Top 10 Evening News
-
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర: మంత్రి అంబటి అమరావతి రైతులది ఫేక్ పాదయాత్ర అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిజమైన రైతుల కంటే రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారని, మధ్యలోనే ఆగిపోతుందన్నారు. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర కాదా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవల పవన్ కల్యాణ్.. భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మోదీ ఇలాకాలో ఆ సీట్లు బీజేపీకి అందని ద్రాక్షే.. 75 ఏళ్లలో ఒక్కసారీ గెలవలే..! గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు చూసుకుంటే గడిచిన 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. వీడియో: కాచుకో జెలెన్ స్కీ.. ఉక్రెయిన్‌లో స్నైపర్ రైఫిల్ పేల్చిన పుతిన్ ఉక్రెయిన్‌లో కొద్దిరోజులుగా రష్యా సైన్యం దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో సామాన్య పౌరులు, రెండు దేశాలకు చెందిన సైన్యం మృత్యువాతపడ్డారు. ఇంత జరిగినా పుతిన్ మాత్రం దాడులను నిలిపివేయడం లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మోదీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్సు తీసేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం దోచుకున్నది చాలని.. వీటి ధరలు పెంచి ఇప్పటికే 30 లక్షల కోట్లను మోదీ సర్కార్ దోచుకుందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్ రిలయన్స్ జియో యూజర్లకు బంపరాఫర్. రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్రాంతాల్లో జియో 5జీ వైఫైను లాంచ్ చేసింది. 5జీ స్మార్ట్ ఫోన్, 5జీ సిమ్ లేని యూజర్లు ఏ స్మార్ట్ఫోన్లలో అయినా ఈ 5జీ వైఫై సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. దయచేసి ‘ఓ..’ శబ్దాన్ని అనుకరించొద్దు: రిషబ్ శెట్టి విజ్ఞప్తి చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎలాంటి అంచానాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగుతో పాటు అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్-పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు టీ20 వరల్డ్‌కప్-2022లో దాయాదుల సమరం ప్రారంభానికి ముందే ఇరు దేశాల మధ్య వాతావరణాన్ని వేడెక్కించింది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్.. పాక్‌లో అడుగుపెట్టబోయేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలే ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఘోరం.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి.. మధ్యప్రదేశ్ ఖర్గోన్లో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బకావా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు ఆమెపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్ డిస్ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలుగు సినిమాలకు అవార్డుల పంట కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు షాక్.. లిజ్ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు! బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్ భగవంత్ రావు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’ వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి! తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికపై పరోక్షంగా సంకేతాలు అందించారు ఆయన. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్‌లో క్రికెట్ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌లోని లీస్టర్‌షైర్ క్రికెట్ గ్రౌండ్‌కు 'గవాస్కర్ గ్రౌండ్'గా నామకరణం చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఇంగ్లండ్ లేదా యూరప్ గడ్డపై ఉన్న క్రికెట్ గ్రౌండ్‌కు ఒక ఇండియన్ క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు.. హీరో సుహాస్ ఏమన్నాడంటే.. కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. మూడు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్ ఫోటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు లభించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మోస్ట్ పవర్ఫుల్ హోండా 2023 సివిక్ టైప్-ఆర్ ఆవిష్కారం హోండా కొత్త సివిక్ వాహనాన్ని లాస్ ఏంజిల్స్‌లో గ్లోబల్‌గా ఆవిష్కరించింది. ‘హెండా సివిక్ టైప్-ఆర్ 2023’ను పరిచయం చేసింది. త్వరలోనే వీటి ధరలు, ఫీచర్లు వెలుగులోకి రానున్నాయి. 30 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన ఆర్ బ్రాండెడ్ మోడల్ అని హోండా వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1. పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం, జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. కాళేశ్వరానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విష ప్రచారం.. బురద జల్లడమే ‘ఈనాడు’ పని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో పాలన కొనసాగుతోందన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జో బైడెన్‌కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసి అమెరికన్లు షాక్ అయ్యారు. ఆయన చెప్పింది నిజమా, లేక ఎప్పటిలాగే పొరపాటుగా నోరుజారారా? అని తెగ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి మెజారిటీ రాదన్నారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అరంగేట్రంలోనే అదుర్స్! 5 వికెట్లు.. ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! కానీ.. టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్‌షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం! శానిటైజేషన్ వర్క్‌ర్ల(పారిశుధ్య కార్మికులు)కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆయా కంపెనీలు పోటీ పడి మరి భారీ ఎత్తున జీతాల్ని చెల్లిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లకు చెల్లించే జీతం కంటే ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Netflix: ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి వీడియో నయనతార, విఘ్నేశ్ శివన్‌లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షాకిచ్చిందని, వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందంటూ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నయన్ దంపతులకు నోటీసులు కూడా ఇచ్చిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది నెట్‌ఫ్లిక్స్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆఫ్రికా నుంచి వచ్చిన భర్త.. ప్రియుడి మోజులో భార్య.. దూరంగా ఉండలేమని.. విశాఖలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం ఓ మహిళ.. భర్తనే చంపేసింది. 18 ఏళ్ల వయసున్న ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి హత్య చేసింది. విశాఖలోని మధురవాడలో బుడుమూరు మురళి కుటుంబం నివాసం ఉంటుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి