Trending Topics
-
ఒక్క వీడియోతో నేషనల్ ట్రెండింగ్
-
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. అనంతను ముంచెత్తిన వాన ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆ ప్యాకేజీకి ఓకే అంటే మునుగోడు నుంచి తప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బీజేపీకి బంపరాఫర్ ప్రకటించారు. మునుగోడు బరి నుంచి తప్పుకునేందుకు ప్యాకేజీ సిద్ధమా? అంటూ ప్రశ్నించారాయన. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ. 18,000 కోట్లు కాంట్రాక్టు ఇచ్చారు కదా అంటూ తీవ్ర విమర్శలే గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. డెమొక్రటిక్ పార్టీకి తుల్సీ గబ్బార్డ్ గుడ్‌బై 20 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు తుల్సీ గబ్బార్డ్. అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు అయిన గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. యూరప్‌లోనూ యూపీఐ చెల్లింపులు యూరప్‌కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్‌కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్‌లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు! భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్‌ను కలుస్తా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ దురాక్రమణ అంశంపై అసలు చర్చించే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయితే ఆ వ్యవహారంపై మాత్రం పుతిన్‌తో అవకాశం ఉంటే చర్చిస్తానని తెలిపారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాలీవుడ్ ఎంట్రీ.. పాన్ ఇండియా లెవల్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన కృతీ శెట్టి మాలీవుడ్‌కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళంలో ‘అజయంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. టీ20 వరల్డ్‌కప్.. టీమిండియాకు బలం టి20 ప్రపంచకప్ 2022 ప్రారంభానికి ముందు టీమిండియా గుడ్‌న్యూస్. టీమిండియా ఫ్రంట్‌లైన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో షమీకి ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. టి20 ప్రపంచకప్‌కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మానవహక్కుల దూత అశ్విని, తొలి దళిత యువతిగా.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ఈవినింగ్ టాప్ 10 న్యూస్
1. ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణం: సీఎం జగన్ ఎస్డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సమీక్ష జరిపారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు కంపల్సరీ కార్ల విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పని సరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్ సప్లయి చైన్ అవరోధాలు, మైక్రో ఎకనామిక్స్ (స్థూల ఆర్థిక) పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ప్యాసింజర్ కార్లలో (ఎం-1 వేరియంట్) కార్ల ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది అక్టోబర్1, 2023 వరకు ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని నితిన్ గడ్కరీ ట్వీట్లో పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా దూరం! టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనుక నిజమైతే టీమిండియాకు నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అసలే బౌలింగ్ అంతంతమాత్రంగా ఉన్న దశలో ఇలా బుమ్రా గాయంతో దూరమవడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4.ఉక్రెయిన్ యుద్దంలో అనూహ్య పరిణామం ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల విలీనం పేరిట రష్యా వేసిన పథకం మొత్తానికి ఫలించింది. ఎనిమిదేళ్ల కిందట క్రిమియా ఆక్రమణ తరహాలోనే.. ఇప్పుడు ఉక్రెయిన్‌కు చెందిన మరో నాలుగు కీలక ప్రాంతాలను తనలో విలీనం చేసుకోబోతోంది. శుక్రవారం క్రెమ్లిన్ భవనంలో జరగబోయే కార్యక్రమంలో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా తనలో కలిపేసుకోనుంది రష్యా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మాణం పోలవరం ముంపు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీ ముగిసింది. ఈ భేటీకి ఏపీ, టీఎస్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అధికారులతో జలశక్తిశాఖ సమావేశమైంది. ఈ భేటీకి ఏపీ నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ప్రభాస్ రాకతో దద్దరిల్లిన మొగల్తూరు.. ప్రతి ఒక్కరికీ భోజనం ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం గురువారం కృష్ణంరాజు స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగల్తూరు వెళ్లారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. సీఎం పదవి నుంచి గెహ్లాట్‌కు ఉద్వాసన.. కారణాలివే! తిరుగుబాటులో గెహ్లాట్ ప్రమేయం లేదని రాజస్థాన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ ఇచ్చిన నివేదికలోనూ ‘క్లీన్చిట్’ దక్కినా.. అనుచరులను కట్టడి చేయలేకపోయారనే కోణంలో అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. అందుకే అధ్యక్ష రేసులో పోటీ నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ముందు రాజస్థాన్ సీఎంగా కొనసాగింపు కష్టమేనని సోనియాగాంధీ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తెలంగాణలో మెడిసిస్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వెయ్యికిపైగా ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. కృష్ణంరాజు స్మృతి వనం కోసం.. రెబల్‌స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10, దిగ్విజయ్‌తో థరూర్ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎన్నో మలుపులు, మీటింగ్‌లతో ఉత్కంఠ రేపుతున్నాయి. ముందు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ముందు వరుసలో ఉంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, దిగ్విజయ్ సింగ్‌లు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ఈవినింగ్ టాప్ 10 న్యూస్
1. గడప గడపకు.. నిర్లక్ష్యం వద్దు: సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ప్రతీ గడపకు సమయం కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం ఆయన నేతృత్వాన జరిగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించి.. దిశానిర్దేశం చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2.కాంగ్రెస్‌కు విజన్ లేదు.. గెలిచేంత సీన్ లేదు దేశంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు గాంధీ కుటుంబంపై వ్యతిరేకత.. మరోవైపు అధ్యక్ష ఎన్నికల వేడి.. పార్టీని కుదేలు చేస్తోంది. ఇప్పటికే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. కాంగ్రెస్‌ను వీడిన అనంతరం వాళ్లు.. అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. పాస్‌పోర్ట్ అప్లికేషన్.. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇక ఈజీ పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) పొందడం సులభతరం కానుంది.నేటి నుంచి (సెప్టెంబరు 28 నుండి) పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో (POPSK) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. స్టార్ ప్లేయర్లకు దక్కనిది.. మనోడికి దక్కిన అరుదైన గౌరవం ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ పరిచయం అక్కర్లేని పేర్లు. సాకర్‌లో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఆటలోనూ.. పాపులారిటీ విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి(Sunil Chhetri)పై ఫిఫా(FIFA) డాక్యుమెంటరీ రూపొందించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా మన దేశం మాత్రం గర్వపడేలా చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. విశాఖ రైల్వే జోన్‌కి కట్టుబడి ఉన్నాం: కేంద్ర రైల్వే శాఖ మంత్రి రైల్వే జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరోమారు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు ఇస్తున్న దరిమిలా.. బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. భూసేకరణ పూర్తై.. భూమి కూడా అందుబాటులో ఉంది అని ఆయన తెలియజేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. చిరుత టూ ఆర్ఆర్ఆర్..చిరు ఎమోషనల్ మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్‌పై తన ప్రేమను చాటుకున్నారు. అప్పుడే నటుడిగా కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. చిరుతతో మొదలై మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వరకు చరణ్ ప్రస్థానాన్ని మెగాస్టార్ కొనియాడారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడని చిరు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. కమలా హ్యారీస్ టూర్.. నార్త్ కొరియా మిస్సైల్ ప్రయోగం ఉత్తర కొరియా అనుమానాస్పద క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రయోగం యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ దక్షిణ కొరియా పర్యటనకు ముందు రోజే జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జపాన్ కోస్ట్ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పండుగ సీజన్ వేళ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 4 శాతం డేర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచుతూ కేబినెట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ ప్రకటన సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. దీంతో అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.కాంగ్రెస్ అధ్యక్ష రేసులో డిగ్గీ రాజా! కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే రేసులో సీనియర్ నేత శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉండనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కీలక నేత దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఆయన సైతం ఉన్నారని, గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ, బంజారా భవన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం రెండు భవన్‌లూ వేదికలు కావాలని తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 679 ఎంఈఓ-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. రాజధానిగా అమరావతి ఉండాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్.. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్రహోం మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిస్థితిపై ఆరా తీశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా’ స్టార్ కిడ్ అయిన దుల్కర్ సల్మాన్ సైతం ట్రోల్స్ బారిన పడ్డాడట. తనని వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శించారని, వాటికి సంబంధించిన స్క్రిన్‌షాట్స్ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. సీతారామంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రెడీగా ఉండండి.. ‘త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు’ రాష్ట్రానికి హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూరీ పర్యటన పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Steamed Food- Health Benefits: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే! దాదాపు ఒక ఇరవై ఏళ్ల కిందటి వరకు జ్వరమొచ్చి తగ్గిన వాళ్లకి పొట్లకాయ, బీరకాయ, దొండకాయ, కాకరకాయ లాంటి కూరలు పథ్యం పెట్టేవాళ్లు పెద్దవాళ్లు. అదేవిధంగా నీరసంగా ఉన్న వాళ్లకి ఆవిరి కుడుముల లాంటివి పెట్టేవాళ్లు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. కొత్త రూల్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ.. ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చేయవచ్చు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో (అక్టోబర్) ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే నయా రూల్‌ను అమల్లోకి తేనుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి.. హత్య కేసుల్లో నేరస్తులను కనిపెట్టడానికి ఫోరెన్సిక్ బృదం ఇచ్చే రిపోర్టు అత్యత కీలకమైనది. కొన్ని నేరాల్లో మృతదేహాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో దొరకడంతో బాధితుల తోపాటు నిందితులను గుర్తించడం కూడా కష్టమవుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మీడియా ఆకాశానికెత్తింది. ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ఎస్సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని సూచించడంపై ప్రశంసలతో ముంచెత్తింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 2020కి ముందున్న స్టేటస్కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని పేర్కొన్నారు. అంతేకాదు మోదీ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. రాజుగారి ఫ్రస్ట్రేషన్.. వీడియో వైరల్ బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్ బుక్‌లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఏపీ ఉద్యోగులందరికీ గుడ్‌న్యూస్.. ఈఎంఐలో ఈ-స్కూటర్లు అందజేత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సచిన్.. ఇలా చేయడం తగునా? సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో బ్యాట్ హాండిల్‌ను, గ్రిప్‌ను ఎలా శుభ్రపరుచుకోవాలో చూపించాడు. ''ఇలాంటి చిన్న విషయాలు ఎవరు చెప్పరు'' అంటూ వీడియోకు క్యాప్షన్ జత చేశాడు. ఈ ప్రక్రియ అంతా బాగానే ఉన్నప్పటికి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సచిన్‌ను ఒక విషయంలో తప్పుబట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఏపీ గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. తెలంగాణ: నేరాలు మెండుగా.. జైళ్లు నిండుగా రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి ఏటా జైలుకు చేరే ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేర ప్రవృత్తి, ఆర్థిక అసమానతలు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు దారుణమైన నేరాలకు కారణమవుతున్నాయి. తద్వారా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. కృష్ణంరాజు.. ఎప్పుడూ చెరగని చిరునవ్వు అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండే వ్యక్తి కృష్ణంరాజు అని పలువురు వక్తలు హైదరాబాద్‌లో జరిగిన సంతాప సభలో వ్యాఖ్యానించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. ‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్ రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రూబుల్ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. అదే జరిగితే గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమావళిలో అమలవుతున్న లోధా కమిటీ సిఫార్సుల సవరణ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి. బోర్డు ప్రధానంగా 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, పదవుల మధ్య విరామం నిబంధనల్ని సవరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.కానీ కోర్టు మాత్రం మూడేళ్ల చొప్పున రెండు దఫాలు వరుసగా కొనసాగిన ఆఫీస్ బేరర్‌కు విరామం ఉండాల్సిందేనని భావిస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. భర్తలూ.. భరోసా ఇవ్వాలి.. బాధ్యతగా ఉండాలి గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. అలాగే డాక్టర్లతో పాటు సైకాలజిస్టులు ఇచ్చే సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో ఘోర ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం కారణంగా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఈ-బైక్స్ నిర్వహణ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. పరిహారం ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ సీఎం జగన్ పర్యటన కంటే ముందే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల సస్పెండ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తనపై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పని తరుణంలోనే స్పీకర్ పోచారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని స్పీకర్ స్పష్టం చేస్తూ.. బయటకు పొమ్మని ఈటలకు సూచించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సౌతాఫ్రికా హెచ్‌కోచ్ పదవికి బౌచర్ గుడ్‌బై ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సైతం ధృవీకరించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. బిగ్‌బాస్-6 రెండోవారం నామినేషన్స్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బిగ్‌బాస్ సీజన్-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో హౌస్‌మేట్‌కు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని బిగ్‌బాస్ తెలిపాడు. మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు? చివర్లో బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఆటోలో కేజ్రీవాల్.. అడ్డుకున్న పోలీసులు గుజరాత్ పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటోడ్రైవర్ కోరిక మేరకు అతని ఇంట్లో భోజనం చేశారు. అయితే అతని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ హైడ్రామా నడిచింది. చివరకు కేజ్రీవాల్ తగ్గకపోవడంతో.. పోలీసులే వెనక్కి తగ్గారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. గోదావరి మళ్లీ ఉగ్రరూపం గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మన రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృతంగా శనివారం, ఆదివారం వర్షాలు కురువడంతో ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. త్రివిక్రమ్ కోసం సరికొత్తగా సూపర్‌స్టార్ సెట్స్‌లో మహేశ్‌బాబు యాక్షన్ ఆరంభమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. రెండేళ్ల తర్వాత చైనా బయటకు జిన్‌పింగ్.. ఒకే వేదికపై ముగ్గురూ! చైనా అధినేత జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. చైనా కంపెనీల మాస్టర్ మైండ్‌కు భారీ షాక్ : వివరాలివిగో! చైనా లింకులతో భారత్‌లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్‌మైండ్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అరెస్టు చేసింది. దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్-10 న్యూస్ రౌండప్
1. కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు, కారణం ఏంటంటే.. రెబల్‌స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు జరిగాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కాకుండా మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌజ్‌లో జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంతేకాదు.. ప్రభాస్ కాకుండా అతని సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. వైఎస్ఆర్ కల్యాణమస్తూ.. బాలికల విద్యకూ ప్రోత్సాహాం పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్) జారీ చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. జ్ఞానవాపి తీర్పు.. వారణాసిలో 144 సెక్షన్ ఉత్తర ప్రదేశ్‌లోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ(సెప్టెంబర్ 12) కీలక తీర్పును వెలువరించనుంది. మసీదుకాంప్లెక్స్లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. నానమ్మ మరణంతో యువరాజుల ఐక్యత! రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. మరోవైపు.. విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. యూఎస్ ఓపెన్‌లో 19 ఏళ్ల కుర్రాడి సంచలనం యూఎస్ ఓపెన్‌లో స్పానిష్ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం ఆర్ధ రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నార్వేజియన్ కాస్పర్ రూడ్‌ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. పాక్‌లో వరద బాధితులను... అక్కున చేర్చుకున్న ఆలయం కనీవిని ఎరగని వరదలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్లో ఓ చిన్న గ్రామంలోని హిందూ దేవాలయం అందిస్తున్న సేవలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జలాల్ ఖాన్ అనే మారుమూల కుగ్రామంలో ఉన్న బాబా మధోదాస్ మందిర్ వరదలో సర్వం కోల్పోయిన కనీసం 300 మంది ముస్లింలకు ఆశ్రయంతో పాటు భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.చెన్నై-బెంగళూరు రూట్లో ఆకాశ ఎయిర్ సర్వీసులు విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్‌వర్క్‌లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు ‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్ నుంచి మద్రాస్ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్‌కి తిరిగొచ్చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. ఆ హిమానీనదం.. కరిగితే ప్రళయమే! థ్వాయిట్స్ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్‌డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఉగ్రగోదావరి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఎగువన కురుస్తున్న వర్షాలతో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర 9 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితిని సమీకక్షించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్ డిస్ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలుగు సినిమాలకు అవార్డుల పంట కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు షాక్.. లిజ్ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు! బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్ భగవంత్ రావు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’ వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి! తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికపై పరోక్షంగా సంకేతాలు అందించారు ఆయన. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్‌లో క్రికెట్ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌లోని లీస్టర్‌షైర్ క్రికెట్ గ్రౌండ్‌కు 'గవాస్కర్ గ్రౌండ్'గా నామకరణం చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఇంగ్లండ్ లేదా యూరప్ గడ్డపై ఉన్న క్రికెట్ గ్రౌండ్‌కు ఒక ఇండియన్ క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు.. హీరో సుహాస్ ఏమన్నాడంటే.. కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. మూడు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్ ఫోటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు లభించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మోస్ట్ పవర్ఫుల్ హోండా 2023 సివిక్ టైప్-ఆర్ ఆవిష్కారం హోండా కొత్త సివిక్ వాహనాన్ని లాస్ ఏంజిల్స్‌లో గ్లోబల్‌గా ఆవిష్కరించింది. ‘హెండా సివిక్ టైప్-ఆర్ 2023’ను పరిచయం చేసింది. త్వరలోనే వీటి ధరలు, ఫీచర్లు వెలుగులోకి రానున్నాయి. 30 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన ఆర్ బ్రాండెడ్ మోడల్ అని హోండా వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1. పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం, జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. కాళేశ్వరానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విష ప్రచారం.. బురద జల్లడమే ‘ఈనాడు’ పని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో పాలన కొనసాగుతోందన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జో బైడెన్‌కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసి అమెరికన్లు షాక్ అయ్యారు. ఆయన చెప్పింది నిజమా, లేక ఎప్పటిలాగే పొరపాటుగా నోరుజారారా? అని తెగ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి మెజారిటీ రాదన్నారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అరంగేట్రంలోనే అదుర్స్! 5 వికెట్లు.. ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! కానీ.. టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్‌షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం! శానిటైజేషన్ వర్క్‌ర్ల(పారిశుధ్య కార్మికులు)కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆయా కంపెనీలు పోటీ పడి మరి భారీ ఎత్తున జీతాల్ని చెల్లిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లకు చెల్లించే జీతం కంటే ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Netflix: ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి వీడియో నయనతార, విఘ్నేశ్ శివన్‌లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షాకిచ్చిందని, వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందంటూ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నయన్ దంపతులకు నోటీసులు కూడా ఇచ్చిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది నెట్‌ఫ్లిక్స్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆఫ్రికా నుంచి వచ్చిన భర్త.. ప్రియుడి మోజులో భార్య.. దూరంగా ఉండలేమని.. విశాఖలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం ఓ మహిళ.. భర్తనే చంపేసింది. 18 ఏళ్ల వయసున్న ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి హత్య చేసింది. విశాఖలోని మధురవాడలో బుడుమూరు మురళి కుటుంబం నివాసం ఉంటుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning 10 AM Top News: మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో ఓ సభలో మాట్లాడుతుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాయి. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSR Jayanthi 2022: వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. సేవకుల తయారీ విధానమది బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్‌లో చేరికలు.. అలకలు ‘ఒక్క చేరిక.. రెండు అసంతృప్తులు’ అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందనే చర్చ కార్యకర్తల్లో సాగుతోంది. కొత్త చేరికలు పాతవారి అలకలకు కారణమవుతున్నాయి. చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలో కొంతమంది పాతనేతల అసంతృప్తి క్యాడర్‌ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. The Warrior-Ram Pothineni: ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్ ‘‘నేను ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా 13 విజయాలు అందుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన మొదటి టీ20లో విజయంతో ఈ ఘనతను రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విమాన ప్రయాణికులకు బంపరాఫర్! విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్ ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్‌గా మారాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఎమ్మెల్యేలు మొత్తం నిరంతరం ప్రజల్లోనే ఉండాలి గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలని సీఎం జగన్ అన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ భారత స్టార్ క్రికెటర్ కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. అమ్నేషియా పబ్ కేసు: బెంజ్, ఇన్నోవా కార్లు ఎవరివి..? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. సీవీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు అని పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: సుప్రీంకోర్టు ఆగ్రహం దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. నిప్పుల కొలిమిలో వేసినా కాలిపోదు ఇది! మార్గరెట్ అట్వుడ్ రాసిన 'ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్' అనే క్లాసిక్ నవలని.. ప్రత్యేకమైన ఫైర్‌ఫ్రూఫ్ మెటీరియల్‌ని ఉపయోగించి ప్రింట్ చేశారు. ఈ బుక్కు చాలా ప్రత్యేకతలు.. ప్రింట్ చేయడం వెనుక ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలియాలంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. బెంగాల్లో హీటెక్కిన పాలిటిక్స్.. జేపీ నడ్డా టూర్‌పై టెన్షన్ బెంగాల్లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ అన్నట్టు వాడివేడి పాలిటిక్స్ చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక వివాదంలో ఈ రెండు పార్టీల నేతలు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా బెంగాల్లో మరోసారి రాజకీయం వేడిక్కింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. కలెక్షన్ల లాభం కన్నా విలువైందే దొరికింది బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సందర్భంగా హీరోకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. అసభ్య ప్రవర్తన?..కాలర్ పట్టి ట్రాఫిక్ ఎస్సైను చితకబాదేశారు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను చితకబాదిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దేశ రాజధానిలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. టెక్నాలజీని దుర్వినియోగం కానివ్వొద్దు: నిర్మలా సీతారామన్ టెక్నాలజీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు డిజిటైజేషన్‌ను అర్థం చేసుకోవడంలో మరింత ముందు ఉండాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ దశాబ్దంలో డిజిటల్ విధానాల వినియోగం గణనీయంగా పెరగనుందని, డిజిటైజేషన్‌పరంగా తగు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవగాహన లేకుండా మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌తో కలిసి బీజేపీ.. ఏపీకి అన్యాయం చేసింది. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & మార్నింగ్ టాప్ 10 న్యూస్
యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ భారీ షాక్! ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ గో'ను షట్ డౌన్ చేస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో అధికారికంగా ప్రకటించింది. గూగుల్ నిర్ణయం యూట్యూబ్ గో షట్‌డౌన్‌తో యూజర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. నటి ఆత్మహత్య చిన్నవయసులోనే ఇంటర్నెట్లో దక్కిన గుర్తింపు, కాస్త పెరిగాక దక్కిన పేరుప్రఖ్యాతులు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న టైంలో ఊహించని విషాదం. కేవలం 16 ఏళ్ల వయసుకే నటి ఆత్మహత్య చేసుకుంది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ఒకప్పుడు నెట్ బౌలర్‌గా.. ఇప్పుడు ఏకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో..! సన్‌రైజర్స్ హైదరాబాద్ మీడియం పేసర్ సౌరభ్ దూబే గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఒకప్పటి నెట్ బౌలర్, అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్న పేసర్‌ను సన్‌రైజర్స్ భర్తీ చేసింది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి రష్యా జనరల్స్ హతం వెనుక వారి హ్యాండ్.. పుతిన్ ఊరుకుంటాడా..? ఉక్రెయిన్‌లో రెండు నెలలకుపైగా జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌తో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లింది. రష్యన్ జనరల్స్ దాదాపు 12 మంది చనిపోయారు. వీరిని హతం చేసుందుకు ఉక్రెయిన్‌కు ఆ దేశం సాయం అందించింది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి తిరుమల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్ ఎవరంటే..? ఎట్టకేలకు తిరుమలలో కిడ్నాప్ అయినా బాలుడు గోవర్ధన్ ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 1వ తేదీన శ్రీవారి ఆలయం ముందు బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కిడ్నాపర్ ఎవరంటే.. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్ నగరంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు ఒక్కరోజులోనే కేసును ఛేదించారు. పోలీసులు గురువారం అధికారికంగా నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి హ్యాపీ బర్త్ డే రాయ్‌లక్ష్మీ.. ‘జనతా బార్’లో ఫస్ట్‌లుక్ విడుదల రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘జనతా బార్’. ఈరోజు లక్ష్మీ బర్త్‌డే సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ఇద్దరు మిత్రుల కలయిక ఇది: ప్రధాని మోదీ.. ముగిసిన యూరప్ పర్యటన యూరప్ దేశాల పర్యటన ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు తిరుగుప్రయాణం అయ్యారు. కాగా, పర్యటనలో చివరగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి భేటీ గురించి మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి సీఎం జగన్ తిరుపతి పర్యటన.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు బంగారు పతకం బ్రెజిల్ వేదికగా జరుగుతోన్న డెఫ్లింపిక్స్లో తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ సత్తా చాటాడు. ఏకంగా బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & మార్నింగ్ టాప్ 10 న్యూస్
ట్విటర్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన మస్క్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విటర్ విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ట్విటర్ యూజర్లకు స్వేచ్ఛ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండబోవంటూనే బాంబు పేల్చాడు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 28ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. సీఎం యోగి భావోద్వేగం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. తన వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పటివరకైతే చూసింది లేదు. అలాంటి వ్యక్తి.. సుమారు 28 ఏళ్ల తర్వాత సొంతూర్లో అడుగుపెట్టి తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణలో ఈదురు గాలులతో వర్ష బీభత్సం తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలుల వర్షం బీభత్సం సృష్టించింది. కాగా, అల్పపీడన ద్రోణి కారణంగా మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి కోవోవాక్స్ వ్యాక్సిన్ టీకా ధర భారీగా తగ్గింపు కోవోవాక్స్ వ్యాక్సిన్ టీకా ఒక్కోడోసు ధరను సీరమ్ సంస్థ భారీగా తగ్గించింది. 12–17ఏళ్ల పిల్లలకు ప్రైవేట్ సెంటర్లలో ఇచ్చేందుకు సోమవారం కోవిన్ పోర్టల్‌లో ఈ టీకాను చేర్చిన సంగతి తెలిసిందే. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి బాలికతో పరీక్ష రాయించిన ‘దిశ’ యాప్ పదో తరగతి పరీక్షలు రాయనీయకుండా నిర్బంధించిన తండ్రిపై ఓ బాలిక దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బాలికను పరీక్ష కేంద్రంలో హాజరుపర్చారు. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి జీవితానికి సరిపడేంత ఎంజాయ్ చేశాను.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు అమ్మాయిలను చూడాలంటే నాకు భయం.. ఎప్పుడైనా ఓరకంటితో చూసేవాణ్ణి. కానీ ఇవాళ నేనలా కాదు. అందమైన అమ్మాయిలను జీవితానికి సరిపడేంత దగ్గరగా చూశాను.. ఇది సక్సెస్ కాకపోతే ఇంకేంటి.. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ వేదిక మార్పు మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ వేదిక మారింది. మూడు జట్లతో కూడిన ఈ టోర్నీ లక్నోలో కాకుండా పుణేలో ఈనెల 23 నుంచి 28 వరకు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. కరోనా కారణంగా గత ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ఐపీఎల్లో రికార్డు.. భారత బౌలర్‌కు చుక్కలు చూపించిన లివింగ్‌స్టోన్ ఐపీఎల్లో ఓ అరుదైన రికార్డును పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఈ సీజన్లోనే భారీ సిక్సర్ బాదాడు. భారత సీనియర్ బౌలర్‌కు చుక్కలు చూపించాడు. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నీటిపారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 6న జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరడంపై నిపుణులు నివ్వెరపోతున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్ ఆజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తమైంది. రాజ్ థాక్రే విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
2021లోఎక్కువ మంది ఆసక్తిని చూపిన అంశాలివే..
ప్రతి భారతీయుడు తమకు నచ్చిన భాషలో తమను తాము ఆన్లైన్లో స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలు కల్పించే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ యాప్ ప్రప్రధమంగా ’వాయిసెస్ ఆఫ్ ఇండియా’ నివేదికను విడుదల చేసింది. దీని ద్వారా తమ ప్లాట్ఫార్మ్పై అత్యధికంగా దేశవాసుల చర్చల్లో చోటు చేసుకున్న అంశాలను వెల్లడించింది. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అందించిన ప్రజల వంచనపై కవితా పదాలు అత్యధికులు ఇష్టపడ్డారు. కోవిడ్19 సెకండ్‌వేవ్ సమయంలో ప్రజలు ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా దాతల్ని కనుగొనడానికి ఆరాటం చూపారు. టోక్యో2020 సమ్మర్ ఒలింపిక్స్, టీ20 ప్రపంచ కప్ 2021, పారాలింపిక్స్, భారతదేశంతో పాకిస్థాన్ పోటీపడిన ప్రపంచకప్ పోటీలు అత్యంత చర్చనీయాంశమైనవిగా గణనీయమైన ఎట్రాక్షన్‌ను అందుకున్నాయి. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, విరాట్ కోహ్లిలు అన్ని భాషలలో ఎక్కువగా ప్రస్తావించబడిన ప్రముఖులుగా అగ్రభాగంలో నిలిచారు. పొట్టి ఫార్మాట్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్ కోహ్లీ నిర్ణయానికి అభిమానుల నుంచి గట్టి మద్దతు లభించింది. ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను విజయానికి అభిమానులు అధిక సంఖ్యలో మద్దతు ఇవ్వడంతో ఆమె ట్రెండ్ అయ్యింది. లెజెండరీ బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ మృతి పట్ల పెద్ద సంఖ్యలో ప్రజలు సంతాపం తెలిపారు. కోవిడ్19 సెకండ్ వేవ్ సమయంలో మ్యూకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ గురించిన ఆందోళన, సూచనలు ట్రెండీగా మారాయి. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా బాగా ట్రెండ్ అయింది. దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ విషాద మరణంపై పెద్ద యెత్తున వెల్లువెత్తిన సానుభూతి పునీత్‌పై ప్రేమకు అద్దం పట్టింది. -
విషాదం! అత్తమామల ఇంట్లో అల్లుడు అనుమానాస్పద మృతి!
గోపాల్‌గంజ్: మరదలిని ప్రేమించి, వివాహం చేసుకున్నందుకు ఓ వ్యక్తి మూల్యంగా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని జాదోపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లా తరేయా సుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహిరోలి డాన్లో నివాసం ఉంటున్న నారాయణ్ సాహ్ కుమారుడు అచ్చెలాల్ సాహ్‌గా పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అచ్చెలాల్ సాహ్‌కు జాదోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవధ్ నగర్‌కు చెందిన మంజు దేవితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయ్యాక భార్యతో కలిసి అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఐతే అదే ఇంట్లో ఉంటున్న మరదలు బేబీ దేవితో అచ్చే లాల్ సాహ్ ప్రేమలో పడ్డారు. ప్రేమ ఎంతగా పెరిగిందంటే వారిద్దరూ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు కూడా. కాగా గత బుధవారం రాత్రి ఇద్దరు భార్యల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఆ తర్వాత అదే రోజు రాత్రి అచ్చే లాల్ ఓ గదిలోకెళ్లి మెడకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు తన అత్తమామల ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని, మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారని మీడియాకు తెలిపారు. చదవండి: Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు! -
ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో..
ఓవర్ నైట్‌లో కోటీశ్వరులైపోవాలని కలలు కనని వారుండరేమో ఈ జిందగీలో! కానీ చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. హఠాత్తుగా అదృష్టం వరించి రాత్రికిరాత్రే జాతకం మారిపోతుంది. అలాంటి వింతొకటి ఓ వ్యక్తి కి తారసపడింది. ఉదయం లాటరీ టికెట్ కొన్నాడు సాయంత్రానికి కోటీశ్వరుడైపోయాడు. అదెలాగో మీరే తెలుసుకోండి.. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బార్ధమాన్కు చెందిన షేక్ హీరా అనే అంబులెన్స్ డ్రైవర్ ఒక రోజు ఉదయం రూ. 270లతో కోటి రూపాయల జాక్‌పాట్ లాటరీ టికెట్ కొన్నాడు. అంతే! సాయంత్రానికి అతన్ని అదృష్ట దేవత వరించింది. దీంతో అయోమయానికి గురైన సదరు వ్యక్తి సమీపంలోని శక్తి ఘడ్ పోలీస్ స్టేషన్‌ను సలహాకోసం ఆశ్రయించాడు. లాటరీ టికెట్ పోతుందేమోననే భయం కూడా అతనిలో లేకపోలేదు. పోలీస్ అధికారులు అతన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లి, బయట కొంత మంది పోలీసులను రక్షణగా ఉంచారు కూడా. నిజానికి అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించుకోవడానికి అతనికి డబ్బు అవసరం చాలా ఉంది. లాటరీని గెలుచుకున్న తర్వాత తన తల్లి త్వరగా కోలుకుంటుందనే ధీమా వ్యక్తం చేశాడు. ‘లాటరీ టికెట్ల ద్వారా ఏదో ఒక రోజు జాక్‌పాట్ కొట్టాలని కలలు కన్నాను. ఇన్నాళ్లకు నా కాల నెరవేరింద’ని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావని మీడియా అడిగిన ప్రశ్నకు.. తన తల్లికి మంచి వైద్యం చేయించి, ఉండటానికి చక్కని ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. ప్రస్తుతం అంతకు మించి వేరే ఆలోచన ఏమీ లేదని చెప్పాడు. హీరాకు టిక్కెట్ అమ్మిన దుకాణదారుడు షేక్ హనీఫ్ మాట్లాడుతూ.. ‘ఎన్నో యేళ్లగా లాటరీ టిక్కెట్ వ్యాపారం చేస్తున్నాను. చాలా మంది నా షాప్ నుండి టిక్కెట్లు కొంటారు. కొంతమందికి రివార్డ్‌లు అప్పుడప్పుడు దక్కుతాయి. కానీ ఇంత పెద్దమొత్తంలో ఎవరికీ మునుపెన్నడూ తగల్లేదు. నా షాప్‌లో కొన్న టికెట్ జాక్‌పాట్ కొట్టడం చాలా సంతోషంగా ఉంద’ని తెలిపాడు. చదవండి: గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు.. -
ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!
ఇండోర్: 'క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ ఈ లైన్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పై ఇమేజ్‌లో న్యూస్ పేపర్ కంటింగ్ దానికి సంబంధించిందే. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అనేక మంది ఈ వార్తా పత్రిక చర్యను ప్రశంసిస్తున్నారు కూడా! ఎందుకో మీరే తెలుసుకోండి.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన జంటకు సంబంధించిన పవిత్రమైన స్మరణ కోసం గ్లామర్‌ను విస్మరించవచ్చు. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్‌తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ వార్తాపత్రిక కటింగ్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ట్విట్టర్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది పెళ్లి సంబరాలను జరుపుకునే తరుణం కాదని, భారతమాత ముద్దుబిడ్డకి తలవంచి నమస్కరించాలని కొందరు, ఈ సమయంలో మన దేశానికి అండగా నిలవాలని మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి ఒక రోజు ముందు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది జవాన్లు మృతి చెందారు. చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్!
Dangerous Stunt Of Guinness Records: రికార్డులను బద్దలు కొట్టాలని ఈ జిందగీలో ఎవరికి ఉండదు! ఐతే.. ఇతను చేసిన విన్యాసం ముందు అవన్నీ దిగదుడుపేనని అంటున్నారు నెటిజన్లు.. పాపం! అంతటి ప్రమాదకరమైన స్టంట్ చేసినా ‘మేము గిన్నిస్ రికార్డులో నీ పేరు నమోదు చేయం’ తేల్చిచెప్పారా అధికారులు! ఏం చేశాడో మీరే చూడండి.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జాకీ బిబ్బీ ఏకంగా 11 అత్యంత విషపూరితమైన పాములను నోట్లో కుక్కుకుని ప్రపంచంలోనే సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010లో కూడా ఇటువంటి ఫీటే చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఐతే ఇప్పుడు తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసి మరొకమారు రికార్డును తిరగరాయాలని అనుకున్నాడు. కానీ అందుకు గిన్నిస్ బుక్ అధికారులు ససేమిరా అన్నారు. దీనిని సంబంధించిన ఫొటోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక ఫేస్బుక్లో చూడొచ్చు. ఒక నివేదిక ప్రకారం.. జాకీ ఈ పాములన్నీంటినీ నోట్లో కుక్కుకోవడానికి చేతులను ఉపయోగించలేదట. నోటితోనే వాటిని నేరుగా పట్టుకున్నాడట. అర్థమైందా.. ఇదెంతటి ప్రమాదకరమైన స్టంటో! వాటిల్లో ఏ ఒక్కపాము కరచినా అతని ప్రాణాలు పోగొట్టుకునేవాడు. తెలిసి.. తెలిసి ఈ విన్యాసం చేశాడితడు. ఐతే గిన్నిస్ అధికారులు అందుకు భిన్నంగా ఆలోచించారు. ‘ఇకపై ఈ రికార్డును అస్సలు పర్యవేక్షించడం లేదు. ఎందుకంటే.. చాలా మంది ప్రజలు అలాంటి రికార్డు కోసం తమ జీవితాలతో ఆటలాడుకునే ప్రమాదం ఉంది. మరొకరు ఈ స్టంట్ చేయాలని కోరుకోవడంలేదని’ తేల్చిచెప్పారు. నిజమే కదా! సరదా ప్రాణాలను తీసేంతగా ఉండకూడదు.. చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..! -
ట్రెండింగ్‌కు ఇక ఫేస్బుక్ గుడ్‌బై!
న్యూయార్క్: ఫేస్బుక్ తన ‘ట్రెండింగ్ న్యూస్’ ఫీచర్‌కు స్వస్తి పలకనుంది. ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న, చర్చిస్తున్న వార్తాంశాలను తన వినియోగదారులకు అందించే ఉద్దేశంతో 2014లో ఫేస్బుక్ ట్రెండింగ్ న్యూస్‌ను ప్రవేశపెట్టింది. ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు అప్పట్లో ఫేస్బుక్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను వినియోగదారులు ఆదరించలేదనీ, ఇది కాలం చెల్లిన ఆప్షన్ అని ఫేస్బుక్ తాజాగా పేర్కొంది. వాస్తవానికి ట్రెండింగ్ న్యూస్ ఫీచర్ ఫేస్‌బుక్‌కు అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. నకిలీ వార్తలు, రాజకీయాల పరంగా సమతుల్యం లేకపోవడం, వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని కృత్రిమ మేధస్సు అందించలేక పోవడం తదితర సమస్యలను ఫేస్బుక్ ఎదుర్కొంది. ఎట్టకేలకు ఈ ఫీచర్‌ను తొలగించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో బ్రేకింగ్ న్యూస్ పేరుతో కొత్త ఫీచర్ మొదలు పెట్టాలని... ఇందులో ప్రాంతీయ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఫేస్బుక్ భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ సెక్షన్‌ను అమెరికాలో పరీక్షిస్తోందని, దాదాపు 44 శాతం వయోజనాలు ఫేస్బుక్ నుంచి న్యూస్ పొందుతున్నారని కొన్ని సర్వే సంస్థలు తెలిపాయి. -
దిగొచ్చిన ఆక్స్ఫర్డ్..
లండన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెలగబెట్టిన నిర్వాకం వివాదంగా మారింది. సోషల్ మీడియాలో దుమారం రేగడంతో ఆక్స్ఫర్డ్ దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సోఫీస్మిత్.. ట్విటర్లో పోస్ట్ చేసిన మహిళ ఫొటో వివాదానికి కారణమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి8) రోజున యూనివర్సిటీ మెట్లపై రాసివున్న ‘హ్యాపి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ నినాదాన్ని ఓ మహిళతో శుభ్రం చేయించడం, అక్కడేవున్న నలుగురు పురుషులు ఏమీ పట్టనట్టు మాట్లాడుకుంటున్నట్టు ఫొటోలో ఉంది. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూనివర్సిటీ చర్యను తప్పుబడుతూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆక్స్ఫర్డ్ క్షమాపణ చెప్పింది. ‘మీరు క్షమాపణలు చెప్పినందుకు అభినందనలు. కానీ మీరు ఆ మహిళకు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపి, గౌరవించండి’ అంటూ ప్రొఫెసర్ సోఫీస్మిత్ ట్విటర్లో స్పందించారు. Oxford security makes a woman cleaner scrub out “Happy International Women’s Day” on the Clarendon steps. What an image for #IWD, @UniofOxford. #strikeforUSS #UCUstrike pic.twitter.com/E9u5S37hWW — Sophie Smith (@DrSophieSmith) March 8, 2018 I appreciate your apology, but far more importantly can you please make sure that the woman asked to remove the message receives a heartfelt apology, a warm cup of tea, the rest of the day off and, along with all our precarious staff, good enough pay to live in this city. — Sophie Smith (@DrSophieSmith) March 8, 2018 -
ట్విన్ టవర్స్ కూల్చివేత ఉగ్రదాడి కాదట!
సామాజిక మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరోసారి తప్పులో కాలేసింది. తన ట్రెండింగ్ టాపిక్స్ లో బూటక కథనాన్ని ప్రకటించడం సంచనలం రేపింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ విధ్వంసం ఉగ్రదాడి కాదంటూ డైలీ స్టార్ లింక్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేసింది. దీనిపై స్పందించిన టెక్ మీడియా అది తప్పుడు కథనమని తెలిపింది. తక్షణ పరిష్కారంగా ఈ కథనాన్ని తొలగించినట్టుగా ఫేస్ బుక్ ప్రతినిధి శుక్రవారం ప్రకటించారని టెక్ వెబ్ సైట్ సీఎన్ఈటీ ప్రకటించింది. 9/11 ఉగ్రదాడికి 15 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా సాధారణంగా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ పై ప్రజలకు ఆసక్తి ఉంటుందని మీడియా నివేదించింది. ఈ కారణంగానే ఇది టాప్ లిస్ట్ లో నిలిచిందని తెలిపింది. అయితే గత రెండు వారాల్లో ఇలాంటి తప్పుడు కథనాలు దర్శనమివ్వడం ఇది రెండవసారి కావడం గమనార్హం. ట్విన్ టవర్స్ ఉగ్రదాడి ఘటన టెర్రరిస్టుల పనికాదనీ, భవనంలో అమర్చిన బాంబుల వల్లే టవర్స్ కూలిపోయాయంటూ ఫేస్ బుక్ ట్రెండింగ్ టాపిక్స్ లో ఓ కథనం టాప్ లో నిలిచింది. దీంతో వివాదం చెలరేగింది. అయితే అల్గారిథమ్స్ తప్పుడు లింక్ లను సంస్థ క్వాలిటీ కంట్రోల్ టీం కనిపెట్టకపోవడంపై వ్యాఖ్యానించడానికి ఫేస్ బుక్ నిరాకరించింది. కాగా ఫేస్ బుక్ ప్రస్తుతం సుమారు 1.7 బిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ట్రెండింగ్స్ టాపిక్స్ లోని కథనాలు వాస్తవమా కాదా అనే దానికి సంబంధం లేకుండా పాపులర్ మారి, ఎక్కువ వ్యూస్ ను సాధించడం తెలిసిందే. -
తప్పుడు కథనాలతో ఫేస్‌బుక్‌కు తంటాలు
న్యూయార్క్ : ప్రపంచపు పాపులర్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ , ట్రెండింగ్ టాపిక్స్ లో తప్పుడు కథనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. తప్పుడు కథనాలనే ఫేస్బుక్ ఎక్కువగా ప్రచారం చేస్తుందని విమర్శలు ఎదుర్కొంటోంది. గత నెల నుంచి ఈ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.. ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత మెగిన్ కెల్లీకు సంబంధించిన ఓ వార్తాకథనాన్ని ఫేస్ బుక్ తప్పుగా ప్రచారం చేసింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డెమొక్రాటిక్ పార్టీ లీడర్ హిల్లరీ క్లింటన్‌కు కెల్లీ మద్దతిస్తున్నట్టు వార్తా కథనాన్ని ఫేస్బుక్ ప్రచురించింది. ఆ స్టోరీని ట్రెండింగ్ టాపిక్స్ సైట్లో టాప్‌లో ఫేస్బుక్ మెయిన్ పేజీలో ప్రచురించింది. నెలకు దాదాపు 1.7 బిలియన్ యూజర్లు ఈ పేజీని వీక్షించారు.. దీంతో ఫేస్బుక్ కచ్చితత్వం లేని స్టోరీలను ప్రసారం చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. స్టోరీ సరియైనదిగా లేదని తొలగించాలంటూ ఫాక్స్ న్యూస్ ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఫేస్బుక్ రివ్యూ టీమ్ స్టోరీలో కచ్చితత్వ లోపాన్ని గుర్తించి వెంటనే స్టోరీని తొలగించింది. 2014లో ప్రవేశపెట్టిన ఈ ట్రెండింగ్ టాపిక్స్ కోసం, ఫేస్ బుక్ ప్రత్యేక టీమ్ పనిచేస్తుంది. అయితే పొలిటికల్ చర్చలు, నమ్మకాలను బట్టి స్టోరీలను ఎంపికచేసి ట్రెండింగ్ టాపిక్స్‌లో పోస్టు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే బ్రేకింగ్ న్యూస్‌లను, ఈవెంట్లను ఈ పేజీకి ఎంపికచేస్తారు. అయితే గత నెల మే నుంచి ఫేస్బుక్ ఈ ట్రెండింగ్ టాపిక్స్‌పై విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమస్యపై విచారణ కొనసాగించిన ఫేస్బుక్ సైతం తమ పోస్టు చేసే కథనాల్లో తప్పులు దొర్లుతున్నాయని చెప్పింది. అయితే ప్రచారం నిర్వర్తించే ముందు స్టోరీల కచ్చితత్వాన్ని ధృవీకిరస్తున్నారో లేదో మాత్రం కంపెనీ అధికార ప్రతినిధి తెలుపలేదు. పాపులర్ స్టోరీలను, న్యూస్ కచ్చితత్వాన్ని గుర్తించడానికి ఫేస్బుక్ అదనంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి.