Top 10 Telugu Latest News: Morning Headlines Today 3rd May 2022 - Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Tue, May 3 2022 10:10 AM | Last Updated on Tue, May 3 2022 4:51 PM

Top 10 Telugu Latest News Morning Headlines Today 3rd May 2022 - Sakshi

1. 66 ఏళ్ల వయస్సులో భారత మాజీ క్రికెటర్‌ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్‌..!
భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ 66 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి 

2. Hyderabad Police: ఎస్వీపీ ట్రైలర్​ రిలీజ్.. ఆ సీన్​తో ప్రజలకు అవగాహన
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేష్​ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా ట్రైలర్‌ వెలువడగానే.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మహేశ్‌ డైలాగ్‌ను మరోసారి వాడేశారు.
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
తెలంగాణ ప‍్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, అప్రమ్తతంగా ఉండాలని ఆరెంజ్‌ అలర్ట్‌ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. 
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పరాగ్‌ అగర్వాల్‌ తొలగింపు ఖాయం.. కొత్త సీఈవోపై సస్పెన్స్‌
ట్విటర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ తొలగింపు దాదాపు ఖాయమైంది. ట్విటర్‌ కొత్త బాస్‌ ఎలన్‌ మస్క్‌ ఇందుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు పంపించారు.
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. హిట్లర్‌లోనూ యూదుల రక్తం అంటూ.. రష్యా మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ వ్యాఖ్యల దుమారం
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నితిన్‌ గడ్కరీ..మాటంటే మాటే! ఎలన్‌మస్క్‌కు బంపరాఫర్‌!
ఎలన్‌ మస్క్‌ సీఈఓగా ఉన్న టెస్లా తన ఈవీల తయారీపై నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ‍్యలు చేశారు. భారత్‌లోనే ఉత్పత్తి చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ, అక్కడ తయారు చేసి, వాటిని ఇక్కడ అమ్ముతామంటేనే సమస్య అని గడ్కరీ స్పష్టం చేశారు. 
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌
రంజాన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. 
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఒక్కరోజులో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ, ఉత్తరాదిలో మరికొన్ని చోట్ల కేసుల ఎఫెక్ట్‌తో గత వారం రోజులుగా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. 
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..
ముంజలలో ఫైటో కెమికల్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యఛాయలను త్వరగా రానివ్వకుండా నెమ్మదిపరుస్తాయి.
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. విజేతలు ఎవరూ ఉండరు: ప్రధాని మోదీ
జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఏదేశమూ విజయం సాధించలేదని అన్నారు.
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement