morning 10o clock
-
టుడే ట్రెండింగ్ & మార్నింగ్ టాప్ 10 న్యూస్
యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ భారీ షాక్! ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ గో'ను షట్ డౌన్ చేస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో అధికారికంగా ప్రకటించింది. గూగుల్ నిర్ణయం యూట్యూబ్ గో షట్‌డౌన్‌తో యూజర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. నటి ఆత్మహత్య చిన్నవయసులోనే ఇంటర్నెట్లో దక్కిన గుర్తింపు, కాస్త పెరిగాక దక్కిన పేరుప్రఖ్యాతులు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న టైంలో ఊహించని విషాదం. కేవలం 16 ఏళ్ల వయసుకే నటి ఆత్మహత్య చేసుకుంది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ఒకప్పుడు నెట్ బౌలర్‌గా.. ఇప్పుడు ఏకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో..! సన్‌రైజర్స్ హైదరాబాద్ మీడియం పేసర్ సౌరభ్ దూబే గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఒకప్పటి నెట్ బౌలర్, అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్న పేసర్‌ను సన్‌రైజర్స్ భర్తీ చేసింది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి రష్యా జనరల్స్ హతం వెనుక వారి హ్యాండ్.. పుతిన్ ఊరుకుంటాడా..? ఉక్రెయిన్‌లో రెండు నెలలకుపైగా జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌తో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లింది. రష్యన్ జనరల్స్ దాదాపు 12 మంది చనిపోయారు. వీరిని హతం చేసుందుకు ఉక్రెయిన్‌కు ఆ దేశం సాయం అందించింది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి తిరుమల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్ ఎవరంటే..? ఎట్టకేలకు తిరుమలలో కిడ్నాప్ అయినా బాలుడు గోవర్ధన్ ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 1వ తేదీన శ్రీవారి ఆలయం ముందు బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కిడ్నాపర్ ఎవరంటే.. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్ నగరంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు ఒక్కరోజులోనే కేసును ఛేదించారు. పోలీసులు గురువారం అధికారికంగా నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి హ్యాపీ బర్త్ డే రాయ్‌లక్ష్మీ.. ‘జనతా బార్’లో ఫస్ట్‌లుక్ విడుదల రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘జనతా బార్’. ఈరోజు లక్ష్మీ బర్త్‌డే సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ఇద్దరు మిత్రుల కలయిక ఇది: ప్రధాని మోదీ.. ముగిసిన యూరప్ పర్యటన యూరప్ దేశాల పర్యటన ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు తిరుగుప్రయాణం అయ్యారు. కాగా, పర్యటనలో చివరగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి భేటీ గురించి మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి సీఎం జగన్ తిరుపతి పర్యటన.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు బంగారు పతకం బ్రెజిల్ వేదికగా జరుగుతోన్న డెఫ్లింపిక్స్లో తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ సత్తా చాటాడు. ఏకంగా బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & మార్నింగ్ టాప్ 10 న్యూస్
ట్విటర్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన మస్క్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విటర్ విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ట్విటర్ యూజర్లకు స్వేచ్ఛ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండబోవంటూనే బాంబు పేల్చాడు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 28ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. సీఎం యోగి భావోద్వేగం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. తన వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పటివరకైతే చూసింది లేదు. అలాంటి వ్యక్తి.. సుమారు 28 ఏళ్ల తర్వాత సొంతూర్లో అడుగుపెట్టి తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు. 👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణలో ఈదురు గాలులతో వర్ష బీభత్సం తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలుల వర్షం బీభత్సం సృష్టించింది. కాగా, అల్పపీడన ద్రోణి కారణంగా మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి కోవోవాక్స్ వ్యాక్సిన్ టీకా ధర భారీగా తగ్గింపు కోవోవాక్స్ వ్యాక్సిన్ టీకా ఒక్కోడోసు ధరను సీరమ్ సంస్థ భారీగా తగ్గించింది. 12–17ఏళ్ల పిల్లలకు ప్రైవేట్ సెంటర్లలో ఇచ్చేందుకు సోమవారం కోవిన్ పోర్టల్‌లో ఈ టీకాను చేర్చిన సంగతి తెలిసిందే. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి బాలికతో పరీక్ష రాయించిన ‘దిశ’ యాప్ పదో తరగతి పరీక్షలు రాయనీయకుండా నిర్బంధించిన తండ్రిపై ఓ బాలిక దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బాలికను పరీక్ష కేంద్రంలో హాజరుపర్చారు. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి జీవితానికి సరిపడేంత ఎంజాయ్ చేశాను.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు అమ్మాయిలను చూడాలంటే నాకు భయం.. ఎప్పుడైనా ఓరకంటితో చూసేవాణ్ణి. కానీ ఇవాళ నేనలా కాదు. అందమైన అమ్మాయిలను జీవితానికి సరిపడేంత దగ్గరగా చూశాను.. ఇది సక్సెస్ కాకపోతే ఇంకేంటి.. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ వేదిక మార్పు మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ వేదిక మారింది. మూడు జట్లతో కూడిన ఈ టోర్నీ లక్నోలో కాకుండా పుణేలో ఈనెల 23 నుంచి 28 వరకు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. కరోనా కారణంగా గత ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ఐపీఎల్లో రికార్డు.. భారత బౌలర్‌కు చుక్కలు చూపించిన లివింగ్‌స్టోన్ ఐపీఎల్లో ఓ అరుదైన రికార్డును పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఈ సీజన్లోనే భారీ సిక్సర్ బాదాడు. భారత సీనియర్ బౌలర్‌కు చుక్కలు చూపించాడు. 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నీటిపారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 6న జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరడంపై నిపుణులు నివ్వెరపోతున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్ ఆజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తమైంది. రాజ్ థాక్రే విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. 66 ఏళ్ల వయస్సులో భారత మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్..! భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ 66 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. Hyderabad Police: ఎస్వీపీ ట్రైలర్ రిలీజ్.. ఆ సీన్‌తో ప్రజలకు అవగాహన సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా ట్రైలర్ వెలువడగానే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మహేశ్ డైలాగ్‌ను మరోసారి వాడేశారు. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, అప్రమ్తతంగా ఉండాలని ఆరెంజ్ అలర్ట్ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పరాగ్ అగర్వాల్ తొలగింపు ఖాయం.. కొత్త సీఈవోపై సస్పెన్స్ ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ తొలగింపు దాదాపు ఖాయమైంది. ట్విటర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ ఇందుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు పంపించారు. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. హిట్లర్‌లోనూ యూదుల రక్తం అంటూ.. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యల దుమారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నితిన్ గడ్కరీ..మాటంటే మాటే! ఎలన్‌మస్క్‌కు బంపరాఫర్! ఎలన్ మస్క్ సీఈఓగా ఉన్న టెస్లా తన ఈవీల తయారీపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోనే ఉత్పత్తి చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ, అక్కడ తయారు చేసి, వాటిని ఇక్కడ అమ్ముతామంటేనే సమస్య అని గడ్కరీ స్పష్టం చేశారు. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఒక్కరోజులో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ, ఉత్తరాదిలో మరికొన్ని చోట్ల కేసుల ఎఫెక్ట్‌తో గత వారం రోజులుగా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. ముంజలలో ఫైటో కెమికల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యఛాయలను త్వరగా రానివ్వకుండా నెమ్మదిపరుస్తాయి. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10.ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. విజేతలు ఎవరూ ఉండరు: ప్రధాని మోదీ జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఏదేశమూ విజయం సాధించలేదని అన్నారు. 👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
రేపు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లా కేంద్రమైన ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. ఏలూరు విజయవిహార్ సెంటర్ నుంచి ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లే సందులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.