టుడే ఈవినింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | top10 telugu latest news evening headlines 29th september 2022 | Sakshi
Sakshi News home page

Top Trending News: టుడే ఈవినింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Thu, Sep 29 2022 6:36 PM | Last Updated on Thu, Sep 29 2022 6:47 PM

top10 telugu latest news evening headlines 29th september 2022 - Sakshi

1. ఎస్‌డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణం: సీఎం జగన్‌

ఎస్‌డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్‌డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ చేపట్టారు. ఈ సందర్భంగా.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సమీక్ష జరిపారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు కంపల్సరీ

కార్ల విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పని సరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్‌ సప్లయి చైన్‌ అవరోధాలు, మైక్రో ఎకనామిక్స్‌ (స్థూల ఆర్థిక) పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ప్యాసింజర్ కార్లలో (ఎం-1 వేరియంట్‌) కార్ల ధర, వేరియంట్‌లతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది అక్టోబర్‌1, 2023 వరకు ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉండాల్సిందేనని నితిన్‌ గడ్కరీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా దూరం!

టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనుక నిజమైతే టీమిండియాకు నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అసలే బౌలింగ్‌ అంతంతమాత్రంగా ఉన్న దశలో ఇలా బుమ్రా గాయంతో దూరమవడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4.ఉక్రెయిన్‌ యుద్దంలో అనూహ్య పరిణామం

ఉక్రెయిన్​ ఆక్రమిత ప్రాంతాల విలీనం పేరిట రష్యా వేసిన పథకం మొత్తానికి ఫలించింది. ఎనిమిదేళ్ల కిందట క్రిమియా ఆక్రమణ తరహాలోనే.. ఇప్పుడు ఉక్రెయిన్‌కు చెందిన మరో నాలుగు కీలక ప్రాంతాలను తనలో విలీనం చేసుకోబోతోంది. శుక్రవారం క్రెమ్లిన్‌ భవనంలో జరగబోయే కార్యక్రమంలో ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా తనలో కలిపేసుకోనుంది రష్యా.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. కేంద్రం​ ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మాణం

పోలవరం ముంపు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన భేటీ ముగిసింది. ఈ భేటీకి ఏపీ, టీఎస్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల అధికారులతో జలశక్తిశాఖ సమావేశమైంది. ఈ భేటీకి ఏపీ నుంచి ఇరిగేషన్‌ శాఖ అధికారులు హాజరయ్యారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. ప్రభాస్‌ రాకతో దద్దరిల్లిన మొగల్తూరు.. ప్రతి ఒక్కరికీ భోజనం

ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం గురువారం కృష్ణంరాజు స్వస్థలమైన  మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగల్తూరు వెళ్లారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. సీఎం పదవి నుంచి గెహ్లాట్‌కు ఉద్వాసన.. కారణాలివే!

తిరుగుబాటులో గెహ్లాట్‌ ప్రమేయం లేదని రాజస్థాన్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్‌ మాకెన్‌ ఇచ్చిన నివేదికలోనూ ‘క్లీన్‌చిట్‌’ దక్కినా.. అనుచరులను కట్టడి చేయలేకపోయారనే కోణంలో అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. అందుకే అధ్యక్ష రేసులో పోటీ నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ముందు రాజస్థాన్‌ సీఎంగా కొనసాగింపు కష్టమేనని సోనియాగాంధీ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

తెలంగాణలో మెడిసిస్‌ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వెయ్యికిపైగా ఎంబీబీఎస్‌ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్‌ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్‌ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు.
 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. కృష్ణంరాజు స్మృతి వనం కోసం..

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10, దిగ్విజయ్‌తో థరూర్‌ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎన్నో మలుపులు, మీటింగ్‌లతో ఉత్కంఠ రేపుతున్నాయి. ముందు నుంచి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ రేసులో ముందు వరుసలో ఉంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్‌ నేతలు శశి థరూర్‌, దిగ్విజయ్‌ సింగ్‌లు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement