1. టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర: మంత్రి అంబటి
అమరావతి రైతులది ఫేక్ పాదయాత్ర అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిజమైన రైతుల కంటే రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారని, మధ్యలోనే ఆగిపోతుందన్నారు. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర కాదా అని ప్రశ్నించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవల పవన్ కల్యాణ్.. భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. మోదీ ఇలాకాలో ఆ సీట్లు బీజేపీకి అందని ద్రాక్షే.. 75 ఏళ్లలో ఒక్కసారీ గెలవలే..!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు చూసుకుంటే గడిచిన 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. వీడియో: కాచుకో జెలెన్ స్కీ.. ఉక్రెయిన్‌లో స్నైపర్ రైఫిల్ పేల్చిన పుతిన్
ఉక్రెయిన్‌లో కొద్దిరోజులుగా రష్యా సైన్యం దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో సామాన్య పౌరులు, రెండు దేశాలకు చెందిన సైన్యం మృత్యువాతపడ్డారు. ఇంత జరిగినా పుతిన్ మాత్రం దాడులను నిలిపివేయడం లేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. మోదీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్సు తీసేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం దోచుకున్నది చాలని.. వీటి ధరలు పెంచి ఇప్పటికే 30 లక్షల కోట్లను మోదీ సర్కార్ దోచుకుందని ధ్వజమెత్తారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్
రిలయన్స్ జియో యూజర్లకు బంపరాఫర్. రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్రాంతాల్లో జియో 5జీ వైఫైను లాంచ్ చేసింది. 5జీ స్మార్ట్ ఫోన్, 5జీ సిమ్ లేని యూజర్లు ఏ స్మార్ట్‌ఫోన్‌లలో అయినా ఈ 5జీ వైఫై సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. దయచేసి ‘ఓ..’ శబ్దాన్ని అనుకరించొద్దు: రిషబ్ శెట్టి విజ్ఞప్తి
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎలాంటి అంచానాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగుతో పాటు అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. భారత్-పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
టీ20 వరల్డ్‌కప్-2022లో దాయాదుల సమరం ప్రారంభానికి ముందే ఇరు దేశాల మధ్య వాతావరణాన్ని వేడెక్కించింది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్.. పాక్‌లో అడుగుపెట్టబోయేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలే ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. ఘోరం.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి..
మధ్యప్రదేశ్ ఖర్‌గోన్‌లో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బకావా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు ఆమెపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment