాలి. రామోజీరావు వసూలు చేసిన డబ్బు కట్టేసి కేసు నుంచి బయటపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కేసీఆర్‌కు కీలకంగా మారిన మునుగోడు.. ఐ ప్యాక్ నివేదికలో ఏముంది! మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా కన్పిస్తున్న నేపథ్యంలో అక్కడ గులాబీ జెండా ఎగిరేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. సుమారు పక్షం రోజుల క్రితమే ఉప ఎన్నికపై స్పష్టంగా ఉప్పందడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్ టవర్స్ ప్రత్యేకలివే.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా కన్పిస్తున్న నేపథ్యంలో అక్కడ గులాబీ జెండా ఎగిరేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. సుమారు పక్షం రోజుల క్రితమే ఉప ఎన్నికపై స్పష్టంగా ఉప్పందడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి కోరారు. సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని.. ఆయన రాయకపోతే తానే లేఖ రాస్తానన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘పునరావాస కేంద్రం నుంచి అధికారులు గెంటేయలేదు’.. వాస్తవానికి భిన్నంగా ‘ఈనాడు’ కథనం ప్రభుత్వంపై బురద చల్లేందుకు పత్రికా ప్రమాణాలకు తిలోదకాలిస్తూ ఈనాడు పత్రిక మరోసారి దిగజారుడు రాతలకు దిగింది. వాస్తవాలను దాచిపెట్టి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మంగళవారం ‘చంద్రబాబుకు బాధలు చెబితే పునరావాస కేంద్రం నుంచి గెంటేస్తారా?’ అంటూ ఏలూరు జిల్లాలోని గోదావరి ముంపు గ్రామమైన వేలేరుపాడు గ్రామానికి చెందిన ఎర్రా వనజాకుమారి చెప్పినట్టు ఓ కథనాన్ని వండి వార్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (82) తైవాన్ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘మహా’దారిలో జార్ఖండ్ ? కాంగ్రెస్ భయానికి కారణాలివీ... జార్ఖండ్ మరో మహారాష్ట్ర కానుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది. మహారాష్ట్రలో 40 మంది పై చిలుకు ఎమ్మెల్యేలతో ముంబై నుంచి బిచాణా ఎత్తేసి వేరుకుంపటి పెట్టుకున్న శివసేన నేత ఏక్నాథ్ షిండేతో బీజేపీ రసవత్తర రాజకీయ నాటకం ఆడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. వర్క్ ఫ్రమ్ హోమ్: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి! కరోనా అనంతరం మారిన పరిస్థితుల్లో.. మహిళలు ఇంటి నుంచి పనిచేసేందుకే (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అవకాశం కల్పించే కంపెనీల వైపు చూస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు సృష్టించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. టాలీవుడ్ అసలు శత్రువు ఎస్ఎస్ రాజమౌళి, యూట్యూబ్ చానళ్లు ప్రస్తుతం టాలీవుడ్లో షూటింగ్ సంక్షోభం నెలకొంది. ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్స్‌పై పలువురు సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్.. 4 రోజులు తిరక్కముందే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అభ్యర్థించి 4 రోజులు తిరక్కముందే ఆర్థిక సహాయం మంజూరు కావడంతో ఆ పేద దంపతుల ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన చీమల సునీత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్రం విఫలం.. తిరుమల వెంకన్నపైనా జీఎస్టీ ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పవ్యవధి చర్చలో ఆయన మాట్లాడారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీఆర్ఎస్కు మంత్రి ఎర్రబెల్లి సోదరుడు గుడ్‌బై! బీజేపీలోకి ప్రదీప్‌రావు? పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, టీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఇటీవల హుజూరాబాద్‌లో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యాక.. వరంగల్ తూర్పు బీజేపీ నేతలతోనూ ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇది మూసీనేనా..? స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు తీసుకుంటున్న జనం ఇటీవల కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాల గేట్లను జలమండలి వరుసగా తెరుస్తోంది. మూసీలో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. నగరంలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ) మార్గంలో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు, మురికి వదిలింది. దీంతో చాదర్‌ఘాట్, మూసారాంభాగ్ వంతెనలపై నుంచి వీక్షిస్తే.. నదిలో నీరు స్వచ్ఛంగా దర్శనమిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయనక్కర్లే.. ఒబామా కీలక వ్యాఖ్యలు డ్రోన్ దాడితో అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివెేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు వివరించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్ వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడిన రోహిత్ 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిటైర్డ్‌హర్ట్‌గా క్రీజును వదిలాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సాంగ్ చూపించేశాం మావా... పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్‌ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రూపాయి విలువ భారీగా పతనం.. ఆర్థికమంత్రి కీలక ప్రకటన డాలర్ మారకంలో రూపాయి విలువ భారీ పతన ఆందోళనల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. భారత్ రూపాయి విలువ కుప్పకూలలేదని స్పష్టం చేశారు. అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మల్లారెడ్డి హత్య వెనుక భారీ స్కెచ్.. రూ.10 లక్షలకుపైనే సుపారీ! న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్యకు ఓ గ్యాంగ్ రూ.10 లక్షలకుపైనే సుపారీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చిందెవరు?.. మల్లారెడ్డిని హత్యచేసే అవసరం ఎవరికుంది?.. ఆయనను మట్టుపెడితే మేలు ఎవరికీ?.. ఈ హత్యకు కారణం మైనింగ్ వివాదమా.. భూ వివాదాలా?.. మర్డర్‌కు ప్రణాళిక రచించిందెవరు? 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి హతం... వెల్లడించిన జో బైడెన్ అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అక్టోబర్ 2న ‘సెల్యూట్ సీఎం సర్’ సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ 2న ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్ సీఎం సర్ కార్యక్రమం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా పిలుపునిచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఇతర శాఖల్లోకి వీఆర్వోలు, జీవో జారీ.. భగ్గుమన్న జేఏసీ నేతలు రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల) శకం ముగిసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న 5,385 మందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఒక్కరోజే రూ.1,383.34 కోట్ల పింఛన్ల పంపిణీ రాష్ట్రంలో అవ్వాతాతలతోపాటు వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు తదితరులకు ప్రభుత్వం సోమవారం ఒక్క రోజే రూ.1,383.34 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం.. ఎటూ తేల్చని కాంగ్రెస్ హైకమాండ్ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. ఈ విషయంలో పార్టీపరంగా రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు ఉంటాయంటూ ఊహాగానాలు వెలువడ్డా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మరో రెండు, మూడు రోజులపాటు వేచిచూసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. యూపీలో తేలియాడే రామసేతు రాయి! భక్తుల పూజలు ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బెంబేలెత్తించిన విండీస్ బౌలర్.. టీమిండియా ఓటమి వరుసగా నాలుగు పరాజయాల తర్వాత వెస్టిండీస్ ఎట్టకేలకు బోణీ కొట్టగలిగింది. టీమిండియాతో సోమవారం ఆలస్యంగా జరిగిన రెండో టి20 వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి(59) కన్నుమూశారు. బాబూరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవికరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే! ప్రయివేట్ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అమానవీయ ఘటన: బైక్‌పై తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు! ఆస్పత్రిలో శవ వాహనం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులకు రూ.5 వేలు చెల్లించుకోలేక తల్లి మృతదేహాన్ని ఓ పేద యువకుడు ఏకంగా 80 కిలోమీటర్లు బైక్ మీదనే తీసుకెళ్లాడు! బెడ్‌షీట్‌లో చుట్టిన తల్లి శవాన్ని 100 రూపాయలతో కొన్న చెక్కపై పెట్టి బైక్‌కు కట్టి, మరొకరిని వెనక కూచోబెట్టి నడుపుకుంటూ వెళ్లాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మరింత చేరువగా.. ఆరోగ్యశ్రీ, గ్రామ స్థాయి నుంచే రిఫరల్ విధానం రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యాలకు శ్రీరామ రక్షగా నిలుస్తోంది.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం. టీడీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన ఈ పథకానికి ఊపిరిలూదుతూ వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు భేష్.. సీడబ్ల్యూసీ కమిటీ ప్రశంసలు పోలవరం ప్రాజెక్టులోకి 30 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద వచ్చినా, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును ఒక మీటర్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టార్గెట్ కాంగ్రెస్! చేవెళ్లతో మొదలై మునుగోడు మీదుగా.. నెక్ట్స్? దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తోంది. చేవెళ్లతో మొదలు పెట్టిన చేరికల గేమ్.. ఇప్పుడు మునుగోడు మీదుగా ఎక్కడివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అడవి మీదుగా రింగురోడ్డు.. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఖరారు భాగ్యనగరానికి చేరువగా ఉన్న ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉన్న అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణం జరగనుంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి కేంద్రం అనుమతించిన 162 కి.మీ. ఉత్తరభాగం రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఓవైపు ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో చైనా, తైవాన్ మధ్య తారస్థాయికి చేరుతున్న ఉద్రిక్తతలు కలవరపరుస్తున్నాయి. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. నిఖత్ పంచ్ అదిరె.. పతకం దిశగా దూసుకెళ్తున్న తెలంగాణ చిచ్చర పిడుగు కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్‌లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో నిఖత్ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి హెలెనా (మొజాంబిక్) తట్టుకోలేక విలవిలలాడింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్ ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Hero Suman: షూటింగ్‌లతో బిజీ.. రాజకీయాల్లోకి..? ‘తరంగణి’ సినిమాతో తెలుగులో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తిరుగులేని కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అందాల నటుడు సుమన్. సుమన్‌గా సుపరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్ దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ్, కన్నడ, ఆంగ్ల, ఒడియా తదితర భాషల్లో నటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కాల్పుల కలకలం.. మాదాపూర్‌లో రౌడీ వార్.. ఒకరి మృతి మాదాపూర్ నీరూస్ చౌరస్తాలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ మృతి చెందగా, జహంగీర్‌కు తీవ్ర గాయలయ్యాయి. ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్‌లో రౌడీషీటర్ మహ్మద్ కాల్పులు జరిపాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రాణాల మీదకు తెచ్చిన డీజే.. కరెంటు షాక్‌తో 10 మంది మృతి.. పలువురికి గాయాలు పశ్చిమ బెంగాల్ కూచ్బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాను జల్పేష్ వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం.. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదో అంశంపై వేడి వేడిగా చర్చ జరుగుతోంది. ప్రఖ్యాత సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా ఆగ్రహంతో.. ‘ప్రధాని నెహ్రూ మొఘల్ చక్రవర్తుల కోర్టుల్లో చప్రాసీలుగా పనిచేసిన వంశం నుంచి వచ్చినవాడు..’ అని మాట తూలారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Atchannaidu: అచ్చెన్నాయుడు ఆడియో కలకలం టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆడియో కలకలం రేపుతోంది. ఆ ఆడియోలో అచ్చెన్న మరొకరి సంభాషణ గూడు పుఠానీలా ఉంది. సంతమ్మాళి మండలం కోటపాడు–కొత్తూరు గ్రామ వాసి మృతి వెనుక కుట్రే ఏదో దాగి ఉంద ని తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. Godavari Floods 2022: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం భద్రాచలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండడంతో గోదారమ్మ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భీతిగొలిపేలా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పెట్టుబడుల వాస్తవరూపంలో ఏపీ నంబర్ 1 రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఘనంగా లష్కర్ బోనాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. MLA Seethakka: సీతక్కకు తప్పిన ప్రమాదం ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు శనివారం ఆమె ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి జంపన్నవాగు మీదుగా పడవలో వెళ్లారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ENG vs IND: విజయంతో ముగించేందుకు... ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు పర్యటన చివరి అంకానికి చేరింది. గత ఏడాది అర్ధాంతరంగా ఆగిన టెస్టు సిరీస్‌ను ఈ నెలారంభంలో ఓటమితో ముగించిన టీమిండియా ఆపై టి20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 'ఇదేం పద్ధతయ్యా.. ఎలాన్ మస్క్ కొత్త రగడ' ఎలాన్ మస్క్.. మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ల మధ్య కొనుగోలు వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మస్క్‌ను ట్విట్టర్ తరుపు లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ ఎలా పొందారని మస్క్‌ను ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Shabaash Mithu: సండే సినిమా ఉమన్ ఇన్ బ్లూ ‘మెన్ ఇన్ బ్లూ’ అంటే భారత క్రికెట్ జట్టు. అంటే మగ జట్టు. క్రికెట్ మగవారి ఆట. క్రికెట్ కీర్తి మగవారిది. క్రికెట్ గ్రౌండ్ మగవారిది. కాని ఈ ఆటను మార్చే అమ్మాయి వచ్చింది. ‘మెన్ ఇన్ బ్లూ’ స్థానంలో ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అనిపించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఐటీ రాజధానిలో హైటెక్ మయసభ..! ఇరవై అంతస్తుల భవనం...వేల మంది ఉద్యోగులు.. వందల సంఖ్యలో కార్లు! నేలపై.. భూగర్భంలోనూ పార్కింగ్! హైటెక్ యుగంలో ఏ ఐటీ ఆఫీసును తీసుకున్నా ఇలాగే ఉంటుంది! ఇలాంటి ఆఫీసులో మిత్రుడిని కలిసేందుకు వెళ్లారనుకోండి... పార్కింగ్ స్థలం వెతుక్కునేందుకు పదిహేను నిమిషాలు.. సెక్యూరిటీ వ్యవహారాల పూర్తికి ఇంకొన్ని నిమిషాలు.. రిసెప్షన్‌లోనో.. క్యాంటీన్లోనో పడిగాపులు..ఇదీ తంతు! వందేళ్ల రాబర్ట్ బాష్ కంపెనీలో మాత్రం దీనికి భిన్నం! 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1.ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. కాన్వాయ్ వేగంగా దూసుకెళుతున్నప్పటికీ ఆపన్న హస్తం కోసం రోడ్డు పక్కనే ఎదురు చూస్తున్న ఓ కుటుంబం సీఎం జగన్ దృష్టి నుంచి దాటిపోలేదు. విశాఖ షిప్ యార్డులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే పొన్నపువ్వు ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం భద్రాచలం వద్ద గోదావరి మరింత ఉధృతంగా మారుతోంది. గంటగంటకూ మరింతగా వరద మట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి 71 అడుగులతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.గోదా'వర్రీ'!.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్! బ్రిటన్ ప్రధాని రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక, బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్‌తో సహా మరో ఐదుగురి మధ్య పోటీ సాగుతున్నది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి యత్నిస్తున్నారా? అవుననే సమాధానం అన్నాడీఎంకేలో వినిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులపై బహిష్కరణ వేటు వేసిన పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తొలగించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.తగ్గేదేలే.. కేంద్రంపై సమరమే..! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలపై పార్లమెంటుతో పాటు దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.తాజా సర్వే: ఈ యువతకు ఏమైంది? పెళ్లి వద్దంటున్నారు! ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు అంటారు. ఉద్యోగం వచ్చి కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన మన దగ్గర పెరిగి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు పెళ్లే వద్దనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం గమనించాల్సిన సంగతి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.అదానీ గ్రూప్ చేతికి ఇజ్రాయెల్ పోర్టు ఇజ్రాయెల్‌లోని పోర్ట్ ఆఫ్ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్), గాడోట్ గ్రూప్ కన్సార్టియం దక్కించుకుంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.రెమ్యునరేషన్ లెక్కలు బయటపెట్టిన కీర్తి పారితోషికం పెంచలేదని అంటోంది కీర్తి సురేష్. కొన్ని చిత్రాలకు తగ్గించే రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని అంటోంది ఈ బ్యూటీ. దక్షిణాది సినిమాలో నటి కీర్తీసురేశ్‌కు అంటూ కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ అమ్మడు ఇటీవల మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించి విజయాన్ని సాధించింది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.ఐర్లాండ్ ఓడినా... వణికించింది! అయ్యో... ఐర్లాండ్! కొండను కరిగించే పనిలో పరుగు తేడాతో ఓడింది. ఇదివరకే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన ఐర్లాండ్ మూడో మ్యాచ్ ఓటమితో ‘వైట్‌వాష్’ అయ్యింది. కానీ అసాధారణ పోరాటంతో ఆఖరి బంతి దాకా కివీస్ ఆటగాళ్లను వణికించింది 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. తీవ్ర దుఃఖంలో ట్రంప్.. భార్య మృతితో భావోద్వేగ సందేశం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం కన్నుముశారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా తన సొంత సోషల్ మీడియా 'ట్రుత్ సోషల్' వేదికగా వెల్లడించారు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్‌కు చేరిన బరి‘తెగింపు’ తెలుగుదేశం పార్టీ తాన అంటే ఈనాడు తందాన అంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలని ప్రయత్నించే చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలను గుడ్డిగా అచ్చేస్తుంది. నిజానిజాల పట్టింపు లేదు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Godavari River Floods: ఉగ్ర గోదారి 'హై అలర్ట్' గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ రాష్ట్రంలో ఆరు రోజులుగా దంచికొడుతున్న వానలు గురువారానికి కాస్త నెమ్మదించాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కాళేశ్వరానికి వరద పోటు కనీవినీ ఎరుగని రీతిలో గోదావరికి వచ్చిన భారీ వరద కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభావం చూపింది. ప్రాజెక్టు పరిధిలోని సరస్వతి (అన్నారం), మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్‌లు పూర్తిగా నీట మునిగాయి. పంపుహౌస్‌లలోని పంపులు, మోటార్లు, ప్యానెల్ బోర్డు, విద్యుత్ పరిక రాలూ నీట మునిగాయి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే:‘టాప్’లీ లేపేశాడు.. లార్డ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్ కుదేలైంది. దీంతో భారత్ రెండో వన్డేలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. మూడు నెలల కనిష్టమే.. అయినా రెండంకెల పైనే! టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 15.18 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్‌తో పోల్చితే ఈ బాస్కెట్ ధర 15.18 శాతం పెరిగిందన్నమాట. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. మే నెలతో పోల్చితే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రెండంకెలపైనే ఈ రేటు కొనసాగడం ఇది వరుసగా 15వ నెల. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మా నాన్న రియల్ హీరో: వరలక్షి శరత్ కుమార్ పాన్ ఇండియా నటుడు శరత్‌కుమార్‌ను అభిమానులు సుప్రీం హీరో అంటారు. తమిళ సినిమాలో కథానాయకుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడడం లేదు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. వితం ఇబ్బందుల్లో పడిందని ఆవేదన చెందిన మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంగొండనహళ్లి నివాసి, ఐటీ ఉద్యోగి అయిన అనిత (25) మృతురాలు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. Kadem Project: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం కడెం ప్రాజెక్ట్‌కు పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. వరద నీరు తగ్గడంతో ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి.. నీతి ఆయోగ్ ప్రశంస నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అట్టడుగు స్థాయి నుంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నవరత్నాలను ఏకీకరణ చేసి అమలు చేస్తోందని నీతి ఆయోగ్ పేర్కొంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. వలంటీర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం నాగార్జున యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలంటీర్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం ఆర్థిక సాయం అందించారు. వలంటీర్ కుటుంబ సభ్యులకు రూ 10 లక్షల చెక్కు అందజేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘ఫిట్నెస్’ పెనాల్టీ మినహాయింపు.. ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా..? రవాణా వాహన యజమానులకు పెద్ద ఊరట. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుము విధింపు నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రెండు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. బ్రిటన్ ప్రధాని పీఠం: తొలి రౌండ్ రిషిదే.. గట్టి పోటీ ఇస్తున్న పెన్నీ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ (42) దూసుకెళ్తున్నారు. బుధవారం తొలి రౌండ్ ముగిసే సరికి ఆయన అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను సాధించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పళనిస్వామికి కొత్త తలనొప్పి.. కలకలం రేపిన రహస్య సంభాషణ మొన్నటి వరకు పన్నీర్‌సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్‌తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. భారత్ జోరును ఆపతరమా! బర్మింగ్‌హామ్ టెస్టు ఫలితం తర్వాత ఇంగ్లండ్ జట్టు ఊహించి ఉండకపోవచ్చు తాము టి20 సిరీస్ కోల్పోతామని...ఊహించకపోవచ్చు తొలి వన్డేలో ఇంత ఘోరంగా ఓడతామని...బుమ్రా స్వింగ్ బౌలింగ్ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేసి ఉండకపోవచ్చు...కానీ ఇప్పుడు వారికి టీమిండియా అసలు సత్తా ఏమిటో తెలిసొచ్చింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా వెలిగి పోతున్న నటి పూజా హెగ్డే. చిన్న గ్యాప్ దొరికినా విహారయాత్రకు బయలుదేతుంది. తాజాగా మూడు ఖండాలు.. నాలుగు నగరాలు.. ఒక నెల అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది ఈ భామ. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 2021–2022: 41 నగరాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు! హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంది. ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో 2021–22లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన రెసిడెక్స్ సూచీ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. రోల్ మోడల్: తొలి ఇండియన్ అమ్మాయిగా చరిత్ర సృష్టించనున్న రిజా వయసుకు తగ్గట్టుగా మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా ఎదగని పిల్లల...మాట, నడక, నవ్వు సాధారణ పిల్లలకంటే విభిన్నంగా ఉంటుంది. కొంతమంది అయితే ఒకటీ రెండు మాటలు కూడా స్పష్టంగా పలకడం కూడా కష్టమే. అటువంటిది డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతోన్న రిజా రేజి ఏకంగా ప్రీమియర్ ఫ్యాషన్ షోకు ఎంపికైంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. గొటబాయకు ఎయిర్‌పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి.. చివరికి సైనిక విమానంలో.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అవి మోదీ మార్కు సింహాలు.. క్రూరంగా, కోపంగా కనిపించడం అవసరమా? పార్లమెంట్ నూతన భవనంపై ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించిన భారీ జాతీయ చిహ్నం(నాలుగు సింహాల)పై ప్రతిపక్షాలు, చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాన్ని సైతం మోదీ ప్రభుత్వం వక్రీకరించిందని ఆరోపించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSR Vahana Mitra: మూడేళ్ల కంటే మిన్నగా.. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్సార్ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రూ.261.51 కోట్ల మేర డ్రైవర్లకు ప్రయోజనం కలగనుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. వరద వేగాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు? గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు.. 64 ఏళ్ల రికార్డు బద్దలు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు: ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు, రాజ కీయ పక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతుంటే.. ఈ చర్చతో సంబంధం లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బుమ్రా బౌలింగ్.. రోహిత్ బ్యాటింగ్; టీమిండియా ఘన విజయం ఆకాశం మబ్బులు పట్టి ఉంది, పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకున్నానంటూ టాస్ సమయంలో రోహిత్ తమ పేసర్లపై ఉంచిన నమ్మకాన్ని వారు గొప్పగా నిలబెట్టారు. స్వింగ్‌తో చెలరేగిన మన పేసర్ల అద్భుత బౌలింగ్ ముందు ప్రపంచ చాంపియన్ తలవంచింది. లైనప్‌లో ఒక్కో ఆటగాడి పేరు, ఇటీవలి ఫామ్ చూస్తే ఈ టీమ్ కనీసం 350 పరుగులు చేస్తుందేమో అనిపించగా, వంద దాటేందుకు కూడా ఆపసోపాలు పడింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సమ్మర్ వార్ కు సై అంటున్న హీరోలు.. బరిలో 7 పెద్ద సినిమాలే! సినిమాలకు మంచి సీజన్ అంటే సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి... ఈ ఏడాది సమ్మర్ ముగిసింది. ఇక 2023 వేసవి బరిలో నిలిచేందుకు భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. డేట్‌ని ఫిక్స్ చేయకపోయినా వేసవి బరిలో నిలిచేందుకు ముందుగానే కర్చీఫ్ వేసేస్తున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టాటా ఎలక్ట్రిక్ కారు, ఒకసారి చార్జింగ్ చేస్తే 312కి.మీ ప్రయాణం! వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా నెక్సన్ ఈవీ ప్రైమ్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.14.99–17.5 లక్షల మధ్య ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే కారు 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. 129 పీఎస్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్, 30.2 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్‌కు తాకడంతో.. వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Top News Today: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1..బురద జల్లడమే జనవాణి అజెండా దున్నపోతు ఈనిదంటే.. దూడను గాటన కట్టేయమన్న తరహాలో విపక్ష టీడీపీ, జనసేన, వాటికి కొమ్ముకాసే మీడియా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా రాజకీయ రంగు పులిమి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం వారికి రివాజుగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2..అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం వర్ష బీభత్సం, 16 మంది భక్తుల దుర్మరణాలతో ఈ నెల 8 నుంచి తాత్కాలికంగా ఆగిన అమర్నాథ్ యాత్ర సోమవారం తిరిగి మొదలైంది. 12వ బ్యాచ్ కింద 4,236 మంది యాత్రికులు దర్శనానికి బయల్దేరారు. వీరంతా మంగళవారం ఉదయానికల్లా గుహకు చేరతారని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.. లంకకు 20న కొత్త అధ్యక్షుడు కనీవినీ ఎరగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స (73) పలాయనం, ప్రధాని రణిల్ విక్రమసింఘె (73) రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానుండటం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.. విదేశీ విద్యా వరం... ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5..Telangana Rains: వానలు డబుల్! సాధారణంతో పోలిస్తే రెట్టింపు వర్షపాతం మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది ఇవల విరాట పర్వం చిత్రంతో అలరించిన సాయి పల్లవి తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ జూలై 15న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మనుసుని బాగా కదిలించిన కథ ఇది అని పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా ఇదే.. ఆంధ్ర అమ్మాయికి చోటు ఈ నెల 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘనకు కూడా జట్టులో చోటు లభించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8.. నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వర్ అయ్యర్ బాధ్యతలు! నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ తాజా బాధ్యతలు చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9..Gita Gopinath: ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డు ‘అర్థం కావాలేగానీ ఆర్థికశాస్త్ర విషయాలు చందమామ కథల కంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి’ అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదుగానీ, గీతా గోపీనాథ్‌కు ఆర్థికశాస్త్రం అనేది శ్వాస! సివిల్ సర్వీసులలో చేరాలనేది తన మొదటి కల. అయితే ఆర్థికశాస్త్రంపై ఆసక్తి ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన చేర్చింది... పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10.. గుంటూరులో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్ బుల్స్, రూపెక్స్ యాప్స్ నుంచి రూ.20,000 లోన్ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్ యాప్స్ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని, లేకుంటే న్యూస్ ఫోటోస్ పెడతామని కేటుగాళ్లు బెదిరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. కఠిన ఆంక్షలు అమలు చేసినా కట్టడి కాని కరోనా.. చైనాలో కొత్త వేరియంట్ కలకలం కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అన్నాడీఎంకే అంతర్గత కలహాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని తేల్చి చెప్పింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే మోదీకీ పడుతుందని అన్నారు. ఆయనలాగే మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని పేర్కొన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. విశాఖకు సీఎం జగన్.. టూర్ షెడ్యూల్ ఇదే..| ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు వెళ్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Pawan Kalyan: జనవాణా.. విషవాణా? ‘జనవాణి’ పేరిట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషవాణి వినిపిస్తున్నారు. అవాస్తవాలు, కట్టుకథలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళతో ఆయన హైడ్రామా సృష్టించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. IND vs ENG 3rd T20: సూర్య 'ప్రతాపం' సరిపోలేదు.. సిరీస్ మాత్రం టీమిండియాదే ఆఖరి పోరులో ఇంగ్లండ్ చెమటోడ్చి పరువు నిలబెట్టుకుంది. మూడో టి20లో సూర్య కుమార్ యాదవ్ (55 బంతుల్లో 117; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు సరైన సహకారం లేక భారత్ 17 పరుగులతో ఓడింది. సిరీస్‌ను 2–1తో సరిపెట్టుకుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Dil Raju-Nithin: ఇండస్ట్రీలో 20 ఏళ్లు.. ఇది మామూలు విషయం కాదు ‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్ సక్సెస్ ఫుల్‌గా ఉండటం గొప్ప విషయం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎస్సై లీలలు.. పెళ్లి చేసుకుంటానని పదేళ్లుగా సహజీవనం, మరొక మహిళతో.. కణతపై తుపాకీ గురిపెట్టి వివాహితను ఓ పోలీసు అధికారి అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువక మునుపే పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి మోసం చేసిన మరో పోలీసు అధికారి అరాచకం వెలుగులోకి వచ్చింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. DMart: డీమార్ట్ ఆకర్షణీయ ఫలితాలు.. మరింత పెరిగిన లాభాలు డీమార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం పలు రెట్లు ఎగసి రూ. 643 కోట్లకు చేరింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు ‘‘నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్ మహౌషథుల్’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. YSRCP Plenary 2022: వన్స్‌మోర్ జగనన్న ‘వన్స్‌మోర్ జగనన్న’ అన్నదే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని మహిళల నినాదం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం, రక్షణ, సాధికారికతలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన సీఎం వైఎస్ జగన్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళలందరిపై ఉందన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. AP CM YS Jagan: అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి అమర్నాథ్లో కుండపోత వాన, అకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. జర పైలం.. రెండ్రోజులు.. జోరు వాన! నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, దానికి తోడుగా ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడింది. వాగులు వంకలు ఉప్పొంగాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గమనించాలి: పోలీస్ ఫోన్ నెంబర్లు మారనున్నాయ్! ప్రస్తుతం సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ కంటే తక్కువ ధరకు ఎక్కువ సదుపాయాలు ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో పోలీసు విభాగం ఫోన్లు ఎయిర్‌టెల్‌కు మారనున్నాయని కొత్వాల్ సీవీ ఆనంద్ శుక్రవారం పేర్కొన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది ఉక్రెయిన్ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. IND vs ENG 2nd T20: సిరీస్ విజయమే లక్ష్యంగా... కోహ్లికి పరీక్ష! ఆతిథ్య ఇంగ్లండ్‌పై తొలి టి20లో పైచేయి సాధించిన భారత్ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి భారీ తేడాతో నెగ్గిన టీమిండియా అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే ఇంగ్లండ్‌ను మరోసారి దెబ్బ తీయవచ్చు. అయితే అనూహ్య ఓటమి నుంచి కోలుకొని సిరీస్ కాపాడుకునేందుకు బట్లర్ బృందం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. OTT-Web Series: సినిమాతో చెప్పలేని కథలను.. ఓటీటీలో చెప్పేందుకు సై అన్న స్టార్స్ సినిమాని థియేటర్లో చూస్తే ఆ అనుభూతే వేరు అని సినీ ప్రముఖులు అంటుంటారు. ఇది నిజమే. అయితే సినిమాలో చెప్పలేని కొన్ని కథలు ఉంటాయి. అవి ఓటీటీలో చెప్పడానికి కుదురుతాయి. ఇలాంటి కథలకు స్టార్స్ ఓకే చెప్పి, ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అందరికీ వృద్ధి ఫలాలు అందడమే అసలైన అభివృద్ధి సమ్మిళిత వృద్ధి (అందరికీ వృద్ధి ఫలాలు చేరేలా) లేకుండా అసలైన వృద్ధి సాధ్యపడదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు ఈ దిశగా తీసుకున్నట్టు చెప్పారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మధ్యాహ్నం పూట పడుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి మధ్యాహ్నం పూట ఒక గంట పాటు నిద్రించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అలాగే మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని, శరీరం చురుగ్గా ఉండటానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. గుజరాత్లో వరుణ విలయం దక్షిణ గుజరాత్లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్‌నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning 10 AM Top News: మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో ఓ సభలో మాట్లాడుతుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాయి. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSR Jayanthi 2022: వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. సేవకుల తయారీ విధానమది బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్‌లో చేరికలు.. అలకలు ‘ఒక్క చేరిక.. రెండు అసంతృప్తులు’ అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందనే చర్చ కార్యకర్తల్లో సాగుతోంది. కొత్త చేరికలు పాతవారి అలకలకు కారణమవుతున్నాయి. చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలో కొంతమంది పాతనేతల అసంతృప్తి క్యాడర్‌ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. The Warrior-Ram Pothineni: ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్ ‘‘నేను ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా 13 విజయాలు అందుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన మొదటి టీ20లో విజయంతో ఈ ఘనతను రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విమాన ప్రయాణికులకు బంపరాఫర్! విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్ ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్‌గా మారాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning 10 AM Top News: మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. CM YS Jagan: మార్గ నిర్దేశకుడు తప్పుడు కేసులకు భయపడలేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వెరవలేదు. ప్రజలకు మేలు చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పదేళ్లు అలుపెరగని పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలా భరోసా కల్పించారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బ్రిటన్ ప్రధాని బోరిస్‌కు మరో షాక్.. సర్కార్ పడిపోనుందా..? బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి తీవ్రతరమైంది. మంగళవారం భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లతో మొదలైన రాజీనామాల పర్వం బుధవారం మరింత ఊపందుకుంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. Rajya Sabha Nominated MPs 2022: రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకొని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మరో అస్త్రం సంధించింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Eknath Shinde: పిక్చర్ అభీ బాకీ హై! ‘కాస్తంత ఊపిరి తీసుకోనివ్వండి. కొద్దిరోజులుగా బోలెడంత హడావిడిలో ఉన్నా!’ మహారాష్ట్ర శాసనసభలో సోమవారం నాటి విశ్వాస పరీక్షలో నెగ్గిన వెంటనే విలేఖరులతో కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే అన్న మాటలివి. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. హైదరాబాద్‌కు ‘ఎగిరొచ్చిన’ ప్రపంచంలోనే నంబర్ 1 సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. Krishna Vamsi: కృష్ణ వంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్! కరోనా తర్వాత జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. దీంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్ కోసం బాగానే ఖర్చు చేస్తున్నాయి. తెలుగులో కూడా పదుల సంఖ్యల్లో వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. IND vs ENG T20: టి20 సమరానికి సై.. పూర్తి స్థాయి టి20 స్పెషలిస్ట్‌ల టీమ్‌తో ఇంగ్లండ్ ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో టి20 ప్రపంచకప్ జరగనుంది. ఆ లోగా భారత్ వేర్వేరు టోర్నీల్లో కలిపి 15 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి ప్రపంచకప్ జట్టు కూర్పు విషయంలో ఒక అంచనాకు వచ్చేందుకు ఇంగ్లండ్‌తో సిరీస్ టీమ్ మేనేజ్మెంట్కు ఉపయోగపడుతుంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. వంటనూనెల ధరల్ని తగ్గించండి, తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు! అంతర్జాతీయంగా రేట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా లీటరుకు రూ. 10 వరకూ తగ్గించాలని తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అలాగే, ఒక బ్రాండ్ ఆయిల్‌పై దేశవ్యాప్తంగా ఒకే ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) ఉండాలని సూచించింది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. గృహిణులు టార్గెట్‌గా కొత్త రకం ఆన్లైన్ మోసాలు పిల్లలు స్కూల్‌కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ ఇటీవల జరిగిన ‘అగ్నిపథ్’ ఆందోళనలు, రైళ్ల దహనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో అధునాతన సీసీటీవీ భద్రతా వ్యవస్థను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సీసీ కెమెరాల స్థానంలో హైటెక్ కెమెరాలతో కూడిన వీడియో నిఘా వ్యవస్థ–వీఎస్ఎస్ (సీసీటీవీ కెమెరాల నెట్వర్క్)ను ఏర్పాటు చేయనుంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning 10 AM Top News: మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. రెండు రోజుల పాటు.. జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. సామాన్యులకు షాక్, భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర! పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. ఇళ్లలో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి.దీంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సిలిండర్ ధరకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSRCP Plenary 2022: తిరుగులేని శక్తి రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీని అణగదొక్కడానికి చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు, సవాళ్లు, దాడులు ఎదుర్కొంది. అయినప్పటికీ వైఎస్ జగన్ ఒకే మాట.. ఒకే బాటగా ముందుకు సాగారు. ఏ దశలోనూ ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. స్వమిత్వ పథకం: తెలంగాణలో పైలట్ ప్రాజెక్టుకు సెలక్టైన గ్రామాలివే! పల్లె ఇల్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోకి వెళ్లు.. ప్రతి ఇంటి లెక్క పక్కాగా సేకరిస్తారు. అందుకే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ‘స్వమిత్వ’పథకం పేరుతో ఇళ్ల సర్వే మొదలుపెట్టింది. గ్రామకంఠం మొత్తాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించి, వాటి ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు కోనోకార్పస్.. ఈ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్షశాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో సుందరీకరణ కోసం దీన్ని విరివిగా పెంచుతున్నారు. అయితే.. వీటితో పర్యావరణానికి పలువిధాలుగా విఘాతం కలుగుతోందని, ముఖ్యంగా పట్టణప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని, మున్సిపాలిటీలకు రూ.లక్షల్లో నష్టం కలుగుజేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు జిల్లాలో తలెత్తింది. శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 81 ఎలుక జ్వరం (ఆర్బీఎఫ్) కేసులు నమోదు కావడం జరిగిందని శివమొగ్గ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మే నెల చివరి నాటికి సుమారు 30 కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి నేటి వరకు అవి మొత్తం 81 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.Johnson Government: సంక్షోభంలో జాన్సన్ సర్కారు బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్ జాన్సన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.టీమిండియా ఓటమిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందన గత కొన్ని ఫలితాలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో, ఇక్కడా మాకు మంచి అవకాశాలు లభించాయి. కానీ వాటిని ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్‌లో ఒకే తరహా తీవ్రత, ప్రదర్శన, ఫిట్నెస్ మ్యాచ్ ఆసాంతం కొనసాగించలేకపోవడం దానికి కారణమని భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. తల్లి నగలు తాకట్టు పెట్టి గెర్బెరా పూలను సాగు చేశారు.. లక్షలు అర్జిస్తున్నారు కోశాక నీటి తడిలో ఉంచితే 15 రోజుల పాటు వాడవు గెర్బెరా పూలు. జార్ఖండ్‌లో ఈ పూలు కావాలంటే బెంగళూరు నుంచి తెప్పించుకోవాలి. ఇప్పుడు జెమ్‌షడ్‌పూర్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ప్రియాంక, ప్రీతిలను అడిగితే చాలు వెంటనే లోడ్ పంపిస్తారు. లాకౌట్ కాలంలో తండ్రికి పనిపోవడంతో ఖాళీగా ఉన్న పొలంలో అలంకరణ పూలైన గెర్బెరాను సాగు చేశారు వీరు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి