1. సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ నేడే
అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు. లలిత్ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. కల్లు కిస్తీలు రద్దు.. ఐదేళ్లకు కల్లుగీత పాలసీ మార్గదర్శకాలు విడుదల
ఏపీలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదేళ్ల విధానాన్ని ప్రకటించింది.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. మునుగోడుపై కేసీఆర్‌ది కపటప్రేమ.. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే..
మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే చండూరు సభలో సీఎం కేసీఆర్ కపటప్రేమ ప్రదర్శించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతూ చేయని పనులు పక్షం రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. చివరి ఘట్టానికి మునుగోడు ఉప ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి!
మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం.. మునుగోడులో ఆ అభ్యర్థి కోసమే..
జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లో తనిఖీలు నిర్వహించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 89.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. జో బైడెన్, కమలా హారిస్ సంతాపం
గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం
మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే?
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దం అవుతోంది. ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి తమ సెమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. సమంత 'మయోసైటిస్' వ్యాధిపై కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్
ఇప్పుడు చర్చంతా నటి సమంత గురించే. ఇంతకుముందు ఈమె వ్యాఖ్యలు, గ్లామరస్ పొటోలు, నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి రకరకాలుగా చర్చించుకున్న సినీ వర్గాలు ఇప్పుడు ఆమె బాధపడుతున్న వ్యాధి గురించి చర్చించుకుంటున్నాయి.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment