News Roundup
-
Today Headlines: ఇవాళ్టి ముఖ్యమైన వార్తలు
ఇవాళ్టి ప్రధాన వార్తల రౌండప్ 1.నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన 146మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆందోళన 2. కొత్త క్రిమినల్ చట్టాలు చరిత్రాత్మకమన్న ప్రధాని మోదీ మసిపూసి మారేడు చేశారంటూ కాంగ్రెస్ కౌంటర్ 3. పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసు విచారణ ఆరుగురు నిందితులకు సైకో అనాలిసిస్ పరీక్షలు 4. పూంచ్ లో కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్ నిన్నటి దాడిలో 5గురు జవాన్లు మృతి 5. ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా ఢిల్లీ, యూపీని కమ్మేసిన మంచు తెర 6. హాలీవుడ్ లో మరోసారి METoo కలకలం విన్ డీసెల్ పై మాజీ అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు -
న్యూస్ దిస్ వీక్ @ 04 November 2023
-
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్ మంగళగిరిలో జనసేన నాయకులపై టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి జనసేన కార్యకర్తలు మంగళగిరిలోని జగనన్న నగర్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులను లబ్ధిదారులు అడ్డుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఊహించని షాక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ టూర్ అట్టర్‌ఫ్లాప్.. తీవ్ర అసహనం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంకలాం జగనన్న కాలనీ పర్యటన అట్టర్ ప్లాప్ అయింది. జగనన్న గృహ లబ్ధిదారుల నుంచి కనీస స్పందన కరువైంది. గత కొద్ది రోజులుగా జనసేన నాయకులు జగనన్న ఇళ్లు పేదల కన్నీళ్లు అంటూ ప్రచారం చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫిల్మ్‌నగర్‌లోని హోటల్ డెక్కన్ కిచెన్‌లో కొంతభాగాన్ని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం! ఉదయ్‌పుర్- అహ్మదాబాద్ రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. ఓడ బ్రిడ్జ్ నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు గమనించిన స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరి అంత తక్కువా? చాలా మందికి ఒక ఇల్లు లేదా విల్లా కొనుగోలు చేయలానే కల ఉంటుంది. కానీ, ఎవరికైనా ఒక గ్రామాన్ని కొనుగోలు చేయాలనుంటుందా? బాగా డబ్బు ఉన్న వాళ్లు రెండు మూడు ప్రాంతాల్లో నివాస గృహాలు కొనుగోలు చేయటం సహజమే. అయితే, ఒక గ్రామం మొత్తం అమ్మకానికి ఉంటే.. అది కేవలం ఒక ఇంటి ధరకే వస్తే..? ఆ ఆలోచనే నమ్మశక్యంగా లేదు కదా! 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. T20 WC 2022 Final Winner: పాకిస్తాన్‌ను చిత్తుచేసి విశ్వవిజేతగా ఇంగ్లండ్ పొట్టి ఫార్మాట్ క్రికెట్లో ఇంగ్లండ్ మరోసారి జగజ్జేతగా నిలిచింది. 2010లో పాల్ కాలింగ్ వుడ్ బృందం ట్రోఫీ గెలవగా.. బట్లర్ సేన టీ20 ప్రపంచకప్-2022 కప్‌ను సొంతం చేసుకుంది. దీంతో మరోసారి వరల్డ్‌కప్ టైటిల్ గెలవాలన్న పాక్ ఆశలు అడియాసలయ్యాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పుష్ప-2 మేకర్స్‌పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్.. గీతా ఆర్ట్స్ వద్ద టెన్షన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు బన్నీ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప- 2 మూవీ అప్ డేట్స్ త్వరగా ఇవ్వాలంటూ అభిమానులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సామాన్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు! కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యవసరాల సరుకుల ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు కాస్త ఊరటరానుంది. దేశంలో కుకింగ్ ఆయిల్ రేట్లు (Cooking Oil) దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. IBS Ragging: ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి: సీఎం జగన్ దేశ ప్రగతి రథసారథి నరేంద్ర మోదీ అని, సహృదయంతో ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్ 177ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదయింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్న సంగతి ప్రధాని మోదీకి తెలిసిపోయిందా?! ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రావడం, పవన్ కళ్యాణ్‌ను కలవడం.. ఇది ఎల్లో మీడియాకు మహాదానందం కలిగించిందన్నది వారి పత్రికల్లో అచ్చేసిన రాతలను బట్టి సగటు ఆంధ్రులందరికీ అవగాహన కలిగిన విషయం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. నన్ను ఎంత తిట్టినా ఫర్వాలేదు, కానీ..: ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే తెలంగాణలో చీకట్లు తొలగిపోవాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. హిమాచల్‌లో పోలింగ్.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా పోలింగ్ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఎట్టకేలకు పుతిన్ సేనలకు ఊహించని పరాభవం.. ఫుల్ జోష్‌లో ఉక్రేనియన్లు ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా సేనలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. బాంబు దాడులతో ఉక్రెయిన్ సేనలను, ఆ దేశ పౌరులను భయభాంత్రులకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే, 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. వణుకుతున్న ఉద్యోగులు.. ఏడాది చివరికల్లా మాంద్యంలోకి ఆ దేశాలు! ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ నటి బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె 2016లో కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే? టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్ తుది సమరంలో పాకిస్తాన్‌తో తలపడనుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. జనసేన నాయకుల ఓవరాక్షన్.. దెబ్బకు జారుకున్నారు కృష్ణా జిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. జగనన్న లే ఔట్‌ను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నాయకులు సౌకర్యాలు లేవని చెప్పాలంటూ లబ్ధిదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వెంటే తాను ఉంటానని తుమ్మల స్పష్టం చేశారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం ఆయన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: రామచంద్రభారతిపై ప్రశ్నల వర్షం.. కీలక స్టేట్మెంట్.. అందులో ఏముంది? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను రాజేంద్రనగర్ సీఎస్‌లో పోలీసులు విచారించారు. తొలి రోజు విచారణలో సుమారు 7 గంటల పాటు నిందితులను ప్రశ్నించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రమాణం చేయగలవా..? చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారిలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని.. అరబిందో సంస్థతో నీకు సంబంధం లేదని ప్రమాణం చేయగలవా..? అంటూ చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు సీనియర్ నాయకులు పోటీ విముఖత చూపారు. తాము పోటీ చేయడం లేదని, అభ్యర్థుల ఎంపికలో తమ పేర్లు పరిశీలించొద్దని అధిష్టానానికి తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. గొప్ప మనసు చాటుకున్న లాలూ కూతురు.. తండ్రికి కిడ్నీ దానం చేయాలని నిర్ణయం బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె గొప్ప మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కొత్త జీవితం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అన్నంత పనిచేస్తున్న పుతిన్... చిన్నారులకు సైతం సైనిక శిక్షణ ఉక్రెయిన్‌పై గెలుపు కోసం పుతిన్ పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు లక్షల మందికి పైగా సైనికులను సైతం రిక్రూట్ చేసుకుంది రష్యా. ఇప్పుడూ ఏకంగా చిన్నారులకు పాఠశాల స్థాయి నుంచి సైనిక శిక్షణ ఇవ్వమంటూ ఆదేశాలు జారీ చేసింది రష్యా. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Ind Vs Eng: టీమిండియా ఓటమి.. ఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో టీమిండియాను చూడాలనుకున్న అభిమానుల ఆశ నెరవేరలేదు. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడ్డ రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. కన్నీరు పెట్టుకున్న రోహిత్ శర్మ ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్-2022 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు మాత్రం తీవ్ర నిరాశపరిశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా? నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. Munugode Bypoll 2022: ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు నిరీక్షిస్తున్నారు. చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. నాపై ఈగ వాలినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊరుకోదు.. ఈటల హెచ్చరిక తన హత్యకు కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని చెప్పారు. సీఎం ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, పక్కా స్కెచ్ ప్రకారమే మంగళవారం మునుగోడులో తనపై దాడి జరిగిందని అన్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పిల్లల్ని చదువుకోనివ్వండి రామోజీ! ఇంకెన్నాళ్లు కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ము కాసే ఈ రాతలు? ప్రభుత్వ స్కూళ్లపై విషం చిమ్మటం వెనక రామోజీరావు ఆందోళన ఒక్కటే. ప్రభుత్వ స్కూళ్లను ఫణంగా పెట్టి తాము పెంచిపోషించిన కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు నూకలు చెల్లుతున్నాయన్నదే!. గాలీవెలుతురూ లేని భారీ భవనాల్లో.. విద్యార్థులను బట్టీపట్టే యంత్రాల్లా మార్చేసే ఈ ‘కార్పొరేట్’ స్కూళ్లకు కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబు ఇపుడు అధికారంలో లేరన్నదే ఆయన బాధ. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. గెహ్లాట్ VS సచిన్ రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్‌పై దాడికి దిగారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో గెహ్లాట్‌పై ప్రశంసలు కురిపించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్? టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాము టైటిల్ గెలవడానికి రాలేదని, టీమిండియాను మాత్రం ఓడించితీరతామని అని షకీబ్ కామెంట్ చేశాడు. అయితే బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. డీజిల్‌పై ఇప్పటికీ రూ.4 నష్టమే! ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్‌పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పవన్‌కళ్యాణ్‌ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటకు వెళ్లినప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టాప్ హెడ్‌లైన్స్ @6:00 Pm 02 నవంబర్ 2022
-
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టు ఫోర్జరీ లేఖ వైరల్.. స్పందించిన బండి దొంగ పాస్‌పోర్టులు తయారుచేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం పెద్ద కష్టం కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫోర్జరీ లేఖ వైరల్ కావడంపై మంగళవారం రాత్రి ఆయన స్పందించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు స్థానికేతర నేతలు, శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గం బయటకు వచ్చినా ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఓటర్లపై పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రిజిస్ట్రేషన్ల అధికారంపై వ్యాజ్యం మూసివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని కల్పించడం సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని అడ్డుకున్నట్టు కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో పాటు సబ్ రిజిస్ట్రార్లు కూడా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హులేనని స్పష్టం చేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Rain Forecast: వచ్చే రెండు రోజులు వర్షాలు రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. గుర్తింపుకు నోచని రక్తచరిత్ర.. మాన్‌గఢ్ ధామ్.. మరో జలియన్ వాలాబాగ్ ఆదివాసీల ప్రాబల్యమున్న మాన్‌గఢ్ ప్రాంతమది. బ్రిటిష్ పాలనలో రక్తమోడింది. జలియన్‌వాలాబాగ్ ఘటనకి ఆరేళ్ల ముందు ఇక్కడ తెల్లదొరలు మారణహోమం సాగించి అక్షరాలా 1500 మంది ఆదివాసీల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. జాబ్ మానేయ్!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్లోకి వెళ్లి.. ఉద్యోగం చేసే స్త్రీ విషయంలో కుటుంబంలో ఎదురయ్యే ప్రతీ సమస్య ఆమెకు ఎప్పుడూ ఓ సవాల్‌గానే ఉంటుంది. పిల్లల సంరక్షణ, పెద్దల ఆరోగ్యం, ఆఫీస్ ఇంటికి దూరమైనా, ఆర్థికంగా బాగున్నాం అనుకున్నా... ముందుగా ‘ఆమె’ను ‘ఉద్యోగం మానేయ్!’ అని అంటుంటారు ఇంట్లో. ‘నిజమే కదా! నా అవసరం మొదట ఇంటికే ఉందనుకుంటూ కుటుంబం కోసం కెరియర్ను త్యాగం చేసేస్తుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా? బిలియనీర్, టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ బ్లూ టిక్ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో యూజర్లు తమ బ్లూ టిక్‌ను నిలుపు కోవాలన్నా, కొత్తగా బ్లూటిక్ కావాలన్నా ఇక చెల్లింపులు చేయాల్సిందే. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్‌కు చేరే జట్లను భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అంచనా వేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. Bigg Boss 6: నిందలు తట్టుకోలేక బాత్రూంలోకి ఇనయా.. రంగంలోకి బిగ్‌బాస్ బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్లో హౌస్మేట్స్ అంతా ఇనయాను టార్గెట్ చేశారు. ఆమె పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. ముఖ్యంగా సూర్య విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. దీంతో ఇనయా మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ నేడే అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు. లలిత్ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కల్లు కిస్తీలు రద్దు.. ఐదేళ్లకు కల్లుగీత పాలసీ మార్గదర్శకాలు విడుదల ఏపీలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదేళ్ల విధానాన్ని ప్రకటించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడుపై కేసీఆర్‌ది కపటప్రేమ.. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే.. మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే చండూరు సభలో సీఎం కేసీఆర్ కపటప్రేమ ప్రదర్శించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతూ చేయని పనులు పక్షం రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. చివరి ఘట్టానికి మునుగోడు ఉప ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి! మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం.. మునుగోడులో ఆ అభ్యర్థి కోసమే.. జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లో తనిఖీలు నిర్వహించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 89.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. జో బైడెన్, కమలా హారిస్ సంతాపం గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దం అవుతోంది. ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి తమ సెమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సమంత 'మయోసైటిస్' వ్యాధిపై కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ ఇప్పుడు చర్చంతా నటి సమంత గురించే. ఇంతకుముందు ఈమె వ్యాఖ్యలు, గ్లామరస్ పొటోలు, నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి రకరకాలుగా చర్చించుకున్న సినీ వర్గాలు ఇప్పుడు ఆమె బాధపడుతున్న వ్యాధి గురించి చర్చించుకుంటున్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. ది హిందూ ఇంటర్వ్యూ: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసు.. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం మునుగోడు నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాలకు రూ.5.24 కోట్ల బదిలీకి సంబంధించి వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీలో మారుతున్న రాజకీయం! టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మారతాయా? ఆ పరిణామాలు ఏ పార్టీకి ప్రయోజనం? ఏ పార్టీకి నష్టం ? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేనలు కలిసి పొత్తు పెట్టుకుని వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీచేస్తే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందా అన్న సందేహం కొందరికి రావచ్చు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పలకని పవన్.. నాదెండ్ల సైగ చేసినా సరే మౌన ప్రేక్షకుడిగానే ! జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈసారి విలేకరుల సమావేశంలో పూర్తి ప్రేక్షక పాత్ర వహించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్‌కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఉన్నట్టుండి బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా? మనిషి శ్వాస తీసుకుంటేనే ప్రాణాలతో ఉంటాడు. శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు ఎంతో కీలకం. మనిషి సాధారణంగా ఒక్క రోజులో దాదాపు 25,000 సార్లు ఊపిరి తీసుకుంటాడు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్, నత్రజని, తక్కువ మొత్తంలో ఇతర వాయువులు, తేలియాడే బ్యాక్టీరియా, వైరస్, వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాలు ఉంటాయి. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ట్విటర్లో ఉద్యోగాల కోతలు షురూ మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ .. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఉద్యోగులు ఎక్కువగా ఉన్న విభాగాలను భారీగా కుదించడంపై దృష్టి పెట్టారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. T20 WC 2022: మేము చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయాం! సూర్య అద్భుతం టీ20 ప్రపంచకప్-2022లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 49 పరుగులుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా? నటుడు, నిర్మాతగా బిజీగా ఉన్నా విశాల్‌పై తాజాగా ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో దొర్లుతుంది. అయితే ఇలాంటి వదంతులు ఆయనకు కొత్తేమీ కాదు. స్టార్ హీరోగా రాణిస్తున్న విశాల్ చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రధాని.. చరిత్రలో ఒకేఒక్కడు రిషి..! కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ను గాడినపెట్టే బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్‌కు మొదట్నుంచి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు ఉంది. చిన్నతనంలో తల్లి పనిచేసే ఫార్మసీ షాప్‌లో పని చేసినప్పుడే వాటి జమా ఖర్చులన్నీ చూసేవారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.ప్రధాని పదవి పూలపాన్పు కాదు.. రిషికి ముందుంది ముళ్లబాటే..! అపజయం ఎదురైన చోటే విజయాన్ని అందుకొని బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆ పదవి పూలపాన్పు కాదు. ముందున్నది అంతా ముళ్లబాటే. బ్రెగ్జిట్, కోవిడ్–19 సంక్షోభం, , రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థికంగా కుదేలైపోయిన బ్రిటన్ను దారిలోని తీసుకురావాల్సిన అతి పెద్ద సవాల్ ఆయన ఎదురుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్(800 మెగావాట్లు)ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం మొదట ఓ పిటిషన్ వేసి, ఆ విషయాన్ని దాచి పెట్టి... అదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేసిన విశాఖ వాసి పి.రంగారావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘చేనేతపై జీఎస్టీ కోరింది కేటీఆరే.. దీనికేం చెప్తరు ట్విట్టర్ టిల్లు?’ చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డీఏవీ స్కూల్ నిర్వహణలో మరో ఉల్లంఘన వెలుగు చూసింది. పాఠశాలకు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖాధికారుల పరిశీలనలో వెల్లడైంది. సఫిల్‌గూడ బ్రాంచి పేరుతో ఆరు, ఏడు తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.Deepmala Pandey: స్పెషల్ టీచర్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి! కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే! సిడ్నీలో నెట్ సెషన్ సందర్భంగా తమకు సరైన భోజనం లభించలేదంటూ టీమిండియా ఆటగాళ్లలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రాక్టీస్ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాతే వారు లంచ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా.. తన భార్య వైపు చూస్తున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ దళితుడు, అతడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా అతడి ఇద్దరు సోదరులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దామోహ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి: సీఎం వైఎస్ జగన్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సందర్భంగా భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బాబు, పవన్ సస్పెన్స్ పాలిటిక్స్‌కు తెర.. ముసుగు తొలగింది! ఏపీ రాజకీయాల్లో ముసుగు తొలగింది. గత మూడేళ్ల నుంచి తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు ఈరోజు దాదాపుగా బహిర్గతమయ్యాయి. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పని చేస్తున్నాడని ఇన్నాళ్ల నుంచి వైఎస్సార్సీసీ చేస్తున్న ప్రకటనలకు పూర్తి ఆచరణ రూపం ఇచ్చిన చంద్రబాబు.. నేరుగా విజయవాడ నొవాటెల్‌కు వెళ్లి పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘సినిమా డైలాగులతో నీ నోటి తీట తీరుతుంది.. అంతే తప్ప ఏమీ పీకలేవు’ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ముసుగు తొలిగిపోయింది. ముసుగు వెనకాల చంద్రబాబు గులాంగిరి ఉంది. చంద్రబాబుకు లబ్ధి కలిగించడమే పవన్ అంతిమ లక్ష్యం. సన్నాసి నాలుక చీరేస్తా.. అని నేను అనలేనా?. కానీ.. నాకు సంస్కారం అడ్డు వస్తోంది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మునుగోడులో డబ్బు ప్రవాహం.. మరో వాహనం! మునుగోడు ఉపఎన్నికలో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు.. డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగిస్తారా? అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌లు భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు. వీరిద్దరు పాకిస్థాన్‌లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్‌కు ఎదురైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో బలపరీక్ష! స్పీకర్‌ను కలిసిన బీజేపీ రాజస్థాన్‌లో రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని బీజేపీ నేతల బృందం మంగళవారం ఉదయం కలవడం చర్చనీయాంశమైంది. గత నెలలో రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మీ కారు, బైక్ ఏ కంపెనీవి..దొంగలు టార్గెట్ చేస్తున్న వాహనాల జాబితా ఇదే! వాహన కొనుగోలు దారులకు అలెర్ట్. ఇప్పటికే కింద పేర్కొన్న కార్లు కొనుగోలు చేసినా, లేదంటే కొనుగోలు చేయాలని అనుకున్నా తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే? దేశంలో దొంగలు రూటు మార్చారు. నిన్న మొన్నటి వరకు చోరీకి వెళ్లి చేతికి ఏది దొరికి అది దొంగిలించేవారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. T20 World Cup Records: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ రికార్డులివే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 8వ టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే సంచలనాలకు వేదికైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకివ్వగా, రెండో రోజు మరో పసికూన స్కాట్లాండ్.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌కు ఫ్యూజులు ఎగరగొట్టింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Bigg Boss 6: కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఫైర్.. షాకింగ్ నిర్ణయం! బిగ్‌బాస్-6లో కెప్టెన్సీ కంటెడర్ టాస్కులు అంతగా పేలడం లేదు. కంటెస్టెంట్స్ అతిగా ఆలోచించి.. వాళ్లకు వాళ్లే కొత్త రూల్స్ పెట్టుకుంటున్నారు. ఫలితంగా బిగ్‌బాస్ ఆశించిన ఔట్పుట్ రావడంతో లేదు. ఈ వారం కూడా కంటెస్టెంట్స్ అలాంటి పనే చేసి బిగ్‌బాస్ ఆగ్రహానికి గురైయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. షాకింగ్.. కదులుతున్న రైలు నుంచి యువకుడ్ని కిందకు తోసేసిన ప్యాసెంజర్ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడ్ని తోటి ప్యాసెంజర్ కదులుతున్న రైలులోనుంచి కిందకు తోసేశాడు. ఇద్దరు గొడవపడిన అనంతరం ఆగ్రహంతో ఈ పని చేశాడు. అయితే యువకుడు రైలు నుంచి కిందపడిపోయినా అతడ్ని తోసేసిన వ్యక్తి ఏమాత్రం పశ్చాతాపం, ఆందోళన లేకుండా యథావిధిగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. వైఎస్సార్ రైతు భరోసా: రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు జమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా నిధుల్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల సాయాన్ని అందించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో.. పవన్‌పై పేర్ని నాని స్ట్రాంగ్ కామెంట్స్ పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షూటింగ్ గ్యాప్‌లో పవన్ విశాఖకు వెళ్లారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘మీ వల్లే నాన్న బతికారు.. మిమ్మల్ని చూడాలని వచ్చారు’ రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆర్బీకే కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్.. రుణాల పేరిట మోసం చేసిన కేసులో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నామా కుటుంబానికి చెందిన రూ.80.65 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని ఈడీ అటాచ్ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు.. 600 మంది మృతి.. 2 లక్షల ఇళ్లు ధ్వంసం దక్షిణ ఆఫ్రికా దేశం నైజీరియాను వరదలు ముంచెత్తాయి. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వివిధ ప్రమాదాల్లో మొత్తం 600 మంది మరణించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆరోపించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అమానవీయం.. అప్పు చెల్లించలేదని స్కూటర్‌కు కట్టేసి.. నడిరోడ్డుపై.. ఒడిశా కటక్ నగరంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడ్ని స్కూటర్‌కు కట్టేసి పరుగెత్తించింది ఓ గ్యాంగ్. అతని చేతులకు తాడు కట్టి నడిరోడ్డుపై చాలా దూరం లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. రూపాయి పతనం: ఆమెకు నోబెల్ ఇవ్వాల్సిందే! సోషల్ మీడియా కౌంటర్లు దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో ప్రకంకపనలు పుట్టిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడం లేదు.. డాలర విలువ పెరుగుతోందని పేర్కొన్నారు డాలర్ నిరంతరం బలపడుతూ ఉండటంతో అన్ని కరెన్సీలు బలహీన పడుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తప్పదా? ఇంతకీ అతడికి ఏమైంది? టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా ఈసారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. స్వదేశం, విదేశాల్లో వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన రోహిత్ సేన.. టైటిల్ విజేతగా నిలవాలని భావిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రపంచంలో అందమైన మహిళలు.. టాప్ టెన్‌లో బాలీవుడ్ నటి..! బాలీవుడ్లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన ఉనికి చాటుకుంది. తాజాగా ఆమె పేరు అరుదైన జాబితాలో చేరింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. ‘అందుకే అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు దాక్కుంటున్నారు’ ప్రజల్లోకి వెళ్తే ధైర్యం చంద్రబాబుకు లేదని.. అందుకే అసెంబ్లీకి కూడా రాకుండా దాక్కుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఎద్దేవా చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి రాజకీయం చేస్తున్నారో ఆయన పార్టీ వారికే అర్థం కాదు. పార్టీ క్యాడర్‌కు కాకపోతే, ఆయనకైనా అర్థం అవుతుందా అన్న అనుమానం వస్తుంటుంది. కాకపోతే ఒక సినీ నటుడు కనుక, ఆయన ఏమి మాట్లాడినా మీడియా కవరేజి వస్తుంటుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. భూముల ధరలకు రెక్కలు.. ‘రింగ్’ రియలేనా? గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న రియల్ వ్యాపారం ఒక్కసారిగా జోరందుకుంది. రింగ్‌రోడ్డు వస్తుందంటూ వార్తలు రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. అయితే “రింగ్’ రియల్‌గా ఎక్కడి నుంచి వెళ్తుందో ఎవరి భూములు రోడ్డుకు పోతాయో, ఎవరి భూ ములు మిగులుతాయో అంటు స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. సల్మాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు యోగా గురువు బాబా రాందేవ్ బాలీవుడ్ ఇండస్ట్రీపై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో రాందేవ్ పాల్గొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీసోడియాకు సమన్లు జారీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్.... చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్ బీజింగ్‌లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్‌పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా... పోలీసులే క్రిమనల్స్‌లా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్ ట్యాక్స్ ఏజెంట్‌ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్ వద్ద కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. హమ్మయ్యా.. కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్డీలపై 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఎస్బీఐ (SBI) వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు అక్టోబర్ 15, 2022 నుంచి అమలులోకి వస్తాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐసీసీ సంచలన నిర్ణయం.. కరోనా వచ్చినా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడవచ్చు..! టీ20 వరల్డ్‌కప్-2022లో పాల్గొనే జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుభవార్త చెప్పింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవిడ్ ప్రోటోకాల్స్‌ను ఎత్తివేయడంతో ఇకపై కోవిడ్ టెస్ట్‌లు, ఐసోలేషన్ తప్పనిసరి కాదని ఐసీసీ ఇవాళ ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇది ఊహించలేదు.. ప్రభుత్వానికి నయన్ దంపతుల బిగ్ ట్విస్ట్! నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మునుగోడు దంగల్.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కేసీఆర్ పెన్షన్లు పెంచితే.. మోదీ పెద్దోళ్లకు దోచిపెడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. Monkeypox: 70 వేలు దాటిన మంకీపాక్స్ కేసులు.. ఇదే డేంజర్ టైమ్! ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్కును దాటాయి. కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి మంకీపాక్స్ బాధితుల సంఖ్య 70వేలు దాటిందని, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ నివేదిక సమర్పించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె! తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజా లట్కేను తమవైపు లాక్కునేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపినట్లయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. నరబలి ఘటన మరువక ముందే క్షుద్రపూజల కలకలం.. కన్నతండ్రే కూతుర్ని.. కేరళలో మహిళల నరబలి ఘటన మరువక ముందే గుజరాత్లో మరో దారుణం వెలుగుచూసింది. కన్నతండ్రే క్షుద్రపూజలు చేసి 14ఏళ్ల కూతుర్ని చంపాడు. ఆమెకు గంటలపాటు నరకం చూపించి చావుకు కారణమయ్యాడు. గిర్ సోమ్‌నాథ్ జిల్లా ధవా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రిస్క్‌లో 90 లక్షల కస్టమర్ల సమాచారం.. ఎస్బీఐ సహా పలు సంస్థల డేటా లీక్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులతో సహా 90 లక్షల కార్డ్ హోల్డర్ల ఆర్థికపరమైన డేటా భారీ లీకైనట్లు సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు బయటపెట్టారు. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు జరుపుతున్న CloudSEK సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పోవడంపై నోరు విప్పిన గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్ గంగూలీ.. పదవి కోల్పోవడంపై తొలిసారి నోరు విప్పాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన దాదా ఈ విషయంపై స్పందిస్తూ.. ఆటగాడిగా, అడ్మినిస్ట్రేటర్‌గా జీవిత కాలం కొనసాగడం కుదురదని, ఏదో ఒక రోజు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందేనని వైరాగ్యంతో నిండిన మాటలు మాట్లాడాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎట్టకేలకు విడాకుల వార్తలపై స్పందించిన దీపికా బాలీవుల్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్‌లు విడాకులు తీసుకోబుతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్వీర్ నగ్న ఫొటోషూట్ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే వాదనలు వినిపించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌కు షాక్.. గుజరాత్ పార్టీ చీఫ్ అరెస్టు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను సరిత విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2019 నాటి ఓ వీడియోలో ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ ఉందా?! ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు సోషల్ మీడియా వేదికగా బ్లూ టిక్ మేనియా గురించి మనకు తెలిసిందే. దీని ఆధారంగానే మన సందేశం లేదా ఫొటో అవతలి వారు చూశారు అన్నది తెలిసిపోతుంది. మన ఆలోచనలను ప్రదర్శించడానికి, షేర్ చేయడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వేదిక ఇన్స్టాగ్రామ్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అంతర్గత రహస్యాలున్నాయ్.. జూనియర్ ఎన్టీఆర్‌పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితోపైకి వచ్చాడని.. ఎవరి మీద ఆధారపడ లేదని.. అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఆయన అభివృద్ధిలో ఎవరి పాత్ర లేదన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడులో స్పీడ్ పెంచిన బీజేపీ.. కోమటిరెడ్డి, ఈటల సంచలన కామెంట్స్ మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి అధికార టీఆర్ఎస్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆ ఉద్యోగులకు దీపావళి కానుక.. 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. శశి థరూర్‌తో పోలిక.. మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు! కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పోటీలో నిలిచిన మల్లిఖార్జున ఖర్గే తన ప్రత్యర్థి శశిథరూర్‌పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అధికార వికేంద్రీకరణ దిశగా వెళతానన్న శశిథరూర్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా. ఆయనతో తనను పోల్చవద్దని ఖర్గే స్పష్టం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్ అదృశ్యం.. రష్యా పనే! జపోరిజజియా అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్ వలెరియ్ మార్టిన్‌యుక్‌ను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. ఆయనను ఎక్కడ నిర్బంధించి ఉంచారో తెలియడం లేదని పేర్కొంది. ట్రేస్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Jio True 5G: అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు రాష్ట్రంలో 5జీ సేవలను అతి త్వరలో ప్రారంభించేందుకు జియో సమాయత్తమవుతోంది. రాష్ట్ర ప్రజలకు 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో తన నెట్వర్క్ పై దృష్టి పెట్టింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..! బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్ గంగూలీకి మరో అవమానం తప్పేలా లేదు. బీసీసీఐ పదవి పోతే పోయింది.. ఐసీసీలోనైనా చక్రం తిప్పొచ్చని భావించిన దాదాకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం.. యంగ్ హీరో అరెస్ట్! వర్ధమాన నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడని సదరు మహిళా ఫిర్యాదులో పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త ప్రపంచ వ్యాప్తంగా బీపీ, షుగర్, క్యాన్సర్ జబ్బుల రోగుల కంటే ఆర్థరైటిస్ సమస్యే ఎక్కువ మందిలో ఉంది. కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యం రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచుకోవచ్చు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. అనంతను ముంచెత్తిన వాన ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆ ప్యాకేజీకి ఓకే అంటే మునుగోడు నుంచి తప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బీజేపీకి బంపరాఫర్ ప్రకటించారు. మునుగోడు బరి నుంచి తప్పుకునేందుకు ప్యాకేజీ సిద్ధమా? అంటూ ప్రశ్నించారాయన. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ. 18,000 కోట్లు కాంట్రాక్టు ఇచ్చారు కదా అంటూ తీవ్ర విమర్శలే గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. డెమొక్రటిక్ పార్టీకి తుల్సీ గబ్బార్డ్ గుడ్‌బై 20 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు తుల్సీ గబ్బార్డ్. అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు అయిన గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. యూరప్‌లోనూ యూపీఐ చెల్లింపులు యూరప్‌కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్‌కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్‌లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు! భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్‌ను కలుస్తా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ దురాక్రమణ అంశంపై అసలు చర్చించే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయితే ఆ వ్యవహారంపై మాత్రం పుతిన్‌తో అవకాశం ఉంటే చర్చిస్తానని తెలిపారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాలీవుడ్ ఎంట్రీ.. పాన్ ఇండియా లెవల్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన కృతీ శెట్టి మాలీవుడ్‌కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళంలో ‘అజయంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. టీ20 వరల్డ్‌కప్.. టీమిండియాకు బలం టి20 ప్రపంచకప్ 2022 ప్రారంభానికి ముందు టీమిండియా గుడ్‌న్యూస్. టీమిండియా ఫ్రంట్‌లైన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో షమీకి ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. టి20 ప్రపంచకప్‌కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మానవహక్కుల దూత అశ్విని, తొలి దళిత యువతిగా.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. పొగాకు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్ ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. రాజాసింగ్ పీడీయాక్ట్ కేసు.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ పీడీ యాక్టు కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఈనెల 20లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీడీపీతో బీజేపీ పొత్తు లేదన్నాక వారిలో మరింత అసహనం! ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియాను ఎల్లో అంటే పచ్చ మీడియాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాత్రమే అబివర్ణిస్తుంటుంది. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ పదాన్ని వాడడం విశేషమే. మూడు మీడియా సంస్థలు ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నిత్యం కధలు తయారు చేసి జనం మీదకు వదలుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. చావనైనా చస్తా కానీ.. ఆ పని మాత్రం చేయను: కేటీఆర్ బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను కట్టబెట్టినట్లు.. నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. గుంతల రోడ్డు.. పెద్దల కాన్వాయ్కి దారివ్వబోయి పేదోడి వాహనం బోల్తా ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఆటోరిక్షా(ఈ-రిక్షా) సైడ్ ఇవ్వబోయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. దిగ్గజ నేతకు అంతిమ వీడ్కోలు.. జనసందోహమైన సైఫాయ్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో జరుగుతున్నాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎన్నారై కుటుంబ హత్యోదంతం.. ఆ మానవ మృగాన్ని వదలొద్దు! ఎనిమిది నెలల పసికందు అనే కనికరం లేకుండా.. పాత గొడవలు పట్టుకుని ఎన్నారై కుటుంబాన్ని పొట్టనబెట్టన బెట్టుకున్న మానవ మృగంపై నేరారోపణలు నమోదు అయ్యాయి. నిందితుడు మాన్యుయెల్ సల్గాడో(48)పై నాలుగు అభియోగాలు, అదనంగా మరో రెండు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్(EV) మార్కెట్ రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్రం ఆదేశాలు, ఇంధన లభ్యతతో పాటు వాటి ధరలు పెరుగదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కంపెనీలు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. తిప్పేసిన స్పిన్నర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డు టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 11) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ జట్టు వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. నేటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. 27.1 ఓవర్లలో కేవలం 99 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కంటెంట్ రేవంత్ వెనకాల పరిగెడుతోంది.. ప్రతి బిగ్‌బాస్ సీజన్లో ఎంటర్టైన్మెంట్, టాస్కులు అంటూ వాటి వెనక పరుగులు తీస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఈ సీజన్లో మాత్రం అదిగో కెమెరా, ఇదిగో కంటెంట్ అంటూ కాస్త అతి చేస్తున్నారు. ఆరో సీజన్ మొదలై ఐదు వారాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కొందరు పూర్తిగా గేమ్‌లో దిగనేలేదు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. వాటిపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్ కీలక ఆదేశాలు ఎస్ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మోదీ, అమిత్‌షాకు మంత్రి జగదీష్‌రెడ్డి చాలెంజ్ తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. చిక్కుల్లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. బహిరంగంగా మద్యం తాగుతూ కెమెరాలకు చిక్కారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన మల్లారెడ్డి ప్రచారం తర్వాత తన అనుచరులతో కలిసి మందు తాగుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ట్విట్టర్లో కాదు పవన్.. దమ్ముంటే విజయవాడకు రావాలి: జోగి రమేష్ సవాల్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైరయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంచా. పవన్ నువ్వు ఉండేది హైదరాబాద్‌లో.. షూటింగ్స్ విదేశాల్లో.. ఏపీలో గ్రౌండ్ రియాలిటీస్ నీకేం తెలుసు? 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ములాయం సొంత కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలుసా? సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి! అన్నం కోసం వెళ్తే.. అమృతం దొరికినట్లు.. మూవీ చూద్దామని వెళ్తే.. మెగాస్టార్ ఎదురొచ్చినట్లు..కొన్నిటిని వర్ణించడానికి మాటలు సరిపోవు.. అలాంటి సన్నివేశమే ఇది.. ఉరిశిక్ష పడి.. నేడో రేపో ప్రాణం తీసేస్తారు అన్నోడికి సడన్‌గా క్షమాభిక్ష పెట్టేస్తే వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆర్థికశాస్త్రంలో నోబెల్: ఈ ఏడాది ముగ్గురికి పురస్కారం ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్విగ్లకు సోమవారం నోబెల్ బహుమతిని ప్రకటింశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా పసికూన థాయ్‌లాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 10) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి ధాటికి ప్రత్యర్ధి చిగురుటాకులా వణికిపోయింది. 15.1 ఓవర్లు ఆడిన థాయ్ జట్టు కేవలం 37 పరుగులకే కుప్పకూలింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆదిపురుష్ వివాదం.. ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్‌పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్‌తో నిండిపోయాయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు ఇందులో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై పలు హిందు సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. తుపాకీతో బెదిరించి మహిళపై అత్యాచారం.. సర్వీస్ నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మహిళను కిడ్నాప్, లైంగిక దాడి నేరారోపణల నేపథ్యంలో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్ కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో జరిగిన యువతి దారుణ హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కుప్పం కోసం కుస్తీ: ఫోన్లు చేసినా.. బుజ్జగించినా.. మాకొద్దు బాబూ! కుప్పంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. గతనెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. 30 ఏళ్ల బానిస సంకెళ్లను తెగ్గొట్టి టీడీపీ కేడర్ మొత్తం వైఎస్సార్సీపీ వైపు చూస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అంతా గందరగోళం.. థరూర్.. ఓ విఫల ప్రయత్నం.! కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఒకపట్టాన అర్థం కావు. అంతా తెలిసినట్టుగానే ఉంటుంది. మొత్తం గందరగోళంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ చీఫ్ ఎన్నిక కూడా ప్రస్తుతం అలాగే తయారైంది. తమకిష్టుడైన ఖర్గేని హైకమాండ్ తరపున బరిలోకి దింపారు. మళ్ళీ ఎవరైనా పోటీ చేయవచ్చని కమ్మని కబుర్లు చెప్పారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.రష్యాకు మరో ఎదురుదెబ్బ ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంలో రష్యాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే వంతెనపై శనివారం పేలుడు సంభవించి కొంతభాగం దెబ్బతింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.ఈయనగారిని ఇలాగే వదిలెయ్యకండిరా.. బీజేపీ బాబులూ! సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘కేసీఆర్ ఫాంహౌస్‌లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘4జీ నుంచి 5జీకి ఇలా అప్‌గ్రేడ్ అవ్వండి’ సైబర్ నేరస్తులు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మార్కెట్ బూమ్‌ను బట్టి జేబులు నింపుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్, ఆధార్ కార్డు, బ్యాంకు సర్వీసులు, యూపీఐ పేమెంట్స్ ఇలా సందర్భాన్ని టెక్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.లాహిరి లాహిరి ‘క్రూయిజ్’లో..! సముద్రం.. ఎవరినైనా చిన్న పిల్లాడిలా మార్చేస్తుంది! ఎగసిపడే కెరటాల్లా మనసును కేరింతలు కొట్టిస్తుంది!! మరి అలాంటి సముద్రంపై ప్రయాణమంటే... అది కూడా 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్లాంటి క్రూయిజ్‌లో విహరిస్తే? తేలియాడే నగరంలో చక్కర్లు కొడితే? పోలా... అదిరిపోలా... 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.‘మెగా’ డైరెక్టర్‌తో ‘అక్కినేని’మల్టీస్టారర్.. స్క్రిప్ట్ రెడీ! తండ్రీకొడుకు నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట మోహన్ రాజా. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.'ధోని భయ్యాను చాలా మిస్సవుతున్నాం' రాంచీ అనగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చౌళూరు గ్రామంలోని ఆయన ఇంటి వద్ద వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు రాష్ట్రంలోని మరిన్ని ఆలయాల్లో స్వామివార్లకు నిత్య నైవేద్యాలు జరగనున్నాయి. ఆలయాల అభివృద్ధి, నిత్యం ధూప, దీప, నైవేద్యాలకు ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి మరో 2091 ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నడిబజారులో నిలబెడతాం.. బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ, పనికిమాలిన, ప్రచార కండూతి తప్ప మరో ధ్యాసలేని వ్యక్తి అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నేనేం సోనియా రిమోట్‌ను కాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత పార్టీకి డమ్మీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ఉండబోతారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన దీటైన సమాధానమిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం అహ్మదాబాద్‌లో ఖర్గే మాట్లాడారు.‘ నేనేం సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్‌ను కాదు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆ సత్తా భారత్ సొంతం ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతూ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం కేంద్రంగా లాజిస్టిక్ రంగం అభివృద్ధికి కీలకమైన అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధితో పాటు ఎగుమతి, దిగుమతులు సులభతరం చేసేలా 110 ఎకరాల విస్తీర్ణంలో మరో ఇండ్రస్టియల్ లాజిస్టిక్ 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి వెదుకుతున్నది దొరికితే కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అలాంటిది పారేద్దామనుకున్న టికెట్‌కు రూ.కోట్లు దక్కితే... ఆనందానికి అవధులుండవు. ఈ యూఎస్ మహిళ విషయంలో అది నిజమైంది. రోపర్‌కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్ ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్‘5’ను ఐదు డాలర్లకు కొన్నది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.. తర్వాతే.. రాజకీయ నాయకులు, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దింపి, మోసం చేసిన మాయలాడిని ఖండగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందిత మహిళ న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. అయితే పోలీసులు ఈ విషయమై అధికారికంగా సమాచారం జారీ చేయలేదు. ఆమె వద్ద 2 పెన్‌డ్రైవ్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Nayanathara: నయన్ అంత పెద్ద షాక్ ఇస్తుందా! దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి నయనతార. ఈమె గురించి నిత్యం ఏదో ఒక వార్త ప్రచారం అవుతునే ఉంటుంది. ఎక్కడో కేరళలో పుట్టి కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి కథానాయికగా గుర్తింపు పొంది నంబర్ వన్ స్థానానికి చేరుకోవడమే కాకుండా లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది టి20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రజా వెల్లడించాడు. షాహిన్ అఫ్రిది అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడని పేర్కొన్నాడు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. 'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఫ్యూచర్ కన్జూమర్ తాజాగా విఫలమయ్యాయి.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కాఫీ డే వెల్లడించింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమీక్షలో నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ తదితర అంశాలపై చర్చించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఈడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రూ.40లక్షల చెక్కు అందజేసిన సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్‌ను ప్రగతి భవన్లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మా టార్గెట్ అదే.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలే తమ టార్గెట్ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఈ దేశానికి గుదిబండ. 2024 తర్వాత కాంగ్రెస్ కనుమరుగయ్యే ఛాన్స్. ప్రధాని అసమర్థుడు, చేతకాని వారు’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మోదీజీ.. ఆయనంటే మీకు ఎందుకంత భయం? చైనా జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మనవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మానవ హక్కుల పోరాటానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్‌లతో పాటు బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీలకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ లిబర్టీస్, బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీల పేర్లను నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. విడా వీ1, వీ1 ప్రొ అనే రెండు వేరియంట్లలో దీన్ని శుక్రవారం లాంచ్ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..? బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ఈ నెల 18న ముగియనున్న నేపథ్యంలో కొత్తగా ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే అంశంపై చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం విధితమే. చాలామంది ప్రస్తుత కార్యదర్శి జై షా బీసీసీఐ కొత్త బాస్ అవుతాడని.. బీసీసీఐ సారధి సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడని భావించగా.. తాజాగా అధ్యక్ష పదవి రేసులో కొత్త పేరు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అనుష్కను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, ఎందుకంటే.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. తన కూతురు వామిక ఫొటోలను తీస్తున్న మీడియాపై అనుష్క అసహనం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! కొన్ని పదార్థాలు (అలర్జెన్స్) మాత్రమే కాకుండా ఒక్కోసారి కొన్ని ఆహారాలూ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అయితే మరికొన్ని ఆహారపదార్థాలు ఆస్తమాను నివారిస్తాయి కూడా. ఆస్తమాను అదుపులో ఉంచుకోడానికి మనకు సరిపడని ఆహారాలకు దూరంగా ఉంటూ, ఆస్తమాను నివారించే వాటిని తీసుకోవడం మంచిది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. WHO: ఆ భారత కంపెనీ సిరప్‌లను వాడొద్దు భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఓవర్ స్పీడ్.. కేరళలో ఘోర ప్రమాదం ఓ డ్రైవర్ నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు బలిగొంది. కేరళలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కడ్ వడక్కన్‌చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అమ్మవారి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి.. 8 మంది మృతి, షాకింగ్ వీడియో విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్ నదిలోకి దిగారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియా గాంధీ గురువారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ అనారోగ్యంతో చాలాకాలంగా ఆమె పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. KCR Party: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేసిన జాతీయపార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయస్థాయిలో విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఏపీ వాసులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. YV Subba Reddy: తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు తిరుపతి శ్రీనివాససేతు రెండో దశ ఫ్లైఓవర్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.684కోట్లతో శ్రీనివాససేతు నిర్మాణంను చేపట్టినట్లు తెలిపారు. త్వరితగతిన మూడో దశ ఫ్లైఓవర్ పనులను కూడా పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సిరాజ్‌కు కలిసిరాని మూడో టీ20.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్.. కెప్టెన్ రోహిత్ సీరియస్ దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20తో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఏదీ కలిసిరాలేదు. ఎన్నో అంచనాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్ తన స్థాయి మేర రాణించలేదు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతను వికట్లేమీ లేకుండా ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్ బిగ్‌బాస్ ఫైమాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్మేట్స్ నిద్ర లేపాల్సి ఉంటుంది. ఇక ఆమె టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్న టైంలో వసంతి, మెరీనాలు దెయ్యం గెటప్‌లు వేసి ప్రాంక్ చేస్తారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన! ఒకే సమయంలో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన విప్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' పేరు మార్పు కేసీఆర్ కొత్తగా ఎలాంటి రాజకీయ పార్టీని స్థాపించడం లేదు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.. జాతీయ స్థాయి కార్యకలాపాలకు వీలుగా ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చుతున్నారు. నిబంధనల ప్రకారం పార్టీ జెండా, రంగు, ఎన్నికల చిహ్నం అన్నీ ప్రస్తుతమున్నవే కొనసాగుతాయి. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. డీజిల్ వాహనాలు.. ఇకపై ఎలక్ట్రిక్! తొలుత హైదరాబాద్‌లో ఆటోలకు బ్యాటరీల బిగింపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్ వాహనలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలుష్యనియంత్రణ దిశగా రెడ్కో ఈ చర్యలు చేపడుతోంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గుడ్‌న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’ వాతావరణంలో కాలుష్యం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం పంపింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ట్రాన్స్‌కో ఆస్తులు ప్రైవేటుకు! విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. India vs South Africa 3rd T20: చివరిది వదిలేశారు.. పోరాడకుండానే.. టీమిండియా టి20 ప్రపంచకప్ సన్నాహకం పరాజయంతో ముగిసింది. మెగా టోర్నీకి ముందు ఆడిన చివరి పోరులో భారత్ ఓటమి పాలైంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా మూడో టి20లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 49 పరుగులతో భారత్‌పై విజయం సాధించింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Godfather Twitter Review ‘గాడ్ ఫాదర్’ టాక్ ఎలా ఉందంటే.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అందుబాటులోకి 5జీ, భారత్‌లో ఇక టెక్నాలజీకి తిరుగుండదు భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రావడమనేది టెక్నాలజీని మెరుగుపర్చుకోవడానికి సంబంధించి ఒక ఉత్ప్రేరకం లాంటి ఘటనగా ఉండగలదని చిప్సెట్ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో అమోన్ తెలిపారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Dussehra 2022: పాలయమాం దేవీ! ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించే దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. ఆసేతు హిమాచలం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలలో ఒకటైన ఈ దసరా గురించి... 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఏదైనా స్పెషల్ చేసి పెట్టు, త్వరగా వస్తానంటవి.. ఇంతలోనే ఎంత పనైంది దేవుడా! విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు యమపాశాల్లా తెగిపడుతున్నాయి. వీటి బారిన పడి ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అయినా విద్యుత్ శాఖ అధికారుల్లో మార్పు రాలేదు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మునుగోడుపై టీఆర్ఎస్ ఫుల్ ఫోకస్! రంగంలోకి కేటీఆర్, హరీశ్ కూడా? మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడటంతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సర్వశక్తులూ ఒడ్డి అయినా మునుగోడులో విజయం సాధించాలని భావిస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇక కొత్త రోస్టర్.. ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెరగడంతో భారీ మార్పులు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో నూతన రోస్టర్ రూపకల్పన అనివార్యమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం ఉండగా తాజాగా 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు.. పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మరోసారి రెచ్చిపోయిన నార్త్‌కొరియా.. జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం నార్త్ కొరియా మరోసారి రెచ్చిపోయింది. మంగళవారం జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్ ప్రావిన్స్ నుంచి బాలిస్టిక్ పణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. సర్వేలో చేదు నిజాలు.. యువతలో గుండె సమస్యలు తీవ్రం ఆరోగ్య రాజధాని బెంగళూరులో యువత గుండె ఒత్తిడితో సమతమవుతోంది. మంచి చదువులు, ఉద్యోగం, ఇంకా రకరకాల లక్ష్యాలతో విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వయసుకు మించిన ఒత్తిడిని హృదయం అనుభవిస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంట్లోనే ఐపీఎస్ అధికారి దారుణ హత్య.. పనిమనిషి పరార్ జమ్ముకశ్మీర్ జైళ్ల ఉన్నతాధికారి హేమంత్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన ఇంట్లో శమమై కన్పించారు. నిందితులు ఆయనను గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గిన 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాలైన నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. IND vs SA 2nd T20: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి ఆస్ట్రేలియాపై సిరీస్ సొంతమైంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కింది. ఇక శనివారం ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరేముందు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే రెండు సిరీస్‌లు సాధించినా, ఒక ప్రధాన సమస్య మాత్రం జట్టును ఇంకా ఇబ్బంది పెడుతోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Bigg Boss 6 Telugu: ఈసారి కాస్త డిఫరెంట్‌గా.. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో రోహిత్ అండ్ మెరీనాలకు షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. గతంలో పోలిస్తే ఈసారి నామినేషన్స్ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగింది. వారిలోనే ఎవరో ఒకరు నామినేట్ అయి, మరొకరు సేవ్ అవ్వాల్సిందిగా ఆదేశించాడు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి