Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌ | Breaking News Munugode Bypoll News Top 10 News 3rd November 2022 | Sakshi
Sakshi News home page

Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

Published Thu, Nov 3 2022 10:03 AM | Last Updated on Thu, Nov 3 2022 10:21 AM

Breaking News Munugode Bypoll News Top 10 News 3rd November 2022 - Sakshi

1. Munugode Bypoll 2022: ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌
ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదైంది. సంస్థాన్‌ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు నిరీక్షిస్తున్నారు. చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతర టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారని బీజేపీ ఆందోళనకు దిగింది.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. నాపై ఈగ వాలినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊరుకోదు.. ఈటల హెచ్చరిక 
తన హత్యకు కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని చెప్పారు. సీఎం ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, పక్కా స్కెచ్‌ ప్రకారమే మంగళవారం మునుగోడులో తనపై దాడి జరిగిందని అన్నారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పిల్లల్ని చదువుకోనివ్వండి రామోజీ! ఇంకెన్నాళ్లు కార్పొరేట్‌ స్కూళ్లకు కొమ్ము కాసే ఈ రాతలు?
ప్రభుత్వ స్కూళ్లపై విషం చిమ్మటం వెనక రామోజీరావు ఆందోళన ఒక్కటే. ప్రభుత్వ స్కూళ్లను ఫణంగా పెట్టి తాము పెంచిపోషించిన కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లకు నూకలు చెల్లుతున్నాయన్నదే!. గాలీవెలుతురూ లేని భారీ భవనాల్లో.. విద్యార్థులను బట్టీపట్టే యంత్రాల్లా మార్చేసే ఈ ‘కార్పొరేట్‌’ స్కూళ్లకు కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబు ఇపుడు అధికారంలో లేరన్నదే ఆయన బాధ. 
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. గెహ్లాట్‌ VS సచిన్‌
రాజస్తాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ మరోసారి సీఎం అశోక్‌ గెహ్లాట్‌పై దాడికి దిగారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో గెహ్లాట్‌పై ప్రశంసలు కురిపించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానానికి సూచించారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ
ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్‌ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్‌లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్‌?
టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ ఆల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాము టైటిల్ గెలవడానికి రాలేదని, టీమిండియాను మాత్రం ఓడించితీరతామని అని షకీబ్‌ కామెంట్‌ చేశాడు. అయితే బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్‌ నటి అరెస్టు
టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్‌ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. డీజిల్‌పై ఇప్పటికీ రూ.4 నష్టమే!
ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్‌పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్‌ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని తెలిపారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి
తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్‌ చేయడం నేటి ట్రెండ్‌. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్‌ టూరిజమ్‌’.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పవన్‌కళ్యాణ్‌ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు
జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటకు వెళ్లినప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement