1. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి: సీఎం వైఎస్ జగన్
జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సందర్భంగా భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. బాబు, పవన్ సస్పెన్స్ పాలిటిక్స్‌కు తెర.. ముసుగు తొలగింది!
ఏపీ రాజకీయాల్లో ముసుగు తొలగింది. గత మూడేళ్ల నుంచి తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు ఈరోజు దాదాపుగా బహిర్గతమయ్యాయి. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పని చేస్తున్నాడని ఇన్నాళ్ల నుంచి వైఎస్సార్‌సీసీ చేస్తున్న ప్రకటనలకు పూర్తి ఆచరణ రూపం ఇచ్చిన చంద్రబాబు.. నేరుగా విజయవాడ నొవాటెల్‌కు వెళ్లి పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యాడు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. ‘సినిమా డైలాగులతో నీ నోటి తీట తీరుతుంది.. అంతే తప్ప ఏమీ పీకలేవు’
దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ముసుగు తొలిగిపోయింది. ముసుగు వెనకాల చంద్రబాబు గులాంగిరి ఉంది. చంద్రబాబుకు లబ్ధి కలిగించడమే పవన్ అంతిమ లక్ష్యం. సన్నాసి నాలుక చీరేస్తా.. అని నేను అనలేనా?. కానీ.. నాకు సంస్కారం అడ్డు వస్తోంది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. మునుగోడులో డబ్బు ప్రవాహం.. మరో వాహనం!
మునుగోడు ఉపఎన్నికలో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు.. డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగిస్తారా?
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌లు భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు. వీరిద్దరు పాకిస్థాన్‌లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్‌కు ఎదురైంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో బలపరీక్ష! స్పీకర్‌ను కలిసిన బీజేపీ
రాజస్థాన్‌లో రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని బీజేపీ నేతల బృందం మంగళవారం ఉదయం కలవడం చర్చనీయాంశమైంది. గత నెలలో రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. మీ కారు, బైక్ ఏ కంపెనీవి..దొంగలు టార్గెట్ చేస్తున్న వాహనాల జాబితా ఇదే!
వాహన కొనుగోలు దారులకు అలెర్ట్. ఇప్పటికే కింద పేర్కొన్న కార్లు కొనుగోలు చేసినా, లేదంటే కొనుగోలు చేయాలని అనుకున్నా తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే? దేశంలో దొంగలు రూటు మార్చారు. నిన్న మొన్నటి వరకు చోరీకి వెళ్లి చేతికి ఏది దొరికి అది దొంగిలించేవారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. T20 World Cup Records: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ రికార్డులివే
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 8వ టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే సంచలనాలకు వేదికైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకివ్వగా, రెండో రోజు మరో పసికూన స్కాట్లాండ్.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌కు ఫ్యూజులు ఎగరగొట్టింది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. Bigg Boss 6: కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఫైర్.. షాకింగ్ నిర్ణయం!
బిగ్‌బాస్-6లో కెప్టెన్సీ కంటెడర్ టాస్కులు అంతగా పేలడం లేదు. కంటెస్టెంట్స్ అతిగా ఆలోచించి.. వాళ్లకు వాళ్లే కొత్త రూల్స్ పెట్టుకుంటున్నారు. ఫలితంగా బిగ్‌బాస్ ఆశించిన ఔట్‌పుట్ రావడంతో లేదు. ఈ వారం కూడా కంటెస్టెంట్స్ అలాంటి పనే చేసి బిగ్‌బాస్ ఆగ్రహానికి గురైయ్యారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. షాకింగ్.. కదులుతున్న రైలు నుంచి యువకుడ్ని కిందకు తోసేసిన ప్యాసెంజర్
పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడ్ని తోటి ప్యాసెంజర్ కదులుతున్న రైలులోనుంచి కిందకు తోసేశాడు. ఇద్దరు గొడవపడిన అనంతరం ఆగ్రహంతో ఈ పని చేశాడు. అయితే యువకుడు రైలు నుంచి కిందపడిపోయినా అతడ్ని తోసేసిన వ్యక్తి ఏమాత్రం పశ్చాతాపం, ఆందోళన లేకుండా యథావిధిగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment