Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు | Latest Telugu News Online Telugu Breaking News 16th October 2022 | Sakshi
Sakshi News home page

Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు

Published Sun, Oct 16 2022 6:16 PM | Last Updated on Sun, Oct 16 2022 6:25 PM

Latest Telugu News Online Telugu Breaking News 16th October 2022 - Sakshi

1. ‘అందుకే అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు దాక్కుంటున్నారు’
ప్రజల్లోకి వెళ్తే ధైర్యం చంద్రబాబుకు లేదని.. అందుకే అసెంబ్లీకి కూడా రాకుండా దాక్కుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఎద్దేవా చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్‌ కల్యాణ్‌కు అర్థమవుతుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఏమి రాజకీయం చేస్తున్నారో ఆయన పార్టీ వారికే అర్థం కాదు. పార్టీ క్యాడర్‌కు కాకపోతే, ఆయనకైనా అర్థం అవుతుందా అన్న అనుమానం వస్తుంటుంది. కాకపోతే ఒక సినీ నటుడు కనుక, ఆయన ఏమి మాట్లాడినా మీడియా కవరేజి వస్తుంటుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. భూముల ధరలకు రెక్కలు.. ‘రింగ్‌’ రియలేనా?
గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న రియల్‌ వ్యాపారం ఒక్కసారిగా జోరందుకుంది. రింగ్‌రోడ్డు వస్తుందంటూ వార్తలు రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. అయితే “రింగ్‌’ రియల్‌గా ఎక్కడి నుంచి వెళ్తుందో ఎవరి భూములు రోడ్డుకు పోతాయో, ఎవరి భూ ములు మిగులుతాయో అంటు స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. సల్మాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడు.. బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు
యోగా గురువు బాబా రాందేవ్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీపై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్‌, వీరాంగన సదస్సులో రాందేవ్‌ పాల్గొన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మనీష్‌ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్‌ చేస్తుంది: ఆప్‌
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీసోడియాకు సమన్లు జారీ చేయడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్‌.... చైనాకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌
బీజింగ్‌లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్‌ పార్టీ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తైవాన్‌పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్‌పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా...
పోలీసులే క్రిమనల్స్‌లా ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్‌ ట్యాక్స్‌ ఏజెంట్‌ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్‌ వద్ద కిడ్నాప్‌ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

8. హమ్మయ్యా.. కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ
ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీలపై 10 బేసిస్‌ పాయింట్ల నుంచి 20 బేసిస్‌ వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఎస్‌బీఐ (SBI) వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రేట్లు అక్టోబర్ 15, 2022 నుంచి అమలులోకి వస్తాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఐసీసీ సంచలన నిర్ణయం.. కరోనా వచ్చినా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడవచ్చు..!
టీ20 వరల్డ్‌కప్‌-2022లో పాల్గొనే జట్లకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) శుభవార్త చెప్పింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను ఎత్తివేయడంతో ఇకపై కోవిడ్‌ టెస్ట్‌లు, ఐసోలేషన్‌ తప్పనిసరి కాదని ఐసీసీ ఇవాళ ప్రకటించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఇది ఊహించలేదు.. ప్రభుత్వానికి నయన్ దంపతుల బిగ్ ట‍్విస్ట్!
నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement