5th May 2022, Top 10 Telugu Latest News: Morning Headlines Today - Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Thu, May 5 2022 10:01 AM | Last Updated on Thu, May 5 2022 10:22 AM

Top 10 Telugu Latest News Morning Headlines Today 5th May 2022 - Sakshi

యూట్యూబ్‌ క్రియేటర్లకు గూగుల్‌ భారీ షాక్‌!

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్‌ గో'ను షట్‌ డౌన్‌ చేస్తున్నట్లు తన బ్లాగ్‌ పోస్ట్‌లో అధికారికంగా ప్రకటించింది. గూగుల్‌ నిర్ణయం యూట్యూబ్‌ గో షట్‌డౌన్‌తో యూజర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి



అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. నటి ఆత్మహత్య

చిన్నవయసులోనే ఇంటర్నెట్‌లో దక్కిన గుర్తింపు, కాస్త పెరిగాక దక్కిన పేరుప్రఖ్యాతులు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న టైంలో ఊహించని విషాదం. కేవలం 16 ఏళ్ల వయసుకే నటి ఆత్మహత్య చేసుకుంది.
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


 ఒకప్పుడు నెట్‌ బౌలర్‌గా.. ఇప్పుడు ఏకంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో..!
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీడియం పేసర్‌ సౌరభ్ దూబే గాయం కారణంగా ఐపీఎల్‌-2022 సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఒకప్పటి నెట్‌ బౌలర్‌, అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్న పేసర్‌ను సన్‌రైజర్స్ భర్తీ చేసింది.
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


రష్యా జనరల్స్‌ హతం వెనుక వారి హ్యాండ్‌.. పుతిన్‌ ఊరుకుంటాడా..?
ఉక్రె​యిన్‌లో రెండు నెలలకుపైగా జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌తో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లింది. రష‍్యన్‌ జనరల్స్‌ దాదాపు 12 మంది చనిపోయారు. వీరిని హతం చేసుందుకు ఉక్రెయిన్‌కు ఆ దేశం సాయం అందించింది. 
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


తిరుమల బాలుడి కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. కిడ్నాపర్‌ ఎవరంటే..?
ఎట్టకేలకు తిరుమలలో కిడ్నాప్ అయినా బాలుడు గోవర్ధన్ ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 1వ తేదీన శ్రీవారి ఆలయం ముందు బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కిడ్నాపర్‌ ఎవరంటే.. 
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి



భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్‌ కథా చిత్రమ్‌
నగరంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది.  పోలీసులు ఒక్కరోజులోనే కేసును ఛేదించారు. పోలీసులు గురువారం అధికారికంగా నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది.  
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


హ్యాపీ బర్త్‌ డే రాయ్‌లక్ష్మీ.. ‘జనతా బార్‌’లో ఫస్ట్‌లుక్‌ విడుదల

రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘జనతా బార్‌’. ఈరోజు లక్ష్మీ బర్త్‌డే సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


ఇద్దరు మిత్రుల కలయిక ఇది: ప్రధాని మోదీ.. ముగిసిన యూరప్‌ పర్యటన

యూరప్‌ దేశాల పర్యటన ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు తిరుగుప్రయాణం అయ్యారు. కాగా, పర్యటనలో చివరగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి భేటీ గురించి మోదీ ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు.  
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


సీఎం జగన్‌ తిరుపతి పర్యటన.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


 తెలంగాణ షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌కు బంగారు పతకం

బ్రెజిల్‌ వేదికగా జరుగుతోన్న డెఫ్లింపిక్స్‌లో తెలంగాణకు చెందిన షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ సత్తా చాటాడు. ఏకంగా బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు.
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement